Ramesh Bala
-
ఆ సినిమాకు నాగ చైతన్య అన్ని కోట్లు తీసుకున్నాడా?
Naga Chaitanya Charged Rs 5 Crores For Laal Singh Chaddha: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు కావోస్తుంది. 2009లో 'జోష్' చిత్రంతో అక్కినేని నాగార్జున నట వారసుడిగా పరిచయమైన చై సినీ కెరీల్లో ఎన్నో హిట్లు, ఫట్లు ఉన్నాయి. ఇటీవల థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చైతూ, బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో చద్దా చడ్డీ బడ్డీ బాలాగా ఆకట్టుకోనున్నాడు. అయితే ఈ సినిమాకు నాగ చైతన్య తీసుకున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ ప్రముఖ హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందిన నాగ చైతన్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు రూ. 5 నుంచి 10 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య రెమ్యునరేషన్, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఇందులో భాగంగానే అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా'లో బాలా పాత్రకు చైతూ సుమారు 5 కోట్లు అందుకున్నట్లు పేర్కొన్నాడు. అలాగే ఈ చిత్రం, అందులో నాగ చైతన్య నటన ఆకట్టుకుంటే అతనికి ఎంతో లాభదాయకంగా ఉంటుదన్నాడు. ఈ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న నాగ చైతన్యకు భారీ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని, దీంతో అతని మార్కెట్ పెరగనున్నట్లు వివరించాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్య ఇప్పటికే వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాష చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. అలాగే 'డీజే టిల్లుట సినిమాతో సత్తా చాటిన విమల్ కృష్ణతో కూడా చైతూ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. -
దటీజ్ రజినీ.. నాలుగు రోజుల్లోనే రూ.400కోట్లు!
సూపర్‌స్టార్ రజనీకాంత్ మానియా అంటే ఏంటో గతకొంతకాలంగా చూపెట్టలేదని అభిమానులు నిరాశపడ్డారు. కబాలి, కాలా సినిమాలతో తలైవా అభిమానులు నిరాశపడినా.. ‘2.ఓ’తో వారికి రెట్టింపు ఆనందాన్నిచ్చారు రజనీ. లేటుగా హిట్ కొట్టినా.. లేటెస్ట్గా హిట్ కొడతామని తలైవా ఫ్యాన్స్ కాలరేగరేసుకుని చెప్పుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం నాలుగు రోజుల్లో నాలుగు వందల కోట్లకు పరుగులు తీసినట్లు మేకర్స్ ప్రకటించారు. గత గురువారం విడుదలై లాంగ్ వీకెండ్‌ను కుమ్మేసిన రజనీ.. వసూళ్లతో అందరినీ ఆశ్యర్యపరిచాడు. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. రోజురోజుకి వసూళ్లను పెంచుకుంటూ పోతోంది. ప్రముఖ తమిళ సినీ విశ్లేషకుడు రమేష్ బాలా ఈ చిత్రవసూళ్లపై ట్వీట్ చేశాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 52.5(దాదాపు 360కోట్లు) మిలియన్ డాలర్లను వసూళ్లు చేసి.. ఫెంటాస్టిక్ బీస్ట్స్ (40.2)ను వెనక్కునెట్టేసిందని ట్వీట్ చేశాడు. యూఎస్‌లో రంగస్థలం ఫుల్‌రన్‌లో వసూళ్లు చేసిన 3.5మిలియన్ డాలర్లను కేవలం నాలుగు రోజుల్లోనే క్రాస్ చేసేసి నాలుగు మిలియన్ డాలర్లకు పరుగులుపెడుతోందని తెలిపాడు. తెలుగులోనే ‘2.ఓ’ ఇప్పటికివరకు దాదాపు 50కోట్లు, హిందీలో 100కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. Nov 29th - Dec 2nd International (Outside North America) Top 5 BO: 1. #2Point0 - $52.5 Million 2. #FantasticBeasts - $40.2 Million 3. #RalphBreaksTheInternet - $33.7 Million 4. #TheGrinch - $27.1 Million 5. #Venom - $13 Million — Ramesh Bala (@rameshlaus) December 3, 2018 #2Point0 crosses the 50 Cr Gross mark at the AP/TG Box office.. Final weekend nos by this afternoon.. AP/TG — Ramesh Bala (@rameshlaus) December 3, 2018 #2Point0 with $3,588,450 is now 2018's Highest Grossing South Movie in #USA It overtakes #Rangasthalam 's Life-time gross of $3,513,450.. * #2Point0 - 3 Lang Versions.. #Rangasthalam - Only Telugu.. — Ramesh Bala (@rameshlaus) December 3, 2018 -
సెన్సేషనల్ హీరోతో జాన్వీ సౌత్ ఎంట్రీ
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్‌కు పరిచయం అయిన భామ జాన్వీ కపూర్. తొలి సినిమా ధడక్‌తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, తల్లి బాటలో బహు భాషానటిగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా సినిమాలు అంగీకరిస్తూ బిజీగా ఉన్నా.. దక్షిణాది దర్శకులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రముఖ దక్షిణాది సినీ విశ్లేషకుడు రమేష్ బాలా.. జాన్వీ సౌత్ ఎంట్రీపై ఆసక్తికర ట్వీట్ చేశారు. జాన్వీ కపూర్ త్వరలోనే సౌత్ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా తెలిపారు. ఇద్దరు తమిళ దర్శకులు ఒక తెలుగు దర్శకుడు జాన్వీతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలిపారు. అంతేకాదు సౌత్‌లో జాన్వీ తొలి సినిమా విజయ్ దేవరకొండతో ఉండే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. #JanhviKapoor to make her South debut soon.. Two Tamil and One Telugu directors are in talks.. A possible pairing with @TheDeverakonda pic.twitter.com/iCy1UyGkk4 — Ramesh Bala (@rameshlaus) 26 September 2018 -
బర్త్‌డే రోజే గోల్డెన్ చాన్స్!
సాక్షి, సినిమా: నటుడు శరత్‌కుమార్ వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన కూతురు వరలక్ష్మి శరత్‌కుమార్. తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో వరుస అవకాశాలు చేజిక్కుంచుకుంటూ దూసుకెళ్తున్న నటి వరలక్ష్మి పుట్టినరోజు నేడు. అయితే ఈ పుట్టినరోజు తనకెంతో ప్రత్యేమని అంటున్నారు. ఇళయదళపతి, స్టార్ హీరో విజయ్ చిత్రంలో తనకు ఛాన్స్ రావడం బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అని ఈ బ్యూటీ ట్వీట్ చేశారు. కాగా, బర్త్‌డే బ్యూటీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఇళయదళపతి, హీరో విజయ్‌తో కలిసి పని చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు బహుమతి. ఏఆర్ మురుగదాస్ ఈ మూవీకి దర్శకుడు. చాలా హ్యాపీగా ఉన్నానంటూ' నటి వరలక్ష్మి తన పోస్టులో రాసుకొచ్చారు. కాగా, ఈ బర్త్‌డే హీరోయిన్ చేతిలో భారీగా చిత్రాలున్న విషయం తెలిసిందే. అందులో తాజాగా విజయ్ చిత్రం చేరింది. శక్తి, కన్నిరాశి, పంభన్, నీయ2, ఇచారిక్కై, మిస్టర్ చంద్రమౌళి, సందయ్ కోజి2, విజయ్ 62వ చిత్రంతో కలిపి మొత్తం 9 చిత్రాలతో ఈ బ్యూటీ ఫుల్‌జోష్‌లో ఉన్నారు. అత్యధికంగా 8 ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బర్త్‌డే గాళ్ వరలక్ష్మి అంటూ మూవీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. Yes it’s the best birthday gift I can ask for.. it’s official I’m joining the cast of #thalapathy62... sooperrrr excited to be working with @actorvijay sir and @ARMurugadoss sir.. looking forward to it..!! — varu sarathkumar (@varusarath) 5 March 2018 At present, Birthday Gal @varusarath has the most number of Tamil movies on hand.. 1. #Thalapathy62 2. #SandaiKozhi2 3. #MrChandramouli 4. #Echarikkai 5. #Neeya2 6. #Paambhan 7. #KanniRaasi 8. #Shakthi pic.twitter.com/DGfUi7IO1i — Ramesh Bala (@rameshlaus) 5 March 2018 -
రెండ్రోజుల్లో బాహుబలి కలెక్షన్లు ఎంతో తెలుసా!
హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి: ది కంక్లూజన్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ మూవీ సుల్తాన్ రికార్డును బద్దలుకొట్టింది బాహుబలి-2. తొలి వారాంతంలో రూ. 210.5 కోట్లతో ఉన్న సుల్తాన్ మూవీ గ్రాస్ కలెక్షన్లను కేవలం రెండు రోజుల్లోనే 217 కోట్లతో టాలీవుడ్ మూవీ అదిగమించింది. బాహుబలి-2 రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.382.5 కోట్ల వసూళ్లు రాబట్టి 400కోట్ల కబ్ల్ వైపునకు పరుగులు తీస్తుంది. ఈ విషయాన్ని మూవీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారత్‌లో ఓవరాల్‌గా 285 కోట్లు రాబట్టిన బాహుబలి-2, అమెరికాలో 52.5 కోట్లు, ఇతర దేశాల్లో రూ.45 కోట్ల భారీ వసూళ్లతో చరిత్ర సృష్టించింది. భారత్‌లో తొలివారాంతంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలవడంతో దర్శకుడు రాజమౌళికి ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఆమీర్ ఖాన్ నటించిన పీకే మూవీ ఓవరాల్‌గా 792 కోట్ల వసూళ్లతో భారత్‌లో అగ్రస్థానంలో ఉంది. అయితే బాహుబలి పీకే రికార్డులను తిరగరాసి తొలి వారం రోజుల్లోనే పీకే వసూళ్లను అధిగమిస్తుందని మూవీ ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. #Baahubali2 / #BaahubaliTheConclusion 2 Days WW BO:#India Gross: ₹ 285 Crs#USA - ₹ 52.5 Crs RoW - ₹ 45 Crs Total - ₹ 382.5 Crs — Ramesh Bala (@rameshlaus) 30 April 2017 #Baahubali2 's Day 1 WW Gross - ₹ 217 cr beats #Sultan 's 1st Wknd WW Gross of ₹ 210.5 cr to emerge All-time No.1 1st Wknd Indian Grosser.. — Ramesh Bala (@rameshlaus) 30 April 2017