![Amma Rajasekhar Fell Unconscious At Prerelease Event](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/amma-rajashekar.jpg.webp?itok=BifT09gJ)
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్(Amma Rajasekhar ) దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘తల’. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. అయితే ఈవెంట్‌కి వచ్చిన అమ్మ రాజశేఖర్ సడెన్‌గా కిందపడిపోవడంతో కాసేపటి వరకు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. సడెన్ గా కింద పడిపోవడంతో డెరెక్టర్ అమ్మ రాజశేఖర్ ఏమయ్యిందని స్టేజిపై ఉన్నవారిలో ఆందోళన మొదలయ్యింది. కాసేపటికి ఆయన తిరిగి స్పృహలోకి వచ్చి, కాసేపు క్రింద అలాగే కూర్చుండిపోయారు. మంచి నీళ్లు తాగి కొద్ది సేపు రెస్ట్ తీసుకుని రిలీఫ్ అయ్యారు. హైబీపీ కారణంగానే అమ్మ రాజశేఖర్ కింద పడిపోయినట్లు తెలుస్తోంది. కాసేపటికే కోలుకొని స్టేజ్ మీదకు రావడంతో టీమ్ అంతా ఊపిరి పీల్చుకుంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/amma.jpg)
అనంతరం తల సినిమా గురించి మాట్లాడుతూ.. మూడు నాలుగు నెలలుగా స్ట్రెస్ గా ఉన్నాను. అయినా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది నాకు ఛాలెంజింగ్ మూవీ. లైఫ్ లో చాలా స్ట్రగుల్ చూశాను. ఆ టైమ్ లో అమ్మ రాజశేఖర్ కు ఏమైంది అన్ని ప్రశ్నించిన అందరికీ ఈ మూవీతో సమాధానం చెబుతాను. నాలాగే నా కొడుకు రాగిన్ రాజ్ ను కూడా ఆశీర్వదించాలి. హిట్ తరవాత అందరి గురించి మాట్లాడతాను. శ్రీనివాస్ గౌడ్ గారి చేసిన సపోర్ట్ లైఫ్ లాంగ్ మర్చిపోను. మీ లాంటి మంచి వారి కోసమైనా ఈ సినిమా హిట్ కావాలి. 14న విడుదలవుతోన్న తల చిత్రాన్ని మీరంతా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.." అన్నారు.
హీరో రాగిన్ రాజ్ మాట్లాడుతూ.. "తల కథ మా నాన్న(అమ్మ రాజశేఖర్) నాకు రెండేళ్ల క్రితం చెప్పారు. ఆ కథ నుంచి మీ ముందు కొత్త యాక్టర్ గా పరిచయం అవుతున్నాను. నాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.ఈ సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. 14న ఈ చిత్రాన్ని అందరూ చూడండి. ఈ మూవీకి మా నాన్న స్ట్రాంగ్ పిల్లర్ గా ఉన్నారు. నేను కొత్తవాడిని అని అందరూ నాకు చాలా నేర్పించారు. యాక్షన్ సీక్వెన్స్ లలో చాలా దెబ్బలు తగిలాయి.ఈ కథ చూస్తే నా వయసు 18యేళ్లు. ఆ వయసు అబ్బాయి అమ్మ సెంటిమెంట్ తో ఏ లెవల్ కు వెళతాడు అనేది మెయిన్ ప్లాట్. దీంతో పాటు యాక్షన్, రొమాన్స్ అన్ని అంశాలూ ఉన్నాయి. అందరూ ఈ చిత్రాన్ని చూస్తే అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అంటారు.." అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment