ఈ సిక్స్ ప్యాక్‌ బ్యూటీ తెలుగు హీరోయినే.. గుర్తుపట్టారా మరి? | Guru Movie Actress Ritika Singh Six Pack Pic And Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: సినిమాల్లో హీరోయిన్.. బయటమాత్రం ప్రొఫెషనల్ బాక్సర్!

Published Fri, Nov 10 2023 8:46 PM | Last Updated on Fri, Nov 10 2023 9:25 PM

Guru Movie Actress Ritika Singh Six Pack Pic And Details - Sakshi

హీరోయిన్ అనగానే వయ్యారం, సుకుమారం, అందం, నాజుకుతనం.. ఇలా చాలా చెబుతారు. కానీ హీరోయిన్లకు సిక్స్ ప్యాక్ దాదాపు అసాధ్యం అని చెప్పొచ్చు. సమంత లాంటి వాళ్లు జిమ్‌కి వెళ్తుంటారు. ఫిట్‌నెస్‌తో కేక పుట్టిస్తుంటారు తప్ప బాడీ ప్యాక్ లాంటిది తక్కువ. కానీ ఓ తెలుగు హీరోయిన్ సిక్స్ ప్యాక్‌తో కనిపించి షాకిచ్చింది. ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు రితికా సింగ్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? అవును మీరు ఊహించింది కరెక్టే. విక్టరీ వెంకటేశ్ 'గురు' సినిమా చేశాడు. అందులో లేడీ బాక్సర్‌గా నటించింది ఈ అమ్మాయే. నటి కావడానికి ముందు చాలా ఏళ్ల పాటు ప్రొఫెషనల్ బాక్సర్‌గా పేరు తెచ్చుకుంది. 20 మ్యాచులాడితే 17 గెలిచింది కూడా.

(ఇదీ చదవండి: మెట్లపై నిద్రపోయేది.. సుమ సీక్రెట్ బయటపెట్టిన మరో యాంకర్!)

అయితే డైరెక్టర్ సుధా కొంగర.. తన తొలి సినిమా 'సాలా ఖాదుస్' అనే బాక్సింగ్ స్టోరీ కోసం హీరోయిన్ని వెతుకుతున్నప్పుడు రితికా కనిపించింది. లేటు చేయకుండానే రియల్ బాక్సర్ అయిన ఆమెతోనే సినిమా తీసేసింది. ఇక ఇది హిట్ అయి, అవార్డులొచ్చేసరికి బాక్సర్ రితిక కాస్త హీరోయిన్ రితిక అయిపోయింది.

'సాలా ఖాదుస్' మూవీని తెలుగులో 'గురు' పేరుతో రీమేక్ చేస్తే ఇందులోనూ రితిక లీడ్ రోల్ చేసింది. దీని తర్వాత తెలుగులో 'నీవెవరో' అనే మూవీ చేసింది గానీ ఓవరాల్‌గా చూసుకుంటే తమిళంలోనే రితిక.. పలు హిట్ సినిమాల్లో నటించింది. ఈ ఏడాది రెండు సినిమాల్లో హీరోయిన్, ఓ సినిమాలో ఐటమ్ సాంగ్, మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. అలా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముంబయి బ్యూటీ.. తాజాగా సిక్స్ ప్యాక్‌తో కనిపించేసరికి అందరూ అవాక్కయ్యారు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement