pre release event
-
ఈ క్రిస్మస్ మనదే: ‘అల్లరి’ నరేశ్
‘‘బచ్చలమల్లి’ సినిమాని యూనిట్ అంతా ఎంతో కష్టపడి, ఇష్టపడి చేశాం. ఈ మూవీని హిట్ చేస్తారా? లేక బ్లాక్‌బస్టర్ చేస్తారా? లేదంటే కల్ట్ చేస్తారా? అనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఈ క్రిస్మస్ మనదే’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. ఆయన టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘బచ్చలమల్లి’. అమృతా అయ్యర్ హీరోయిన్ . సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్తా మీనన్, దర్శకులు మారుతి, నక్కిన త్రినాథరావు, విజయ్ కనకమేడల, కార్తీక్ దండు, యదు వంశీ, ‘బలగం’ వేణు, వశిష్ట ముఖ్య అతిథులుగా హాజరై, ‘బచ్చలమల్లి’ విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా సుబ్బు మంగాదేవి మాట్లాడుతూ–‘‘బచ్చలమల్లి’ పాత్రను నరేశ్‌గారు మాత్రమే చేయగలరు. కావేరి పాత్రకు అమృత మాత్రమే న్యాయం చేయగలరు. రాజేష్‌లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నేను ఎంతో ప్రేమించి చేసిన కథ ఇది’’ అన్నారు రాజేష్ దండా. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది’’ అని అమృతా అయ్యర్ చెప్పారు. -
'బచ్చలమల్లి' ప్రీ రిలీజ్ ఈవెంట్.. హీరోయిన్ల వైల్డ్ ఫైర్ గ్లామర్ (ఫొటోలు)
-
షణ్ముఖ్ జస్వంత్ ' లీల వినోదం' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఉపేంద్ర ‘యూఐ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ అట్రాక్షన్‌గా దాక్షాయణి! (ఫొటోలు)
-
పుష్ప2 ఈవెంట్లో సందడి చేసిన శ్రీలీల, అనసూయ (ఫొటోలు)
-
ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పుష్ప-2
-
పుష్ప2 ఈవెంట్లో 'పీలింగ్సే' అంటూ ఫిదా చేసిన రష్మిక మందన్న (ఫోటోలు)
-
Pushpa 2 Pre Release Photos: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ‘పుష్ప 2’ ఈవెంట్.. చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్!
హైదరాబాద్‌లో పుష్ప 2 ఈవెంట్ పక్కా.. కానీ ఎక్కడ? ఎప్పుడు? అనేది నిన్నటి వరకు క్లారిటీ రాలేదు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్లో సోమవారం(డిసెంబర్ 2) ఈ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్.చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్ఇప్పటికే పాట్నా, ముంబై, చెన్నై, కొచ్చిలో భారీ ఈవెంట్స్ నిర్వహించిన పుష్ప 2 టీమ్.. అంతకు మించిన ఈవెంట్‌ని హైదరాబాద్‌లో జరపాలని ముందు నుంచే ప్లాన్ వేసుకున్నారు. డిసెంబర్ 1న ఈ ఈవెంట్‌ని నిర్వహించాలనుకున్నారు. తొలుత ఎల్బీ స్టేడియంలో ప్లాన్ చేశారు. కానీ అక్కడ పర్మిషన్ లభించలేదు. దీంతో మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్‌కి మార్చారు. అయితే అక్కడ కూడా అనుమతి లభించకపోవడంతో చివరి నిమిషంలో ఈ ఈవెంట్‌ని యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్‌కి మార్చారు. ఈ రోజు కాకుండా రేపు (డిసెంబర్ 2) ఈ భారీ ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. బన్నీతో పాటు చిత్రబృందం అంతా ఈ కార్యక్రమానికి హాజరుకానుంది. ‘అలా.. ’తర్వాత మళ్లీ ఇలా..యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్లో బన్నీ సినిమా ఈవెంట్ జరగడం ఇది రెండోసారి. తొలిసారి 2020లో బన్నీ నటించిన ‘అల..వైకుంఠపురములో’ మూవీ మ్యూజికల్ ఈవెంట్ ఇక్కడే జరిగింది. దాదాపు ఆరు వేల మంది అంచనాతో ఈవెంట్ నిర్వహించగా.. 15 వేల మందికి పైగా హాజరయ్యారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అంతేకాదు ఆరు వేల మందికి పర్మిషన్ తీసుకొని..15 వేల మందిని ఆహ్వానించారంటూ ఈవెంట్ ఆర్గనైజేషన్ శ్రేయాస్ మీడియా పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.టికెట్ రేట్లు భారీగా పెంపుసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రంపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది. బన్నీ మాస్ ఫెర్ఫార్మెన్స్ని చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి కోసమే బెనిఫిట్ షోలు కూడా వేయబోతున్నారు. తెలంగాణలో నవంబర్ 4 రాత్రి 9.30 గంటల నుంచే ఈ బెన్ఫిట్ షోలు పడబోతున్నాయి. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అంతేకాదు టికెట్ ధరలు కూడా పెంచేశారు. బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800 ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షో లకు ఈ ధరలు వర్తిస్తాయి. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200లకు టికెట్ ధరను పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి తీసుకున్నారు. -
హైదరాబాద్‌లోనే 'పుష్ప 2' ఈవెంట్.. కానీ ప్లాన్ ఛేంజ్!
పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబయి.. ఇలా పాన్ ఇండియా సినిమాకు తగ్గట్లే దేశమంతా 'పుష్ప 2' టీమ్ తెగ తిరిగేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారా అనేది కాస్త సందేహంగా అనిపించింది. అయితే ఇప్పుడు వాటికి ఎండ్ కార్డ్ పడిందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఈవెంట్ నిర్వహిస్తున్నప్పటికీ ప్లాన్‌లో చిన్న మార్పు జరిగినట్లు సమాచారం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)డిసెంబరు 5న థియేటర్లలో రిలీజయ్యే 'పుష్ప 2'కి కావాల్సినంత బజ్ ఏర్పడింది. అయినా సరే టీమ్‌తో కలిసి దేశమంతా చుట్టేస్తున్న అల్లు అర్జున్.. హైప్‌ని ఇంకా పెంచేస్తున్నాడు. గతంలో 'దేవర' విషయంలో గందరగోళం జరిగిన దృష్ట్యా.. 'పుష్ప 2' హైదరాబాద్ ఈవెంట్‌కి అనుమతిస్తారా అనేది డౌట్‌గానే ఉండేది. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉండొచ్చు అన్నారు. కానీ ఇది ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్‌కి మారిందట.టీమ్ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇదే వేదిక ఫైనల్ అయిందని తెలుస్తోంది. ఇప్పటికే సెన్సార్ కూడా అయిపోయింది కాబట్టి డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొంటారని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్) -
చాన్నాళ్ల తర్వాత ప్రేమకథతో వస్తున్నాను: సిద్ధార్థ్
‘‘మిస్ యు’ సినిమా నాకు చాలా ప్రత్యేకం. రాజశేఖర్ ఈ చిత్రకథ చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. చాన్నాళ్ల తర్వాత ‘మిస్ యు’ లాంటి ఒక అందమైన ప్రేమకథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. ఈ సినిమాని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనిపిస్తోంది’’ అని హీరో సిద్ధార్థ్ అన్నారు. ఎన్. రాజశేఖర్ దర్శకత్వంలో సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన చిత్రం ‘మిస్ యు’. శామ్యూల్ మాథ్యూస్ నిర్మించిన ఈ సినిమాని ఏషియన్ సురేష్ ఎల్ఎల్పీ సంస్థ ఈ నెల 29న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మిస్ యు’ ప్రీ రిలీజ్ వేడుకలో సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘నేటి యువతరానికి మా మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. ‘మిస్ యు’ తర్వాత నాకు మరిన్ని మంచి ప్రేమకథలు వస్తాయి.గిబ్రాన్ ఈ సినిమా కోసం ఎనిమిది అద్భుతమైనపాటలు ఇచ్చారు. శామ్యూల్‌గారు ΄్యాషన్ ఉన్న నిర్మాత. ఈ సినిమాను మంచి ప్రొడక్షన్ విలువలతో నిర్మించారు. మా సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న ఏషియన్ సురేష్ ఎల్ఎల్పీ సంస్థకు కృతజ్ఞతలు’’ అన్నారు. -
గేమ్ ఛేంజర్: అక్కడా ఇక్కడా కాదు, ఏకంగా అమెరికాలోనే!
సినిమా తీయడం ఒకెత్తయితే ప్రమోషన్స్ చేయడం మరో ఎత్తు. సినిమాను జనాల్లోకి తీసుకునేందుకు చిత్రబృందం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని నగరాల్లో టూర్స్ చేస్తుంటారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తారు.ఇదెక్కడి మాస్‌రా మావాఅయితే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎవరూ ఊహించని ప్లేస్‌లో చేస్తున్నారు. అక్కడా, ఇక్కడా కాదు.. ఏకంగా అమెరికాలోనే ప్లేస్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 21న సాయంత్రం 6 గంటలకు ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.గేమ్ ఛేంజర్ పేరుకు సార్థకంఈ విషయం తెలిసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ప్రమోషన్స్‌లోనే గేమ్ ఛేంజర్ అని నిరూపించుకున్నారు.. ఇదెక్కడి ప్రమోషన్స్‌రా.. భలే ప్లాన్ చేశారు అంటూ ప్రశంసిస్తున్నారు. ఇకపోతే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. 'Mega MASS'ive Event in the USA 🇺🇸 💥The pre-release event of #GameChanger will happen in the USA - the first time ever for an Indian cinema ❤️🔥📍 Curtis Culwell Center, 4999 Naaman Forest Garland TX 75040🗓️ 21st DEC, 6:00 PM ONWARDSSee you soon, America!Event by… pic.twitter.com/rcjVCrDGOX— Game Changer (@GameChangerOffl) November 22, 2024 చదవండి: ఆర్ఆర్ఆర్ టైమ్‌లో లేదు.. అందుకే పుష్ప-2తో.. నాగార్జున -
ఈ సినిమా ఇద్దరికీ అగ్నిపరీక్షే
‘‘చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఉండదు. మంచి సినిమానా? కాదా? అనేది ఉంటుంది. ‘దేవకి నందన వాసుదేవ’ వంద శాతం మంచి సినిమా అనిపించింది. ఈ చిత్రం అశోక్‌కి, అర్జున్‌కి అగ్ని పరీక్షే. ఈ పరీక్షని ఎదుర్కొని వారు నిలబడతారని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. అశోక్ గల్లా, వారణాసి మానస జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోయపాటి శ్రీను, హీరో సుధీర్ బాబు అతిథులుగా పాల్గొన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్, విజువల్స్, సాంగ్స్ చూసినప్పుడు అశోక్‌కి సరైన సినిమా అనిపించింది. తను కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడు’’ అన్నారు. ‘‘నేను రాసిన కథల్లో ఇది మాస్ ఎంటర్టైనర్. ఈ పాత్రకి అశోక్ కరెక్టుగా సరిపోయాడు. మహేశ్‌బాబుగారి ఫ్యాన్స్, ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూసి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’’ అని చిత్ర కథారచయిత ప్రశాంత్ వర్మ అన్నారు. ‘‘ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. నాలాంటి కొత్త నిర్మాతని బతికించాలి’’ అని బాలకృష్ణ కోరారు. -
KCR మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో MLA హరీష్ రావు స్పీచ్
-
‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి అలా!
మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా, మానస వారణాసి ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమా ద్వారా మిస్ ఇండియా మానస వారణాసి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రశాంత్ వర్మ రాసిన కథతో దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. అందరిలా కాకుండా కాస్తా వైరైటీగా మూవీ ప్రమోట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా మొదటి ఐదు నిమిషాల మూవీని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. టాలీవుడ్ ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. ఈ మూవీ ఈ నెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. #DevakiNandanaVasudeva ఏం అయివుంటుంది? pic.twitter.com/FR1sIUH5xf— Kakinada Talkies (@Kkdtalkies) November 19, 2024 -
రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ మాట అన్నారు: మూవీ ఈవెంట్లో హరీశ్ రావు
జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). గరుడవేగ అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్ కథానాయికగా నటించారు. రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..'ముఖ్యమంత్రులు వస్తు ఉంటారు. పోతుంటారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు కేసీఆర్. ఆయన పేరు మీద సినిమా తీయడం సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణను సాధించడమే కాదు అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించారు. రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. నేను హైదరాబాద్‌లో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా అని. కేసీఆర్ పల్లెలను, హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. మనం చూసే భౌతికమైన అభివృద్దే కాదు. సామాజిక పరంగా సంస్కృతి పరంగా తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక దశ దిశను చూపించారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కేసీఆర్ చేసిన కృషి. అధికారంలో ఉన్న పార్టీ వారి మీద సినిమాలు తీస్తారు. కానీ అధికారంలో లేకపోయినా రాకేష్ ప్రేమతో, దమ్ము ధైర్యంతో ఈ సినిమా తీశారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. లంబాడీ వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు. -
ఈ సినిమా గిట్ట ఆడకపోతే.. ఇలాంటి మాటలు వద్దు ఇక: విశ్వక్ సేన్ కామెంట్స్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి మాస్ యాక్షన్‌తో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో హిట్ కొట్టిన యంగ్ హీరో మళ్లీ అలరించేదుకు రెడీ అయ్యాడు. యంగ్ మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం మెకానిక్ రాకీ. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో గుంటూరు కారం భామ మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వరంగల్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా హిట్ కొట్టినా.. ఫ్లాఫ్ అయినా నేను సినిమాలు తీయడం ఆపేది లేదని ఛాలెంజ్ విసిరారు.విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'మీకు ఎప్పటిలాగే ఛాలెంజ్ విసరాలా? ప్రతి సినిమాకు ఛాలెంజ్ కావాలా? మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా. ఈ సినిమా గిట్ట ఆడకపోతే షర్ట్ లేకుండా చెక్‌పోస్ట్‌లో తిరుగుతా.. ఫిల్మ్ నగర్లో ఇల్లు ఖాళీ చేస్తా.. ఇకపై ఇలాంటివీ నేను మాట్లాడదలచుకోవట్లేదు. సినిమా హిట్ అయినా.. ఫ్లాఫ్ అయినా నా చొక్కా నా ఒంటిమీదనే ఉంటది.. నా ఇల్లు జూబ్లీహిల్స్లోనే ఉంటది.. నేను ఇంకో సినిమా చూస్తా. అది ఉన్నా.. దొబ్బినా మళ్లీ మళ్లీ సినిమా తీస్తా. పూరి జగన్నాధ్ రాసినట్టు, రవితేజ అన్న చెప్పినట్లు మాకు తెలిసిందల్లా ఒక్కటే.. సినిమా సినిమా. అంతే ప్రాణం పెట్టిన ఈ మూవీ తీసినం' అంటూ మాట్లాడారు. కాగా.. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. -
‘మెకానిక్ రాకీ’ ఐదు నిమిషాలు కూడా బోర్ కొట్టదు : విశ్వక్ సేన్
‘‘నేను పది సినిమాలు చేశాను. ఆ అనుభవంతో చెబుతున్నాను. నా గత సినిమాల కన్నా చాలా భిన్నమైన సినిమా ‘మెకానిక్ రాకీ’. ఐదు నిమిషాలు కూడా బోర్ కొట్టదు. 21న ‘మెకానిక్ రాకీ’ పెయిడ్ ప్రిమియర్స్ వేస్తున్నాం. థియేటర్స్‌కు రండి. నిర్మాత రామ్‌గారు లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. ఆయన కాలర్ ఎగరేసుకునేలా చేస్తాను’’ అని విశ్వక్ సేన్ అన్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘మెకానిక్ రాకీ’ మంచి సినిమా’’ అన్నారు. ‘‘విశ్వక్ సేన్ కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రామ్ తాళ్లూరి. ఈ వేడుకలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడి, ‘మెకానిక్ రాకీ’ విజయాన్ని ఆకాంక్షించారు. -
హన్మకొండలో విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫొటోలు)
-
'రోటి కపడా రొమాన్స్' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫొటోలు)
-
'అయితే ఏటంటావ్ ఇప్పుడు'.. అభిమానికి మెగాస్టార్ అదిరిపోయే రిప్లై!
చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో విలనిజంతో మెప్పించిన సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం జీబ్రా. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన డాలీ ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యం అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ అభిమానిని మెగాస్టార్ ఆటపట్టించారు. ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్స్ మెగాస్టార్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటో మనం ఓ లుక్కేద్దాం పదండి.చిరంజీవి వేదికపై మాట్లాతుండగా ఓ అభిమాని గట్టిగా అరిచాడు. మిమ్మల్ని చూసేందుకు వైజాగ్ నుంచి వచ్చానని అతను చెప్పాడు. దీనికి చిరు వెంటనే 'అయితే ఏటంటావ్ ఇప్పుడు.. నువ్వు వైజాగ్ నుంచి వచ్చినందుకు సంతోషమే.. మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్‌లో ఆడించాలి.. భలేవాడివే.. మన హీరోలు కూడా అదే ఊరే.. కూసో కూసో రా కాసేపు' అంటూ వైజాగ్ యాసలోనే మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు మెగాస్టార్. ఇది చూసిన నెటిజన్స్ మీరు టైమింగ్ సూపర్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ టైమింగ్‌లోనూ మీరు మెగాస్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతమందించారు.Chiranjeevi timing 😂😂🤣🤣😭😭Cinemalo aina Offline lo aina Boss @KChiruTweets timing ni kottevadu inka puttaledu 💥💥😂😂🫶🏻#ZEBRA #Chiranjeevi pic.twitter.com/khp7QZvSwq— Vamc Krishna (@lyf_a_zindagii) November 12, 2024 -
చిరంజీవి కాళ్లకు నమస్కరించిన టాలీవుడ్ డైరెక్టర్!
చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో విలనిజంతో ఆకట్టుకున్న నటుడు సత్యదేవ్. ఈ ఏడాదిలో 'కృష్ణమ్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. తాజాగా నటించిన చిత్రం జీబ్రా. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో 'పుష్ప'లో జాలిరెడ్డిగా కనిపించిన డాలీ ధనంజయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం ఈ మూవీని నిర్మించారు.తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ కాళ్లకు ఆయన నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జీబ్రా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, సత్య అక్కల కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతమందించారు. చాలా రోజులుగా హీరోగా సరైన హిట్ కోసం చూస్తున్న సత్యదేవ్ ఈ సినిమాతోనైనా ట్రాక్‌లో పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.Megastar #Chiranjeevi's MEGA Grand Entry At #ZEBRA Pre Release Event 💫💥❤️Mana Andari Aradhya Daivam 🙏❤️@KChiruTweets @ActorSatyaDev #MegastarChiranjeevi pic.twitter.com/rZ82BHPjgf— We Love Chiranjeevi 💫 (@WeLoveMegastar) November 12, 2024 -
విశాఖపట్నం : ‘మట్కా’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)