బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్ సంపూర్ణమైందన్నాడు కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది. హౌస్‌లో వచ్చేవాళ్లు అయిపోయారు కానీ స్టేజీపైకి వచ్చి మాట్లాడేవాళ్లు ఇంకా మిగిలే ఉన్నారు. ఈ రోజు కంటెస్టెంట్ల ఇంటిసభ్యులతో పాటు స్నేహితులు కూడా వచ్చి విజయం నీదేనంటూ ధైర్యం చెప్పనున్నారు.
పృథ్వీ సేఫ్
కానీ ఈపాటికే ఆ పదిమందిలో ఒకరి ఎలిమినేషన్ కన్ఫామ్ అయిపోయింది. ఈ వారం అవినాష్, తేజ, గౌతమ్, పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి నామినేషన్‌లో ఉన్నారు. పృథ్వీ వెళ్లిపోయే సూచనలున్నాయి, జంట పక్షులు విడిపోవడానికి సమయం ఆసన్నమైందని ఊరించారు కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతెందుకు సండేవరకు ఆగకుండా నేటి ఎపిసోడ్‌లోనే పృథ్వీ సేవ్ అయ్యాడట!
ఎంటర్‌టైనర్ గుడ్‌బై
అంటే తన ఓటు బ్యాంక్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలినవారిలో అవినాష్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన ఇతడు నామినేషన్స్ అంటేనే జంకాడు. చివరకు అతడి భయమే నిజమైంది. గేమ్ ఆడి మెగా చీఫ్ అయినప్పటికీ ప్రేక్షకులు అతడిని బయటకు పంపించేందుకే మొగ్గుచూపారు. ఈ వారం ఎంటర్‌టైనర్‌ను ఎలిమినేట్ చేశారు.
నబీల్ వల్ల బతికిపోయిన అవినాష్
కానీ ఇక్కడే ట్విస్ట్ ఇచ్చారు. చివర్లో తేజ, అవినాష్ ఇద్దరూ మిగిలారు. నబీల్‌తో ఎవిక్షన్ షీల్డ్ బలవంతంగా వాడేలా చేశారు. దీంతో అతడు అవినాష్ కోసం ఎవిక్షన్ షీల్డ్ వాడటంతో అతడు సేవ్ అయిపోయాడట. అలా ఈ వారం నో ఎలిమినేషన్ అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment