సౌత్‌ ఫిలింఫేర్‌ అవార్డులు-2018 | South Jio Filmfare Awards 2018 Winners | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 17 2018 8:12 AM | Last Updated on Sun, Jun 17 2018 8:25 AM

South Jio Filmfare Awards 2018 Winners - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జియో ఫిలింఫేర్ అవార్డులు-2018 వేడుకల్లో బాహుబలి ది కంక్లూజన్‌ సత్తా చాటింది. 65వ సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కార్యక్రమం గత సాయంత్రం(శనివారం) హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జ‌రిగింది. తెలుగు, త‌మిళ‌, కన్నడ, మళయాళ చిత్ర పరిశ్రమల నటీనటులు ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజర‌య్యారు. తెలుగులో బాహుబ‌లి-2 చిత్రం ఉత్తమ చిత్రంతోపాటు మొత్తం 8 విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. అర్జున్‌ రెడ్డికి చిత్రానికిగానూ ఉత్త‌మ నటుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ, క్రిటిక్స్‌ విభాగంలో వెంకటేష్‌ దగ్గుబాటి గురు చిత్రానికి, ఫిదా చిత్రానికిగానూ ఉత్త‌మ న‌టిగా సాయి ప‌ల్ల‌వి, క్రిటిక్స్‌ విభాగంలో ఉత్తమ నటిగా రితికా సింగ్‌(గురు చిత్రానికి), దర్శకధీరుడు రాజ‌మౌళికి బాహుబ‌లి-2కి ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డులు దక్కాయి. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణకి జీవితకాల సాఫల్య పురస్కారం(లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌) అవార్డు అందించారు. 

తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల అవార్డులను కేటగిరీలుగా పరిశీలిస్తే...

తెలుగు

  • ఉత్తమ చిత్రం - బాహుబలి 2
  •  ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (బాహుబలి 2) 
  • ఉత్తమ నటుడు - విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి) 
  • ఉత్తమ నటి - సాయి పల్లవి (ఫిదా) 
  • ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - వెంకటేష్ (గురు సినిమా)
  • ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - రితికా సింగ్ (గురు) 
  • ఉత్తమ సహాయ నటి - రమ్యకృష్ణ (బాహుబలి 2) 
  • ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (బాహుబలి 2) 
  • ఉత్తమ నటి (తొలి పరిచయం) - కల్యాణ్ ప్రియదర్శన్ (హలో) 
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్ కుమార్ (బాహుబలి 2) 
  • ఉత్తమ కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్ (ఖైదీ, ఫిదా) - అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు, వచ్చిండే 
  • ఉత్తమ గేయ రచయిత - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 - దండాలయ్యా సాంగ్) 
  • జీవితకాల సాఫల్య పురస్కారం - కైకాల సత్యనారాయణ 
  • ఉత్తమ నేపథ్య గాయకుడు - హేమ చంద్ర (ఫిదా - ఊసుపోదు సాంగ్) 
  • ఉత్తమ నేపథ్య గాయని - మధు ప్రియ (ఫిదా - వచ్చిండే సాంగ్) 
  • ఉత్తమ సంగీత దర్శకుడు - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2) 
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (బాహుబలి 2)

తమిళం (కోలీవుడ్‌)

  • ఉత్తమ చిత్రం - అరమ్ 
  • ఉత్తమ దర్శకుడు - పుష్కర్ గాయత్రి (విక్రమ్ వేద) 
  • ఉత్తమ నటుడు - విజయ్ సేతుపతి (విక్రమ్ వేద) 
  • ఉత్తమ నటి - నయనతార (అరమ్) 
  • ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - మాధవన్ (విక్రమ్ వేద), కార్తీ (థీరమ్ అడిగరం ఒంద్రు) 
  • ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - అదితి బాలన్ (ఆరువి) 
  • ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వైరముత్తు (కాట్రు వెలియిదయ్ - వాన్ మూవీ) 
  • ఉత్తమ సహాయ నటి - నిత్యా మీనన్ 
  • ఉత్తమ సహాయ నటుడు - ప్రసన్న 
  • ఉత్తమ నేపథ్య గాయకుడు - అనిరుధ్ రవిచందర్ 
  • ఉత్తమ నేపథ్య గాయని - శశా తిరుపతి 
  • ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహ్మాన్ (మెర్సల్) 
  • ఉత్తమ తొలి నటుడు - వసంత్ రవి (తారామణి) 


మాలీవుడ్‌(మళయాళం)

  • ఉత్తమ చిత్రం - తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్ 
  • ఉత్తమ దర్శకుడు - దిలీష్ పోతెన్ 
  • ఉత్తమ నటుడు - ఫహద్ ఫజిల్ 
  • ఉత్తమ నటి - పార్వతి (టేక్ ఆఫ్) 
  • ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - టొవినో థామస్ 
  • ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - మంజూ వారియర్ 
  • ఉత్తమ సహాయ నటి - శాంతి కృష్ణ 
  • ఉత్తమ సహాయ నటుడు - అలెన్సియెర్ 
  • ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - అన్వర్ అలీ (మిజియి నిన్ను మిజియిలెక్కు) 
  • ఉత్తమ నేపథ్య గాయకుడు - షాబాజ్ అమన్ 
  • ఉత్తమ నేపథ్య గాయని - కేఎస్ చిత్ర 
  • ఉత్తమ సంగీత దర్శకుడు - రెక్స్ విజయన్ (మాయనది) 
  • ఉత్తమ తొలిచిత్ర నటుడు - ఆంటోనీ వర్గీస్ (అంగామలి డైరీస్) 
  • ఉత్తమ తొలిచిత్ర నటి - ఐశ్వర్య లక్ష్మి 

కన్నడ(శాండల్‌వుడ్‌)

  • ఉత్తమ చిత్రం - ఒందు మొట్టెయ కథె 
  • ఉత్తమ దర్శకుడు - తరుణ్ సుధీర్ (చౌక) 
  • ఉత్తమ నటుడు - రాజ్ కుమార 
  • ఉత్తమ నటి - శ్రుతి హరిహరన్ 
  • ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - ధనంజయ 
  • ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - శ్రద్ధా శ్రీనాథ్ 
  • ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వి. నాగేంద్ర ప్రసాద్ (అప్పా ఐ లవ్యూ - చౌక) 
  • ఉత్తమ సహాయ నటి - భవానీ ప్రకాశ్ 
  • ఉత్తమ సహాయ నటుడు - పి రవిశంకర్ 
  • ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్మాన్ మాలిక్ 
  • ఉత్తమ నేపథ్య గాయని - అనురాధ భట్ 
  • ఉత్తమ సంగీత దర్శకుడు - బీజే భరత్ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement