సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ చిత్రం అంటేనే సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈయన అజిత్‌తో ఒక చిత్రం చేయడానికి కొద్దిరోజుల క్రితం విశ్వప్రయత్నం చేశారు. కథా చర్చలు కూడా పూర్తి చేశారు. ఇక చిత్రం సెట్‌పైకి వెళ్లడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో కారణాలేమైనా ఆ చిత్రం నుంచి వైదొలిగారు.
ఆ తరువాత 'లవ్ టుడే' చిత్రం ఫేమ్ ప్రదీప్‌రంగనాథన్ హీరోగా చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. లియో చిత్ర నిర్మాత సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కూడా నటిస్తుంది. ఈ చిత్రానికి ఎల్‌ఐసీ (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అదే ఈ చిత్ర దర్శక, నిర్మాతలను చిక్కుల్లో పడేసింది. ఎల్‌ఐసీ అనేది భారత్‌లో అత్యంత ప్రజాధరణ పొందిన జీవిత బీమా సంస్థ అని ఈ టైటిల్ తమ పేటెంట్ హక్కు అంటూ చిత్ర నిర్మాత, దర్శకులకు నోటీసులు జారీ చేసింది ఆ సంస్థ.
ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎవరూ స్పందించలేదు. అయితే ఎల్‌ఐసీ అనే టైటిల్‌ను వాడుకునే అవకాశం మాత్రం వీరికి లభించే అవకాశం ఉండదని సమాచారం. ఏదేమైనా నటి కృతిశెట్టి నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు ఎస్‌జే సూర్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే చడీచప్పుడు లేకుండా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆవరణలో చిత్రీకరణను జరుపుకుంటోందని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment