నిశ్చితార్థం చేసుకున్న రామ్ చరణ్ 'ఆరెంజ్' హీరోయిన్ | Orange Movie Actress Shazahn Padamsee Engagement With Ashish Kanakia, Photo Goes Viral | Sakshi
Sakshi News home page

Shazahn Padamsee Engagement: బిజినెస్‌మ్యాన్‌తో చరణ్ హీరోయిన్ ఎంగేజ్‌మెంట్

Published Sat, Nov 16 2024 1:50 PM | Last Updated on Sat, Nov 16 2024 2:48 PM

Actress Shazahn Padamsee Engagement With Ashish Kanakia

రామ్ చరణ్ 'ఆరెంజ్' సినిమాలో హీరోయిన్‌గా చేసిన షాజన్ పదమ్సీ నిశ్చితార్థం చేసుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న ఆశిష్ కనాకియ అనే బిజినెస్‌మ్యాన్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త లైఫ్ మొదలుపెట్టేందుకు ఆగలేకపోతున్నా అని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్)

ముంబైకి చెందిన షాజన్.. 2009లో 'రాకెట్ సింగ్' సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాతి ఏడాది తెలుగులో రామ్ చరణ హీరోగా నటించిన 'ఆరెంజ్' మూవీలో రూబా అనే పాత్రలో కనిపించించింది. ఫ్లాష్ బ్యాక్‌లో ఈమె కనిపిస్తుంది. దీని తర్వాత వెంకటేశ్-రామ్ 'మసాలా' సినిమాలోనూ నటించింది. ఈ రెండు ఫ్లాప్ కావడంతో తెలుగులో మరో ఛాన్స్ ఈమెకు రాలేదు.

కెరీర్ మొత్తంలో 6-7 సినిమాలు మాత్రమే చేసిన షాజన్... ప్రస్తుతం జీఓఏటీస్ అనే టీవీ షో చేస్తోంది. ఇప్పుడు 'మూవీ మ్యాక్స్' థియేటర్లకు సీఈఓ అయిన ఆశిష్ కనాకియాతో పెళ్లికి సిద్ధమైంది. వీళ్లిద్దరూ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో వీళ్లిద్దరి పెళ్లి ఉండే అవకాశముంది.

(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement