
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన కొత్త చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) ఏప్రిల్ 11న విడుదలైంది. ఈ సినిమాలో కామెడీ ఉన్నా సరైన కథ లేదంటూ నెగటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఈ సినిమా గురించి ఒక నెటిజన్ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. సినిమాకు వెళ్దామనుకుంటే రివ్యూలు చూసి వెళ్లలేకపోతున్నానంటూ పేర్కొన్నాడు. అందుకు ప్రదీప్ కూడా ఆ నెటిజన్‌కు సమాధనంగా ఒక ఆఫర్ చేశాడు.
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా గురించి ఒక నెటిజన్ ఇలా పోస్ట్ చేశాడు. యాంకర్ ప్రదీప్ కోసం అయినా సినిమాకు పోదాం అనుకున్నాను. కానీ, ఆ రివ్యూలు చూసిన తర్వాత డబ్బులు వృధా చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఈరోజు ఇంట్లోనే కూర్చొని ఒక బిర్యానీ ఆర్డర్ చేసి.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న కోర్టు సినిమా చూస్తాను.' అని తన ఎక్స్ పేజీలో పోస్ట్ షేర్ చేశాడు. దీంతో ప్రదీప్ కూడా ఇలా రియాక్ట్ అయ్యాడు. ఏమ్ పర్వాలేదు బయ్యా ఒకసారి సినిమా చూసేందుకు ప్రయత్నం చేయండి. సరదాగ నవ్వుకొని వచ్చేసేయండి. మూవీ చూసొచ్చాక చెప్పు తప్పకుండా నీకు బిర్యానీ పంపుతాను.' అని తెలిపాడు.

అయితే, నెటిజన్లు మాత్రం సినిమా బాగుందని కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా తర్వాత నాలుగేళ్లకు కనిపించారు.. మరో సినిమాతో మళ్లీ తెరపై కనిపించాలని అభిమానులు కోరుతున్నారు. సినిమా చూసిన తర్వాత అభిప్రాయం చెప్పండి బ్రదర్.. రివ్యూలను నమ్మొద్దు అంటూ అతనికి సూచిస్తున్నారు.
నితిన్–భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ ప్రాజక్ట్ ద్వారా చాలామంది కొత్తవాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం రధన్ అందించారు.
Em parledu bhayya okasari try chey ..saradaga navvukuni vachey…chusaka cheppu bhayya biryani kuda nene pamipstha ❤️🤗#AkkadaAmmayiIkkadaAbbayi https://t.co/RYwREZjfWr
— Pradeep Machiraju (@impradeepmachi) April 13, 2025