
‘‘ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునే సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. మా కోసం రెండున్నర గంటలు కేటాయించండి. సూపర్‌గా ఎంటర్‌టైన్ చేస్తాం. ఇది నాప్రామిస్’’ అని హీరో ప్రదీప్ మాచిరాజు అన్నారు. ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’.
నితిన్–భరత్ దర్శకత్వంలో మాంక్స్ అండ్ మంకీస్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో చాలామంది కొత్తవాళ్లు పరిచయం అవుతున్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత వారందరి పేర్లు గట్టిగా వినిపిస్తాయి. రిలీజ్‌కు ముందే మా సినిమా ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ పూర్తి కావడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘ఇందులోని పాటలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క జానర్‌లో ఉంటాయి. 60 ఇయర్స్ ఓల్డ్ వాయిస్‌తో ఓ పాటను చేయడం జరిగింది. ఆ పాటని మా మామగారు పాడారు’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ రథన్.