remunaration
-
బిగ్‌బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?
బిగ్‌బాస్ 8 తెలుగు చివరకొచ్చేసింది. ఫినాలే కోసం నువ్వానేనా అన్నట్లు పోటీ జరుగుతోంది. మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఇందులో భాగంగా శనివారం ఎపిసోడ్లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. తన కోరికని ఈ సీజన్లో నెరవేర్చుకున్న తేజ.. రెమ్యునరేషన్ కూడా బాగానే సంపాదించాడట. ఇంతకీ ఎన్ని లక్షలు అందుకున్నాడంటే?(ఇదీ చదవండి: నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రేరణ.. టాప్ 2లో గౌతమ్ పక్కా!: తేజ)అక్టోబరు 6న వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఒకడిగా టేస్టీ తేజ వచ్చాడు. ప్రారంభంలో ఉన్నంతలో బాగానే ఎంటర్టైన్ చేశాడు. తర్వాత తర్వాత అరుపులు గొడవలు ఎక్కువైపోయాయి. బాగా నస పెట్టేశాడు. దీంతో ఎలిమినేట్ కావడం అయితే పక్కా అనుకున్నారు. కాకపోతే అలా సేవ్ అయిపోతూ వచ్చాడు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్లలో ఒకడిగా బయటకొచ్చేశాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే తన తల్లి వస్తుందని ఆశపడ్డాడు. అనుకున్నట్లే అది నెరవేర్చుకున్నాడు.హౌసులో 8 వారాలు పాటు ఉన్న తేజ.. ఒక్కో వారానికిగానూ లక్షన్నర అందుకున్నాడట. అంటే 8 వారాలకు గానూ రూ.12 లక్షలు తేజకి రాబోతున్నాయట. ఓ రకంగా చూసుకుంటే తేజకి ఇది మంచి మొత్తమే అని చెప్పొచ్చు. ఇదలా ఉంచితే ఆదివారం ఎపిసోడ్లో కన్నడ బ్యాచ్‌లో ఒకడైన పృథ్వీ ఎలిమినేట్ అయి బయటకు రాబోతున్నాడు. బహుశా వచ్చే వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు గట్టిగానే ఉన్నాయండోయ్!(ఇదీ చదవండి: Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!) -
టాప్-10 హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఇండియన్ హీరోల లిస్ట్ ఇదే
-
సినిమా ప్లాప్ అయితే రెమ్యునరేషన్ వద్దు: స్టార్ హీరోలు
బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్‌లు తమ రెమ్యునరేషన్ల గురించి ఓపెన్‌గానే మాట్లాడారు. తాజాగా జరిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2024లో వారిద్దరూ పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్లో ఉన్న ఐక్యత గురించి కూడా చర్చించారు. ఒక సినిమా కోసం వారు ఎలా రెమ్యునరేషన్ తీసుకుంటారో చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు.లాభాలు వస్తేనే రెమ్యునరేషన్: అక్షయ్ కుమార్ఒక సినిమాకు రెమ్యునరేషన్ అనేది స్క్రిప్ట్, కథలో ప్రాధాన్యతను బట్టే రెమ్యునరేషన్ తీసుకోవాలని అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం చాలామంది హీరోలు సినిమాకు వచ్చే లాభాల నుంచి షేర్ తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంటారని ఆయన అన్నారు. అందులో తాను కూడా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో సినిమా అనుకున్న ఫలితం ఇవ్వకపోతే నిర్మాతకు రికవరీ ఉండదు. దీంతో హీరోలు తమ పారితోషికాన్ని పూర్తిగా వదులుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇలా చేయడానికి ప్రధాన కారణం సినిమా పరిశ్రమపై ఉన్న మక్కువే అంటూ అక్షయ్ తెలిపారు. అయితే, సినిమా భారీ విజయం సాధిస్తే మాత్రం మంచి రెమ్యునరేషన్ వస్తుందని కూడా ఆయన అన్నారు. నిర్మాతకు వచ్చిన లాభంలో మాత్రమే తాము వాటా తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల నిర్మాత సేఫ్‌గా ఉంటారని అన్నారు. అదే సినిమా ప్లాప్ అయితే మాత్రం నిర్మాతతో పాటు తమకు కూడా నష్టాలు తప్పవని అక్షయ్ పేర్కొన్నారు.సినిమా ప్లాప్ అయితే రెమ్యునరేషన్ తీసుకోను: అజయ్ దేవగణ్చిత్ర పరిశ్రమలో సినిమా బడ్జెట్ పెరుగుతుందని అజయ్ దేవగణ్ అభిప్రాయపడ్డారు. తాను నటించిన సినిమా విజయం సాధించకపోతే రెమ్యునరేషన్ తీసుకోనని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఆధారంగానే తాను పారితోషకం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమతో పోలిస్తే బాలీవుడ్లో అంతగా ఐక్యత లేదని ఆయన అన్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీ తమ నటీనటులకు మద్దతుగా ఉంటుందని ఆయన గుర్తుచేశారు. అయితే, అక్షయ్ కుమారు, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్లు మాత్రం మంచి స్నేహంగా ఉంటారని అజయ్ దేవగణ్ తెలిపారు. ఈ క్రమంలో ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం తానే డైరెక్షన్ చేయబోతున్నట్లు అజయ్ దేవగణ్ తెలిపారు. ఇందులో అక్షయ్ కుమార్ ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తారని రివీల్ చేశారు.#AkshayKumar and #AjayDevgn talks about their fees. They are right if Akki is producer and movies like padman and toilet did 300 cr+ worldwide definitely he will earn 100 cr plus per movie. And if he sign other producers movie like bmcm he might get nothing. Its proper business. pic.twitter.com/OVlpOj2FXe— axay patel🔥🔥 (@akki_dhoni) November 16, 2024 -
'దేవర' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత ఇచ్చారు?
'దేవర' థియేటర్లలోకి వచ్చేశాడు. తారక్ నటవిశ్వరూపం, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లయితే అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి. వరల్డ్ వైడ్ వేల థియేటర్లలో రిలీజ్ కావడంతో తొలిరోజు వసూళ్లు గట్టిగానే రాబోతున్నాయని తెలుస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే 'దేవర'కి బడ్జెట్ ఎంత? రెమ్యునరేషన్స్ ఎవరికెంత ఇచ్చారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా 'దేవర'. గతంలో తారక్‌తో 'జనతా గ్యారేజ్' తీసిన కొరటాల దీనికి దర్శకుడు. సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీసిన ఈ చిత్రానికి దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. ఎన్టీఆర్ అన్న కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు.పారితోషికాల విషయానికొస్తే 'దేవర'లో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ దాదాపు రూ.60 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. హీరోయిన్గా చేసిన జాన్వీ రూ.5 కోట్లు, విలన్‌గా చేసిన సైఫ్ అలీ ఖాన్ రూ.10 కోట్లు, ఇతర కీలక పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్ రూ 1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళీశర్మ రూ.40 లక్షలు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన దర్శకుడు కొరటాల శివ ఏకంగా రూ.30 కోట్ల వరకు అందుకున్నాడని సమాచారం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 20 సినిమాలు) -
మూడు వారాలకే బ్యాగు సర్దిన అభయ్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ఆటతో లేదా మాటతో మెప్పించాలి. అప్పుడే బిగ్‌బాస్ షోలో రాణించగలరు. ఈ రెండింటిలో ఏది బ్యాలెన్స్ కోల్పోయినా హౌస్ నుంచి బయటకు రావడం ఖాయం! అభయ్ నవీన్ రెండింటి మీదా పట్టు కోల్పోయాడు. ఫలితంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఏదో అదృష్టం కలిసొచ్చి అభయ్ చీఫ్ అయ్యాడంతే! అచ్చిరాని చీఫ్ పోస్ట్కంటెస్టెంట్లు తనను నమ్మి చీఫ్ పదవి కట్టబెట్టారు. ఏ ముహూర్తాన చీఫ్ అయ్యాడో కానీ తనలో నిర్లక్ష్యం, ధిక్కార ధోరణి ప్రస్ఫుటంగా కనిపించాయి. పైగా సెల్ఫ్ నామినేట్ అవడంతో అతడి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇట్టే బయటపడింది. గుడ్ల టాస్క్‌లో తన టీమ్ గెలుపు కోసం వెంపర్లాడుతుంటే చీఫ్ పోస్టులో ఉన్న అభయ్ మాత్రం పిచ్చ లైట్ తీసుకున్నాడు. అంతేనా, టీమ్ సభ్యులను కూడా ఆడొద్దని చెడగొట్టేందుకు ప్రయత్నించాడు.ఎలిమినేషన్‌కు ప్రధాన కారణమిదేపైగా తన టీమ్‌పై విరుచుకుపడుతున్న అవతలి టీమ్ వాళ్లపై అరవాల్సింది పోయి బిగ్‌బాస్ మీద తన ప్రతాపం చూపించాడు. బిగ్‌బాస్.. బయాస్డ్ అంటూ నానాబూతులు తిట్టాడు. ఆడలేక మద్దెల దెరువు అన్నట్లు తప్పంతా బిగ్‌బాస్ మీదకు తోసేశాడు. ఇది చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారు, తనను బయటకు పంపించడమే బెస్ట్ అనుకున్నారు.నాగార్జున దయ చూపినా..ఏదో అద్భుతంగా ఆడి బిగ్‌బాస్‌ను నిలదీసుంటే మెచ్చుకునేవారేమో కానీ, ఇలా చేతగానివాడిలా ఓ మూలన కూర్చుని సెటైర్లు వేయడం ఎవ్వరికీ మింగుడుపడలేదు, అందుకే నాగార్జున రెడ్ కార్డు చూపించినప్పటికీ దయ తలిచి హౌస్‌లో ఉండనిచ్చినా ప్రేక్షకులు అందుకు ఒప్పుకోలేదు. నిర్దాక్ష్యిణ్యంగా ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఇక ఈ మూడువారాలకుగానూ దాదాపు రూ.6 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్‌బాస్ 8లో రెండో వారం గడిచిపోయింది. ఊహించని విధంగా చాలా వారాలు ఉంటాడనుకున్న ఆర్జే శేఖర్ భాషా ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్‌బాస్ తీసుకొచ్చిన తలతిక్క ట్విస్ట్ వల్ల ఇతడికి చాలా అన్యాయమే జరిగిందని చెప్పొచ్చు. కానీ ఏం చేస్తాం కొన్నిసార్లు అలా జరిగిపోతుంటాయంతే. అయితే ఉన్నది కొద్దిరోజులే అయినా గానీ రెమ్యునరేషన్ బాగానే వెనకేసుకున్నాడు. ఇంతకీ చెందే మొత్తం ఎంత? శేఖర్ భాషా ఎలిమినేషన్‌కి కారణం ఏమై ఉండొచ్చు.శేఖర్ భాషా ఎలిమినేట్బిగ్బాస్ 8లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. అలానే ఏ వారం ఎవరూ ఎలిమినేట్ అవుతారనేది కూడా చెప్పలేం. అలా తొలివారం బేబక్క ఎలిమినేట్ అయి బయటకొచ్చేయాల్సి వచ్చింది. ఇప్పుడు శేఖర్ భాషా ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. ఆర్జేగా ఒకప్పుడు పాపులర్. షోలోకి రాకముందు రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో ఎంటరై కాస్త క్రేజ్ తెచ్చుకున్నాడు. అలానే హౌసులోనూ కామెడీ చేసే బాధ్యతలు తీసుకున్నాడు.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)అదే శాపమైందా?కానీ బిగ్‌బాస్ తీసుకొచ్చిన కొత్త రూల్ శేఖర్ భాషాకు శాపమైంది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఓటింగ్ పరంగా చివరి రెండు స్థానాల్లో ఆదిత్య ఓం, శేఖర్ భాషఆ నిలిచారు. అయితే హౌసులో ఎవరు ఉండాలి? ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది ఆడియెన్స్ కాకుండా మిగిలిన హౌస్మేట్స్ డిసైడ్ చేస్తారని చెప్పి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో సీత తప్పితే అందరూ శేఖర్ భాషా హౌస్ నుంచి వెళ్లిపోవాలని తీర్మానించేశారు.ఎన్ని లక్షలు వచ్చాయి?ఎంటర్టైన్ చేస్తూ రోజురోజుకీ శేఖర్ భాషా స్ట్రాంగ్ అవుతున్నాడు. ఈ విషయం బహుశా మిగిలిన హౌస్‌మేట్స్‌కి అనిపించడం వల్లనో ఏమో గానీ ఎలిమినేట్ చేసి పంపిశారు. అయితే వారానికి రూ.2.5 లక్షలు చొప్పున రెండు వారాల్లో రూ.5 లక్షల్ని ఇతడు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రీసెంట్‌గానే ఇతడి భార్యకి కొడుకు పుట్టాడు. (ఇదీ చదవండి: బిగ్ బాస్ 8: బాషాకు మూకుమ్మడిగా అన్యాయం.. బ్రేకప్ స్టోరీ చెప్పిన సీత) -
బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
-
రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!
హరీశ్ శంకర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. ఎక్కువగా రీమేక్ కథలతో మూవీస్ తీస్తాడనే అపవాదు ఉన్న ఈ దర్శకుడు తీసిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజై ఘోరంగా ఫ్లాప్ అయింది. చాలా నష్టాలొచ్చాయి. ఈ క్రమంలోనే హరీశ్ శంకర్ తన వంతుగా కొంత రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్తుతానికి రెండు కోట్లు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చారని, త్వరలో మరి కొంచె వెనక్కి ఇచ్చే అవకాశముందని సమాచారం. ఏదేమైనా ఇలా సినిమా నష్టపోతే ఇలా పారితోషికం వెనక్కి ఇచ్చి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లని ఆదుకోవడం మంచి విషయమే. మరోవైపు ఇదే సినిమాలో హీరోగా రవితేజ నుంచి ఇలాంటి రెస్పాన్స్ రాలేదు.(ఇదీ చదవండి: Bigg Boss 8: చావు వరకు వెళ్లొచ్చా.. ఏడిపించేసిన నాగ మణికంఠ!)'మిస్టర్ బచ్చన్' విషయానికొస్తే.. 2018 హిందీలో వచ్చిన 'రైడ్' అనే మూవీకి రీమేక్‌గా దీన్ని తీశారు. అయితే ఒరిజినల్ స్టోరీ సీరియస్‌గా ఉంటుంది. హరీశ్ శంకర్ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి పాటలు, ఫైట్స్ అని అదనంగా జోడించారు. దీంతో మూవీ కాస్త కిచిడి అయిపోయింది. అలానే మరీ ఎక్కువగా హీరోయిన్ భాగ్యశ్రీ అందాలని చూపించడం కూడా అసలు కథని పక్కదారి పట్టించిందనే విమర్శలు వచ్చాయి.ఇకపోతే 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అనేలా అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్. దీనిబట్టి చూస్తే వచ్చే వారం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. లేదంటే వినాయక చవితి కానుకగా ఈ శనివారం నుంచి స్ట్రీమింగ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం) -
సూపర్ హిట్ మూవీ.. ఎవరి పారితోషికం ఎంతంటే?
స్త్రీ .. ఆరేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రాజ్‌కుమార్ రావు- శ్రద్దాకపూర్‌ల నటనకు జనాలు ఫిదా అయ్యారు. భయపెడుతూనే నవ్వించే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశారు. తాజాగా దీనికి సీక్వెల్‌గా స్త్రీ 2 తెరకెక్కింది. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల పైచిలుకు సాధించింది. ఈ క్రమంలో ఇందులో నటించిన తారల రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం..హీరో రాజ్‌కుమార్ రావు రూ.6 కోట్ల పారితోషికం తీసుకోగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ రూ.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. కీలకపాత్రలో మెప్పించిన పంకజ్ త్రిపాఠి రూ.3 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారట. అపరశక్తి ఖురానా.. రూ.70 లక్షలు, అభిషేక్ బెనర్జీ రూ.55 లక్షలు అందుకున్నారు. అతిథి పాత్రలో కనిపించిన వరుణ్ ధావన్.. ఏకంగా రూ.2 కోట్లు అందుకున్నాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.135 కోట్లు వసూలు చేసింది.చదవండి: బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘స్త్రీ 2’.. ఇంతకీ ఈ మూవీలో ఏముంది? -
కౌన్ బనేగా కరోడ్‌పతి.. ఒక్క ఎపిసోడ్‌కే రూ.5 కోట్లా?
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే ప్రభాస్ కల్కి చిత్రంలో కనిపించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం ఆయన ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-16కు హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్లో ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 12న తాజా సీజన్ ప్రారంభమైంది.అయితే ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అమితాబ్ పారితోషికం గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌కు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ ఎంతనే దానిపై ఆడియన్స్ తెగ ఆరా తీస్తున్నారు. బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అమితాబ్ భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క ఎపిసోడ్‌కే ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుంటున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇది గత అన్ని సీజన్ల కంటే అత్యధిక రెమ్యునరేషన్‌గా తెలుస్తోంది. 2000 సంవత్సరంలో మొదటి సీజన్లో కేవలం రూ.25 లక్షలు తీసుకున్న అమితాబ్.. తాజా సీజన్లో 5 కోట్లకు పెంచేశారు. గతంలో 14వ సీజన్‌కు అత్యధికంగా రూ.4 కోట్లకు పారితోషికం అందుకున్నారు. -
రూపాయి రెమ్యునరేషన్ తీసుకోలేదు.. ఇప్పుడేమో జాక్‌పాట్!
కొన్నిసార్లు ఊహించని విధంగా కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతుంటాయి. అలాంటి ఓ మూవీనే 'మహారాజ'. తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం.. థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చూసిన ప్రతిఒక్కరూ అద్భతహా అనే రేంజులో మెచ్చుకున్నారు. ఇంతలా పేరు తెచ్చుకున్న 'మహారాజ'లో నటించినందుకు గానూ సేతుపతి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. దీనికి ఓ కారణముందట!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)వైవిధ్యమైన పాత్రలు చేసే విజయ్ సేతుపతి.. 'మహారాజ'లో సెలూన్ షాపులో పనిచేసే బార్బర్‌గా నటించాడు. మేకప్ లేకుండా డీ గ్లామర్‌గా కనిపించాడు. సమాజంలో ప్రస్తుతం చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ పాయింట్‌కి చిన్నపాటి ట్విస్ట్ లింక్ చేసి తీసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. అయితే నిర్మాతలు ఈ మూవీ కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో మాత్రమే తీయాలని ఫిక్స్ అయ్యారట. ఇదే విషయాన్ని సేతుపతిగా చెప్పగా ఓకే అన్నాడు.పైన చెప్పిన దానిబట్టి చూస్తే విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ తీసుకోకూడదు. 'మహారాజ' కోసం అదే చేశాడు. సినిమా హిట్ అయితే లాభాల్లో ఇస్తామని నిర్మాతలు చెప్పారట. ఈ లెక్కన చూసుకుంటే సినిమాకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. సాధారణంగా సేతుపతి.. ఒక్కో మూవీ రూ.10-12 కోట్లు తీసుకుంటాడు. కానీ లాభాల్లో షేర్ అంటున్నారు కాబట్టి పారితోషికం కంటే రెట్టింపు మొత్తం అందుకుంటాడేమో అనిపిస్తోంది. అంటే సక్సెస్‌తో పాటు జాక్ పాట్ కొట్టేసినట్లే!(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?) -
రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్.. నిజమేనా?
హీరో ప్రభాస్ పేరుకే పాన్ ఇండియా స్టార్. కానీ చూస్తే చాలా సింపుల్‌గా ఉంటాడు. బయట కావొచ్చు, మీడియాలోనూ పెద్దగా కనిపించడు. సినిమా రిలీజ్ టైంలో తప్పితే డార్లింగ్‌ని చూడటం కూడా కష్టమే. ఫుడ్ విషయంలో సహ నటీనటుల్ని ఆశ్చర్యపరిచే ప్రభాస్.. నిర్మాతలకు అండగా ఉంటాడు. తాజాగా ఓ నిర్మాత కోసం తన పారితోషికాన్నే తగ్గించుకున్నాడనే వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఇది నిజమేనా?'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. వసూళ్లకు తగ్గట్లే తన రెమ్యునరేషన్ కూడా పెంచాడు. రూ.100 కోట్ల మార్క్ ఎప్పుడో దాటేశాడని టాక్. రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 AD' చేసినందుకు గానూ రూ.150 కోట్లు తీసుకున్నాడని సమాచారం. ఇదంతా పక్కనబెడితే ప్రస్తుతం చేస్తున్న 'రాజాసాబ్' కోసం మాత్రం తన పారితోషికాన్ని కాస్త తగ్గించాడట.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')'రాజాసాబ్' సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. గతంలో ఈ ప్రొడక్షన్ హౌస్.. 'ఆదిపురుష్' చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ క్రమంలోనే కొంతమేర నష్టాలొచ్చాయట. ఇందుకు బదులుగానే ప్రభాస్, 'రాజాసాబ్' కోసం కేవలం రూ.100 కోట్లని మాత్రమే పారితోషికంగా తీసుకున్నాడని తెలుస్తోంది. అధికారికంగా బయటకు రానప్పటికీ ఇది నిజమై ఉండొచ్చని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే మూవీ 'రాజా సాబ్'. ఈ ఏడాది క్రిస్మస్కి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. దీని తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2.. వరసగా రానున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే రాబోయే ఐదేళ్ల వరకు ప్రభాస్ డైరీ ఖాళీ లేనట్లే. ఇవన్నీ పూర్తయ్యేసరికి డార్లింగ్ హీరో రెమ్యునరేషన్ రూ.200 కోట్ల మార్క్ దాటేస్తుందేమో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
ఉప్పెన కేవలం ఆయన కోసమే చేశా: విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఉప్పెన మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఆయన మహారాజా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పెన చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.విజయ్ సేతుపతి మాట్లాడుతూ..'ఉప్పెన సినిమా కేవలం నేను బుచ్చిబాబు కోసమే చేశా. ఆయనకున్న ప్యాషన్ చూసి నేను ఒప్పుకున్నా. చాలా తక్కువ రెమ్యునరేషన్‌కే ఉప్పెన సినిమా చేశా. మామూలుగా అయితే నాలాంటి యాక్టర్స్ చేయడానికి వెనుకాడతారు. కానీ సినిమా పట్ల బుచ్చిబాబుకున్న ప్యాషన్ చూసే ఆ చిత్రంలో నటించా' అని అన్నారు. I did #Uppena only because of @BuchiBabuSana , Less Remuneration కి ఆ సినిమా చేశాను - #VijaySethupathi pic.twitter.com/qRBIGwwFho— Rajesh Manne (@rajeshmanne1) June 10, 2024 -
నయనతారకు క్రేజీ ఛాన్స్.. భారీగా డిమాండ్ చేస్తోన్న భామ!
జీవితంలో ప్రతిదానికీ ఒక లెక్క ఉంటుంది. అది డబ్బు కావచ్చు ఇంకేదైనా కావ్వవచ్చు. జరిగిన ఏ ఒక్క క్షణం తిరిగి రాదు. అందుకే ఉన్న సమయంలోనే సంపాదించుకోవడం అయినా, అనుభవించడం అయినా. ఈ నగ్న సత్యం బాగా తెలిసిన నటి నయనతార. నటిగా ఆదిలో అవరోధాలను ఎదుర్కొన్నా, తన ప్రతిభ, అంది వచ్చిన అదృష్టంతో ఎదుగుతూ అందలం ఎక్కారు. లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తున్నా.. మరో పక్క నిర్మాతగా, ఇతర వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయినా డబ్బెవరికి చేదు అన్న సామెతలా కలిసి వచ్చే ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదనిపిస్తోంది. లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తూనే కథానాయికగా కాకుండా అక్కగా.. చెల్లెలిగా నటించడానికి కూడా వెనుకాడడం లేదు.ఆ మధ్య ఇమైకా నొడిగళ్ చిత్రంలో నటుడు అధర్వకు అక్కగా.. ఆ తరువాత తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలిగా నటించారు. ఇప్పుడు కన్నడ నటుడు యశ్ కు అక్కగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీని వెనుక బలమైన పాత్రలు ఉండవచ్చు.. అంతకంటే ముఖ్యమైనది డబ్బు. అవును ఇది అక్షరాలా నిజం.లేడీ సూపర్‌స్టార్ నయనతారకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార ఆ చిత్రానికి రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమిళంలో టెస్ట్, మన్నాంగట్టి చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే ములాయంలో నివీన్ బాలి సరసన కథానాయికిగా నటిస్తున్నారు.తాజాగా కేజీఎఫ్ చిత్రం ఫేమ్ యశ్ పాన్ ఇండియా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అందులో ప్రాముఖ్యత కలిగిన అక్క పాత్ర చేస్తున్నారట. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. అయితే కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె అంగీకరించలేదని సమాచారం. దీంతో ఇప్పుడు ఆ పాత్రలో నయనతారను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయన్నది సమాచారం. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నటించడానికి నయనతార డబుల్ పారితోషికం అంటే రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
సాయిపల్లవికి రికార్డ్ రెమ్యునరేషన్.. 'రామాయణ' కోసం అన్ని కోట్లా?
ప్రస్తుత జనరేషన్ లో నేచురల్ బ్యూటీ అంటే సాయిపల్లవినే. ఎందుకంటే చాలా సాధారణమైన పాత్రల్లో చేస్తూనే సూపర్ హిట్స్ కొట్టింది. ప్రస్తుతం హిందీలో భారీ బడ్జెట్ తో తీస్తున్న 'రామాయణ' మూవీలో నటిస్తోంది. అయితే ఇందులో నటిస్తున్నందుకు కళ్లుచెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న అనసూయ లేటెస్ట్ మూవీ) 'ప్రేమమ్' అనే మలయాళ మూవీతో హీరోయిన్ గా మారిన సాయిపల్లవి.. ఆ తర్వాత 'ఫిదా'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో నటించి హిట్స్ కొట్టింది. చివరగా 'విరాటపర్వం'లో కనిపించింది. ఇది వచ్చి నాలుగేళ్లుపైనే అయిపోయింది. అయితే గత రెండేళ్లుగా నటనకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్యే మళ్లీ బిజీగా మారుతోంది. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తున్న సాయిపల్లవి.. హిందీలో ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న సినిమా చేస్తోంది. అలానే రణ్ బీర్, యష్ తదితరులు నటిస్తున్న 'రామాయణ'లోనూ సీత పాత్ర చేయబోతుంది. త్వరలో ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించబోతున్నారు. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సాయిపల్లవి.. మూడు భాగాలుగా తీస్తున్న 'రామాయణ' కోసం మాత్రం రూ.10-15 కోట్ల వరకు తీసుకుంటుందని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం నయనతారని దాటేసి రికార్డ్ సృష్టించినట్లే. సీత పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్టానే తన పారితోషికాన్ని సాయిపల్లవి అమాంతం పెంచేసిందని అంటున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
'ఆ నిర్మాత పారితోషికం ఇవ్వలేదు'.. టాలీవుడ్ హీరోయిన్!
బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన బాలీవుడ్ భామ మాల్వీ మల్హోత్రా. ఆ తర్వాత హిందీలో హోటల్ మిలాన్ చిత్రం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. హిందీతో పాటు తెలుగు, మలయాళం సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది ముద్దుగుమ్మ. పంజాబీ కుటుంబానికి చెందిన మాల్వీ పలు వీడియో ఆల్బమ్స్‌లో కనిపించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామీ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా మాల్వీ మల్హోత్రా సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్ ప్రముఖ చిత్రనిర్మాత విక్రమ్ భట్ తనను మోసం చేశారని ఆరోపించారు. తాను మాల్వి బర్బాద్ కర్ దియా తేరే ప్యార్ నే అనే మ్యూజిక్ వీడియోలో పనిచేశానని తెలిపారు. ఈ పాటకు ఆయన కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. అయితే ఈ ఆల్బమ్‌లో నటించినందుకు విక్రమ్ తనకు ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వలేదని మాల్వీ మల్హోత్రా ఆరోపించింది. పారితోషికం కోసం విక్రమ్‌కు కాల్ చేసినా, మెసేజ్ చేసినా స్పందించలేదని ఆమె పేర్కొంది. మాల్వీ మాట్లాడుతూ.. 'నేను విక్రమ్ భట్ నిర్మించిన బర్బాద్ కర్ దియా ఆల్బమ్ సాంగ్ కోసం పనిచేశా. అప్పడే నేను దక్షిణాదిలో సినిమా షూట్లతో బిజీగా ఉన్నా. అయినప్పటికీ విక్రమ్ భట్ ఆయన నిర్మాణంలో ఒక పాట చేయమని నన్ను సంప్రదించారు. నాకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సమయం కేటాయించా. ఎందుకంటే వారిని నేను పూర్తిగా విశ్వసించా. కానీ ఆ తర్వాత నాకు పెండింగ్‌లో డబ్బుల కోసం ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన రాలేదు. కొన్ని నెలల తర్వాత విక్రమ్ భట్ మళ్లీ వారి తన ప్రాజెక్ట్‌లో పని చేయమని నన్ను అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక నటిగా మరే ఇతర ఆర్టిస్ట్ కూడా ఇలా మోసపోకూడదని దీన్ని షేర్ చేస్తున్నా" అని వెల్లడించింది. అయితే ఈ విషయంపై విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్ స్పందించింది. ఆ డబ్బులు విషయం గురించి తనకు తెలియదని.. అందుకే దానిపై నేను ఏం మాట్లాడదలచుకోలేదని చెప్పింది. -
రాజమౌళి సినిమాకి..మహేష్ బాబు రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదా ?
-
గుంటూరు కారం మూవీ.. ప్రిన్స్ రెమ్యునరేషన్ అంత తక్కువా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు కాంబోలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే తొలి రోజు ఉదయం నుంచే థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అయితే ఈ సినిమా అభిమానులు ఆశించినా స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని కొందరు సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: 'నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం'.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!) అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్‌పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్లో పలువురు స్టార్ హీరోలు కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు కారం చిత్రానికి మహేశ్ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టీటౌన్లో టాక్ వినిపిస్తోంది. అయితే మహేశ్ బాబు ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.70 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే గుంటూరు కారం సినిమాకు తక్కువగానే తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ షాకవుతున్నారు. తమ అభిమాన హీరో తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడాన్ని నమ్మలేకపోతున్నారు. స్టార్ హీరోగా ఉన్న మహేశ్ ఇంత తక్కువ తీసుకోవడం ఏంటని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. (ఇది చదవండి: గుంటూరు కారం రిలీజ్.. ట్రెండింగ్‌లో అజ్ఞాతవాసి.. ఎందుకంటే?) -
దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్.. ఆ బుల్లితెర నటి ఎవరంటే?
సినిమా ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. ఎందుకంటే స్టార్ హీరోల విషయాకొనిస్తే ఆ పదం కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు కూడా ఉన్నారు. అలాగే సినిమాలతో పాటు బుల్లితెరపై కనిపించే నటీనటులు సైతం కోట్లలో కాకపోయినా.. లక్షల్లో తీసుకునేవారు ఉన్నారు. బుల్లితెరపై నటీనటుల విషయంలో రెమ్యునరేషన్ తక్కువే అయినా.. అందులోనూ అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్‌కు లక్షల రూపాయలు వసూలు చేస్తున్న క్రేజీ నటి గురించి తెలుసుకుందాం. ఇంతకీ ఆమె ఎవరో మీరు కూడా ఓ లుక్కేయండి. ఏడేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన నటి ప్రస్తుతం బుల్లితెరపై నటించేవారిలో అత్యధిక పారితోషికం అందుకుంటోంది. ప్రముఖ సీరియల్స్‌లో నటిస్తూ ఒక్కో ఎపిసోడ్‌కు హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఆమె దాదాపు 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బుల్లితెర భామ రూపాలీ గంగూలీ. దర్శకుడు, స్క్రీన్ రైటర్ అనిల్ గంగూలీ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె సోదరుడు విజయ్ గంగూలీ కూడా కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. రూపాలి గంగూలీ 1985లో ఏడేళ్ల వయసులో తన తండ్రి చిత్రం సాహెబ్‌లో నటించింది. ఆ తర్వాత ఆమె 2000లో సుకన్య అనే సీరియల్‌తో బుల్లితెర రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సారాభాయ్ వర్సెస్ సారాభాయ్‌లో మోనిషా పాత్రకు ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2006లో ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్- 1లో పాల్గొంది. ఆ తర్వాత కూడా పలు రియాలిటీ షోస్‌లో కూడా పాల్గొంది. ఆమెకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో సన్నిహితమైన సంబంధాలు కూడా ఉన్నాయి. అక్షయ్ కుమార్‌ను కుటుంబ సభ్యుడిలా భావిస్తామని గతంలో రూపాలీ చాలాసార్లు చెప్పుకొచ్చారు. సీరియల్స్‌లో నటిస్తూ ఉండగానే రూపాలి గంగూలీ ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ కె. వర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అనుపమ-నమస్తే అమెరికా, బతేన్ కుచ్ అంకాసీ అనే సీరియల్స్‌లో నటిస్తోంది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బుల్లితెర నటిగా పేరు సంపాదించుకున్న రూపాలీ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న బుల్లితెర నటిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఒక్కో ఎపిసోడ్‌కి రూ. 3 లక్షలు తీసుకుంటోంది. కేవలం సీరియల్స్ ద్వారానే దాదాపు రూ. 20 కోట్ల వరకు ఆస్తులు సంపాదించారు. బుల్లితెర పరంగా చూస్తే ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ రూపాలీ గంగూలీ అందుకుంటున్నారు. ఓవరాల్‌గా ఇండియాలో ఈ స్థానం మాత్రం కమెడియన్ కపిల్ శర్మదే. అతడు ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.50 లక్షలు వసూలు చేస్తుండటం విశేషం. బాలీవుడ్ లోనూ అతడు పలు సినిమాల్లో కనిపించాడు. ది కపిల్ శర్మ షో మాత్రం చాలా ఫేమస్ అయ్యారు. సంపద పరంగా చూస్తే రూపాలీ గంగూలీ కంటే హీనా ఖాన్ నెట్ వర్త్ చాలా ఎక్కువ. ఆమె రూ.52 కోట్లతో దేశంలో అత్యధిక సంపద కలిగిన బుల్లితెర నటిగా నిలిచింది. View this post on Instagram A post shared by Rups (@rupaliganguly) -
Bigg Boss 7: ఆ కారణంతో గౌతమ్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్‌బాస్ 7 నుంచి డాక్టర్‌బాబు ఎలిమినేట్ అయిపోయాడు. అశ్వద్ధామ 2.0 అని హడావుడి చేసిన ఇతడు.. సింగిల్‌గా ఆడుతూనే 13వ వారం వరకు నెట్టుకొచ్చేశాడు. అయితే ఇతడు చేసిన కొన్ని పనులు, అలానే హౌసులోని పలువురి వల్ల గౌతమ్.. బయటకొచ్చేసినట్లు అనిపిస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే.. ఇన్నివారాలకు కలిపి రెమ్యునరేషన్ మాత్రం గట్టిగా ముట్టినట్లు టాక్. ఇంతకీ ఏంటి విషయం? డాక్టర్‌బాబు ఫెర్ఫార్మెన్స్ ఓకే డాక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ కృష్ణ.. బిగ్‌బాస్ హౌస్‌లో 13వ వారాలైతే ఉన్నాడు గానీ గుర్తింపు అయితే పెద్దగా తెచ్చుకోలేకపోయాడు. మొదటి వారం నుంచి ఇప్పటివరకు దాదాపు ఒంటరిగానే పోరాడుతూ వచ్చారు. ఈ విషయంలో మాత్రం అతడిని మెచ్చుకోవచ్చు. ఇన్ని వారాలు జరిగిన గేమ్స్‌లోనూ గౌతమ్ గెలిచిన దాఖలాలు అయితే లేవు. ఓ రోజు సీక్రెట్ రూంలో ఉండొచ్చి, 'అశ్వద్ధామ 2.0' అని హడావుడి చేశాడు గానీ అది పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. (ఇదీ చదవండి: హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) ఎలిమినేషన్‌కి అదే కారణమా? ప్రారంభంలో నామమాత్రంగా ఆడిన గౌతమ్.. ఆ తర్వాత నుంచి శివాజీతో గొడవ పెట్టుకుని హైలైట్ అయ్యాడు. అప్పటి నుంచి తాజా వీకెండ్ ఎపిసోడ్ వరకు ఈ తంతే నడిచింది. అయితే శివాజీ వరస్ట్ కామందు తరహా ప్రవర్తన గురించి కాస్తో కూస్తో నిజాలు మాట్లాడిన వాళ్లలో గౌతమ్ ఒకడు. ఇదే ఇప్పుడు బిగ్‌బాస్ ఆర్గనైజర్స్‌కి నచ్చలేదు. గౌతమ్‌ని ఎలిమినేట్ చేసి పడేశారు. గత రెండు మూడు వారాల గేమ్ తీసుకుంటే శివాజీ, యావర్ కంటే గౌతమ్ చాలా బెటర్. కానీ శివాజీ మీద బిగ్బాసోళ్లకు ప్రేమ ఎక్కువైంది. అదే గౌతమ్‌కి శాపమైందని టాక్. రెమ్యునరేషన్ ఎంత? ఇకపోతే వారానికి రూ 1.5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అని గౌతమ్ డీల్ మాట్లాడుకున్నాడట. అంటే 13 వారాలకు గానూ దాదాపు రూ 19.5 లక్షలు పారితోషికంగా అందుకున్నాడని సమాచారం. అయితే ఈ విషయంపై గౌతమ్ క్లారిటీ ఇస్తే తప్ప అసలు లెక్కలు తెలియవు. ఏదేమైనా శివాజీతో పెట్టుకోవడం తనకు ప్లస్ అవుతుందని గౌతమ్ అనుకున్నాడు కానీ అదే మైనస్ అయి, ఇంటి నుంచి బయటకొచ్చేలా చేసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రానా తమ్ముడి డెస్టినేషన్ వెడ్డింగ్? ఆ దేశంలో మూడు రోజుల పాటు!) -
సౌత్‌లో ఈ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎంతంటే.. టాప్‌లో ఎవరో తెలుసా?
సినీరంగంలో ఒక వ్యక్తికి 60 ఏళ్లు వచ్చినా తనదైన మార్కెట్‌తో దూసుకుపోతుంటారు. వారు ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా కూడా సినిమా ఛాన్స్‌లు వస్తుంటాయి. ఈ విషయాన్ని స్వయంగా సినీరంగంలో పనిచేసే వారే చాలాసార్లు చెప్తుంటారు. సినిమాల్లో మగవాళ్లలా నటీమణులు కనీసం 40, 50 ఏళ్లు కూడా ఉండలేరు. ఒకవేళ ఉన్నా సపోర్టింగ్ రోల్స్‌లలో నటించేందుకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ వారు పెళ్లి చేసుకుంటే సినిమాల్లో మార్కెట్ పడిపోతుంది. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం కొన్ని సంవత్సరాలుగా నిరంతరం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్లుగా ఇంకా తమ సత్తా చాటుతున్నారు. త్రిష, నయనతార వంటి నటీమణులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీరిద్దరూ 20 ఏళ్లకు పైగా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకానీ సపోర్టింగ్ రోల్స్ లో నటించడం లేదు. అనేక భారీ బడ్జెట్, పాన్-ఇండియన్ చిత్రాలలో ఇటీవలి కాలంలో హీరోలతో సమానంగా వారు కూడా రెరమ్యునరేషన్ పొందుతున్నారు. వీళ్లు రూ. 10 నుంచి 11 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటారని టాక్. ఒక సినిమాకు రూ. 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్న తొలి దక్షిణ భారత నటిగా నయనతారకు గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు సౌత్ ఇండియాలో నయనతార కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటి మరోకరు ఉన్నారు. ఆమె మరెవరో కాదు నటి త్రిష. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి త్రిష. ప్రస్తుతం నయనతార పారితోషికం కంటే త్రిష ఎక్కువ తీసుకుంటున్నట్లు టాక్. దీనికి ప్రధాన కారణం త్రిష నటనా ప్రావీణ్యంతో పాటు.. 40 ఏళ్లు దాటినా యూత్ ఫుల్ అందం అని చెప్పవచ్చు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో నటించినందుకు త్రిష 12 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదే విషయం గూగుల్ కూడా తెలుపుతుంది. త్రిషకు ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు నిర్మాతలు కూడా ముందుకొచ్చారని తెలుస్తోంది. దీంతో సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి త్రిష అని పరిగణనలోకి తీసుకుంటే, నయనతార రెమ్యూనరేషన్ పెద్దగా తగ్గలేదు. జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నయనతార ఈ సినిమా కోసం 11 కోట్ల పారితోషికం తీసుకుందట. రెమ్యునరేషన్ పరంగా అనుష్క శెట్టి మూడో స్థానంలో నిలిచింది. ఆమె పారితోషికం రూ.6 కోట్లు. అనుష్క ప్రస్తుతం తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. సమంత రూ.6 నుంచి 8 కోట్లు ఒక సినిమాతో సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన యశోద, శకుంతలం, ఖుషి చిత్రాల తర్వాత సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. పూజా హెగ్డే సౌత్ ఇండియన్ బిజీ నటీమణులలో ఒకరు. పూజా హెగ్డే ఒక్కో సినిమాకు రెండున్నర కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. రష్మిక మందన ఒక్కో సినిమాకు రూ. 4 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. జైలర్ ద్వారా మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా.. రూ. 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. కాజల్ అగర్వాల్ ఒక సినిమా కోసం ఒకటిన్నర నుంచి నాలుగు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. నటి ఏడాది క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కో సినిమాకు 1.5 నుంచి 3.5 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. నివేదికల ప్రకారం, కీర్తి సురేష్ ఒక సినిమాకు రూ.2.5 నుంచి 4 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌కు సరైన హిట్ దక్కలేదు. -
50 సెకన్లకు రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్ వంటి అగ్ర నటులందరితోనూ నటించిన నయన్ తాజాగా షారుక్ ఖాన్ జవాన్‌లో మెప్పించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే నయన్ చాలారోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నయన్ కొద్దిరోజుల క్రితం తన పిల్లల ఫోటోలు చూపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టింది. నిమిషాల్లోనే ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు వచ్చేశారు. ప్రస్తుతం ఆమెకు 32 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నయనతార గత కొన్నేళ్లుగా కొత్త స్కిన్ కేర్ కంపెనీని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఆమె తరచుగా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆ ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఈ ఉత్పత్తులను కూడా ఆన్లైన్లో విక్రయించేందుకు ప్లాన్‌లో ఉంది. ఇలా ఆమె వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టడం విశేషం. తన వ్యాపార ఉత్పత్తులు షేర్ చేసేందుకే ఇన్‌స్టాగ్రామ్‌లోకి నయన్ అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రకటనకు కోట్లలో రెమ్యునరేషన్: ఈ సందర్భంలో నటి నయనతార ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. కేవలం 50 సెకన్ల ప్రకటనలకే నయనతార దాదాపు రూ. 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రకటనల సమయం అంతకు మించి పెరిగితే తన రెమ్యునరేషన్ కూడా పెరుగుతుందని అంటున్నారు. సినిమా ద్వారా కోట్లకు పడగలెత్తినా.. కొత్త మార్గాల్లో సంపాదిస్తూ.. ఏడాదికేడాది ఆస్తుల విలువను పెంచుకుంటుంది నయన్. (ఇదీ చదవండి: గర్భవతిగా ఉన్న నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను: పూర్ణ) -
'జవాన్' కోసం దీపిక నో రెమ్యునరేషన్.. కారణం అదే?
'జవాన్' సినిమా పేరు చెప్పగానే అందరికీ వందల కోట్ల కలెక్షన్సే గుర్తొస్తాయి. ఎందుకంటే గత వారం రిలీజైన ఈ చిత్రం.. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ మూవీలో షారుక్‌తోపాటు బోలెడంత మంది స్టార్స్ నటించారు. అయితే మిగతా వాళ్లు కోట్లకు కోట్లు తీసుకున్నారు. కానీ ఇందులో యాక్ట్ చేసిన దీపికా పదుకొణె మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఎందుకో తెలుసా? తనకు జరిగిన అన్యాయంపై ఓ జవాన్.. తన కొడుకుతో కలిసి విలన్‌పై ఎలా పగతీర్చుకున్నాడు? అనే కాన్సెప్ట్‌తో తీసిన 'జవాన్' సినిమాని ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీశారు. తమిళ దర్శకుడు అట్లీ ఈ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఇకపోతే ఈ మూవీలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో షారుక్‌కి జోడీగా దీపికా పదుకొణె యాక్ట్ చేసింది. (ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి ఫైమా.. అమ్మని పట్టుకుని ఏడ్చేసింది!) సాధారణంగా ఒక్కో సినిమాకు దీపికా పదుకొణె.. రూ.12-15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటదని టాక్. అలాంటిది 'జవాన్'లో ఉచితంగా నటించినట్లు స్వయంగా ఆమెనే క్లారిటీ ఇచ్చింది. ఆ క్యారెక్టర్ అంత గొప్పగా ఉండటంతో ఇంకేం ఆలోచించలేదని చెప్పుకొచ్చింది. అయితే ఈమె కెరీర్‌కి బ్రేక్ ఇచ్చిన మూవీ 'ఓం శాంతి ఓం'. ఈ చిత్రం నుంచి షారుక్, నిర్మాణ సంస్థతో దీపికకు మంచి బాండింగ్ ఉంది. బహుశా ఈ కారణంతోనే ఫ్రీగా యాక్ట్ చేసి ఉండొచ్చు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ప్రాజెక్ట్ K' అలియాస్ 'కల్కి'లో హీరోయిన్గా చేస్తోంది దీపికనే. అయితే గతంలో తన భర్త రణ్వీర్ సింగ్ 83, సర్కస్ సినిమాల్లోనూ గెస్ట్ రోల్స్ చేసిన దీపికా.. అప్పుడు రెమ్యునరేషన్ తీసుకుంది. ఇప్పుడు 'జవాన్'కి మాత్రం ఫ్రీగా చేసింది. మరి ఇది విశేషమేగా! (ఇదీ చదవండి: అతడితో పులిహోర కలిపేస్తున్న రతిక.. పాపం ప్రశాంత్!) -
ఒక నిమిషానికి శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీలీల. ‘పెళ్లిసందడి’తో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు వరుస సినిమాలతో అలరిస్తోంది. యంగ్ హీరోల సినిమాల దగ్గర నుంచి అగ్ర నటుల చిత్రాల వరకు ఆమె కీలక పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి లిస్ట్‌లో చాలా సినిమాలే ఉన్నాయి. రానున్న ఆరు నెలల్లో శ్రీలీల నటిస్తోన్న ఆరు సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. (ఇదీ చదవండి; తండ్రితో హీరోయిన్ లిప్‌లాక్.. 33 ఏళ్ల తర్వాత రియాక్షన్) మొదటి సినిమా పెళ్లి సందడికి కేవలం 5 లక్షలు మాత్రమే తీసుకున్న శ్రీలీల రవితేజ ధమాకా సినిమాకు 50 లక్షల వరకు డిమాండ్ చేసిందట. త్వారలో విడుదలన కానున్న రామ్ స్కంద సినిమాకు 80 లక్షల నుంచి కోటి రూపాయల దాకా రెమ్యునరేషన్‌గా తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలకు ఏకంగా ఒక సినిమా కోసం రూ. 5 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తన చేతిలో డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. దీంతో ఇక నుంచి ఆమె ఒప్పుకునే సినిమాలకు సుమారు రూ. 8 కోట్లు వరకు ఫిక్స్ చేసినట్లు సమాచారం. సినిమాలతో పాటు శ్రీలీల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కూడా వెళ్తుంటుంది. అందుకోసం ఆమె సుమారు కోటి రూపాయల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ షాపింగ్ మాల్ కార్యక్రమంలో కేవలం పది నిమిషాలు మాత్రమే ఉంటారట. ఆ లెక్కనా ఒక నిమిషానికి రూ. 10 లక్షల రెమ్యునరేషన్ అవుతుంది. వీటితో పాటు ఆమెకు అయ్యే ఫ్లైట్ ఖర్చులతో పాటు హోటల్ రూమ్స్ అన్నీ షాపింగ్ మాల్ నిర్వాహుకులే ఏర్పాటు చేయడం సహజం. ఈ విషయంపై ఒక నిమిషానికి శ్రీలీల రెమ్యునరేషన్ రూ. 10 లక్షలా అంటూ పలువురు నోరెళ్ల బెడుతున్నారు. కానీ మరికొందరు మాత్రం.. తన మొదటి రెమ్యునరేషన్ కేవలం రూ. 5 లక్షలే కదా అంటూ.. తను కూడా ఇండస్ట్రీలో కష్టపడి మంచి గుర్తింపు తెచ్చుకుంది కాబట్టే వాళ్లందరూ అంత మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని టాక్ వినిపిస్తుంది. -
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కోసం వీళ్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. టాప్‌లో ఎవరంటే?