Baahubali 2
-
Pushpa 2 Collection: రప్పా రప్పా సరికొత్త రికార్డప్పా
పుష్పరాజ్ (‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్పాత్ర పేరు) అస్సలు తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో రప్పా రప్పా అంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. కేవలం 32 రోజుల్లోనే ‘పుష్ప 2 : ది రూల్’ ప్రపంచ వ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ , రష్మికా మందన్నా జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేకపాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదలైంది.అయితే డిసెంబరు 4 నుంచి ప్రీమియర్స్ మొదలైన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్ లలో ‘పుష్ప 2: ది రూల్’ విడుదలైంది. సినిమా రిలీజైన 32 రోజుల్లోనే రూ.1831 కోట్లు గ్రాస్ వసూలు చేసి, రూ.1810 కోట్లు వసూలు చేసిన ‘బాహుబలి–2’ సినిమా వసూళ్లను ‘పుష్ప 2’ అధిగమించి, సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్లు చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఆమీర్‌ఖాన్ నటించిన హిందీ సినిమా ‘దంగల్’ ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్లకుపైగా వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే రూ.1831 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో ‘పుష్ప 2: ది రూల్’ నిలిచింది. కాగా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో మాత్రం ‘పుష్ప 2: ది రూల్’ మొదటి స్థానంలో నిలిచింది. -
నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్న టాలీవుడ్
-
హిందీలో అత్యధిక వసూళ్లు చేసిన 2వ సినిమా కేజీయఫ్ 2, తొలి సినిమా ఏదో తెలుసా?
KGF 2 Becomes All Time Second Highest Hindi Grosser: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీయఫ్ 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలై మూడు వారాలకు పైగా గడుస్తున్న ఇప్పటికీ థియేటర్లో ఈ మూవీ హావా కొనసాగుతూనే ఉంది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే విడుదలైన అన్ని భాషల్లో (కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ) భారీ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ బాలీవుడ్లో అరుదైన ఘనతను సాధించింది. చదవండి: విరాట పర్యం రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజే బిగ్స్క్రీన్పై సందడి విడుదలైన 22 రోజుల్లోనే ఈ మూవీ దంగల్ లైఫ్‌టైం కలెక్షన్స్‌ను దాటేసి అప్పటికి వరకు ఉన్న ఆ మూవీ రికార్డును చెరిపేసింది. ‘దంగల్’ చిత్రం లైఫ్‌టైం రన్లో రూ. 387.40 కోట్లు వసూలు చేయగా... కేవలం 22 రోజుల్లోనే ఆ రికార్డును 'కేజీఎఫ్2' అధిగమించింది. ఇక నిన్నటి(మే 5) వరకు కేజీయఫ్ 2 బి-టౌన్ బాక్సాఫీసు వద్ద రూ. 391.65 కోట్లు వసూలు చేసింది. ఈ రోజు(మే 6) కలెక్షన్స్‌తో రూ. 400 కోట్ల పైగా వసూలు చేసే అవకాశం ఉందని గురువారం ప్రముఖ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ వెల్లడించగా.. రమేశ్ బాలా అనే మరో ట్రెడ్ అనలిస్ట్ నేటితో కేజీయఫ్ 2 రూ. 400 కోట్ల క్లబ్‌లోకి చేరిందని తెలిపాడు. చదవండి: ఉపాసన.. నా మైండ్లోనూ అదే ఉంది, కానీ మనం కొద్ది రోజులు ఆగాల్సిందే! దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సౌత్ సినిమాగా కేజీయఫ్ 2 నిలిచింది. ఇప్పటి వరకు హిందీలో అత్యధిక వసూళు చేసిన దక్షిణాది సినిమాల్లో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది. బాహుబలి 2 హిందీ వెర్షన్ అక్కడ రూ. 511.30 కోట్లు వసూలు చేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే హిందీలో ఇప్పటి వరకు కేవలం రెండు చిత్రాలు మాత్రమే రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఆ రెండూ దక్షిణాది చిత్రాలే (బాహుబలి2, కేజీఎఫ్2) కావడం విశేషం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘రాజ్ కపూర్ తర్వాత ప్రభాస్‌కే’
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పిన చిత్రం ‘బాహుబలి’. ఎన్నో రికార్డులు, అవార్డులు ఘనతలు అందుకున్న ‘బాహుబలి’ కీర్తి కిరీటంలో మరో కలికుతురాయి వచ్చిచేరింది. బాహుబలిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటనకు గాను ‘రష్యా ఆడియన్స్ హార్ట్’ అవార్డుకు ఎంపికయ్యాడు. 2015కు గాను ప్రకంటించిన అవార్డుల జాబితాలో ప్రభాస్‌కు అభిమానులను మెప్పించిన విభాగంలో అవార్డు లభించింది. రష్యాలోని సినీ ప్రేక్షకుల అభిమానాన్ని విపరీతంగా పొందడంతోనే ప్రభాస్‌కు ఈ అవార్డు లభించిందని అక్కడి ప్రతినిధులు పేర్కొంటున్నారు. (రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకుంటా..) ఇక ఈ అవార్డు అందుకుంటున్న రెండో భారతీయ నటుడిగా ప్రభాస్ నిలవనున్నాడు. గతంలో దిగ్గజ నటుడు రాజ్‌కపూర్ ఈ అవార్డును అందుకున్నారు. శ్రీ 420, అవారా, ఆరాధన వంటి చిత్రాలతో రష్యన్ ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుని రష్యన్ అభిమానులను మెప్పించిన రాజ్ కపూర్ 30ఏళ్ల క్రితం ఈ అవార్డును అందుకున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి2 చిత్రాలు ఎంతటి చరిత్ర సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్‌తో పాటు రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు ఈ చిత్రంలో నటించి మెప్పించారు. (ప్రభాస్ కళ్లు నాకు చాలా ఇష్టం..) -
బాహుబలికి ముందు ఆ సినిమానే!
సాక్షి, హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘బాహుబలి’... ఈ సినిమా విడుదలై చాలాకాలమైన ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడో చోట ఈ సినిమా ప్రదర్శితమవుతూనే ఉంది. తాజాగా ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రాన్ని లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించారు. ఇప్పటివరకు రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శించిన తొలి ఇంగ్లిషేతర సినిమా ‘బాహుబలి’ కావడం విశేషం. ఈ సినిమా ప్రదర్శనకు దర్శకుడు రాజమౌళితోపాటు రానా, ప్రభాస్, అనుష్క, కీరవాణి, శోభూ యార్లగడ్డ తదితరులు హాజరయ్యారు. చిత్ర ప్రదర్శన సందర్భంగా ప్రభాస్, రానా బీబీసీ విలేకరి హరూన్ రషీద్‌తో ముచ్చటించారు. బాహుబలి సక్సెస్ గురించి తమ ఆనందానుభూతులను పంచుకున్నారు. ‘బాహుబలి’ కి ముందు తెలుగు సినిమాలు ఏమైనా ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపించాయా? అని రషీద్ ప్రశ్నించగా.. దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ చిత్రాన్ని ప్రభాస్ ప్రస్తావించారు. ‘30, సంవత్సరాల కిందట రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా దేశవ్యాప్తంగా సత్తాను చాటింది’ అని తెలిపారు. అయితే,బాహుబలి సినిమా అంతకుమించి దేశవ్యాప్తంగా అన్నిచోట్ల విజయం సాధించిందని, విదేశాల్లోనూ గొప్పగా ప్రేక్షకుల ఆదరణ పొందిందని ప్రభాస్ తెలిపారు. నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
‘బాహుబలి’కి భల్లాలదేవ విషెస్
హైదరాబాద్: పుట్టినరోజు సందర్భంగా యంగ్ రెబల్ స్టార్, టాలీవుడ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాహుబలి ప్రభాస్ మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని, ఆయన కెరీర్ గొప్పగా సాగాలని, మున్ముందు భారీ విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా ప్రభాస్‌కు పోటీగా నటించిన రానా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్ తెలిపారు. "జన్మదిన శుభాకాంక్షలు సోదరా... నీ అందమైన మనస్సు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ" అంటూ రానా ప్రభాస్‌కు విషెస్ చెప్పారు. ప్రభాస్ తో కలిసి నవ్వులు చిందిస్తున్న ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. 'బాహుబలి' సినిమాలో ప్రభాస్-రానా పోటాపోటీగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మూడేళ్లకుపైగా కలిసి పనిచేసిన ఈ ఇద్దరు స్టార్స్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. బాహుబలిగా ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చిందో.. భల్లాలదేవగా రానాకు కూడా ప్రేక్షకులు అంతగానే ఫిదా అయ్యారు. -
బాహుబలిని దాటలేకపోయిన ‘అవెంజర్స్’
ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన భారీ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సిరీస్‌లో చివరి చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇండియాలోనూ భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగటం, సింగిల్ స్క్రిన్స్లోనూ పెద్ద సంఖ్యలో సినిమా రిలీజ్ కావటంతో రికార్డ్లను తిరగరాయటం ఖాయం అని భావించారు. ఒక దశలో భారత్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి 2 రికార్డును అవెంజర్స్ తుడిచేస్తుందన్న టాక్ వినిపించింది. అయితే బాహుబలి 2 రికార్డ్‌ను అవెంజర్స్ అందుకోలేకపోయింది. బాహుబలి 2 తొలి రోజు 63 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా అవెంజర్స్ మాత్రం 53 కోట్లతో సరిపెట్టుకుంది. శంకర్ తెరకెక్కించిన విజువల్ వంబర్ 2.ఓ 59 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. బాలీవుడ్ మూవీ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, కబాలి చిత్రాలు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. -
బాహుబలి-2 రికార్డు బద్ధలు
ఇండియన్ భాక్సాఫీస్ వద్ద బాహుబలి ది కంక్లూజన్ సృష్టించిన రికార్డులు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయి. హిందీతోపాటు విడుదలైన అన్ని భాషల్లోనూ బెంచ్ మార్క్ రికార్డులను క్రియేట్ చేసింది. అప్పటి నుంచి విడుదలైన చిత్రాలు భారీస్థాయిలో స్క్రీన్లలో రిలీజ్ చేసినప్పటికీ ఆ ఫీట్‌ను అందుకోలేకపోయాయి. అయితే ఎట్టకేలకు రీసెంట్ రిలీజ్ సంజు బాహుబలి-2 నెలకొల్పిన ఓ రికార్డును మాత్రం అధిగమించింది. ఈ చిత్రం ఆదివారం(మూడో రోజు) రూ. 46.71 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. అంతకు ముందు ఆ రికార్డు రూ.46.50 కోట్లతో బాహుబలి-2(హిందీ వర్షన్) పేరిట ఉంది. ఏదైతేనేం మొత్తానికి బాహుబలి-2కి చెందిన ఓ రికార్డును అధిగమించామని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించేస్తోంది. రాజ్‌కుమార్ హిరాణీ డైరెక్షన్లో రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్లో నటించిన సంజు కేవలం మూడు రోజుల్లోనే రూ. 120 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తొలిరోజ దాదాపు రూ.35 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది హయ్యెస్ట్ ఓపెనర్‌గా నిలవటంతోపాటు.. రణ్‌బీర్ కెరీర్ బెస్ట్ ఓపెనర్‌గా కూడా నిలిచింది. సాహోరే.. హైబ్రిడ్ పిల్లా -
సౌత్ ఫిలింఫేర్ అవార్డులు-2018
సాక్షి, హైదరాబాద్: దక్షిణ చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జియో ఫిలింఫేర్ అవార్డులు-2018 వేడుకల్లో బాహుబలి ది కంక్లూజన్ సత్తా చాటింది. 65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం గత సాయంత్రం(శనివారం) హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్ర పరిశ్రమల నటీనటులు ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలుగులో బాహుబలి-2 చిత్రం ఉత్తమ చిత్రంతోపాటు మొత్తం 8 విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. అర్జున్ రెడ్డికి చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ, క్రిటిక్స్ విభాగంలో వెంకటేష్ దగ్గుబాటి గురు చిత్రానికి, ఫిదా చిత్రానికిగానూ ఉత్తమ నటిగా సాయి పల్లవి, క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా రితికా సింగ్(గురు చిత్రానికి), దర్శకధీరుడు రాజమౌళికి బాహుబలి-2కి ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డులు దక్కాయి. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణకి జీవితకాల సాఫల్య పురస్కారం(లైఫ్ టైమ్ అచీవ్మెంట్) అవార్డు అందించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల అవార్డులను కేటగిరీలుగా పరిశీలిస్తే... తెలుగు ఉత్తమ చిత్రం - బాహుబలి 2 ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (బాహుబలి 2) ఉత్తమ నటుడు - విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి) ఉత్తమ నటి - సాయి పల్లవి (ఫిదా) ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - వెంకటేష్ (గురు సినిమా) ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - రితికా సింగ్ (గురు) ఉత్తమ సహాయ నటి - రమ్యకృష్ణ (బాహుబలి 2) ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (బాహుబలి 2) ఉత్తమ నటి (తొలి పరిచయం) - కల్యాణ్ ప్రియదర్శన్ (హలో) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్ కుమార్ (బాహుబలి 2) ఉత్తమ కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్ (ఖైదీ, ఫిదా) - అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు, వచ్చిండే ఉత్తమ గేయ రచయిత - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 - దండాలయ్యా సాంగ్) జీవితకాల సాఫల్య పురస్కారం - కైకాల సత్యనారాయణ ఉత్తమ నేపథ్య గాయకుడు - హేమ చంద్ర (ఫిదా - ఊసుపోదు సాంగ్) ఉత్తమ నేపథ్య గాయని - మధు ప్రియ (ఫిదా - వచ్చిండే సాంగ్) ఉత్తమ సంగీత దర్శకుడు - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (బాహుబలి 2) తమిళం (కోలీవుడ్) ఉత్తమ చిత్రం - అరమ్ ఉత్తమ దర్శకుడు - పుష్కర్ గాయత్రి (విక్రమ్ వేద) ఉత్తమ నటుడు - విజయ్ సేతుపతి (విక్రమ్ వేద) ఉత్తమ నటి - నయనతార (అరమ్) ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - మాధవన్ (విక్రమ్ వేద), కార్తీ (థీరమ్ అడిగరం ఒంద్రు) ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - అదితి బాలన్ (ఆరువి) ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వైరముత్తు (కాట్రు వెలియిదయ్ - వాన్ మూవీ) ఉత్తమ సహాయ నటి - నిత్యా మీనన్ ఉత్తమ సహాయ నటుడు - ప్రసన్న ఉత్తమ నేపథ్య గాయకుడు - అనిరుధ్ రవిచందర్ ఉత్తమ నేపథ్య గాయని - శశా తిరుపతి ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహ్మాన్ (మెర్సల్) ఉత్తమ తొలి నటుడు - వసంత్ రవి (తారామణి) మాలీవుడ్(మళయాళం) ఉత్తమ చిత్రం - తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్ ఉత్తమ దర్శకుడు - దిలీష్ పోతెన్ ఉత్తమ నటుడు - ఫహద్ ఫజిల్ ఉత్తమ నటి - పార్వతి (టేక్ ఆఫ్) ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - టొవినో థామస్ ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - మంజూ వారియర్ ఉత్తమ సహాయ నటి - శాంతి కృష్ణ ఉత్తమ సహాయ నటుడు - అలెన్సియెర్ ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - అన్వర్ అలీ (మిజియి నిన్ను మిజియిలెక్కు) ఉత్తమ నేపథ్య గాయకుడు - షాబాజ్ అమన్ ఉత్తమ నేపథ్య గాయని - కేఎస్ చిత్ర ఉత్తమ సంగీత దర్శకుడు - రెక్స్ విజయన్ (మాయనది) ఉత్తమ తొలిచిత్ర నటుడు - ఆంటోనీ వర్గీస్ (అంగామలి డైరీస్) ఉత్తమ తొలిచిత్ర నటి - ఐశ్వర్య లక్ష్మి కన్నడ(శాండల్‌వుడ్) ఉత్తమ చిత్రం - ఒందు మొట్టెయ కథె ఉత్తమ దర్శకుడు - తరుణ్ సుధీర్ (చౌక) ఉత్తమ నటుడు - రాజ్ కుమార ఉత్తమ నటి - శ్రుతి హరిహరన్ ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - ధనంజయ ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - శ్రద్ధా శ్రీనాథ్ ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వి. నాగేంద్ర ప్రసాద్ (అప్పా ఐ లవ్యూ - చౌక) ఉత్తమ సహాయ నటి - భవానీ ప్రకాశ్ ఉత్తమ సహాయ నటుడు - పి రవిశంకర్ ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్మాన్ మాలిక్ ఉత్తమ నేపథ్య గాయని - అనురాధ భట్ ఉత్తమ సంగీత దర్శకుడు - బీజే భరత్ -
సాహోరే.. హైబ్రిడ్ పిల్లా
సాక్షి, హైదరాబాద్: బాహుబలి సిరీస్ సృష్టించిన ప్రభంజనం తెలియంది కాదు. మరోవైపు ఫిదా చిత్రం టాలీవుడ్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. రెండూ కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించినవే. కలెక్షన్లపరంగా సంగతి పక్కనపెడితే మ్యూజిక్ పరంగా మాత్రం ఫిదానే ఎక్కువగా ఆకట్టుకుంది. ఇందుకు నిదర్శనంగా యూట్యూబ్‌లో ఓ రికార్డును ప్రస్తావిస్తున్నారు. బాహుబలి-2లోని టైటిల్ సాంగ్ సాహోరో బాహుబలి పాట కన్నా ఫిదాలోని వచ్చించే సాంగ్ ఎక్కువగా వ్యూవ్స్ రావటం విశేషం. సాహోరే సాంగ్ 11 నెలల్లో సాధించిన వ్యూవ్స్‌ను వచ్చిండే సాంగ్ 7 నెలల్లోనే దాటేసింది. బాహుబలి ది కంక్లూజన్‌కి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించగా.. ఫిదాకు శక్తికాంత్ సంగీతం అందించారు. హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి చేసిన మ్యాజిక్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ స్క్రీన్ షాట్లతో హల్ చల్ చేస్తున్నారు. -
సాహోరే సాంగ్ కన్న వచ్చించే సాంగ్ ఎక్కువ వ్యూవ్స్
-
నువ్వు ఆగు మిత్రమా.. నేను వెళతాను..!!
సాక్షి, హైదరాబాద్ : బాహుబలి-ది కంక్లూజన్ పార్ట్‌కు చైనీయులు ఫిదా అయిపోయారు. హీరో ప్రభాస్‌ను ఏకంగా హాలీవుడ్ స్టార్స్‌తో పోల్చుతూ ఓ చైనీయుడు చేసిన పోస్టు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ పాంథర్‌ను కలిసిన ప్రభాస్.. తాను ముందు వెళ్తానని ఆపుతున్నట్లు, శత్రువును చీల్చిచెండాటానికి వెళ్తున్న ఎవెంజర్స్ సీరియస్‌గా చూస్తుంటే.. ప్రభాస్ మాత్రం చిరునవ్వుతో శత్రువును చూస్తున్నట్లు ఫొటోషాప్ చేసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 4వ తేదీన బాహుబలి 2ను చైనాలో విడుదల చేశారు. 10 తేదీ వరకూ చిత్రం రూ. 68 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు తెలిసింది. అయితే, చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాలకు భారీ దూరంలోనే ప్రభాస్ ఉన్నాడని చెప్పుకోవాలి. చైనాలో దంగల్, సిక్రెట్ సూపర్ స్టార్, బజరంగీ భాయిజాన్, హిందీ మీడియం, పీకే చిత్రాలు వరుసగా అత్యధిక వసూళ్లు రాబట్టాయి. -
రాజమౌళికి బిగ్ షాక్
దర్శక ధీరుడు రాజమౌళికి ఊహించని షాక్ తగిలింది. బాహుబలి-2 చైనా వర్షన్ దారుణమైన ఫలితాన్ని రాబడుతోంది. ఇప్పటిదాకా కనీసం రూ. 100 కోట్లు కూడా వసూలు చేయకపోవటం విశేషం. అమీర్ ఖాన్ దంగల్ చిత్రం చైనాలో రూ. 1200 కోట్లు వసూలు చేయగా(ఫుల్ రన్లో).. ఇక్కడ యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చిత్రం సైతం రూ. 700 కోట్లు రాబట్టడం గమనార్హం. అంతెందుకు బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై విజయం సాధించిన హిందీ మీడియం కూడా చైనాలో రూ. 200 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బాహుబలి-2 కూడా మంచి వసూళ్లనే రాబడుతుందని రిలీజ్‌కు ముందు మేకర్లు భావించారు. బాహుబలి మొదటి భాగం ఫలితం తేడా కొట్టడంతో జాగ్రత్త పడ్డ జక్కన్న హాలీవుడ్ టెక్నీషియన్ విన్సెంట్ టబైల్లాన్ను రంగంలోకి దించారు. విన్సెంట్(ది ఇన్క్రిడబుల్ హల్క్, క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ చిత్రాల ఫేమ్) ఎడిటింగ్ వర్క్‌తో చిత్రం బాహుబలి-2 ష్యూర్ హిట్ అని అంతా భావించారు. కానీ, సీన్ ఇప్పుడు పూర్తిగా రివర్స్ కావటంతో ఖంగుతినటం రాజమౌళి అండ్ నిర్మాతల వంతు అయ్యింది. మే 4వ తేదీన 7 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజైన బాహుబలి-2.. మంగళవారం వరకు చిత్రం రూ.63 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పటిదాకా వచ్చిన వసూళ్లతో త్రీ ఇడియట్స్, ధూమ్-3 చిత్రాల వసూళ్లను మాత్రం అధిగమించింది. కాగా, ఎస్ ఎస్ రాజమౌళి సృష్టించిన కళాఖండం బాహుబలి సిరీస్ ఇండియాలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. భారత బాక్సాఫీస్ వద్ద వేగంగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన చిత్రంగా బాహుబలి ది కంక్లూజన్ రికార్డు సృష్టించింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 18 వందల కోట్లు వసూళ్లు చేసింది. హిందీ వర్షన్ ఇండియాతోపాలు విదేశాల్లోనూ భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ మధ్యే బాహుబలి-2 జపాన్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. #Baahubali2 continues to struggle... Remains on the lower side in CHINA... Fri $ 2.43 mn Sat $ 2.94 mn Sun $ 2.30 mn Mon $ 0.89 mn Tue $ 0.82 mn Total: $ 9.38 mn [₹ 63.19 cr] — taran adarsh (@taran_adarsh) 9 May 2018 -
ప్చ్: చైనాలో బాహుబలి-2 కలెక్షన్లు కూడా..!
దర్శకదీరుడు రాజమౌళి దృశ్యకావ్యం ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ భారీ అంచనాలతో చైనాలో విడుదలైంది. బాహుబలి మొదటి పార్టు చైనాలో ఫెయిల్ కావడంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని.. చిత్రబృందం పొరుగుదేశంలో గతవారం ఈ సినిమాను విడుదల చేశారు. చైనీయుల అభిరుచికి తగినట్టు మార్పులు చేసినప్పటికీ.. బాహుబలి-2 సినిమా అక్కడి సినీ ప్రేమికులను ఆకట్టుకోలేకపోయింది. తొలిరోజు ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. దీంతో చైనాలోనూ బాహుబలి ప్రభంజనం ఖాయమని భావించారు. కానీ, ఆ తర్వాతి రోజుల్లో ప్రేక్షకులను థియేటర్ల వైపునకు రప్పించడంలో ఈ సినిమా విఫలమైంది. మొత్తంగా మొదటి మూడురోజుల్లో బాహుబలి-2 రూ. 51.20 కోట్లు వసూలు చేసిందని తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. గతంలో మొదటి వీకెండ్లో ఆమిర్ ఖాన్ సీక్రెట్ సూపర్‌స్టార్ రూ. 173.82 కోట్లు వసూలుచేస్తే.. ఇర్ఫాన్ ఖాన్ హిందీ మీడియం సినిమా రూ. 102.18 కోట్లు రాబట్టింది. కానీ బాహుబలి-2 మాత్రం మొదటివారంలో ఆశించినంత వసూళ్లు రాబట్టలేకపోయింది. ‘చైనాలో బాహుబలి-2 ఆశించినంత వసూళ్లు రాబట్టడం లేదు. శుక్రవారం 2.43 మిలియన్ డాలర్లు రాబట్టిన ఈ సినిమా శనివారం 2.92 మిలియన్ డాలర్లు, ఆదివారం 2.26 మిలియన్ డాలర్లు.. మొత్తంగా 7.63 మిలియన్ డాలర్లు (రూ. 51.20 కోట్లు) వసూలు చేసింది’ అని తరణ్ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన బాహుబలి 2 ఈ శుక్రవారం చైనాలో భారీగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి తొలి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో రెండో భాగం విషయంలో చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాను మరోసారి ఎడిటింగ్ చేయించారు. అంతేకాదు ఏకంగా 7వేలకు పైగా స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేశారు. బాహుబలి నిర్మాతలు తీసుకున్న జాగ్రత్తలు తొలిరోజు ఫలించినట్టు కనిపించినా.. ఆ తర్వాత మాత్రం కలెక్షన్లు ఊపందుకోలేదు. అయితే, బాహుబలి తొలి భాగం చైనాలో ఫుల్ రన్లో సాధించిన 1.18 మిలియన్ డాలర్ల కలెక్షన్లను.. బాహుబలి 2 తొలి రోజే సాధించింది. -
బాహుబలి లైఫ్ టైం వసూళ్లు ఒక్క రోజులోనే..!
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన బాహుబలి 2 ఈ శుక్రవారం చైనాలో భారీగా రిలీజ్ అయ్యింది. బాహుబలి తొలి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో రెండో భాగం విషయంలో చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాను మరోసారి ఎడిటింగ్ చేయించారు. అంతేకాదు ఏకంగా 7వేలకు పైగా స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేశారు. బాహుబలి నిర్మాతలు తీసుకున్న జాగ్రత్తలు బాగానే ఫలించినట్టున్నాయి. బాహుబలి 2 తొలి రోజు 2.85 మిలియన్ డాలర్లు (19 కోట్లు) కలెక్ట్ చేసింది. కేవలం తొలి షోతోనే మిలియన్ మార్క్‌ను అందుకొని సత్తా చాటింది. బాహుబలి తొలి భాగం చైనాలో ఫుల్ రన్లో సాధించిన 1.18 మిలియన్ డాలర్ల కలెక్షన్లను.. బాహుబలి 2 తొలి రోజే సాధించటం విశేషం. అంతేకాదు చైనాలో ఘనవిజయం సాధించిన దంగల్, భజరంగీ బాయ్‌జాన్ సినిమాల తొలి రోజు కలెక్షన్ రికార్డ్లను సైతం చెరిపేసిన బాహుబలి 2, అక్కడ తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో వరుసగా ఆమిర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్, ఇర్ఫాన్ ఖాన్ హిందీ మీడియం సినిమాలు ఉన్నాయి. -
‘బాహుబలి 2’ భారీ రిలీజ్
తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది బాహుబలి 2. దాదాపు అన్ని భాషల్లో టాప్ గ్రాసర్‌గా చరిత్ర సృష్టించింది ఈ సినిమా. ఓవర్సీస్ లో కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన బాహుబలి 2 ఈ శుక్రవారం చైనాలో రిలీజ్ అవుతోంది. చైనాలోని ఐమాక్స్ స్క్రీన్స్ మీద రిలీజ్ అవుతున్న తొలి భారతీయ సినిమాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్న బాహుబలి 2కు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమా చైనాలో 7000లకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. దంగల్ సినిమా 7000 వేల స్క్రీన్స్ మీదే రిలీజ్ కాగా బాహుబలి అంతకు మించి భారీ స్థాయిలో విడుదలవుతోంది. దంగల్ రికార్డ్‌ను చెరిపేసిన బాహుబలి 2.. 8000 స్క్రీన్లపై రిలీజ్ అయిన భజరంగీ బాయ్‌జాన్ రికార్డ్‌ను మాత్రం దాటలేకపోయింది. బాహుబలి తొలి భాగం చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరి బాహుబలి 2 అయినా సత్తా చాటుతుందేమో చూడాలి. -
ఈ రోజు నాకెప్పటికీ ప్రత్యేకమే : ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ బాహుబలి. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సిరీస్‌లో రెండో భాగం రిలీజ్ అయిన ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు ప్రభాస్. ‘మా సినిమా బాహుబలి 2 విడుదలై ఏడాది పూర్తయ్యింది. ఈ రోజు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. నా అందమైన, భావోద్వేగ ప్రయాణంలో భాగమైనందకు కృతజ్ఞతలు. దర్శకుడు రాజమౌళికి, బాహుబలి చిత్రయూనిట్ కు నా కృతజ్ఞతలతో పాటు శుభాకాంక్షలు’ అంటూ తన ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా పనుల్లో బిజీగా ఉండగా రాజమౌళి బాహుబలి 2 సినిమాను జపాన్‌లో ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి జపాన్ పర్యటనలో ఉన్న జక్కన్న అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మే 4 బాహుబలి 2ను చైనాలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ లు ఇతర కీలక పాత్రలో నటించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. -
చైనాలో ‘బాహుబలి 2’ రికార్డ్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించటమే కాదు ప్రపంచ దేశాల్లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ఇటీవల జపాన్ లో రిలీజ్ అయిన బాహుబలి 2కి అక్కడి ప్రజలు ఘనవిజయాన్ని అంధించారు. మే 4న ఈ సినిమా చైనాలోనూ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. బాహుబలి 1.. చైనాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో రెండవ భాగం విషయంలో మరింత శ్రద్ధ తీసుకొని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే హాలీవుడ్ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో బాహుబలి 2 సినిమాను చైనా రిలీజ్ కోసం రీ ఎడిట్ చేసి సిద్ధం చేశారు. బాహుబలి 2 చైనాలో సరికొత్త రికార్డ్‌ను సొంతం చేసుకోనుంది. చైనాలోని ఐమాక్స్ స్క్రీన్స్ మీద రిలీజ్ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా బాహుబలి 2 రికార్డ్ సృష్టించనుంది.మరి బాహుబలి ఈ సారైన చైనా బాక్సాఫీస్‌ను కొల్లగొడతాడేమో చూడాలి. Pleased that @BaahubaliMovie 2 will be the first Indian film to have an @IMAX release in China on May 4th. It's big but very tough market to crack. Hoping for the best! — Shobu Yarlagadda (@Shobu_) 26 April 2018 -
చైనాలో బాహుబలి-2.. రిలీజ్ డేట్ ఫిక్స్!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన భారీ ప్రాజెక్టు బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగానే విదేశాల్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టించింది. 'బాహుబలి 2: ది కంక్లూజన్' చైనాలో విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేశారు. మే 4న చైనా ప్రేక్షకులు థియేటర్లలో బాహుబలి రెండో భాగాన్ని చూడబోతున్నారంటూ కథనాలు కొన్ని రోజులుగా వస్తున్న విషయం విదితమే. చైనాలో విడుదల కోసం మూవీ యూనిట్ ఎడిటింగ్ నిమిత్తం హాలీవుడ్ ఎడిటర్ విన్సెంట్ టబైల్లాన్ను తీసుకున్నారు. ఎడిటింగ్ చేయడంలో విన్సెంట్ నిపుణుడు. 'ది ఇన్క్రిడబుల్ హల్క్', 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్' చిత్రాలకు పనిచేశాడు. బాహుబలి రెండో భాగం చైనాలో విజయవంతం అవుతుందని రాజమౌళి అండ్ కో ధీమాగా ఉన్నారు. ఇటీవల బాహుబలి 2 జపాన్‌లో విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. హౌస్‌ఫుల్ కలెక్షన్లు సాధిస్తున్న ‘బాహుబలి 2’ మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసి దూసుకుపోతోంది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి 2 హవా ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. -
రాజమౌళికి మహేష్ శుభాకాంక్షలు
బాహుబలి 2 సినిమా జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగును అంతర్జాతీయ స్థాయికి చేర్చిన దర్శక ధీరుడు రాజమౌళిని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆకానికెత్తేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రాజమౌళికి, బాహుబలి టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఘనవిజయం సాధించినందుకు శుభాకాంక్షలు. మీ సినిమా బాహుబలి భారతీయ సినీచరిత్రలో ఓ మైలురాయి. మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కేయల్ నారాయణ ఈ కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించేందుకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు. Congratulations @ssrajamouli for the massive win at the #NationalAwards2018. Your film, Baahubali is an important landmark in Indian cinema. We are all very proud of you. — Mahesh Babu (@urstrulyMahesh) 14 April 2018 -
జపాన్ బాక్సాఫీస్ బద్దలు కొట్టిన బాహుబలి
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన భారీ చిత్రం బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించటమే కాదు ప్రపంచ దేశాల్లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ఇటీవల జపాన్ లో రిలీజ్ అయిన బాహుబలి అక్కడి ప్రజలు ఘనవిజయాన్ని అంధించారు. బాహుబలి సినిమాలో క్యారెక్టర్స్‌కు ఫిదా అయిన జపాన్ ప్రజలు థియేటర్లలో ఆ పాత్రల వేశధారణలో సందడి చేశారు. తాజాగా బాహుబలి 2 జపాన్ లో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతున్న ‘బాహుబలి 2’ వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు బాహుబలి 2లోని సాహోరే పాట యూట్యూబ్ లో 100 మిలియన్ల (పదికోట్ల) వ్యూస్ సాధించింది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ అయిన బాహుబలి 2 హవా ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. -
బాహుబలి-2ని క్రాస్ చేసిన స్పైడర్!
సాక్షి, చెన్నై : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది తెలిసిందే. ద్విబాషా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో తమిళ వాసనలు ఎక్కువైపోవటంతో, హీరోయిజాన్ని దర్శకుడు తక్కువగా ఎలివేట్ చేయటంతో ఫ్యాన్స్ సైతం పెదవి విరిచారు. అయితే ఈ చిత్రంలో కోలీవుడ్‌లో ఇప్పుడు ఓ రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం బుల్లితెరపై ప్రదర్శించగా.. 10.4 రేటింగ్ సాధించింది. గతంలో బాహుబలి ది కంక్లూజన్ తమిళ వర్షన్‌కు అక్కడ 10.33 రేటింగ్ దక్కింది. దీంతో మహేష్ స్పైడర్ బుల్లితెరపై బాహుబలి-2 టీఆర్పీని దాటేసినట్లయ్యింది. మురుగదాస్ దర్శకుడు కావటం, సూర్య విలన్, మహేష్ క్రేజ్ మూలంగానే ఈ ఘనత సాధించినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇదయదళపతి విజయ్ మెర్సల్ చిత్రంతో పోలిస్తే ఈ రెండు చిత్రాలు అత్యధిక టీఆర్పీ సాధించినట్లు కోలీవుడ్ మీడియా వెల్లడించటం ఇక్కడ మరో విశేషం. -
హర్రర్ చిత్రంలో సత్యరాజ్
కోలీవుడ్‌లో హర్రర్ కథా చిత్రాల ట్రెండ్ చాలా కాలంగానే కొనసాగుతోంది. ఇందుకు కారణం ప్రేక్షకుల ఆదరణే అని చెప్పవచ్చు. ఇకపోతే దక్షిణ భారతీయ సినిమాలో ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి ఆ పాత్రకు జీవం పోసే నటుడు సత్యరాజ్. ఈ మధ్య బాహుబలి చిత్రంతో తన పేరును దేశ వ్యాప్తంగా ఇనుమడింపజేసుకున్న ఈయన తాజాగా హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంలో ప్రధాన పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని కళ్లపడం చిత్ర ఫేమ్ వేల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ పాత్రలకు నప్పే నటులను ఎంపిక చేసుకోవడం చిత్రానికి చాలా ముఖ్యం అని తాను భావిస్తానన్నారు. ఆ విధంగా తాజా చిత్రానికి సత్యరాజ్ నటించడానికి ఒప్పుకోవడంతో సగం పని తగ్గిందని అన్నారు. ఇది ఒక ఎఫ్ఎం రేడియో స్టూడియో నేపథ్యంలో సాగే సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఒక రాత్రి ఎఫ్ఎం.రేడియో స్టూడియోలో జరిగిన సంఘటన ఇతివృత్తంగా చిత్రం ఉంటుందన్నారు. దీన్ని ఒక ఎఫ్ఎం స్టూడియోలోనే చిత్రీకరించనున్నట్లు తెలిపారు. ఒక నూతన నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని, ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చెప్పారు. హర్రర్ కథా చిత్రాల్లో ఈ చిత్రం వైవిధ్యభరితంగా ఉంటుందని దర్శకుడు వేల్ పేర్కొన్నారు. ఇంకాపేరు నిర్ణయించని ఈ సినిమా ఉత్కంఠ భరిత సన్నివేశాలతో అన్ని వర్గాలను అలరించే చిత్రంగా ఉంటుందని అన్నారు. -
బాహుబలి.. ఓ పాఠం!
‘బాహుబలి’ సినిమా ఖాతాలో మరో రికార్డు చేరింది. అదేంటంటే.. ‘బాహుబలి’ సినిమా సక్సెస్‌ను పాఠంగా చెప్పబోతున్నారు. ఈ చిత్ర విజయాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎమ్ఎ) ఓ కేస్ స్టడీగా తీసుకుని, పరిశోధన చేయనున్నట్లు అక్కడి ప్రొఫెసర్ భరతన్ కందస్వామి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ– ‘‘సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి’ చక్కని మార్కెటింగ్ స్ట్రాటజీతో మంచి వసూళ్లు రాబట్టింది. సీక్వెల్స్ తీస్తున్నప్పుడు ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయితే రెండో పార్ట్‌కి పబ్లిసిటీ ఈజీగా వస్తుంది. మార్కెటింగ్ సులువు అవుతుంది. ప్రధానంగా నేను సీక్వెల్స్ నిర్మాణం, మార్కెటింగ్ మంత్ర, కలెక్షన్స్ మీద దృష్టి పెట్టబోతున్నాను. ఈ విషయాల్లో అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులకు డిజిటల్ మార్కెట్ గురించి కూడా చెబుతాం. సినిమా ఇండస్ట్రీ గురించి అన్ని కోణాల నుంచి విద్యార్థులకు తెలియజేయనున్నాం.అందుకే సక్సెస్ సాధించిన ‘బాహుబలి’ సినిమాను ఓ కేస్ స్టడీగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి’ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ముఖ్య తారలుగా నటించిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచింది. -
త్వరలో జపాన్‌లో ‘బాహుబలి 2’ రిలీజ్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా సత్తా చాటిన ఈ భారీ చిత్రం త్వరలో ఓవర్ సీస్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో భారీ వసూళ్లు సాధించగా ముందు ముందు మరిన్ని దేశాల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు చిత్రయూనిట్. ఈ నెల 29న బాహుబలి 2 జపాన్ లో భారీగా రిలీజ్ అవుతోంది. జపనీస్ భాషలో డబ్ చేసి భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు జపాన్ సెన్సార్ బోర్డ్ ‘జీ’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. మన సెన్సార్ బోర్డ్ అందించే క్లీన్ యు సర్టిఫికేట్ కు ఇది సమానం. త్వరలోనే కొరియా, చైనా తో పాటు ఇతర ఆసియా దేశాల్లో బాహుబలి 2 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
యూట్యూబ్ వ్యూస్ లో బాహుబలి 2 రికార్డ్
భారతీయ సినిమా చరిత్రలోని అన్ని రికార్డ్ లను తిరగరాసిన తెలుగు సినిమా బాహుబలి 2 హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్కలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాహుబలి 2 సంచలన విజయం సాధించటమే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులతో పాటు భారీ వసూళ్లను కూడా సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిన బాహుబలి 2, 2017 యూట్యూబ్ లోనూ రికార్డ్ సృష్టించింది. 2017లో అత్యధిక మంది వీక్షించిన సినిమా ట్రైలర్ల జాబితాలో బాహుబలి 2 సినిమా రెండో స్థానంలో నిలిచింది. 9 కోట్ల 10 లక్షలకుపైగా వ్యూస్ సాధించి హాలీవుడ్ సినిమా అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ తొలి స్థానంలో నిలవగా 8 కోట్లకుపైగా వ్యూస్ తో బాహుబలి 2 ట్రైలర్ రెండో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు ఇన్ క్రెడిబుల్స్ 2, థోర్ : రాగ్నరాక్ బాహుబలి 2 తరువాతి స్థానాల్లో నిలవగా బాలీవుడ్ సినిమాలు టైగర్ జిందాహై, పద్మావతి చిత్రాల ట్రైలర్లు 5 కోట్లకు పైగా వ్యూస్ సాధించాయి. -
ప్చ్... బాహుబలిని మాత్రం బీట్ చెయ్యట్లేదు!
సాక్షి, సినిమా : బాలీవుడ్‌కు ఎట్టకేలకు కాస్త ఊరట లభించింది. ఈ యేడాది రెండు వందల కోట్లు వసూలు చేసిన తొలి హిందీ చిత్రంగా గోల్మాల్ అగెయిన్ నిలిచింది. ఆదివారం వసూళ్లతో ఈ మార్క్ చేరుకుందని సినీ ట్రేడ్ విశ్లేషకుడు తరన్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలియజేశారు. తద్వారా వరుణ్ ధావన్ నటించిన జుద్వా-2 చిత్రాన్ని వెనక్కి నెట్టి గోల్మాల్ అగెయిన్ రెండో స్థానంలో నిలిచింది. ఇక 500 కోట్లకు పైగా వసూళ్లతో బాహుబలి ది కంక్లూజన్ మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. డబ్బింగ్ చిత్రంగా విడుదలైన బాహుబలి-2 ఎవరూ ఊహించని రేంజ్లో ప్రభంజనం సృష్టించగా... తర్వాత వచ్చిన సల్మాన్ ట్యూబ్‌లైట్, షారూఖ్ జబ్ హ్యారీ మెట్ సెజల్, అక్షయ్ కుమార్ టాయ్ లెట్ చిత్రాలు మ్యాజిక్ చేస్తాయని భావించినప్పటికీ అది జరగలేదు. దీంతో ఈ యేడాది కనీసం రెండు వందల కోట్ల క్లబ్లో కూడా ఏ చిత్రం చేరదేమోనని అంతా భావించారు. అయితే దీపావళికి రిలీజ్ అయిన గోల్మాల్ అగెయిన్‌కు అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్‌స్టార్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా 3500 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం.. విదేశాల్లో 732 స్క్రీన్లలో రిలీజ్ అయి 46 కోట్లు రాబట్టింది. అజయ్ దేవగన్, టబు, పరిణితీ చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భారీ యాక్షన్ చిత్రాన్ని దర్శకుడు రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి 200 కోట్లు రాబట్టి ఈ యేడాది ఇప్పటిదాకా హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది. ఇక ఇప్పుడు అందరి కళ్లు సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి చిత్రంపైనే ఉన్నాయి. -
బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసిన సల్మాన్
ఇటీవల వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో పడ్డ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టైగర్ జిందాహై. గతంలో ఘనవిజయం సాధించిన ఏక్తా టైగర్ కు సీక్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ నెలాఖరున రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ ట్రైలర్ గత చిత్రాల డిజిటల్ రికార్డులన్నింటినీ చెరిపేస్తూ దూసుకుపోతోంది. తాజాగా యూట్యూబ్‌లో అత్యధిక లైక్‌లు సాధించిన భారతీయ చిత్ర ట్రైలర్‌గా రికార్డ్ సృష్టించింది టైగర్ జిందాహై. గతంలో ఐదున్నర లక్షల లైకులతో బాహుబలి 2 ట్రైలర్ పేరిట ఉన్న రికార్డ్‌ను 7 లక్షలకు పైగా లైకులతో టైగర్ జిందాహై ట్రైలర్ బ్రేక్ చేసింది. అంతేకాదు ఇప్పటికే మూడు కోట్ల వ్యూస్‌కు చేరువలో ఉన్న ఈ ట్రైలర్, త్వరలో అత్యధిక వ్యూస్ సాదించిన ట్రైలర్‌గా కూడా రికార్డ్ సృష్టింస్తుందని భావిస్తున్నారు. సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు, యష్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ట్రైలర్ల లిస్ట్ లో బాహుబలి, ట్రైగర్ జిందాహైలు ముందున్నా.. తమిళ సినిమా ‘మెర్సల్’ టీజర్ 10లక్షలకు పైగా లైకులు సాదదించి ఎవరికీ అందని స్థాయిలో నిలిచింది. -
'ఇంతకన్నా గొప్ప ఆదివారం రాదు'
బాహుబలి 2 సినిమా వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా సంచలనాలు నమోదు చేస్తుందని చిత్రయూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. అందుకే ఒకేసారి మూడు భాషల్లో టీవీ ప్రసారానికి రంగం సిద్ధం చేసింది. ఎలాంటి పండుగ సీజన్ కాకపోయినా.. బాహుబలి ప్రదర్శనే ఓ పండుగు అన్నట్టుగా ప్రచారం చేశారు చిత్రయూనిట్. ఆదివారం (08-10-2017) హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రెండు గంటల తేడాతో సినిమాను ప్రసారం చేయనున్నారు.స ఈ ప్రీమియర్స్ షోస్ పై హీరో ప్రభాస్ ఆసక్తికరంగా స్పందించాడు. తన ఫేస్ బుక్ పేజ్ లో బాహుబలి 2 సినిమాను టీవీలో చూసి ఆనందించాలని కోరిన ప్రభాస్, ఇంతకంటే గొప్ప ఆదివారం రాదంటూ కామెంట్ చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్లకు పైగా వసూళ్లు సాదించి సంచలనం సృష్టించింది. -
ఓవర్సీస్ రికార్డ్: బాహుబలి, ధూమ్ తరువాత స్పైడరే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ స్పైడర్. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఓవర్ సీస్ లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ ప్రారంభమయ్యాయి. అమెరికాలో తెలుగు, తమిళ భాషల్లో కలిపి మూడు వందలకు పైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఓవర్ సీస్ లో ప్రీమియర్ షోస్ తోనే స్పైడర్ పది లక్షల డాలర్లు వసూళు చేసినట్టుగా ఫోర్బ్స్ సంస్థ ఓ వార్తలో పేర్కొంది. వారాంతంలో కాకుండా వీక్ డేస్ లో రిలీజ్ అయి ఈ ఫీట్ సాధించిన మూడో భారతీయ చిత్రంగా స్పైడర్ రికార్డ్ సృష్టించింది. స్పైడర్ కన్నా ముందు ధూమ్ 3, బాహుబలి 2 సినిమాలు మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. ఇప్పటికే తొలివారం అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవటంతో తొలివారాంతనికి స్పైడర్ మరిన్ని రికార్డ్ లు బద్ధలు కొడుతుందని భావిస్తున్నారు. -
భారత్ నుంచి ఆస్కార్ బరిలో 'న్యూటన్'
ఈ ఏడాది ఆస్కార్ బరిలో విదేశీ చిత్రం కేటగిరిలో పోటి పడబోయే భారతీయ చిత్రాన్ని ప్రకటించారు. బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావు లీడ్ రోల్ లో తెరకెక్కిన న్యూటన్ సినిమా ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో పోటికి పంపనున్నారు. ఈ మేరకు జ్యూరీ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 26 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ చివరకు న్యూటన్ ను ఎంపిక చేసింది. తెలుగు నుంచి బాహుబలి 2తో పాటు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలను కూడా పరిశీలించినట్టుగా జ్యూరీ చైర్మన్ సీవీ రెడ్డి తెలిపారు. -
బాహుబలి 2 ఇంకా చూడలేదు: సూపర్ స్టార్
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేసిన బాహుబలి సినిమాపై టాలీవుడ్ బాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురించినా.. బాలీవుడ్ ఖాన్ లు మాత్రం పెద్దగా స్పందించిన సందర్భాలు లేవు. సల్మాన్, షారూఖ్ లాంటి స్టార్ గతంలో బాహుబలి రిజల్ట్ పై స్పందించారు. ఏదో మొక్కుబడి బాహుబలి ఇంకా చూడలేదు.. కానీ మంచి టాక్ సొంతం చేసుకోవటం ఆనందంగా ఉందంటూ కామెంట్ చేశారు. తాజాగా మరో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఇలాగే స్పందించాడు. ప్రస్తుతం తానే స్వయంగా నటిస్తూ నిర్మించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆమిర్, బాహుబలి సినిమా ఇంకా చూడలేదని తెలిపాడు. సినిమా రిలీజ్ అయి 100 రోజులు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో ఆమిర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బాహుబలి 2 హిందీ వర్షన్ 500 కోట్లకు పైగా వసూళు చేసింది కథ, ఆ సినిమా కలెక్షన్లు చూస్తూ మీకు భయం వేయటం లేదా అన్న ప్రశ్నకు 'బాహుబలి 2 రిజల్ట్ తో మన హిందీ సినిమా స్థాయి ఏంటనేది మనకు తెలిసింది. ఇంకా మంచి సినిమాలు తీయాలి. అలాగే బాహుబలి 2 అంతటి ఘనవిజయం సాధించటం ఆనందంగా ఉంది. కాని నేను ఇంకా సినిమాను చూడలేదు. త్వరలోనే చూస్తాను' అంటూ కామెంట్ చేశాడు. -
'నా సినిమాను బాహుబలి 2 మింగేసింది'
ముంబయి: తన సినిమా బిజినెస్‌ను బాహుబలి 2 మింగేసిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా అన్నారు. తన చిత్రం మేరి ప్యారీ బిందు బాక్సాపీస్ వద్ద రాబట్టిన వసూళ్లు చిత్రంపై ప్రేక్షకులు ప్రతిస్పందనవంటి విషయాలను ఆయన వద్ద ప్రస్తావించగా ఆయన పై విధంగా స్పందించారు. 'నా చిత్రానికి నా కుటుంబం నుంచి మిత్రుల నుంచి ప్రేక్షకుల నుంచి భిన్న స్పందన వచ్చింది. కొంతమంది నచ్చిందని చెప్పారు. కొంతమంది నచ్చలేదని చెప్పారు. ఏదేమైనా వ్యాపారపరంగా నా సినిమాపై బాహుబలి 2 ప్రభావం కొద్దిగా పడిందనే చెప్పగలను. నా సినిమా విడుదలయ్యే సమయానికి థియేటర్లలో బాహుబలి 2 లేకుంటే కచ్చితంగా నా సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టేది. నా చిత్ర బిజినెస్‌ను బాహుబలి 2 మింగేసింది' అని ఆయన తెలిపారు. బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల కాగా మేరి ప్యారీ బిందు మాత్రం మే నెలలో విడుదలైంది. -
విదేశాల్లో బాహుబలి కలెక్షన్లు ఎంతో తెలుసా..
న్యూఢిల్లీ: బాహుబలి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. హాలీవుడ్ దర్శకులు సైతం సాహో అనే విధంగా బాహుబలిని రాజమౌళి తెరకెక్కించారు. అది సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. రికార్డులు అన్నీ తిరగ రాసింది. ఇప్పడు ఏ రికార్డైనా నాన్-బాహుబలి రికార్డుగా చెప్పకుంటున్నారంటే అది సృష్టించిన సంచలనం అలాంటింది. దేశ విదేశాల్లో రికార్డులు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల బెంచ్ మార్కును దాటిన చిత్రంగా బాక్సాఫీసు వద్ద కొత్త ఫీట్‌ను సృష్టించింది. ఇప్పుడు తాజాగా మరో రికార్డు బాహుబలి ఒడిలో చేరింది. బాక్సాఫీస్ ఇండియా తాజా రిపోర్టు ప్రకారం బాహుబలి-2 విదేశాల్లో రూ.801 కోట్లు వసూలు చేసింది. ఇది ఏభారతీయ చిత్రం ఇప్పటివరకూ చేరుకోలేని రికార్డు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రష్యాలో ఏర్పాటు చేసిన 39వ అంతర్జాతీయ సినీ ఫెస్టివల్లో మొదటిసారి ఇండియన్ పనోరమ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. బ్యాడ్‌మ్యాన్, ఎ డెత్ ఇన్ ద గంజ్, బేయార్, యూటర్న్, కోతనోడి చిత్రాలతోపాటు బాహుబలి సిరీస్‌ను కూడా ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. -
ప్రభాస్‌తో కరణ్ భారీ డీల్..?
బాహుబలి సినిమాతో ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా ఎదిగాడు. తొలి భాగం రిలీజ్ అయిన తరువాత పలు బాలీవుడ్ సినిమాల్లో ప్రభాస్‌కు ఆఫర్లు వచ్చాయి. అయితే బాహుబలి పూర్తయితే గాని ఇతర సినిమాలు అంగీకరించకూడదని నిర్ణయం తీసుకున్న ప్రభాస్, అన్నింటిని రిజెక్ట్ చేశాడు. రెండో భాగం రిలీజ్ తరువాత ప్రభాస్ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్లో బాహుబలి 2 సృష్టిస్తున్న సంచలనాలతో అక్కడి నిర్మాతలు కూడా ప్రభాస్ డేట్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అదే సమయంలో బాహుబలి సినిమాకు బాలీవుడ్ సమర్పకుడిగా వ్యవహరించిన కరణ్ జోహర్, ప్రభాస్‌తో స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఒకేసారి రెండు, మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకునేలా ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్నాడట. గతంలో బాహుబలి 2 సక్సెస్ పార్టీ ఇచ్చాడు కరణ్. కానీ ఆ సమయంలో ప్రభాస్ విదేశాల్లో ఉండటంతో ఆ పార్టీలో పాల్గొనలేదు. అందుకే ఇటీవల ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఓ పార్టీ ఇచ్చాడు కరణ్. ఈ పార్టీలోనే ప్రభాస్‌తో వరుసగా సినిమాలు చేసేందుకు చర్చించాడట. ప్రభాస్ కూడా కరణ్‌తో డీల్‌కు సుముఖంగానే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. -
పెరోల్‌పై వచ్చి బాహుబలి 2 చూసి జంపయింది
అహ్మదాబాద్: పైకి చూడటానికి ఆమె ఒక సన్యాసి. పేరు జై శ్రీ గిరి. ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతూ ఓ ఆలయాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది తొలి రోజుల్లో (జనవరిలో) గుజరాత్ పోలీసులు ఆమె ఆశ్రయంపై దాడులు నిర్వహించగా బిత్తరపోయే విషయాలు వెలుగుచూశాయి. పెద్ద మొత్తంలో అక్రమ మార్గంలో బంగారం కొనుగోలు చేసి అడ్డంగా దొరికిపోయింది. తన ఆశ్రమంలో కోట్ల విలువైన బంగారు బిస్కెట్లతోపాటు మద్యం సీసాలు కూడా పెద్ద మొత్తంలో లభించాయి. దీంతో ఆమెను అరెస్టు చేశారు. అప్పటి నుంచి విచారణ ఖైదీగా ఉంచిన పోలీసులు ఇటీవలె ఆరోగ్య పరీక్షల నిమిత్తం పెరోల్‌పై నలుగురు పోలీసులను గార్డులగా ఇచ్చి బయటకు పంపించారు. అయితే, ఆరోగ్య పరీక్షల పేరిట బయటకు వచ్చిన ఆమె పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత తనకు కొంత విరామం కావాలంటూ బ్రతిమిలాడుకుంది. అహ్మదాబాద్‌లోని హిమాలయన్ మాల్‌కు తన వ్యక్తిగత లాయర్, పోలీసు గార్డులతో వెళ్లింది. ఏం చక్కా నచ్చిన ఫుడ్డు లాగించేసి.. అనంతరం తాఫీగా మసాజ్ చేయించుకుంది. ఆ వెంటనే భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించి ఇప్పటికీ విజయవంతంగా దూసుకెళుతున్న బాహుబలి 2 చిత్రాన్ని చూసింది. ఆ సమయంలో నిరంతరం ఫోన్లో మాట్లాడిన ఆమె తన పెరోల్ మరింత పొడిగించే అవకాశం ఉందా అని కనుక్కుంది. అయితే, ఎప్పుడైతే ఆమె పెరోల్ గడువు పొడిగించడం లేదని తెలిసిందో ఆ వెంటనే తాను వాష్ రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లి అటునుంచి అటే పారిపోయింది. దీంతో బిత్తరపోవడం ఆమెకు కాపలాగా ఉన్న గార్డుల వంతైంది. ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యి గార్డుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె పారిపోయిందంటూ వారిని, ఆమె న్యాయవాదిని అరెస్టు చేశారు. ఈ నలుగురు గార్డులకు కూడా ఈ మధ్య శిక్షణ పూర్తయిందట. ప్రస్తుతం ఇతర పోలీసులు ఆమెను పట్టుకునే పనిలో పడ్డారు. ఈమె దాదాపు రూ.5కోట్ల విలువైన బంగారాన్ని అక్రమ మార్గంలో ఈ ఏడాది జనవరిలో కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
50 రోజులు, 1050 సెంటర్లు
హైదరాబాద్: బాక్సాఫీసు వద్ద ‘బాహుబలి 2’ హవా కొనసాగుతోంది. ఇప్పటికే రికార్డులు మీద రికార్డులు సాధించిన ఈ చిత్రరాజం మరో ఘనత సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల నేటికి 50 రోజులు పూర్తయింది. దేశవ్యాప్తంగా 1050 సెంటర్లలో ఇంకా ‘బాహుబలి 2’ సినిమా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. 50 రోజులు గడిచినా ఈ సినిమాకు ఆదరణ తగ్గకపోవడం విశేషం. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం నిలిచిన ‘బాహుబలి 2’ మున్ముందు మరిన్ని రికార్డులు సృష్టించనుంది. త్వరలో చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీంతో ఆల్‌టైమ్ రికార్డు కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూ. 2 వేల కోట్లు సాధించే తొలి భారతీయ సినిమా అవుతుందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ హైయ్యస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఇప్పటి వరకు రూ. 1650 కోట్లకు పైగా వసూలు చేసింది. కాగా, ఈ నెల 22న ప్రారంభం కానున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి 2ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనుండటం విశేషం. -
బాహుబలి 2కు మరో అరుదైన గౌరవం
రికార్డ్ కలెక్షన్లు సాధించి బిగెస్ట్ ఇండియన్ ఫిలింగా అవతరించిన బాహుబలి సంచలనాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితమైన ఈ సినిమాను మరో ప్రెస్టీజియస్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఈ నెల 22న ప్రారంభం కానున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బాహుబలి 2ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు. ఇటీవల జరిగి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌తో పాటు రొమేనియా ఫిలిం ఫెస్టివల్ లోనూ బాహుబలి 2కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్కోలోనే అదే స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ హైయ్యస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఇప్పటి వరకు 1650 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలో చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
బాహుబలి-2 వీడియో; గంటల్లో వేలకొద్దీ వ్యూస్
ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అర్ధశతదినోత్సవానికి చేరువవుతోన్నా ‘బాహుబలి-2 (ది కన్‌క్లూజన్)’ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్లో గతవారం కొత్త సినిమాలు విడుదలైనా ఎక్కువ మంది ప్రేక్షకులు బాహుబలికే జైకొట్టారు. ఆదివారం విడుదలైన వీడియో సాంగ్ విషయంలోనూ నెటిజన్లు విపరీతమైన ఆసక్తి కనబర్చారు. బాహుబలి 2 సినిమా టైటిల్స్ పడేప్పుడు వినిపించే ‘ఒక ప్రాణం..’ పాట వీడియోను.. టైటిల్స్ లేకుండా ప్రత్యేకంగా విడుదలచేశారు లహరి మ్యూజిక్ వారు. ‘ఒక ప్రాణం..’ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో పబ్లిష్ అయిన రెండు గంటల వ్యవధిలోనే దాదాపు 80వేల మంది వీక్షించారు. బాహుబలి టీజర్లు, ట్రైలర్ల మాదిరే వీడియో సాంగ్స్ కూడా భారీ సంఖ్యలో హిట్స్ సాధిస్తుండటం గమనార్హం. ‘ఒక ప్రాణం..’ పాటను ఎంఎం కీరవాణి స్వయంగా రాసి, స్వరపర్చగా, ఆయన తనయుడు కాలభైరవ ఆలపించారు. అద్భుతమైన హెచ్డీలో రూపొందించిన ఆ పాట మీకోసం.. -
మాది జన్మజన్మల అనుబంధం
‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్న ‘బాహుబలి 2’ విడుదల వరకూ వెంటాడింది. రిలీజయ్యాక ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇప్పుడు పలు ప్రశ్నలు వెంటాడుతున్నాయి. వాటిలో భల్లాలదేవ రానా భార్య పాత్రధారి ఎవరు? అనే ప్రశ్న ఒకటి. ఈ ప్రశ్నను రానాని డైరెక్ట్‌గా అడిగేశాడు ఓ వ్యక్తి. సోషల్ మీడియా ద్వారా రానా తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అందరూ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పారు. గతంలో ‘బాహుబలి’లో మీ భార్య ఎవరు? అని ఒకరు అడిగితే, ‘సరోగసి’ ద్వారా నా కొడుకు భద్ర పుట్టాడంటూ సరదాగా సమాధానం చెప్పి, తప్పించుకున్నారు రానా. అయితే ఈసారి ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా రానా ముందు ఈ ప్రశ్న ఉంచాడు. ‘బాహుబలి 2’లో మీ భార్య ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిందే’ అన్నాడు. ‘కాజల్’ అంటూ సమాధానమిచ్చాడు రానా. ‘ఇక నేనేం చెప్తాను. మాది జన్మజన్మల అనుబంధం’ అంటూ రానా ట్వీట్‌కి ట్విట్టర్ ద్వారానే కాజల్ సరదాగా సమాధానం ఇచ్చారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి రాణిగా... కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించిన బాలీవుడ్ ‘క్వీన్’ ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని తమిళ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ రైట్స్ కొనుక్కున్నారు. నటి రేవతి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తమన్నా లీడ్ రోల్లో ఈ చిత్రం తీయనున్నారని గతంలో వార్తలొచ్చాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయి, సినిమా మొదలవుతుందనే టైమ్‌కి ఈ చిత్రం నుంచి తమన్నా తప్పుకున్నారనే వార్త వచ్చింది. ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నారని తెలిసింది. కాగా పరుల్ యాదవ్ లీడ్ రోల్లో రమేష్ అరవింద్ దర్శకత్వంలో కన్నడ రీమేక్‌ను ఇప్పటికే స్టార్ట్ చేశారట త్యాగరాజన్. -
ప్రభాస్ గురించి ఓ ఫన్నీ సీక్రెట్ చెప్పిన రాజమౌళి
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డులు సృష్టిస్తున్న చిత్రం బాహుబలి 2. వసూళ్ల పరంగా భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా ఈ సినిమా దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ పలురకాలుగా బాహుబలి 2 మానియా కొనసాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ఆసక్తిని రేపుతుండగా చిత్ర దర్శకుడు రాజమౌళి ఈ సినిమా హీరో ప్రభాస్ గురించి ఓ ఫన్నీ సీక్రెట్ చెప్పాడు. కండలు తిరిగిన ప్రభాస్ దేహం వెనుక బిర్యానీ మాయ ఉందంట. అవునూ సినిమా కోసం ప్రభాస్, రానాలు తమ దేహాన్ని ఎంత ఫిట్నెస్గా ఉంచుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రానా గురించి పక్కన పెడితే ప్రభాస్ మాత్రం 15 రకాల బిర్యానీలు తినేవాడంట. ఈ విషయాన్ని రాజమౌళి బ్రిటన్‌లో ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులకు తెలియజేశారు. చేపలు, మటన్‌తో కూడిన బిర్యానీలు, అందులో కర్రీలు, ఫ్రైలతో తెగ లాగించేశాడంట. ‘వాళ్లు(ప్రభాస్, రానా) ఎలాంటి డైట్‌ఫాలో అయినా నేను అడ్డు చెప్పే వాడిని కాదు. వారిపై ఒత్తిడి కూడా చేయలేదు. కానీ, ఈ సందర్భంగా మీకు ప్రభాస్ గురించి ఓ ఫన్నీ సంఘటన చెబుతాను. ప్రభాస్ బాహుబలి 2 షూటింగ్ సమయంలో కనీసం 10 నుంచి 15 రకాల బిర్యానీలు తినేవాడు’ అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు రాజమౌళి. -
బాహుబలి కన్నా.. నా కలెక్షన్లే ఎక్కువ : సల్మాన్
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న బాహుబలి సినిమాపై బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. బాహుబలి 2 రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన తరువాత కూడా చాలా కాలం పాటు బాలీవుడ్ హీరోలు ఈ సినిమాపై స్పందించలేదు. అయితే ఇండియన్ సినిమా అంటే బాహుబలే అనే స్థాయి కలెక్షన్లు నమోదు కావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో షారూఖ్, ఆమిర్ లాంటి స్టార్స్ సినిమా చూడలేదు గానీ.. బాహుబలి గొప్ప సినిమా అంటూ కామెంట్ చేశారు. తాజాగా ఈ లిస్ట్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా చేరిపోయాడు. ఈద్ కానుకగా రిలీజ్ అవుతున్న ట్యూబ్‌లైట్ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సల్మాన్.. బాహుబలి కలెక్షన్లపై స్పందించాడు. అయితే బాహుబలి గొప్ప సినిమానే అన్న సల్మాన్, బాహుబలి కలెక్షన్ల కన్నా.. నా కలెక్షన్లే ఎక్కువంటూ మెలికపెట్టాడు. బాహుబలి సినిమాను నాలుగేళ్ల పాటు తెరకెక్కించారు. నేను ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ వస్తున్నా.. అవన్ని కలుపుకుంటే బాహుబలి వసూళ్ల కన్నా నా కలెక్షన్లే ఎక్కువ కదా..! అంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేశాడు. -
చెరిగిపోయిన బాహుబలి 2 రికార్డు
ముంబై: బాహుబలి 2, దంగల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ తలపడుతున్నాయి. తాజాగా బాహుబలి 2 నెలకొల్పిన రికార్డును దంగల్ దాటేసింది. అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. చైనాలో సునామీ వసూళ్లుతో దూసుకుపోతున్న ఆమిర్ ఖాన్ సినిమా గ్రాస్ వసూళ్లలో కొత్త రికార్డు నెలకొల్పినట్టు ప్రముఖ సినిమా జర్నలిస్టు హరిచరణ్ పుడిపెద్ది తెలిపారు. బాహుబలి 2 సినిమా నాలుగు బాషల్లో (హిందీ తెలుగు, తమిళం, మలయాళం) రూ.1530 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు వెల్లడించారు. దంగల్ నాలుగు బాషల్లో(హిందీ, తమిళం, తెలుగు, మాండరిన్) రూ. 1743 గ్రాస్ వసూళ్లు సాధించినట్టు తెలిపారు. మే 5న చైనాలో విడుదలైన దంగల్ ఇప్పటివరకు రూ. 810 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. అయితే దంగల్ రికార్డును బాహుబలి 2 అధిగమించే అవకాశాలున్నాయి. ఈ సినిమాను త్వరలోనే చైనాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దంగల్ భారీ విజయం సాధించడంతో బాహుబలి 2 సినిమాను కూడా అక్కడ విడుదల చేసే యోచనలో ఉన్నారని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారని తెలిపారు. ఇంకా పలు దేశాల్లో ఈ చిత్రరాజన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. With its WW gross collections, #AamirKhan's #Dangal has officially beaten #Baahubali2 at the box-office. Well deserved success pic.twitter.com/R7b8cUZxc7 — Haricharan Pudipeddi (@pudiharicharan) 25 May 2017 -
పోలీసులకు నిద్రలేకుండా చేసిన బాహుబలి 2
జైపూర్: ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘బాహుబలి 2’ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. సరిహద్దులతో సంబంధం లేకుండా రికార్డుల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రరాజం బుధవారం రాత్రంతా జైపూర్ పోలీసులకు నిద్రలేకుండా చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. శక్తినగర్ ప్రాంతంలో ముగ్గురు చిన్నారులు తప్పిపోయినట్టు బుధవారం సాయంత్రం జోత్వారా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. 8 నుంచి 13 ఏళ్ల వయసున్న ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు సోదరులు, వారి స్నేహితుడు ఉన్నాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నగరాన్ని జల్లెడ పట్టారు. ‘నగరంలో చాలా చోట్ల గాలించాం. ఇన్ఫార్మర్ల సహాయం తీసుకున్నాం. రాత్రంతా పెట్రోలింగ్ వాహనాలతో సిటీ అంతా తిరిగామ’ని జోత్వారా ఎస్ఐ గురుదత్ సైనీ తెలిపారు. గురువారం తెల్లవారుజామున చిన్నారుల ఆచూకీ తెలియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జోత్వారాలోని ఓ ఆలయం వద్ద చిన్నారులను కనుగొన్నారు. తర్వాత చిన్నారుల చెప్పిన మాటలు విని పోలీసులు అవాక్కయ్యారు. బాహుబలి 2 సినిమా చూడడానికి వెళ్లి తప్పిపోయామని చెప్పడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. ‘సమీపంలో ఉన్న ధియేటర్లో బాహుబలి 2 సినిమాకు చూడటానికి వెళ్లమని చెప్పారు. టిక్కెట్లు దొరక్కపోవడంతో వాళ్లు సినిమా చూడలేకపోయారు. ఆలస్యంగా వెళితే ఇంట్లో తిడతారన్న భయంతో తిరుగు పయనమయ్యారు. కంగారులో దారి తప్పిపోయామని’ చిన్నారులు చెప్పినట్టు జోత్వారా పోలీసు అసిస్టెంట్ కమిషనర్ ఆస్ మహ్మద్ తెలిపారు. ముగ్గురు చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు చెప్పారు. చిన్నారులు సురక్షితంగా ఉన్నారని, వారిని తమ ఇళ్లలో దించామని స్టేషన్ హౌస్ అధికారి వెల్లడించారు. ‘రాత్రంతా నిద్ర లేదు. ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవాల’ని ఆయన చెప్పడం గమనార్హం. -
బాహుబలి-2కి రెహ్మాన్ టార్గెట్ ఎంతో తెలుసా?
చెన్నై: ఆస్కార్ విన్నర్, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ "బాహుబలి 2’’పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రికార్డ్ కలెక్షన్లతో సునామీ సృష్టిస్తున్న బాహుబలి-2 పై తన అంచనాలను సోమవారం వెలిబుచ్చారు. "బాహుబలి 2 (ది కన్‌క్లూజన్) బాక్స్ ఆఫీసు వద్ద రూ.2వేలకోట్లను అధిగమిస్తుందని తెలిపారు. చెన్నైలో ఈ సినిమాను వీక్షించిన రెహ్మాన్ తన ఫేస్బుక్ పేజీలో ఈ బాహుబలి విజయాలన ప్రస్తావించారు. త్వరలోనే బాక్స్ ఆఫీసు వద్ద రూ.2వేకోట్ల రూపాయలను దాటిపోతుందని తాను నమ్ముతున్నాని పేర్కొన్నారు. ప్రపంచంలో భారతీయసినిమాకు ఒక కొత్త గుర్తింపును తీసుకొచ్చారంటూ చిత్రం బృందంపై ప్రశంసలు కురిపించారు. దక్షిణ భారతీయకు వసూళ్ల వరదగేట్లను తెరిచారని కొనియాడారు.దర్శకుడు, రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణిలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బాహుబలికి కొత్త టార్గెట్‌ను సెట్ చేశారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ.. మీ అభినందనలు సినిమాకు మరింత వన్నెతెచ్చినట్టు తెలిపారు. కాగా ఎస్. రాజమౌళి దర్వకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన బాహుబలి రెండవభాగం ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల వర్షంతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోఇప్పటికే రూ .1,500 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. To Rajamouli garu, Keeravani garu and the whole team of BB2... Just finished watching it in Chennai. I hope it... https://t.co/3xd19PXNq5 — A.R.Rahman (@arrahman) May 21, 2017 Thanks you very much sir. Your appreciation makes it very special.. -
బాహుబలి 2 : విజయయాత్రలో మరో మజిలీ
బాహుబలి 2 మరో అరుదైన ఘనతను సాధించింది. 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించిన ఈ సినిమా తరువాత మరో పదిరోజుల్లో 1500 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కు వచ్చేసిన బాహుబలి ఇప్పటికీ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఓవర్ సీస్ లో బాహుబలి కలెక్షన్ల జోరు బాలీవుడ్ తారలకు కూడా చుక్కలు చూపిస్తోంది. ఈ శుక్రవారంతో 1500 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఫుల్ రన్ లో మరిన్ని సంచలనాలు నమోదు చేసే దిశగా దూసుకుపోతోంది. త్వరలో సింగపూర్ లో రిలీజ్ అవుతున్న బాహుబలి 2ను ఈ ఏడాది చివర్లో చైనా, జపాన్ దేశాల్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కూడా ఇదే రెస్పాన్స్ వస్తే 2000 కోట్ల కలెక్షన్లు కూడా సాధ్యమే అంటున్నారు విశ్లేషకులు. It's getting Bigger and Bigger... SUCH A REMARKABLE MILESTONE!! THANK YOU EVERYONE FOR YOUR SUPPORT! #1500CroreBaahubali pic.twitter.com/C7htwLDxS7 — Baahubali (@BaahubaliMovie) 19 May 2017 -
బాహుబలికి షాక్ : పిల్లలకు నో ఎంట్రీ
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాహబలి 2కి షాక్ తగిలింది. చందమామ కథలా భారీ రాజప్రాసాదాలు, గుర్రాలు, ఏనుగులు, యుద్ధ సన్నివేశాలతో తెరకెక్కిన ఈసినిమాను ఎక్కువగా పిల్లలే ఇష్టపడతారు. అయితే సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉందన్న కారణంతో సింగపూర్ సెన్సార్ బోర్డ్ ఏ(ఎన్సీ 16) సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో 16 ఏళ్ల లోపు పిల్లలను ఆ దేశంలో బాహుబలి 2 సినిమాను చూసేందుకు అనుమతించరు. ఈ విషయం పై స్పందించిన భారత సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ.. భారత్‌లో బాహుబలి 2కి ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను జారీ చేశాం. కానీ సింగపూర్ సెన్సార్ బోర్డ్ మాత్రం ఈ సినిమా హింసాత్మకంగా ఉందని భావించింది. ముఖ్యంగా సైనికుల తలలు నరికే సన్నివేశాలే ఏ సర్టిఫికేట్ రావడానికి కారణమన్నారు. సింగపూర్‌తో పాటు మరికొన్ని ఆసియా, యూరప్ దేశాల్లోనూ బాహుబలికి ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. -
బాహుబలి 2 : మరో మైల్స్టోన్కు చేరువలో..!
ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించిన ఈ విజువల్ వండర్, ఇప్పుడు మరో అరుదైన ఘనతకు చేరువైంది. ఇప్పటికే 1450 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా వారాంతానికి 1500 కోట్ల మార్క్ ను కూడా దాటేయనుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా బాహుబలి 2 రికార్డ్ సృష్టించనుంది. మొదటి రెండు వారాల్లో భారత్ లోనే 1012 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓవర్ సీస్ తో కలిపి 1250 కోట్ల సాధించింది. తాజా లెక్కల ప్రకారం 19 రోజుల్లో బాహుబలి 2 భారత్ లో 1189 కోట్లు, ఓవర్ సీస్ లో 261 కోట్ల వసూళ్లు సాధించి 1450 కోట్ల మార్క్ కు చేరిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. మరో రెండు రోజుల్లో 1500 కోట్ల మార్క్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ప్రభాస్, రానాలు ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ రికార్డ్స్ అన్నింటినీ చెరిపేస్తూ దూసుకుపోతోంది. -
బాహుబలి 2 అద్భుతం : మాట మార్చిన కేఆర్కే
సౌత్ నార్త్ అన్న తేడాలేకుండా పెద్ద చిత్రాలు ఏవి రిలీజ్ అయిన నెగెటివ్ ట్వీట్ లతో హల్ చల్ చేస్తుంటాడు బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమాల్, బాహుబలి 2 రిలీజ్ సమయంలోనే అదే స్థాయిలో నోరు పారేసుకున్నాడు. ప్రభాస్ ను జిరాఫీతో పోల్చిన కమాల్, రాజమౌళిపై కూడా అలాంటి కామెంట్సే చేశాడు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో బాహుబలి 2 సాధిస్తున్న కలెక్షన్లు చూసి ఈ ఎనలిస్ట్ కమ్ క్రిటిక్ మాట మార్చాడు. 'బాహుబలి 2 ఓ సినిమా కాదు.. ఉద్యమం. ప్రతి ఒక్కరు ఆ సినిమాలో భాగం కావాలని కోరుకుంటారు. బాహుబలి 2 సాధించిన విజయాన్ని రిపీట్ చేయటం రానున్న 30 ఏళ్లలో సాధ్యం కాదు. మూడో ఆదివారం కూడా బాహుబలి 2(హిందీ వర్షన్) 20 కోట్లకు పైగా వసూళు చేసింది. ఇది సాదారణ విషయం కాదు. రాజమౌళికి దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం' అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు బాహుబలి 2 యూనిట్ కు క్షమాపణలు కూడా చెప్పాడు. తప్పుడు రివ్యూ ఇచ్చినందుకు క్షమించండి. నాకు నచ్చకపోయినా ప్రజలకు నచ్చింది. క్షమించండి రాజమౌళి' అంటూ ట్వీట్ చేశాడు. I m very sorry for my wrong review of #Baahubali2! I didn't like it but ppl like it n Janta Ki Awaaz means Nakkare Khuda. Sorry @ssrajamouli — KRK (@kamaalrkhan) 14 May 2017 #Baahubali2 is not a film anymor. It's a movement n evrybody wants to becom part of it. It will not happen again with any film in next 30Yrs — KRK (@kamaalrkhan) 15 May 2017 Hindi #Baahubali2 collected approx 20Cr on 3rd Sunday n definitely it's not a normal business. It's blessing of the GOD for @ssrajamouli — KRK (@kamaalrkhan) 15 May 2017 -
బాహుబలిపై నోరువిప్పిన బాలీవుడ్ హీరో
ఇండియన్ సినిమాను తొలిసారిగా 1000 కోట్ల క్లబ్ లో నిలబెట్టిన భారీ చిత్రం బాహుబలి 2. భారీ వసూళ్లతో భారత్ లోని ఇండస్ట్రీ రికార్డు లన్నింటినీ బద్ధలు కొట్టిన బాహుబలి, బాలీవుడ్ స్టార్స్ కు కూడా చుక్కలు చూపించింది. అందుకే మీడియా సాధారణ ప్రేక్షకులు బాహుబలిని ఆకాశానికి ఎత్తేసినా.. బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఈ సినిమా పై స్పందించలేదు. ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీ లో టాప్ ప్లేస్ లో ఒక్క స్టార్ హీరో కూడా బాహుబలి సక్సెస్ పై మాట్లాడలేదు. తాజాగా కిలాడీ అక్షయ్ కుమార్ బాహుబలి 2 సక్సెస్ పై స్పంధించాడు. సినిమా రిలీజ్ అయిన రెండు వారాల తరువాత బాహుబలి 2కు సంబంధించిన ట్వీట్ చేశాడు అక్షయ్ కుమార్. 'ఫైనల్ గా బాహుబలి సినిమా చూశా. వస్తున్న హైప్, సక్సెస్ కు బాహుబలి 2కి అర్హత ఉంది. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశాడు అక్షయ్. Finally saw #BaahubaliTheConclusion, it deserves every bit of hype & success,taking Indian cinema 2 an international level.Congrats 2 d team — Akshay Kumar (@akshaykumar) 15 May 2017 -
కట్టప్పకు బాలీవుడ్ హీరో భార్య ఫిదా
ముంబై: బాహుబలి2 విడుదలైన తర్వాత మొత్తం ప్రేక్షకులు సినీలోకమంతా ప్రభాస్, రాజమౌళి, కట్టప్ప, శివగామిలాంటి పాత్రలను తెగ పొగిడేస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నటి, నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా మాత్రం కట్టప్పపై మనసు పారేసుకుంది. బాహుబలి సినిమాలో మహిష్మతి సామ్రాజ్యంలో బానిస సేన నాయకుడిగా సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్రను తెగ ఇష్టపడుతోంది. అందులో భాగంగా సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. తాను కట్టప్పకు ఎలా అభిమానిగా మారిపోయాననే విషయాన్ని వివరించింది. ‘నేను బాహుబలి 2 చూశాను. నా కూతురు కోపంతో తన తండ్రిని కట్టప్ప అని పిలుస్తోంది. ఎంతలా అంటే ఒక వ్యసనంలాగా.. కట్టప్ప అని తను మూడుసార్లు అరిచేంత వరకు కూడా మేం అస్సలు అపలేకపోతున్నాం’ అంటూ ట్వింకిల్ ఖన్నా చెప్పుకొచ్చింది. -
అలా అయితే బాగుండేది: రాజమౌళి
సాక్షి, బళ్లారి: తమిళం తరహాలో కన్నడంలో కూడా బాహుబలి–2 చిత్ర అనువాదానికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. ఆయన శనివారం బళ్లారి సిటీలోని రాధిక సినిమా థియేటర్లో బాహుబలి–2ను వీక్షించారు. అనంతరం విలేకరుల తో మాట్లాడారు. బాహుబలి–2 దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ కావడం సంతోషంగా ఉందన్నారు. తనతో పాటు హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ శ్రమించడం ఈ విజయానికి దోహదపడిందన్నారు. ప్రస్తుతం మరో కొత్త ప్రాజెక్టు ఏదీ లేదని చెప్పారు. ఈ సక్సెస్‌ను తాను, తన కుటుంబం ఆస్వాదిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం బెంగళూరు వచ్చిన ‘భల్లాలదేవ’ రానా దగ్గుబాటికి ప్రభాస్ ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. కెంపేగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో రానాకు కర్ణాటక ప్రభాస్ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి, అధ్యక్షుడు అశిష్, సభ్యులు ఆయనకు స్వాగతం పలికి మైసూరు పేటెతో సన్మానించారు. -
బాహుబలి టీం కారణంగానే స్పైడర్ వాయిదా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ ఇంటలిజెన్స్ అధికారిగా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ముందుగా జూన్ 23నే రిలీజ్ చేయాలని భావించారు. తరువాత ఆగస్టుకు వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం స్పైడర్ ఆగస్టులోనూ రిలీజ్ అయ్యే చాన్స్ లేదట. దసరా కానుకగా అక్టోబర్‌లో సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే స్పైడర్ ఆలస్యం వెనుక బాహుబలి టీం ఉందన్న టాక్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాహుబలి 2 సంచలనాలు నమోదు చేస్తుండటంతో స్పైడర్ సినిమా విషయంలో కూడా గ్రాఫిక్స్ మీద ఎక్కువ సమయం, బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించారు యూనిట్. అందుకే కమల్ కణ్నన్ ఆధ్వర్యంలో మకుటతో గ్రాఫిక్స్ చేయిస్తున్నారు. అయితే బాహుబలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మకుట, ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావటంలేదు. ఎంత సమయమైనా కేటాయించి క్వాలిటీ గ్రాఫిక్స్‌ను రెడీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని స్పైడర్ టీంకు కూడా చెప్పడంతో చేసేదేమి లేక సినిమాను వాయిదా వేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. -
రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై మరో న్యూస్..!
బాహుబలి 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి రాజమౌళి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యంగ్ హీరోలతో చిన్న ప్రాజెక్ట్ చేస్తారని.. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ హీరోగా సినిమా ఉంటుందని.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని తెరకెక్కిస్తాడని.. రకరకాల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ లిస్ట్‌లో మరో వార్త కూడా చేరిపోయింది. తాజాగా సమచారం ప్రకారం జక్కన్న తన నెక్ట్స్ సినిమాను మహేష్ హీరోగా రూపొందించాలని భావిస్తున్నాడట. చాలా కాలం క్రితమే మహేష్ బాబు హీరోగా కెయల్ నారాయణ నిర్మాణంలో సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు రాజమౌళి. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ప్రకారం సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటిస్తున్న మహేష్, తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. మరి రాజమౌళి.. మహేష్‌తోనే సినిమా చేయాలని భావిస్తే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది..? కొరటాల ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి రాజమౌళితో సినిమా చేస్తాడా..? లేక రాజమౌళి కొరటాల సినిమా పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తాడా..? కొరటాల సినిమా తరువాత వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ శ్రీనివాస్లతోనూ మహేష్ బాబుకు కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్ని పక్కన పెట్టి రాజమౌళి సినిమాను ఓకె చేస్తాడా..? అసలు విషయం తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఆల్‌టైమ్ టాప్ ‘బాహుబలి 2’
ముంబై: భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించిన ‘బాహుబలి 2’ మరో ఘనత సాధించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గుండెకాయగా పరిగణించబడే బాలీవుడ్‌లోనూ టాప్‌గా నిలిచింది. హిందీలో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ‘దంగల్’ పేరిట ఉన్న రికార్డును రెండు వారాల్లోనే తుడిచిపెట్టేసింది. రూ. 375 కోట్ల నెట్ వసూళ్లతో ఇప్పటివరకు దంగల్ అగ్రస్థానంలో ఉంది. బాహుబలి 2 హిందీ సినిమా రూ. 390.25 కోట్ల నెట్ కలెక్షన్లతో ఆల్‌టైమ్ టాప్‌గా నిలిచింది. మొదటి వారంలో రూ. 247 కోట్లు, రెండో వారంలో రూ. 143.25 కోట్లు రాబట్టిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. అమెరికాలో రూ. 100 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి భారతీయ సినిమాగా నిలిచింది. తమిళనాడులోనూ రూ. 100 కోట్ల మైలురాయికి చేరువగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 250 కోట్లుపైగా కలెక్ట్ చేసింది. కేరళలో రూ. 50 కోట్లుపైగా బిజినెస్ చేసింది. మరోవైపు భారతదేశంలోనే రూ. 1000 కోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్ర లిఖించింది. -
బాహుబలి 2 : భారత్‌లోనే 1000 కోట్లు
సినిమా రిలీజ్ అయి రెండు వారాలు గడుస్తున్నా బాహుబలి 2 రికార్డ్‌లు వేట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న అన్ని రికార్డులను తుడిచి పెట్టేసిన బాహుబలి 2, ఇప్పుడు సరికొత్త రికార్డ్ లను సెట్ చేస్తూ దూసుకెళుతుంది. రిలీజ్ అయిన 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల వసూళ్లు సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా అవతరించింది బాహుబలి. తాజాగా 14 రోజుల్లో కేవలం భారత్ లోనే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాగా బాహుబలి చరిత్ర సృష్టించింది. ఇప్పట్లో ఏ భారతీయ సినిమా ఈ రికార్డును అందుకోవటం అసాధ్యం అంటున్నారు విశ్లేషకులు. భారత్‌లో తెలుగు, హిందీతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ భారీగా రిలీజ్ అయిన బాహుబలి రెండు వారాల్లో 1020 కోట్ల గ్రాస్ వసూళు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి వసూళ్లు 1300 కోట్లకు చేరువలో ఉన్నాయి. -
ఖర్చు నబ్బే కరోడ్... ఫాయిదా 285.35 కోట్లు!
-
ఖర్చు నబ్బే కరోడ్... ఫాయిదా 285.35 కోట్లు!
‘బాహుబలి–2’ హిందీ వెర్షన్ లెక్కల చిట్టా ఇది. థియేటర్లలో సినిమా ఇంకా బాగా ఆడుతోంది కనుక లాభం మరింత పెరిగే అవకాశముంది. ‘బాహుబలి–2’ హిందీ థియేట్రికల్ రైట్స్‌ను రూ. 80కోట్లకు సొంతం చేసుకున్న కరణ్ జోహార్ పబ్లిసిటీకి ఓ 10 కోట్లు ఖర్చుపెట్టారట! మొత్తం ఖర్చు నబ్బే (90) కరోడ్. ఇప్పటివరకు ఇండియాలో ఈ సినిమా హిందీ వెర్షన్ రూ. 375.35 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే నిర్మాతకు రూ. 285.35కోట్లు ఫాయిదా (లాభం). ఇంకో ఫాయిదా ఏంటంటే.. పన్నెండు కోట్లు కలెక్ట్ చేస్తే ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ ఇండియా (రూ. 387.38 కోట్లు) రికార్డును బీట్ చేసేస్తుంది. 12 కోట్లు ఏంటి? 25 కోట్లు కలెక్ట్ చేసి రూ. 400 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా (హిందీ నెట్)గా ‘బాహుబలి–2’ రికార్డు సృష్టిస్తుందని ట్రేడ్ పండితుల అంచనా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ నాడులో వంద కోట్ల దిశగా దూసుకెళ్తోంది. -
బాహుబలి.. మరో ప్రశ్న!
‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా ప్రేక్షకులకు కొన్ని ప్రశ్నలను మిగిల్చింది. వీటికి ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సమాధానాలు దొరుకుతాయని భావించారు. అయితే కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లభించలేదు. భల్లాలదేవుడి భార్య ఎవరు? అనేది అందులో ఒకటి. భద్ర(అడివి శేష్)ను భల్లాలదేవ కుమారుడిగా మొదటి భాగంలో చూపించారు. దేవసేనను భల్లాలదేవ చెర నుంచి విడిపించే సమయంలో భద్రను చంపుతాడు మహేంద్ర బాహుబలి(శివుడు). అయితే బాహుబలి 2లో భల్లాలదేవుడి భార్య ఎవరో చూపిస్తారని ఆశించిన ప్రేక్షకులకు ఆశాభంగం ఎదురైంది. భద్ర తల్లి ఎవరనే ప్రశ్నకు భల్లాలదేవ(దగ్గుబాటి రానా) సరదాగా సమాధానం ఇచ్చాడు. ‘ సరోగసి(అద్దె గర్భం) ద్వారా భద్ర పుట్టాడని, అతడికి తల్లి లేద’ని సరదాగా జవాబిచ్చాడు. మొత్తానికి భల్లాలదేవ ప్రేక్షకుల అనుమానాన్ని నివృత్తి చేశాడు. ప్రేక్షకుల ప్రశ్నల మాటెలావున్నా బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ హవా కొనసాగుతోంది. రెండో వారంలోనూ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. -
బాహుబలి సక్సెస్‌కి కారణం ప్రభాస్ కాదట..!
బాహుబలి సక్సెస్‌తో ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ముఖ్యంగా ఒక్క ప్రాజెక్ట్ కోసం ఐదేళ్ల సమయం కేటాయించిన డార్లింగ్ కమిట్మెంట్కు ఇండియన్ ఇండస్ట్రీ అంతా సాహో అంటుంది. అదే సమయంలో బాహుబలి సక్సెస్‌లో రాజమౌళితో పాటు ప్రభాస్‌కు అదే స్థాయిలో క్రెడిట్ ఇచ్చారు క్రిటిక్స్. కానీ ఓ బాలీవుడ్ దర్శకుడు మాత్రం బాహుబలి సక్సెస్‌లో ప్రభాస్ క్రెడిట్ ఏం లేదంటూ తేల్చేశాడు. బాలీవుడ్ మాస్ మసాల ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే రోహిత్ శెట్టి బాహుబలి సక్సెస్‌లో ప్రభాస్ కెడ్రిట్ ఏం లేదంటున్నాడు. కేవలం కథ, దర్శకత్వం వల్లనే బాహుబలి అంతటి ఘన విజయం సాధించిందన్న రోహిత్, నటీనటులు సక్సెస్ హెల్ప్ అయ్యారేగాని వారి గొప్పతనం ఏమి లేదన్నట్టుగా మాట్లాడాడు. అంతేకాదు బాలీవుడ్ జనాలు సినిమా ప్రమోషన్ ఎలా చేయాలో బాహుబలి టీం నుంచి నేర్చుకోవాలని తెలిపాడు. అయితే బాహుబలి సక్సెస్ ప్రభాస్ క్రెడిట్ ఏం లేదంటూనే అవకాశం వస్తే ప్రభాస్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తానని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. -
బాహుబలి: ఇంకేమైనా రికార్డులు మిగిలాయా?
హిందీలోకి డబ్ అయిన ఒక తెలుగు సినిమా సృష్టిస్తున్న సంచలనం చూసి మార్కెట్ వర్గాలతో పాటు విమర్శకులు కూడా నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇప్పటికే హిందీ వెర్షన్ ఒక్కదాంట్లోనే రూ. 300 కోట్లకు పైగా నెట్ వసూళ్లు చేసిన బాహుబలి-2 సినిమా, ఇప్పుడు రూ. 350 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్వయంగా ట్వీట్ చేశాడు. ఇప్పటికే బాహుబలి 2 సినిమా చాలా రికార్డులు బద్దలు కొట్టిందని ఆయన తెలిపారు. ఫాస్టెస్ట్ 50 కోట్లు, ఫాస్టెస్ట్ 100 కోట్లు, ఫాస్టెస్ట్ 150 కోట్లు, ఫాస్టెస్ట్ 200 కోట్లు, ఫాస్టెస్ట్ 250 కోట్లు, ఫాస్టెస్ట్ 300 కోట్లు... వీటన్నింటినీ ఇప్పటికే దాటేసిందని, ఇప్పుడు రూ. 350 కోట్ల వైపు వెళ్తోందని చెప్పారు. ఈ సినిమా నిజంగా ఒక గేమ్‌ఛేంజర్ అని ఆయన ప్రశంసించారు. అయితే, ఉత్తరాదిలో మాత్రం కొందరు దక్షిణాది సినిమా ఇంతలా విజయం సాధించడం ఏంటన్న భావనలోనే ఉన్నట్లుంది. 'డియర్ బాహుబలి.. దంగల్ పని ఇంకా అయిపోలేదు, కలెక్షన్లు వస్తున్నాయి' అంటూ జాతీయ మీడియాలోని ఒక వర్గం వ్యాఖ్యానించింది. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా బాహుబలి వసూళ్లను దాటి వెళ్తుందన్న ఉద్దేశంలో అలా రాశారు. #Baahubali2 RECORDS: Fastest ₹ 50 cr... Fastest ₹ 100 cr... Fastest ₹ 150 cr... Fastest ₹ 200 cr... Fastest ₹ 250 cr... Fastest ₹ 300 cr... — taran adarsh (@taran_adarsh) 9 May 2017 #Baahubali2 is now set to cross ₹ 350 cr, the FASTEST to achieve it. Seriously, is there any record left? This film is truly a GAME CHANGER! — taran adarsh (@taran_adarsh) 9 May 2017 -
రాజమౌళికి ప్రఖ్యాత దర్శకుడి ప్రశంస
హైదరాబాద్: బాహుబలి సిరీస్‌ను తెరకెక్కించి ఘన విజయం సాధించిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై ప్రశంసలు కురుస్తున్నాయి. వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సినిమా తీసిన రాజమౌళి తెగువను కొనియాడుతున్నారు. ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ కూడా ఈ జాబితాలో చేరారు. రాజమౌళిని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టారు. ‘సృజనాత్మక తెగువ ప్రదర్శించి, ఎన్నో కష్టాలను అధిగమించి బాహుబలి 2 సినిమా తీసిన రాజమౌళిని ఎంతో అభిమానిస్తున్నాన’ని ట్వీట్ చేశారు. దీనికి ఎంతో వినమ్రంగా రాజమౌళి సమాధానమిచ్చారు. ‘ఫెయిల్యూర్ గురించి భయపడుతూనే సృజనాత్మక ధైర్యంతో ముందడుగు వేస్తుంటాను. మీ శైలిలో సినిమాలు తీయాలన్నది నా కోరిక. కానీ మీలా సినిమాలు తీయలేనని నాకు తెలుసున’ని రాజమౌళి ట్వీట్ పెట్టారు. దీనిపై శేఖర్ కపూర్ స్పందిస్తూ... ‘అపజయం పట్ల భయం సృజనాత్మకతకు గొప్ప చోదకంగా పనిచేస్తుంది. భయాన్ని తెలివైన సృజనాత్మక ప్రక్రియగా మార్చడంలో రాజమౌళి పనితనం అద్భుతమ’ని పేర్కొన్నారు. మరోవైపు బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. బాలీవుడ్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన శేఖర్ కపూర్.. మిస్టర్ ఇండియా, మసూమ్, బండిట్ క్వీన్, క్వీన్ ఎలిజబెత్, ది గోల్డెన్ ఏజ్ సినిమాలు తీశారు. Why I admire @ssrajamouli ? He showed creative courage and grit to beat all odds #Bahubali2 — Shekhar Kapur (@shekharkapur) 8 May 2017 @shekharkapur Sir my creative courage is always interlaced with constant fear of failure. I So wish to be as rebellious as you, but also know that i cant — rajamouli ss (@ssrajamouli) 8 May 2017 @ssrajamouli Fear of failure is a great driver of creativity. You've managed to turn that fear into brilliant creative action. Wonderful @ssrajamouli — Shekhar Kapur (@shekharkapur) 8 May 2017 -
బాహుబలిని తట్టుకున్న పవర్ పాండి
భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి–2’ విడుదలైన సమయంలో మరో సినిమా రిలీజ్ అంటే రిస్కే. అందుకే ఈ సినిమా విడుదలైన ఏప్రిల్ 28న వేరే ఏ తెలుగు సినిమాలనూ విడుదల చేయలేదు. అంతకు వారం క్రితం రిలీజైన వాటిలో కూడా ఆశించిన ఫలితాన్ని సాధించినవి లేవు. కానీ, తమిళంలో మాత్రం ‘పవర్ పాండ్’ చిత్రం ‘బాహుబలి–2’ని తట్టుకుని నిలబడింది. హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదలైంది. మొదటి రోజునే హిట్ టాక్ తెచ్చుకోవ డంతో ప్రేక్షకాదరణ పెరిగింది. ‘బాహుబలి–2’ విడుదలయ్యాక కూడా ఈ సినిమా వసూళ్లు నిలకడగా ఉండటం విశేషం. ఈ చిత్రం సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ధనుష్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ పార్ట్‌లో సీనియర్ నటుడు రాజ్‌కిరణ్ టైటిల్ రోల్ చేశారు. ధనుష్ అతిథి పాత్ర చేశారు. సీక్వెల్లో మామ రజనీకాంత్‌ను నటింపజేయాలని ధనుష్ అనుకుంటున్నారట. -
బాహుబలి 2లో తమన్నా సీన్స్ ఏమయ్యాయ్..?
బాహుబలి తొలి భాగంలో కీలక పాత్రలో కనిపించిన తమన్నా, సెకండ్ పార్ట్ లో మాత్రం కొన్ని షాట్స్ కే పరిమితమైంది. బాహబలి 2 రిలీజ్ కు ముందు పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో తమన్నా తన పాత్రో సెకండ్ పార్ట్ లోనూ చాలా సీన్స్ లో కనిపిస్తుందని తెలిపింది. కానీ సినిమా రిలీజ్ అయ్యే సరికి సీన్ మారిపోయింది. రెండు మూడు షాట్స్ తప్ప తమన్నకు సెకండ్ పార్ట్‌లో పెద్దగా స్కోప్ లేదు. అయితే ముందుగా చెప్పినట్టుగా తమన్నాతో కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించాడట దర్శకుడు రాజమౌళి, కానీ ఆ సీన్స్‌లో గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో చివరి నిమిషంలో ఆ సీన్స్‌ను తొలగించి సినిమా రిలీజ్ చేశారు. ఏ రకంగా సినిమా క్వాలిటీ విషయంలో వెనక్కి తగ్గకూడదన్న ఉద్దేశంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడట. దీంతో సెకండ్ పార్ట్‌లో తమన్నా క్యారెక్టర్ మెరుపుతీగలా అలా కనిపించి ఇలా వెళ్లిపోయింది. -
బాహుబలి 2కు భారీ ఇన్సూరెన్స్
రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న బాహుబలి 2 సినిమాకు సంబంధించిన ప్రతీ వార్త టాలీవుడ్ లో వైరల్ అయిపోతుంది. సినిమా రిలీజ్ తరువాత యూనిట్ సభ్యులు చేస్తున్న ప్రతి కామెంట్ ను మీడియాతో పాటు సాధరణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భారీ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తెరకెక్కించిన ఈ సినిమాకు నిర్మాణ దశలో ఏవైన ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచనతో భారీ మొత్తానికి సినిమాను ఇన్సూరెన్స్ చేయించినట్టుగా తెలుస్తోంది. ఫ్యూచర్ జనరలి ఇన్సూరెన్స్ కంపెనీ.. ఫిలిం ఇన్సూరెన్స్ ప్యాకేజీ కింద బాహుబలి చిత్రాన్ని 200 కోట్లకు ఇన్సూరెన్స్ చేసినట్టుగా తెలిపింది. షూటింగ్ సమయంలో లేదా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో ఎలాంటి ప్రమాదం జరిగినా పాలసీ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. అంతేకాదు షూటింగ్ సమయంలో నటులు గాయపడినా, మరణించినా.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా షూటింగ్ ఆలస్యమైన భీమా వర్తించేలా పాలసీ చేశారు. ప్రస్తుతం భారీ చిత్రాల నిర్మాణ పెరుగుతుండటంతో భీమ చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుందని ఫ్యూచర్ జనరలీ ఎమ్‌డి కేజీ కృష్ణమూర్తి తెలిపారు. కేవలం 2017లోనే 160 చిత్రాలకు ఇన్సూరెన్స్ చేశారు. వీటిలో బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. దక్షిణాదిలో ఇన్సూరెన్స్ చేస్తున్న సినిమాలు తక్కువని అందుకు ప్రస్తుతం తమ సంస్థ సౌత్ సినిమాల మీద దృష్టి పెట్టిందన్నారు కృష్ణమూర్తి. ఇప్పటి వరకు ఈ సంస్థ 372 సినిమాలకు ఇన్సూరెన్స్ చేసింది. -
బాహుబలి 2పై బ్యాన్ తప్పదా..?
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి 2 రిలీజ్ కోసం పాకిస్తాన్ సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. అంతేకాదు అక్కడి ప్రేక్షకులు బాహుబలి 2ను పాక్‌లో రిలీజ్ చేయాలంటే సోషల్ మీడియలో పెద్ద ఎత్తున మేసేజ్‌లు కూడా పెడుతున్నారు. దీంతో బాహుబలి నిర్మాతలు కూడా పాక్ రిలీజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. భారత్‌లో తెరకెక్కిన చాలా సినిమాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల లోనూ రిలీజ్ అవుతుంటాయి. షారూఖ్ లాంటి స్టార్ హీరోలకు పాకిస్తాన్‌లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే బాహుబలి రిలీజ్‌పై పాక్ సెన్సార్ బోర్డ్ ఎలా స్పందిస్తుందో అన్న అనుమానం కలుగుతుంది. హిందుత్వాన్ని ప్రమోట్ చేసే సన్నివేశాలున్న సినిమాలను పాక్‌లో రిలీజ్ చేసేందుకు అక్కడి సెన్సార్ బోర్డ్ అంగీకరించదు. గతంలో ఈ కారణంగానే సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్‌జాన్ సినిమాపై పాక్ బ్యాన్ విధించింది. అయితే బాహుబలి సినిమా కావాలంటూ పాకిస్తాన్ యువతే కోరుతుండటంతో ఈ సినిమాపై సానుకూలంగా స్పందిస్తారనే ఆశిస్తున్నారు. మరి బాహుబలి పాక్‌లో రిలీజ్ అవుతుందా..? లేక బ్యాన్ బారిన పడుతుందా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
‘బాహుబలి 2’కు భారీగా బీమా
హైదరాబాద్: విజువల్ వండర్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమాకు రూ. 200 కోట్లకు పైగా బీమా చేసినట్టు ఫ్యూచర్ జనరాలీ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించింది. ఫిల్మ్ ప్యాకేజీ ఇన్సూరెన్స్ కింద ఈ మొత్తానికి బీమా చేసినట్టు తెలిపింది. ప్రిప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఈ పాలసీ కింద కవరేజీ ఉంటుందని వివరించింది. ‘మరణం, నటులకు అనారోగ్యం, ప్రకృతి విపత్తులు, ప్రమాదాల కారణంగా సినిమా షెడ్యూల్ లో జాప్యం జరిగినా బీమా వర్తిస్తుంది. షూటింగ్ జరుగుతుండగా ఎక్విప్మెంట్ పాడైనా బీమా చెల్లిస్తామ’ని ఫ్యూచర్ జనరాలీ ఒక ప్రకటనలో తెలిపింది. సినిమాలకు బీమా చేయడం పెరుగుతోందని ఫ్యూచర్ జనరాలీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేజీ కృష్ణమూర్తి రావు తెలిపారు. 2017 ఆర్థిక సంవత్సరంలో 160 సినిమాలకు బీమా చేశామని, వీటిలో ఎక్కువగా బాలీవుడ్ సినిమాలున్నాయని చెప్పారు. దక్షిణాది సినిమాలపై దృష్టి పెట్టామని, ఫిల్మ్ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ చేస్తున్నట్టు చెప్పారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సినిమా భారతదేశంలో భారీ బడ్జెట్ తో తెర కెక్కిన చిత్రంగా నిలిచింది. -
మరో రెండు భాషల్లోకి బాహుబలి-2
హైదరాబాద్: టాలీవుడ్ అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విజువల్ వండర్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ రికార్డులు తిరగరాస్తుంది. కేవలం భారత్ లోనే కాదు అమెరికా, సహా ఇతర దేశాల్లో కొత్త చర్రిత లిఖిస్తోంది బాహుబలి-2. ఈ మూవీని మరో రెండు భాషల్లోకి డబ్బింగ్ చేసి రెండు దేశాల ప్రేక్షకులకు ఈ విజువల్ వండర్ ను చేరువ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో తొమ్మిది వేల స్క్రీన్లపై విడుదలైన తొలి టాలీవుడ్ చిత్రంగానూ బాహుబలి-2 రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ‘బాహుబలి: ది బిగనింగ్’ మూవీకి చైనాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిభాగం చైనాలో మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో, రెండో భాగమైన బాహుబలి-2ను చైనీస్ భాషలోకి డబ్బింగ్ చేసి చైనా ప్రేక్షకులకు చేరువ కావాలని కసరత్తు మొదలుపెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు భారీస్థాయిలో అభిమానులున్న జపాన్ లోనూ విడుదల చేస్తే బాహుబలి-2 ప్రభంజనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ మూవీ ఇప్పటికే రూ.800 కోట్లు కొల్లగొట్టి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరనున్న తొలి భారతీయ చిత్రంగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. -
రజనీతో సినిమాపై రాజమౌళి స్పందన
బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం హాలీడే మూడ్‌లో ఉన్నాడు. ఐదేళ్లుగా బాహుబలి పనులతో అలసిపోయిన జక్కన్న ప్రస్తుతం లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అక్కడ కూడా రాజమౌళిని మీడియా విడిచిపెట్టడం లేదు. అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ జక్కన్నను ఇంటర్య్వూ చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు రాజమౌళి. ముఖ్యంగా బాహుబలి తరువాత రాజమౌళి చేయబోయే సినిమాపై ప్రదానంగా చర్చ జరుగుతుంది. రజనీకాంత్ లాంటి స్టార్ హీరోతో రాజమౌళి సినిమా చేస్తే అవతార్ రికార్డ్‌లు కూడా బ్రేక్ అవుతాయంటూ పలువురు సినీ ప్రముఖులు కామెంట్ చేయటంతో రాజమౌళి.. ఇంటర్య్యూలో ఈ విషయం పై స్పందించాడు. 'రజనీకాంత్ ఇండియాలోనే టాప్ స్టార్స్ లో ఒకరు. ఏ దర్శకుడైనా ఆయనతో సినిమా చేయాలనుకుంటాడు. నేను కూడా చేయాలనుకుంటున్నాను. అయితే ఆయన ఇమేజ్‌కు తగ్గ కథ దొరికితే తప్పకుండా రజనీతో సినిమా చేస్తాను. ఆ అవకాశం వస్తే నాకన్న సంతోషించే వ్యక్తి మరొకరు ఉండరు' అన్నాడు. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ప్రస్తుతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే 700 కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన ఈ భారీ చిత్రం, సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఏరియాల్లో రికార్డ్ లను తిరగరాస్తోంది. అంతేకాదు ఓవర్ సీస్ లోనూ హయ్యస్ట్ గ్రాసర్ గా ఉన్న దంగల్ రికార్డ్ ను మరో 24 గంటల్లో బాహుబలి 2 బద్ధలు కొట్టడం కాయంగా కనిపిస్తోంది. -
బాహుబలి 2.. ఆ దేశంలోనూ ఇండస్ట్రీ హిట్..!
బాహుబలి కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే నేషనల్ లెవల్లో ఉన్న ఎన్నో రికార్డ్ లను చెరిపేసిన ఈ విజువల్ వండర్, ఓవర్ సీస్ లోనూ అదే జోరు చూపిస్తుంది. బాలీవుడ్ టాప్ స్టార్స్‌కు చెమటలు పట్టిస్తూ తిరిగులేని రికార్డ్లను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే ఇండియాస్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్‌గా పేరు తెచ్చుకున్న బాహుబలి 2, మరో దేశంలోనూ ఇండస్ట్రీ హిట్‌గా అవతరించనుంది. భారత్‌లో సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి పొరుగు దేశమైన నేపాల్లోనూ అదే జోరు చూపిస్తోంది. ఇప్పటికే అక్కడ పది కోట్ల వసూళ్లు సాధించిన బాహుబలి, అతి త్వరలో నేపాల్‌లోనే అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించనుంది. ఇప్పటి వరకు 17 కోట్లతో 'చక్క పంజా' అనే సినిమా అక్కడ హయ్యస్ట్ గ్రాస్‌గా ఉంది. మరో వారం రోజుల్లో బాహుబలి 2 ఈ రికార్డ్‌ను చెరిపేస్తుందని భావిస్తున్నారు. దీంతో భారత్‌తో పాటు నేపాల్ లోనూ బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్‌గా నిలవనుంది. -
బాహుబలి హద్దులు చెరిపేసింది : రామ్ చరణ్
బాహుబలి 2 సినిమాకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ స్టార్స్ బాహుబలి యూనిట్‌పై అభినందనల జల్లు కురిపిస్తుండగా, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్పందించాడు. మంగళవారం రాత్రి చిరంజీవి, రామ్ చరణ్‌లు బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ చూసిన తరువాత చరణ్ తన సోషల్ మీడియా పేజ్‌లో స్పందించాడు. బాహుబలి నిజంగా ఇండియాస్ బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న చరణ్, రాజమౌళి ఊహ, విజువలైజేషన్లు సినిమా మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయన్నాడు. ఒక గొప్ప సినిమా అన్ని రకాల హద్దులను చెరిపేస్తుందని మరోసారి రుజువైందని, బాహుబలి ఫిలింమేకర్స్కు ఇన్సిపిరేషన్ అంటూ కీర్తించాడు.నటీనటులపై కూడా అదే స్థాయిలో స్పందించాడు చరణ్. డార్లింగ్ ప్రభాస్ బాహుబలిగా అద్భుతంగా కనిపించాడు, నటించాడు. నా మిత్రుడు రానా తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ల నటన కట్టిపడేస్తుంది అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. -
హ్యాపిడేస్ హీరోకు గోల్డెన్ ఛాన్స్
హ్యాపిడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు రాహుల్ హరిదాస్. ఈ యంగ్ హీరో హ్యాపిడేస్ తరువాత ఒకటి రెండు సినిమాల్లో నటించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే తాజా వెంకటాపురం సినిమాతో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ యంగ్ హీరోకు ఓ గోల్డెన్ ఛాన్స్ తలుపు తట్టింది. బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాను కోలీవుడ్‌లో రిలీజ్ చేసిన కె ప్రొడక్షన్ సంస్థ రాహుల్ హీరోగా ఓ సినిమాను నిర్మించనుంది. టాలీవుడ్లో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తున్న కె ప్రొడక్షన్ సంస్థ ఇప్పటికే రానా, రెజీనా లీడ్ రోల్స్‌లో 1945 అనే బైలింగ్యువల్ సినిమాను ప్రారంభించింది. అదే సమయంలో రాహుల్ హీరోగా అడ్వంచరస్ డ్రామాను తెరకెక్కించడానికి రెడీ అవుతుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. రాహుల్ హీరోగా తెరకెక్కిన వెంకటాపురం మే 12న రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
రానాపై నోరు పారేసుకున్న బాలీవుడ్ క్రిటిక్
బాహుబలి 2 సినిమాకు ప్రపంచమంతా బ్రహ్మరథం పడుతుంటే కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు మాత్రం ఆ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్ లో చిన్న సినిమాల విషయంలో కూడా స్పందించే కొంత మంది స్టార్స్, ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన బాహుబలి 2పై స్పందించకపోవటం పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే తనకు తాను క్రిటిక్ అని చెప్పుకునే ఓ కమాల్ ఆర్ ఖాన్ మరో అడుగు ముందుకేసి బాహుబలి 2 యూనిట్ సభ్యులపై విమర్శలకు దిగుతున్నాడు. రానా ట్విట్టర్ పేజ్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కమాల్ ఆర్ ఖాన్. 'నేను ఈ ఇడియట్ ని ఎప్పుడు ఫాలో అవులేదు. ఈ రోజు వరకు అతని గురించి ట్వీట్ కూడా చేయలేదు. అయినా తను మెదడు లేని వాడిగా ప్రూవ్ చేసుకునేందుకు నన్ను బ్లాక్ చేశాడు' అంటూ ట్వీట్ చేశాడు. కమాల్ ట్వీట్ పై జాతీయ మీడియాలో వార్తలు రావడంతో రానా స్పందించాడు. 'ఆ మొరటు వ్యక్తిని ఏడాది కిందటే బ్లాక్ చేశాను' అంటూ రిప్లై ఇచ్చాడు రానా. మరి రానా స్పందన పై కేఆర్ కే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. I never followed this idiot neither tweeted about him till date. Still he blocked me to prove that he is brainless. pic.twitter.com/W93uhUOPuo — KRK (@kamaalrkhan) 2 May 2017 Blocked that bloke almost a year ago!!https://t.co/26IySsZtqU — Rana Daggubati (@RanaDaggubati) 2 May 2017 -
ప్రభాస్.. ఒకేసారి రెండు సినిమాల్లో..!
బాహుబలి సినిమాతో యూనివర్సల్ స్టార్ గామారిపోయిన ప్రభాస్, ఇక మీద అభిమానులను వరుస సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాను ప్రారంభించాడు. టీజర్ కోసం కొద్ది రోజుల షూటింగ్ కూడా చేసిన యూనిట్ ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. ప్రభాస్ హాలీడే ట్రిప్ ముగిసిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన జిల్ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు రాధా కృష్ణన్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సాహోతో పాటు రాధాకృష్ణన్ సినిమా షూటింగ్ లోనూ ఒకేసారి పాల్గొనేలా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాడట. త్వరలోనే ఈ రెండు సినిమాలపై అధికారిక ప్రకటన వెలువడనుందన్న ప్రచారం జరుగుతోంది. -
బాహుబలి 2.. ఆ రెండు దాటితే క్లీన్ స్వీప్
బాహుబలి 2 బాలీవుడ్ టాప్ స్టార్స్‌కు కూడా చెమటలు పట్టిస్తోంది. ఇప్పట్లో బ్రేక్ చేయడం సాధ్యం కాదనిపించే ఎన్నో రికార్డ్ లను బాహుబలి అవలీలాగా చెరిపేసింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో బాహుబలి జోరు మామూలుగా లేదు. ఖాన్ త్రయం సెట్ చేసిన ఎన్నో రికార్డ్లను బాహుబలి ఇప్పటికే బద్ధలు కొట్టింది. అత్యధిక థియేటర్ల రిలీజ్, అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ లాంటి రికార్డ్‌లు బాహుబలి పేరు మీదకు మారిపోయాయి. అయితే ఓవర్ సీస్లో బాహుబలి ముందున్నవి కేవలం రెండు రికార్డ్‌లు మాత్రమే. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన పీకే ఓవర్ సీస్లో 10.56 మిలియన్ డాలర్లు వసూళు చేయగా, దంగల్ సినిమా 12.36 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. అయితే పీకే రికార్డ్‌ను సోమవారం దాటేయనున్న బాహుబలి 2, దంగల్ రికార్డ్‌ను బ్రేక్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి. అత్యంత సమీపంలో ఉన్న ఈ రెండు రికార్డ్లను చెరిపేసి బాహుబలి 2 ఓవర్ సీస్ రికార్డ్లను క్లీన్ స్వీప్ చేయటం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఫుల్ రన్లో బాహుబలి 2, 20 మిలియన్ల మార్క్‌ను సైతం అందుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ శుక్రవారం హాలీవుడ్ సినిమా గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ రిలీజ్ అవుతుండటంతో బాహుబలి 2 థియేటర్లకు కోత పడనుంది. కానీ తరువాత మరో నెలన్నర పాటు పెద్ద సినిమాలేవి లేక పోవటం బాహుబలి 2కి కలిసొచ్చే అంశం. మరి ముందు ముందు ఈ విజువల్ వండర్ ఓవర్ సీస్లో ఇంకెన్నీ రికార్డ్‌లు సెట్ చేస్తుందో చూడాలి. -
బాహుబలి 2లో ఐదు తప్పులు..!
బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అదే స్థాయిలో యూనిట్ ప్రసంశల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు బాహుబలి 2పై తమ అభిప్రాయాలు వెల్లడించగా. యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ మాత్రం ఆసక్తికరంగా స్పందిచాడు. బాహుబలి 2లో ఐదు తప్పులున్నాయంటూ తన ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. ఇంతకీ విఘ్నేష్ చెపుతున్న ఆ తప్పులేంటంటే. '1. కేవలం 120 రూపాయలకే సినిమా చూడాల్సి రావడం. దీనికి పరిష్కారం, నిర్మాత కోసం థియేటర్ల ముందు కలెక్షన్ బాక్స్ లు పెట్టాలి. 2. సినిమా డ్యూరేషన్ చాలా తక్కువగా ఉంది. మూడు గంటల్లోనే సినిమా పూర్తయిపోవడాన్ని సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 3. అత్యంత డీటెయిల్డ్ గా సినిమాను చిత్రీకరించటం.. దీని వల్ల ఇన్నాళ్లు తాము పర్ఫెక్ట్ గా సినిమా చేస్తున్నామనుకునే చాలా మంది దర్శకుల తల పొగరు తగ్గుతుంది. 4. ఇది కన్‌క్లూజన్ అవ్వడానికి వీల్లేదు. ఈ సీరీస్ లో మరో పది సినిమాలు త్వరలోనే చూడాలని కోరుకుంటున్నాం. 5. భవిష్యత్తు ఎంతో కష్టంగా ఉండనుంది. ఎందుకంటే ఈ స్థాయి రికార్డ్ లను బద్ధలు కొట్టి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలంటే మన పరిశ్రమకు ఎన్నో ఏళ్లు పడుతుంది.' అంటూ తన ట్విట్టర్ పేజ్ లో పోస్ట్ చేసిన విఘ్నేష్ శివన్, రాజమౌళి, ప్రభాస్, రమ్యకృష్ణ, సత్యరాజ్ రానాలకు శుబాకాంక్షలు తెలిపాడు. 5 Mistakes in #Baahubali2 Frm Legend @ssrajamouli sir's Masterpiece! TakeABow@meramyakrishnan #prabas #satyaraj @RanaDaggubati &team pic.twitter.com/GRPD3HLnVH — Vignesh ShivN (@VigneshShivN) 1 May 2017 -
హాలిడే తప్పదు మామా
‘‘నువ్వు నా పక్కన ఉన్నంతవరకూ నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా’’... ‘బాహుబలి–2’లో కట్టప్పతో అమరేంద్ర బాహుబలి ఈ డైలాగ్ చెబుతాడు. కట్టప్ప ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమరేంద్ర బాహుబలి అంటే ప్రభాస్ అని కూడా తెలుసు. ఇప్పుడు ఇదే డైలాగ్‌ని మార్చి చెప్పమని ప్రభాస్‌ని అడిగితే.. ‘‘నాలుగేళ్లు నాన్‌స్టాప్‌గా పని చేసిన తర్వాత హాలిడే తీసుకోక తప్పదు మామా...’’ అంటారు. అవును మరి. ‘బాహుబలి’ రెండు భాగాల కోసం ప్రభాస్ మామూలుగా కష్టపడలేదు. నాలుగేళ్లు పూర్తిగా ఈ సినిమాకు డెడికేట్ అయిన ప్రభాస్ కొంచెం రిలాక్స్ కావాలనుకుంటున్నారు. ‘బాహుబలి–2’ రిలీజ్ అయ్యి, మంచి టాక్ తెచ్చుకుంది. పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. ఇక, నెక్ట్స్ మూవీ షూట్లో బిజీ అయ్యేలోపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందనుకున్నారు. అందుకే ప్రభాస్ యూఎస్ చెక్కేశారు. హాలిడే ఎన్ని రోజులు డార్లింగ్? అని అభిమానుల మనసులో ప్రశ్న మెదలకుండా మానదు. ఒక నెల యూస్‌లో ఉండి, డార్లింగ్ ప్రభాస్ ఇండియా వచ్చేస్తారు. ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్లో చేస్తోన్న సినిమాతో బిజీ అయిపోతారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఆ సంగతలా ఉంచితే.. ‘బాహుబలి’ తపస్సులో ఐదేళ్లకు పైనే ఇన్వాల్వ్ అయిన రాజమౌళి కుటుంబం కూడా టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఈ కుటుంబం లండన్ వెళ్లింది. -
బాహుబలి దర్శకుడు, నిర్మాతలపై ఫిర్యాదు
హైదరాబాద్: ఇటీవల విడుదలైన బాహుబలి–2 సినిమాలో తమ కులాన్ని కించపరిచే విధంగా ‘కటిక చీకటి’ అనే పదాన్ని వాడి ఆరె కటికల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపిస్తూ బాహుబలి సినిమా దర్శక, నిర్మాతలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆదివారం ఆరెకటిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో కటిక చీకటి అన్న పదాన్ని వాడటం వల్ల సెన్సార్ నిబంధనలను కూడా ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. ఆ పదాన్ని తొలగించకపోతే దర్శకుడు రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామని అప్పటికీ మార్పు రాకపోతే సినిమా థియేటర్ల వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్, మహేష్, సంతోష్, గురుచరణ్ తదితరులు ఉన్నారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేయాలా వద్దా నిర్ణయం తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
రెండ్రోజుల్లో బాహుబలి కలెక్షన్లు ఎంతో తెలుసా!
హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి: ది కంక్లూజన్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ మూవీ సుల్తాన్ రికార్డును బద్దలుకొట్టింది బాహుబలి-2. తొలి వారాంతంలో రూ. 210.5 కోట్లతో ఉన్న సుల్తాన్ మూవీ గ్రాస్ కలెక్షన్లను కేవలం రెండు రోజుల్లోనే 217 కోట్లతో టాలీవుడ్ మూవీ అదిగమించింది. బాహుబలి-2 రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.382.5 కోట్ల వసూళ్లు రాబట్టి 400కోట్ల కబ్ల్ వైపునకు పరుగులు తీస్తుంది. ఈ విషయాన్ని మూవీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారత్‌లో ఓవరాల్‌గా 285 కోట్లు రాబట్టిన బాహుబలి-2, అమెరికాలో 52.5 కోట్లు, ఇతర దేశాల్లో రూ.45 కోట్ల భారీ వసూళ్లతో చరిత్ర సృష్టించింది. భారత్‌లో తొలివారాంతంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలవడంతో దర్శకుడు రాజమౌళికి ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఆమీర్ ఖాన్ నటించిన పీకే మూవీ ఓవరాల్‌గా 792 కోట్ల వసూళ్లతో భారత్‌లో అగ్రస్థానంలో ఉంది. అయితే బాహుబలి పీకే రికార్డులను తిరగరాసి తొలి వారం రోజుల్లోనే పీకే వసూళ్లను అధిగమిస్తుందని మూవీ ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. #Baahubali2 / #BaahubaliTheConclusion 2 Days WW BO:#India Gross: ₹ 285 Crs#USA - ₹ 52.5 Crs RoW - ₹ 45 Crs Total - ₹ 382.5 Crs — Ramesh Bala (@rameshlaus) 30 April 2017 #Baahubali2 's Day 1 WW Gross - ₹ 217 cr beats #Sultan 's 1st Wknd WW Gross of ₹ 210.5 cr to emerge All-time No.1 1st Wknd Indian Grosser.. — Ramesh Bala (@rameshlaus) 30 April 2017 -
ఉద్వేగానికి గురైన శివగామి
హైదరాబాద్: జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న బాహుబలి 2 సినిమాలో శివగామి దేవి పాత్రలో రమ్యకృష్ణ సత్తాచాటింది. ఈ సినిమాలో ప్రభాస్, రానా, సత్యరాజ్‌లతో పాటు రమ్యకృష్ణ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. రమ్యకృష్ణకు ఫోన్ కాల్స్, మెసేజ్, సోషల్ మీడియా ద్వారా అభినందనలు వెల్లువెత్తున్నాయి. బాహుబలి 2లో తన పాత్రకు వస్తున్న స్పందన, ప్రశంసలు చూసి ఆమె ఉద్వేగానికి గురైంది. తనకు అభినందనలు తెలిపినవారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. 'అభిమానులకు ధన్యవాదాలు. ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేసి అభినందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలు, మద్దతు వల్లే ఈ రోజు ఈ స్థానంలో ఉన్నా. లేకుంటే ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. నాకు చాలా సంతోషంగా, ఉద్వేగంగా ఉంది. జై మహిష్మతి' అంటూ రమ్యకృష్ణ ట్వీట్ చేసింది. ఆమె కెరీర్లో పేరు తెచ్చిన పాత్రల్లో బాహుబలిలోని 'శివగామి' ఒకటి. ఈ సినిమాలో రమ్య నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.