Star Anchors Suma, Pradeep Machiraju and Other Remuneration Details In Telugu - Sakshi
Sakshi News home page

Telugu Star Anchors Remuneration: హాట్‌టాపిక్‌గా తెలుగు యాంకర్స్‌ షాకింగ్‌ రెమ్యునరేషన్‌? ఎవరికి ఎంతంటే..!

Published Tue, Dec 20 2022 6:49 PM | Last Updated on Wed, Dec 21 2022 10:16 AM

Star Anchor Suma, Pradeep Machiraju, Anasuya Bharadwaj Remuneration Goes Viral - Sakshi

బుల్లితెరపై తమ మాటలతో, పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్స్‌ ఎంతోమంది ఉన్నారు. వీరికి కూడా స్టార్‌ నటీనటులకు సమానమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. అందులో ఎక్కువగా ఫ్యాన్‌ బేస్‌ను సంపాదించుకున్న టాప్‌ ఫీమేల్‌, మేల్‌ యాంకర్లలో సుమ కనకాల, ప్రదీప్‌ మాచీరాజుల మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత  అనసూయ భరద్వాజ్‌, యాంకర్‌ రవి, రష్మీ గౌతమ్‌, శ్రీముఖి, శ్యామల, మంజూషలు ఉన్నారు. ఇందులో కొందరు బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై సందడి చేస్తుంటారు. అలా రోజురోజు తమ క్రేజ్‌ను పెంచుకుంటున్న వారి రెమ్యునరేషన్స్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. మరి ఈ స్టార్‌ యాంకర్ల పారితోషికం ఎలా ఉందో ఓసారి చూద్దాం! 

చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం

యాంకర్లలో మొదట చెప్పుకోవాల్సింది సుమ కనకాల గురించి. ఎంతోకాలంగా తన యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్నారామె. ఆమె ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ధాలు గడుస్తున్నా ఇప్పటికీ సుమ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. తనదైన పంచ్‌, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు ఫుల్‌ఎంటర్‌టైన్‌ చేస్తూ వస్తోంది. ఇక స్టార్‌ హీరోహీరోయిన్లు సైతం సుమకు ఫ్యాన్స్‌ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇటూ టీవీ షోలతో అటూ మూవీ ప్రీరిలీజ్‌, ఆవార్డ్‌ ఫంక్షన్స్‌కు సుమ యాంకర్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది.

అలా ఆమె ఒక్కో ఈవెంట్‌కు రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు తీసుకుంటందని సమాచారం. ఇక ఒక్కొఎపిసోడ్‌కు అయితే రూ. 2 నుంచి రూ. 3 లక్షలు తీసుకుందట. ఈ లెక్కన సుమ నెలకు దాదాపు రూ. 20 లక్షలపైనే సంపాదిస్తుంది. ఇక ప్రదీప్‌ మాచీరాజు కూడా ఇంచుమించు సుమ రెంజ్‌లోనే పారితోషికం తీసుకుంటాడని తెలుస్తోంది. మూవీ ఈవెంట్స్‌ అయితే రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు తీసుకోగా ఒక్కొక్క ఎపిసోడ్‌కు రూ. 2 లక్షల వరకు అందుకుంటాడట. ఇక రంగమ్మత్తగా ఎనలేని క్రేజ్‌ సొంతంగా చేసుకున్న అనసూయ యాంకర్‌గానే కాదు వెండితెరపై నటిగానూ రాణిస్తోంది.

చదవండి: ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్‌ దేవ్‌ లేటెస్ట్‌ పోస్ట్‌.. ‘దీని అంతర్యం ఏంటీ?’

ఆమెకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్లలో గ్లామరస్‌ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఆమె ఒక్కో ఈవెంట్కు రూ.2 నుంచి రూ. 3 లక్షలు వరకు  తీసుకుంటుందట. ఇక యాంకర్‌ రష్మీ గౌతమ్‌ రూ. 1.5 నుంచి రూ. 2 లక్షల వరకు డిమాండ్‌ చేస్తుందట. ఇక యాంకర్‌ రవి దాదాపు రూ. లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. ఇక మంజుషా కూడా రూ. 50 వేల వరకు రెమ్యునరేష‌న్ తీసుకుంటుందని టాక్. యాంక‌ర్ వ‌ర్షిణీ 30వేలు, యాంక‌ర్ శ్యామ‌ల రూ. 50వేల రెమ్యునరేష‌న్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో అందరికంటే సుమ పారితోషికమే ఎక్కువ ఉండటం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement