మూడు సెకన్ల ఫుటేజీ వాడినందుకు మాపై పగ తీర్చుకోవడం సరికాదంటూ హీరోయిన్ నయనతార.. ధనుష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నానుమ్ రౌడీదాన్ (నేనూ రౌడీనే) సినిమాలోని ఓ చిన్న క్లిప్‌ను నయనతార తన డాక్యుమెంటరీలో వాడింది. నిర్మాతగా తన అనుమతి పొందకుండా ఆ క్లిప్ వాడటంతో ధనుష్ రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశాడు. దీంతో నయన్.. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తోంది.. ఇంతలా దిగజారుతావనుకోలేదు అంటూ నానామాటలు అనేసింది.
మరి నీ భర్త చేసిందేంటి?
ఈ వ్యవహారంపై నిర్మాత ఎస్‌ఎస్ కుమారన్ స్పందిస్తూ నయనతారను దుయ్యబట్టాడు. ఒకర్ని తప్పుపట్టేముందు తమరి తప్పులు తెలుసుకోవాలని విమర్శించాడు. ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా సినిమాలోని మూడు సెకన్ల ఫుటేజీ వాడుకున్నందుకు ధనుష్ మీకు లీగల్ నోటీసులు పంపాడు. మరి నీ భర్త నేను రిజిస్టర్ చేసుకున్న ఎల్‌ఐసీ సినిమా టైటిల్‌ను అప్పనంగా వాడేశాడు.
నా నిర్ణయాన్ని గౌరవించలేదు
ఆ టైటిల్ కావాలని ఎవరి ద్వారానో అడిగించాడు. నేనందుకు ఒప్పుకోలేదు. అయినా సరే మీరు నా నిర్ణయాన్ని లెక్క చేయకుండా ఎల్‌ఐసీ టైటిల్‌తోనే సినిమా చేశారు. మరి దీన్నెలా సమర్థిస్తారు? నా కథకు, ఎల్‌ఐసీ టైటిల్‌కు కనెక్షన్ ఉండటం వల్లే దాన్ని మీకు ఇవ్వలేనని సున్నితంగా తిరస్కరించాను. కానీ మీరేం చేశారు? ఏం చేసుకుంటావో చేసుకో? అని నా టైటిల్‌ను వాడేశారు. దీనికి ఏమని సమాధానం చెప్తారు?
ఎంత కుంగిపోయానో?
ఒక ఫుటేజీ కోసం మీ కంటే శక్తిమంతుడైన వ్యక్తి అంగీకారం కోసం రెండేళ్లు ఎదురుచూశారు. నేను చిన్న నిర్మాతను కాబట్టి నన్నసలు లెక్కచేయలేదు. ఇది నాకెంతో బాధేసింది. ఎమోషనల్‌గా ఎంత కుంగిపోయానో నాకు తెలుసు. అది నా సినిమాపైనా ప్రభావం చూపింది.
ఉచితంగా యాక్ట్ చేస్తున్నారా?
ప్రతి నిర్మాత తన సినిమా కోసం సమయం, డబ్బు వెచ్చిస్తాడు. అలాంటిది.. ఆ సినిమాను మీ వ్యాపారాల కోసం వాడుకోవాలంటే కచ్చితంగా అతడి అనుమతి తీసుకోవాలి. న్యాయపరంగా ముందుకెళ్లాలి. మీరేమీ ఏదీ ఉచితంగా చేయట్లేదు.. కానీ ఫుటేజీ మాత్రం ఫ్రీగా ఇచ్చేయాలి! ఈ దారుణమైన ట్రెండ్‌ను నువ్వు, నీ భర్త ఇండస్ట్రీలో తీసుకురావాలని చూయడం ఘోరం అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment