Guru movie
-
ఉత్తమ సినిమా, హీరో.. అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం
రాష్ట్ర చలనచిత్ర అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 2015 చిత్రాలకు గాను ఈ అవార్డులను ఇవ్వనున్నారు. ఉత్తమ నటుడు, నటి, సాంకేతిక విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారిక తమిళనాడు ప్రభుత్వం 2015 ఫిల్మ్ అవార్డులను మార్చి 6న అందించనుంది. ఇందులో 'తని ఒరువన్' చిత్రానికి గాను అత్యధికంగా అవార్డులను సొంతం చేసుకుంది. జయం రవి, అరవింద్ సామీ, నయనతార ప్రధానంగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ హిట్‌ను అందుకుంది. ఉత్తమ చిత్రంగా 'తని ఒరువన్' ఎంపిక అయింది. దీంతో పాటుగా పసంగ 2, ప్రభ, పూతిచ్చుచుటు, 36 వయదిలిలే కూడా ఉత్తమ సినిమాలుగా ఎంపికయ్యాయి. తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో 'ధృవ'గా రామ్ చరణ్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. సూర్య- అమలపాల్ జోడీగా నటించిన పసంగ-2 మూవీ తెలుగులో 'మేము' అనే పేరుతో విడుదలైంది. జ్యోతిక నటించిన 36 వయదిలిలే అనే సినిమా కూడా తెలుగులో '36 వయసు'లో అనే పేరుతో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడిగా 'ఇరుది సుట్రు' చిత్రానికి గాను నటుడు 'మాధవన్' ఎంపికయ్యారు. ఈ సినిమాను వెంకటేశ్ 'గురు' పేరుతో రీమేక్ చేశారు. 36 వయదిలిలే చిత్రానికి గాను 'జ్యోతిక' ఉత్తమ నటిగా ఎంపికైంది. 'వై రాజా వై' చిత్రానికి గాను గౌతమ్ కార్తీక్‌కు ఉత్తమ నటుడిగా ప్రత్యేక అవార్డు లభించింది. 'ఇరుది చుట్టు' చిత్రానికి గానూ రితికా సింగ్‌కు ఉత్తమ నటిగా ప్రత్యేక అవార్డు లభించింది. ఉత్తమ విలన్‌గా 'తని ఒరువన్'లో నటించిన అరవింద్ సామీకి దక్కగా.. ఉత్తమ కథా రచయితగా 'తని ఒరువన్' చిత్రానికి మోహన్ రాజా ఎంపికయ్యారు. పాపనాశం, ఉత్తమ విలన్ చిత్రాలకు గాను జిబ్రాన్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు గెలుచుకున్నారు. 'తని ఒరువన్' చిత్రానికి గానూ రామ్‌జీ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ఎం.జి ఆర్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు కూడా పలు అవార్డులను ప్రరభుత్వం అందించనుంది. అవార్డుల ప్రధానోత్సవం మార్చి 6వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమం రాజా అన్నామలైపురంలో ఉన్న ముత్తమిలిప్ అసెంబ్లీలో జరుగుతుంది. తమిళనాడు అభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.యు.సామినాథన్ అధ్యక్షతన ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు గ్రహీతలకు బంగారు పతకాలు, చెక్కు, జ్ఞాపికలు, ఉత్తమ చిత్రాల నిర్మాతలకు సర్టిఫికెట్లు అందజేస్తారు. -
ఈ సిక్స్ ప్యాక్ బ్యూటీ తెలుగు హీరోయినే.. గుర్తుపట్టారా మరి?
హీరోయిన్ అనగానే వయ్యారం, సుకుమారం, అందం, నాజుకుతనం.. ఇలా చాలా చెబుతారు. కానీ హీరోయిన్లకు సిక్స్ ప్యాక్ దాదాపు అసాధ్యం అని చెప్పొచ్చు. సమంత లాంటి వాళ్లు జిమ్‌కి వెళ్తుంటారు. ఫిట్నెస్తో కేక పుట్టిస్తుంటారు తప్ప బాడీ ప్యాక్ లాంటిది తక్కువ. కానీ ఓ తెలుగు హీరోయిన్ సిక్స్ ప్యాక్‌తో కనిపించి షాకిచ్చింది. ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు రితికా సింగ్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? అవును మీరు ఊహించింది కరెక్టే. విక్టరీ వెంకటేశ్ 'గురు' సినిమా చేశాడు. అందులో లేడీ బాక్సర్‌గా నటించింది ఈ అమ్మాయే. నటి కావడానికి ముందు చాలా ఏళ్ల పాటు ప్రొఫెషనల్ బాక్సర్‌గా పేరు తెచ్చుకుంది. 20 మ్యాచులాడితే 17 గెలిచింది కూడా. (ఇదీ చదవండి: మెట్లపై నిద్రపోయేది.. సుమ సీక్రెట్ బయటపెట్టిన మరో యాంకర్!) అయితే డైరెక్టర్ సుధా కొంగర.. తన తొలి సినిమా 'సాలా ఖాదుస్' అనే బాక్సింగ్ స్టోరీ కోసం హీరోయిన్ని వెతుకుతున్నప్పుడు రితికా కనిపించింది. లేటు చేయకుండానే రియల్ బాక్సర్ అయిన ఆమెతోనే సినిమా తీసేసింది. ఇక ఇది హిట్ అయి, అవార్డులొచ్చేసరికి బాక్సర్ రితిక కాస్త హీరోయిన్ రితిక అయిపోయింది. 'సాలా ఖాదుస్' మూవీని తెలుగులో 'గురు' పేరుతో రీమేక్ చేస్తే ఇందులోనూ రితిక లీడ్ రోల్ చేసింది. దీని తర్వాత తెలుగులో 'నీవెవరో' అనే మూవీ చేసింది గానీ ఓవరాల్‌గా చూసుకుంటే తమిళంలోనే రితిక.. పలు హిట్ సినిమాల్లో నటించింది. ఈ ఏడాది రెండు సినిమాల్లో హీరోయిన్, ఓ సినిమాలో ఐటమ్ సాంగ్, మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. అలా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముంబయి బ్యూటీ.. తాజాగా సిక్స్ ప్యాక్‌తో కనిపించేసరికి అందరూ అవాక్కయ్యారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) -
మరి ఇంత బోల్డ్ గానా?.. హీరోయిన్ పోస్ట్‌పై దారుణ కామెంట్స్!
రితికా సింగ్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గురు మూవీతో టాలీవుడ్లో సినీరంగ ప్రవేశం చేసిన భామ.. తొలి చిత్రానికే నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత తెలుగులో ‘నీవెవ్వరో’ అనే సినిమా చేశారు. ఇటీవలే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోత చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. కాల పక్కారా అంటూ సాగే ఐటమ్ సాంగ్‌తో అభిమానులను అలరించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: వెండితెరపై మరో సిల్క్ స్మిత.. తెగ వైరలవుతున్న ఫోటో!) రితికా జిమ్‌లో సాధన చేసిన తర్వాత ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. అయితే ఇవీ చూసిన నెటిజన్స్ మరీ ఇంత బోల్డ్‌గా ఉన్న ఫోటోలు షేర్ చేయడమేంటని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే దారుణంగా పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఇటీవలే ఆమె మరీ లావుగా ఉందంటూ అభిమానులు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అందుకోసమే తాను బరువు తగ్గి మళ్లీ స్లిమ్ అయ్యానంటూ రితికా పిక్స్ షేర్ చేశారు. అంతే కాకుండా బొద్దుగా ఉన్న శరీరానికి వీడ్కోలు పలుకుతున్నట్లు రితికా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా.. రితికా సింగ్ తమిళ చిత్రం 'ఇరుధి సూత్ర'తో ఫేమస్ అయింది. 'ఆండవన్ కోమండి', 'శివలింగ', 'ఓ మై గాడ్' 'కోలా', బిచ్చగాడు-2 చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా రితికా మార్షల్ ఆర్టిస్ట్ కూడా. అయితే నెటిజన్స్ మాత్రం హాట్ ఫోటో షూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) -
‘వై నాట్’ నుంచి మరో సినిమా!
తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో విభిన్న చిత్రాలను తెరకెక్కిస్తున్న సంస్థ వై నాట్. విక్రమ్ వేద, సాలా ఖడ్డూస్( తెలుగులో ‘గురు’)లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. సక్సెస్ ఫుల్‌గా సినిమాలు నిర్మిస్తున్న ఈ సంస్థ నుంచి మరో ప్రతిష్టాత్మక చిత్రం రానుంది. దీనికి సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ్, తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్చేస్తున్నారు. -
సౌత్ ఫిలింఫేర్ అవార్డులు-2018
సాక్షి, హైదరాబాద్: దక్షిణ చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జియో ఫిలింఫేర్ అవార్డులు-2018 వేడుకల్లో బాహుబలి ది కంక్లూజన్ సత్తా చాటింది. 65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం గత సాయంత్రం(శనివారం) హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్ర పరిశ్రమల నటీనటులు ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలుగులో బాహుబలి-2 చిత్రం ఉత్తమ చిత్రంతోపాటు మొత్తం 8 విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది. అర్జున్ రెడ్డికి చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ, క్రిటిక్స్ విభాగంలో వెంకటేష్ దగ్గుబాటి గురు చిత్రానికి, ఫిదా చిత్రానికిగానూ ఉత్తమ నటిగా సాయి పల్లవి, క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా రితికా సింగ్(గురు చిత్రానికి), దర్శకధీరుడు రాజమౌళికి బాహుబలి-2కి ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డులు దక్కాయి. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణకి జీవితకాల సాఫల్య పురస్కారం(లైఫ్ టైమ్ అచీవ్మెంట్) అవార్డు అందించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల అవార్డులను కేటగిరీలుగా పరిశీలిస్తే... తెలుగు ఉత్తమ చిత్రం - బాహుబలి 2 ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (బాహుబలి 2) ఉత్తమ నటుడు - విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి) ఉత్తమ నటి - సాయి పల్లవి (ఫిదా) ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - వెంకటేష్ (గురు సినిమా) ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - రితికా సింగ్ (గురు) ఉత్తమ సహాయ నటి - రమ్యకృష్ణ (బాహుబలి 2) ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (బాహుబలి 2) ఉత్తమ నటి (తొలి పరిచయం) - కల్యాణ్ ప్రియదర్శన్ (హలో) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్ కుమార్ (బాహుబలి 2) ఉత్తమ కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్ (ఖైదీ, ఫిదా) - అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు, వచ్చిండే ఉత్తమ గేయ రచయిత - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 - దండాలయ్యా సాంగ్) జీవితకాల సాఫల్య పురస్కారం - కైకాల సత్యనారాయణ ఉత్తమ నేపథ్య గాయకుడు - హేమ చంద్ర (ఫిదా - ఊసుపోదు సాంగ్) ఉత్తమ నేపథ్య గాయని - మధు ప్రియ (ఫిదా - వచ్చిండే సాంగ్) ఉత్తమ సంగీత దర్శకుడు - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (బాహుబలి 2) తమిళం (కోలీవుడ్) ఉత్తమ చిత్రం - అరమ్ ఉత్తమ దర్శకుడు - పుష్కర్ గాయత్రి (విక్రమ్ వేద) ఉత్తమ నటుడు - విజయ్ సేతుపతి (విక్రమ్ వేద) ఉత్తమ నటి - నయనతార (అరమ్) ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - మాధవన్ (విక్రమ్ వేద), కార్తీ (థీరమ్ అడిగరం ఒంద్రు) ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - అదితి బాలన్ (ఆరువి) ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వైరముత్తు (కాట్రు వెలియిదయ్ - వాన్ మూవీ) ఉత్తమ సహాయ నటి - నిత్యా మీనన్ ఉత్తమ సహాయ నటుడు - ప్రసన్న ఉత్తమ నేపథ్య గాయకుడు - అనిరుధ్ రవిచందర్ ఉత్తమ నేపథ్య గాయని - శశా తిరుపతి ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహ్మాన్ (మెర్సల్) ఉత్తమ తొలి నటుడు - వసంత్ రవి (తారామణి) మాలీవుడ్(మళయాళం) ఉత్తమ చిత్రం - తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్ ఉత్తమ దర్శకుడు - దిలీష్ పోతెన్ ఉత్తమ నటుడు - ఫహద్ ఫజిల్ ఉత్తమ నటి - పార్వతి (టేక్ ఆఫ్) ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - టొవినో థామస్ ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - మంజూ వారియర్ ఉత్తమ సహాయ నటి - శాంతి కృష్ణ ఉత్తమ సహాయ నటుడు - అలెన్సియెర్ ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - అన్వర్ అలీ (మిజియి నిన్ను మిజియిలెక్కు) ఉత్తమ నేపథ్య గాయకుడు - షాబాజ్ అమన్ ఉత్తమ నేపథ్య గాయని - కేఎస్ చిత్ర ఉత్తమ సంగీత దర్శకుడు - రెక్స్ విజయన్ (మాయనది) ఉత్తమ తొలిచిత్ర నటుడు - ఆంటోనీ వర్గీస్ (అంగామలి డైరీస్) ఉత్తమ తొలిచిత్ర నటి - ఐశ్వర్య లక్ష్మి కన్నడ(శాండల్‌వుడ్) ఉత్తమ చిత్రం - ఒందు మొట్టెయ కథె ఉత్తమ దర్శకుడు - తరుణ్ సుధీర్ (చౌక) ఉత్తమ నటుడు - రాజ్ కుమార ఉత్తమ నటి - శ్రుతి హరిహరన్ ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - ధనంజయ ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - శ్రద్ధా శ్రీనాథ్ ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వి. నాగేంద్ర ప్రసాద్ (అప్పా ఐ లవ్యూ - చౌక) ఉత్తమ సహాయ నటి - భవానీ ప్రకాశ్ ఉత్తమ సహాయ నటుడు - పి రవిశంకర్ ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్మాన్ మాలిక్ ఉత్తమ నేపథ్య గాయని - అనురాధ భట్ ఉత్తమ సంగీత దర్శకుడు - బీజే భరత్ -
డల్లాస్‌లో 'గురు' మూవీ ఫ్రీ షో
డల్లాస్: విభిన్న కార్యక్రమాలతో ప్రవాస తెలుగు వారికి సేవ చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఈ ఆదివారం డల్లాస్ లోని తెలుగువారందరికీ ఒక చిరు కానుకను అందించింది. స్థానిక దేశీప్లాజా సమన్వయంతో కారల్టన్ లోని వెనీషియాన్ థియేటర్ లో 'గురు' తెలుగు చిత్ర ప్రదర్శనను డల్లాస్ వాసులందరికీ ఉచితంగా ఏర్పాటు చేసింది. తెలుగు చిత్ర నిర్మాణంలో తాజాగా వస్తున్న కొత్త తరహా చిత్రాల కోవలోకి చెందిన గురు చిత్రం స్థానికులను విశేషంగా ఆకట్టుకొంది. దీక్ష, పట్టుదల ఉంటే ఎన్ని అవాంతరాలైనా దాటి విజయాన్ని అందుకోవచ్చని ఈ చిత్రం చాటింది. ఈ సందేశాత్మక చిత్రాన్ని ఉచిత ప్రదర్శనకు ఎంచుకొన్నందుకు ప్రేక్షకులు నాట్స్ డల్లాస్ చాప్టర్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని నాట్స్ కార్యవర్గ సభ్యులు రామకృష్ణ మార్నేని, అమర్ అన్నే, బాపు నూతి , శ్రీనివాస్ కోనేరు,విజయ్ వెలమూరి, శేఖర్ అన్నే, చౌదరి అచంట, శ్రీనివాస్ కొమ్మినేని, చైత్యన్య కంచర్ల, వీణ యలమంచిలి, కిషోర్ వీరగంధం, రామకృష్ణ నిమ్మగడ్డ, డల్లాస్ ఇతర కార్యవర్గ సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. దాదాపు 300 మంది ప్రేక్షకులు హాజరై ఈ మూవీని తిలకించారు. డల్లాస్ చాఫ్టర్ కో ఆర్డినేటర్ రామకృష్ణ మార్నేని కార్యక్రమ స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. -
మనల్ని మనం మోసం చేసుకోకూడదు!
ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎత్తుపల్లాలు, తప్పులు సహజం. నా జీవితంలోనూ ఉన్నాయి. ప్రతి హీరో బాగా నటిస్తున్నారు. నేనెప్పుడూ మిగతా హీరోలతో పోల్చుకోను. పోల్చుకోవడం మొదలు పెడితే రాంగ్ స్టెప్ పడుతుంది. మిగతావాళ్ల గురించి ఆలోచించను. మన శక్తి తెలుసుకోకుండా ఎవరో సూపర్‌గా చేస్తున్నారని అనుకోవడం ఎందుకు? నీ సంగతి చూసుకుంటే... మంచి స్థాయికి చేరకుంటావు. సినిమా హిట్ అయితే ఆకాశానికి ఎత్తుతారు. ఫట్ అయితే పరిస్థితి మరోలా ఉంటుంది. కొందరు నన్ను దర్శకత్వం చేయమంటారు? నేను దర్శకత్వానికి సరిపోనని నా అభిప్రాయం. ఎవరో చెప్పింది ఫాలో కాకూడదు. మనమంతా (మనుషులు) సెకండ్ హ్యాండ్ బ్యాచే. అమ్మానాన్నలు పేరు పెడతారు... నువ్వు మంచోడివి అంటే ‘ఒహో... నేను మంచోణ్ణి’ అనుకోవాలి. ఎవరో చెబితేనే... మన వ్యక్తిత్వం వస్తుంది. ఇతరుల అభిప్రాయా లకు మనం ఎక్కువ విలువిస్తాం. అప్పుడు లైఫ్ సెకండ రీనే. మరి, ఫస్ట్ హ్యాండ్ ఎక్కడుంది? అంటే... నీలోనే ఉంది. అది దొరికితే... నువ్వే హీరో. అదేంటంటే... నిజం. ‘‘సరైన లక్ష్యం లేకుండా యాక్సిడెంటల్‌గా సినిమాల్లోకి వచ్చాను. నా సక్సెస్‌లో ఫ్యామిలీతో పాటు దర్శక– నిర్మాతలు, సాంకేతిక నిపుణుల మద్దతు ఎంతో ఉంది. ఆ టైమ్‌కి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేశా. భవిష్యత్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ ప్రయాణంలో కొన్ని తప్పులూ జరిగాయి. వాటి నుంచి కొంత నేర్చుకున్నా. జీవితమంటే ఇదే కదా! ఈ ప్రయాణం ఇలాగే అందంగా సాగాలని కోరుకుంటున్నా’’ అన్నారు వెంకటేశ్. ఆయన హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో ఎస్. శశికాంత్ నిర్మించిన ‘గురు’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వెంకటేశ్ చెప్పిన విశేషాలు.... ►స్కూల్లో స్ట్రిక్ట్ టీచర్ తర్వాత... ఇప్పుడు సమ్మర్లో స్ట్రిక్ట్ కోచ్ వస్తున్నాడు. ఒలింపిక్స్‌లో మేరీ కోమ్ టీమ్‌ను రిప్రజెంట్ చేసిన కోచ్‌లలో ఒకరి జీవితంలో జరిగిన సంఘటనలతో పాటు మరికొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకురాలు సుధ కథ రాశారు. ఎలాంటి లక్ష్యం లేని అమ్మాయిలను విజేతలుగా తీర్చిదిద్దిన ఓ వ్యక్తి కథ ఇది. రాజకీయాల వల్ల అతని జీవితం ఎలా పాడైందో... పేరు ఎలా మసకబారిందో చెప్పే కథ. ఉదాహరణకు... 12 కోట్ల తెలుగు ప్రజల్లో కేవలం 100 మంది మహిళా బాక్సర్లు మాత్రమే ఉన్నారు. అందులో 45 మంది నేషనల్, ఇంటర్నేషనల్ ఛాంపియన్స్. మహిళల సక్సెస్ రేట్ ఎంతుందో చూడండి. దురదృష్టవశాత్తూ... ఎక్కువ మంది స్పోర్ట్స్‌లోకి రావడం లేదు. దీనికి కారణాలు ఏంటి? స్పోర్ట్స్ పాలిటిక్స్ ఏంటనేవి సినిమాలో చూపించాం. ►ఈ వయసులో ఇలాంటి పాత్ర చేయడం నా అదృష్టం. చాలా రోజులుగా వెరీ న్యాచురల్, రియలిస్టిక్ ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలనుకుంటున్నా. నా లుక్ దగ్గర్నుంచి ప్రతిదీ న్యాచురల్‌గా ఉండేలా సుధకు ఫ్రీడమ్ ఇచ్చాను. 30 ఏళ్లుగా ఎన్నో సినిమాలు చేశా. సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. కానీ, మొదటిసారి స్క్రిప్ట్ మొత్తం చదివి, ప్రతి సీన్ ఒకటికి పదిసార్లు రిహార్సల్స్ చేసింది ఈ సినిమా కోసమే. ఇది నాకో సవాల్ అనిపించింది. ఇలాంటప్పుడు నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ఛాన్స్ వస్తుంది. మరింత మెరుగ్గా నటించవచ్చు. రిజల్ట్ కూడా బాగుంటుంది. ఈ స్టైల్లో చేయడం నాకో సవాల్. ►కోచ్ అంటే కొంచెమైనా బాగుండాలి కదా. ఆ లుక్ తీసుకురావడం కోసం ఆర్నెల్లు కష్టపడ్డాను. బాక్సింగ్ కోచ్ బాడీ లాంగ్వేజ్ తెలుసుకోవడానికి కొన్ని బుక్స్ చదివా, సినిమాలు చూశా. ‘జింగిడి.. జింగిడి..’ ట్యూన్ వినగానే మరోసారి పాట పాడే ఛాన్స్ రాదనుకున్నా. ఎంజాయ్ చేస్తూ ఆ పాట పాడాను. ఎక్కువ శాతం ఒరిజినల్ బాక్సర్లు సినిమాలో నటించారు. రితికా సింగ్, ముంతాజ్‌లు కూడా బాక్సింగ్ నేపథ్యం ఉన్నవారే. సంక్రాంతికి సినిమా విడుదల చేయాలనుకున్నా... మ్యూజిక్, రీ రికార్డింగ్ పూర్తి కాలేదు. అందుకే సమ్మర్‌కి వస్తున్నాం. ఇప్పుడు ఫ్యామిలీలు, చిల్డ్రన్ అందరూ ఫ్రీగా ఉంటారు. మంచి సీజన్లో సినిమా వస్తోంది. హ్యాపీ! ►‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ కథపై దర్శకుడు కిశోర్ తిరుమల పూర్తి సంతృప్తిగా లేరు. అందుకే, దాన్ని పక్కన పెట్టాం. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నాం. కానీ, నవల హక్కుల దగ్గర ఏదో సమస్య వచ్చింది. దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా ప్రిపరేషన్ జరుగుతోంది. దానికి మరింత టైమ్ కావాలి. ప్రస్తుతం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనుంది. తర్వాతి సినిమా గురించి ఆ తర్వాత ఆలోచిస్తా. ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనుంది. ►ఎప్పుడూ యంగ్‌గా కనిపించాలనుకోవడం కరెక్ట్ కాదు. పాత్రకు తగ్గట్టు లుక్, గెటప్... అన్నీ మారాలి. ‘దంగల్’లో ఆమిర్‌ఖాన్ ఎలా ఉన్నారు? పెద్ద పొట్టతో పాత్రకు తగ్గట్టు ఎంత బాగా ఎమోషన్స్ పండించారు. ఎప్పుడూ యంగ్‌గా కనిపించాలి.. లేదంటే ఫ్యాన్స్ ఒప్పుకోరని మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ‘గురు’లో పాత్రకు తగ్గట్టు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించా. లుక్ చూసి, ఇండస్ట్రీలో హీరోలు, ప్రముఖుల దగ్గర్నుంచి ప్రేక్షకుల వరకూ... అందరూ ప్రశంసించారు. తర్వాత సినిమాలో పాత్రను బట్టి మాసీగా లేదా క్లాస్‌గా మారతా. -
ఆకట్టుకుంటున్న ‘ గురు’ స్టిల్స్
విక్టరీ వెంకటేశ్ ‘గురు’ సినిమా లేటెస్ట్ స్టిల్స్ అభిమానులను అలరిస్తున్నాయి. మంగళవారం(డిసెంబర్ 13) వెంకీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ లేటెస్ట్ ఫొటోలు విడుదల చేసింది. రేపు టీజర్ విడుదల చేయనున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో హిందీలో ‘సాలా ఖడూస్’గా, తమిళంలో ‘ఇరుది సుట్రు’గా ఏకకాలంలో రూపొందిన చిత్రానికి ‘గురు’ రీమేక్. తెలుగు చిత్రానికి కూడా సుధా కొంగరే దర్శకురాలు. ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించడానికి వెంకీ కండలు పెంచారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న వెంకటేష్ గురు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ అవుతోంది.