Vignesh Shivan
-
ఇది మా బెస్ట్ హాలీడే.. ఫ్యామిలీతో పారిస్‌లో నయనతార (ఫొటోలు)
-
నయనతార భర్త.. ప్రభుత్వ భూమిపై కన్నేశాడా?
హీరోయిన్ నయనతార రీసెంట్ టైంలో చెప్పుకోదగ్గ సినిమాలేం చేయలేదు. కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. దీనికి కారణం వివాదాలు. కొన్నాళ్ల క్రితం తమిళ స్టార్ హీరో ధనుష్‌తో పెద్ద గొడవే పెట్టుకుంది. ఇందులో నయన్ భర్త విఘ్నేశ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇతడిపై షాకింగ్ రూమర్స్ వచ్చాయి. ఏకంగా ప్రభుత్వ భూముల్నే కొనేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. ఇప్పుడు దీనిపై స్వయంగా విఘ్నేశ్ క్లారిటీ ఇచ్చేశాడు.దర్శకుడు విఘ్నేశ్ శివన్.. ఈ మధ్య పుదుచ్చేరికి వెళ్లి ముఖ్యమంత్రి, పర్యాటక శాఖామంత్రిని కలిసి వచ్చాడు. అయితే పుదుచ్చేరి బీచ్ రోడ్లో ప్రభుత్వానికి చెందిన సీగల్ హోటల్ని కొనుగోలు చేసే ప్రయత్నాల్లో విఘ్నేశ్ ఉన్నాడని ప్రచారం మొదలైంది. అందుకే స్వయంగా సీఎంని కలిసి వచ్చాడనే పుకారు వచ్చింది. కానీ ప్రభుత్వ ఆస్తిని అమ్మడం కుదరదని పర్యాటక శాఖామంత్రి చెప్పడంతో విఘ్నేశ్ తిరిగొచ్చేశాడని మాట్లాడుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పుకార్ల అన్ని అబద్ధాలే అని విఘ్నేశ్ శివన్ పేర్కొన్నాడు. తన పాండిచ్చేరి పర్యటన వెనకున్న కారణాన్ని ఇప్పుడు బయటపెట్టాడు. 'నా సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' షూటింగ్ అనుమతి తీసుకునేందుకు అక్కడికి వెళ్ళాను. గౌరవ మర్యాదలతో ముఖ్యమంత్రిని, పర్యాటక శాఖా మంత్రిని కలిశాను. అనుకోకుండా, నాతో పాటు వచ్చిన లోకల్ మేనేజర్.. నా మీటింగ్ తర్వాత దేని గురించో వాళ్ళతో మాట్లాడారు. దీంతో ఆ చర్చ నాకోసమే అని పొరబడుతున్నారు. వస్తున్న రూమర్స్ ఏవి నిజం కాదు' అని విఘ్నేష్ శివన్ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.'నానుమ్ రౌడీ దానే' సినిమాతో దర్శకుడిగా మారిన విఘ్నేశ్ శివన్.. తొలి మూవీతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వడం లేదు. మధ్యలో నయన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మువీ చేస్తున్నాడు. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరోహీరోయిన్లు.(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం) -
విఘ్నేశ్‌తో జీవితం పంచుకోకుంటే బాగుండేది: నయనతార
విఘ్నేశ్ లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో ఊహించుకోవడానికే కష్టంగా ఉందంటోంది నయనతార. కానీ తన వల్ల అతడు విమర్శలపాలవుతున్నాడని, అదే సహించలేకపోతున్నానని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ.. జీవితాన్ని కలిసి పంచుకోకపోయుంటే బాగుండేదేమో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. తనను ఈ రిలేషన్‌షిప్‌లోకి లాగినందుకు గిల్టీగా అనిపిస్తుంది. ఇప్పటికీ అలాగే ఫీలవుతున్నాను. ప్రేమను పంచుకోవాలి కానీ..మా రిలేషన్లో నేనే మొదటి అడుగు వేశాను. నేనే గనక అతడి జీవితంలో లేకపోయుంటే అతడి ప్రతిభను గుర్తించేవారు. డైరెక్టర్‌గా, రచయితగా, గేయరచయితగా తనకు క్రెడిట్ ఇచ్చేవారు. విఘ్నేశ్ మంచి మనసున్న వ్యక్తి. నేను కూడా మంచిదాన్నే. కానీ తనంత మంతనమైతే నాలో లేదనుకుంటా! సక్సెస్ అయిన మనుషులు తమతో సమానంగా సక్సెస్ అయినవారినే పెళ్లి చేసుకోవాలని జనం ఆలోచిస్తారు. ఇక్కడ మీరు ప్రేమను ఎంచుకోవాలి తప్ప విజయాలను, డబ్బును, లగ్జరీని కాదు! అప్పుడే మీరు మరింత ప్రేమలో పడతారు.అందుకేనేమో..విఘ్నేశ్ నాకంటే ఆలస్యంగా కెరీర్ ప్రారంభించాడు. నేను అతడికంటే సీనియర్‌ను. అతడు వరుస బ్లాక్‌బస్టర్స్ ఇవ్వలేదనో, తన సినిమాలు ఆలస్యంగా వస్తున్నాయనో కానీ విఘ్నేశ్‌ను చాలామంది ట్రోల్ చేస్తుంటారు. నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయి, నాకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాను. అతడు ఇంకా తన స్థానం సంపాదించుకునే పనిలోనే ఉన్నాడు. అందుకేనేమో అతడిపై ఎక్కువ ద్వేషం, చులకన! అని నయనతార చెప్పుకొచ్చింది.చదవండి: ట్రెండింగ్‌లో #JusticeforSangeetha.. అంతా త్రిష వల్లే? -
ధనుష్‌తో వివాదం.. సోషల్ మీడియాలో విఘ్నేశ్ మిస్సింగ్!
తమిళ ఇండస్ట్రీలో ధనుష్-నయనతార మధ్య గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. ఈమె లైఫ్, పెళ్లి తదితర అంశాలతో డాక్యుమెంటరీ తీశారు. దాన్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. అయితే ఇందులో తను నిర్మించిన 'నానుమ్ రౌడీదానే' మూవీ సీన్స్ ఉపయోగించడంపై ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 3 సెకన్ల క్లిప్ వాడినందుకు రూ.10 కోట్ల దావా వేశాడు. దీంతో నయనతార పెద్ద పోస్ట్ పెట్టింది.ధనుష్‌ని చెడ్డవాడు అనేలా చిత్రీకరించడానికి నయనతార గట్టిగానే ట్రై చేసింది. లాజికల్‌గా చూసుకుంటే ఈమె చేసింది తప్పయినా సరే ధనుష్‌నే తప్పుబట్టాలని చూసింది. కొన్నిరోజులు ఊరుకున్న ధనుష్.. ఈ మధ్యే నయనతార-ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌కి కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయించాడు. పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని నయనతారని ఆదేశించారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)గొడవ నయన-ధనుష్ మధ్య జరుగుతున్నప్పటికీ కొన్నిరోజుల క్రితం నయనతార భర్త విఘ్నేశ్.. ధనుష్ వీడియో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేసేసరికి దాన్ని డిలీట్ చేశాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హీరో అజిత్ సినిమా 'ఎన్నై అరిందాల్' మూవీ కోసం పాట రాశానని, అదే టైంలో తన తొలి మూవీ 'నానుమ్ రౌడీదానే' చూసి ఆయన మెచ్చుకున్నారని చెప్పాడు.అయితే 'నానుమ్ రౌడీదానే' రిలీజ్ కావడానికి 7 నెలల ముందు అజిత్ మూవీ రిలీజైందని.. అసలు థియేటర్లలోకి రావడానికి ముందు అజిత్ ఎలా సినిమా చూశారని, ఇలా అబద్ధాలు చెప్పడం సరికాదని ధనుష్ అభిమానులు విఘ్నేశ్ని విపరీతంగా ట్రోల్ చేశారు. అలానే ధనుష్ తొలి మూవీ చేసే ఛాన్స్ ఇచ్చారనే కనీస కృతజ్ఞత కూడా విఘ్నేశ్‌కి లేదని అంటున్నారు. దీంతో ఈ గోల భరించలేక విఘ్నేశ్ తన ట్విటర్ ఖాతాని డిలీట్ చేశాడు. (ఇదీ చదవండి: Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!) -
వివరణ ఇవ్వాలి.. నయనతారకి హైకోర్టు నోటీసు
నటి నయనతార, ఆమె భర్త–దర్శకుడు విఘ్నేశ్ శివన్ లకు చెన్నై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే... నయనతార జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా ‘నయనతార: బియాండ్ద ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపొందిన విషయం తెలిసిందే. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమ్ అవుతోంది. కాగా ఈ డాక్యుమెంటరీలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీదాన్ ’ చిత్రంలోని సన్నివేశాలను ఉపయోగించారు. అయితే ఇలా వినియోగించడానికి ధనుష్ అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ధనుష్‌ని విమర్శిస్తూ నయనతార ఒక లేఖను విడుదల చేశారు. అది సినీ వర్గాల్లో చర్చకి దారి తీసింది. ఇక తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీదాన్ ’లోని క్లిప్పింగ్ వాడినందుకు నష్టపరిహారంగా రూ. 10 కోట్లు కోరుతూ నయనతారపై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నయనతార, విఘ్నేష్ శివన్ లకు నోటీసులు జారీ చేశారు. మరి... తదుపరి పరిణామాలేంటి? అనేది వేచి చూడాల్సిందే. – సాక్షి, తమిళ సినిమా -
స్టార్ జంటకు ఘోర అవమానం.. 30 నిమిషాలైనా ఎవరూ కూడా!
సినీతారలు రోడ్డు మీద కనపడితే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు. అంతేకాదు పోటీపడి మరీ వారితో ఫోటోలు దిగేందుకు వెనుకాడరు. సినీతారలకు ఉన్న క్రేజ్ అలాంటిది. బయట ఎక్కడైనా సినీ సెలబ్రిటీలు కనిపిస్తే ఇంకేముంది ఎంచక్కా వారితో సెల్ఫీ కోసం ఎగబడతాం. కానీ అందుకు భిన్నంగా ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటో మీరు చూసేయండి.దక్షిణాది స్టార్ జంటగా గుర్తింపు ఉన్న సెలబ్రిటీ కపుల్ నయనతార- విఘ్నేశ్ శివన్. ఇటీవల నయన్ తన భర్తతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఓ హోటల్‌కు వెళ్లిన నయన్- విఘ్నేశ్ దాదాపు 30 నిమిషాల పాటు లైన్లోనే వెయిట్ చేసిన తర్వాత టేబుల్ దక్కించుకున్నారు. అయితే ఆ సమయంలో వీరిని అక్కడా ఎవరూ కూడా గుర్తు పట్టలేదు. అంతేకాదు వీళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అదే మనమైతే పక్కన పెట్టి ఫోటోల కోసం పోటీ పడేవాళ్లేమో. దీనికి సంబంధించిన వీడియోను విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'17 నవంబర్.. చాలా ఏళ్ల తర్వాత సింపుల్‌గా పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం. ఇలా డిన్నర్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. దాదాపు 30 నిమిషాలు లైన్లో ఉన్నాం. చివరికీ ఒక మంచి టేబుల్ దొరికింది. ఈ వీడియో తీసిన వ్యక్తికి నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు విఘ్నేష్, నయనతార తమ కుమారులతో కలిసి ఢిల్లీలోని కుతాబ్ మినార్ను సందర్శించారు. ఆ జంట రాజధానిలోని ఓ ఫేమస్ హోటల్‌కి వెళ్లారు. అక్కడ కూడా వారిని ఎవరూ గుర్తించలేదు.నయనతార ఇటీవల తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ తర్వాత వివాదంలో చిక్కుకున్నారు. ధనుశ్ హీరోగా నటించిన నానుమ్ రౌడీ ధాన్ సెట్స్ ఓ క్లిప్‌ను ఉపయోగించినందుకు ఆమెకు రూ. 10 కోట్ల లీగల్ నోటీసు పంపారు. ఆ తర్వాత దీనిపై నయనతార ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
ఎరుపు రంగు చీరలో లేడీ సూపర్ స్టార్ ..వైరల్‌గా పెళ్లినాటి పోటోలు
-
నయనతారతో డేటింగ్.. నన్ను ఆ జంతువుతో పోల్చారు: విఘ్నేశ్ శివన్
కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ లేడీ సూపర్ స్టార్ నయనతారను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. అయితే తాజాగా నయనతార తన జర్నీని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ డాక్యుమెంటరీలో నయన్ భర్త విఘ్నేశ్ శివన్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. నయనతారతో డేటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఇందులో వివరించారు. తాను నయన్‌తో డేటింగ్లో ఉన్నప్పుడు పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో తనకు తెలుసన్నారు. ఒక మృగాన్ని అందమైన అమ్మాయి ఎంచుకుంటే దానిని ఎవరూ ఆపలేరంటూ.. నన్ను కుక్కతో పోల్చారని విఘ్నేశ్ శివన్ వెల్లడించారు. కుక్కకు బిర్యానీ తినిపిస్తున్నారని చేసిన మీమ్‌లో మా ఇద్దరి చిత్రాలు ఉన్నాయని విఘ్నేశ్ తెలిపారు.అయితే తాను నయనతారతో డేటింగ్ చేయడంలో తప్పు ఏంటని ట్రోలర్స్‌ను విఘ్నేశ్ ప్రశ్నించాడు. బస్ కండక్టర్ సూపర్ స్టార్ (రజినీకాంత్) అయ్యారు.. మన జీవితంలో ఒక గొప్ప స్థానానికి చేరుకోవడం అంత తేలిక కాదని అన్నారు. మేమిద్దరం లవ్‌లో ఉన్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయని తెలిపారు. వాటిని నేను తేలిగ్గా తీసుకున్నప్పటికీ.. నయనతార గిల్టీగా ఫీలయిందని పేర్కొన్నారు. కొన్నిసార్లు నేను తన జీవితంలో భాగం కాకపోతే.. ఆమె మరింత సంతోషంగా ఉండేదన్న భావనతో కలిగిందని విఘ్నేశ్ శివన్ తెలిపాడు.నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నయన్ తన ప్రేమ జీవితం, కెరీర్ ఆధారంగా తీసుకొచ్చారు. ఆమె తన అరంగేట్రం నుంచి సినీ ప్రయాణం చూపించారు. ఇందులో నాగార్జున, రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, రాధిక శరత్‌కుమార్, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా నటించారు. కాగా.. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత ధనుశ్- నయనతార మధ్య వివాదం మొదలైంది. అనుమతి లేకుండా నానుమ్ రౌడీ ధాన్ మూవీ క్లిప్‌లను ఉపయోగించినందుకు నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారు ధనుశ్. -
ఫ్రీగా నటిస్తున్నారా? ఫ్రీగా ఫుటేజీ ఎందుకివ్వాలి?: నిర్మాత
మూడు సెకన్ల ఫుటేజీ వాడినందుకు మాపై పగ తీర్చుకోవడం సరికాదంటూ హీరోయిన్ నయనతార.. ధనుష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నానుమ్ రౌడీదాన్ (నేనూ రౌడీనే) సినిమాలోని ఓ చిన్న క్లిప్‌ను నయనతార తన డాక్యుమెంటరీలో వాడింది. నిర్మాతగా తన అనుమతి పొందకుండా ఆ క్లిప్ వాడటంతో ధనుష్ రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశాడు. దీంతో నయన్.. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తోంది.. ఇంతలా దిగజారుతావనుకోలేదు అంటూ నానామాటలు అనేసింది.మరి నీ భర్త చేసిందేంటి?ఈ వ్యవహారంపై నిర్మాత ఎస్ఎస్ కుమారన్ స్పందిస్తూ నయనతారను దుయ్యబట్టాడు. ఒకర్ని తప్పుపట్టేముందు తమరి తప్పులు తెలుసుకోవాలని విమర్శించాడు. ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా సినిమాలోని మూడు సెకన్ల ఫుటేజీ వాడుకున్నందుకు ధనుష్ మీకు లీగల్ నోటీసులు పంపాడు. మరి నీ భర్త నేను రిజిస్టర్ చేసుకున్న ఎల్ఐసీ సినిమా టైటిల్‌ను అప్పనంగా వాడేశాడు. నా నిర్ణయాన్ని గౌరవించలేదుఆ టైటిల్ కావాలని ఎవరి ద్వారానో అడిగించాడు. నేనందుకు ఒప్పుకోలేదు. అయినా సరే మీరు నా నిర్ణయాన్ని లెక్క చేయకుండా ఎల్ఐసీ టైటిల్‌తోనే సినిమా చేశారు. మరి దీన్నెలా సమర్థిస్తారు? నా కథకు, ఎల్ఐసీ టైటిల్‌కు కనెక్షన్ ఉండటం వల్లే దాన్ని మీకు ఇవ్వలేనని సున్నితంగా తిరస్కరించాను. కానీ మీరేం చేశారు? ఏం చేసుకుంటావో చేసుకో? అని నా టైటిల్‌ను వాడేశారు. దీనికి ఏమని సమాధానం చెప్తారు?ఎంత కుంగిపోయానో?ఒక ఫుటేజీ కోసం మీ కంటే శక్తిమంతుడైన వ్యక్తి అంగీకారం కోసం రెండేళ్లు ఎదురుచూశారు. నేను చిన్న నిర్మాతను కాబట్టి నన్నసలు లెక్కచేయలేదు. ఇది నాకెంతో బాధేసింది. ఎమోషనల్‌గా ఎంత కుంగిపోయానో నాకు తెలుసు. అది నా సినిమాపైనా ప్రభావం చూపింది.ఉచితంగా యాక్ట్ చేస్తున్నారా?ప్రతి నిర్మాత తన సినిమా కోసం సమయం, డబ్బు వెచ్చిస్తాడు. అలాంటిది.. ఆ సినిమాను మీ వ్యాపారాల కోసం వాడుకోవాలంటే కచ్చితంగా అతడి అనుమతి తీసుకోవాలి. న్యాయపరంగా ముందుకెళ్లాలి. మీరేమీ ఏదీ ఉచితంగా చేయట్లేదు.. కానీ ఫుటేజీ మాత్రం ఫ్రీగా ఇచ్చేయాలి! ఈ దారుణమైన ట్రెండ్‌ను నువ్వు, నీ భర్త ఇండస్ట్రీలో తీసుకురావాలని చూయడం ఘోరం అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: బిగ్‌బాస్ షోలో పృథ్వీ సేఫ్.. ఎంటర్టైనర్ అవుట్ -
మంచివాళ్ళంటే ధనుష్‌కు ఇష్టం ఉండదు: విఘ్నేష్ శివన్
నయనతారకు లీగల్ నోటీసులు పంపిన ధనుష్‌పై ఆమె భర్త విఘ్నేష్ శివన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సాటి మనిషిగా ధనుష్ చేసింది ముమ్మాటికి తప్పు అంటూ ఆయన పేర్కొన్నారు. ధనుష్ అభిమానులు అతని అసలు ముఖం ఎంటో తెలుసుకోవాలని ఒక ఆడియో క్లిప్‌ను విఘ్నేష్ శివన్ షేర్ చేశారు. దీంతో అది నెట్టింట వైరల్ అవుతుంది.ధనుష్ పంపిన లీగల్ నోటీసును విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ధనుష్ మాట్లాడిన ఒక పాత వీడియోను కూడా పంచుకున్నారు. ఆ వీడియోలో ధనుష్ ఇలా అన్నారు 'ఒకరిపై ప్రేమ మరొకరిపై ద్వేషంగా మారుతుంది. అది అలా ఎందుకు మారుతుందో అర్థం కాదు. ప్రపంచం నేడు అత్యంత అధ్వాన్నంగా ఉంది. మంచివాడే ఎవరినీ ఇష్టపడడు. మీరు జీవించండి, జీవించనివ్వండి. ఎవరూ ఎవరినీ ద్వేషించాల్సిన అవసరం లేదు.' అని అన్నారు. మంచివాళ్ళంటే ధనుష్‌కు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించిన ఆయన పాత వీడియోను విఘ్నేష్ శివన్ పోస్ట్ చేశారు. ధనుష్ అభిమానులను ప్రస్తావిస్తూ కూడా విఘ్నేష్ పలు వ్యాఖ్యలు చేశారు. 'మీరందరూ అనుకున్నట్లు ధనుష్ అంత మంచివాడు కాదు. ఈ విషయాన్ని తెలుసుకుంటారని నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.' అని తెలిపారు. ఆపై ధనుష్ కోరిన రూ. 10 కోట్ల విలువగల వీడియో ఇదేనంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విఘ్నేష్ షేర్ చేశారు.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ)ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నయనతార.. సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేంత స్థాయికి చేరుకున్నారు. ఆపై ఆమే ప్రేమించి విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకోవడం ఆపై ఇద్దరు పిల్లలతో ఆమె సక్సెస్ఫుల్ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఆమె డాక్యుమెంటరీని తెరకెక్కించింది. నవవంబర్ 18న విడుదల కానుంది. అయితే, ధనుష్ నిర్మాతగా తెరకెక్కిన 'నేనూ రౌడీనే' అనే చిత్రం నుంచి 3 సెకండ్ల వీడియోను వారు ఉపయోగించుకున్నారు. కాపీ రైట్స్ హక్కుల పరంగా ధనుష్ ఏకంగా రూ. 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ వారికి నోటీసులు పంపారు. ఈ చిత్రంలో నయన్ నటించిగా.. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచే వారిద్దరూ ప్రేమలో పడటం ఆపై పెళ్లి చేసుకోవడంతో ఆ 3 సెకండ్ల వీడియోను ఉపయోగించుకున్నట్లు నయన్ పేర్కొంది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ
తమిళ స్టార్ హీరో ధనుష్‌పై హీరోయిన్ నయనతార సంచలన ఆరోపణలు చేసింది. ఇంత దిగజారుతావ్ అనుకోలేదు అనే స్టేట్మెంట్ పాస్ చేసింది. తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికింది. దాదాపు మూడు పేజీలున్న నోట్‌ని నయన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసి అటు నయన్ ఇటు ధనుష్ అభిమానులు షాక్‌లో ఉన్నారు.ఏం జరిగింది?నయనతార గతంలో 'నేనూ రౌడీనే' సినిమా చేసింది. దీనికి దర్శకుడు విఘ్నేశ్ శివన్. హీరో ధనుష్ నిర్మాత. ఈ మూవీ చేస్తున్న టైంలోనే విఘ్నేశ్-నయన్ ప్రేమలో పడ్డారు. చాన్నాళ్లపాటు రహస్యంగా రిలేషన్లో ఉన్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈమె పెళ్లి, జీవిత విశేషాలతో 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. నవంబర్ 18న దీన్ని రిలీజ్ చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది.డాక్యుమెంటరీ ట్రైలర్లో 'నేనూ రౌడీనే' షూటింగ్ టైంలో తీసిన 3 సెకన్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ సీరియస్ అయ్యాడు. కాపీరైట్ యాక్ట్‌లో భాగంగా లీగల్ నోటీసులు పంపించాడు. ఏకంగా రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. గత కొన్నిరోజులుగా ఈ గొడవ నడుస్తోంది. ఇరువురు మధ్య రాజీ కుదరకపోవడంతో ఇప్పుడు నయన్ ఓపెన్ అయిపోయింది. ధనుష్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ మూడు పేజీల పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: మోసపోయిన 'కంగువ' హీరోయిన్ తండ్రి)నయన్ ఏమంది?తండ్రి, ప్రముఖ డైరెక్టర్ అయిన అన్నయ్య అండతో నటుడిగా ఎదిగిన నువ్వు ఇది చదివి అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. సినిమా అనేది ఓ యుద్ధం లాంటిది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రంగంలో పోరాడి నేను ఇప్పుడీ స్థానంలో ఉన్నాను. నా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నేను, నా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నాం. అయితే మాపై నీకు పగ ఉంది. కానీ అది ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన వారి జీవితాలపై అది ప్రభావం చూపిస్తుంది. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు, నా సినిమా క్లిప్స్ ఇందులో జోడించాం. కానీ నాకు ఎంతో ప్రత్యేకమైన 'నానుమ్ రౌడీ దాన్' (తెలుగులో 'నేనూ రౌడీనే') మూవీ క్లిప్స్ మాత్రం ఉపయోగించలేకపోయాం. అందులోని పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్ అవుతాయి. కానీ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నువ్వు నో చెప్పడం నా మనసుని ముక్కులు చేసింది.బిజినెస్ లెక్కల పరంగా కాపీ రైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేసుంటావ్ అనుకోవచ్చు. కానీ చాలాకాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్ల మేం చాలా బాధపడాల్సి వస్తోంది. 'నానుమ్ రౌడీ దానే' షూటింగ్ టైంలో మేం మా మొబైల్స్‌తో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట నువ్వు ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాన్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా? డాక్యుమెంటరీ విషయంలో క్లిప్స్ వాడుకునేందుకు కోర్టు ద్వారా నోటీసులు పంపించి ఉండొచ్చు. కానీ నీకు ఓ మనస్సాక్షి అనేది ఉంటుందిగా!(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్)సినిమా రిలీజై 10 ఏళ్లు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికే బయటకు ఒకలా, లోపల మరోలా నటిస్తూ ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తున్నావ్? ఈ మూవీ గురించి అప్పట్లో నువ్వు చెప్పిన షాకింగ్ విషయాలు నేను ఇప్పటికీ ఏవి మర్చిపోలేదు. 'నానుమ్ రౌడీ దానే' బ్లాక్ బస్టర్ హిట్ అవడం నీ ఇగోని హర్ట్ చేసిందని నాకు తెలుసు. 2016 ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేడుకలోనూ నీ అసంతృప్తిని బయటపెట్టావ్. బిజినెస్ లెక్కలన్నీ పక్కనబెడితే పబ్లిక్‌లో ఉన్న తోటి వ్యక్తుల జీవితాల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇలాంటి విషయాల్లో కాస్త మర్యాదగా ప్రవర్తిస్తే బెటర్. తమిళనాడు ప్రజలు ఇలాంటి వాటిని సహిస్తారని అనుకోను.ఈ లెటర్ ద్వారా ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకు తెలిసినవాళ్లు సక్సెస్ అవ్వడం చూసి ఇగో పెంచేసుకున్నావ్, దాన్ని నీ మనసులో నుంచి తీసేస్తావని అనుకుంటున్నాను. ప్రపంచం అందరిది. నీకు తెలిసిన వాళ్లు ఎదిగితే తప్పేం కాదు. బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లు స్టార్స్ అయితే తప్పేం కాదు. వ్యక్తులు ఒక్కటై, హ్యాపీగా ఉంటే తప్పేం కాదు. ఇవన్నీ జరగడం వల్ల నువ్వు కోల్పోయేదేం లేదు. ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని మొత్తం మార్చేసి, కొత్త కథ అల్లేసి, రాబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోలా చెబుతావని నాకు తెలుసు అని నయనతార షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' చూసి భయపడ్డాను: తమన్) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
పిక్చర్ ఫెర్ఫెక్ట్.. భర్త, కొడుకులతో నయనతార ఫుల్ హ్యాపీ (ఫొటోలు)
-
ఓటీటీలో నయనతార లైఫ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో నయనతార లైఫ్ స్టోరీ రానుంది. కొన్నిరోజుల క్రితం ఇందుకు సంబంధించిన పోస్టర్ వదిలారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా నయన్ జీవితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు తదితర విషయాల్ని స్వయంగా ఆమెనే చెప్పింది. 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో ఈ డాక్యుమెంటరీ తీశారు.ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్.. ఈ డాక్యుమెంటరీని డైరెక్ట్ చేశాడు. నవంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ చూస్తే.. నయన్ గురించి కన్నడ హీరో ఉపేంద్ర, తెలుగు హీరో నాగార్జున, తమిళ నటి రాధిక, తమిళ డైరెక్టర్స్ అట్లీ, నెల్సన్ మాట్లాడటం చూపించారు. చివర్లో దర్శకుడు విఘ్నేశ్.. నయనతారతో తన ప్రేమ ఎప్పుడు మొదలైందో చెప్పకనే చెప్పాడు.(ఇదీ చదవండి: పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. తమిళ నటి పోస్ట్ వైరల్)నేను మనుషుల్ని త్వరగా నమ్మేస్తాను, నా గురించి పేపర్ లో వచ్చేవన్నీ చూసి అమ్మ చాలా భయపడేది లాంటి విషయాలు నయన్ చెప్పింది. అసలు మీ జీవితాన్ని నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంట్ సిరీస్‌గా ఎందుకు తీసుకురావాలని అనుకున్నారని అడగ్గా.. పక్కనోళ్ల హ్యాపీనెస్ చూసి, అందరూ హ్యాపీగా ఫీలవ్వాలని నేను అనుకున్నా. అందుకే దీనికి ఒప్పుకొన్నా అని చెప్పింది.నయన్ చెప్పడం బాగానే ఉంది గానీ అంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. అలానే నయనతార గతంలో తమిళ హీరో శింబు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారాలు నడిపింది. కాకపోతే అవి తర్వాత స్టేజీకి వెళ్లలేదు. బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈ విషయాల్ని ఏమైనా ఈ సిరీస్‌లో చూపిస్తారా? లేదంటే విఘ్నేశ్‌తో ప్రేమ, పెళ్లి వరకు మాత్రమే చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి) -
నయన్ ఇంట ఆయుధపూజ... పిల్లలతో బహుమతులు ఇప్పించిన విఘ్నేష్ శివన్ (ఫోటోలు)
-
హ్యాపీ బర్త్‌డే : మా ‘ప్రాణం, ప్రపంచం’ మీరే - స్టార్ దంపతులు (ఫొటోలు)
-
విఘ్నేశ్ శివన్ బర్త్ డే.. బుర్జ్ ఖలీఫా వద్ద సెలబ్రేషన్స్!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం దుబాయ్‌లో చిల్ అవుతోంది. సైమా వేడుకలకు హాజరైన ముద్దుగుమ్మ తన భర్త పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా భర్త బర్త్ డే వేడుకను దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ముందు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వద్ద విఘ్నేష్ శివన్ కోసం బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేసుకుంది. ఈ పుట్టినరోజు వేడుకలకు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, నటుడు కవిన్ కూడా హాజరయ్యారు. కాగా.. అంతుకుముందు భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ తెలిపింది. నా జీవితంలో అన్ని నువ్వే అంటూ నయన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.కాగా.. ఇటీవల జరిగిన సైమా- 2024 వేడుకల్లో నయనతార ఉత్తమ నటి అవార్డ్‌ను గెలుచుకుంది. విఘ్నేష్ శివన్ సైతం ఉత్తమ లిరిసిస్ట్ అవార్డ్ దక్కించుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే నయనతార టెస్ట్ అనే చిత్రంలో కనిపించనుంది. అంతేకాకుండా 'మన్నంగట్టి 1960' మూవీలో నటిస్తోంది. ఆ తర్వాత మూకుతి అమ్మన్ 2, డియర్ స్టూడెంట్స్ చిత్రాల్లో నటించనుంది. మరోవైపు ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీక చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. -
భర్త పుట్టినరోజు.. బోలెడంత ప్రేమతో నయనతార పోస్ట్ (ఫొటోలు)
-
కేరళకు భారీ సాయం ప్రకటించిన 'నయనతార' దంపతులు
స్టార్ హీరోయిన్ నయనతార- విగ్నేష్ శివన్ దంపతులు మంచు మనసు చాటుకున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విలయంలో వేల సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల వల్ల తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి ఇప్పుడు వయనాడ్‌లో కనిసిస్తుంది. జల ప్రళయం వల్ల ఇప్పటి వరకు సుమారు 300 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. కేరళ ప్రజలను ఆదుకునేందకు ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు ముందుకొచ్చారు. తాజాగా నయనతార దంపతులు కూడా తమ వంతుగా కేరళ కోసం విరాళం ప్రకటించారు.కేరళకు జరిగిన నష్టాన్ని ఎవరూ భర్తి చేయలేరంటూ నయనతార భర్త విగ్నేష్ శివన్ ఒక నోట్ విడుదల చేశారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తమ వంతుగా రూ. 20 లక్షలు అందిస్తున్నట్లు అందులో వారు పేర్కొన్నారు. కేరళ ప్రజల కష్టాలను చూస్తుంటే కన్నీటితో తమ గుండె బరువెక్కుతుందని వారు తెలిపారు. కేరళ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు అంటూ నయనతార దంపతులు తెలిపారు. సూర్య, జ్యోతిక, కార్తీ రూ. 50 లక్షలు... విక్రమ్ రూ. 20 లక్షలు, మమ్ముట్టి రూ.20 లక్షలు, దుల్కర్ సల్మాన్ రూ. 15 లక్షలు,ఫహాద్ ఫాజిల్- నజ్రియా దంపతులు రూ.25 లక్షలు, రష్మిక మందన్నా రూ. 10 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
Vignesh Shivan: నువ్వు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడినే కాదు (ఫోటోలు)
-
నువ్వు లేకపోతే ఇంతదూరం వచ్చేవాడినే కాదు: విఘ్నేశ్
తల్లిగా/ తండ్రిగా ప్రమోషన్ పొందాకే పేరెంట్స్ విలువ బాగా అర్థమవుతుంది. సామాన్యులే కాదు సెలబ్రిటీల విషయంలోనూ అంతే! తనకు కూడా తండ్రయ్యాకే అమ్మానాన్నల విలువ బాగా తెలిసొచ్చిందంటున్నాడు దర్శకుడు విఘ్నేశ్ శివన్. శనివారం విఘ్నేశ్ తల్లి పుట్టినరోజు. ఈ సందర్భంగా తల్లితో దిగిన ఫోటో షేర్ చేసిన విక్కీ సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చాడు. పేరెంట్స్ కూడా ఇలాగే..నేను నా పిల్లల్ని చూసిన ప్రతిసారి నాలో పొంగే ప్రేమను మాటల్లో వర్ణించలేను. ఎన్ని ఏండ్లు దాటినా ఈ ప్రేమ ఇలాగే ఉంటుందని తెలుసుకున్నాను. తల్లిదండ్రులు కూడా మన విషయంలో ప్రతిరోజు ఇలాగే ఫీల్ అవుతారు కదా! పిల్లల్ని వారికి నచ్చినట్లుగా సంతోషంగా ఉండనిద్దామనుకుంటారు. హ్యాపీ బర్త్‌డే నా మీనా కుమారి. నువ్వు లేకపోతే నేను ఇంతదూరం వచ్చేవాడినే కాదు. లవ్యూ మమ్మీ..దేవుడు మంచివాడుఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. నాకింత మంచి కుటుంబాన్ని, ఎన్నో జ్ఞాపకాలను అందించిన ఆ దేవుడు చాలా మంచివాడు. ఆయన ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయమ్మా.. అని రాసుకొచ్చాడు. సినిమాల విషయానికి వస్తే విఘ్నేశ్ ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial)చదవండి: నేను, మహేశ్‌బాబు హీరోయిన్ను ఏడిపించాం: సుధ -
బాహుబలి పోస్టర్‌ను రీక్రియేట్ చేసిన స్టార్..
ఫాదర్స్ డే (జూన్ 16) రోజు అందరూ తమ తండ్రి గొప్పదనాన్ని, మంచితనాన్ని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే పై ఫోటోలో కుమారుడిని పైకెత్తి పట్టుకున్న వ్యక్తి మాత్రం.. పిల్లలు వచ్చాకే తన జీవితం సంతృప్తికరంగా మారిందంటున్నాడు. ఇంతకీ ఇలా చిన్నారులను బాహుబలిలా ఎత్తుకుంది ఎవరో కాదు. దర్శకుడు విఘ్నేశ్ శివన్. ఫాదర్స్ డేను నయనతార, విఘ్నేష్‌శివన్ తమ కవల పిల్లలతో చాలా జాలీగా గడిపారు. ఈ సందర్భంగా నయనతార తన భర్త విఘ్నేష్‌శివన్, పిల్లలు ఉయిర్, ఉలగంలతో సరదాగా గడిపిన సన్నివేశాలకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. విఘ్నేష్ శివన్ నీటిలో మునిగి తన పిల్లలను చేతిలో పైకెత్తి పట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన జీవితంలో సంతోషానికి కారణం ఉయిర్, ఉలగం అని, వారిని ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara)చదవండి: కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్‌లో మోస్ట్ ఫేమ్ ఉన్న ఫేమ్ ఉన్న జంటల్లో నయనతార- విఘ్నేశ్ శివన్ ఒకరు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు జూన్ 9, 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసి పద్ధతిలో కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. తాజాగా ఇవాళ రెండో వివాహా వార్షికోత్సవం సందర్భంగా నయన భర్త విఘ్నేశ్ శివన్ స్పెషల్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తన భార్యతో కలిసి చిల్ అవుతోన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్. ఇవాళ మా రెండో వివాహా వార్షికోత్సవం. నిన్ను పెళ్లి చేసుకోవడం, ఉయిర్ ఉలగం రావడం నా జీవితంలోకి అతి గొప్పవిషయం. నా భార్య తంగమేయిని చాలా ప్రేమిస్తున్నా. నీతో మరెన్నో ఆహ్లాదకరమైన సమయాలు, జ్ఞాపకాలు, విజయవంతమైన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాంటి పరిస్థితుల్లనైనా నీకు తోడుగా ఉంటా. ఆ భగవంతుడు ఎల్లవేళలా మనకు అండగా నిలవాలని కోరుకుంటున్నా. మన ఉయిర్, ఉలగంతో సంతోషంగా ఉండాలనేదే ఆశయం. ఆలాగే మన పెద్ద పెద్ద ఆశయాలు నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. నయన్ గతేడాది జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఆమె నటించిన అన్నపూరణి చిత్రం విమర్శల పాలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
-
12 ఏళ్ల క్రితం.. చెప్పులేసుకుని ఇక్కడ నిలబడ్డా.. వెయ్యి రూపాయలతో..
సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది కింది స్థాయి నుంచి పైకి వచ్చినవారే! అలాంటివారిలో తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఒకరు. ఎన్నో కష్టాలను దాటుకుని గొప్ప స్థాయికి ఎదిగాడు. తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య నయనతార, కవల పిల్లలతో కలిసి హాంకాంగ్ ట్రిప్పుకు వెళ్లాడు. అక్కడున్న పర్యాటక ప్రదేశాలన్నింటినీ కుటుంబంతో చుట్టేస్తున్నాడు.12 ఏళ్ల తర్వాత..ఈ క్రమంలో తాజాగా డిస్నీల్యాండ్ రిసార్ట్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనలయ్యాడు. 12 ఏళ్ల క్రితం కాళ్లకు చెప్పులు వేసుకుని కేవలం వెయ్యి రూపాయలతో ఇక్కడ నిల్చున్నాను. పోడా పొడి షూటింగ్ కోసం అనుమతివ్వమని అర్థించాను. పుష్కరకాలం తర్వాత మరోసారి నా లవ్లీ బేబీస్ నయనతార, ఉయిర్, ఉలగ్‌తో డిస్నీలాండ్ రిసార్ట్‌లో అడుగుపెట్టాను. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ఎంతో భావోద్వేగంగా, ఆనందంగా, సంతృప్తిగా ఉంది. జీవితం ఎంత అందమైనదో కదా.. నిజంగా ఆ దేవుడు చాలా మంచివాడు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కాగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం పొడా పోడి. ఈ సినిమాలోని అప్పన్ మవనే వాడ పాట సాంగ్ షూటింగ్ అంతా హాంకాంగ్‌లోని డిస్నీల్యాండ్ రిసార్ట్‌లోనే జరిగింది. ఇందులో శింబు హీరోగా వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) చదవండి: జాతరలో మాస్ స్టెప్పులేసిన టాలీవుడ్ హీరో.. వీడియో వైరల్ -
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
సౌత్ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార సిండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్ధాలు దాటినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమె కాస్మొటిక్స్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది. తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఈ మధ్య ఎక్కువగా ఆమె పలు దేవాలయాల చుట్టు తిరుగుతూ తన భర్తతో కలిసి పూజలు నిర్వహిస్తుంది. దీంతో వరుసగా పుణ్యక్షేత్రాలు, ప్రత్యేక పూజలు చేయడం వెనుక కారణం ఏమైనా ఉందా..? ఆమె జాతకంలో దోశం ఏమైనా ఉందా..? ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒకటే చర్చ జరుగుతుంది.నయనతార జాతకంలో దోషం ఉందని, అందుకే విక్కీతో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఆమె పలు దేవాలయాలను సందర్శిస్తూ పూజలు, పరిహారాలు చేస్తోందని ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాలకు కూడా కాస్త బ్రేక్ ఇచ్చి మరీ.. పుణ్యక్షేత్రాల చుట్టూ ఆమె తిరగడం విశేషం. వాస్తవంగా నయనతారకు కాస్త దైవభక్తి ఎక్కువేనని చెప్పవచ్చు. తన వివాహం అయిన వెంటనే ఆ పట్టు వస్త్రాలతోనే తిరుమల శ్రీవారిని ఆమె సందర్శించిన విషయం తెలిసిందే. వారి పెళ్లి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కొద్దిరోజుల క్రితం నయన్,విక్కీ విడిపోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో వారు క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్‌కు ఫుల్స్టాప్ పడింది. ఇలాంటి వార్తలు వచ్చిన కొద్దిరోజుల తర్వాత నయనతార జంటగా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. నయనతార జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారని సమాచారం. తన భర్తతో కలిసి సంతోషంగా జీవించేందుకు పలు పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ఆ హీరో వల్లే ఒక్కటైన నయన్-విఘ్నేశ్ (ఫోటోలు)
-
నయన్- విఘ్నేశ్‌లను కలిపిన స్టార్ హీరో ఎవరంటే?
నయనతార- విఘ్నేశ్ శివన్.. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే స్టార్ కపుల్. నయనతార హీరోయిన్గా నటించిన నానుమ్ రౌడీ దాన్ (2015) సినిమాకు విఘ్నేశ్ (విక్కీ) దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో నేను రౌడీ అనే టైటిల్ పేరిట రిలీజైంది. ఆ సినిమా షూటింగ్లో ఏర్పడిన పరిచయం కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఏడేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2022 జూన్ 9న పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సరోసగి ద్వారా ఉయిర్, ఉలగం అని ఇద్దరు కుమారులకు తల్లిదండ్రులయ్యారు. ఇకపోతే వీరి మధ్య లవ్ పుట్టడానికి ఓ స్టార్ హీరో కారణమంటున్నాడు విక్కీ. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నానుమ్ రౌడీ ధాన్ కథ నయనతారకు చెప్పమని ధనుష్ సరే సూచించాడు. అలా ఆమె ఈ సినిమాలోకి వచ్చింది. మొదట్లో ఈ స్క్రిప్ట్ నచ్చలేదన్న విజయ్ సేతుపతి నయన్ ఓకే చేసిందనగానే తను కూడా సంతకం చేశాడు. ఈ సినిమా వల్ల నయన్‌కు ఎక్కువ సమయం కేటాయించాను. తెలియకుండానే ఇద్దరం ప్రేమలో పడిపోయాం. ఒకరకంగా మా ప్రేమకు ధనుషే కారణమయ్యాడు' అని చెప్పాడు. నానుమ్ రౌడీ ధాన్ మూవీకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. -
Nayanthara-Vignesh Shivan Photos: భర్తను వదిలి ఉండలేకపోతున్న నయనతార
-
20 రోజులు దూరంగా.. భర్త కోసం అల్లాడిపోయిన నయనతార
కోలీవుడ్‌లో సంచలన జంట ఎవరైనా ఉన్నారంటే అది నయనతార, విఘ్నేశ్ శివన్నే. వీరు సుదీర్ఘ ప్రేమలో ఉన్న తరువాత పెళ్లికి సిద్ధం అయ్యారు. 2022 జూన్ 9వ తేదీన వివాహం చేసుకున్నారు. అలాగే సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వారికి ఉయిర్, ఉలగం అని నామకరణం చేశారు. పెళ్లికి ముందు వరకూ పుట్టిన రోజులు, పండుగలు అంటూ ట్రిప్పుకు వెళ్తూ.. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేవారు. రాక కోసం ఎదురుచూశాం ఇప్పుడు తమ కవల పిల్లలతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా విదేశానికి వెళ్లిన భర్త విఘ్నేశ్ శివన్‌ను ఎంతగానో మిస్ అయ్యామంది నయనతార. తాను, తన పిల్లలు అతడి రాకకోసం ఎదురు చూశామని, విఘ్నేశ్ శివన్ తిరిగి వచ్చిన తరువాత ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారో తెలుపుతూ ఇన్‌స్ట్రాగామ్‌లో ఫోటోలు షేర్ చేసింది. మాటల్లో చెప్పలేం.. విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం ఏల్ఐసీ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా, నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కోసం ఇటీవల సింగపూర్ వెళ్లారు. ఈ చిత్రం సింగపూర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా నయనతార తన ఇన్‌స్ట్రాగామ్‌లో '20 రోజుల ఎదురుచూపుల తర్వాత నిన్ను చూస్తుంటే మాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేము. నిన్ను ఎంతో మిస్ అయ్యాం' అని పేర్కొన్నారు. అందులో పిల్లలతో కలిసున్న ఫొటోలను పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
భర్తతో నయనతార ఎప్పటికీ విడిపోదు.. అసలు సీక్రెట్ ఏమిటంటే
సౌత్ ఇండియాలో నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్ నయనతార. ఆమె సినీ పయనం ఒక సంచలనం. అవమానాలు, ఆరోపణలు, వివాదాలమయ జీవితం. అయితే అందులోనూ ఆనందాన్ని వెతుక్కుంటూ అకుంఠిత శ్రమతో నంబర్ వన్ నటి అనే అంతస్తులో నిలిచారు. సూపర్ స్టార్‌గా అత్యంత అధిక పారితోషికం తీసుకుంటున్న ఇండియన్ నాయకిగా రాణిస్తున్నారు. రెండు మూడు సార్లు ప్రేమలో ఓడిపోయి చివరికి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమను పొంది, ఆయనతో గత రెండేళ్ల క్రితం ఏడు అడుగులు వేశారు. ఇప్పుడు వీరికి ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కథానాయకిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న నయనతార తనకు సంబంధించిన సినీ, వ్యక్తిగత విషయాలను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేయడంతో పాటు అప్పుడప్పుడు వివాదాస్పదమైన విషయాలను పొందుపరుస్తూ షాకింగ్‌కు గురి చేస్తుంటారు. భర్త విగ్నేష్ శివన్, పిల్లలు ఉయిర్, ఉలగంతో ఎంతో అన్యోన్యంగా ఉండే నయనతార ఇటీవల తాను ఓడిపోయాను అంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో చేసిన పోస్ట్ అందరిని షాక్‌కు గురి చేసింది. దర్శకుడు విగ్నేశ్ శివన్‌తో మనస్పర్థలా? ఇద్దరు విడిపోతున్నారా? అసలు వీరి మధ్య ఏం జరుగుతోంది? అంటూ పలు ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే తన భర్త పిల్లలతో ఆనందంగా గడుపుతున్న ఫొటోలను ఆమె పోస్ట్ చేశారు. దీంతో అదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. కాగా నయనతార విగ్నేష్ శివన్ విడిపోతారనే పదానికే తావు లేదని విశ్లేషకులు అంటున్నారు. నయనతార ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టించడానికి సలహాలు ఇచ్చిందే విగ్నేష్ శివన్ అని, ఎంతో కష్టపడి కూడబెట్టిన ఆస్తులు, చేస్తున్న వ్యాపారాలకు ఆమె భర్త విగ్నేష్ శివన్ ఫౌండర్గానో, కో ఫౌండర్గానో ఉన్నారని, కాబట్టి విడిపోయే ఛాన్సే లేదని విశ్లేషకులు చెబుతున్న మాట. -
ఓడిపోయానంటూ పోస్ట్.. విఘ్నేష్ , నయనతారల మధ్య ఏం జరుగుతుంది?
నేను ఓడిపోయాను అని నటి నయనతార తన ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పేర్కొన్నారు. ఇప్పుడిది పెద్ద చర్చకి దారి తీస్తోంది. లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న బహుభాషా నటి నయన తార. నాలుగు పదుల వయసులోనూ అగ్రకథా నాయకిగా రాణిస్తూ అత్యధిక పారితోషికం పు చ్చుకుంటున్న నటి ఈమె. ఇటీవల జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అందుకున్నారు. దీంతో ఈ సంచలన నటికి మరింత డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె తమిళంలో శశికాంత్ దర్శకత్వంలో టెస్ట్, యూ ట్యూబర్ డ్యూడ్ విక్కీ దర్శకత్వంలో మన్నాంగట్టి, తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐసీ, దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా తన భర్తతో కలిసి చిత్ర నిర్మాణం చేపట్టారు. మరో పక్క ఇతర వ్యాపార రంగాలలోనూ బిజీ గా వున్నారు. కాగా 2022లో దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే సరోగసి విధానం ద్వారా ఈ జంట ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. వీరికి సంబంధించిన ఫొటోలను నయనతార తరచూ తన ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. కాగా సమీప కాలంలో ఆమె తన భర్త విఘ్నేష్ శివన్‌ను అన్పాలో చేస్తూ చేసిన పోస్టు పెద్ద చర్చకే దారి తీసింది. దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ ఇద్దరు విడిపోబోతున్నారా? అనే చర్చ జరుగుతోంది. దీనికి ఆజ్యం పోసే విధంగా తాజాగా నటి నయనతార నేను ఓడిపోయాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొనడం మరింత అలజడికి దారి తీస్తోంది. దీంతో విఘ్నేష్ శివన్, నయనతారల మధ్య అసలు ఏం జరుగుతోంది? నయనతార ఇలా పోస్ట్ చేయడానికి కారణం ఏమిటి? ఇదంతా వాస్తవమా? లేక ఏదైనా ఒక ప్రకటనలో భాగమా..? అనే చర్చ కోలీవుడ్‌లో జోరందుకుంది. -
నయనతార - విగ్నేష్ - విడాకులు ?
-
నయన్ - విఘ్నేశ్ జంటపై రూమర్స్.. ఆ ఫోటో షేర్ చేసిన భర్త!
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు. సౌత్‌లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది షారుక్ సరసన జవాన్‌తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల ఆమె నటించిన అన్నపూరణి పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో ఓ వర్గం వారిని కించపరిచేలా సీన్స్ ఉన్నాయంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని ఓటీటీ నుంచి తొలగించింది. అయితే ఇటీవల నయన్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన భర్తను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడంతో పెద్ద ఎత్తున రూమర్స్ మొదలయ్యాయి. గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట విడిపోనుందా? అనే అనుమానాలు తలెత్తాయి. కానీ అంతలోనే మళ్లీ తన భర్తను ఫాలో చేసింది. దీంతో ఈ జంట విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టింది. కానీ తాజా పరిణామాలతో వాటికి చెక్ పెడుతూ.. విఘ్నేశ్ శివన్ ఆమె ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. దీంతో ఈ జంటపై వస్తున్న రూమర్స్‌కు తెరపడింది. కాగా.. నయనతార ప్రస్తుతం ‘టెస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. శశికాంత్ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కుముద అనే పాత్రలో కనిపించనున్నారు. కాగా.. గత నెల ప్రేమికుల రోజు నయనతార.. తన భర్త ప్రేమను వర్ణిస్తూ విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. -
భర్తను అన్ ఫాలో చేసిన నయనతార..
-
అన్‌ఫాలో.. ఫాలో!
అస్టార్ హీరోయిన్ నయనతార, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం, కవల పిల్లలు (కుమారులు) ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ దంపతులు అన్యోన్యంగా కనిపిస్తారు. అలాంటిది తాజాగా తన భర్త విఘ్నేష్ శివన్‌ను నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఇన్స్టాగ్రామ్ ఖాతాని ప్రారంభించిన నయనతార తక్కువ సమయంలోనే 78 లక్షల మంది ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్నారు. ఇన్‌స్టాలో విఘ్నేష్‌ని ఫాలో అవుతూ వచ్చిన నయనతార అకస్మాత్తుగా అన్‌ఫాలో అయ్యారు. గత నెల ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున కూడా ‘మా ప్రేమ బంధానికి పదేళ్లు’ అంటూ భర్తతో ఉన్న ఫొటోలు షేర్ చేసిన నయనతార ఇప్పుడు ఇలా అన్‌ఫాలో కావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే సాంకేతిక కారణాల వల్లే అలా జరిగి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. కాగా అన్‌ఫాలో వార్త వైరల్ అయిన కొంత సమయానికి తిరిగి విఘ్నేష్‌ని ఫాలో అయ్యారు నయనతార. -
భర్తను అన్‌ఫాలో చేసిన నయనతార!
నయనతార.. సౌత్‌లో టాప్ హీరోయిన్, విఘ్నేశ్ శివన్.. కోలీవుడ్‌లో ప్రముఖ డైరెక్టర్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఎన్నో అడ్డంకులు దాటి గతేడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. మొన్నటి ప్రేమికుల రోజున కూడా మా ప్రేమ బంధానికి పదేళ్లు అంటూ భర్తతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసింది. నయనతార గతేడాదే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి భర్త విక్కీని ఫాలో అవుతూ వచ్చింది. కానీ సడన్‌గా ఇప్పుడు అతడిని అన్‌ఫాలో చేసింది. కన్నీటితో కూడా అదే మాట.. కన్నీళ్లు ఉబికి వస్తున్నప్పుడు కూడా.. ఇదే నాకు మిగిలిందని ఆమె చెప్పడం మానదు అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. అయితే జంటగా కలిసున్న ఫోటోలు మాత్రం ఇద్దరి సోషల్ మీడియా ఖాతాలో అలాగే ఉన్నాయి. దీంతో పొరపాటున అన్‌ఫాలో అయ్యారేమోనని కొందరు అభిప్రాయపడుతుండగా.. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు మొదలయ్యాయా? ఎంతో ఆప్యాయంగా ఉండే వీరు కూడా విడిపోతారా? అసలేం జరిగింది? అంటూ తల పట్టుకుంటున్నారు. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ కానీ అంతలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చిందీ బ్యూటీ. ఈ వార్త అంతటా పాకేలోపు ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను మళ్లీ ఫాలో అయింది. ఇది చూసిన అభిమానులు హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇకపోతే నయనతార గతేడాది జవాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్లకు పైగా రాబట్టింది. తర్వాత ఆమె నటించిన అన్నపూరణి సినిమా ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. ప్రస్తుతం టెస్ట్ సినిమాలో నటిస్తోంది. చదవండి: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామంటూ.. -
మళ్లీ సక్సెస్ బాట పట్టేందుకు ప్లాన్ చేస్తున్న నయనతార
నయనతార వంటి ప్రముఖ నటీనటులకు అవకాశాలు తగ్గే చాన్స్ ఉండదు. ఒకవేళ తగ్గినా వారే స్వయంగా చిత్రాలను నిర్మించడానికి సిద్ధమవుతారు. కాగా ప్రస్తుతం నయనతారకు అవకాశాలు తగ్గే అవకాశమే లేదు. అయితే విజయాలకు దూరం అవుతున్న ఈ లేడీ సూపర్‌స్టార్ మళ్లీ సక్సెస్ బాట పట్టే ప్రయత్నంలో సొంతంగా చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈమె ఇటీవల జయంరవి సరసన నటించిన ఇరైవన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత నటించిన లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం 'అన్నపూరణి' కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం మాధవన్, సిద్ధార్థ్‌తో కలిసి టెస్ట్ చిత్రంలో ఆమె నటిస్తుంది. కాగా భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా పలు చిత్రాలను నిర్మించడంతో పాటు, అనేక సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. తాజాగా సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో నటించడానికి నయనతార సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ చిత్రాలు నయనతార విఘ్నేష్ శివన్ తమ రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఎలాగైన ఈ చిత్రంతో హిట్ కొట్టాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కనెక్ట్ చిత్రం తరువాత రౌడీ పిక్చర్స్ సంస్థ నిర్మించే చిత్రం ఇదే అవుతుంది. కాగా ఇది కచ్చితంగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా ఇంకా వెలువడాల్సి ఉంది. -
నయనతార భర్తకు 'ఎల్ఐసీ' నోటీసులు..!
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ చిత్రం అంటేనే సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈయన అజిత్‌తో ఒక చిత్రం చేయడానికి కొద్దిరోజుల క్రితం విశ్వప్రయత్నం చేశారు. కథా చర్చలు కూడా పూర్తి చేశారు. ఇక చిత్రం సెట్‌పైకి వెళ్లడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో కారణాలేమైనా ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత 'లవ్ టుడే' చిత్రం ఫేమ్ ప్రదీప్‌రంగనాథన్ హీరోగా చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. లియో చిత్ర నిర్మాత సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కూడా నటిస్తుంది. ఈ చిత్రానికి ఎల్ఐసీ (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అదే ఈ చిత్ర దర్శక, నిర్మాతలను చిక్కుల్లో పడేసింది. ఎల్ఐసీ అనేది భారత్‌లో అత్యంత ప్రజాధరణ పొందిన జీవిత బీమా సంస్థ అని ఈ టైటిల్ తమ పేటెంట్ హక్కు అంటూ చిత్ర నిర్మాత, దర్శకులకు నోటీసులు జారీ చేసింది ఆ సంస్థ. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎవరూ స్పందించలేదు. అయితే ఎల్ఐసీ అనే టైటిల్‌ను వాడుకునే అవకాశం మాత్రం వీరికి లభించే అవకాశం ఉండదని సమాచారం. ఏదేమైనా నటి కృతిశెట్టి నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు ఎస్జే సూర్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే చడీచప్పుడు లేకుండా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆవరణలో చిత్రీకరణను జరుపుకుంటోందని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
భర్త సినిమా నుంచి నయనతార అవుట్!
లేడీ సూపర్‌స్టార్ నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌లకు టైమ్ అస్సలు బాగోలేనట్లుంది. కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రం తరువాత విఘ్నేశ్ ఇప్పటి వరకు మరో చిత్రం చేయలేదు. ఆ మధ్య అజిత్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం చాలా సమయం వెచ్చించారు. అయితే చివరి క్షణంలో ఆ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. నయనతారకు అక్కగా.. ఈ మధ్యే లవ్‌టుడే చిత్రం ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. కృతిశెట్టిని హీరోయిన్గా ఎంపిక చేశారు. ఇందులో ప్రదీప్ రంగనాథన్‌కు అక్కగా నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిని 7 స్క్రీన్స్ స్టూడియోస్ పతాకంపై లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజాకార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఇక ఈ చిత్ర టైటిల్ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే! వివాదాస్పదంగా అన్నపూరణి ఎల్ఐసీ సంస్థ.. తమ ఖాతాదారుల నమ్మకాన్ని పొందిన ఈ టైటిల్ చిత్రానికి ఉపయోగించరాదని నిర్మాతకు నోటీసులు పంపింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన చిత్రానికి టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక నయనతార విషయానికి వస్తే ఈమె నటించిన తన 75వ చిత్రం అన్నపూరణి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అంతేకాకుండా చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారడంతో సినిమాపై కేసు నమోదైంది. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌ను నిలిపేసింది. అంత డబ్బు ఇచ్చుకోలేక.. ఇవన్నీ నయనతారకు ఎదురుదెబ్బలే. మరో విషయం ఏమిటంటే నయనతార తన భర్త విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్న ఎల్ఐసీ చిత్రం నుంచి వైదొలగినట్లు తాజా సమాచారం. ఆమె ఎక్కువ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈమె ఒక చిత్రానికి రూ.10 నుంచి రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఎల్ఐసీ చిత్ర నిర్మాత అంత చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చదవండి: ఓటీటీలో మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు! -
స్టార్ జంటకు కలిసిరాని కొత్త ఏడాది.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్!
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC). ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని తమిళంలో నయనతార భర్త శివన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. అసలు ఎందుకు సమస్య ఎక్కడ వచ్చింది? ఆ వివాదం ఎందుకు మొదలైందో తెలుసుకుందాం. ఈ చిత్రానికి ఎల్ఐసీ టైటిల్ పెట్టడంపై ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొషన్ ఆఫ్ ఇండియా (LIC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమా టైటిల్ తమ సంస్థ పేరును గుర్తు చేసేలా ఉందంటూ వెల్లడించింది. ఈ మేరకు మూవీ టైటిల్ మార్చాలంటూ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌కు ఎల్ఐసీ లీగల్ నోటీసులు పంపినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా.. ఎల్ఐసీ సినిమా టైటిల్‌ను ఏడు రోజుల్లోగా మార్చాలని.. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయంలో విఘ్నేశ్‌తో పాటు మూవీ నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్‌కు నోటీసులు పంపినట్లు సమాచారం. పేరు మార్చకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని ఎల్ఐసీ హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే ఎల్ఐసీ పంపిన నోటీసులకు మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారికంగా స్పందన రాలేదు. అయితే ఇప్పటికే నయనతార నటించిన అన్నపూరణి చిత్రం కూడా వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో హిందువులు మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా నయనతార భర్త సినిమా సైతం వివాదంలో చిక్కుకుంది. కాగా.. ఈ చిత్రం ప్రముఖ నటుడు ఎస్జే సూర్య కీలకపాత్ర చేస్తున్నారు. ప్రదీప్ సోదరి పాత్రలో ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తారని తెలుస్తోంది. చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. -
వాళ్లు హర్ట్ అయ్యారు.. హీరోయిన్ నయనతార భర్తకు నోటీసులు!
ప్రముఖ హీరోయిన్ నయనతార భర్త, స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ చిక్కుల్లో పడ్డాడు. అయితే ఒక్క పేరు వల్ల రెండు వివాదాలు ఇతడిని ఇబ్బందిపెడుతున్నాయి. కొత్త సినిమా ఇంకా మొదలుపెట్టనే లేదు అప్పుడే కాంట్రవర్సీలు ఎక్కువైపోయాయి. తాజాగా ఓ పెద్ద సంస్థ.. విఘ్నేశ్‌కి నోటీసులు జారీ చేసింది. ఇంతకీ అసలేం జరిగింది? గొడవేంటి? తమిళంలో పేరున్న దర్శకుల్లో విఘ్నేశ్ శివన్ ఒకడు. 'నా పేరు రౌడీ' లాంటి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల ముందు హీరోయిన్ నయనతారని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. రీసెంట్గా 'ఎల్ఐసీ' పేరుతో కొత్త సినిమా తీస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టైటిల్‌పై రోజుల వ్యవధిలో రెండు కాంట్రవర్సీలు ఏర్పడ్డాయి. (ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) సినిమా గురించి అనౌన్స్ చేసినప్పుడే.. కోలీవుడ్ డైరెక్టర్ కుమారన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాను ఎనిమిదేళ్ల క్రితమే ఈ టైటిల్ రిజస్టర్ చేయించుకున్నానని చెప్పారు. ఈ పేరుపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా చెప్పాడు. ఈ వివాదం అలా ఉండగానే ఇప్పుడు మరొకటి వచ్చింది. ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ.. ఇప్పుడు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌కి నోటీసులు జారీ చేసింది. తమ సంస్థకు ప్రజల్లో మంచి పేరు ఉందని, సినిమా కోసం ఈ టైటిల్‌ని ఉపయోగిస్తే.. తమ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని నోటీసుల్లో పేర్కొంది. వారం రోజుల్లోపు పేరు మార్చకపోతే లీగల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే దీనిపై చిత్రబృందం, విఘ్నేశ్ స్పందించాల్సి ఉంది. (ఇదీ చదవండి: రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ) -
మళ్లీ అలాంటి చిత్రానికే రెడీ అవుతున్న నయనతార
కోలీవుడ్‌లో హీరోయిన్ సెంట్రిక్ కథా పాత్రలకు కేరాఫ్‌గా మారిన నటి నయనతార. ఇంతకుముందు త్రిష, కాజల్ అగర్వాల్ వంటి వారు ఇలాంటి పాత్రల్లో నటించినా సక్సెస్ కాలేదు. నటి ఐశ్వర్యారాజేశ్ కొన్ని చిత్రాల్లో నటించి సక్సెస్ అయినా, ఆ తరువాత ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఐశ్వర్యారాజేశ్కు అలాంటి అవకాశాలు ముఖం చాటేశాయనే చెప్పాలి. అయితే నయనతార విషయం వేరు. ఈమె నటించిన లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు కొన్ని నిరాశపరిచినా, కొత్త అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలా ఇటీవల నటించిన అన్నపూరిణి చిత్రం పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ మరో లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం ఈ సంచలన నటి తలుపు తట్టినట్లు తాజా సమాచారం. ఇంతకుముందు ఐశ్వర్యారాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన కనా చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన అరుణ్రాజా కామరాజ్ తొలి చిత్రంతోనే సక్సెస్ అయ్యారు. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్ హీరోగా నెంజిక్కు నీతి చిత్రాన్ని చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవల ఉత్తర చైన్నె నేపథ్యంలో లేబుల్ అనే వెబ్ సీరీస్‌కు దర్శకత్వం వహించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇందులో నయనతారను హీరోయిన్గా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం తన 75వ చిత్రంలో నటిస్తున్న నయనతార, మాధవన్, సిద్ధార్థ్‌లతో కలిసి టెస్ట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా తన భర్త విగ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ నటించనున్నారు. ఇందులో లవ్‌టుడే చిత్రం ఫేమ్ దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి కృతిశెట్టి నటిస్తుండగా, నయనతార హీరోకు అక్కగా ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. -
నయన్-విఘ్నేశ్ క్రేజీ సెలబ్రేషన్స్.. ఈ ఫొటోలు చూశారా?
-
Nayanthara And Vignesh Christmas Pics: ట్విన్స్‌తో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న నయనతార (ఫొటోలు)
-
ఎల్ఐసీ మూవీ.. కృతీ శెట్టికి తండ్రిగా నటించేదెవరో తెలుసా?
దర్శకుడు విఘ్నేశ్ శివన్ కొత్త సినిమా గురువారం ఉదయం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విఘ్నేశ్ గత ఏడాది కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అజిత్ కథానాయకుడిగా ఓ సినిమా చేయాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తాజాగా ఈయన దర్శకుడిగా మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎల్ఐసీ అని టైటిల్ ఖరారు చేశారు. ఎల్ఐసీ అంటే లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని అర్థం. లవ్ టుడే చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా హీరోయిన్ కృతిశెట్టి నటిస్తుండగా నటుడు ఎస్జే.సూర్య, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని, రవి వర్మన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రేమికుల మధ్య ఏర్పడే ఈగో, విడిపోవడం, మళ్లీ కలవడం వంటి అంశాలతో వినోదభరిత కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కృతి శెట్టికి తండ్రిగా ఎస్జే సూర్య, హీరోకి మిత్రుడిగా యోగి బాబు నటిస్తున్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర షూటింగ్ రెండు షెడ్యూల్లో పూర్తి చేసి 2024 సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. చదవండి: రూ.100 కోట్ల కేసులో ప్రకాష్ రాజ్‌కు ఊరట.. ఆ స్కామ్‌లో క్లీన్ చిట్ -
యంగ్ హీరోకు అక్కగా నటించనున్న నయనతార
కోలీవుడ్‌లో దర్శకుడిగా తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రదీప్ రంగనాథన్ ఆ తర్వాత కథానాయకుడిగా తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని సాధించడం విశేషం. ఆయన జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'కోమాలి' చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్ర విజయంతో పెరిగిన ఆత్మవిశ్వాసంతో వెంటనే కథానాయకుడు గానూ పరిచయమయ్యారు. అలా ఈయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం లవ్ టుడే. ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. దీంతో ప్రదీప్ రంగనాథన్‌కు వరుసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అందులో ఒకటి నటుడు కమలహాసన్ నిర్మించ తలపెట్టిన చిత్రం. అయితే బడ్జెట్ అధికం కావడంతో ఆ చిత్రం ఆగిపోయింది. ఇక ప్రదీప్ రంగనాథన్ రూ.20 కోట్లు పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో మరికొందరు నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఇలాంటి సమయంలో లియో చిత్ర నిర్మాత ప్రదీప్ రంగనాథన్‌తో చిత్రం చేయడానికి ముందుకు వచ్చారు. దీనికి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నారు. నటుడు అజిత్ చిత్రానికి దర్శకత్వం వహించాల్సిన విఘ్నేష్ ఆ చిత్రం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. కాగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఈయన దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి 'ఎల్ఐసీ' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తాజా సమాచారం. కాగా ఇందులో దర్శకుడు మిష్కిన్, ఎస్ జే సూర్య, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు తెలిసింది. కాగా ఇందులో కథానాయకిగా ఓ ప్రముఖ బాలీవుడ్ నటి నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. లేకపోతే ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటుడు ప్రదీప్ రంగనాథన్‌కు అక్కగా ప్రధాన పాత్రను పోషించబోతున్నట్లు తెలిసింది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ప్రేమ గాయాలను తట్టుకుని ఆపై పడిలేచిన కెరటం నయనతార
సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు వెండితెరపై అలా మెరిసి, ఇలా కనుమరుగవుతారు. మరికొందరు సుదీర్ఘ ప్రయాణం చేసి ఒక బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తారు. అలాంటి మార్క్‌నే సినిమా ప్రపంచంలో నయనతార వేశారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 ఏళ్లు పూర్తి అవుతుంది. ఇదే సందర్భంలో నేడు (నవంబర్ 18) నయన్ 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. వెండితెరపై ఎలాంటి పాత్రలోనైనా ఆమె నటించగలదు అదే ఆమె ప్రత్యేకత. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు అనే తేడా లేకుండా.. కథ, అందులో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడమే ఆమె ప్రత్యేకత.ప్రారంభంలో ఏ సినిమా ఛాన్స్ వచ్చినా కాదనకుండా ఓకే చెప్పిన నయన్... తర్వాత తన రూట్ మార్చి ప్రేక్షల చేత విజిల్స్ వేసే పాత్రలు చేసింది. అలా ఇప్పటి వరకు 80కి పైగా చిత్రాల్లో నటించింది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె బెంగళూరులో జన్మించారు. కానీ ఆమె స్వస్థలం కేరళ.. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఓమన్ కురియన్. . నయన్ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. కేరళలో ఇంగ్లిషు లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేసిన నయన్ కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగులు వేశాంరు. అలా కెరియర్ ప్రారంభంలో టీవీ యాంకర్‌గా కూడా పనిచేశారు. ఆపై 2003లో మలయాళ సినిమా అయిన 'మానస్సినక్కరే' తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. చంద్రముఖి సినిమాతో గుర్తింపు రావడంతో ఆమెకు టాలీవుడ్లో 'లక్ష్మీ'లో ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత బాస్, యోగి,దుబాయ్ శ్రీను, తులసి తదితర సినిమాల్లో నటించినా ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. 2010లో వచ్చిన అదుర్స్ సినిమా ఆమె కెరియర్నే మార్చేసింది. అక్కడి నుంచి ఆమె జర్నీలో భారీ విజయాలు దక్కాయి. అలా ఇక్కడ యంగ్, సీనియర్ హీరోలతో వరుస ఛాన్సులు దక్కించుకుని లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగింది. కొద్దిరోజుల క్రితం చిరంజీవి చెల్లెలుగా గాడ్ ఫాదర్లో మెప్పించిగా.. షారుక్ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. వారిద్దరితో ప్రేమ.. ఆ గాయాలను తట్టుకుని నిలిచింది సినిమాలే కాదు. వ్యక్తిగత విషయాలతోనూ నయనతార వార్తల్లో నిలిచింది. మొదట్లో వల్లవన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్, తన సహనటుడు శింబుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే కొద్దిరోజుల తర్వాత నయన్ తాను శింబుతో విడిపోయినట్టు వెల్లడించింది. ఆయన సినిమాల్లో తానిక నటించనని తేల్చిచెప్పేసింది. తర్వాత 'విల్లు' షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో తాను ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై 2010లో ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రకటించారు. అలా పెళ్లి కోసం సినిమా కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టింది నయన్. అయితే ఆ తర్వాత 2012లో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది నయనతార. తన ప్రేమ గురించి నయనతార ఏమన్నారంటే..? ఒక ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ తాను రెండు సార్లు ప్రేమలో విఫలమయ్యానని స్వయంగా నయన్ ఇలా చెప్పింది. 'నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ఆ ఇద్దరికీ నాకూ మధ్య అపార్థాలు వచ్చాయి. వాటి కారణంగా ఒకరిమీద ఒకరికి నమ్మకం పోయింది. అలాంటి పరిస్థితుల్లో విడిగా ఉంటేనే మంచిది అనుకున్నాం. ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. ఎంత కష్టం అయినా పడతాను. అలాంటిది నా ప్రేమ ఫెయిల్ అయినప్పుడు ఎంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను. ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడ్డా. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చా.. ఆ సమయంలో సినిమాలే నన్ను తిరిగి బలంగా నిలబెట్టాయి. నాలో ధైర్యాన్ని నింపాయి.' అని నయన్ అన్నారు. అలా ప్రేమ గాయాలను తట్టుకుని కొంత కాలం తర్వాత దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి 2022 జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగం ఉన్నారు. వీరిద్దరూ కూడా సరోగసీ ద్వారా జన్మించారు. నయనతార ఆస్తులు ఎంత..? నయనతార ఒక్కో సినిమాకి దాదాపు రూ.10 నుంచి 14 కోట్లు కోట్ల పారితోషికాన్ని తీసుకుంటుందని సమాచారం. అంతేకాకుండా ఈ బ్యూటీ ఆస్తుల నికర విలువ దాదాపు రూ.200 కోట్లపై మాటే. 2018లో అయితే ఏకంగా ఫోర్బ్స్ ఇండియా ‘సెలబ్రిటీ 100’ లిస్ట్‌లో చోటు సాధించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆ జాబితాలో నిలిచిన మొదటి మహిళా నటి నయనతారే కావడం ఇక్కడ విశేషం.అలాగే, ఆమె ఇటీవల తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి చర్మ సౌందర్య ఉత్పత్తుల కొత్త వెంచర్‌ను ప్రారంభించింది. వారి వ్యక్తిగత అవసరాల కోసం ఒక ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉంది. హిందూ మతాన్ని స్వీకరించిన నయన్ నయన్ క్రిస్టియన్.. ఆమె 2011లో హిందూ మతాన్ని స్వీకరించింది. ఆమె తమిళంలో నిర్మించిన కూళంగల్ (పెబెల్స్) సినిమా 2022లో జరిగే 94వ ఆస్కార్ పోటీలకు భారతదేశం తరఫున ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో ఎంట్రీ అందుకుంది. శ్రీరామరాజ్యంలో సీతగా మెప్పించిన నయనతారకు 2011లో నంది అవార్డు దక్కింది. అదే సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా ఆమెకు వచ్చింది. -
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. నయన్ భర్త ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన సినిమా 'కూళంగల్'. పీఎస్ వినోద్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరుత్తడైయాన్, చెల్లపాండి ప్రధానపాత్రులు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. నయనతార, విఘ్నేశ్ శివన్ నిర్మాతలు. తమిళనాడు, తంజావూర్‌లోని ఓ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించిన చిత్రమిది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మ్యాడ్' మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన ఈ సినిమా అక్టోబరు 27న సోనీ లివ్ ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత విఘ్నేశ్ శివన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా చూడగానే చాలా నచ్చిందని, తమకు ఎంతో ఘనత తెచ్చిపెట్టిన చిత్రం ఇదని అన్నాడు. ఈ మూవీని థియేటర్లోనే విడుదల చేయాలనుకున్నామని కానీ సమయం గడిచిపోతుండడంతో సోనీ లివ్ ఓటీటీలో విడుదల చేసినట్లు విఘ్నేశ్ శివన్ చెప్పుకొచ్చాడు. కాగా దర్శకుడు వినోద్ రాజ్‌తో కలిసి మరో చిత్రం చేయడానికి చర్చలు జరుగుతున్నాయని విఘ్నేష్ శివన్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
విజయ్‌కు వాటితో సంబంధం లేదు.. బాధ్యత అంతా నాదే: లోకేష్ కనకరాజ్
విజయ్ చిత్రాలు విడుదలకు ముందు ఆ తర్వాత కూడా వివాదాస్పదం కావడం కొత్తకాదు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన లియో కూడా ఇందుకు మినహాయింపు కాదు. మాస్టర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత విజయ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్ మేనన్, మిష్కిన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: రెండో రోజుకే చుక్కలు చూపించారు.. వెళ్లిపోతానని హాట్ బ్యూటీ గోల) నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతోంది. చిత్రం సెన్సార్ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంది. ఇక ఎలాంటి సమస్య లేదు అనుకుంటున్న సమయంలో లియో చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. అందులో విజయ్ చెప్పే పవర్ ఫుల్ డై లాగ్స్ ఆయన అభిమానులకు విపరీతంగా నచ్చింది. అయితే ఇందులో విజయ్ చెప్పిన కొన్ని అనుచిత డైలాగులే ఇప్పుడు పెద్ద దుమారానికి దారి తీస్తున్నాయి. వీటిపై ఒక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందించారు. ఆ సంభాషణలతో నటుడు విజయ్‌కి ఎలాంటి సంబంధం లేదని, ఈ డైలాగులు చెప్పాలా అని ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారని, తానే కథకు అవసరమని ఒప్పించానని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే అవి విజయ్ చెప్పిన సంభాషణ కాదని, లియో చిత్రంలోని పార్తిపన్ అనే పాత్ర చెప్పిన సంభాషణలని పేర్కొన్నారు. దానికి తానే బాధ్యత వహిస్తున్నానన్నారు. అయితే చిత్ర టైలర్లో చోటు చేసుకున్న ఆ వివాదాస్పద సంభాషణలు చిత్రంలో మ్యూట్ చేసినట్లు తెలిపారు. ఇకపోతే నటుడు విజయ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌ల మధ్య విభేదాలు అంటూ ఒక పోస్టు ట్విట్టర్లో వైరల్ అయ్యింది. దాన్ని దర్శకుడు విగ్నేష్ శివన్ లైక్ కొట్టడం పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇక ఈ ట్వీట్‌ను రజనీకాంత్ అభిమానులు ఎంజాయ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. దీంతో చివరికి దర్శకుడు విగ్నేష్ శివన్ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. తాను ఆ ట్వీట్‌ను సరిగా చూడకుండా లైక్ కొట్టారని, అందుకు క్షమాపణ చెప్పుకుంటున్నానని ఆయన మరో ట్వీట్ చేయడం గమనార్హం. -
Nayanthara Sons Uyir, Ulag 1st Birthday: నయనతార-విఘ్నేశ్ పిల్లల ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
-
నయనతార- విఘ్నేశ్ శివన్ ట్విన్స్.. ఈ అరుదైన ఫోటోలు చూశారా?
సౌత్ ఇండియాలో తన అభినయం, అందంతో అభిమానులను సొంతం చేసుకున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ సరసన జవాన్ మూవీలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించగా.. దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లోన కనిపించారు. (ఇది చదవండి: వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే..) అయితే గతేడాది కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట అధికారికంగా మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. అంతేకాకుండా ఈ జంటకు సరోగసీ ద్వారా కవల పిల్లలు కూడా జన్మించారు. వీరికి ఉయిర్, ఉలగం అని నామకరణం చేశారు. (ఇది చదవండి: ఒక్క సినిమాతో ఆ రేటింగ్స్‌నే మార్చేసిన నయనతార) తాజాగా నయన్ సోషల్ మీడియాలో పోస్ట్ తెగ వైరలవుతోంది. తన పిల్లలు, భర్తతో ఉన్న ఫోటోను పంచుకుంది. అయితే గతంలో ట్విన్స్‌తో ఉన్న ఫోటోను పంచుకున్న నయన్.. తాజాగా మరో పిక్‌ను షేర్ చేసింది. అయితే ఈ ఫోటో ట్విన్స్ పుట్టినప్పుడు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోల్లో కవల పిల్లలిద్దరూ చాలా క్యూట్‌గా ఉన్నారు . ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్యూట్ బేబీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
లవ్ టుడే హీరోతో విఘ్నేశ్ శివన్.. స్వీట్స్‌తో గుడ్‌న్యూస్..
శింబు, వరలక్ష్మి శరత్‌కుమార్ జంటగా నటించిన పోడాపొడి చిత్రంతో విఘ్నేష్ శివన్ దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత నానుమ్ రౌడీదాన్ చిత్రం చేశారు. అందులో విజయ్ సేతుపతి, నయనతార హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే విఘ్నేష్ శివన్, నయనతారల పరిచయం ప్రేమగా మారింది. అది సుమారు ఆరేళ్లకు ఇద్దరిని పెళ్లిపీటలు ఎక్కించింది. ఆ తరువాత విఘ్నేష్ శివన కాత్తు వాకుల రెండు కాదల్, సూర్య హీరోగా తానా సేంద కూట్టం చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ తరువాత ఇటీవల అజిత్ 62వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో నయనతార లైకా ప్రొడక్షన్స్ సంస్థలతో సంధి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె కూడా మనస్థాపానికి గురైనట్లు ప్రచారం జరిగింది. కాగా ఇటీవల నయనతార గుడ్‌టైమ్స్ ఆర్ హియర్ అంటూ ట్విట్టర్లో పోస్టు చేశారు. తాజాగా తన భర్త విఘ్నేష్ శివన్ కొత్త చిత్రానికి సిద్ధమయ్యారు. లవ్ టుడే చిత్రం ఫేమ్ ప్రదీప్ రంగనాథ్ కథానాయకుడిగా నటించనున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మంగళవారం(సెప్టెంబర్ 19) విఘ్నేష్ శివన్ 38వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన చైన్నెలోని ఓ జిమ్‌లో నటుడు ప్రదీప్ రంగనాథన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రదీప్ రంగనాథన్ డేట్స్ (ఖర్జూర పండ్లు)తో నిండిన ప్లేట్‌ను ఇవిగో నా డేట్స్ (కాల్షీట్స్) అంటూ సింబాలిక్‌గా విఘ్నేష్ శివన్‌కు అందించారు. కాగా ఇందులో నయనతార ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఇకపోతే జాన్వీ కపూర్‌ను నటింపచేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. Official announcement!👀#PradeepRanganathan X #VigneshShivan X #Anirudh X #RKFI pic.twitter.com/cmVYq2N3SW — Satham Hussan (@im_Satham) September 18, 2023 చదవండి: నా బలం వెనుక ఉన్న శక్తి నువ్వే.. తల్లి ప్రేమ అంటే ఇదే! -
శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, హీరోయిన్ నయనతార
-
ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార ఎంట్రీ.. ఫాలో అయ్యేది ఆ ఐదుగురిని మాత్రమే
సౌత్ ఇండియా లేడీ సూపార్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. నేడు అందరూ రాఖీ పండుగ సెలబ్రేషన్లో ఉండగా నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టింది. మొదటగా తన ఇద్దరు కుమారులతో (ఉయిర్, ఉలగం) కలిసి ఉన్న స్టైలిష్ వీడియోను షేర్ చేసింది. నయనతార ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే భారీగా వైరల్ కావడంతో ఆమెను లక్షల మంది ఫాలో అయ్యారు. ఆమె పెట్టిన రీల్‌ను కూడా ఇప్పటికే ఐదు లక్షలకు పైగా లైక్ చేయగా.. రెండు మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. (ఇదీ చదవండి: హీరో గోపీచంద్‌ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్) ఇప్పటికే సౌత్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకుని జవాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన నయన్‌కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. తన కుమారుల ఫోటోలను ఇప్పటి వరకు ఎక్కడా రివీల్ చేయని నయన్ తొలిసారి ఇలా షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. జవాన్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నయన్ ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆమెకు ఇప్పటి వరకు ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేయలేదు. తనకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు భర్త విఘ్నేష్ శివన్ షేర్ చేస్తూ వచ్చేవాడు. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు) 'జైలర్'లోని హుకుమ్ పాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో తన కవలలను ఎత్తుకుని మాస్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చిన నయన్ తన ఇన్‌స్టాలో మాత్రం కేవలం ఐదుగురిని మాత్రం ఫాలో అవుతుంది. అందులో తన భర్త విఘ్నేశ్, హీరో షారుక్ ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, ఒబామా భార్య మిషెల్లి ఒబామాతో పాటు తన సొంత ప్రొడక్షన్ సంస్థ అయిన 'ది రౌడీ పిక్చర్స్' ఉన్నాయి. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
ఓనం సెలబ్రేషన్స్‌లో స్టార్ కపుల్.. ట్విన్స్‌తో తొలిసారిగా!
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న భామ గతేడాది జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా తల్లిదండ్రులయ్యారు. అయితే నయన్ దంపతులు సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనివ్వడం అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. అయితే ఇప్పటివరకు తమ పిల్లల మొహాలను ఇప్పటివరకు అభిమానులకు చూపించలేదు. (ఇది చదవండి: రాజకీయాల్లోకి స్టార్ హీరో.. పక్కా ప్లాన్‌తో ప్రజల్లోకి!) తాజాగా కేరళలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఓనం పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి తొలిసారిగా ఓనం జరుపుకోవడం సంతోషంగా ఉందంటూ విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. సెలబ్రేషన్స్‌తో పాటు తన భార్య, పిల్లలతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. 'మా జీవితంలో అందమైన, అద్భుతమైన క్షణాలు.. ఉయిర్, ఉలగంతో కలిసి తొలిసారిగా ఓనం పండుగ జరుపుకుంటున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
రజనీకాంత్‌కు అనిరుధ్ ఏమవుతాడో తెలుసా.. ? జైలర్ సక్సెస్ సీక్రెట్ ఇదే
రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం తగ్గలేదు.. ఈ మూవీలో 'హుకూం' సాంగ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఇందులో రజనీకాంత్ స్టైల్‌కు యువ సంచలనం అనిరుధ్ అందించిన మ్యూజిక్, బీజీఎం నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. రజనీ కోసం ఆయన ఇచ్చిన బీజీఎంతో ప్రేక్షకులకు గూస్బమ్స్ తెప్పించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో అనిరుధ్ ఇచ్చిన స్టేజ్ ఫర్మామెన్స్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. (ఇదీ చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్) స్టేజీపై మ్యూజిక్కు తగ్గట్టుగా ఆతను ఊగిపోతూ పాడుతుంటే ఆడియన్స్‌ను మరో ట్రాన్స్‌లోకి వెళ్తారు. అంతలా రజనీ కోసం పర్ఫామెన్స్ ఇచ్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్‌డమ్‌ను వివరిస్తూ సాగే ఆ పాట సినీ అభిమానులను ఊపేస్తోంది. జైలర్ సినిమాతో అనిరుధ్ తమిళంలో నెంబర్ వన్ స్టార్ అయ్యాడు. 2012లో ధనుష్ త్రి సినిమా కోసం పాటను కంపోజ్ చేసినప్పుడు కేవలం 21 ఏళ్లు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దపు కాలం గడిచింది. తన కెరియర్లో ఎన్నో అద్బుతమైన పాటలను అందించాడు. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏఆర్ రెహమాన్‌ను మించిపోయాడని సినీ ట్రేడర్స్ తెలుపుతున్నాయి. రజనీకి కుమారుడు లేరనే సమస్య లేదు: విఘ్నేష్ జైలర్ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో అనిరుధ్- రజనీకాంత్ బంధం గురించి దర్శకుడు విఘ్నేష్ శివన్ (నయనతార భర్త) చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. 'మనం జీవితంలో కొన్ని అద్భుతమైన క్షణాల కోసం ఎదురుచూస్తాం. నేను తలైవా ముందు నిలబడిన ఈ క్షణం అలాంటిదే. జైలర్‌లో తండ్రీకొడుకుల అనుబంధంపై ఓ పాట రాశాను. దాని గురించి గుర్తుచేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. దానికి కారణం నేను ఇప్పుడు ఇద్దరు అబ్బాయిల తండ్రిని. భవిష్యత్తులో వాళ్లు పెద్దయ్యాక నేను రాసిన పాట రజనీ సినిమాలో ఉందని చెబుతాను. (ఇదీ చదవండి: అతను నా తమ్ముడు.. అవసరమైతే ఎన్నికల్లో ప్రచారం చేస్తా: విష్ణు) అలాగే, తలైవా గురించి నేను ఇంకో విషయం చెప్పాలి. రజనీ సార్ కోసం ఓ పాటను సిద్ధం చేసినప్పుడే తలైవా పట్ల అనిరుధ్‌లోని నిజాయతీ, ప్రేమ కనిపించాయి. రజనీ సర్కి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయనకు కొడుకు లేడనే సమస్య అనిరుధ్‌తో తీరిపోయింది. ఎందుకంటే తలైవా పట్ల అతనిలో విపరీతమైన ప్రేమను చూశాను. ఒకవేళ రజనీకి కొడుకు ఉంటే అనిరుద్- రజనీకాంత్ బంధాన్ని చూసి అసూయపడేవాడు.' అని విఘ్నేష్ శివన్ అన్నారు. (అనిరుధ్ ఫ్యామిలీ) రజనీ- అనిరుధ్ మధ్య ఉన్న బంధుత్వం ఇదే ఆడియో లాంచ్ ఫంక్షన్‌కి అనిరుధ్ వచ్చినప్పుడు సూపర్ స్టార్ రజనీ అతన్ని కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అనిరుధ్ తమిళ నటుడు రవి రాఘవేంద్ర కుమారుడు అనే సంగతి తెలిసిందే. ఆయన రజనీకాంత్‌కు చాలా దగ్గర బంధువు. తలైవా భార్య సతీమణి లతా రజనీకి మేనల్లుడు అవుతాడు. అందుకే రజనీకి అనిరుధ్ అంటే ప్రత్యేక అభిమానం. సుమారు 30 ఏళ్ల క్రితం రజనీ కాంత్ సినిమా షూటింగ్లో ఉండగా అనిరుధ్‌ను తీసుకుని లత వెళ్లారట. ఆ సమయంలో రజనీ-అనిరుధ్ ఫోటో దిగారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
సినిమాల్లో నటనే కాదు.. అమ్మతనం ఉట్టి పడుతోంది!
లేడీ సూపర్ స్టార్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడిన భామ.. సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షారుక్ ఖాన్ సరసన జవాన్‌లో నటిస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఎప్పుడు సినిమాలతో బిజీగా నయన్.. చిన్న పిల్లలకు టైం కేటాయించేందుకు వీలు కాదు. అలా ప్రొఫెషనల్ లైఫ్‌తో పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తోంది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!) ఆదివారం కాస్తా తన కుమారులతో అమ్మతన్నాని ఆస్వాదిస్తోంది. సినిమాల్లో ప్రియురాలుగా, భర్తకు భార్యగా, బిడ్డకు తల్లిగా ఎంతగా ప్రేమను చూపిన అది నటనే కాబట్టి అందులో మమతాను రాగాలు ఉండవు. అదే నిజ జీవితంలో ఇప్పుడు నయనతార అమ్మతనాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. అందులో సహజ సిద్ధంగా కలిగే మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు. అలా ఆదివారం కాస్తా తీరిక లభించడంతో తన బిడ్డను లాలిస్తూ మురిసి పోతున్న దృశ్యాన్ని ఆమె భర్త విఘ్నేశ్ శివన్ ఫొటో తీసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తమ ప్రాణంగా ప్రేమించే పిల్లలతో సమయాన్ని ఆనందంగా గడిపినట్లు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నయనతార హిందీలో షారుక్ ఖాన్‌తో తొలిసారిగా జతకట్టిన జవాన్ చిత్ర విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తన 75 చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. గత ఆరేళ్లకు పైగా ప్రేమించుకుంటూ సహజీవనం చేసిన దర్శకుడు విఘ్నేష్ శివన్.. గతేడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. (ఇది చదవండి: హీరోయిన్ల చీరలు లాగి లాగి చిరాకొచ్చింది: ప్రముఖ నటుడు ) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయనతారపై భర్త విఘ్నేష్ శివన్ ఆస్తకికర ట్వీట్
దక్షిణాది లేడీ సూపర్ స్టార్‌గా వెలిగిపోతున్న నయనతార తొలిసారిగా బాలీవుడ్లో నటించిన చిత్రం జవాన్. షారూక్ ఖాన్ హీరోగా నటించిన ఇందులో నటి దీపికా పదుకోనే, ప్రియమణి, విజయ్ సేతుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కోలీవుడ్‌లో చాలా ఆసక్తి నెలకొంది. కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నయనతార, విజయ్ సేతుపతి, దర్శకుడు అట్లీలే. కాగా ఇందులోని నయనతార ఫొటోతో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో చేతిలో తుపాకీ, కూలింగ్ గ్లాస్ ధరించి ఫుల్ యాక్షన్ మూడ్ లో కనిపించారు. దీనిపై ప్రేక్షకుల రియాక్షన్ ను పక్కన పెడితే నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆమెను యథాతథంగా పొగడ్తలతో ముంచెత్తారు. ఆ పోస్టర్‌ను తన ట్విట్టర్లో పోస్ట్ చేసి నయన్ ని చూస్తుంటే ఆనందంగా.. గర్వంగా ఉందన్నారు. షారూఖ్ ఖాన్ కి అభిమానిగా ఆయన నటించిన మూవీస్ అన్ని చూసిన నయన్.. ఇప్పుడూ షారూఖ్ మూవీలో మెయిన్ రోల్ లో నటించడం గర్వంగా ఉందన్నారు. ‘నువ్వు ఎంతోమంది స్ఫూర్తినిస్తున్నావు.. నిన్ను చూసి నేనొక్కడినే కాదు మన ఫ్యామిలీ మొత్తం ఎంతో గర్వంగా ఫీల్ అవుతోంది’ అంటూ నయనతారను ఆకాశానికెత్తారు. ఈ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా మారింది. కాగా అంతకు ముందు నయనతార పోస్టర్‌ను విడుదల చేసిన సందర్భంగా నటుడు షారుక్ ఖాన్ తన ట్విటర్ లో తుఫాన్‌కు ముందు పిడుగు అని పోస్ట్ చేశారు. దీంతో నయనతార అటు బాలీవుడ్‌లోనూ దుమ్ము రేపుతారంటూ ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Happy & Proud of you thangamey #Nayanthara ❤️❤️ From being a fan of Shahrukh sir & binge watching only his movies ! Like literally only his movies !!! To Acting opposite to him in such a big film! Your journey is jus starting ❤️🫡😇☺️ You are soooo inspiring dear wife… https://t.co/6ZkGJtwrir — VigneshShivan (@VigneshShivN) July 17, 2023 -
నయన్ భర్తకు వార్నింగ్ ఇచ్చిన షారుక్ ఖాన్!
షారుక్ ఖాన్ మంచి ఊపు మీదున్నాడు. ఐదేళ్లుగా ఒక్క సినిమా చేయక సైలెంట్‌గా ఉన్న ఇతడు.. ఈ ఏడాది 'పఠాన్'తో హిట్ కొట్టాడు. రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాడు. త్వరలో 'జవాన్'తో రాబోతున్నాడు. దీని ట్రైలర్ ఈ మధ్యే రిలీజైంది. ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అయితే సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న షారుక్.. ఇప్పుడు నయనతార భర్తకి ఓ విషయమై హెచ్చరించాడు. ఆమెతో జాగ్రత్త ఉండని చెప్పుకొచ్చాడు. షారుక్‌తో కలిసి లేడీ సూపర్‌స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే నయనతార.. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. దక్షిణాదిలో మిగతా హీరోయిన్లతో పోలిస్తే అత్యధిక పారితోషికం తీసుకుంటోంది. ఇన్నాళ్లు సౌత్‌కే పరిమితమైన నయన్.. షారుక్ 'జవాన్'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మధ్య రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే ఈ మూవీలో నయన్‌ది పోలీస్ క్యారెక్టర్. (ఇదీ చదవండి: ఆమెని మర్చిపోలేకపోతున్న చిన్నల్లుడు కల్యాణ్ దేవ్!) విఘ్నేశ్‌కి జాగ్రత్తలు 'జవాన్' ట్రైలర్ చూసిన నయన్ భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.. 'అట్లీ ఇలాంటి సూపర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటే గర్వపడకుండా ఎలా ఉండగలం. ఔట్‌ఫుట్ ఇంటర్నేషనల్ లెవల్లో ఉంది. హ్యాట్యాఫ్' అని పోస్ట్ పెట్టాడు. అలానే షారుక్ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇస్తున్నందుకు నయనతార, అనిరుధ్, విజయ్ సేతుపతికి విషెస్ చెప్పాడు. షారుక్ పంచులు ఇక విఘ్నేశ్ శివన్ పోస్ట్ చూసిన షారుక్.. తనదైన శైలిలో స్పందించాడు. 'విఘ్నేశ్ శివన్ చూపిన ప్రేమకు థ్యాంక్స్. నయనతార అద్భుతంగా చేసింది. అయితే నేను చెప్పబోయేది మీకు ముందే తెలుసనుకుంటాను. కానీ జాగ్రత్త. ఆమె కొన్ని భారీ కిక్స్, పంచులు నేర్చుకుంది' అని షారుక్ ఫన్నీగా విఘ్నేశ్‌కి సలహాలు ఇచ్చాడు. ఇప్పుడిది వైరల్‌గా మారింది. @VigneshShivN thank u for all the love. #Nayanthara is awesome…but oh who am I telling this…you toh already know!!! But Hubby, beware, she has now learnt some major kicks & punches!! pic.twitter.com/5aMZ8rzReN — Shah Rukh Khan (@iamsrk) July 12, 2023 (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!) -
నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేశ్ శివన్ బాబాయ్
దర్శకుడు విగ్నేష్ శివన్, నయనతారలపై ఆస్తి అపహరణ కేసు నమోదు అయ్యింది. ఆరేళ్ల క్రితం ప్రేమలో పడి, సహజీవనం చేస్తూ గత రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సంచలన జంట నయనతార, విఘ్నేష్ శివన్. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో నయనతార నటిగా రానిస్తూ.. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉన్నా వ్యక్తిగతంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ జంట సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం కూడా వివాదంగా మారింది. (ఇదీ చదవండి; 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్ హీరో) తాజాగా వీళ్లకు మరో సమస్య ఎదురైంది. విఘ్నేశ్ శివన్ పూర్వీకం తిరుచ్చి జిల్లా, లాల్‌కుడి గ్రామం ఈయన తండ్రి పేరు శివకొళుదు. వీళ్లు తొమ్మిది మంది అన్నదమ్ములు. పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేసిన విఘ్నేష్ శివన్ తండ్రి శివకొళుదు ఇప్పుడు లేరు. అయితే ఈయన జీవించి ఉండగా తమ ఉమ్మడి ఆస్తిని అన్నదమ్ములకు తెలియకుండా మోసపూరితంగా అపహరించినట్లు ఆయన సోదరుడు మాణిక్యం కోయంబత్తూర్‌లో నివసిస్తున్న మరో సోదరుడు కుంచిత పాదం గురువారం తిరిచ్చి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. (ఇదీ చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) అందులో మాణిక్యం పేర్కొంటూ తమ సోదరుడు విఘ్నేష్ శివన్ తండ్రి ఉమ్మడి ఆస్తిని తమకు తెలియకుండా వేరే వారికి విక్రయించి మోసానికి పాల్పడ్డాడని, తమ ఆస్తిని కొనుగోలు చేసిన వారికి డబ్బును తిరిగి ఇచ్చి, ఆస్తిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా తమ సోదరుడు కుమారుడు విఘ్నేశ్ శివన్ అతని తల్లి మీనాకుమారి, సోదరి ఐశ్వర్య, భార్య నయనతారలపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తిరుచ్చి డీఎస్పీ ఈ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది నటి నయనతారకు కూడా తలనొప్పిగా మారింది. -
నయనతార ఆశలన్నీ ఆ 75 పైనే!
సంచలనాలకు బ్రాండ్ అంబాసిడర్ నయనతార. ఈమె నట జీవితం అంతా వివాదాలు, వినోదాలతోనే సాగుతుందని చెప్పవచ్చు. మొదట్లో నటుడు శింబును గాఢంగా ప్రేమించిన నయనతార అది పెళ్లికి దారి తీస్తుందని నమ్మారు అయితే ఆ ప్రేమ బెడిసికొట్టింది. ఆ తర్వాత నృత్య దర్శకుడు, నటుడు ప్రభుదేవాతో ప్రేమ ఇక ఏడడుగులు వేయడమే ఆలస్యం అన్నంత వరకు వెళ్లింది. అయితే ఆ ప్రేమ కథ అడ్డం తిరిగింది. ఇక ఇటీవల దర్శకుడు విగ్నేష్శివన్తో కొంతకాలం సహజీవనం చేసి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయ్యారు. (ఇదీ చదవండి: రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న టాప్ హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..) అయినా ఇప్పటికీ నటనకు మాత్రం దూరం కాలేదు. అయితే పెళ్లి అయిన తరువాత కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో సాగడం లేదనే మాట వినిపిస్తోంది. భారీ చిత్రాల అవకాశాలు రావడం, నటించిన చిత్రాలు కూడా ఆశించిన విధంగా ఆడడం లేదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే బాలీవుడ్ ఎంట్రీ.. షారుక్ ఖాన్ జంటగా జవాన్ చిత్రంలో నటించడం ఒక్కటే ప్లస్ పాయింట్ అని చెప్పక తప్పదు. లేడీస్ సూపర్‌స్టార్ స్థానాన్ని అనుభవించిన నయనతార ఇప్పుడు దాన్ని నిలుపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఎందుకు నయనతార తన 75వ చిత్రాన్నే నమ్ముకున్నారు. ఇది లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం. ఇందులో జై కథానాయకుడిగా నటిస్తున్నారు. రాజారాణి చిత్రం తర్వాత వీళ్లు కలిసి నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా శంకర్ శిష్యులు నీలేష్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇది తిరుచ్చి, చైన్నెలలో జరిగే కథా చిత్రంగా ఉంటుందని, ఇందులో నయన మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతిగా నటిస్తున్నట్లు సమాచారం. ఓకే చోట పనిచేసే నయనతార, జై మధ్య ప్రేమను దర్శకుడు కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నట్లు తెలిసింది. View this post on Instagram A post shared by Nayanthara (@nayantharaofficiial) (ఇదీ చదవండి: వాళ్లు బాలకృష్ణ మనుషులని నాకు తెలియదు: కిర్రాక్ ఆర్పీ) -
ఆ వెడ్డింగ్ వీడియో ఏమైనట్లు ?
-
12 ఏళ్ల నుంచి నా బెస్ట్ ఫ్రెండ్.. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది: విఘ్నేశ్ శివన్
సౌత్ ఇండియా బ్యూటీఫుల్ కపుల్స్‌లో నయన్-విక్కీ జంట ఒకరు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది జూన్ 9న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ జంటకు పలువురు తారలు, ఫ్యాన్స్, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఈ జంటకు సరోగసీ ద్వారా ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు జన్మించారు. అయితే వీరి వివాహా వార్షికోత్సవం సందర్భంగా ఈ జంటకు విఘ్నేశ్ శివన్ చిన్ననాటి స్నేహితుడు సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: అలా ప్రేమలో.. వరుణ్, లావణ్య త్రిపాఠి లవ్‌స్టోరీకి ఐదేళ్లు) చెన్నైలోని వీరి నివాసంలో జరిగిన వార్షికోత్సవంలో ఫ్లూట్ వాయించి మరీ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. బాల్య స్నేహితుడు ఇచ్చిన సర్ప్రైజ్కు నయన్- విఘ్నేశ్ ఎమోషనలయ్యారు. ఈ విషయాన్ని విక్కీ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. వీడియోనూ షేర్ చేస్తూ స్నేహితునిపై ప్రశంసలు కురిపించారు. విఘ్నేశ్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..'మాకు ఇవీ ప్రత్యేకమైన క్షణాలు. మా మొదటి వివాహా వార్షికోత్సవ వేడుక. నా 12 ఏళ్ల వయస్సు నుంచి నవీన్ బెస్ట్ ఫ్రెండ్. నీతో కలిసి ఒకే వేదికపై డ్రమ్స్ వాయించడం.. చాలాసార్లు నీతో వేదికను పంచుకున్నా. నా జీవితంలో నిన్ను చూస్తూనే ఎదిగా. కానీ ఈరోజు మర్చిపోలేనిది. అలాగే చాలా ప్రత్యేకమైనది కూడా. ఈ రోడు మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నువ్వు నా స్నేహితుడిగా ఉండటం నాకు గర్వంగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్ప్రైజ్ అదిరిపోయిందిగా !) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకున్న నయన్- విఘ్నశ్ (ఫొటోలు)
-
నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్ప్రైజ్ అదిరిపోయిందిగా !
సౌత్ ఇండియా బ్యూటీఫుల్ కపుల్స్‌లో నయన్-విక్కీ జంట ఒకరు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ జంట గతేడాది జూన్ 9న వివాహాబంధంతో ఒక్కటయ్యారు. మొదటి వివాహా వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ జంటకు పలువురు తారలు, ఫ్యాన్స్, సన్నిహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఈ జంటకు ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు జన్మించారు. అయితే ఈ శుభ సందర్భంలో అమ్మా-నాన్నకు సర్ప్రైజ్ ఇచ్చారు ట్విన్స్. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: పిల్లల ఫోటోలు రివీల్ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?) నయన్- విఘ్నేశ్ ఇద్దరు పిల్లలు వివాహా వార్షికోత్సవానికి అమ్మా-నాన్నకు సర్ప్రైజ్ ఇచ్చారు. హ్యాపీ యానివర్శరీ అంటూ బెలూన్లతో అలంకరించిన ఫోటోను విక్కీ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన ఇద్దరు పిల్లల గురించి విక్కీ ఎమోషనలయ్యారు. ఈ విషయాన్ని విఘ్నేశ్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'ధన్యవాదాలు బాయ్స్. ఇంత చక్కని వివాహ వార్షికోత్సవ వేడుకను మాకు అందించినందుకు లవ్ యూ టూ ఉయిర్, ఉలగం. ఇంత చిన్న వయసులో మాకోసం మీరిద్దరు ఎంతగా ఆలోచించారు. మేము మీ ఇద్దరినీ ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాం'. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన ఇద్దరు పిల్లల ఫోటోను షేర్ చేస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఇంత చిన్న వయసులోనే ఇంతలా డేకరేషన్ ఎలా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో సూపర్బ్ అంటూ విషెష్ చెబుతున్నారు. కాగా.. జూన్ 9, 2022న మహాబలిపురంలో నయనతార- విఘ్నేశ్ శివన్ వివాహా ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి రజనీకాంత్, షారూఖ్ ఖాన్, అనిరుధ్ రవిచంద్రన్‌తో పాటు సినీ పరిశ్రమకు పలువురు తారలు, స్నేహితుల హాజరయ్యారు. అయితే పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా గతేడాది అక్టోబర్‌లో కవలలకు స్వాగతం పలికారు. (ఇది చదవండి: పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె.. తండ్రి ఎమోషనల్ పోస్ట్!) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
పిల్లల ఫోటోలు రివీల్ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను గతేడాది జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేడు తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. వారి పిల్లల ఫోటోలను కూడా ఆయన మొదటిసారి షేర్ చేశాడు. ఆ ఫోటోలలో, నయనతార తన బిడ్డలను పట్టుకుని ప్రకాశవంతమైన చిరునవ్వులతో కనిపిస్తుంది. ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: అప్పుడు మా కాలికి నమస్కరించేవాళ్లు, ఇప్పుడేమో హగ్గులు, ముద్దులు: నటి) నయనతార గురించి విఘ్నేశ్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్‌లో ఇలా రాసుకొచ్చాడు. 'నువ్వు నా జీవితంలోకి వచ్చి అప్పుడే ఏడాది గడిచిపోయింది. సంవత్సర కాలంలో ఎన్నో సమస్యలను కలిసే ఎదుర్కొన్నాం. నా పనిలో భాగంగా ఎన్ని చికాకులు ఉన్నా ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత నిన్నూ (నయన్), పిల్లల్ని చూడగానే అన్నీ మర్చిపోతాను. కుటుంబం ఇచ్చే బలం ఎవరూ ఇవ్వలేరు. మన పిల్లలు ఉయిర్, ఉలగమ్‌లకు మంచి జీవితాన్ని అందించడానికి ఎప్పటికీ ప్రయత్నిస్తాను' అని భావోద్వేగానికి లోనయ్యాడు. గత అక్టోబరులో అద్దె గర్భం ద్వారా ఈ జంట ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: అబ్బే.. ఈ హీరోలకు అసలు పెళ్లి ధ్యాసే లేదుగా!) -
విజయ్ స్పీడ్‌కు నో బ్రేక్స్.. అజిత్‌కు అన్నీ అడ్డంకులే
హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన తుణివు (తెగింపు) చిత్రం విడుదలై ఏడాదిన్నర కాబోతోంది. ఈ చిత్రంతో పాటు హీరో విజయ్ నటించిన వారీసు (వారసుడు) చిత్రం విడుదలైంది. కాగా విజయ్ తదుపరి చిత్రం ప్రారంభం కావడడంతో పాటు షూటింగ్కూడా పూర్తి చేసుకోబోతోంది. అయితే అజిత్ తాజా చిత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. (ఇదీ చదవండి: బన్నీ విషయంలో లెక్క తప్పిన అల్లు రామలింగయ్య) ఆయన 62వ చిత్రాన్ని ఏ ముహుర్తాన ప్రకటించారో గానీ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ చిత్రానికి నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సి ఉంది. కథ సిద్ధమైంది. ఇక సెట్‌పైకి వెళ్లటమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ఈ చిత్రం నుంచి విఘ్నేష్ శివన్ వైదొలిగారు. ఆయన స్క్రీన్‌ప్లే లైకా ప్రొడక్షన్స్ అధినేతకు, అజిత్‌కు సంతృప్తిని కలిగించకపోవడం కారణమని తెలిసింది. ఆ తరువాత చిత్ర కథ మారింది. దర్శకుడు మారారు. అనూహ్యంగా దర్శకుడు మగిళ్ తిరుమేణి తెరపైకి వచ్చారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో లైకా ప్రొడక్షన్స్ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. (ఇదీ చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!) అజిత్ పుట్టినరోజు సందర్భంగా మే 1వ తేదీన 'విడామయర్చి' అని చిత్ర టైటిల్ వెల్లడించారు. దీంతో షూటింగ్ ప్రారంభం అవుతుందని అందరూ భావించారు. అలాంటి సమయంలో విదేశీ బైక్ ప్రయాణానికి వెళ్లిపోయారు. ఇటీవలే ఆయన తిరిగి రావడంతో జూన్ తొలి వారంలో విరామం వీడి చిత్ర షూటింగ్ మొదలవుతుందని ప్రచారం జరిగింది. ఇందులో నటి త్రిష నాయకిగా నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు. తాజా సమాచారం ప్రకారం అజిత్, దర్శకుడు మగిళ్ తిరుమేణి ప్రస్తుతం లండన్‌లో మకాం పెట్టినట్లు తెలిసింది. విడామయర్చి చిత్ర షూటింగ్ గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్‌ను పలు దేశాల్లో నిర్వహించనున్నట్లు, ఈ నెల చివరిలో షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నటుడు అజిత్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపిస్తున్నట్లు సమాచారం. -
కొత్త వ్యాపారంలోకి నయన్, అంత సాహసం ఎందుకు చేస్తోంది? క్లారిటీ?
సాక్షి,ముంబై: లేడీ సూపర్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న నయనతార మరోసారి తన ప్రత్యకతను చాటుకునేందుకు సిద్ధమవుతోంది. అటు సినిమాలు ఇటు వ్యాపారం లోనూ రాణిస్తున్న నయనతార తాజాగా మరో కొత్త బిజినెస్‌లోకి ఎంటర్ అవుతోన్నట్లు తెలుస్తోంది. భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ఉత్తర చెన్నైలోని 56 ఏళ్ల నాటి పాత అగస్త్య థియేటర్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం. అలాంటిదేమీలేదు నయనతార, విఘ్నేష్ శివన్ కోలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చెన్నై థియేటర్ని సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నారని సోషల్ మీడియాలో పుకార్లకు చెక్ పడినట్టే కనిపిస్తోంది. దర్శకుడు, నయన్ సన్నిహితుడు ఈ వార్తలను కొట్టి పారేశారు. ఎలాంటి థియేటర్‌ను కొనడానికి ప్లాన్ చేయడం లేదంటూ స్పష్టం చేశారు. అయితే దీనిపై నయన్, విఘ్నేష్ నుంచి అధికారికంగా ప్రకటన వస్తే తప్ప క్లారిటీ ఉండదు. ఇప్పటికే అనేక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టిన టాప్ సౌత్ ఇండియాన్ స్టార్ నయన్ ఇపుడిక థియేటర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. తమ నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ కింద చెన్నైలో తొలి ఆస్తిని కొనుగోలు చేసారనేది టాక్. ఉత్తర చెన్నై ప్రాంతంలో, దేవి థియేటర్ గ్రూప్ యాజమాన్యంలోని అగస్త్య థియేటర్ 1967నుంచి పనిచేస్తోంది. తమిళ టాప్ స్టార్లు ఎంజీఆర్, శివాజీ గణేశన్ మొదలు రజనీ కాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ దాకా లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను ప్రదర్శించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ కరోనా, లాక్డౌన్ కాలంలో చిక్కుల్లో పడింది. దీంతో 2020లో దీన్ని మూసి వేశారు. 1000 సీటింగ్ కెపాసిటీతో కూడిన థియేటర్‌ను రెండు స్క్రీన్లతో మల్టీప్లెక్స్‌గా రెన్నోవేట్ చేసి ఈ ఏడాది చివరికి తిరిగి లాంచ్ చేయనున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. కాగా నయనతార ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో బాలీవుడ్ మూవీ 'జవాన్' లో విజయ్ సేతుపతి, షారుక్ ఖాన్ సరసన నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 7 న విడుదల కానుంది. దీంతోపాటు 'లేడీ సూపర్ స్టార్ 75' ఆర్. మాధవన్‌తో తన తొలిచిత్రం 'ద టెస్ట్' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, విఘ్నేష్ శివన్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైనాడు. -
ప్రపంచంలో బెస్ట్ మదర్ నువ్వే.. భార్యకు విఘ్నేశ్ శివన్ విషెస్
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. అంతలా స్టార్డమ్ తెచ్చుకున్న తెలుగు, తమిళ, మళయాళంలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న జవాన్ చిత్రంలో కనిపించనుంది. అగ్ర హీరోలతో జతకట్టిన నయన్ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడింది. వివాహమైన తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటించింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. (ఇది చదవండి: బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ .. సోషల్ మీడియాలో వైరల్!) అయితే ఈ జంట గతేడాది సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మదర్స్ డే సందర్భంగా నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నయనతారపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తన తల్లితో దుబాయ్‌లో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నారు. (ఇది చదవండి: మెగా డాటర్ కొత్త ప్రాజెక్ట్.. సోషల్ మీడియాలో ప్రకటించిన నిహారిక) విఘ్నేశ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'ప్రియమైన నయన్ ... ఒక తల్లిగా నీకు 10కి 10 మార్కులు. నీ అపారమైన ప్రేమ, శక్తి నాకు రక్ష. నీకు మొదటి హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు. మన ఒక కల నిజమైంది. ఉయిర్, ఉలగం కవలలతో ఆశీర్వదించిన దేవుడికి నా ధన్యవాదాలు. యూ ఆర్ ది బెస్ట్ మదర్ ఇన్ ది వరల్డ్' అంటూ పోస్ట్ చేశారు. నయనతార పిల్లలను ఎత్తుకుని ఫోటోలను పంచుకున్నారు. ఆస్పత్రిలో తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న నయన్ అరుదైన పిక్స్ మీరు చూసేయండి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) అలాగే తన తల్లి మీనాకుమారితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. 'నువ్వు చూపించిన ప్రేమ, అప్యాయతలే మా జీవితాన్ని బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తకు ఎదిగేలా చేశాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ తల్లి నువ్వే.' అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
ఆ క్షణమే నయన్‌తో ప్రేమలో పడిపోయా: విఘ్నేశ్ శివన్
సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార కోలీవుడ్ రెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇటీవల ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా విఘ్నేశ్ శివన్ నయనతారతో తన ప్రేమ కహానీని వెల్లడించారు. పోడాపోడి సినిమాతో డైరెక్టర్‌గా మారిన నేను తొలి సినిమాతోనే భారీ పరాజయాన్ని చూశాను. కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ‘నేనూ రౌడీనే’ అనే కథ రాశాను. హీరో ధనుష్ కథ నచ్చడంతో దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాడు. నయనతారను కలిసి కథ చెప్పమన్నాడు. నయన్ అంగీకరించదేమో అని అనుకొని నజ్రియాతో మాట్లాడదామనుకున్నా. కానీ ధనుష్ చెప్పడంతో నయన్ దగ్గరికి వెళ్లా. ఆమె నన్ను ఎంతో గౌరవించింది. ఆ క్షణమే నయన్‌తో ప్రేమలో పడిపోయా. ఆ సినిమా సెకండ్ షెడ్యూల్ నుంచే మేం ఇద్దరం డేటింగ్లో ఉన్నాం. కానీ సెట్స్‌లో అస్సలు బయటపడలేదు. నయన్‌ను మేడమ్ అనే పిలిచేవాడ్ని. ఆమె క్యారవాన్‌కు కూడా వెళ్లేవాడిని కాదు. ఇద్దరం వృత్తిపరంగా ప్రొఫెషనల్‌గా ఉండేవాళ్లం. మేం ప్రేమలో ఉన్నామని చెప్పేవరకు ఈ విషయం ఎవరికి తెలియదు అంటూ విఘ్నేశ్ తన లవ్‌స్టోరీని రివీల్ చేశాడు. -
అందుకే అజిత్ సినిమా నుంచి తొలిగించారు: విఘ్నేశ్ శివన్
లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విఘ్నేశ్ శివన్ అజిత్ సినిమా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అజిత్ 62వ సినిమా రాబోయే ప్రాజెక్ట్‌కు ఎన్నికైన విఘ్నేశ్ శివన్ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే దీనిపై ఇంతవరకు అజిత్ కానీ విఘ్నేశ్ శివన్ నుంచి క్లారిటీ లేదు. నయన్ కూడా దీనిపై ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ తన భర్తను అవమానించినందుకు నయన్ హర్ట్ అయ్యిందని, ఇకపై అజిత్‌తో నటించనని ఆమె నిర్ణయించుకుందంటూ రకరకాలుగా వార్తలు వినిపించాయి. చదవండి: పుష్ప 2 టీజర్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే దీంతో ఈ విషయంలో అంతా అజిత్‌ని తప్పుబట్టారు. అజిత్‌కు స్క్రిప్ట్ నచ్చలేదని.. అందుకే, ఇది ఆగిపోయిందంటూ కోలీవుడ్ వర్గాలు చర్చించుకున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్ సినిమా నుంచి తప్పుకోవడంపై మొదటిసారి విఘ్నేశ్ శివన్ పెదవి విప్పాడు. రీసెంట్గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన AK62 ప్రాజెక్ట్ నిలిచిపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. తన స్కిప్ట్ నచ్చకపోవడం వల్లే ఈ సినిమా నుంచి తనని తప్పించారన్నాడు. చదవండి: ‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు ఇందులో అజిత్ తప్పులేదని, తాను రాసిన స్క్రిప్ట్ ఆ మూవీ నిర్మాణ సంస్థకు నచ్చలేదని క్లారిటీ ఇచ్చాడు. సెకండాఫ్ విషయంలో వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ ప్రాజెక్ట్‌కు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నందుకు ఆనందిస్తున్న అన్నాడు. అంతేకాదు ఒక అభిమానిగా అజిత్ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తానంటూ విఘ్నేశ్ చెప్పుకొచ్చాడు. కాగా అజిత్ - విఘ్నేశ్ శివన్ కాంబోలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్షన్స్ గతేడాది ప్రకటించింది. అజిత్ 62వ చిత్రంగా ఇది ప్రచారం పొందింది. -
ఐదు నిమిషాలు కూడా ఆగలేరా?.. నయనతార ఆగ్రహం!
లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. దక్షిణాది ఇండస్ట్రీలో అంతలా పేరు సంపాదించుకుంది కోలీవుడ్ భామ. గతేడాది దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడిన నయన్.. సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే తమ పిల్లల పూర్తి పేర్లను కూడా వెల్లడించారు. అయితే ఇటీవల కుంభకోణంలోని తమ ఇష్టదైవమైన ఆలయానికి వెళ్లిన దంపతులు పూజలు నిర్వహించారు. కానీ అదే సమయంలో అక్కడున్న భక్తులపై నయనతార ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలేం జరిగిందంటే.. ఏప్రిల్ 5న కుంభకోణం జిల్లాలోని ఆలయానికి వెళ్లారు నయన్, విఘ్నేశ్ దంపతులు. వీరు పూజలు చేస్తున్న సమయంలో కొందరు భక్తులు గొడవకు దిగారు. అంతే కాకుండా వారి ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో నయనతార భక్తులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క ఐదు నిమిషాలు ఆగండి. మా పూజ పూర్తవుతుంది, మేము మీలాగే దేవుడి ఆశీస్సుల కోసమే వచ్చాం.' అని అన్నారు. కాగా.. నయనతార తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించింది. ఆమె చివరిసారిగా దర్శకుడు అశ్విన్ శరవణన్ 'కనెక్ట్'లో కనిపించింది. త్వరలోనే షారుఖ్ ఖాన్ మూవీ జవాన్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. "5 நிமிஷம் ப்ளீஸ்" - பொதுமக்களிடம் பொறுமையாக இருக்கக் கோரிய நடிகை நயன்தாரா! #Nayanthara | #VigneshShivan | #WikkiNayan pic.twitter.com/lxGftqQVrI — PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) April 5, 2023 -
కవల పిల్లల పేర్లు రివీల్ చేసిన నయనతార
-
ఎట్టకేలకు కవలల పేర్లు చెప్పిన నయన్ దంపతులు
నయనతార, విఘ్నేశ్ శివన్ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారిన విషయం అందరికీ తెలిసిందే! ఈ కవలలను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఈ దంపతులు తమ పిల్లల ముఖాలను మాత్రం ఇంతవరకు చూపించనేలేదు. కనీసం పేర్లు కూడా వెల్లడించలేదు. ఎప్పుడెప్పుడు వారి ముఖాలు రివీల్ చేస్తారా? అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. సస్పెన్స్‌కు తెర దించుతూ విఘ్నేశ్ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో కిటికీ దగ్గర కూర్చున్న నయన్ చేతిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న పిల్లల పేర్లను కూడా బయటపెట్టాడు విఘ్నేశ్. 'ఉయిర్ రుద్రనీల్ ఎన్ శివన్, ఉలగ్ దైవిక్ ఎన్ శివన్.. ఈ ప్రపంచంలోనే ఉత్తమ తల్లి నయనతారకు సంకేతంగా ఇద్దరి పేర్లలో ఎన్ను చేర్చాం. మా పిల్లల పేర్లను పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. కాగా చాలాకాలం డేటింగ్లో ఉన్న నయన్, విఘ్నేశ్ 2022 జూన్ 9న పెళ్లిపీటలెక్కారు. అక్టోబర్‌లో సరోగసి ద్వారా కవలలకు పేరెంట్స్ అయ్యారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయన్ కవలల పిక్ షేర్ చేసిన భర్త విఘ్నేశ్ శివన్
లేడీ సూపర్ స్టార్ నయనతార-దర్శకుడు విఘ్నేశ్ గతేడాది జూన్‌లో పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. దాదాపు 5 ఏళ్లు ప్రేమలో మునిగి తేలిన నయన్, విఘ్నేశ్‌లు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. ఈ క్రమంలో 2022లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదు నెలలు తిరక్కుండానే సరోగసి ద్వారా కవలకు తల్లిదండ్రులయ్యారు. అప్పట్లో ఈ వ్యవహరం వివాదం మారింది. అన్ని నిబంధనల ప్రకారమే తాము సరోగసికి వెళ్లామని నయన్ దంపతులు ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకోవడంతో వివాదం సద్దుమనిగింది. చదవండి: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్.. ఫొటోలు వైరల్ కవలలు జన్మించి నెలలు గడుస్తున్న ఇంతవరకు వారి ఫేస్ రివీల్ చేయలేదు ఈ జంట. దీంతో నయన్ పిల్లలను చూసేందుకు నెటిజన్లు, ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త విఘ్నేశ్ తాజాగా చిన్నారుల క్యూట్ పిక్స్ షేర్ చేశాడు. ఎప్పటిలాగే వారి ముఖం కనిపించకుండ విఘ్నేశ్ జాగ్రత్త పడ్డాడు. దీంతో నెటిజన్లు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంకా ఎంతకాలం ఇలా చేస్తారు’ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చదవండి: షాకింగ్: లాకర్లోని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ కాగా నయన్, విఘ్నేశ్‌లు చిన్నారుల చేతులు పట్టుకుని ఉన్న ఫొటోలన పోస్ట్ చేస్తూ.. ‘ఆనందం అనేది మన ప్రియమైన వారితోనే ముడిపడి ఉంటుంది. ప్రేమ అంటేనే ఆనందం.. ఆనందం అంటనే ప్రేమ’ అంటూ విఘ్నేశ్ తన పోస్ట్‌కు రాసుకొచ్చాడు. కాగా ఇటీవల ఈ స్టార్ కపుల్ తమ కవలలతో ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మీడియా వాళ్ళ కెమెరాలకు పనిచేప్పారు. స్టార్ కపుల్ వెంట పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టంట వైరల్‌గా మారాయి. కాగా తమ పిల్లలకు ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఉయిర్ అంటే ప్రపంచం అని.. ఉలగం అంటే జీవితం అని అర్ధం. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
తొలిసారి కవలలతో బయట కనిపించిన నయన్- విఘ్నేశ్, వీడియో వైరల్
సౌత్ స్టార్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే! తొలిసారి పిల్లలతో కలిసి వీరిద్దరూ దర్శనమిచ్చారు. మార్చి 8న ముంబై ఎయిర్‌పోర్టులో నయన్, విఘ్నేశ్.. చెరొక బాబును ఎత్తుకుని కనిపించారు. దీంతో మీడియా వారిని ఫోటోలు క్లిక్‌మనిపించే ప్రయత్నం చేశాయి. కానీ ఈ దంపతులు మాత్రం తమ పిల్లల ఫోటోలు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. కెమెరామన్లను చూసి నయన్ చిరునవ్వులు చిందిస్తూనే బుడ్డోడిని జాగ్రత్తగా అదిమిపట్టుకుంది. పిల్లలిద్దరికీ సేమ్ డ్రెస్సులు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇకపోతే నానుం రౌడీ ధాన్ సినిమా సెట్స్‌లో నయన్, విఘ్నేశ్ మధ్య ప్రేమ చిగురించింది. చాలాకాలం పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ 2022 జూన్ 9న పెళ్లి పీటలెక్కారు. వీరి వివాహ వేడుకకు రజనీకాంత్, షారుక్ ఖాన్, విజయ్ సేతుపతి సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లి జరిగి ఏడాది పూర్తికాకముందే సరోగసి ద్వారా పేరెంట్స్ అయ్యారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఎయిర్ పోర్టులో కవలపిల్లలతో నయన్.. విఘ్నేశ్ (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత నయన్‌కు కలిసిరావడం లేదా?
లేడీ సూపర్ స్టార్ నయనతారకు పెళ్లి తర్వాత కలిసిరావడం లేదని అనిపిస్తోందంటున్నారు ఆమె ఫ్యాన్స్. సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న ఆమె గతేడాది ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరుస ఆఫర్లు చేతి నిండా సినిమాలతో దూసుకుపోయిన నయన్‌కు పెళ్లి అనంతరం బ్రేక్ పడిందంటూ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. దీనికి కారణం ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా ఆఫర్స్ లేకపోవడమే. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఇంతకి అసలు సంగతి ఏంటంటే.. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటూ.. ఇటీవలే బాలీవుడ్‌లోనూ రంగప్రవేశం చేసింది నయన్. హిందీలో షారూఖ్ ఖాన్‌కి జంటగా నటించిన జవాన్ చిత్రం, తమిళంలో జయం రవి సరసన నటిస్తున్న ఇరైవన్ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకున్నాయి. వీటి విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈమెకు తర్వాత చిత్రం ఏంటి అన్న ప్రశ్న ఎదురవుతోంది.దీనికి కారణం కొత్త చిత్రాలేవీ చేతిలో ఏమీ లేకపోవడమే. అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో అంగీకరించిన చిత్రాలు సైతం వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నయనతార ఇటీవల నటించిన ఆ తరహా చిత్రాలు నిరాశపరిచాయి. మరో విషయం ఏంటంటే నయనతార ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో రెండు లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలు చేయడానికి అంగీకరించారని. అందుకు ఒక్కో చిత్రానికి రూ. 10 కోట్లు చొప్పున రెండు చిత్రాలకు రూ. 20 కోట్లు డిమాండ్ చేశారని సమాచారం. అయితే అడ్వాన్స్ తీసుకుని రెండేళ్లుగా కాలయాపన చేయడంతో వారు చిత్రాలను నిలిపివేయడమే కాకుండా.. నగదు వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. చదవండి: మృణాల్‌కు పెళ్లి ప్రపోజల్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే! ఇదిలా ఉంటే నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. ఆయన అజిత్ కథానాయకుడిగా దర్శకత్వం వహించాల్సిన చిత్రం చేజారిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలు వీరిద్దరి కెరీర్‌కూ పెద్ద ఎదురుదెబ్బ అనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇవి ఇలా ఉండగా.. నయన్ నటనకు స్వస్తి చెప్పారనే ప్రచారం హోరెత్తుతోంది. దీంతో నయనతారకు టైమ్ బాగాలేదా? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
భర్త కోసం నయన్ వ్యూహం.. ఆ డైరెక్టర్‌కి హ్యాండ్ ఇచ్చిన విజయ్ సేతుపతి?
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తున్న నటి నయనతార. జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ పాగా వేసిన సంచలన నటి మరోసారి వార్తల్లో నానుతున్నారు. నయనతార పెళ్లి అయిన తర్వాత పలు సమస్యలను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఆ మధ్య సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లి అయ్యి రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈమె నటించిన చిత్రాలు ఏమీ ఆశించిన విధంగా విజయాలు సాధించలేదు. ఇక తన భర్త విఘ్నేష్ శివన్ విషయంలో ఘోర పరాభవం జరిగింది. ఈయన నటుడు అజిత్ కథానాయకుడుగా చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు. దీన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు ప్రకటన కూడా జరిగింది. ఇక షూటింగ్‌కు వెళ్లడమే ఆలస్యం అన్న తరుణంలో సినిమా కథ నచ్చలేదంటూ ఇటు అజిత్, అటు సంస్థ పేర్కొనడమే కాకుండా చిత్రం నుంచి దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను తొలగించారు. ఇది దర్శకుడు విఘ్నేష్ శివన్ కంటే ఆమె భార్య, నటి నయనతారను బాగా గాయపరచిందనే ప్రచారం వైరల్ అయ్యింది. దీనికి కారణం ఈ వ్యవహారంలో ఆమె చేసిన సంధి ప్రయత్నం కూడా విఫలం కావడమే. దీంతో అజిత్‌కు బదులుగా నటుడు విజయ్ సేతుపతిని తీసుకొని విఘ్నేష్ శివన్ చిత్రం చేసేలా నయనతార చక్రం తిప్పిందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. అందుకు కారణం కూడా ఉంది. హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా నటుడు విజయ్ సేతుపతి తమిళంలో సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై 4 చిత్రంలో నటించడానికి అంగీకరించారు. అయితే తాజాగా ఆ చిత్ర కథ నచ్చలేదంటూ సుందర్.సి కి హ్యాండ్ ఇచ్చారు. అయితే దీని వెనుక నటి నయనతార హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా అజిత్ తిరస్కరించిన కథలోనే విజయ్ సేతుపతిని నటింపజేస్తూ తన ఈగోను తృప్తి పరచుకుంటోందనే వాదన కూడా వినిపిస్తోంది. కాగా విజయ్ సేతుపతి, నయనతార, విఘ్నేష్ శివన్ కాంబోలో ఇంతకు ముందు నానుమ్ రౌడీదాన్, కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రాలు రూపొందాయి.