రాజమౌళికి ప్రఖ్యాత దర్శకుడి ప్రశంస | Fear of failure is a great driver of creativity, sasy Shekhar Kapur | Sakshi
Sakshi News home page

రాజమౌళికి ప్రఖ్యాత దర్శకుడి ప్రశంస

Published Tue, May 9 2017 12:16 PM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

రాజమౌళికి ప్రఖ్యాత దర్శకుడి ప్రశంస

రాజమౌళికి ప్రఖ్యాత దర్శకుడి ప్రశంస

హైదరాబాద్‌: బాహుబలి సిరీస్‌ను తెరకెక్కించి ఘన విజయం సాధించిన దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళిపై ప్రశంసలు కురుస్తున్నాయి. వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సినిమా తీసిన రాజమౌళి తెగువను కొనియాడుతున్నారు. ప్రఖ్యాత దర్శకుడు శేఖర్‌ కపూర్‌ కూడా ఈ జాబితాలో చేరారు. రాజమౌళిని ప్రశంసిస్తూ ట్వీట్‌ పెట్టారు. ‘సృజనాత్మక తెగువ ప్రదర్శించి, ఎన్నో కష్టాలను అధిగమించి బాహుబలి 2 సినిమా తీసిన రాజమౌళిని ఎంతో అభిమానిస్తున్నాన’ని ట్వీట్‌ చేశారు.

దీనికి ఎంతో వినమ్రంగా రాజమౌళి సమాధానమిచ్చారు. ‘ఫెయిల్యూర్‌ గురించి భయపడుతూనే సృజనాత్మక ధైర్యంతో ముందడుగు వేస్తుంటాను. మీ శైలిలో సినిమాలు తీయాలన్నది నా కోరిక. కానీ మీలా సినిమాలు తీయలేనని నాకు తెలుసున’ని రాజమౌళి ట్వీట్‌ పెట్టారు. దీనిపై శేఖర్‌ కపూర్‌ స్పందిస్తూ... ‘అపజయం పట్ల భయం సృజనాత్మకతకు గొప్ప చోదకంగా పనిచేస్తుంది. భయాన్ని తెలివైన సృజనాత్మక ప్రక్రియగా మార్చడంలో రాజమౌళి పనితనం అద్భుతమ’ని పేర్కొన్నారు.

మరోవైపు బాక్సాఫీస్‌ వద్ద ‘బాహుబలి 2’  కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. బాలీవుడ్‌ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన శేఖర్‌ కపూర్‌.. మిస్టర్‌ ఇండియా, మసూమ్‌, బండిట్‌ క్వీన్‌, క్వీన్‌ ఎలిజబెత్‌, ది గోల్డెన్‌ ఏజ్‌ సినిమాలు తీశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement