Pradeep Machiraju
-
టచ్‌లో ఉండు..
యాంకర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ద్వితీయ చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. డుయో నితిన్, భరత్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తున్నారు. మాంక్స్– మంకీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా నుంచి క్రిస్మస్ సందర్భంగా ‘టచ్‌లో ఉండు..’ అంటూ సాగే ద్వితీయ పాటని రిలీజ్ చేశారు. రధన్ ఈ మూవీకి సంగీతం అందించారు. టచ్‌లో ఉండు..’ పాటకి చంద్రబోస్ సాహిత్యం అందించగా, లక్ష్మీ దాస, పి. రఘు పాడారు. ‘‘యునిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ప్రదీప్, చంద్రికా రవిలపై చిత్రీకరించిన ‘టచ్‌లో ఉండు..’ మాస్ సాంగ్ ఆకట్టుకుంటుంది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎమ్ఎన్ బాలరెడ్డి. -
డిజైనర్‌తో ఏడడుగులు? పెళ్లి వార్తలపై స్పందించిన ప్రదీప్
తెలుగు స్టార్ యాంకర్లలో ప్రదీప్ ఒకరు. తన కామెడీ టైమింగ్‌తో, పంచులతో ఎంటర్టైన్ చేసే ప్రదీప్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ ఊహాగానాలపై ప్రదీప్ స్పందిస్తూ అవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'నేను కాస్త బిజీగా ఉండటం వల్ల దీనిపై ఇప్పటివరకు స్పందించలేకపోయాను. ఇకపోతే నిశ్చితార్థం, పెళ్లి.. ఏదీ లేదు. నేనిప్పటికీ సింగిలే! పాపం.. ఎవరో డిజైనర్‌తో ఏడడుగులు వేయబోతున్నానని రాసేశారు. కానీ ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. బహుశా.. నా టీమ్ ఆమె రెడీ చేసిన డ్రెస్సులు కొని ఉండొచ్చేమో కానీ అనవసరంగా ఆమె పేరు లాగకండి. ఇప్పట్లోపెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. ఇప్పుడిప్పుడే నా కుటుంబం తండ్రిని కోల్పోయిన బాధలో నుంచి కోలుకుంటోంది. ప్రస్తుతం నా దృష్టంతా టీవీ షోలు, సినిమాపైనే ఉంది. నేను హీరోగా మరో సినిమా చేస్తున్నాను. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదే ఆ సినిమా రిలీజ్ చేస్తాం' అని చెప్పుకొచ్చాడు ప్రదీప్. చదవండి: యాంకరింగ్‌కు బ్రేక్? పుట్టిందే టీవీ కోసమన్న సుమ -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? వధువు ఎవరంటే!
తెలుగు స్టార్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ తనదైన యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్‌కు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ఒకవైపు పలు టీవీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా కూడా మారాడు. ఇదిలా ఉంటే బులితెరపై ఎంతో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. చదవండి: ఈ స్టార్ యాంకర్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అందరికంటే ఎక్కువ ఎవరికంటే! అందుకే తరచూ పెళ్లి రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తుంటాడు ప్రదీప్. తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి వార్తలు తెరపై వచ్చాయి. అయితే గతంలో ఇప్పటికే పలుమార్లు ప్రదీప్ పెళ్లంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే వాటిని ప్రతిసారి ఖండించాడు. కానీ ఈసారి మాత్రం ప్రదీప్ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రదీప్ చేసుకోబోయే అమ్మాయి పేరు, ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. నవ్య.. ప్రదీప్ పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్‌ని, ఆ పరిచయమే స్నేహం, ప్రేమగా మారిందంటున్నారు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం కొంతకాలంగా వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని, ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంలో ఇరుకుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిలిం దూనియాలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించి ఇరుకుంటుంబాలు చర్చించుకుంటున్నారట. త్వరలోనే ప్రదీప్ గుడ్‌న్యూస్ చెప్పబోతున్నాడని సన్నిహితవర్గాలంటున్నాయి. అయితే వీరి మతాలు కూడా వేరే అనేది విశ్వసనీయ సమాచారం. మరీ ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ప్రదీప్ నుంచి క్లారిటీ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. నవ్య.. ప్రదీప్‌తో పాటు చాలా మంది సెలబ్రెటీలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుందట. బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) -
ఈ స్టార్ యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అందరికంటే ఎక్కువ ఎవరికంటే!
బుల్లితెరపై తమ మాటలతో, పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్స్ ఎంతోమంది ఉన్నారు. వీరికి కూడా స్టార్ నటీనటులకు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందులో ఎక్కువగా ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న టాప్ ఫీమేల్, మేల్ యాంకర్లలో సుమ కనకాల, ప్రదీప్ మాచీరాజుల మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత అనసూయ భరద్వాజ్, యాంకర్ రవి, రష్మీ గౌతమ్, శ్రీముఖి, శ్యామల, మంజూషలు ఉన్నారు. ఇందులో కొందరు బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై సందడి చేస్తుంటారు. అలా రోజురోజు తమ క్రేజ్‌ను పెంచుకుంటున్న వారి రెమ్యునరేషన్స్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. మరి ఈ స్టార్ యాంకర్ల పారితోషికం ఎలా ఉందో ఓసారి చూద్దాం! చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం యాంకర్లలో మొదట చెప్పుకోవాల్సింది సుమ కనకాల గురించి. ఎంతోకాలంగా తన యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్నారామె. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ధాలు గడుస్తున్నా ఇప్పటికీ సుమ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తనదైన పంచ్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు ఫుల్ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇక స్టార్ హీరోహీరోయిన్లు సైతం సుమకు ఫ్యాన్స్ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇటూ టీవీ షోలతో అటూ మూవీ ప్రీరిలీజ్, ఆవార్డ్ ఫంక్షన్స్‌కు సుమ యాంకర్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. అలా ఆమె ఒక్కో ఈవెంట్‌కు రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు తీసుకుంటందని సమాచారం. ఇక ఒక్కొఎపిసోడ్కు అయితే రూ. 2 నుంచి రూ. 3 లక్షలు తీసుకుందట. ఈ లెక్కన సుమ నెలకు దాదాపు రూ. 20 లక్షలపైనే సంపాదిస్తుంది. ఇక ప్రదీప్ మాచీరాజు కూడా ఇంచుమించు సుమ రెంజ్లోనే పారితోషికం తీసుకుంటాడని తెలుస్తోంది. మూవీ ఈవెంట్స్ అయితే రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు తీసుకోగా ఒక్కొక్క ఎపిసోడ్‌కు రూ. 2 లక్షల వరకు అందుకుంటాడట. ఇక రంగమ్మత్తగా ఎనలేని క్రేజ్ సొంతంగా చేసుకున్న అనసూయ యాంకర్‌గానే కాదు వెండితెరపై నటిగానూ రాణిస్తోంది. చదవండి: ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లేటెస్ట్ పోస్ట్.. ‘దీని అంతర్యం ఏంటీ?’ ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్లలో గ్లామరస్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఆమె ఒక్కో ఈవెంట్‌కు రూ.2 నుంచి రూ. 3 లక్షలు వరకు తీసుకుంటుందట. ఇక యాంకర్ రష్మీ గౌతమ్ రూ. 1.5 నుంచి రూ. 2 లక్షల వరకు డిమాండ్ చేస్తుందట. ఇక యాంకర్ రవి దాదాపు రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. ఇక మంజుషా కూడా రూ. 50 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్. యాంకర్ వర్షిణీ 30వేలు, యాంకర్ శ్యామల రూ. 50వేల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో అందరికంటే సుమ పారితోషికమే ఎక్కువ ఉండటం విశేషం. -
టాలీవుడ్ యాంకర్లు.. అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా?
టాలీవుడ్లో ఫేమస్ యాంకర్లు ఎంతమంది ఉంటారని అడిగేతే.. ఠక్కున గుర్తొచ్చే పేర్లు సుమ, అనసూయ, రష్మీ, ప్రదీప్, రవి వేళ్లపై చెప్పేస్తారు. తెలుగులో అంతలా క్రేజ్ సంపాందించారు వీరు. టాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా యాంకర్ల పాత్ర చాలా కీలకం. వారు లేకుండా ఏ ఫంక్షన్ ఊహించుకోవడం కష్టమే. మరీ అంత ప్రాముఖ్యత ఉన్న యాంకర్స్ తీసుకునే రెమ్యునరేషన్ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. మరీ వారు ఒక్క ఈవెంట్‌కు తీసుకుంటారు. వారిలో ఎవరికీ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అన్న విషయాలపై ఓ లుక్కేద్దాం. సుమ కనకాల: ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్ సుమ కనకాల. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ నుంచి ఇప్పటి వరకు ఆమె దిగ్విజయంగా కొనసాగిస్తోంది. సుమ కనకాల హాజరయ్యే ఒక్క ఈవెంట్‌కు దాదాపు రూ.3.5 నుంచి 4 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ప్రదీప్ మాచిరాజు: మేల్ యాంకర్స్‌లో ముందు వరుసలో వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు. టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ప్రదీప్ ఒక్క ఈవెంట్‌కు రూ.2 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అనసూయ భరద్వాజ్: జబర్దస్త్ ద్వారా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న యాంకర్. కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన అనసూయ భరద్వాజ్ కూడా భారీగానే పారితోషికం తీసుకుంటోంది. దాదాపు రూ.2-3 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది. రష్మీ గౌతమ్: జబర్దస్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన మరో యాంకర్ రష్మీ గౌతమ్. ఆమె అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న రష్మీ ప్రస్తుతం రూ 2 లక్షల నుంచి నుండి రూ 3 లక్షల వరకు పారితోషికం అందుకుంటోంది. రవి: ప్రదీప్ తర్వాత అంతలా పేరు సంపాదించిన మరో మేల్ యాంకర్ రవి. పటాస్ షోతో క్రేజ్ సంపాదించిన రవి కేరీర్ పరంగా ఇప్పుడు కాస్త వెనుకబడ్డారు. అయినప్పటికీ ఒక్కో ఈవెంట్‌కు రూ.లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. శ్యామల: టాలీవుడ్లో ఫేమస్ అయిన మరో యాంకర్ శ్యామల. ఆమె కూడా ప్రస్తుతం రూ.లక్ష వరకు పారితోషికం తీసుకుంటూ.. సినిమాల్లోనూ నటిస్తోంది. మంజూష: టాలీవుడ్ మరో యాంకర్ మంజూష. ఆమె కూడా రూ.లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఇంటర్వ్యూల్లో ఎక్కువగా కనిపించే మంజూష యాంకర్‌గా తెలుగులో ఫేమస్ అయింది. వర్షిని: టాలీవుడ్ మరో యాంకర్ వర్షిని. ప్రస్తుతం ఆమె రూ.50వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. వర్షినికి జబర్దస్త్ ద్వారా తెలుగులో గుర్తింపు వచ్చింది. -
యాంకర్ ప్రదీప్ పెళ్లి అయిపోయిందా? ఆయన ఏమన్నాడంటే..
తెలుగు టాప్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు కూడా ఒకరు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ తన యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇటీవలె ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా మారి అలరించాడు. ఇదిలా ఉండగా కొంతకాలంగా యాంకర్ ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని, పొలిటికల్ లీడర్ కూతురితోనే అతని వివాహం అని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.గతంలో కూడా అతని పెళ్లిపై రకారకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ షోలో భాగంగా తనని తాను ఇంటర్వ్యూ చేసుకున్న ప్రదీప్ ఊతపదం ఏంటని అడగ్గా.. నీ యంకమ్మ అని సమాధానమిచ్చాడు. మీకు నిజంగా పెళ్లయిపోయింది కదా? అని అడగ్గా.. నాలుగైదుసార్లు అయిపోయింది, యూట్యూబ్ లో చూడలేదా నువ్వు అని తనపై తానే కౌంటర్స్ వేసుకున్నాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
వైరల్ అవుతున్న యాంకర్ ప్రదీప్ ట్వీట్, మాచిరాజుపై నెటిజన్ల ప్రశంసలు
ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఓ విద్యార్థి చేసిన ట్వీట్‌కు ప్రదీప్ ఇచ్చిన రిప్లై నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం ట్విటర్లో ట్రెండింగ్‌గా మారింది. ఇంతకి ఆ ట్వీట్లో ఏముందంటే.. ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆర్థిక సాయం కోరుతూ ప్రదీప్‌ను ట్యాగ్ చేశాడు. ‘మా కుటుంబ పరిస్థితి అసలు బాగోలేదు. మా నాన్న ఇటీవల కరోనా కారణంగా చనిపోవడంతో ఆర్థికంగా కుంగిపోయాం. దీంతో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న నేను.. చదవండి: ‘ఆశ: ఎన్ కౌంటర్’ సినిమా దిశ ఘటన గురించి కాదు!: ఆర్జీవీ ఫైనల్ ఇయర్ చదువుతున్న మా సిస్టర్ చాలా కష్టాల్లో ఉన్నాం. దయచేసి మీ నుంచి కొంత డబ్బు సాయం కావాలి. మా కుటుంబ పరిస్థితి గురించి మీకు తెలియలాంటే ప్రూఫ్ కూడా చెబుతాను’ అంటూ తన ఫోన్ నెంబర్ ఇస్తూ ప్రదీప్‌ను ట్యాగ్ చేస్తూ ఆర్థిక సాయం కోరాడు. అది చూసిన ప్రదీప్ ఉదారతతో సదరు నెటిజన్‌కు ఇలా సమాధానం ఇచ్చాడు. ‘తప్పకుండా బ్రదర్. నాకు చేతనైనా సాయం చేస్తాను. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. మీ వివరాలను నాకు పంపించండి’ అంటూ అతడికి భరోసా ఇచ్చాడు. చదవండి: SS Thaman: ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన తమన్ వరుస ట్వీట్లు This is the reason for becoming a fan of you Deepu ❤️❤️ ur great pradeep garu 👍👍love you sooo much baby ❤️❤️ — Akshaya Sri (@AkshayaSri1437) December 29, 2021 ప్రదీప్ ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చిన తీరుపై ప్రతిఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘అందుకే నేను మీకు ఫ్యాన్ అయ్యాను దీపూ, మీరు చాలా గ్రేట్’, ప్రస్తుతం మీరు వాళ్లకు చాలా పెద్ద సాయం చేస్తున్నారు బ్రదర్’ అంటూ పలువురు ప్రదీప్ ట్వీట్‌కు రీట్వీట్ చేస్తున్నారు. కాగా కష్టాల్లో ఉన్న ఎంతో మందికి ప్రదీప్ ఇదివరకు కూడా ఆర్థిక సాయం చేసి ఆదుకున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో ఆర్థిక సాయం కోరిన పలువురికి ప్రదీప్ చేతనైనా సాయం చేసి తన ఉదారతను చాటుకున్నాడు. Present Meeru vallaki Big Help Chesthunnaru Super👌 Bro — Shivaᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ💞 (@ShivaCrazyBoyy) December 29, 2021 Love u Annya ur one off the inspiration all young 🌟s... — Karthik pondu (@Karthikpondu3) December 29, 2021 -
ప్రముఖ యూట్యూబ్ స్టార్ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి
youtube Star shreya Muralidhar(27) Last Breath Due To Cardiac Arrest: ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శ్రియా మురళిధర్(27) మృతి చెందారు. సోమవారం(డిసెంబర్ 7) రాత్రి గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. నిన్న అర్థరాత్రి ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానికి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణంచినట్లు వైద్యలు స్పష్టం చేశారు. యూట్యూబ్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న శ్రియా మురళీధర్… యాంకర్ ప్రదీప్ రియాలిటీ షో ‘పెళ్లి చూపులు’లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించింది. యాంకర్‌గా కూడా పలు కార్యక్రామాల్లో మెప్పించేది. చదవండి: సోషల్ మీడియాలో చేదు అనుభవం, బోల్డ్‌గా స్పందించిన హీరోయిన్ ఇక ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ 2లో ఓ పాత్ర చేసింది. ‘వాట్ ద ఫన్’ అనే యూట్యూబ్ ఛానల్లో ఆమె చేసిన వీడియోలు.. నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే వెండితెరపై కనిపించాలని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా ఈ యంగ్ యూట్యూబర్ అర్థాంతరంగా చనిపోవడం పలువురి బాధిస్తోంది. శ్రీయా మురళీధర్ స్వస్థలం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్. కాగా శ్రీయా మృతి పట్ల యూట్యూబ్ స్టార్ దీప్తీ సునైనా, సినీ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రిత, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ చెర్రీతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Shreya Muralidhar Ambala! (@shreyamuralidhar__) -
యాంకర్ ప్రదీప్‌కు ప్రపోజ్ చేసిన శ్రీముఖి.. వీడియో వైరల్
Sreemukhi Anchor Pradeep: బుల్లితెరపై స్టార్ యాంకర్లుగా దూసుకుపోతున్నారు యాంకర్ ప్రదీప్ అండ్ శ్రీముఖి. తెరపై వీళ్లిద్దరు చేసే హంగామా మాములుగా ఉండదు. అందుకే వీరు జంటగా హోస్ట్ చేసిన షోలు టీఆర్పీ రేటింగ్‌లోనూ టాప్ రేంజ్లో ఉంటాయి. ఇక ఓ వైపు రియాలిటీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాలతో అలరిస్తున్న ప్రదీప్-శ్రీముఖి మధ్య ఏదో ఉందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు శ్రీముఖి యాంకర్‌గా ప్రస్థానం మొదలుపెట్టింది కూడా ప్రదీప్‌తోనని, దీంతో అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని టాక్. ఇద్దరి మధ్యా ఉన్నది ఫ్రెండిష్ మాత్రమే కాదని, ఇంకా ఏదో ఉందనే పలు ఊహాగానాలు తెరపైకి వచ్చినా అలాంటిదేమీ లేదని ఇద్దరూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా శ్రీముఖి..ప్రదీప్‌పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టేసింది. లేటెస్ట్గా ఓ షోలో పాల్గొన్న శ్రీముఖి..అందరూ చూస్తుండగానే యాంకర్ ప్రదీప్‌కు ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేసింది. 'అందాలలో అహో మహోదయం' అనే పాటతో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి సిగ్గుపడుతూ వచ్చి తన మనసులో మాటను బయటపెట్టింది. దీనికి ప్రదీప్ కూడా సరే అన్నట్లుగా ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ జోడీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ కొందరు కామెంట్ చేస్తుంటే, కేవలం షో కోసం ఇలా చేస్తున్నారేమో అంటూ మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
హల్చల్ : సోనమ్ సొగసులు..దీప్తి సునయన వయ్యారాలు
♦చీర కట్టులో దీప్తి సునయన ♦ తమ్ముడి షర్ట్‌ను దొంగతనం చేసిన అనుపమ ♦ క్యూట్ లుక్స్‌లో సనయా ఇరానీ ♦ పొలం దున్నుతున్న అభిజీత్ ♦ బ్రేక్ ఫాస్ట్‌తో తమన్నా.. ఆ షో కోసమేనా? ♦ వోగ్ ఫోటో షూట్లో సోనమ్ కపూర్ ♦ నిషా అగర్వాల్‌ను పొగిడేస్తున్న కాజల్ View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Sanaya Irani (@sanayairani) View this post on Instagram A post shared by Jhansi (@anchor_jhansi) View this post on Instagram A post shared by pradeep machiraju (@pradeep_machiraju) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) -
తండ్రి మరణంపై తొలిసారిగా స్పందించిన ప్రదీప్
ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తండ్రి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తండ్రి మరణంపై స్పందించని ప్రదీప్ తాజాగా నోరు విప్పాడు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటు సోషల్ మీడియా వేదికగా భావోద్యేగానికి లోనయ్యాడు. ఆదివారం ప్రదీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు షేర్ చేశాడు. ‘ఐ లవ్ యు నాన్న, ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైన చిరునవ్వుతో ఎలా ఎదుర్కొవాలో నేర్పించారు. నేను ఏం చేసినా మీకు గౌరవం కలిగించే పని చేస్తాను’ అంటు రాసుకొచ్చాడు. ‘అలాగే ‘నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మంచి చెడు అనేది ఆలోచించకుండా మీరు నా వెంట ఉన్నారు. బాధతో ముక్కలైన నా మనస్సును మీ ప్రేమతో బాగు చేసేవారు. మీ ధైర్యం నాకు ఎన్నో సార్లు స్ఫూర్తినిచ్చింది. అలాగే నా కాళ్ళ మీద నన్ను నిలబడేలా చేసింది. దానిని మించిన ప్రేమ లేదు. మీరు నాకు ఎప్పటికీ స్పెషల్. జీవితంలో నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ఆపలేను. మీరు కోరుకున్నట్లుగానే ఎప్పుడూ నా చూట్టు ఉన్నవారిని, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూనే ఉంటా. ఇక మనం కలిసే దాకా మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటా నాన్న.. ఐ మిస్ యూ’ అంటూ ప్రదీప్ తన ఏమోషనల్ పోస్టుతో అందరిని కదిలించాడు. కాగా ఇటీవల ప్రదీప్ కరోనా పాజిటివ్‌గా పరీక్షించిన విషయం తెలిసిందే. కోవిడ్ పాజిటివ్‌గా తేలిన అనంతరం హో క్వారంటైన్‌కు వెళ్లిన ప్రదీప్ ఇప్పటి వరకు తన ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో అతడి తండ్రి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన వార్త ప్రదీప్ అభిమానులను, సన్నిహితులను కలచివేసింది. View this post on Instagram A post shared by pradeep machiraju (@pradeep_machiraju) -
30 Rojullo Preminchadam Ela: ఓటీటీలో చూసేయండి
బుల్లితెర టాప్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడనే చెప్పాలి. తన పంచులతో, తనదైన యాంకరింగ్‌తో వినోదాల విందును పంచే ఈ యాంకర్ హీరోగా నటించిన తొలి సినిమా "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?". మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా ఆకట్టుకుంది. ఇక ఇందులో అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో మనందరికీ తెలిసిన విషయమే. జనవరి 29న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతోపాటు విడుదలైన తొలి రోజే రూ.4 కోట్ల గ్రాస్ సాధించి ప్రదీప్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్ అయినవాళ్లు వెంటనే దీన్ని ఓటీటీలో వీక్షించవచ్చు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: విషాదం: యాంకర్ ప్రదీప్ తండ్రి కన్నుమూత -
విషాదం: యాంకర్ ప్రదీప్ తండ్రి కన్నుమూత
ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి పాండు రంగ(65) కన్నుమూశారు. గత కొద్ది రోజలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉంటే ప్రదీప్‌కు కరోనా వచ్చిందని, ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేదని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కరోనా పాటిజివ్‌పై ప్రదీప్ మాత్రం స్పందించలేదు. ఇక పాండు రంగ కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. అయితే ఆయన కరోనాతో మృతి చెందాడా లేదా ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రదీప్.. ఇటీవల హీరోగా కూడా మారాడు. ఆయన హీరోగా నటించిన తొలి సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. చదవండి : ఐ మిస్ యూ, కన్నీళ్లతో ప్రార్థిస్తున్నా: విజయ్ దేవరకొండ అభిమానికి కరోనా..స్వయంగా ఫోన్ చేసిన చిరంజీవి -
యాంకర్ ప్రదీప్‌కి కరోనా పాజిటివ్.. అందుకే ఆ షోకి వెళ్లిన రవి!
కరోనా సెకండ్ వేవ్‌కి దేశం అతలాకుతలం అవుతోంది. ప్రతి రోజు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు కర్ప్యూ, లాక్డౌన్ ప్రకటించినా..కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి మృతి చెందారు. కొంతమంది ఇప్పటికీ ఐసోలేషన్ల్లో ఉన్నారు. తాజాగా ప్రముఖ యాంకర్, హీరో ప్రదీప్ మాచిరాజుకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న ఓ షోకి యాంకర్ రవి వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ప్రదీప్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. చదవండి: అలా పెళ్లి చేసుకోలేదు.. తన లవ్‌స్టోరీ చెప్పిన ఇంద్రజ క్వారంటైన్లో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్ -
ప్రముఖ డ్యాన్స్ షోలో ప్రమాదం..కంటెస్టెంట్‌కు తీవ్ర గాయం!
ప్రముఖ డ్యాన్స్ షో ఢీ తెలుగునాట సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు సినిమాల్లో స్టార్ కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. అంతేకాక కంటెస్టెంట్లు సైతం సినిమాల్లో పలు పాటలకు చిందేస్తున్నారు. ఇప్పటివరకు పన్నెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఢీ.. ప్రస్తుతం 13వ సీజన్‌ను నిర్వహిస్తుంది. అయితే తాజాగా షోలో డ్యాన్స్ చేస్తూ ఓ లేడీ కంటెస్టెంట్ ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలె విడుదలైంది. ఇందులో..డ్యాన్స్ చేస్తూ ఓ కంటెస్టెంట్ ప్రమాదవశాత్తూ స్టేజ్ కింద పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం అయ్యింది. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రమాదం జరిగిందని స్పష్టమవుతోంది. డ్యాన్స్ చేస్తూ కిందకు దూకే ఓ షాట్లో కంటెస్టెంట్ ప్రమాదవశాత్తూ కింద పడిపోవడంతో తలకు తీవ్రంగా దెబ్బ తగిలి రక్తస్రావమైంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఇది నిజంగానే ప్రమాదమా లేక పబ్లిసిటీ స్టంటా అన్నది తెలియాలంటే మాత్రం వచ్చే వారం ఏప్రిల్14న విడుదలయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సి ఉంది. చదవండి : ఈ బుల్లితెర జంట విడిపోనుందా? చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! -
అందుకే ఖమ్మం వచ్చా: యాంకర్ ప్రదీప్
సాక్షి, ఖమ్మం: ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా యూనిట్ ఆదివారం సాయంత్రం ఖమ్మంలో సందడి చేసింది. ఈ చిత్రం ప్రదర్శించబడుతున్న తిరుమల థియేటర్‌కు యాంకర్ ప్రదీప్ రాగా.. అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులతో ముచ్చటించి, సినిమా ఎలా ఉందో తెలుసుకున్నారు. తనను ఆదరిస్తున్న వారందరికీ ప్రదీప్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోందని అన్నారు. ఈ చిత్రాన్ని హిట్ చేసిన ప్రేక్షకులను స్వయంగా కలుసుకునేందుకే తమ యూనిట్ ఖమ్మంకు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమా దర్శకుడు మున్నా, నిర్మాత శ్రీనివాసరావు, థియేటర్ మేనేజర్ సంగబత్తుల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఇస్మార్ట్ సోహైల్‌కు గ్రాండ్ వెల్కమ్ గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు -
యాంకర్ ప్రదీప్ నెల సంపాదన ఎంతో తెలుసా?
బుల్లితెరపై హోస్ట్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. తనదైన పంచ్‌లు, యాంకరింగ్‌తో సుమ కనకాల తరువాత టాలీవుడ్లో అంతటి పేరును సొంతం చేసుకున్న వ్యక్తి ప్రదీప్ ఒక్కడే. ఇటీవలే ఈయన హీరోగా నటించిన తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ విడుదలైన విషయం తెలిసిందే. జనవరి 29 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. కాగా టెలివిజన్‌లో అత్తా కోడళ్ళు షోతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రదీప్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఒకానొక సమయంలో వంద రూపాయల కోసం కూడా ఎంతో కష్టపడినట్లు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం పలు చానల్స్ లో అనేక షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రదీప్.. స్టార్ యాంకర్ కొనసాగుతున్నాడు. ఇతనికి యూత్, అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే టీవీ షోలు, సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రదీప్ నెలకు ఎంత సంపాదిస్తున్నాడన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రదీప్ నెలకు దాదాపు రూ. 40 నుంచి 50 లక్షల వరకు సంపాదిస్తున్నాడనే టాక్ ఫిలీం వర్గాల్లో వినిపిస్తోంది. చదవండి: 30 రోజుల్లో..ఫస్ట్‌డే కలెక్షన్లు.. ప్రదీప్ ఎమోషనల్ ట్వీట్ రెండేళ్ల క్రితం ప్రదీప్ టీవీ షోలలో ఒక్కో ఎపిసోడ్‌కు రూ 75 వేల వరకు తీసుకునేవాడట. అయితే ఇప్పుడు అదే షోకు ప్రదీప్ అక్షరాలా లక్షన్నరకు పైగా తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రానికి పాతిక లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. అంటే ఈ స్టార్ యాంకర్ దాదాపు ఏడాదికి ఆరు కోట్లకు పైగా సంపాదిస్తున్నడన్న మాట. ఈ మొత్తం టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా ఇంత భారీ మొత్తంలో సంపాదించడం లేదని టాక్. చదవండి: ఠాగూర్ మధుపై ‘క్రాక్’ డైరెక్టర్ ఫిర్యాదు చదవండి: పిట్టకథలు ట్రైలర్: ఎంతమంది మొగుళ్లే నీకు.. చదవండి: ఐస్‌క్రీమ్ తింటున్న స్టార్ హీరోను గుర్తుపట్టారా? -
‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా..’ పాట రచయితెవరు?
పునర్జన్మలు ఉన్నాయా, లేవా? అంటే ఎవరి సమాధానం వారికి ఉంటుంది. ఆ వాదన పక్కనపెడితే పునర్జన్మల ఆధారంగా తెలుగులో పలు చిత్రాలు వచ్చాయి... వస్తున్నాయి. యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా..’ సినిమా కూడా పునర్జన్మల కథ నేపథ్యంలోనే తెరకెక్కంది. ఇటువంటి చిత్రాలపై స్పెషల్ క్విజ్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1541342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1551342029.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..
-
30 రోజుల్లో..ఫస్ట్‌డే కలెక్షన్లు.. ప్రదీప్ ఎమోషనల్ ట్వీట్
తనదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమర్‌తో బుల్లితెరపై గొప్ప యాంకర్‌గా పేరు సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. మున్నా దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించింది. ఈ శుక్రవారం(జనవరి 29) విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. తొలిరోజే రూ.4 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక తన తొలి సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ప్రదీప్ సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ ఓ ఎమోషనల్ లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. (చదవండి : ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ మూవీ రివ్యూ) ‘ఒక చిన్న సినిమాకి విశేష స్పందన అందింది. ఎన్నో రోజుల కల ఇది. మీ అందరి సహకారంతోనే ఈ రోజు సాధ్యం అయింది. నా కెరీర్లో అతిపెద్ద అడుగు నేను వేసేటప్పుడు ఇంతమంది సపోర్ట్ నాకు ఉండడం, అద్భుతమైన ఓపెనింగ్స్‌తో ఇంతమంది ప్రజలు థియేటర్స్‌కి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా ధన్యవాదాలు. ఎప్పటికీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను’అని ప్రదీప్ మాచిరాజు ట్వీట్ చేశాడు. జనం మెచ్చిన సినిమా.. #30RojulloPreminchadamEla, First Day Worldwide Gross 4 Crores🤩 అందరి నోట ఒకటే మాట, పాటంత బాగుంది సినిమా! ❤️@impradeepmachi @Actor_Amritha@DirectorMunna1 @anuprubens #GA2UV @UrsVamsiShekar @SVProductions5 @LahariMusic #NeeliNeeliAakasamAnthaHit pic.twitter.com/4RHQdAQYJS — Ramesh Bala (@rameshlaus) January 30, 2021 -
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ మూవీ రివ్యూ
టైటిల్ : 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? జానర్ : రొమాంటిక్ ఎంటర్ టైనర్ నటీనటులు : ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్, శుభలేఖ సుధాకర్, పోసాని కృష్ణమురళి, హేమ, వైవా హర్ష హైపర్ ఆది తదితరులు నిర్మాణ సంస్థ : ఎస్వీ ప్రొడక్షన్ నిర్మాత : ఎస్వీ బాబు దర్శకత్వం : మున్నా ధూళిపూడి సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర విడుదల తేది : జనవరి 29, 2021 బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యాఖ్యతగా తనదైన పంచులు, సెన్సాఫ్ హ్యూమర్‌తో అదరగొట్టే ప్రదీప్ మాచిరాజు.. సుమ తరువాత గొప్ప యాంకర్‌గా పేరు సంపాదించుకున్నాడు. తనదైన శైలి హోస్టింగ్‌తో ఎన్నో షోలను విజయవంతంగా నడిపించాడు. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు చాలా తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇక తొలిసారి హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే డిఫెరెంట్ టైటిల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాది పాటు వాయిదా పడిన ఈ మూవీ.. శుక్రవారం(జనవరి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ తనకు మంచి పేరు తీసుకొస్తుందన్న ధీమాలో ప్రదీప్ ఉన్నాడు. యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్ వెండి తెరపై ఏ స్థాయిలో రాణించాడు? హీరోగా ప్రేక్షకులను మెప్పించాడా? రివ్యూలో తెలుసుకుందాం. కథ వైజాగ్‌లో ఓ కాలేజీలో ఇంజనీరింగ్ చదివే అల్లరి స్టూడెంట్ అర్జున్(ప్రదీప్ మాచిరాజు). చదువంటే ఇష్టం ఉండదు కానీ బాక్సింగ్ అంటే ప్రాణం. అదే కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన విద్యార్థిని అక్షర(అమృతా అయ్యర్). అమృతకి, అర్జున్‌కి అసలే పడదు. ఒకరంటే ఒకరికి కోపం, పగ, ద్వేషం. అనుకోకుండా వీరిద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ వీరిద్దరికి ఓ పెద్ద సమస్య ఎదురువుతోంది. ఆ సమస్యకు పరిష్కారమేంటో స్వామిజీ(శుభలేక సుధాకర్) చెప్తాడు. దీంతో వీరిద్దరు ఇష్టంలేకున్నా 30 రోజుల్లో ప్రేమించుకోవాల్సి వస్తోంది. అసలు వీరిద్దరికి ఎదురైన సమస్య ఏంటి? వీరి జీవితాలకు, స్వామీజికి సంబంధం ఏంటి? వీరిద్దరికి ఒకరంటే ఒకరు ఎందుకు పడదు? ఇష్టం లేని వీరిద్దరు ఎందుకు ప్రేమించుకోవాల్సి వచ్చింది? చివరకు వీరి సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా? అనేదే మిగతా కథ. నటీనటులు బుల్లితెరపై యాంకర్‌గా తనదైన ముద్రవేసుకున్నాడు ప్రదీప్. తనదైన కామెడీ పంచ్‌లతో, సెన్సాఫ్ హ్యూమర్‌తో ఎన్నో షోలను విజయవంతం చేశాడు. షోలో ప్రదీప్ ఉంటే చాలు కామెడీకి కొదవ ఉండదు. తొలి సినిమాలో కూడా అదే కామెడీతో నవ్వించాడు ప్రదీప్. అర్జున్ అను అల్లరి స్టూడెంట్ పాత్రలో జీవించేశాడు. తొలి సినిమాయే అయినా.. ఎంతో అనుభవం ఉన్న హీరోలా నటించేశాడు. యాంకర్‌గా తనకున్న ఎక్స్పీరియన్స్ సినిమాకు బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. తనదైనశైలీలో నవ్విస్తూనే.. అవసరం ఉన్న చోట ఎమోషనల్ సీన్లను కూడా అవలీలగా చేసేశాడు. ప్రదీప్ తర్వాత బాగా పండిన పాత్ర అమృతది. అక్షర అనే యువతి పాత్రలో అమృత జీవించేసింది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. ఇక పోసాని కృష్ణమురళి, హేమల అనుభవం మరోసారి తెరపై చూడొచ్చు. వైవా హర్ష తనదైన కామెడీతో అందరిని నవ్వించేశాడు. హైపర్ ఆది, మహేశ్, శుభలేఖ సుధాకర్ తమ పాత్రల పరిధి మేర నటించారు. విశ్లేషణ యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు ఇది తొలి సినిమా. మొదటి సినిమాతోనే ప్రదీప్‌తో ప్రయోగం చేయించాడు దర్శకుడు మున్నా. పునర్జన్మల కథ ఎంచుకుని దర్శకుడు మంచి ప్రయత్నమే చేశాడు. కానీ ఆ కథని తెరపై చూపించడంతో కాస్త తడబడ్డాడు. నేటి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చిన ప్రేమ సన్నివేశాలు కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఉండవు. అలాగే సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి తప్ప, ఆడియన్స్‌ని ఇన్వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. సీరియస్ కథ అయినా.. కామెడీతో నడిపించే ప్రయత్నం చేసి కాస్త విఫలమయ్యాడు. హీరో, హీరోయిన్ల మధ్య చోటు చేసుకునే కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో ఒక్క ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. అలాగే సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఫస్టాప్‌ను కామెడీగా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌ను ఎమోషనల్‌గా నడుపుదామనుకొని కాస్త విఫలం అయ్యాడు. ఆ ఎమోషన్ గాని, ఆ ఫీల్ గాని ఆడియన్స్ ఫీల్ అవ్వరు. ఇక సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా 'నీలి నీలి ఆకాశం..' పాట ఎంత గొప్పగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ బాగా లేదు. కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే. ఈ సినిమా ‘నీలి నీలి ఆకాశం’ పాట అంత బాగాలేదు కానీ, చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ : ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ నటన ఇంటర్వెల్ ట్విస్ట్ అనూప్ రూబెన్స్ సంగీతం మైనస్ పాయింట్స్ కథాకథనం సాగదీత సీన్లు ప్రీ క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మా సినిమాని కుటుంబమంతా కలసి చూడొచ్చు
‘‘నేనీ స్థాయికి రావడానికి పదేళ్లు పట్టింది. నా మీద నమ్మకంతో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు మున్నా. నా మొదటి సినిమాకే అంత మంచి ప్యాషన్ ఉన్న నిర్మాత బాబుగారు దొరకడం నా అదృష్టం. కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది’’ అని ప్రదీప్ మాచిరాజు అన్నారు. ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఎస్వీ బాబు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘ నీలి నీలి ఆకాశం..’ పాట ఒక ఏడాదంతా వినేలా చేసిందంటే మామూలు విషయం కాదు. పాట ఎంత పెద్ద హిట్ అయిందో సినిమా కూడా అంతే హిట్ కావాలి’’ అన్నారు. ‘‘నా ‘పటాస్’ సినిమాని యస్వీ బాబుగారు కన్నడలో రిలీజ్ చేశారు. ఆయన తెలుగులో నిర్మించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సూపర్ హిట్ అవ్వాలి’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘అనూప్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. ఈ సినిమాతో ప్రదీప్ మంచి హీరోగా స్థిరపడాలని కోరుకుంటున్నా’’ అన్నారు హీరో కార్తికేయ. ‘‘మా సినిమాకి ఓటీటీ రిలీజ్‌కి ఆఫర్స్ వచ్చినా మా కష్టాన్ని గుర్తించిన బాబుగారు థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషం’’ అన్నారు ఫణి ప్రదీప్. ‘‘ఒక మంచి సినిమా తీశానన్న తృప్తి కలిగింది. మా సినిమాని సక్సెస్ చేయాలి’’ అన్నారు చిత్రనిర్మాత ఎస్వీ బాబు. ‘‘నీలి నీలి ఆకాశం..’ పాట ఎంతలా హిట్ అయిందో అంతకంటే గొప్పగా సినిమా ఉంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. అనంతరం నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ప్లాటినమ్ డిస్క్‌లను అందించారు. ఈ కార్యక్రమంలో అమృతా అయ్యర్, హీరో అడవి శేష్, నిర్మాత సి. కల్యాణ్, కెమెరామాన్ శివేంద్ర, సింగర్స్ సునీత, సిద్ శ్రీరామ్, పాటల రచయిత అనంత్ శ్రీరామ్ పాల్గొన్నారు. -
ముగ్గురు టాప్ యాంకర్లతో హీరో ప్రదీప్ స్టెప్పులు
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనేది థియేటర్ల సాక్షిగా అభిమానులకు నేర్పించబోతున్నాడు యాంకర్ ప్రదీప్. ఆయన హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?". ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. రిపబ్లిక్ డే సందర్భంగా మంగళవారం 'వావా మేరే బావా' అనే ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. (చదవండి: సింగర్ సునీత వెడ్డింగ్.. సుమ డాన్స్ అదరహో) ఇందులో పోర్ల జోలికి వెళ్లొద్దంటూనే ప్రదీప్ ముద్దుగా ముద్దుగుమ్మలతో డ్యాన్స్ చేయడం విశేషం. ఆ ముగ్గురు భామలెవరో కాదు, తెలుగు బుల్లితెరను ఏలుతున్న ముగ్గురు టాప్ యాంకర్లు రష్మీ, అనసూయ, శ్రీముఖి. ఇంకేముందీ.. యాంకర్లందరూ ఒకేచోట చేరి స్టెప్పులేస్తే ఆ జోష్ ఎలా ఉంటుందో చూపించాడు ప్రదీప్. ప్రస్తుతం ఈ వావా మేరే బావా పాట నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సాంగ్‌ను మీరు కూడా మరోసారి వినేయండి. (చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ జాబ్ వచ్చిందని ఏడ్చాను: ప్రదీప్) 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'30 రోజుల్లో ప్రేమించటం ఎలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
-
‘ఉద్యోగం వచ్చిందని ఏడ్చాను’
‘‘డైరెక్టర్ అవ్వాలనేది నా కల. నాకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ జాబ్ వచ్చినప్పుడు ఇంట్లో ఆనందపడ్డారు. నేను మాత్రం డైరెక్టర్ అవుదామనుకుంటే ఇంజినీర్ని అయ్యానే అని ఏడ్చాను’’ అన్నారు ఫణి ప్రదీప్ (మున్నా). యాంకర్ ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ జంటగా నటించిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఎస్.వి. బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. చిత్రదర్శకుడు ఫణి ప్రదీప్ (మున్నా) విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2011లో ఇంజినీర్ ఉద్యోగానికి రాజీనామా చేశాను. సుకుమార్‌గారి దగ్గర ‘ఆర్య 2’, ‘1.. నేనొక్కడినే, 100 పర్సెంట్ లవ్’ చిత్రాలకు రచయితల విభాగంలో చేశాను. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, హిట్ అయిన ‘నువ్వేకావాలి, ఆనందం, నువ్వు నేను, క్షణం, స్వామిరారా’ సినిమాల స్ఫూర్తితో ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ కథ రాశాను. ఈ కథని నిర్మాత ‘బన్నీ’ వాసుగారికి చెబితే, ఆయన దగ్గరుండి స్క్రీన్‌ప్లే రాయించారు. గీతా ఆర్ట్స్‌లో చేయాల్సింది కానీ, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. నా కజిన్, నటుడు భద్రం ద్వారా ఎస్వీ బాబుగారిని కలిశాను. ఆయనకు కథ నచ్చడంతో నిర్మించారు. మా అమ్మ, నా భార్య హీరోగా ప్రదీప్ అయితే బాగుంటాడు? అనడంతో నిర్మాతగారికి చెప్పడంతో ఓకే అన్నారు. సినిమా చూసిన ‘బన్నీ’ వాసుగారు మా బ్యానర్లో విడుదల చేస్తాం అన్నారు. ప్రస్తుతం రెండు పెద్ద బ్యానర్లలో అవకాశం వచ్చింది’’ అన్నారు. -
30 రోజుల్లో ఎలా ప్రేమించాలో ఆ రోజే తెలుస్తుంది!
ప్రదీప్ మాచిరాజు.. ఇప్పటివరకు యాంకర్‌గానే పరిచయం. కొన్ని సినిమాల్లో హీరోకు స్నేహితుడుగానూ కనిపించాడు. కానీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ‘ఆర్య 2’, , నేనొక్కడినే’ చిత్రాలకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులోని నీలి నీలి ఆకాశం.. సాంగ్ ఎంతోమంది ప్రేక్షకుల సెల్ఫోన్లలో ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. అనూప్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, సిద్ శ్రీరామ్, సునీత సుమధర గానం.. అన్నీ కలిసి ఈ పాటను ఇంత బ్లాక్‌బస్టర్ చేశాయి. (చదవండి: చైతూ, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ టీజర్ రిలీజ్) ఈ సినిమాను గతేడాది ఉగాదికి రిలీజ్ చేయాలని భావించినప్పటికీ లాక్డౌన్ వల్ల విడుదల వాయిదా పడింది. ఎలాగైనా థియేటర్లలోనే విడుదల చేయాలన్న సంకల్పంతో ఓటీటీ వైపు కూడా మొగ్గు చూపలేదు. దీంతో రిలీజ్ ఆలస్యమవగా మొత్తానికి ముహూర్తం డేట్ ఫిక్స్ చేశారు. జనవరి 29న రిలీజ్ అవనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. పాట అంత బాగుంటుంది ఈ సినిమా అని ప్రేక్షకులను ఊరిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్‌తో మ్యాజిక్ చేసిన ప్రదీప్ ఈ సినిమాతో జనాలను ఎలా మాయ చేస్తారో చూడాలంటే రిలీజయ్యేవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: బాలీవుడ్ హీరోయిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్) Jan 29th !!!!😊 With all your love and support 🙏#GA2 nd #UV release @DirectorMunna1@Actor_Amritha @anuprubens @SVProductions5 @boselyricis @UrsVamsiShekar @LahariMusic @Dsivendra pic.twitter.com/DteqclKWH0 — Pradeep Machiraju (@impradeepmachi) January 11, 2021 -
‘యాంకర్ ప్రదీప్‌కు ఈ కేసుతో సంబంధం లేదు’
సాక్షి, హైదరాబాద్: 139 మంది అత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలికి అండగా నిలిచిన వివిధ కుల సంఘాలు, మహిళా సంఘాలు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ అన్నారు. డాలర్ బాబు ఒత్తిడి వల్లే ప్రదీప్‌పై బాధితురాలు కేసు పెట్టిందని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటువంటి ఘటన చూస్తే పూలన్ దేవి గుర్తొచ్చింది. ఫూలన్ దేవి ఎన్నోసార్లు అఘాయిత్యానికి గురయ్యారు. పీడిత కులానికి చెందిన యువతిపై 139 దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసి షాక్‌కి గురయ్యాను. ఈ కేసుకు సంబంధించి సీసీఎస్ పోలీసులను మా బృందం సంప్రదించింది. ఒక మహిళా ఏసీపీ కేసును విచారిస్తున్నరని తెలిపారు. కేసును సీఐడీకి బదిలీ చేయాలని కోరుతున్నాం. నిన్న సుమారు రెండు గంటల పాటు బాధితురాలితో మాట్లాడాను. 139 మందిపై రేప్ కేసుతో పాటు ఎస్సీఎస్టీ కేసులు పెట్టారు. మా జోలికి అనవసరంగా వస్తే వదిలి పెట్టం. ఈ కేసులో నిజాలు తెలుసుకునేందుకు బాధితురాలికి పోలీసుల కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగాను. పెళ్లైన తరువాత అమ్మాయి జీవితంలో జరిగిన నాలుగు ఘటనలు వివరించింది. 139 మందిలో 30 శాతం మంది అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేశారు. ఇంకో 30 శాతం అమ్మాయిని మానసికంగా వేధించి బ్లాక్ మెయిల్ చేశారు. (చదవండి: ఎవరీ డాలర్ బాయ్?) దాదాపు 40 శాతం మందికి ఈ కేసుతో సంబంధం లేని వాళ్లు ఉన్నారు. అమ్మాయి చిన్న వయసులోనే బ్లాక్ మెయిల్ కు గురై అత్యాచారానికి గురైంది. ఎస్ఎఫ్ఐ మీసాల సుమన్ ఈ అమ్మాయి జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడే అమ్మాయి బ్లాక్ మెయిల్‌కు గురైంది. డాలర్ బాయ్ అమ్మాయితో కేసులు పెట్టించి వారిని బ్లాక్మెయిల్ చేశాడు. డాలర్ బాబు కూడా అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మీసాల సుమన్, డాలర్ బాయ్‌ను అదుపులోకి తీసుకుంటే అన్ని నిజాలు బయట పడుతాయి. బాధితురాలికి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలి’ అని మందకృష్ణ పేర్కొన్నారు. (చదవండి: 143 మంది అత్యాచారం కేసు: స్పందించిన ప్రదీప్) -
143 మంది అత్యాచారం కేసు: స్పందించిన ప్రదీప్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనంగా మారిన యువతిపై 143 మంది అత్యాచారం కేసులో ప్రముఖ యాంకర్ మాచిరాజు ప్రదీప్ పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు అతనిపై కేసు సైతం నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పలువర్గాల నుంచి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా యాంకర్ ప్రదీప్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే తనను టార్గెట్‌గా చేసుకుని తనకు ఎలాంటి సంబంధంలేని వివాదంలోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తన కుటుంబాన్ని ఎంతో మానసిక కుంగుబాటుకు గురిచేస్తున్నారని అన్నారు. (42 పేజీల ఎఫ్ఐఆర్ రెడీ!) ‘సోషల్ మీడియాలో నా మీద వస్తున్న ఆరోపణలు ఎంతో బాధపెడుతున్నాయి. సున్నితమైన వివాదంలో నా పేరు పెట్టి ఉద్దేశపూర్వకంగానే అటాక్ చేస్తున్నారు. అవతలి వ్యక్తులు నా పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మీడియా వ్యూస్ కోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తాను. మీ ఆరోపణల కారణంగా నా కుటుంబం మానసికంగా బలవుతుంది. మమ్మల్ని మానసికంగా మానభంగం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలి కానీ నిజాలు తెలియకుండా నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఒక్కో మెట్టు ఎదిగిన నన్ను కావాలని వివాదంలోకి లాగుతున్నారు. సోషల్ నెట్ వర్క్ లో నా పేరు వాడటం చాలామందికి అలవాటుగా మారింది. అనవసరమైన ఆరోపణలతో నా సన్నిహతులు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజానిజాలు ఖచ్చితంగా బయటకు రావాలి’ అని వీడియో ద్వారా వెల్లడించారు. తనపై 143 మంది లైంగిక దాడికి పాల్పడ్డారంటూ పంజాగుట్ట పోలీసు స్టేషన్లో ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సీసీఎస్ పోలీసులు వేగవంతం చేశారు. ఎఫ్ఐఆర్, బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా నిందితులను విచారించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 143 మంది నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే 42 పేజీలతో ఎఫ్ఐఆర్ రెడీ చేశారు. 143 మందిలో ప్రముఖ రాజకీయ నాయకుల పీఏలు, టీవీ నటులు, పోలీసులు, ఎస్ఎఫ్ఐ లీడర్లు ఉన్నట్టు బాధితురాలు తెలిపింది. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. -
నీలి నీలి ఆకాశం @ 10 కోట్లు!
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’. అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. మున్నా దర్శకత్వంలో ఎస్వీ బాబు నిర్మించారు. అనూప్ రూబె¯Œ ్స సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాట 100 మిలియన్ల వ్యూస్ దాటినట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా మున్నా, ఎస్వీ బాబు మాట్లాడుతూ– ‘‘మా సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాటతో సహా అన్ని పాటలనూ చంద్రబోస్ రాశారు. ప్రదీప్, అమృతలపై చిత్రీకరించిన ‘నీలి నీలి ఆకాశం’ పాట పది కోట్ల వ్యూస్ దాటడం చాలా ఆనందంగా ఉంది. అనూప్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, సిద్ శ్రీరామ్, సునీత సుమధర గానం.. అన్నీ కలిసి ఈ పాటను ఇంత బ్లాక్‌బస్టర్ చేశాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితులు సమసిపోయి, సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. కాగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాని జీఏ2, యూవీ క్రియేష¯Œ ్స సంస్థలు విడుదల చేయనున్నాయి. -
బుల్లితెర కార్మికులకు యాంకర్ ప్రదీప్ చేయూత
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి వల్ల దేశదేశాలే స్తంభించిపోయాయి. భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీని ప్రభావం అన్ని రంగాలపై పడింది. వీటిలో సినీ, టెలివిజన్ రంగాలు కూడా ఉన్నాయి. లాక్డౌన్ వల్ల సినిమా, టీవీ షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల రోజువారీ వేతనాలకు పనిచేసే కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సిసీ కార్మికులను ఆదుకునేందుకు కొంతమంది హీరోలు ముందుకొచ్చి రూ.కోట్లల్లో విరాళాలు ప్రకటిస్తున్నారు. అలాగే బుల్లితెరపై కూడా చాలా మంది కార్మికులు ఆధారపడి ఉంటారు. ఒక్కో షోకు వందలాది కార్మికులు కష్టపడుతుంటారు. లాక్డౌన్ నేపథ్యంలో వీరందరికి పనిలేకుండా పోయింది. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. తనకు తెలిసిన 60 మంది టెలివిజన్ కార్మికులకు ఒక నెలకు సరిపడా ఆర్థికసాయం చేస్తాననని ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. (చదవండి : కరోనా కష్టాలు... టాలీవుడ్ హీరోల భారీ విరాళాలు) ‘ప్రస్తుతం ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం ఇంట్లో ఉండటం చాలా చాలా సేఫ్. అలా ఉండటమే చాలా ఉత్తమం. మనం ఇంట్లో ఉండటం కరోనా వ్యాప్తి చెందకుండా దాని చైన్‌ను బ్రేక్ చేసినవాళ్లం అవుతాం. మన ద్వారా వేరేవాళ్లకు కానీ.. వాళ్ల ద్వారా మనకి కానీ రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి లాక్డౌన్ టైమ్‌లో ఇంట్లోనే ఉండటం వెరీ వెరీ సేఫ్. దయచేసి అందరూ దీన్ని ఫాలో అవ్వండి. ప్రస్తుతం ఫాలో అవుతున్న వాళ్లు దాన్నే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. (చదవండి : కిచెన్ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్) దీంతో పాటు ఇంట్లో వాళ్లతో గడిపే సమయం దొరికింది. మూవీస్, టీవీ షోలు, ప్రోగ్రామ్స్ చూస్తున్నాం. వీటిలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ మనకి టెలివిజన్ ద్వారా వస్తోంది. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మనకి అందించడానికి కొన్ని వందల మంది వాటి వెనుక పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది రోజువారీ కార్మికులు ఉంటారు. నా షోలకు పనిచేసేవాళ్లే కాకుండా చాలా షోలు, సీరియల్స్‌కు వీళ్లు పనిచేస్తారు. ఆరోజు షూటింగ్ జరిగితే దాని ద్వారా వచ్చిన డబ్బులతోనే వాళ్ల ఇల్లు గడుస్తుంది. చాలా రోజుల నుంచి షూటింగ్‌లు జరగట్లేదు. ఇంకా ఎన్ని రోజులు జరగకుండా ఉంటాయో తెలీదు. ఇలాంటి పరిస్థితిలో వాళ్లకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంటుంది. రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికులకు సంబంధించి నాకు తెలిసిన 50 నుంచి 60 కుటుంబాలు ఉన్నాయి. వాళ్లందరికీ ఒక నెలకు సరిపడే ఆర్థిక సహాయాన్ని నేను చేద్దామని అనుకుంటున్నాను. నా తరఫున ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ఇది నా టెలివిజన్ ఫ్యామిలీ. నేను షోలు చేయడానికి వీళ్లంతా ఎంతగానో సహాయం చేశారు. అందుకే, వాళ్లు కనీస అవసరాలు పొందడానికి నేను సాయం చేస్తాను. ఇలాగే మీకు తెలిసిన దినసరి కార్మికులు కూడా చాలా మంది ఉండొచ్చు. వారికి కాల్ చేసి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండి. మీకు తోచిన సహాయం చేయండి. మనం మన ఇంట్లోనే ఉంటూ ఇంకో ఇంటి గురించి ఆలోచిద్దాం’ అని ప్రదీప్ అన్నారు. -
ప్రస్తుతం ఏం జరుగుతోందో అందరికీ తెలుసు: ప్రదీప్
-
30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ప్రెస్ మీట్
-
మంచి కథతో వస్తున్నాం
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్గా మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. యస్.వి. బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మున్నా మాట్లాడుతూ– ‘‘నేను ఎంసీఏ చదివే రోజుల్లో సుకుమార్‌గారి వద్ద పనిచేయాలనుకున్నా. ఆ తర్వాత ఆయన అసిస్టెంట్‌గా పని చేశాను. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ కథని అల్లు అర్జున్‌గారికి, ‘బన్నీ’ వాసుకి చెప్పాను. వారు కొన్ని సలహాలిచ్చారు. ‘బన్నీ’ వాసు మా సినిమాని జీఎ2 పతాకంపై విడుదల చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు. ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ– ‘‘హీరోలు మహేశ్‌బాబు, రానా, హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నా మా సినిమాని సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. అనూప్ మంచి సంగీతం ఇచ్చారు. మున్నా మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి మనుషులు కలిసి చేసిన ఈ చిత్రం తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘నీలి నీలి ఆకాశం..’ పాటకు మంచి స్పందన వచ్చింది. అనూప్ చక్కని సంగీతం ఇచ్చారు. చంద్రబోస్ మంచి సాహిత్యాన్ని అందించారు’’ అన్నారు యస్.వి.బాబు. ‘‘ఇది నా తొలి చిత్రం. మంచి పాత్ర ఇచ్చినందుకు మున్నాకి థాంక్స్’’ అన్నారు అమృతా అయ్యర్. సహ నిర్మాత వినయ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, కెమెరామెన్ శివ, ఆర్ట్ డైరెక్టర్ నరేష్ మాట్లాడారు. -
పండక్కి సిద్ధం
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’. అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. ‘ఆర్య 2’, ‘1.. నేనొక్కడినే’ చిత్రాలకు సుకుమార్ దగ్గర పనిచేసిన మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ చిత్రసీమలో విజయవంతమైన చిత్రాల నిర్మాతగా పేరుపొందిన ఎస్వీ బాబు నిర్మించిన ఈ సినిమాని ఉగాదికి ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఔట్పుట్ నచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి జీఏ2, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ‘‘రొమాంటిక్ కామెడీగా రూపొందిన చిత్రమిది. ఇందులోని ‘నీలి నీలి ఆకాశం..’, ‘ఇదేరా స్నేహం..’ పాటలు సంగీత ప్రియుల ఆదరణను అమితంగా పొందాయి. మహేశ్ బాబు విడుదల చేసిన ‘నీలి నీలి ఆకాశం..’ పాట సెన్సేషనల్ హిట్టయి, ఇప్పటికే 60 మిలియన్ వ్యూస్ సాధించింది. తాజాగా విడుదల చేసిన ‘మీకో దండం..’ పాట 24 గంటల్లో 3 మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. శివన్నారాయణ, హేమ, పోసాని కృష్ణమురళి, ‘శుభలేఖ’ సుధాకర్, వైవా హర్ష, ‘హైపర్’ ఆది తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: దాశరథి శివేంద్ర. -
ప్రదీప్ మాచిరాజు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమిృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహించాడు. ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్వీ బాబు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రదీప్ ఫాలోవర్స్‌కు చిత్ర బృందం తీపి కబురు తెలిపింది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా రిలీజ్ డేట్‌కు సంబంధించి పోస్టర్స్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్సందన వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ సాంగ్ 60 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఈ సాంగ్‌ను టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక మార్చి 25న విడుదల కాబోతున్న నాలుగు చిత్రం ఇది. అదే డేట్‌న నాని, సుధీర్ల ‘వి’, రాజ్ తరుణ్ ‘ఓరేయ్ బుజ్జిగా’,తో పాటు ‘అమృతరామమ్’ చిత్రాలు రీలీజ్ కానున్నాయి. చదవండి: ‘ప్రదీప్’ పాటకు నెటిజన్లు ఫిదా ‘ఎవరీ కుంజాలి.. చూసిన వాళ్లు బతికిలేరు’ -
యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న‘నీలి నీలి ఆకాశం..’
బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో ప్రేక్షకుల్ని అలరించిన ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. మున్నా దర్శకత్వం వహించారు. అమృతా అయ్యర్ కథానాయిక. ఎస్వీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్వీ బాబు నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. ఈ సందర్భంగా ఎస్వీ బాబు మాట్లాడుతూ– ‘‘లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ప్రదీప్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కొత్తగా కనిపిస్తారు.. ఆయన నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. హీరో–హీరోయిన్ల మధ్య సన్నివేశాలు భావోద్వేగంతో ఉంటాయి. దర్శకునికి ఇది తొలి సినిమా అయినప్పటికీ దృశ్యకావ్యంలా తెరకెక్కించారు. హీరో మహేశ్‌బాబు చేతుల మీదగా ఇటీవల విడుదలైన ‘నీలి నీలి ఆకాశం..’ పాట సంగీత ప్రపంచంలో ఒక సంచలనం సృష్టిస్తూ యూట్యూబ్‌లో ఇప్పటికే 50 మిలియన్ వ్యూస్ సాధించింది. ఒక చిన్న సినిమా పాట ఈ స్థాయిలో పాపులర్ కావడం ఈమధ్య కాలంలో మాదే. సంగీతప్రియులు ఈ స్థాయిలో పాటను ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: దాశరథి శివేంద్ర. -
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’.. తమన్నా సాయం!
బుల్లితెర ప్రఖ్యాత యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై పాజిటీవ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్టు చిత్ర ప్రమోషన్లు భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే మూవీ మ్యూజిక్ పోస్టర్‌ను రానా విడుదల చేయగా.. తొలి పాట సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలోని రెండు లిరికల్ సాంగ్ మిల్క్ బ్యూటీ తమన్నా తన అధికారిక ట్విటర్ ద్వారా విడుదల చేశారు. ఈ సాంగ్ విడుదల చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌కు తమన్నా బెస్ట్ విషెస్ తెలిపారు. కాగా, ఈ చిత్రం కోసం తమన్నా తన వంతు సాయాన్ని ఈ విధంగా చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘ఇదేరా స్నేహం.. కనివిని ఎరుగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం.. దేహం అడగని స్నేహం.. ఇది హృదయం అడిగే స్నేహం.. నింగిని నేలని వాన చినుకై కలిపెను స్నేహం. తూర్పుకు పడమరకు కాంతి తోరణమైందీ స్నేహం’అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ యూత్‌ను కట్టిపడేస్తోంది. ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా.. ‘బుట్టబొమ్మ’ ఫేమ్ అర్మాన్ మాలిక్ ఆలపించాడు. చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. స్నేహానికి సంబంధించి ఈ పాటలో చంద్రబోస్ అందించిన లిరిక్స్ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ ‘నీలి నీలి ఆకాశం’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నాడు. Happy to launch this beautiful song #IderaSneham from #30RojulloPreminchadamEla 😊 So happy for u my dear @impradeepmachi and wishing entire team the best 👍😊https://t.co/UI1Y3dlSoO — Tamannaah Bhatia (@tamannaahspeaks) February 16, 2020 చదవండి: ‘ప్రదీప్’ పాటకు నెటిజన్లు ఫిదా ‘సామజవరగమన’ వీడియో సాంగ్ వచ్చేసింది! నితిన్ లవ్‌స్టోరీ తెలిసింది అప్పుడే -
నీలి నీలి ఆకాశం..
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. మున్నా దర్శకత్వంలో ఎస్వీ బాబు నిర్మించారు. చంద్రబోస్ సాహిత్యం అందించగా, అనూప్ రూబె¯Œ ్స సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాటకి మంచి ఆదరణ రావడంతో ఆ పాట విజయోత్సవాన్ని నిర్వహించారు. మున్నా మాట్లాడుతూ– ‘‘మా సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం..’ పాటను మొదట చూసిన ప్రేక్షకుడు హీరో మహేశ్‌బాబుగారు. ఆయనే ట్వీటర్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ పాటను అందరూ పాడుతున్నారు. అనూప్ రూబెన్స్ గొప్ప ట్యూన్ ఇస్తే, చంద్రబోస్‌గారు గొప్ప సాహిత్యం అందించారు’’ అన్నారు. ‘‘ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు అనూప్ రూబె¯Œ ్స. ‘‘ఒక పాటకు విజయోత్సవం జరగడం ఇదే మొదటిసారి’’ అన్నారు చంద్రబోస్. ‘‘నీలి నీలి ఆకాశం..’ పాట అద్భుతాలు సృష్టించింది’’ అన్నారు గాయని సునీత. ‘‘ఈ పాటను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు ఎస్వీ బాబు. ‘‘నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా ఇది’’ అన్నారు అమృతా అయ్యర్. ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా డైరెక్టర్ మున్నా అసలు పేరు ప్రదీప్. అంటే ఈ సినిమాకి ఇద్దరు ప్రదీప్‌లు పని చేశారు. ‘నీలి నీలి ఆకాశం..’ పాటను మహేశ్‌బాబుగారు విడుదల చేయడం వల్ల ప్రపంచంలోని తెలుగువాళ్లందరికీ చేరువయింది. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. -
30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ప్రెస్ మీట్
-
‘ప్రదీప్’ పాటకు నెటిజన్లు ఫిదా
ప్రదీప్ మాచిరాజు, అమ్రిత జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహిస్తున్నాడు. యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రదీప్ హీరోగా ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. యూత్‌లో ముఖ్యంగా అమ్మాయిల్లో మంచి పాలోయింగ్ ఉన్న ఈ యాంకర్ తన తొలి సినిమా కోసం ప్యూర్ లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. దీనికి తగ్గట్టు ఈ సినిమాకు డిఫరెంట్ టైటిల్ ప్రకటించడంతో సినిమాపై పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. అంతేకాకుండా చిత్ర ఫస్ట్ లుక్ ఆకట్టుకనే విధంగా ఉంది. తాజాగా మూవీ ఫస్ట్ సాంగ్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. మబ్బులు నిన్నే కమ్మెస్తాయని మానేస్తున్నా’అంటూ ప్రేయసికి కానుకగా ఏమి ఇవ్వాలో తెలియక గందరగోళంలో ఉన్న ఓ ప్రేమికుడి మనసులోని భావాలను అద్భుతమైన పాటగా తీర్చిదిద్ది విడుదల చేశారు. ప్రేమ పాటల ఎక్స్పర్ట్ అనూప్ రుబెన్స్ ఈ పాటను కంపోజ్ చేయగా.. చాలా కాలంగా వెండితెరపై పేరు కనిపించని చంద్రబోస్ ఈ పాటకు హృదయానికి హత్తుకునే లిరిక్స్ అందించాడు. సిద్ శ్రీరామ్, సునీతలు తమ గాత్రంతో ఈ పాటకు ఊపిరి పోశారు. ప్రస్తుతం ఈ పాట ప్రేమికులకు చాలా బాగా కనెక్ట్ అయింది. దీంతో ప్రతీ ప్రేమికుడు తన ప్రేయసికి ఈ పాటను కానుకగా అందిస్తున్నాడు. ఈ పాటలోని కొన్ని పదాలు మచ్చుకకు మీకోసం.. ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. మబ్బులు నిన్నే కమ్మెస్తాయని మానేస్తున్నా, నెలవంకను ఇద్దామనుకున్నా.. నీ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వు వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే, ఇంత గొప్ప అందగత్తెకు ఏమి ఇవ్వనే.., నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే.. ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలె, ఏదో ఇవ్వాలి కానుక.. ఎంతో వెతికాను ఆశగా.. ఏదీ నీసాటి రాదిక అంటూ ఓడాను పూర్తిగా కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా?’అనే లిరిక్స్ వావ్ అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాట మూడు మిలియన్ వ్యూస్‌కు పైగా సొంతం చేసుకుని యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. చదవండి: అమీ.. ఏమాత్రం తగ్గడం లేదుగా! ‘అమలాపాల్-విజయ్ విడిపోడానికి ధనుషే కారణం!’ -
ప్రదీప్ సాంగ్‌ను ఆవిష్కరించిన మహేష్..
యాంకర్ ప్రదీప్ మాచీరాజు హీరోగా తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ . ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రదీప్ సరసన అమ్రిత హీరోయిన్గా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ పోస్ట్‌ర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి వీడియో సాంగ్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించారు. ఈ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? చిత్రం నుంచి మొదటి సాంగ్ లాంచ్ చేస్తున్నందకు ఆనందంగా ఉందని మహేష్ తెలిపారు. పాట చాలా బాగుందన్న మహేష్.. ప్రదీప్‌తోపాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమ పాటను ఆవిష్కరించినందుకు చిత్రబృందం మహేష్‌కు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో సందడి చేస్తుంది. ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా..’ అంటూ సాగే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. సునీత, సిద్ శ్రీరామ్ పాడారు. కాగా, బుల్లితెరపై యాంకర్‌గా ప్రదీప్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న క్రమంలో.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. -
ప్రదీప్ సినిమా మ్యూజికల్ పోస్టర్ వచ్చేసింది..
బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ మాచిరాజు. ప్రస్తుతం ప్రదీప్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తోపాటు మ్యూజికల్ పోస్టర్‌ను శనివారం హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్‌కు రానా విషెస్ చెప్పారు. ఈ వీడియోను తన యూట్యూబ్ చానల్లో పోస్ట్ చేసిన ప్రదీప్.. ‘సెలయేటి మధ్యలో ఆ పూల పరిమళం.. నీ నీలి కళ్ళలో నా ప్రేమ మధురం.. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా!’ అని ఓ కవితను ఉంచారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది. మున్నా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అమ్రిత ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. Wishing you great luck @impradeepmachi bro for a big step from small screen to big screen😊 Here's the musical poster of#30RojulloPreminchadamEla#MRP @anuprubens pic.twitter.com/F1gjADHj9u — Rana Daggubati (@RanaDaggubati) January 25, 2020 27న గోపిచంద్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ హీరో గోపిచంద్, డైరక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గోపిచంద్ హీరోగా ఇది 28వ సినిమా. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను జనవరి 27 ఉదయం 8.47 గంటలకు విడుదల చేయనున్నుట్టు చిత్రబృందం ప్రకటించింది. 'శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్' బ్యానర్‌పై 'ప్రొడక్షన్ నెం.3' గా శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా తమన్నా నటిస్తున్నారు. గతంలో గోపిచంద్, సంపత్ నంది కలయికలో గౌతమ్ నంద చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. #Gopichand28FirstLook 1 Day to Go...#HappyRepublicDay2020#Gopichand28 @YoursGopichand @tamannaahspeaks @SS_Screens pic.twitter.com/VpYOFoLLsA — Sampath Nandi (@IamSampathNandi) January 26, 2020 -
ఆ వార్తల్ని ఖండించిన యాంకర్ ప్రదీప్
గత కొంతకాలంగా యాంకర్ ప్రదీప్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్నో వార్తలు ప్రచారమయ్యాయి. అంతేకాక బుల్లితెరకు దూరమైపోయాడంటూ ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. వీటన్నింటిపై ప్రదీప్ మాచిరాజు క్లారిటీ ఇచ్చేశాడు. మెదటిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో చేసిన ఆయన తన అనారోగ్యంపై వచ్చిన వార్తలను ఖండించారు. ‘షూటింగ్లో నా కాలికి ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు నిల్చోవద్దని చెప్పారు. అందుకే రెస్ట్ తీసుకున్నా. మళ్లీ ఓ వారంలో షూటింగ్లో పాల్గొంటాను’అని ప్రదీప్ తెలిపాడు. తన 10 సంవత్సరాల కెరీర్లో ఇప్పటివరకూ ఇంతపెద్ద బ్రేక్ ఎప్పుడూ తీసుకోలేదన్నాడు. నెల రోజుల పాటు షూటింగ్‌కు దూరంగా ఉన్నట్టు తెలిపాడు. చాలా రోజుల తర్వాత దీపావళి, తన పుట్టిన రోజు వేడుకలను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశానని ప్రదీప్ సంతోషం వ్యక్తం చేశాడు. బర్త్‌డే విషెస్ చెప్పిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ‘నెలరోజులు రెస్ట్ అంటే బోర్ కొడుతుందనుకున్నా కానీ యూట్యూబ్ వీడియోలు, వాటి శీర్షికలు చూసి చాలా టైమ్‌పాస్ అయింది. క్షీణించిన ఆరోగ్యం, దిగ్భ్రాంతిలో ఇండస్ట్రీ అంటూ క్రేజీ శీర్షికలు ఉన్న వీడియోలను చూసి బాగా నవ్వుకునేవాడిని. కానీ తెలీనివాళ్లు కంగారుపడిపోతారు కదా. సో కాస్త నిజానిజాలు తెలుసుకొని చెప్పండి’ అని హితవు పలికాడు. ‘ఢీ’ షోలో త్వరలోనే మరింత ఎంటర్టైన్మెంట్తో ముందుకు రాబోతున్నట్టు ప్రదీప్ చెప్పుకొచ్చాడు. -
మేము సైతం అంటున్న యాంకర్లు...
అనాథలకు అన్నం పెట్టడం, పేదలకు సాయం చేయడం, వికలాంగులకు ఊతమివ్వడం, సమాజానికి చేతనైన సేవ చేయడం... ఇవన్నీ చేయాలంటే బోలెడంత డబ్బుండాలి... అది నిజమే కావచ్చు కానీ సేవ చేయాలన్న దృఢ సంకల్పం, ఆ సంకల్పాన్ని నిలబెట్టుకోవాలన్న సహృదయం ఉంటే చాలు... ఆ సేవను చూసి తోటివాళ్లు ముందుకు వస్తారని నిరూపిస్తున్నాడు శరత్.బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని కిస్మత్పూర్లో నివసించే శరత్‌కుమార్ కొండగడుపులో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆర్థికంగా అంత బలంగా లేకపోయినా, ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలనే తపన బలంగా ఉండేది. ఒక బాలికను దత్తత తీసుకుని... తన గల్లీలో ఉండే ఇంటికి పెద్ద దిక్కు అయిన ఓ బాలిక తండ్రి 2011లో చనిపోయాడు. ఇది చూసిన శరత్ ఆ బాలికను దత్తత తీసుకుని స్కూల్లో చేర్పించాడు. ఆమె చదువుకు అయ్యే ఖర్చు తానే భరించాడు. ఆ బాలిక దత్తతతో మొదలైన తన ప్రస్థానం ఇంకెందరికో సాయపడేలా సాగింది. ఇలా సాగిపోతున్న తనకు ఒక ఆలోచన వచ్చింది. ‘నాలాగా ఆలోచించే వాళ్లను ఒక బృందంగా చేసుకుని నేనెందుకు ఒక ఎన్జీఓను ప్రారంభించకూడదు?’అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. ఒక ఎన్జీఓను నడపడం అంత సులువేమీ కాదని శరత్‌కు తెలుసు కాని ఒక సంవత్సరం పాటు దానిపై కసరత్తు చేసి నిస్వార్థంగా ఎన్జీఓను ఎలా నడపాలనే దానిపై అవగాహన పెంచుకున్నాడు. తల్లిదండ్రుల అనుమతితో ‘ది సహృదయ్ స్వచ్ఛంద సంస్థ’ ను ప్రారంభించాడు. సాక్షి దినపత్రికలో వచ్చిన ఓ కథనంతో మొదలైంది... ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడిపై సాక్షి దినపత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. రెండుకిడ్నీలు ఫెయిలైన ఇమ్రాన్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సకు అయ్యే ఖర్చు కోసం దాతల సాయం కావాలన్న ఆ కథనాన్ని చదివిన శరత్ వెంటనే ఆ పేపర్ క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఇమ్రాన్ తల్లిదండ్రులను కలుసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే మందుల కోసం తన వంతుగా రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని అందించాడు. సేవాభావం గల తన స్నేహితుల సాయంతో మరికొంత సాయం చేశాడు. అది తన మనసుకెంతో తృప్తిని ఇవ్వడంతో వైద్యులతో మాట్లాడి చికిత్స చేస్తే బతికే అవకాశాలున్న రోగులకు దాతల నుంచి సాయం అందేలా చూడటం ప్రారంభించాడు. శరత్‌తోపాటు తన బృందంలోని సభ్యులు వివిధ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకునే స్థోమత లేని రోగులకు సాయం చేయడం మొదలు పెట్టాడు. శరత్ బృందానికి కేటీఆర్ ఏ సాయం కావాలన్నా చేస్తా అని హామీ ఇవ్వడంతో ఆయన ద్వారా ఎంతోమందికి సేవలందిస్తున్నారు. ఇప్పటివరకు కేటీఆర్ సాయంతో 26 మంది ప్రాణాలను కాపాడినట్లు శరత్ తెలిపారు. కేటీఆర్ తమ ఫౌండేషన్‌కు ఎంతో అండగా నిలిచారని పేర్కొన్నారు. ఫోన్ చేస్తే రక్తం దానం... రోగులకు రక్తం కావాలని ఫలానా గ్రూప్ రక్తం కావాలని ఈ ఫౌండేషన్‌ను సంప్రదించే వాళ్లు. ఇది దృష్టిలో పెట్టుకుని ఫౌండేషన్ వలంటీర్ల బ్లడ్ గ్రూప్ వివరాలను సేకరించి పొందుపరిచారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో వలంటీర్లు రోగుల వివరాలు తెలుసుకుని రక్తదానం చేస్తున్నారు. అంతేకాకుండా బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వలంటీర్లు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం. హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు విస్తరణ... 2017లో శరత్ స్థాపించిన ‘ది సహృదయ్ ఫౌండేషన్’ 23 మంది వలంటీర్లతో హైదరాబాద్‌లో తమ సేవా కార్యక్రమాలను ప్రారంభించింది. తెలంగాణలోని అన్ని జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాలలో తమ సేవలను అందిస్తున్నారు. మరింత మందికి సేవలందించాలనే ఉద్దేశంతో ఆ తర్వాత తమిళ్నాడు, కర్నాటక, యూపీ, ఎంపీ, ఢిల్లీ, అస్సాం, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, మణిపూర్ రాష్ట్రాలలో సహృదయ ఫౌండేషన్ బృందాలు పని చేస్తున్నాయి. విదేశాలలోనూ ఫౌండేషన్ బృందాలు... యూఎస్ఏ, రష్యా, ఆస్ట్రేలియా, మలేసియా, ఇండోనేసియా, ఫిలిఫైన్స్, ఇటలీ, ఉక్రెయిన్ వంటి దేశాలలో తమ బృందాలు పని చేస్తున్నాయని శరత్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 5000మంది వలంటీర్లు ఉన్నారని పేర్కొన్నారు. మేము సైతం అంటున్న యాంకర్లు... శరత్ చేస్తున్న సేవల గురించి తెలిసిన యాంకర్ ప్రదీప్, విష్ణుప్రియ, సుడిగాలి సుధీర్ తల్లి కూడా స్వచ్ఛందంగా తమ వంతు తోడ్పాటును అందిస్తున్నారు.– సచిన్ విశ్వకర్మ, సాక్షి, హైదరాబాద్ -
హీరోగా యాంకర్ ప్రదీప్
బుల్లితెర మీద సత్తా చాటిన చాలా మంది యాంకర్లు వెండితెర మీద కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే అనసూయ, రష్మీ, రవి లాంటి వారు ఈ లిస్ట్‌లో చేరగా తాజా మరో స్టార్ యాంకర్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అధికారిక ప్రకటన రాకపోయిన ప్రదీప్ మాచిరాజు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుందన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. 1947 నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ సంగీతమందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈసినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
'నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు'
-
నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు..
సాక్షి, హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన స్టార్ యాంకర్ ప్రదీప్ వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. ప్రస్తుతం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పోలీసులు పట్టుబడుతున్నా ప్రదీప్ రాకపోవడంతో అతడు పరారీలో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయంపై యాంకర్ ప్రదీప్ ఓ వీడియో ద్వారా స్పందించారు. తాను తప్పుచేసినట్లు అంగీకరించిన ప్రదీప్.. ఇంకెవరూ తనలాగా తప్పుచేయకూడదంటూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాను ఇప్పటికీ పోలీస్ కౌన్సెలింగ్‌కు ఎందుకు హాజరుకాలేదు, ఇతరత్రా విషయాలను వీడియో ద్వారా ప్రదీప్ షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో ప్రదీప్ ఏమన్నారంటే.. 'అందరికీ నమస్కారం.. నేను మీ ప్రదీప్ మాచిరాజు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఏం జరిగిందో అందరికీ తెలుసు. దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్స్‌ను చట్ట ప్రకారమే ఫాలో అవుతాను. నాకు వచ్చిన సూచనల ప్రకారం పోలీస్ కౌన్సెలింగ్ కానీ, దాని తర్వాత జరిగే ప్రతి ప్రొసీడింగ్‌కు హాజరు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే ఈలోగా నేను ముందుగానే కమిట్ అయిన ప్రోగ్రామ్స్, ఇతర ఈవెంట్ల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. అందువల్ల నేను అందుబాటులో లేనంటూ కొందరు ఆందోళన చెందుతున్నారు. తెలియజేసేది ఏమంటే షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్లనే కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయాను. కంటిన్యూగా ఫోన్ మోగడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అయుండొచ్చు. దయచేసి మీడియా మిత్రులకుగానీ, ప్రేక్షకులకు గానీ తెలియజేయడం ఏమనగా.. చట్ట ప్రకారం అన్ని ప్రొసీడింగ్స్ ఫాలో అవుతాను. గతేడాది డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఓ వీడియో గురించి చెప్పాను. అవును.. దురదృష్టవశాత్తూ నేను అందులో లభించాను. నేను తెలియజేసేది ఏమంటే.. నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదని కోరుకుంటున్నాను. అందరూ నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నానంటూ' ప్రదీప్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే గత డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిపోయిన మందుబాబులు దాదాపు కౌన్సెలింగ్‌కు హాజరుకాగా, యాంకర్ ప్రదీప్ మాత్రం రాలేదు. ప్రదీప్ పోలీస్ కౌన్సెలింగ్‌కు గత మూడురోజులుగా హాజరుకాకపోవడంతో అతని కోసం ఇళ్లు, కార్యాలయంలో పోలీసులు ఆరా తీసినా అందుబాటులోకి రాలేదని సమాచారం. ప్రదీప్ పరారయ్యాడని, జైలు శిక్ష పడుతోందని కౌన్సెలింగ్‌కు హాజరుకావడం లేదని ప్రచారం అవుతుండగా తన గురించి ఆందోళన చెందవద్దని.. త్వరలోనే లా ప్రొసీడింగ్స్ ఫాలో అవుతానంటూ ఓ వీడియోను ప్రదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బ్రీత్ అనలైజర్‌తో ప్రదీప్‌ను పరీక్షించినప్పుడు 178 పాయింట్లు రావడంతో పాటు.. ఈ స్టార్ యాంకర్ నడుపుతున్న వాహనం అద్దాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా బ్లాక్‌ఫిల్మ్ ఉండటంతో ఆర్టీఏ చట్ట ప్రకారం కూడా అతనిపై చర్యలు తీసుకొనే అవకాశముందని తెలుస్తోంది. నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు