రెండ్రోజుల్లో బాహుబలి కలెక్షన్లు ఎంతో తెలుసా!
హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి: ది కంక్లూజన్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ మూవీ సుల్తాన్ రికార్డును బద్దలుకొట్టింది బాహుబలి-2. తొలి వారాంతంలో రూ. 210.5 కోట్లతో ఉన్న సుల్తాన్ మూవీ గ్రాస్ కలెక్షన్లను కేవలం రెండు రోజుల్లోనే 217 కోట్లతో టాలీవుడ్ మూవీ అదిగమించింది. బాహుబలి-2 రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.382.5 కోట్ల వసూళ్లు రాబట్టి 400కోట్ల కబ్ల్ వైపునకు పరుగులు తీస్తుంది. ఈ విషయాన్ని మూవీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
భారత్‌లో ఓవరాల్‌గా 285 కోట్లు రాబట్టిన బాహుబలి-2, అమెరికాలో 52.5 కోట్లు, ఇతర దేశాల్లో రూ.45 కోట్ల భారీ వసూళ్లతో చరిత్ర సృష్టించింది. భారత్‌లో తొలివారాంతంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలవడంతో దర్శకుడు రాజమౌళికి ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఆమీర్ ఖాన్ నటించిన పీకే మూవీ ఓవరాల్‌గా 792 కోట్ల వసూళ్లతో భారత్‌లో అగ్రస్థానంలో ఉంది. అయితే బాహుబలి పీకే రికార్డులను తిరగరాసి తొలి వారం రోజుల్లోనే పీకే వసూళ్లను అధిగమిస్తుందని మూవీ ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.
#Baahubali2 / #BaahubaliTheConclusion 2 Days WW BO:#India Gross: ₹ 285 Crs#USA - ₹ 52.5 Crs
— Ramesh Bala (@rameshlaus) 30 April 2017
RoW - ₹ 45 Crs
Total - ₹ 382.5 Crs
#Baahubali2 's Day 1 WW Gross - ₹ 217 cr beats #Sultan 's 1st Wknd WW Gross of ₹ 210.5 cr to emerge All-time No.1 1st Wknd Indian Grosser..
— Ramesh Bala (@rameshlaus) 30 April 2017