బర్త్‌డే రోజే గోల్డెన్ చాన్స్! | The Best Birthday Gift, Tweets  Varalaxmi Sarathkumar | Sakshi
Sakshi News home page

బర్త్‌డే రోజే గోల్డెన్ చాన్స్ కొట్టేసింది!

Published Mon, Mar 5 2018 7:06 PM | Last Updated on Tue, Mar 6 2018 9:22 AM

The Best Birthday Gift, Tweets  Varalaxmi Sarathkumar - Sakshi

వరలక్ష్మి శరత్‌కుమార్

సాక్షి, సినిమా: నటుడు శరత్‌కుమార్ వారసురాలిగా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన కూతురు వరలక్ష్మి శరత్‌కుమార్. తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో వరుస అవకాశాలు చేజిక్కుంచుకుంటూ దూసుకెళ్తున్న నటి వరలక్ష్మి పుట్టినరోజు నేడు. అయితే ఈ పుట్టినరోజు తనకెంతో ప్రత్యేమని అంటున్నారు. ఇళయదళపతి, స్టార్ హీరో విజయ్ చిత్రంలో తనకు ఛాన్స్ రావడం బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్‌ అని ఈ బ్యూటీ ట్వీట్ చేశారు. కాగా, బర్త్‌డే బ్యూటీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'ఇళయదళపతి, హీరో విజయ్‌తో కలిసి పని చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు బహుమతి. ఏఆర్‌ మురుగదాస్ ఈ మూవీకి దర్శకుడు. చాలా హ్యాపీగా ఉన్నానంటూ' నటి వరలక్ష్మి తన పోస్టులో రాసుకొచ్చారు. కాగా, ఈ బర్త్‌డే హీరోయిన్ చేతిలో భారీగా చిత్రాలున్న విషయం తెలిసిందే. అందులో తాజాగా విజయ్ చిత్రం చేరింది.

శక్తి, కన్నిరాశి, పంభన్, నీయ2, ఇచారిక్కై, మిస్టర్ చంద్రమౌళి, సందయ్ కోజి2, విజయ్ 62వ చిత్రంతో కలిపి మొత్తం 9 చిత్రాలతో ఈ బ్యూటీ ఫుల్‌జోష్‌లో ఉన్నారు. అత్యధికంగా 8 ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బర్త్‌డే గాళ్ వరలక్ష్మి అంటూ మూవీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement