Akkada Ammayi Ikkada Abbayi Movie
-
తిరుమల శ్రీవారి సేవలో అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి టీమ్ సందడి (ఫొటోలు)
-
సినిమా చూసొచ్చాక చెప్పండి బ్రదర్.. నెటిజన్‌కు ప్రదీప్ ఆఫర్
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన కొత్త చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) ఏప్రిల్ 11న విడుదలైంది. ఈ సినిమాలో కామెడీ ఉన్నా సరైన కథ లేదంటూ నెగటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఈ సినిమా గురించి ఒక నెటిజన్ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. సినిమాకు వెళ్దామనుకుంటే రివ్యూలు చూసి వెళ్లలేకపోతున్నానంటూ పేర్కొన్నాడు. అందుకు ప్రదీప్ కూడా ఆ నెటిజన్‌కు సమాధనంగా ఒక ఆఫర్ చేశాడు.‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా గురించి ఒక నెటిజన్ ఇలా పోస్ట్ చేశాడు. యాంకర్ ప్రదీప్ కోసం అయినా సినిమాకు పోదాం అనుకున్నాను. కానీ, ఆ రివ్యూలు చూసిన తర్వాత డబ్బులు వృధా చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఈరోజు ఇంట్లోనే కూర్చొని ఒక బిర్యానీ ఆర్డర్ చేసి.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న కోర్టు సినిమా చూస్తాను.' అని తన ఎక్స్ పేజీలో పోస్ట్ షేర్ చేశాడు. దీంతో ప్రదీప్ కూడా ఇలా రియాక్ట్ అయ్యాడు. ఏమ్ పర్వాలేదు బయ్యా ఒకసారి సినిమా చూసేందుకు ప్రయత్నం చేయండి. సరదాగ నవ్వుకొని వచ్చేసేయండి. మూవీ చూసొచ్చాక చెప్పు తప్పకుండా నీకు బిర్యానీ పంపుతాను.' అని తెలిపాడు. అయితే, నెటిజన్లు మాత్రం సినిమా బాగుందని కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా తర్వాత నాలుగేళ్లకు కనిపించారు.. మరో సినిమాతో మళ్లీ తెరపై కనిపించాలని అభిమానులు కోరుతున్నారు. సినిమా చూసిన తర్వాత అభిప్రాయం చెప్పండి బ్రదర్.. రివ్యూలను నమ్మొద్దు అంటూ అతనికి సూచిస్తున్నారు.నితిన్–భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ ప్రాజక్ట్ ద్వారా చాలామంది కొత్తవాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం రధన్ అందించారు.Em parledu bhayya okasari try chey ..saradaga navvukuni vachey…chusaka cheppu bhayya biryani kuda nene pamipstha ❤️🤗#AkkadaAmmayiIkkadaAbbayi https://t.co/RYwREZjfWr— Pradeep Machiraju (@impradeepmachi) April 13, 2025 -
ప్రామిస్‌ని నిలబెట్టుకున్నాం: హీరో ప్రదీప్
‘‘ఈ వేసవిలో మంచి తెలుగు సినిమా చూసి నవ్వుకుందాం అని భావించే ప్రతి ఫ్యామిలీని ‘మా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’కి ఆహ్వానిస్తున్నాం. మా సినిమా చూసి, థియేటర్స్ నుంచి బయటకొచ్చే ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వు కనిపిస్తోంది. మా సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుల పెదవులపై నవ్వు ఉంటుందని ప్రామిస్ చేశాను.ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకున్నాం’’ అని ప్రదీప్ మాచిరాజు అన్నారు. ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. నితిన్–భరత్ దర్శకత్వంలో ఈ సినిమాను మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మించింది. ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో... ‘‘క్లీన్ కామెడీతో అందర్నీ నవ్విస్తామని చెప్పం. అదే చేశాం’’ అన్నారు నితిన్–భరత్. గెటప్ శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ రథన్, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు. -
రాపిడ్ ఫైర్: ప్రదీప్ మాచిరాజు And దీపికా పిల్లి
-
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
టైటిల్ : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్,రోహిణి, ఝాన్సీ తదితరులునిర్మాణ సంస్థలు: మాంక్స్ అండ్ మంకీస్‌నిర్మాత: మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌ఎడిటింగ్: కొడాటి పవన్ కల్యాణ్‌దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: నితిన్–భరత్‌కథ, డైలాగ్స్: సందీప్ బొల్లాసంగీతం: రధన్సినిమాటోగ్రఫీ: ఎమ్ఎన్ బాల్‌రెడ్డివిడుదల: ఏప్రిల్ 11, 2025‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రదీప్ మాచిరాజు నటించిన కొత్త చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) నేడు ఏప్రిల్ 11న విడుదలైంది. ఇందులో దీపికా పిల్లి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నితిన్–భరత్ దర్శకత్వంలో మాంక్స్ అండ్ మంకీస్ ఈ మూవీని నిర్మించింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ ప్రాజక్ట్ ద్వారా చాలామంది కొత్తవాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం రధన్ అందించారు. ఈ సినిమాలో దర్శకులతో పాటు హీరోయిన్ని కూడా బుల్లితెర వారినే తీసుకోవడం విశేషం. హీరోగా తన రెండో ప్రయత్నంలో ప్రదీప్ మాచిరాజు ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో తెలుసుకుందాం.కథేంటి..?కథ మొదలు కావడమే తమిళనాడులోని భైరిలంక గ్రామం నుంచి మొదలౌతుంది. కొన్ని దశాబ్దాలుగా రాజన్న (జీఎమ్ సుందర్) కుటుంబానికి చెందిన వారే గ్రామ సర్పంచ్‌గా ఉంటారు. అయితే, తన తరంలో అయినా వారసత్వ రాజకీయం అంతం కావాలని ఆయన పెళ్లి కూడా చేసుకోడు. అలా ప్రజల బాగు కోసం రాజన్న ఎంతవరకైనా త్యాగం, దానం చేసేందుకు వెనకడుగు వేయడు. అయితే, ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో మగబిడ్డ మాత్రమే జన్మిస్తుండటంతో సర్పంచ్‌లో ఆందోళన మొదలౌతుంది. అలా 60 మంది తర్వాత రాజా (దీపికా పిల్లి) జన్మిస్తుంది. అప్పటి వరకు గ్రామంలో అలముకున్న అపశకునాలన్ని పోతాయి. రాజా పుట్టిన తర్వాత అక్కడ వర్షాలతో పాటు పంటలు బాగా పండుతాయి. ఆమె తమ గ్రామానికి అదృష్ట దేవత అని అందరూ భావిస్తారు. రాజా పెరిగి పెద్ద అయిన తర్వాత గ్రామం దాటనీయొద్దని, అదే గ్రామంలో ఉన్న 60 మందిలో ఒక్కరిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండాలని సర్పంచ్ రాజన్న తీర్మానిస్తాడు. ఆమె ఎవరిని అయితే పెళ్లి చేసుకుంటుందో అతనే గ్రామ సర్పంచ్ అని, తనకు సంబంధించిన ఆస్తి అంతా ఆమె భర్తకే చెందుతుందని ప్రకటిస్తాడు. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని 60 మంది యువకులు పోటీ పడుతారు. ఇతర గ్రామాలకు చెందిన అబ్బాయిలను తమ ఊరిలో అడుగుపెట్టకుండా వారందరూ చూసుకుంటూ ఉంటారు. సరిగ్గా అలాంటి సమయంలోనే గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగా వారి గ్రామంలో మొదట బాత్రూమ్లు నిర్మించాలని సర్పంచ్ అనుకుంటాడు. అందుకోసం ఇంజనీర్ అయిన కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) పట్నం నుంచి అక్కడకు వస్తాడు. మరో ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ గ్రామంలో అడుగుపెట్టడం ఆ 60మందికి నచ్చదు. రాజాను పెళ్లి చేసుకునేందుకు అతను ఎక్కడ పోటీకి వస్తాడో అని వారు అడ్డుపడుతారు. అలాంటి సమయంలో ఫైనల్‌గా అక్కడ పనులు ప్రారంభం అవుతాయి. ఒకరోజు రాజా (దీపికా పిల్లి), కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) ఇద్దరూ అనుకోకుండా కలవడం ఆపై ప్రేమలో పడిపోవడం జరిగిపోతుంది. అయితే, రాజా, కృష్ణల పెళ్లికి ఉన్న అడ్డంకులు ఏంటి..? వారి ప్రేమ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలందరూ కృష్ణకు పెట్టిన పరీక్ష ఏంటి..? రాజాను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ 60 మంది కలిసి కృష్ణను ఏం చేశారు..? ఫైనల్‌గా వారిద్దరూ ఒక్కటి అవుతారా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సినిమా మొత్తం నవ్వులతోనే కొనసాగుతుంది. మంచి వినోదాన్ని పంచి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే దర్శకులు నితిన్–భరత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పవచ్చు. కథ పరిచయాన్నే చాలా ఆసక్తిగా చెప్పారు కానీ, ఇంటర్వెల్ తర్వాత కాస్త తడబడ్డారు. ఒక్క అమ్మాయి కోసం 60మంది పెళ్లి చేసుకోవాలని పోటీ పడటం చాలా ఫన్నీగా దర్శకుడు చూపాడు. ఈ క్రమంలో ఆమెను దక్కించుకునేందుకు వారందరూ పడుతున్న పాట్లు మామూలుగా ఉండవు. ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలోకి ఒకరోజు సడెన్‌గా కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) రావడంతో వారిలో అందోళన మొదలౌతుంది. ఆ గ్రామంలోకి కృష్ణతో పాటు బిలాల్ (సత్య) కూడా కారు డ్రైవర్‌గా ఎంట్రీ ఇస్తాడు. 60మంది గ్యాంగ్‌లో పని (గెటప్ శ్రీను) ఉంటాడు. వారందరి చుట్టే కథ రన్ అవుతుంది. పల్లెటూరి అమ్మాయితో పట్నం నుంచి వచ్చిన అబ్బాయి ప్రేమలో పడటం, వారి ప్రేమ కథలో చిన్నచిన్న ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. కథాపరంగా సినిమాలో కొత్తదనం లేకపోయినా గెటప్ శ్రీను, సత్యల మధ్య వచ్చే కామెడీ సీన్లు సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు. వారు స్క్రీన్‌పై కనిపించే ప్రతిసీన్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వుతారు. వారి పంచ్‌లు, ప్రాసలు గట్టిగానే పేలాయి.రాజా (దీపికా పిల్లి), కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) ఇద్దరి జోడీ సరిగ్గా సెట్ అయింది. 60మంది కళ్లుకప్పి వారిద్దరూ సీక్రెట్‌గా పదేపదే కలుసుకునే సీన్లు బాగుంటాయి. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం ఇద్దరూ కామియో రోల్స్‌లో ఎంట్రీ ఇస్తారు. ఉన్నది కొద్దిసేపు మాత్రమే అయినా బాగా ఫన్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచి ఆ గ్యాంగ్ మొత్తం సిటీకి చేరుకున్న తర్వాత సినిమా కాస్త నెమ్మదిస్తుంది. అక్కడి నుంచి పంచ్ డైలాగ్స్, కామెడీ అంతగా మెప్పించేలా ఉండవు. అలా ఫస్టాఫ్‌లో ఉన్న బలం సెకండాఫ్‌లో ఉండదు. సినిమాకు కాస్త ఇదే మైనస్ అని చెప్పవచ్చు. సినిమా క్లైమాక్స్ సీన్ మరీ కామెడీగా ఉంటుంది. ఇలా కూడా సినిమాను ముగించేయవచ్చా అనే సందేహం ప్రేక్షకులలో రావడం ఖాయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు చాలా వీక్.. అవి పదే పదే రావడం వల్ల ప్రేక్షకులలో విసుగును తెప్పిస్తాయి.ఎవరెలా చేశారంటే..గెటప్ శ్రీను, సత్య కామెడీ కోసం ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వారిద్దరే.. తమ పాత్రలతో నవ్విస్తూ దుమ్మురేపారని చెప్పవచు. ఆ తర్వాత హీరోయిన్ దీపిక తన పాత్రలో బాగా సెట్ అయిపోయింది. తను యాంకర్‌గా పలు వేదికలపై రాణించిన అనుభవం ఉండటంతో ఈజీగా తన పాత్రలో నటించేసింది. ప్రదీప్‌కు ఇదీ రెండో సినిమా కావడంతో సులువుగానే కనెక్ట్ అయిపోయాడు. అతని డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ బాగున్నప్పటికీ అక్కడక్కడా కొంత తడబాటుకు లోనయ్యాడని చెప్పవచ్చు. ప్రదీప్ తల్లిదండ్రులుగా మురళీధర్ గౌడ్,రోహిణి తమ పరిదిమేరకు మెప్పించారు. పాన్ ఇండియా పెళ్లిళ్ల బ్రోకర్‌గా బ్రహ్మాజీ కనిపించింది కొంతసేపు మాత్రమే.. అయినా తన పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. సంగీతం, కెమెరామెన్ పనితీరు బాగుంది. చిన్న బడ్జెట్ సినిమాలకి ఈ స్థాయి టెక్నికల్ క్వాలిటీస్ ఉండటం చాలా అరుదు. కథ బలం ఉన్నంతమేరకు నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రదీప్, దీపిక, గెటప్ శ్రీను, సత్య అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఆపై కామెడీని ఇష్టపడే వారు హ్యాపీగా వెళ్లొచ్చు.. -
ఎంటర్టైన్ చేస్తాం... ప్రామిస్: ప్రదీప్ మాచిరాజు
‘‘ఈ సమ్మర్లో ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునే సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. మా కోసం రెండున్నర గంటలు కేటాయించండి. సూపర్‌గా ఎంటర్టైన్ చేస్తాం. ఇది నాప్రామిస్’’ అని హీరో ప్రదీప్ మాచిరాజు అన్నారు. ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’.నితిన్–భరత్ దర్శకత్వంలో మాంక్స్ అండ్ మంకీస్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో చాలామంది కొత్తవాళ్లు పరిచయం అవుతున్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత వారందరి పేర్లు గట్టిగా వినిపిస్తాయి. రిలీజ్‌కు ముందే మా సినిమా ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ పూర్తి కావడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘ఇందులోని పాటలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క జానర్లో ఉంటాయి. 60 ఇయర్స్ ఓల్డ్ వాయిస్‌తో ఓ పాటను చేయడం జరిగింది. ఆ పాటని మా మామగారు పాడారు’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ రథన్. -
కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్‌చరణ్.. వీడియో వైరల్
బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఈసారి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ (Akkada Ammayi Ikkada Abbayi Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడు పెంచింది. తాజాగా ఈ మూవీకి సపోర్ట్ చేసేందుకు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ముందుకు వచ్చాడు.గ్లోబల్ స్టార్‌కు ఫస్ట్ టికెట్ఇందుకు సంబంధించిన ఓ సరదా వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. అందులో ప్రదీప్.. ఫస్ట్ డే మార్నింగ్ షో.. ఫస్ట్ టిక్కెట్టు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan)కు ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అది విన్న సత్య.. రామ్‌చరణ్ తనకు చాలా క్లోజ్.. నేను ఏది చెప్తే అంత అంటూ బిల్డప్ కొట్టాడు.చివర్లో మాత్రం..చివరకు చరణ్ ఎంట్రీ ఇచ్చి సత్యను చూసి ఎవరీ అబ్బాయి అనడంతో అతడి పరువు పోయినట్లయింది. చివర్లో మాత్రం సత్యను గుర్తుపట్టి పెద్ది షూటింగ్‌కు సమయానికి వచ్చేయ్ అన్నాడు. అనంతరం సత్య.. చెర్రీ కాళ్లు మొక్కగా అతడు కూడా తిరిగి పాదాలకు నమస్కరించడం విశేషం. తర్వాత చరణ్.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఫస్ట్ టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఇది చూసిన అభిమానులు అంత పెద్ద స్టార్ అయ్యుండి ఇంత సింపుల్‌గా ఉండటం చాలా గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: సందీప్ వంగాతో వివాదం.. తండ్రి తిట్టాడనే అనుకున్నా: రధన్ -
సందీప్ వంగాతో వివాదం.. తండ్రి తిట్టాడనే అనుకున్నా: రధన్
అర్జున్ రెడ్డి సినిమా (Arjun Reddy)కు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హర్షవర్దన్ రామేశ్వర్ ఇస్తే పాటలకు రధన్ సంగీతం అందించాడు. అతడు అందించిన పాటలు బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. అయితే సరైన సమయానికి పాటలు ఇవ్వకుండా నా టైం మొత్తం వృధా చేశాడని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రధన్‌పై విమర్శలు గుప్పించాడు. సిద్దార్థ్ రాయ్ సినిమా దర్శకుడు కూడా రధన్ చెప్పిన సమయానికి పాటలు ఇవ్వకపోగా ఫోన్లు కూడా లిఫ్ట్ చేసేవాడు కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన తండ్రిలాంటి వారుఇలా రధన్ వల్ల సినిమా లేటైందని దర్శకులు తిట్టుకున్నారు. తాజాగా ఈ వివాదంపై రధన్ స్పందించాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా (Akkada Ammayi Ikkada Abbayi Movie) ఈవెంట్లో అతడు మాట్లాడుతూ.. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) నాకు తండ్రిలాంటివారు. తండ్రి తిడితే ఆయన తిట్టారని ప్రచారం చేసుకోలేం. నాన్న మనల్ని కాకపోతే ఎవర్ని తిడతారు? దాన్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆయన తండ్రిలాంటివారు కాబట్టి!అనుదీప్ తల్లిలా..ఆయన నన్ను తిట్టిన తర్వాత కూడా అనుదీప్ (జాతిరత్నాలు), ప్రదీప్ మాచిరాజు (అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి) నాపై నమ్మకంతో సినిమా ఆఫర్ ఇచ్చారు. అంతర్గత విభేదాలు తలెత్తినప్పుడు కొన్ని పట్టించుకోవాలి, కొన్నింటిని పట్టించుకోకూడదు. సందీప్ ఎప్పుడూ అలాగే ఉంటారు. ఒక తండ్రిగా తిట్టారు, తిడతారు. నేనైతే అవేవీ మనసుకు ఎక్కించుకోలేదు. నాన్న తిట్టాడని ఫీలయ్యానంతే! అర్జున్ రెడ్డిలో నేను చెత్త మ్యూజిక్ అయితే ఇవ్వలేదు కదా.. మంచి సంగీతం ఇచ్చానన్న తృప్తి ఉంది. అనుదీప్ నాకు తల్లిగా అనిపించారు. కొందరు తిడతారు, మరికొందరు దగ్గరకు తీసుకుంటారు. అందరూ ఒకేలా ఉండరు అని రధన్ వివరణ ఇచ్చాడు.చదవండి: లక్షలు పెట్టి టికెట్ తీసుకుంటే సెల్ఫీ కూడా లేదు.. హృతిక్‌పై అభిమానుల ఆగ్రహం -
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
పవన్ టైటిల్.. మాపై బాధ్యత పెంచింది: యాంకర్ ప్రదీప్
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన మాటతీరుతో ఏ షోనైనా సరే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీగా అందిస్తాడు. ఆయన వేసే పంచ్‌లు, జోకులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాక, మనసు నిండా ఆనందాన్ని పంచుతాయి. అందుకే యాంకర్లలో ప్రదీప్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ టాలెంటెడ్ యాంకర్ వెండి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతున్నాడు. నాలుగేళ్ల కిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు వచ్చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రదీప్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి.. హీరోగా మారారు. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది?చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సరైన సమయంలో మంచి అవకాశాలు వచ్చాయి. ప్రేక్షకుల నుంచి మంచి సపోర్టు లభించింది. ఆర్జేగా, టెలివిజన్ యాంకర్ గా యాక్టర్ గా ఇన్నోవేటివ్ గా వర్క్ చేసే అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మంచి కథ చెప్పే చాన్స్ కుదిరింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. లక్షల్లో ఒక్కరికి మాత్రమే లభించే అవకాశంగా భావిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ సినిమాను నిర్మించారట కదా..కారణం ఏంటి?నా స్నేహితులకు నాలాగే సినిమా అంటే పిచ్చి. అందరికి మంచి చాన్స్‌లు వస్తున్నాయి. కానీ మేమంతా కలిసి ఓ సినిమా చేయలాని ఎప్పుటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పుడు కుదిరింది. మంచి కథ ఉంది. అందరం కలిసి చేస్తే బాగుంటందని అనుకొని.. సినిమాను స్టార్ట్ చేశాం.ఈ కథకి ఫౌండేషన్ నుంచి వర్క్ చేసాం. అందుకే కొంచెం టైం పట్టింది. ఫ్యామిలీ అంతా కూర్చుని సమ్మర్లో హ్యాపీగా చూసే సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ మా నుంచి ఎలాంటి కంటెంట్ ని ఆశిస్తారో అలాంటి కంటెంట్ ఇందులో ఉంది. ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు.‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఎలాంటి కథ అంటే..?మా సినిమాలో కథే మంచి ఎంటర్టైన్మెంట్. దీన్ని ఒక చందమామ కథల చూడొచ్చు. అనగనగా ఒక ఊరు. అక్కడ ఓ అమ్మాయి. ఆ ఊరికి వెళ్ళిన ఒక సివిల్ ఇంజనీర్. ఆ ఊర్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ రూల్స్ మధ్య హీరో ఎలా ఇరుక్కున్నాడు? అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రజెంట్ చేయడం జరిగింది.పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌ని హైప్ కోసమే పెట్టారా?లేదండి. మా కథ అనుకున్నప్పుడే లక్కీగా ఈ టైటిల్ ని అనుకున్నాం . పవన్ కళ్యాణ్ గారి డెబ్యు సినిమా టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నామంటే మాపై బాధ్యత పెరిగింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. టైటిల్ కు తగ్గట్టు చాలా చక్కని అచ్చ తెలుగు సినిమా ఇది. సినిమా చూసిన తర్వాత ఈ టైటిల్ పర్ఫెక్ట్ అని ఆడియన్స్ ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారి టైటిల్ తో ఒక సినిమా చేయడం మా అదృష్టం. చిన్న సినిమా కదా.. ఆ టైటిల్ పెడితే జనాల్లోకి ఈజీ వెళ్లొచ్చు అనిపించింది. కానీ కేవలం పబ్లిసిటీ కోసం అయితే ఈ టైటిల్ పెట్టలేదు.ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?-ఇందులో కృష్ణ అనే పాత్రలో కనిపిస్తాను. చాలా స్మార్ట్ క్యారెక్టర్. ఈ సినిమాలో నేను ఎంత చిరాకు పడతానో ఆడియన్స్ అంత ఎంటర్టైన్ అవుతారు. ఆ క్యారెక్టర్ పడే కష్టాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. డైరెక్టర్స్ నితిన్ భరత్ భరత్ కు నాతో ఎప్పటినుంచో జర్నీ చేస్తున్నారు. నా టైమింగ్ వాళ్ళకి తెలుసు. దానికి తగ్గట్టుగా ఈ కథని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు.దీపికా పిల్లి ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చింది?ఈ సినిమా హీరోయిన్ పాత్రకు ఒక తెలుగు అమ్మాయి కావాలి. ఆడిషన్స్, లుక్ టెస్ట్, వర్క్ షాప్ అన్నీ చేసిన తర్వాతే దీపికని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. తను చాలా అద్భుతంగా పెర్ఫర్మ చేసింది. ఆడియన్స్ డెఫినెట్ గా సర్ప్రైజ్ అవుతారు.మ్యూజిక్ డైరెక్టర్ రదన్ గురించి ?ఈ సినిమాలో మ్యూజిక్ కి చాలా మంచి స్కోప్ ఉంది. ప్రతి సాంగ్ ఒక డిఫరెంట్ జోనర్ లో చేయడం జరిగింది. రదన్ బ్యూటీఫుల్ ఆల్బమ్ ఇచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ ఆడియన్స్ కి చాలా అలరిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమాని చాలా క్వాలిటీ గా తీసాం. బాల్ రెడ్డి గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. క్వాలిటీ పరంగా సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్స్ నితిన్ భరత్ గురించి ?నితిన్ భరత్ నన్ను సర్ప్రైజ్ చేశారు.డెబ్యూ డైరెక్టర్స్ లాగా అనిపించలేదు. డేఫినెట్ గా చాలామంది యంగ్ డైరెక్టర్స్ కి నితిన్ భరత్ ఇన్స్పిరేషన్ అవుతారు. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఎక్కడ కూడా కొత్తవారితో పని చేసిన ఫీలింగ్ రాలేదు. సినిమాని చాలా అద్భుతంగా తీశారు.కామెడీ సినిమా కదా.. సెన్సార్ యూ/ఏ ఇచ్చారేంటి?ఈ సినిమా సెన్సార్ సభ్యులు చూసిన తర్వాత చాలా కాలం తర్వాత హాయిగా నవ్వుకునే సినిమా తీశారని చెప్పారు. అది మాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సినిమాకి ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ ఇచ్చారు. రెండున్నర గంటల పాటు ఆడియన్స్ హాయిగా నవ్వుకునే సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్ సినిమా చూశారు. సినిమా పూర్తవ్వగానే డీల్ క్లోజ్ చేశారు. ఇది సమ్మర్ కి ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా అని రిలీజ్ డేట్ ని వారే లాక్ చేశారు. ఇది మాకు మరింత కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. -
అందుకే పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ పెట్టాం: నితిన్-భరత్
‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) సినిమా ఈ వేసవిలో కుటుంబమంతా కలిసి సరదాగా నవ్వుకుంటూ చూసేలా ఉంటుంది’’ అని డైరెక్టర్స్ నితిన్–భరత్ చెప్పారు. ప్రదీప్ మాచిరాజు(pradeep Machiraju), దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. మాంక్స్– మంకీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నితిన్, భరత్ మాట్లాడుతూ– ‘‘ప్రదీప్‌గారి ఫస్ట్ సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ చేశాం. అప్పుడే ఆయనతో సినిమా తీయాలనుకున్నాం. అలా మేం చెప్పిన కథ ప్రదీప్‌కి నచ్చడంతో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ఆరంభమైంది. ఇది పవన్ కల్యాణ్ గారి సినిమా టైటిల్. కచ్చితంగా పబ్లిసిటీ పరంగా ప్లస్ అవుతుందని అనుకున్నాం. అలాగే కాన్సెప్ట్ కూడా టైటిల్‌కి యాప్ట్‌గా ఉండడం వల్లే పవన్ కల్యాణ్ గారి టైటిల్ తీసుకోవడం జరిగింది. రొమాంటిక్ ఎంటర్టైనర్లా రూపొందిన ఈ సినిమాలో వినోదం సందర్భానుసారంగా, ఆర్గానిక్‌గా ఉంటుంది. తెలుగు అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలనుకుని, ఆడిషన్స్ చేసి, దీపికని తీసుకున్నాం. ప్రదీప్‌గారి ఫ్రెండ్స్ ఈ మూవీ నిర్మించారు. రథన్గారి అద్భుతమైన సంగీతం, బాల్ రెడ్డిగారి విజువల్స్ ఆకట్టుకుంటాయి. మా సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌కి నచ్చడంతో విడుదల చేస్తున్నారు’’ అన్నారు.