తమిళ స్టార్ హీరో ధనుష్‌పై హీరోయిన్ నయనతార సంచలన ఆరోపణలు చేసింది. ఇంత దిగజారుతావ్ అనుకోలేదు అనే స్టేట్మెంట్ పాస్ చేసింది. తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికింది. దాదాపు మూడు పేజీలున్న నోట్‌ని నయన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసి అటు నయన్ ఇటు ధనుష్ అభిమానులు షాక్‍లో ఉన్నారు.
ఏం జరిగింది?
నయనతార గతంలో 'నేనూ రౌడీనే' సినిమా చేసింది. దీనికి దర్శకుడు విఘ్నేశ్ శివన్. హీరో ధనుష్ నిర్మాత. ఈ మూవీ చేస్తున్న టైంలోనే విఘ్నేశ్-నయన్ ప్రేమలో పడ్డారు. చాన్నాళ్లపాటు రహస్యంగా రిలేషన్‌లో ఉన్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈమె పెళ్లి, జీవిత విశేషాలతో 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. నవంబర్ 18న దీన్ని రిలీజ్ చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది.
డాక్యుమెంటరీ ట్రైలర్‌లో 'నేనూ రౌడీనే' షూటింగ్ టైంలో తీసిన 3 సెకన్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ సీరియస్ అయ్యాడు. కాపీరైట్ యాక్ట్‌లో భాగంగా లీగల్ నోటీసులు పంపించాడు. ఏకంగా రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. గత కొన్నిరోజులుగా ఈ గొడవ నడుస్తోంది. ఇరువురు మధ్య రాజీ కుదరకపోవడంతో ఇప్పుడు నయన్ ఓపెన్ అయిపోయింది. ధనుష్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ మూడు పేజీల పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: మోసపోయిన 'కంగువ' హీరోయిన్ తండ్రి)
నయన్ ఏమంది?
తండ్రి, ప్రముఖ డైరెక్టర్ అయిన అన్నయ్య అండతో నటుడిగా ఎదిగిన నువ్వు ఇది చదివి అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. సినిమా అనేది ఓ యుద్ధం లాంటిది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రంగంలో పోరాడి నేను ఇప్పుడీ స్థానంలో ఉన్నాను. నా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నేను, నా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నాం. అయితే మాపై నీకు పగ ఉంది. కానీ అది ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన వారి జీవితాలపై అది ప్రభావం చూపిస్తుంది. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు, నా సినిమా క్లిప్స్ ఇందులో జోడించాం. కానీ నాకు ఎంతో ప్రత్యేకమైన 'నానుమ్ రౌడీ దాన్' (తెలుగులో 'నేనూ రౌడీనే') మూవీ క్లిప్స్ మాత్రం ఉపయోగించలేకపోయాం. అందులోని పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్ అవుతాయి. కానీ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నువ్వు నో చెప్పడం నా మనసుని ముక్కులు చేసింది.
బిజినెస్ లెక్కల పరంగా కాపీ రైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేసుంటావ్ అనుకోవచ్చు. కానీ చాలాకాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్ల మేం చాలా బాధపడాల్సి వస్తోంది. 'నానుమ్ రౌడీ దానే' షూటింగ్ టైంలో మేం మా మొబైల్స్‌తో తీసుకున్న వీడియోని ట్రైలర్‌లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట నువ్వు ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్‌లో ఉన్న వాళ్లందరి జీవితాన్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా? డాక్యుమెంటరీ విషయంలో క్లిప్స్ వాడుకునేందుకు కోర్టు ద్వారా నోటీసులు పంపించి ఉండొచ్చు. కానీ నీకు ఓ మనస్సాక్షి అనేది ఉంటుందిగా!
(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్)
సినిమా రిలీజై 10 ఏళ్లు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికే బయటకు ఒకలా, లోపల మరోలా నటిస్తూ ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తున్నావ్? ఈ మూవీ గురించి అప్పట్లో నువ్వు చెప్పిన షాకింగ్ విషయాలు నేను ఇప్పటికీ ఏవి మర్చిపోలేదు. 'నానుమ్ రౌడీ దానే' బ్లాక్ బస్టర్ హిట్ అవడం నీ ఇగోని హర్ట్ చేసిందని నాకు తెలుసు. 2016 ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేడుకలోనూ నీ అసంతృప్తిని బయటపెట్టావ్. బిజినెస్ లెక్కలన్నీ పక్కనబెడితే పబ్లిక్‌లో ఉన్న తోటి వ్యక్తుల జీవితాల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇలాంటి విషయాల్లో కాస్త మర్యాదగా ప్రవర్తిస్తే బెటర్. తమిళనాడు ప్రజలు ఇలాంటి వాటిని సహిస్తారని అనుకోను.
ఈ లెటర్ ద్వారా ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకు తెలిసినవాళ్లు సక్సెస్ అవ్వడం చూసి ఇగో పెంచేసుకున్నావ్, దాన్ని నీ మనసులో నుంచి తీసేస్తావని అనుకుంటున్నాను. ప్రపంచం అందరిది. నీకు తెలిసిన వాళ్లు ఎదిగితే తప్పేం కాదు. బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లు స్టార్స్ అయితే తప్పేం కాదు. వ్యక్తులు ఒక్కటై, హ్యాపీగా ఉంటే తప్పేం కాదు. ఇవన్నీ జరగడం వల్ల నువ్వు కోల్పోయేదేం లేదు. ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని మొత్తం మార్చేసి, కొత్త కథ అల్లేసి, రాబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మరోలా చెబుతావని నాకు తెలుసు అని నయనతార షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: 'పుష్ప 2' చూసి భయపడ్డాను: తమన్)
Comments
Please login to add a commentAdd a comment