
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రదీప్ మాచిరాజు నటించిన తాజా చిత్రం ‘అక్కడ అమ్మాయి... ఇక్కడ అబ్బాయి’. ఇందులో దీపికా పిల్లి హీరోయిన్‌గా నటించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది.
నితిన్ – భరత్‌ల దర్శకత్వంలో మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రిలీజ్ చేయనున్నట్లు ఆదివారం చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘వెన్నెల’ కిశోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: రధన్.
Comments
Please login to add a commentAdd a comment