
Naga Chaitanya Charged Rs 5 Crores For Laal Singh Chaddha: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు కావోస్తుంది. 2009లో 'జోష్' చిత్రంతో అక్కినేని నాగార్జున నట వారసుడిగా పరిచయమైన చై సినీ కెరీల్‌లో ఎన్నో హిట్లు, ఫట్లు ఉన్నాయి. ఇటీవల థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చైతూ, బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో చద్దా చడ్డీ బడ్డీ బాలాగా ఆకట్టుకోనున్నాడు. అయితే ఈ సినిమాకు నాగ చైతన్య తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
టాలీవుడ్ ప్రముఖ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందిన నాగ చైతన్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు రూ. 5 నుంచి 10 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య రెమ్యునరేషన్, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఇందులో భాగంగానే అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా'లో బాలా పాత్రకు చైతూ సుమారు 5 కోట్లు అందుకున్నట్లు పేర్కొన్నాడు. అలాగే ఈ చిత్రం, అందులో నాగ చైతన్య నటన ఆకట్టుకుంటే అతనికి ఎంతో లాభదాయకంగా ఉంటుదన్నాడు.
ఈ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్యకు భారీ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని, దీంతో అతని మార్కెట్ పెరగనున్నట్లు వివరించాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్య ఇప్పటికే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాష చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. అలాగే 'డీజే టిల్లుట సినిమాతో సత్తా చాటిన విమల్ కృష్ణతో కూడా చైతూ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment