Mukku Avinash
-
నాగార్జునకు, రామ్‌చరణ్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ముక్కు అవినాష్ (ఫోటోలు)
-
బిగ్‌బాస్ 8 హైలైట్స్: ఈ విషయాలు గమనించారా?
ఎన్నో ట్విస్టులు, టర్నులతో బిగ్‌బాస్ 8 మొదలైంది. అన్లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అంటూ షో మొదలుపెట్టాడు హోస్ట్ నాగార్జున. రానురానూ ఫన్ తగ్గిపోవడంతో వైల్డ్‌కార్డ్స్‌ను రంగంలోకి దింపాడు. అప్పటినుంచి షోపై హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లుగానే కంటెస్టెంట్లు కూడా హోరాహోరీగా పోరాడారు. చివరకు నిఖిల్ విజేతగా నిలిచాడు. మరి 105 రోజుల జర్నీలో ఏమేం జరిగాయో హైటైల్స్లో చూసేద్దాం..⇒ సెప్టెంబర్ 1న బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభం⇒ లాంచింగ్ రోజు హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు.. వీరిని జంటలుగా పంపించిన బిగ్‌బాస్⇒ ప్రైజ్‌మనీని జీరోగా ప్రకటించిన నాగార్జున.. హౌస్‌మేట్సే దాన్ని సంపాదించాలని వెల్లడి⇒ రెండో వారం శేఖర్ బాషాను పంపించేసిన హౌస్మేట్స్⇒ అక్టోబర్6న రీలోడ్ ఈవెంట్ ద్వారా 8 మంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ⇒ ఈ ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ గత సీజన్స్‌లో వచ్చినవాళ్లే కావడం గమనార్హం⇒ పాతవారిని ఓజీగా, వైల్డ్‌కార్డ్స్‌ను రాయల్స్ క్లాన్‌గా విభజించిన బిగ్‌బాస్⇒ తొమ్మిదోవారంలో క్లాన్స్ తీసేసి అందర్నీ కలిపేసిన బిగ్‌బాస్⇒ ఈ సీజన్లో కెప్టెన్ పదవికి బదులుగా మెగా చీఫ్ పదవిని పెట్టారు⇒ రేషన్ కూడా కంటెస్టెంట్లే సంపాదించుకోవాలన్నారు, కిచెన్‌లో టైమర్ ఏర్పాటు చేశారు⇒ ఈ సీజన్లో జైలుకు వెళ్లిన ఏకైక కంటెస్టెంట్ మణికంఠ⇒ ఏడోవారంలో నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ వల్ల బతికిపోయిన గౌతమ్⇒ పదోవారంలో గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్⇒ 12 వారం.. ఎలిమినేట్ అయినవారితో నామినేషన్స్⇒ ఎవిక్షన్ షీల్డ్ గెలిచిన నబీల్⇒ పదమూడోవారంలో ఎవిక్షన్ షీల్డ్‌ను అవినాష్‌కు వాడిన నబీల్.. ఫలితంగా తేజ ఎలిమినేట్⇒ ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్⇒ బీబీ పరివారం వర్సెస్ మా పరివారం ఛాలెంజ్‌లో అన్ని గేముల్లోనూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లదే గెలుపు⇒ ఈ సీజన్ చిట్టచివరి టాస్క్ గెలిచి ప్రైజ్‌మనీకి రూ.1 యాడ్ చేసిన గౌతమ్⇒ దీంతో టోటల్ ప్రైజ్‌మనీ రూ.55 లక్షలకు చేరింది.⇒ తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ⇒ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా రామ్‌చరణ్⇒ బిగ్‌బాస్ 8 విన్నర్‌గా నిఖిల్, రన్నరప్‌గా గౌతమ్⇒ తర్వాతి మూడు స్థానాల్లో నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నారు.నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవకపోయినా, నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడకపోయినా గౌతమ్, అవినాష్ ఫైనల్స్‌లో ఉండేవారే కాదు. అప్పుడు వీళ్లకు బదులుగా వేరే ఇద్దరికి ఫైనల్స్‌లో చోటు లభించేది!చదవండి: ఫినాలేలో గౌతమ్‌పై నాగ్ సెటైర్లు.. కానీ చివర్లో మాత్రం..! -
ఆ బాధతో 18వ అంతస్తు నుంచి దూకేద్దామనుకున్న గౌతమ్..
గత కొన్నిరోజులుగా నవ్వుతూ తుళ్లుతూ ఎంజాయ్ చేస్తున్న ఫైనలిస్టులను చివరిసారి ఏడిపించే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్. మీ జీవితంలోని అత్యంత బాధాకరమైన సంఘటనను పంచుకోమని చెప్పడంతో అందరూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. మరి ఎవరెవరు ఏమేం చెప్పారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..సోనియాను బ్లాక్ చేస్తానన్న ప్రేరణషో అయిపోయాక ఎవరితో కలిసుండాలనుకుంటున్నారు? ఎవరిని కలవకూడదనుకుంటున్నారో చెప్పమంటూ ఫాలో- బ్లాక్ గేమ్ ఆడించాడు బిగ్‌బాస్. దాదపు అందరితోనూ కలవాలనుకుంటున్న చెప్పారు టాప్ 5 కంటెస్టెంట్లు. ఎవరిని కలవకూడదన్న విషయానికి వస్తే.. సోనియా పర్సనాలిటీ నచ్చలేదంటూ తనను బ్లాక్ చేస్తానంది ప్రేరణ. తక్కువ పరిచయం వల్ల పృథ్వీని టెంపరరీగా బ్లాక్ చేశాడు గౌతమ్. నబీల్.. హరితేజ, సోనియాను బ్లాక్ చేస్తానన్నాడు. నిఖిల్.. బేబక్క, సీతను బ్లాక్ చేశాడు. అవినాష్.. పృథ్వీని టెంపరరీగా బ్లాక్ చేస్తానన్నాడు.మూడేళ్లు ఇంట్లో ఖాళీగా..తర్వాత చలిమంట వేసిన బిగ్‌బాస్.. జీవితంలోని బెస్ట్, వరస్ట్ సంఘటనలను పంచుకోమన్నాడు. నబీల్ మాట్లాడుతూ.. బైక్ యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్పాలయ్యాను. అదే నా చేదు జ్ఞాపకం అన్నాడు. నిఖిల్ మాట్లాడుతూ.. నేను ఆర్కిటెక్ట్ కోర్స్ చేస్తున్నప్పుడు సినిమా ఆఫర్ వచ్చింది. చదువు మధ్యలోనే వదిలేశాను. మూడేళ్లపాటు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను. రోజూ అమ్మ దగ్గర రూ.30 అడుక్కునేవాడిని. నువ్వు ఇంటికి భారమయ్యావు, నీకు తిండి పెట్టడమే కాకుండా ఖర్చులకు కూడా డబ్బివ్వాలా? అని తిట్టింది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చాకే..తర్వాత కన్నడ సీరియల్లో ఆఫర్ వచ్చింది. రోజుకు రూ.2500 ఇస్తామన్నారు. అంటే నెలకు రూ.75వేలు వస్తాయనుకున్నాను. కానీ పదిరోజులే షూటింగ్ జరిగింది. ఆ తర్వాత తెలుగు సీరియల్ చేశాను. అప్పటినుంచి నేను వెనుదిరిగి చూసుకోలేదు అని చెప్పాడు. ప్రేరణ నానమ్మ చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేసింది.ఏ పాపం చేశానో..గౌతమ్ మాట్లాడుతూ.. మెడిసిన్ చదువుతున్నప్పుడు ఒకమ్మాయితో బ్రేకప్ అయింది. ఆ బాధ తట్టుకోలేక నేను ఉంటున్న 18వ అంతస్థులోని బాల్కనీలో నుంచి దూకి చనిపోదామనుకున్నాను. కానీ నాతోపాటు నన్ను ప్రేమించేవాళ్లు గర్వపడేలా చేస్తే ఈ ప్రపంచమే దాసోహం అవుతుందని ఆలోచించి ఆగిపోయాను అన్నాడు. అవినాష్ మాట్లాడుతూ.. నేను, నా భార్య అను ఎన్నో కలలు కన్నాం. ఏ జన్మలో ఏ తప్పు చేశానో మాకు బాబు పురిటిలోనే చనిపోయాడు. నా చేతిలో కొడుకున్నాడు, కానీ వాడికి ప్రాణం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.యష్మిపై ఫీలింగ్స్?తర్వాత యాంకర్ సుమ వచ్చి సరదా టాస్కులు ఆడించింది. అలాగే ప్రేక్షకుల మనసులోని ప్రశ్నలను ఫైనలిస్టులను అడిగేసింది. కావాలని స్ట్రాటజీతో రెచ్చగొట్టి గొడవలు పెట్టుకుంటారా? అని గౌతమ్‌ను అడగ్గా అలా ఏం లేదని, దేనికైనా హర్ట్ అయితేనే గొడవపడతానన్నాడు. యష్మిపై నీకు నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయా? లేదా లవ్ యాంగిల్ కోసం వేసిన స్ట్రాటజీయా? అని అడగ్గా మొదట్లో కొంచెం ఫీల్ ఉండేది కానీ ఒకసారి అక్క అన్నాక అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవని గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు.ఫైర్ తగ్గలేదన్న నబీల్రాయల్స్(వైల్డ్ కార్డ్స్) వచ్చాక నీలో ఎందుకు ఫైర్ తగ్గింది? అని నబీల్ను అడగ్గా.. తనలో ఫైర్ ఎక్కడా తగ్గలేదని, కాకపోతే కొన్నిసార్లు కనిపించకపోయుండొచ్చన్నాడు. పృథ్వీ కాకుండా ఈ ఇంట్లో ఎవరిని ఎక్కువ నమ్ముతారు? అని నిఖిల్‌ను అడగ్గా ఆ రేంజ్లో ఎవరినీ నమ్మలేనన్నాడు. సీజన్ 4 లేదా సీజన్ 8లో ఏది బెస్ట్ అని ప్రశ్నించగా అవినాష్ క్షణం ఆలోచించుకోకుండా నాలుగో సీజన్ అని చెప్పాడు.అక్కడే అసలు గొడవనిఖిల్, గౌతమ్.. మీరిద్దరూ ఎందుకు ఎప్పుడూ గొడవపడతారు? అన్న ప్రశ్నకు అభిప్రాయబేధాలు అని ఇద్దరూ బదులిచ్చారు. తర్వాత ఓ టాస్క్‌లో నిఖిల్ గెలవడంతో అతడి తమ్ముడి వీడియో సందేశాన్ని చూపించాడు. అనంతరం ప్రేరణ గెలవడంతో తనకు ఓ ఫోటోఫ్రేమ్ ఇచ్చారు. అలా ఎమోషన్స్, ఆటపాటలతో ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8: ప్రేరణ, అవినాష్ ఎలిమినేట్!
బిగ్‌బాస్ రియాలిటీ షో మొదలై ఎనిమిదేళ్లు కావస్తోంది. కానీ ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా టైటిల్ గెలవలేదు. ఎలాగైనా సరే ఈసారి ట్రోఫీ అందుకుని చరిత్ర తిరగరాయాలని ప్రేరణ బలంగా కోరుకుంది. అందుకు తగ్గట్లుగానే ఎంతో కష్టపడింది. అబ్బాయిలతోనూ ధీటుగా పోరాడింది. తను పాల్గొన్న ప్రతి టాస్కులోనూ విజృంభించి ఆడింది. లేడీ ఫైటర్ అని పేరు తెచ్చుకుంది. టాప్ 3లో కూడా చోటు దక్కించుకోని ప్రేరణకానీ మైక్రో మేనేజ్మెంట్ వల్ల విమర్శలపాలైంది. అందరికీ ఓపికగా వంటచేసినప్పటికీ కిచెన్‌లో గొడవలు పడి నెగెటివిటీ మూటగట్టుకుంది. ప్రేరణ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే స్థాయి నుంచి ఈమె ఫైనల్‌కు అయినా వస్తుందా? అనే స్థాయికి పడిపోయింది. అందుకే టాప్3లో కూడా స్థానం దక్కించుకోలేదు.విజేత ఎవరు?ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ 8 గ్రాండ్ ఫినాలే షూటింగ్ సగం పూర్తయింది. మొదటగా ముక్కు అవినాష్‌ను ఎలిమినేట్ చేయగా నాలుగో స్థానంలో ప్రేరణను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. టాప్ 3లో నిఖిల్, నబీల్, గౌతమ్ కృష్ణ మిగిలారు. మూడో స్థానం నబీల్దే అన్న విషయం అందరికీ తెలుసు.. ఇక విన్నర్, రన్నర్ ఎవరనేది తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8కు అందుకే వచ్చానన్న గౌతమ్.. ఏడ్చేసిన అవినాష్!
ఆటలు, పాటలు.. అడ్డంకులు, ఆటుపోట్లు.. ఇలా ఎన్నింటినో దాటుకుని బిగ్‌బాస్ ఫైనల్ వీక్‌కు ఐదుగురు మాత్రమే చేరుకున్నారు. ఇంటిని, బయటి ప్రపంచాన్ని వదిలేసి బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజులుగా ఉంటున్నారు. వీరి జర్నీ తుది అంకానికి చేరుకున్న సందర్భంగా ఫైనలిస్టుల కష్టాలను, ఆనందాలను గుర్తు చేస్తూ బిగ్‌బాస్ జర్నీ వీడియోలు ప్లాన్ చేశాడు. ఆ విశేషాలు నేటి (డిసెంబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..తన్మయత్వంలో గౌతమ్బిగ్బాస్ హౌస్‌లో గడిచిన ప్రయాణాన్ని గుర్తు చేసేలా గార్డెన్ ఏరియాలో అదిరిపోయే సెటప్ ఏర్పాటు చేశాడు బిగ్‌బాస్. కంటెస్టెంట్ల ఫోటోలు, టాస్క్ ప్రాపర్టీస్.. ఇలా అన్నింటినీ అందంగా అమర్చాడు. మొదటగా గౌతమ్ గార్డెన్ ఏరియాలోకి వచ్చి తన ఫోటోలు చూసుకుని, ఆడిన టాస్కుల్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.అదే మీ స్ట్రాటజీతర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. బలవంతుడితో ఎలాగోలా గెలవొచ్చు. కానీ మొండివాడితో గెలవలేము. మీ మొండితనంలో నిజాయితీ ఉంది. మునుపటిసారి ఇంట్లో వచ్చినప్పుడు జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని పర్ఫెక్ట్ ప్లేయర్‌గా మిమ్మల్ని మీరు మల్చుకోవడానికి చేసిన కృషి ప్రశంసనీయం. లక్ష్యాన్ని చేధించేందుకు మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లోని బలమైన కంటెస్టెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారు. మీ స్ట్రాటజీ ఏంటో మిగతావారికి అర్థం కాకపోవడమే మీ స్ట్రాటజీగా మార్చుకున్నారు. ఊహించని విధంగా వారిపై దాడి చేశారు. ఒక యోధుడిలా..స్త్రీల పట్ల మీకున్న గౌరవం మీ మాటలో, ఆటలో స్పష్టంగా ప్రతిబింబించింది. ఎలిమినేషన్ అంచులవరకు వెళ్లినప్పుడు మీ మనసు చెలించింది. మీ ప్రణాళికను మార్చేసుకుని బుద్ధిబలం, భుజబలంతో ఒక యోధుడిగా పాదరసంలా కదులుతూ ఏ ఆటంకం లేకుండా మీ ఆట ముందుకు సాగింది. మీరు కోరుకున్న (యష్మి దగ్గర) ప్రేమ మీకు లభించకపోయినా అది మీ ఆటను ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. అమ్మ మాట వినే...గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి. అది నెరవేర్చుకోవడానికి అచంచలమైన కార్యదీక్ష కూడా అంతే అవసరం. ఈ రెండూ కనబర్చిన మీ ప్రయాణాన్ని ఓసారి చూసేద్దాం అంటూ పొగడ్తల అనంతరం జర్నీ వీడియో ప్లే చేశాడు. అది చూసిన గౌతమ్.. బిగ్‌బాస్ 8 నా జీవితంలోనే ఒక మైల్ స్టోన్. 'నీ లైఫ్‌లో ఎవరూ నీ కోసం ఏదీ చేయరు, ఒక్కడివే నిలబడు, ఒక్కడివే పోరాడు' అని అమ్మ చెప్పింది. ఆ గౌరవం కోసమే వచ్చాతను చెప్పింది వినే ఇక్కడిదాకా వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకెప్పుడూ గౌరవం లభించలేదు. దానికోసమే ఈ సీజన్‌కు వచ్చాను. గౌరవం సంపాదించుకున్నాను. జీవితంలో ముగ్గురే ముఖ్యమైన వారు తల్లి, తండ్రి, గురువు. మీరు నా గురువు బిగ్‌బాస్ అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత అవినాష్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు బిగ్‌బాస్. మీరు చుట్టూ ఉంటే ఉష్ణోగ్రత తనకు తానే కొన్ని డిగ్రీలు కోల్పోతుంది. జస్ట్ కమెడియన్ కాదుఎన్ని డిగ్రీలు పొందినవారికైనా అది సాధ్యమవుతుందా? నవ్వుకున్న బలం అలాంటిది! ఈ ఇంట్లో కొందరే మీ స్నేహితులైనా అందరూ మీ ఆప్తులే.. వారందరూ నవ్వు మీకిచ్చిన బంధువులే! రింగుల జుట్టు మీ భార్యకు ఇష్టమైనప్పటికీ ఆటకోసం త్యాగం చేశారు. కొందరు మిమ్మల్ని జస్ట్ కమెడియన్ అన్నా, మీ కామెడీ వారికి రుచించలేదని నిందించినా మీరు కుంగిపోలేదు. కమెడియన్ అనే బిరుదును గర్వంగా ధరించి ధీటుగా జవాబిచ్చారు. ఎవరికీ తక్కువ కాదుఈసారి అవినాష్ కామెడీ మాత్రమే చేయగలిగే జస్ట్ కమెడియన్ మాత్రమే కాదు, అన్నీ చేయగలిగే కంప్లీట్ ఎంటర్టైనర్గా ఆవిష్కరించుకున్నారు. మిమ్మల్ని వేలెత్తి చూపినవారు కూడా ఈ విషయం ఒప్పుకోక తప్పదు. రెండుసార్లు మెగా చీఫ్‌గా, అందరికంటే ముందు ఫైనలిస్టుగా నిలిచి.. ఆటలో, మాటలో, పోటీలో ఎవరికీ తక్కువ కాదని తెలిసేలా చేశారు అంటూ జర్నీ వీడియో చూపించాడు.మనిషిగా నేను గెలిచాఅది చూసి భావోద్వేగానికి లోనైన అవినాష్.. నాకు గొడవపెట్టుకోవడం రాదు. మనసున్న మనిషిగా నేను గెలిచాను బిగ్‌బాస్. బాగా ఆడే నా ఫ్రెండ్ రోహిణి ఓడిపోతుంటే నాతోపాటు ముందుకెళ్లాలని ఆలోచించాను. కమెడియన్స్ ఎందుకు గెలవకూడదు? అని బిగ్‌బాస్ నాలుగో సీజన్ నుంచి నాలో మెదులుతున్న ప్రశ్న. కానీ జనాలు అనుకుంటే ఏదైనా అవుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మిగతావారి జర్నీలు రేపటి ఎపిసోడ్లో ఉండనున్నాయి.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అవినాష్ జస్ట్ కమెడియన్ కాదు! బిగ్‌బాస్ ఎలివేషన్స్ వేరే లెవల్
కామెడీ తప్ప ఏం చేయగలవ్? ఫినాలేలో అడుగుపెట్టే అర్హత నీకు లేదు.. ఇలాంటి కామెంట్లను తట్టుకుని ఈ సీజన్లోనే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు ముక్కు అవినాష్. నామినేషన్స్‌లోకి ఒకే ఒకవారం రాగా.. నబీల్ ఇచ్చిన ఎవిక్షన్ షీల్డ్ సాయంతో ఆ వారం గండం గట్టెక్కాడు. తర్వాత మెగా చీఫ్ అయ్యాడు, టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనలిస్ట్ అయ్యాడు. కొందరే స్నేహితులు..ఈ సీజన్‌కు ఎంటర్టైన్మెంట్ను జోడించిన అవినాష్ తన ప్రయాణాన్ని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. తెలియని సముద్రం భయాన్ని పెంచితే.. తెలిసిన సముద్రం అంచనాలను పెంచుతుంది. ఈరోజు మీరీ స్థానంలో నిలిచి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఇంట్లో కొందరే మీకు స్నేహితులైనా అందరూ మీకు ఆప్తులే..జస్ట్ కమెడియన్ కాదుమీ భార్యకెంతో ఇష్టమైన రింగుల జుట్టును ఆటపై ప్రేమతో త్యాగం చేశారు. ఈసారి అవినాష్ కామెడీ మాత్రమే చేయగలిగే జస్ట్ కమెడియన్ కాదు.. అన్నీ చేయగలిగే ఎంటర్టైనర్లా మిమ్మల్ని మీరు ఆవిష్కరించారు. అన్ని అనారోగ్యాల నుంచి ఉపశమనం ఇచ్చే దివ్యౌషధం నవ్వు ఒక్కటే! ఆ నవ్వును పంచే మీరు అందరికన్నా ఐశ్వర్యవంతులు అంటూ బిగ్‌బాస్ అవినాష్‌పై ప్రశంసలు కురిపించాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణకు కలిసొచ్చిన లక్.. టాప్ 5పై గెలవని సీరియల్ బ్యాచ్
మరో ఐదు రోజుల్లో కంటెస్టెంట్లు ఉండరు, బిగ్‌బాస్ హౌసూ ఉండదు. ఉన్న నాలుగురోజులైనా టాప్ 5 కంటెస్టెంట్లను, వారి జర్నీని, బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌ను ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందామంటే బిగ్‌బాస్ ఆ ఛాన్సే ఇవ్వట్లేదు. వరుసపెట్టి సీరియల్ ఆర్టిస్టులను పంపిస్తూనే ఉన్నాడు. సీరియల్స్ ప్రమోషన్ జరిపిస్తూనే ఉన్నాడు. మరి ఈ రోజెవరొచ్చారో నేటి (డిసెంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..సీరియల్ బ్యాచ్‌పై గెలుపువంటలక్క సీరియల్ టీమ్ హౌస్‌లోకి వచ్చింది. వీరితో ప్రేరణ, అవినాష్ గేమ్ ఆడి గెలిచారు. దీంతో బిగ్‌బాస్ రూ.10,928 ప్రైజ్‌మనీలో యాడ్ చేశాడు. తర్వాత మగువ.. ఓ మగువ సీరియల్ టీమ్ హౌస్‌మేట్స్‌తో చిట్‌చాట్ చేసింది. అప్పుడు కూడా అవినాష్ తన కామెడీ యాంగిల్‌తో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అనంతరం అందరూ కలిసి ఓ ఫన్ గేమ్ ఆడారు. ప్రేరణ నోటికి తాళంమ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు ఒకరి చేతిలోని బాక్స్‌ను మరొకిరి ఇస్తూ పోవాలి. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు ఎవరి చేతిలో అయితే ఆ బాక్స్ ఉంటుందో దాన్ని తెరిచి అందులో ఏది రాసుంటే అది ఫాలో అయిపోవాలి. అలా మొదటగా ప్రేరణ చేతిలో బాక్స్ ఉన్నప్పుడు మ్యూజిక్ ఆగిపోయింది. అందులో గేమ్ అయిపోయేవరకు ప్రేరణ నోరు తెరవకూడదని ఉంది. ఆమె తరపున అవినాష్ మాట్లాడాలని ఉంది. దెబ్బలు తిన్నాడ్రోయ్రెండో రౌండ్లో అవినాష్ వంతురాగా.. తనకు ఇచ్చిన టాస్క్ ప్రకారం అందరిపై ఫేక్ పొగడ్తలు కురిపించాడు. తర్వాత నిఖిల్ మార్నింగ్ పనులను డ్యాన్స్ రూపంలో చేయగా.. నబీల్ రెండు పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తిన్నాడు. చివర్లో అవినాష్ అందరితో దెబ్బలు తిన్నాడు. అనంతరం మగువ ఓ మగువ టీమ్‌తో ప్రేరణ, గౌతమ్ టాస్క్ ఆడి రూ.10,0010 గెలిచారు.ప్రేరణకు కలిసొచ్చిన అదృష్టంబీబీ పరివారంపై మా పరివారం ఇప్పటివరకు ఒక్క టాస్క్ గెలిచిందే లేదు! మరి రేపటి ఎపిసోడ్లో అయినా ఈ రికార్డును ఎవరైనా బ్రేక్ చేస్తారేమో చూడాలి! అలాగే వచ్చిన అందరూ.. హౌస్‌లో ఒక్క అమ్మాయే ఉందంటూ ప్రతి గేమ్‌లోనూ తననే సెలక్ట్ చేసుకుంటున్నారు. అలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వందశాతం ఉపయోగించుకుంటోంది ప్రేరణ. ఈ టాస్కుల్లో తన కష్టాన్ని చూసి ప్రేరణకు మరిన్ని ఓట్లు పడే అవకాశం లేకపోలేదు. -
ప్రేమ పెళ్లి ముద్దు అన్న నిఖిల్.. అవినాష్‌ను ఆడుకున్న బిగ్‌బాస్
నామినేషన్స్ అయిపోయాయి. బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 5 ఫైనలిస్టులు మాత్రమే మిగిలారు. ఈ చివరివారంలో కూడా ప్రైజ్‌మనీ పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ గేమ్స్‌లో గెలవకపోతే ప్రైజ్‌మనీ కట్ అవుతుందన్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..సీరియల్ పరివారం వర్సెస్ బీబీ పరివారంసీరియల్ సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌస్‌కు వస్తారని చెప్పాడు బిగ్‌బాస్. మా సీరియల్ పరివారంతో బీబీ పరివారం పోటీపడి ఆటలు ఆడి గెలిచి ప్రైజ్‌మనీని పెంచుకోవచ్చన్నాడు. ఓడిపోతే ప్రైజ్‌మనీ కూడా తగ్గుందన్నాడు. మొదటగా నువ్వుంటే నా జతగా సీరియల్ టీమ్ అర్జున్ కళ్యాణ్, అను హౌస్‌లోకి వచ్చారు. వీరితో ఆడాల్సిన గేమ్‌కు రూ.12,489 ప్రైజ్‌మనీ నిర్ణయించారు. ఒగ్గుకథ చెప్పిన అవినాష్ఈ ఆటలో సీరియల్ పరివారంతో నబీల్-ప్రేరణ ఆడి గెలిచారు. అలా పన్నెండువేల రూపాయల్ని ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. తర్వాత అవినాష్ టాప్ 5 ఫైనలిస్టులపై ఒగ్గుకథ చెప్పి అలరించాడు. ఇప్పుడెలాగూ చేసేదేం లేదని కాసేపు దాగుడుమూతలు ఆడారు. ఈ క్రమంలో అవినాష్ యాక్షన్ రూమ్‌లో దాక్కున్నాడు. ఇంతలో బిగ్‌బాస్ ఆ గదికి తాళం వేసి లైట్లు ఆఫ్ చేశాడు. కాసేపటికి ఘల్లు ఘల్లుమంటూ గజ్జెల శబ్దం ప్లే చేశాడు.అవినాష్‌ను ఆటాడుకున్న బిగ్బాస్దీంతో అవినాష్ దడుసుకుని చచ్చాడు. తలుపు తీయండి బిగ్‌బాస్ అని వేడుకున్నా కనికరించలేదు. దెయ్యం కేకలు, కాంచన అరుపుల సౌండ్స్ వినిపించడంతో అవినాష్ ఏడ్చినంత పని చేశాడు. చివరకు గది తాళం తీయడంతో బయటకు పరిగెత్తాడు. అతడిని చూసి హౌస్మేట్స్ అందరూ ఘొల్లుమని నవ్వారు.ప్రేమ వివాహం చేసుకుంటా: నిఖిల్అనంతరం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీమ్ నుంచి ప్రభాకర్, ఆమని వచ్చారు. తమ సీరియల్ స్టోరీలైన్ గురించి చెప్తూ హౌస్‌మేట్స్‌ను మీలో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారని అడిగారు. అందుకు నిఖిల్.. ప్రేమవివాహం చేసుకుంటానన్నాడు. పెద్దలను ఒప్పించాకే తన పెళ్లి జరుగుతుందన్నాడు. ఇక ప్రభాకర్- ఆమనితో ప్రేరణ - అవినాష్ బాల్స్ గేమ్ ఆడారు. ఇందులో సీరియల్ పరివారంపై బీబీ పరివారం గెలిచి రూ.15,113 పొందారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గౌతమ్‌కు హ్యాట్సాఫ్ చెప్తూ.. నిఖిల్‌ను విలన్ చేసిన రోహిణి
ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ నాగార్జున బాంబు పేల్చాడు. వచ్చేవారం ఫినాలే జరగబోతుందని తెలిపాడు. ఇక ఇన్నివారాల ప్రయాణంలో ఏ విషయంలో రిగ్రెట్ ఫీలయ్యారు? అది ఏ వారమో చెప్పాలన్నాడు నాగ్. మరి ఎవరెవరు ఏమేం చెప్పారో నేటి (డిసెంబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..మెగా చీఫ్ నా కొంప ముంచిందిమొదటగా అవినాష్.. 12వ వారంలో నేను మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు విష్ణు, రోహిణి మధ్య గొడవను పరిష్కరించలేకపోయానన్నాడు. ప్రేరణ.. పదకొండోవారంలో నేను మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు సాఫ్ట్‌గా ఉండాల్సింది. కానీ బ్యాలెన్స్ కోల్పోయాను. దానివల్ల నాకు, హౌస్‌మేట్స్‌కు ఎఫెక్ట్ అయిందని చెప్పుకొచ్చింది. నబీల్.. తొమ్మిదో వారంలో మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ, ఏదో బాధలో ఉండటంతో ఆ అవకాశాన్ని ఈజీగా వదిలేసుకుని తప్పు చేశానన్నాడు. ఎందుకంత తుత్తర? ఈ సందర్భంగా నాగ్.. టాస్కులు సరిగా పూర్తిచేయకముందే ఎందుకు గంట కొడతావ్? ఎందుకంత తుత్తర? అని ప్రశ్నించాడు. అలాగే ఫైనలిస్ట్ అవడానికి చెక్‌పై రూ.15 లక్షలు రాసి, దాన్నెందుకు చించేశావని సూటిగా అడిగాడు. మొదట నా స్వార్థం కొద్దీ రాశాను కానీ తర్వాత మనసొప్పకపోవడంతో దాన్ని చింపేశానని తెలిపాడు. రోహిణి వంతురాగా పదోవారం ఎవిక్షన్ షీల్డ్ గేమ్‌లో అవినాష్ గుడ్డు పాము నోట్లో వేసినందుకు ఎన్నోసార్లు బాధపడ్డానంది. పృథ్వీతో ఫ్లర్ట్ చేశావిష్ణుప్రియ వంతురాగా.. పృథ్వీతో ఫ్లర్ట్ చేయడం వల్ల అతడి గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అయిందేమోనని బాధపడుతున్నాను. అలాగే తొమ్మిదో వారంలో నేను చీఫ్ అయినప్పుడు ఐదుగుర్ని నామినేట్ చేయమన్నారు. అప్పుడు నబీల్ను నామినేట్ చేసినందుకు రిగ్రెట్ అయ్యానంది. గౌతమ్.. ఆరో వారంలో కామెడీ టాస్క్‌లో నన్ను అశ్వత్థామ అన్నందుకు ఫీలయ్యాను. అది నామినేషన్స్ దాకా వెళ్లింది. అక్కడ ఫీలయ్యాను అని చెప్పాడు. సారీ చెప్పాలి కదా!ఈ సందర్భంగా నిఖిల్‌తో గొడవ గురించి అడిగాడు నాగ్. నా క్యారెక్టర్ గురించి తప్పుగా అనడంతో నేనూ నోరు జారానన్నాడు. వాడుకున్నావ్ అనేది ఎంత పెద్ద మాటో తెలుసా? అని నాగ్ చెప్తుంటే గౌతమ్.. తాను చేసింది తప్పని, కానీ వేరే ఉద్దేశంలో అనలేదన్నాడు. తప్పు ఎలా చేసినా తప్పే.. మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి కదా అని క్లాస్ పీకడంతో గౌతమ్ మరోసారి నిఖిల్‌ను అందరి ముందు క్షమాపణలు కోరాడు.వీడియోతో క్లారిటీనిఖిల్ వంతు రాగా.. ఎన్నడూ నోరు జారని నేను పద్నాలుగోవారంలో గౌతమ్‌పై నోరు పారేసుకున్నందుకు రిగ్రెట్ అవుతున్నానన్నాడు. రంగుపడుద్ది టాస్క్‌లో గౌతమ్ నిఖిల్‌ను కావాలని కొట్టాడా? లేదా? అనేది వీడియో ప్లే చేసి చూపించాడు. అది అనుకోకుండా తగిలిందని క్లారిటీ రావడంతో నిఖిల్ సైతం అతడికి సారీ చెప్పాడు. తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారో అవిష్ను గెస్ చేయమన్నాడు నాగ్. అవినాష్ ఊహించిందే నిజమైందిఫస్ట్ టైమ్ నామినేషన్స్‌కు రావడం పెద్ద మైనస్.. కాబట్టి రోహిణి ఎలిమినేట్ అవుతుందని అంచనా వేశాడు. అతడు చెప్పిందే నిజమైంది. రోహిణి ఎలిమినేట్ అయింది. అయితే హౌస్‌లో ఆమె మాటతీరు, ఆటతీరును ప్రశంసిసిస్తూ చప్పట్లు కొట్టి, సెల్యూట్ చేసి మరీ సెండాఫ్ ఇచ్చారు. స్టేజీపైకి వచ్చిన రోహిణి.. అవినాష్, గౌతమ్, ప్రేరణను హీరోలుగా పేర్కొంది. ఆ ముగ్గురు హీరోలు: రోహిణిగౌతమ్తో.. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన మొదటివారమే ఎలిమినేషన్ అంచుల దాకా వెళ్లొచ్చావ్.. అలా ఎందుకు జరిగిందన్న ఆలోచనతో ఆ తర్వాతి వారం నుంచి నువ్వు ఆడిన విధానానికి హ్యాట్సాఫ్. సోలో.. సోలో అంటూ ఫైనల్‌కు వచ్చేశావ్.. ఫ్రెండ్స్‌తో ఉండటం తప్పేం కాదు, అందరికీ కాసేపు సమయం కేటాయించు సలహా ఇచ్చింది. విష్ణు, నబీల్, నిఖిల్‌ను విలన్లుగా పేర్కొంది. ట్రోఫీ గెలవకపోయినా రోహిణి సగర్వంగా విన్నర్లా బయటకు వెళ్లిపోయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అవినాష్ త్యాగం వృథా.. విన్నర్‌ను చేయమంటూ విష్ణు రిక్వెస్ట్
బిగ్‌బాస్ సీజన్ ఎండింగ్‌కు వచ్చేసింది. విన్నర్‌గా గెలిపించమని ప్రేక్షకులను ఓట్లు అడిగే ఛాన్స్ పొందాలంటే తాను పెట్టే టాస్కులు గెలవాలన్నాడు బిగ్‌బాస్. అలా మొన్న ప్రేరణ, నిన్న నబీల్, నేడు విష్ణుప్రియ ఓట్ అప్పీల్ ఛాన్స్ పొందరు. ఆమె ఎలా గెలిచింది? ఏం మాట్లాడిందన్నది నేటి (డిసెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అదరగొట్టిన గౌతమ్బిగ్బాస్ ఈ రోజు మొదటగా పవర్ ఫ్లాగ్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. బజర్ మోగినప్పుడు ఫ్లాగ్ పట్టుకున్నవారు ఆ రౌండ్లో ఒకరిని ఛాలెంజ్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో గౌతమ్ గెలిచి నబీల్ను రేసు నుంచి తప్పించాడు. తర్వాతి రౌండ్లలో కూడా గౌతమ్ ఒక్కడు ఒకవైపు, మిగతా వారంతా మరోవైపు అన్నట్లుగా ఆట కొనసాగింది. గౌతమ్ దగ్గరి నుంచి జెండా లాక్కునేందుకు అందరూ కలిసి ప్రయత్నించినా లాభం లేకపోయింది. అలా మిగతా రెండు రౌండ్లలో గౌతమ్.. ప్రేరణ, నిఖిల్‌ను తీసేశాడు.గౌతమ్ దూకుడుకు బ్రేక్ వేసిన రోహిణితర్వాతి రౌండ్లో మిగిలినవాళ్లు గౌతమ్‌ను లాక్ చేశారు. అలా అతడి దగ్గరి నుంచి రోహిణి జెండా తీసుకుంది. స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ గౌతమ్‌ను రేసులో నుంచి తొలగించింది. అనంతరం అవినాష్.. విష్ణును రౌండ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. చివర్లో అవినాష్, రోహిణి మాత్రమే మిగిలారు. స్నేహితురాలిని గెలిపించడం కోసం అవినాష్ జెండా త్యాగం చేయడంతో రోహిణి కంటెండర్‌గా నిలిచింది. తనకోసం అవినాష్ త్యాగం చేయడంతో ఆమె చిన్నపిల్లలా ఏడ్చేసింది.ఆగమైన సంచాలక్బిగ్బాస్ నిలబెట్టు-పడగొట్టు అనే రెండో ఛాలెంజ్ ఇచ్చాడు. అర్హత లేదనుకున్న వ్యక్తి ఫోటోను వేస్ట్ బాక్స్‌లో పడేయాలి. ఇందులో అందరూ వారు తెచ్చుకున్న ఫోటోలు పడేయగా గౌతమ్ తాను తీసుకున్న నబీల్ ఫోటో పడేయలేకపోయాడు. దీంతో సంచాలక్ రోహిణి.. నబీల్ను విజేతగా ప్రకటించింది. ఇక్కడే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ గేమ్ సరిగానే ఆడారా? అని ప్రశ్నించాడు. విష్ణు గెలుపుదీంతో ఆలోచనలో పడ్డ రోహిణి.. టాస్క్‌ను ప్రేరణ, విష్ణు మినహా ఎవరూ సరిగా ఆడనట్లు గుర్తించింది. చర్చోపచర్చల అనంతరం విష్ణు గెలిచినట్లు తెలిపింది. రోహిణి, విష్ణుప్రియలో ఎవరు ఓట్ అప్పీల్ చేయాలో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. అవినాష్ మినహా మిగతా అందరూ విష్ణుకు సపోర్ట్ చేయడంతో ఆమె ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం పొందింది.మహిళా విజేతగా నిలవాలనుందివిష్ణుప్రియ మాట్లాడుతూ.. ఇప్పటిదాకా వివిధ షోలలో నన్ను చూసి, ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను నన్నుగా ప్రేమించి పద్నాలుగువారాల వరకు తీసుకొచ్చినవారికి థ్యాంక్స్. నా ప్రవర్తన నచ్చనివారికి సారీ.. ఇంకా ఒక్కవారమే ఉంది. మీ ప్రేమాభినాలు ఇలాగే కొనసాగించి నన్ను విజేతను చేస్తారని కోరుకుంటున్నాను. వీలైనంతవరకు నిజాయితీగా ఉన్నాను. బిగ్‌బాస్ చరిత్రలో మహిళా విజేత అవ్వాలన్నది నా కోరిక.. అందుకు మీ సాయం కావాలి. మీ ఓటే నా గెలుపు అని ప్రేక్షకులను ఓట్లు అభ్యర్థించింది.సంగీత కచేరీఇక టాస్కులు ఆడి అలిసిపోయిన కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ప్రత్యేకంగా సంగీత కచేరీ ఏర్పాటు చేశాడు. జామర్స్ బ్యాండ్‌ను పిలిచి లైవ్ కన్సర్ట్ ద్వారా వినోదాన్ని పంచాడు. సంగీతంతో హౌస్మేట్స్ తమ బాధలన్నీ మర్చిపోయి రిలాక్స్ అయ్యారు. పాదమెటు పోతున్నా.. అనే ఫ్రెండ్షిప్ పాటకైతే అందరూ కలిసిపోయి డ్యాన్స్ చేయడం కన్నులపండగ్గా ఉంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ను తప్పుపట్టిన బిగ్‌బాస్.. అయినా అతడిదే గెలుపు!
ప్రేరణ ఆటలో గెలిచింది. కానీ సంచాలకురాలిగా మాత్రం తడబడింది. నిన్న ప్రేరణ ఓట్లు అడిగే ఛాన్స్ పొందగా నేడు ఆ అదృష్టం నబీల్ను వరించింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అడ్డదిడ్డంగా చుట్టేసిన నబీల్ఓట్ అప్పీల్ గెలిచేందుకు బిగ్‌బాస్ క్రాసింగ్ పాత్ అనే మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో నబీల్ అడ్డదిడ్డంగా తన తాడును పోల్‌కు చుట్టేసి అందరికంటే ముందు గంట కొట్టాడు. తర్వాత రోహిణి గంట కొట్టింది. అనంతరం ప్రేరణ, గౌతమ్, నిఖిల్ వరుసగా గంట కొట్టారు. అయితే నిఖిల్ తన పోల్‌కు బదులు వేరేవారి పోల్‌కు తాడు చుట్టాడు. దీంతో నాలుక్కరుచుకుని మళ్లీ తన పోల్‌కు తిరిగి చుట్టాడు. విష్ణుప్రియ, అవినాష్ చివరి స్థానాల్లో ఉన్నారు.నేనే గెలిచా: ప్రేరణహౌస్మేట్స్ అందరూ కలిసి ఎవరు గెలిచారో చెప్పాలన్నాడు. నబీల్ తాడు సరిగా చుట్టలేదని, తానే గెలిచానని ప్రేరణ వాదించింది. లేదు, నేనే ఫస్ట్ అని నబీల్ అరుస్తూ ఉండటంతో ఆమె అతడిని ఇమిటేట్ చేసింది. ఇన్నాళ్లూ అవతలివారిని వెక్కిరించిన నబీల్.. తనను ఒకరు ఇమిటేట్ చేయడంతో తట్టుకోలేకపోయాడు. నన్ను వెక్కిరిస్తే బాగోదంటూ వార్నింగ్ ఇచ్చాడు.నబీల్‌కు బిగ్‌బాస్ కౌంటర్చివరకు అందరూ కలిసి నబీల్ గెలిచినట్లు ప్రకటించారు. అప్పుడు బిగ్‌బాస్.. మీరు తాడును సరిగా చుట్టారని అనుకుంటున్నారా? అని అడగడంతో అందరూ మనసు మార్చుకుని ప్రేరణ పేరు చెప్పారు. అయినా నబీల్ తనది కరెక్టే అనడంతో మీకు చుట్టడమంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించాడు. దీంతో అతడు కిక్కురుమనకుండా ఉండిపోయాడు.అయోమయం.. గందరగోళంఈ ఆటలో ఎవరు ఓడిపోయారని ప్రేరణను అడగ్గా ఆమె మొదట అవినాష్ పేరు చెప్పింది. గంట కొట్టేశాక మళ్లీ ఆడటం తప్పు కాదా? అని అవినాష్ అడగడంతో ఆమె మనసు మార్చుకుని నిఖిల్ పేరు చెప్పింది. అందుకతడు అభ్యంతరం చెప్పడంతో ఆమె మళ్లీ యూటర్న్ తీసుకుని అవినాష్ పేరు చెప్పి ఇదే ఫైనల్ నిర్ణయమంది. దాంతో అవినాష్ రేసు నుంచి తప్పుకున్నాడు.నబీల్‌కు ఓట్లు అడిగే ఛాన్స్టర్ఫ్ వార్ అని బిగ్‌బాస్ మరో ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో చివరివరకు సర్కిల్లో ఉన్నవారు విజేతగా నిలుస్తారు. మొదటగా ప్రేరణను తోసేశారు. తర్వాత వరుసగా గౌతమ్, నిఖిల్, రోహిణిని తోసేశారు. చివర్లో నబీల్, విష్ణుప్రియ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ పొందాలో ఇంటిసభ్యులు నిర్ణయించాలన్నాడు. అందరూ కలిసి నబీల్ను సెలక్ట్ చేశారు.ప్రాణం పోయినా సరేనని..నబీల్ మాట్లాడుతూ.. నేనొక సామాన్యుడిని. సినిమాల్లో నటుడవ్వాలని కలలు కన్నాను. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినా ఎక్కడా అవకాశం రాలేదు. ఎవరో అవకాశాలివ్వడమేంటని సోషల్ మీడియాలో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. తొమ్మిది సంవత్సరాల్లో నాకు వచ్చిన పెద్ద అవకాశం బిగ్‌బాస్. ప్రాణం పోయినా సరే అని టాస్కులు గెలవాలని ఆడాను. నన్ను విజేతగా చూడాలన్నది మా అమ్మ కల. దాన్ని మీరే నిజం చేయాలి అంటూ ప్రేక్షకులను ఓట్లు వేయమని అభ్యర్థించాడు.ఎన్నాళ్లకెన్నాళ్లకు..అనంతరం ప్రముఖ చెఫ్ సంజయ్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. అలాగే వారికోసం రుచికరమైన భోజనం వండి మరీ తీసుకొచ్చాడు. నిఖిల్, గౌతమ్ మధ్య దూరాన్ని చెరిపేస్తూ ఒకరికొకరు ఫుడ్ తినిపించుకోమన్నాడు. స్టార్టర్, బిర్యానీ, ఐస్‌క్రీమ్స్ అన్నీ కడుపారా తిన్న కంటెస్టెంట్లు ఇది జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమంటూ ఫుల్ ఖుషీ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిని వాడుకున్నావ్.. నోరు జారొద్దంటూ నిఖిల్ వార్నింగ్
బిగ్‌బాస్ హౌస్‌లో ఏడుగురు మిగిలారు. టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. దీంతో అతడు మినహా మిగతా ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. తర్వాత హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు. ఈ రేసు నుంచి తొలగించాలనుకుంటున్న కంటెస్టెంట్ల ఫోటోలను కాల్చాల్సి ఉంటుంది. విష్ణు ఫోటో కాల్చిన అవినాష్ముందుగా అవినాష్.. విష్ణుప్రియ ఉండకూడదనుకుంటున్నట్లు చెప్పాడు. గేమ్ అంటే టాస్కులు మాత్రమే కాదు పర్సనాలిటీ కూడా అని చెప్పావు. గేమ్స్ ఆడుతున్నాం.. కానీ అది ఎలా ఆడుతున్నామనది ముఖ్యం అని నొక్కి చెప్పాడు. తర్వాత నిఖిల్, గౌతమ్ మధ్య వార్ మొదలైంది. పృథ్వీ, నేను.. ఇలా ఎవరో ఒకరు అవతల వ్యక్తిని అగౌరవపరిస్తే తప్పు.. కానీ నువ్వు చేస్తే మాత్రం ఒప్పా? అని నిఖిల్ ప్రశ్నించాడు. ఒప్పని నేనెప్పుడు చెప్పానని నిలదీశాడు. నీ ప్రవర్తనతోనే తెలిసిపోతుందని నిఖిల్ కోపంతో ఊగిపోయాడు.కోపంతో ఊగిపోయిన నిఖిల్ఇన్ని రోజులు ఈ స్వరంతో ఎందుకు మాట్లాడలేదు? అని గౌతమ్ అడగ్గా.. ఎందుకంటే ఇదే చివరి ఛాన్స్.. నువ్వు చేసిందంతా బయటకు రావాలి కదా అని బదులిచ్చాడు. ఇలా మాటామాటా అనుకునే క్రమంలో గౌతమ్.. యష్మిని వాడుకుంది నువ్వు అని పెద్ద నింద వేశాడు. నువ్వు ఏదిపడితే అది అంటుంటే వినడానికి రాలేదు, ఇంకోసారి నోరుజారితే వేరేలా ఉంటుంది అని నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ ఎలిమినేట్.. నిజాయితీగా ఎలా ఉండాలో నేర్చుకోమన్న విష్ణు
ఈరోజు మొదటగా గౌతమ్‌ను సేవ్ చేశాడు నాగార్జున. తర్వాత ఓ ఫన్ గేమ్ కోసం హౌస్‌మేట్స్‌ను రెండు టీమ్స్‌గా విడగొట్టాడు. అవినాష్, రోహిణి, నబీల్, గౌతమ్ ఒక టీమ్ కాగా మిగతావారంతా విష్ణుప్రియ టీమ్‌గా విభజించాడు. హుక్ స్టెప్ వేస్తే ఆ సాంగ్ ఏంటో గెస్ చేయాలన్నదే గేమ్. ఇందులో విష్ణుప్రియ టీమ్ గెలిచింది. మరి తర్వాత ఏం జరిగిందో నేటి (డిసెంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..షాక్‌లో ప్రేరణఈ వారం ప్రేరణ సేవ్ అవుతుందని కలలో కూడా అనుకోలేదేమో! ఆమె సేవ్ అయినట్లు చెప్పగానే నమ్మలేనట్లు నోరెళ్లబెట్టింది. వెంటనే తేరుకుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ఆ వెంటనే నిఖిల్‌ను సైతం సేవ్ చేశాడు. తర్వాత కళ్లకు గంతలు కట్టి మ్యూజికల్ చెయిర్ గేమ్ ఆడించాడు. ఇందులో నిఖిల్, అవినాష్‌ను సంచాలకులుగా పెట్టారు. ఇందులో పృథ్వీ గెలిచాడు.టాప్ 8 కోసం స్పెషల్ పోస్టర్స్హౌస్లో ఉన్న ఎనిమిది కోసం బిగ్‌బాస్ స్పెషల్ పోస్టర్స్ క్రియేట్ చేశాడు. అలా నబీల్ కోసం డబుల్ ఇస్మార్ట్, విష్ణుప్రియ కోసం నిన్ను కోరి, పృథ్వీ కోసం యానిమల్, గౌతమ్ కోసం ఏక్ నిరంజన్, రోహిణి కోసం అరుంధతి, ప్రేరణకు అందాల రాక్షసి, నిఖిల్‌కు ద ఫ్యామిలీ స్టార్, అవినాష్ కోసం సుడిగాడు పోస్టర్స్ వేశాడు.ఎక్స్‌ట్రాలు చేయకుండా ఉండటం ఎలా?అనంతరం నబీల్ను సేవ్ చేసినట్లు ప్రకటించాడు. నెక్స్ట్ ఓ చిన్న టాస్క్ పెట్టాడు. కొన్ని టైటిల్స్ రాసున్న బుక్స్‌ను హౌస్‌మేట్స్‌కు అంకితమివ్వాలన్నాడు. ఎక్స్‌ట్రాలు చేయకుండా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని ప్రేరణ.. అవినాష్‌కు డెడికేట్ చేసింది. సరైన కారణాలు లేకుండా నామినేట్ చేయడం ఎలా? పుస్తకాన్ని గౌతమ్ నిఖిల్‌కు ఇచ్చాడు.బ్రెయిన్ వాడమన్న అవినాష్బ్రెయిన్ వాడి ఆడటం ఎలా? పుస్తకాన్ని అవినాష్.. విష్ణుప్రియకు ఇచ్చాడు. సపోర్ట్ కోరుకోకుండా ఉండటం నేర్చుకో అన్న పుస్తకాన్ని నబీల్.. రోహిణికి డెడికేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడకుండా ఉండటం ఎలా? అనేది అవినాష్‌కు ఇచ్చాడు పృథ్వీ. నిజాయితీగా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని విష్ణు.. అవినాష్‌కు ఇచ్చింది.పృథ్వీ ఎలిమినేట్ఒక్కరిని టార్గెట్ చేయకుండా ఉండటం ఎలా? అన్న బుక్‌ను నిఖిల్.. అవినాష్‌కు ఇచ్చాడు. తర్వాత నాగార్జున విష్ణును సేవ్ చేసి పృథ్వీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దాంతో విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు గొప్ప మనిషివి పృథ్వీ, ఐ మిస్ యూ అంటూ ఏడ్చేసింది.కన్నీళ్లు పెట్టుకున్న పృథ్వీఅటు స్టేజీపైకి వచ్చిన పృథ్వీ తన జర్నీ చూసుకుని ఎమోషనలయ్యాడు. కాసేపటికి తేరుకున్నాక హౌస్‌మేట్స్‌తో మాట్లాడాడు. నిఖిల్, నబీల్, విష్ణు సూపర్ హిట్ అని.. రోహిణి, అవినాష్ సూపర్ ఫ్లాప్ అని చెప్పాడు. నిఖిల్, నబీల్, విష్ణు, ప్రేరణకు తప్పకుండా ఓటేస్తానన్నాడు. చివర్లో నాగార్జున ఓ సర్ప్రైజ్ రివీల్ చేశాడు. ఈ సీజన్ విజేతకు ట్రోఫీ, ప్రైజ్‌మనీతో పాటు బ్రాండెడ్ కారు కూడా లభిస్తుందని చెప్పాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రేరణ.. టాప్ 2లో గౌతమ్ పక్కా!: తేజ
నాగార్జున వచ్చీరావడంతోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించాడు. అయితే టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకుని నేరుగా ఫైనల్‌కు వెళ్లిపోయాడని గుడ్‌న్యూస్ చెప్పాడు. అంతేకాదు ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ అతడికి ఓ ట్రోఫీ కూడా ఇచ్చారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నోరు తీపి చేసిన బిగ్బాస్ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్‌ను మనసులో కోరిక చెప్పమనగా.. మందు బాటిల్స్, స్వీట్స్ కావాలంటూ చిట్టా బయటపెట్టాడు. మందు కుదరదు కానీ స్వీట్స్‌తో సరిపెట్టుకోమంటూ బిగ్‌బాస్ గులాబ్‌జామూన్ పంపించి హౌస్మేట్స్ నోరు తీపి చేశాడు. అలాగే టికెట్ టు ఫినాలే టాస్క్‌లో అతడికి హౌస్మేట్స్ పెట్టిన బ్యాడ్జ్ ప్రకారం రూ.4 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. అలా ప్రైజ్‌మనీ రూ.54,30,000కి చేరింది.బ్లాక్ టికెట్.. గోల్డెన్ టికెట్తర్వాత నాగ్.. హౌస్‌లో కొందరికి బ్లాక్ టికెట్, మరికొందరికి గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. ఎవరికి బ్లాక్ టికెట్ ఇవ్వాలని నిఖిల్‌ను అడగ్గా తేజ పేరు చెప్పాడు. గౌతమ్ వంతు రాగా.. అతిథులు బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే వారితో సరిగా ప్రవర్తించలేదని ప్రేరణ పేరు సూచించాడు. దీంతో ఆమె ఫౌల్ గేమ్ ఆడిన వీడియో నాగ్ ప్లే చేశాడు. ఇలా ఆడితే బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వకపోతే ఏం చేస్తారన్నట్లు క్లాస్ పీకాడు. రోహిణి.. ఫౌల్ గేమ్ ఆడాడంటూ పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గేమ్స్ గెలిస్తే టైటిల్ రాదు!అవినాష్.. నబీల్‌కు, తేజ.. విష్ణుకు బ్లాక్ టికెట్ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఎవరు ఈ సీజన్ విన్నర్ అనుకుంటున్నావని విష్ణును అడగ్గా తనే గెలుస్తానంది. గెలవాలంటే ఈ ఆట సరిపోదుకదా అని నాగ్ అంటుంటే.. ఆటలన్నీ గెలిచినవారు టైటిల్ సాధించినట్లు బిగ్‌బాస్ చరిత్రలోనే చూడలేదని వేదాంతం చెప్పింది. అది తప్పని, జనాలు.. ఆట, మాట.. ఇలా ప్రతి ఒక్కటి చూస్తారని స్పష్టం చేశాడు.గౌతమ్‌కు గోల్డెన్ టికెట్ప్రేరణ.. గౌతమ్‌కు బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గౌతమ్ అందుకు అర్హుడంటూ నబీల్, విష్ణు, పృథ్వీ, నిఖిల్ కూడా చేయెత్తారు. అప్పటివరకు హౌస్మేట్స్ చెప్పిన అందరికీ బ్లాక్ టికెట్ ఇచ్చుకుంటూ పోయిన నాగార్జున.. గౌతమ్‌కు మాత్రం బ్లాక్ టికెట్ ఇవ్వనంటూ గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అలాగే రోహిణి, నిఖిల్, అవినాష్‌కు సైతం గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అనంతరం దమ్ము-దుమ్ము అని ఓ గేమ్ ఆడించాడు. ట్రోఫీని పైకి ఎత్తగల దమ్మున్న ప్లేయర్ ఎవరు? ఫినాలే వరకు రాకుండా దుమ్ముదుమ్మయిపోయే వ్యక్తి ఎవరు? అనేది చెప్పాలన్నాడు. నిఖిల్ దమ్మున్న ప్లేయర్నబీల్, పృథ్వీ, విష్ణుప్రియ.. నిఖిల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము అని తెలిపారు. రోహిణి.. గౌతమ్ దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ ఫినాలే వరకు రాకపోవచ్చంది. తేజ.. ఎంటర్టైనర్లు కూడా గెలవగలరని నిరూపిస్తారంటూ అవినాష్ దమ్మున్న ప్లేయర్ అన్నాడు. విష్ణు ఉట్టి దుమ్మున్న ప్లేయర్ అన్నాడు. గౌతమ్.. రోహిణి దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ దుమ్ము అని తెలిపాడు. అవినాష్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, ఫౌల్ గేమ్స్ ఆడతాడంటూ పృథ్వీని దుమ్ము కంటెస్టెంట్‌గా పేర్కొన్నాడు.గౌతమ్‌పై కోపాన్నంతా కక్కేసిన తేజతర్వాత తేజ.. గౌతమ్‌పై తన కోపాన్నంతా కక్కేశాడు. టికెట్ టు ఫినాలే ఆడే క్రమంలో ఓ గేమ్‌లో గౌతమ్ నా పేరు సెలక్ట్ చేయకపోవడంతో బాధేసిందని, అదే విషయం అతడిని నిలదీశానన్నాడు. నామినేషన్స్‌లో ప్రేరణతో అంత గొడవైనా కూడా ఆమెనే ఎందుకు సెలక్ట్ చేశాడు? అక్కడ నేను ఫ్రెండ్ కాబట్టి నన్ను సెలక్ట్ చేస్తే అతడికి సోలో బాయ్ అనే ట్యాగ్ పోతుందని వెనకడుగు వేశాడు. ప్రేరణను సెలక్ట్ చేస్తే తనకు మంచి పేరొస్తుందని లెక్కలు వేసుకున్నాడని తెలిపాడు.తేజ ఎలిమినేట్నా మనసుకు ఏదనిపిస్తే అది చేసుకుంటూ పోయా.. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా అది నీ ఇష్టం అని గౌతమ్ ఒక్కముక్కలో తేల్చేశాడు. ఇక ప్రేరణ, నిఖిల్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము కంటెస్టెంట్ అని అభిప్రాయపడ్డారు. తేజ ఆడలేకపోతున్నాడని పేర్కొన్నాడు. అనంతరం నాగార్జున తేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలన్న కల నెరవేర్చుకున్నాకే వెళ్లిపోతున్నానంటూ తేజ సంతోషపడితే అవినాష్ మాత్రం కంటనీరు పెట్టుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన తేజతో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. హౌస్‌మేట్స్‌ను కూరగాయలతో పోల్చాలన్నాడు. టాప్ 2లో గౌతమ్..అలా అవినాష్ ఉల్లిపాయ అని, ఈ సీజన్లో పెద్ద గెలుపు రోహిణిదేనంటూ బంగాళాదుంపతో పోల్చాడు. విష్ణుప్రియ కాకరకాయ అన్నాడు. ప్రేరణ.. మాట సరిగా లేకపోతే నెక్స్ట్ నువ్వే బయటకు వచ్చేస్తావని హెచ్చరిస్తూ బెండకాయ ఇచ్చాడు. పృథ్వీ.. విష్ణుప్రియను వదిలినట్లు కొన్ని గేమ్స్ కూడా వదిలేస్తున్నావంటూ పచ్చిమిర్చి ట్యాగ్ ఇచ్చాడు. గౌతమ్‌లో ఎన్ని పొరలుంటాయో వాడికే తెలీదంటూ క్యాబేజీతో పోల్చాడు. అతడు టాప్ 2లో పక్కాగా ఉంటాడనన్నాడు. నబీల్.. గేమ్‌లో కన్ఫ్యూజ్ అవుతున్నాడని, టాప్ 2లో ఉంటాడనుకుంటే ఇప్పుడు టాప్ 5కి వచ్చేశాడంటూ టమాటతో పోల్చాడు. నిఖిల్.. ఎమోషనల్‌గా వీక్ అంటూ అతడికి సోరకాయ ఇచ్చాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇన్నాళ్లకు విష్ణు కళ్లు తెరిపించిన శ్రీముఖి.. పృథ్వీతో కటీఫ్!
వైల్డ్కార్డ్స్కు టికెట్ టు ఫినాలే గెలిచే అర్హతే లేదన్నాడు పృథ్వీ.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అవినాష్ టికెట్ టు ఫినాలే ఎగరేసుకుపోయాడు. పృథ్వీ జపం చేస్తున్న విష్ణు కళ్లు తెరిపించింది శ్రీముఖి. మరి శ్రీముఖి ఏం చెప్పిందో నేటి (నవంబర్ 29) ఎపిసోడ్ హైలైట్స్ చూసేయండి..నాలుగో కంటెండర్‌గా తేజరోహిణి, అవినాష్, నిఖిల్ 'టికెట్ టు ఫినాలే' కంటెండర్లుగా నిలిచారు. వీరికి ఓ వ్యక్తిని కంటెండర్‌గా ఎన్నుకునే సూపర్ పవర్ ఇచ్చాడు. ముగ్గురూ కలిసి తేజ పేరు సూచించారు. ఇది పృథ్వీకి ఏమాత్రం నచ్చలేదు. తేజ, అవినాష్, రోహిణి.. ఈ ముగ్గురికీ టికెట్ టు ఫినాలే అందుకునే అర్హత లేదన్నాడు. మరోవైపు తేజ, గౌతమ్‌తో గొడవపడ్డాడు. నువ్వు సోలోగా ఆడుతున్నావని చెప్పడానికి నన్ను ఆటలో సైడ్ చేశావంటూ నిందలు వేశాడు. నా నిర్ణయం నా ఇష్టం.. దానికి నువ్వు గౌరవమివ్వకపోతే నేనేం చేయలేను అని గౌతమ్ హర్టయ్యాడు.కరెక్ట్ గెస్ చేస్తే రూ.5 లక్షలుఅనంతరం యాంకర్ శ్రీముఖి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే ఎవరు టికెట్ టు ఫినాలే కొడతారో గెస్ చేయమని హౌస్‌మేట్స్‌తో చిన్న గేమ్ ఆడించింది. కరెక్ట్‌గా గెస్ చేస్తే రూ.5 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ అవుతాయంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది పందెమనే అనుకోవచ్చు. దీంతో ఇంటిసభ్యులు చర్చించుకుని నిఖిల్‌కు రూ.5 లక్షల బ్యాడ్జ్, అవినాష్‌కు రూ.4 లక్షలు, రోహిణికి రూ.3 లక్షలు, తేజకు రూ.2 లక్షలు అని రాసి ఉన్న బ్యాడ్జ్ ఇచ్చారు.నాకోసం అతడిని వదిలెయ్శ్రీముఖి.. విష్ణుప్రియ కళ్లు తెరిపించే ప్రయత్నం చేసింది. మొదటి మూడు వారాలు నువ్వు గెలుస్తావేమో అనిపించింది. ఆటలో కనెక్షన్స్ ఏర్పడతాయి. ఒకర్ని ఇష్టపడటం తప్పు కాదు. కానీ ఈ రెండు వారాలు నాకోసం ఆ అబ్బాయి(పృథ్వీ)తో స్నేహం వదిలెయ్. అతడు నాకిష్టం లేదు, ఆసక్తి లేదు అని అన్నిసార్లు చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు దిగజారి అతడి వెనకపడుతున్నావ్? నువ్వు ఎంకరేజ్ చేయకపోతే అతడు ఆడడా? నీ ప్రేమకు విలువిచ్చి చెప్తున్నా.. ఒక్కరికే కాకుండా అందరినీ సపోర్ట్ చేయు అని మంచి మాటలు చెప్పింది. ఆశలు పెట్టుకోవద్దని చెప్పా: పృథ్వీఅటు పృథ్వీ దగ్గరకు వెళ్లి కూడా.. అందరూ మీ గురించి అడుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి కదా అని అడిగింది. అందుకతడు.. నీపై ఆశలు పెట్టుకోవచ్చా? అని విష్ణు అడిగినప్పుడు కూడా నాపై ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని స్పష్టంగా చెప్పానన్నాడు. ఏదైనా ఉంటే షో అయిపోయాక చూసుకుందామని మీ ఇద్దరూ మాట్లాడుకోండని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో విష్ణు.. పృథ్వీతో తన స్నేహాన్ని పక్కనపెట్టి గేమ్‌పై ఫోకస్ చేస్తానని చెప్పింది.టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్అనంతరం గుర్తుపట్టు, గంట కొట్టు అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో తేజకు 1, రోహిణికి 2, అవినాష్‌కు 3, నిఖిల్‌కు 4 పాయింట్లు వచ్చాయి. తక్కువ పాయింట్లు వచ్చిన తేజ గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత శ్రీముఖి అందరికోసం వంట చేయడం విశేషం. అనంతరం రోహిణి, అవినాష్, నిఖిల్‌కు.. కేవలం ఒక్క అడుగుదూరం అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో అవినాష్ విజయం సాధించి టికెట్ టు ఫినాలే గెలిచాడు. తన కల నెరవేరడంతో అవినాష్ సంతోషంలో మునిగి తేలాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8: ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ముగింపుకు వచ్చేసింది. డైరెక్ట్‌గా ఫినాలేలో అడుగుపెట్టేందుకు ఎప్పటిలాగే బిగ్‌బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇప్పటికే ఈ టాస్క్‌లో అవినాష్, రోహిణి, నిఖిల్ కంటెండర్లుగా నిలిచారు. నేడు హౌస్‌లోకి వచ్చిన యాంకర్ శ్రీముఖి వారిలో ఒకర్ని ఫైనలిస్టుగా ప్రకటించనుంది.కిచెన్‌లో మళ్లీ కయ్యంఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజైంది. అయితే ఎప్పటిలాగే మరోసారి కిచెన్‌లో కయ్యం మొదలైంది. ఒక్కొక్కరికి రెండు దోశలు వేస్తోంది ప్రేరణ. తనకు ఒక చీజ్ దోశ కావాలని రోహిణి అడిగితే అందుకు ప్రేరణ ఒప్పుకోలేదు. చీజ్ దోశ తిన్నవాళ్లు ప్లేన్ దోశ తినలేరంటూ అడ్డు చెప్పింది. దానికి తేజ అభ్యంతరం చెప్పాడు. ఇలా మధ్యలో దూరడం తప్పని ప్రేరణ అనగా.. అందరికీ సమానంగా పెట్టమని చెప్పానంతేనని తేజ బదులిచ్చాడు.టికెట్ టు ఫినాలే ఎవరి సొంతం?తర్వాత శ్రీముఖి హౌస్‌లో అడుగుపెట్టింది. ఇకపోతే అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచినట్లు ఓ వార్త వైరలవుతోంది. అదే నిజమైతే ఈ సీజన్లో ఫినాలేలో అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ అవినాష్ అవుతాడు. అయితే ఈ వారం గండం గట్టెక్కితేనే అది సాధ్యమవుతుంది. అసలే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. పైగా అవినాష్ నామినేషన్స్‌లో ఉన్నాడు. ఈ ఒక్కవారం సేవ్ అయ్యాడంటే టాప్ 5లో బెర్త్ కన్ఫామ్ అయినట్లే! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అమ్మలా ప్రేమను పంచాడు, నెత్తిన పెట్టుకున్నాడు: విష్ణుప్రియ లవ్‌స్టోరీ
అవినాష్‌ను తక్కువ అంచనా వేసిన నబీల్, ప్రేరణకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. ఇచ్చిన రెండు గేమ్స్‌లోనూ అతడే గెలిచి విన్నరయ్యాడు. కంటెండరవ్వాలనుకున్న నబీల్ రేసులోనే లేకుండా పోయాడు. అటు విష్ణుప్రియ... తన మాజీ ప్రియుడిని గుర్తు చేసుకుంది. తన ప్రేమ కహానీని పృథ్వీతో పంచుకుంది. అదేంటో నేటి (నవంబర్ 27) ఎపిసోడ హైలైట్స్‌లో చదివేయండి..తక్కువ అంచనా వేశారుటికెట్ టు ఫినాలే కోసం హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడించేందుకు మానస్, ప్రియాంక జైన్ బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చారు. వీళ్లు ప్రేరణ, నబీల్ను గేమ్ ఆడేందుకు సెలక్ట్ చేశారు. అయితే ఈ రోజు బ్రెయిన్ గేమ్‌లో నలుగురు ఆడే ఛాన్స్ ఉందంటూ మరో ఇద్దర్ని ఎంపిక చేయమన్నాడు బిగ్‌బాస్. దీంతో ప్రేరణ, నబీల్.. ఐక్యూ అంతగా లేదు, బ్రెయిన్ గేమ్ ఆడలేరంటూ అవినాష్, పృథ్వీని సెలక్ట్ చేశారు.సుడోకు గేమ్అలా ఈ నలుగురికి సుడోకు గేమ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ముందుగా నబీల్ గంట కొట్టి గెలిచేసినంత బిల్డప్ ఇచ్చాడు. తీరా చూస్తే అన్నీ తప్పులతడకగానే ఉంది. ఏ ఒక్కరూ సుడోకు పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్ క్లూ ఇచ్చాడు. ఆ క్లూ అందుకుని అవినాష్ చకచకా సుడోకు పూర్తి చేసి గంట కొట్టాడు. తర్వాత ప్రేరణ, పృథ్వీ, నబీల్ గేమ్ కంప్లీట్ చేశారు. వీళ్లందరికీ బిగ్‌బాస్ కొన్ని మూటలు ఇచ్చాడు. అందులో అవినాష్‌కు 8 బాల్స్, ప్రేరణకు 6, పృథ్వీకి 5, నబీల్‌కు 4 బంతులు ఉన్నాయి.అవినాష్ గెలుపుపై నబీల్ డౌట్అవినాష్ గెలుపుపై నబీల్ అనుమానపడ్డాడు. తేజ, నువ్వేమైనా సాయం చేశావా? అని అడిగాడు. ఎవరూ సాయం చేయలేదని హౌస్మేట్స్ అందరూ క్లారిటీ ఇచ్చారు. అంతా అయిపోయాక నబీల్.. నువ్వు ఆడలేవని అనలేదు, ఎవరైనా సాయం చేశారనిపించి అడిగానంతే.. నీకు కోపం వస్తే అప్పుడే తిట్టాల్సిందంటూ అవినాష్‌కు సారీ చెప్పాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ కలిసి కామెడీ స్కిట్‌తో కడుపుబ్బా నవ్వించారు.మళ్లీ గెలిచేసిన అవినాష్అనంతరం పృథ్వీ, ప్రేరణ, అవినాష్, నబీల్.. వారు పొందిన బంతులతో నేర్పుగా సాగు- స్కోర్ పొందు అని మరో గేమ్ ఆడారు. ఈ టాస్క్‌లో అవినాష్ అందరికంటే ఎక్కువగా 43 పరుగులు చేసి గెలిచాడు. పృథ్వీ, ప్రేరణ.. 30 పరుగులు చేయగా, నబీల్ 24 పరుగులు చేశాడు. చివర్లో రెండు బంతుల్ని ఎవరికైనా ఇవ్వొచ్చు అని మానస్, ప్రియాంకకు బిగ్‌బాస్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ వాళ్లు అందుకు అంగీకరించలేదు.విష్ణుప్రియ బ్రేకప్ స్టోరీరెండు టాస్కులు గెలిచిన అవినాష్‌కు కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చారు. నబీల్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టు ఫినాలే రేసులో నుంచి తొలగించారు. చివర్లో విష్ణు, మానస్ కలిసి జరీజరీ పంచె కట్టి.. పాటకు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. మాజీ బాయ్‌ఫ్రెండ్ గుర్తురావడంతో అర్ధరాత్రి పృథ్వీపక్కన చేరి ముచ్చట్లు పెట్టింది విష్ణు. కలలో తనకు మాజీ బాయ్‌ఫ్రెండ్ వచ్చాడంది. బ్రేకప్ నువ్వు చెప్పావా? అని పృథ్వీ అడగ్గా.. అవును, నేనే బ్రేకప్ చెప్పానంది. తల్లి స్థానమిచ్చా..తెలీకుండా రెండు తప్పులు చేశాడు. నా మంచి కోసమే చేశాడు. నాకు తెలిస్తే భరించలేనని చెప్పలేదు. తీరా తెలిశాక నేను నిజంగా భరించలేకపోయాను. నాకోసమే కొన్ని పనులు చేసినా అవి నాకస్సలు నచ్చలేదు. అవి నా ముఖంపై చెప్పేంత ధైర్యం లేని వ్యక్తితో ఉండకూడదనుకున్నాను, బ్రేకప్ చెప్పాను. కానీ అతడికి నా తల్లి స్థానమిచ్చాను.నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడుకాబట్టి తనను చూడకుండా ఉండలేకపోతున్నాను. అతడు నా బలం. తనను హత్తుకుంటే మా అమ్మను హత్తుకున్నట్లే ఉంటుంది. నన్ను నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నాడు. అమ్మలాగా స్వచ్ఛంగా ప్రేమించాడు అంటూ అతడి జ్ఞాపకాలను పృథ్వీతో పంచుకుంది. అయితే అతడెవరనేది మాత్రం బయటపెట్టలేదు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బొక్కబోర్లా పడ్డ నబీల్.. తన సత్తా చూపించిన అవినాష్
టికెట్ టు ఫినాలే కోసం మాజీ కంటెస్టెంట్లు హౌస్‌లోకి వస్తున్నారు. ఇప్పటికే అఖిల్, హారిక వచ్చి గేమ్స్ ఆడించగా అందులో కమెడియన్ రోహిణి గెలిచి ఫస్ట్ కంటెండర్‌గా నిలిచింది. తాజాగా హౌస్‌లో మానస్, ప్రియాంక జైన్ అడుగుపెట్టారు. వీళ్లు పృథ్వీ, నబీల్, ప్రేరణ, అవినాష్‌తో సుడోకు గేమ్ ఆడించారు. నబీల్ అత్యుత్సాహంఇందులో నబీల్ తాను అందరికంటే ముందు విజయవంతంగా పూర్తి చేసేశాననుకుని సంతోషంతో గెంతులేశాడు. తీరా మానస్ వెళ్లి చూస్తే అక్కడ అన్నీ తప్పులే ఉన్నాయి. ఏ ఒక్కరూ ఈ గేమ్ పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్ చిన్న క్లూ వదిలాడు. ఆ క్లూ సాయంతో అవినాష్ అందరికంటే ముందు సుడోకు పూర్తి చేశాడు. అతడి విజయాన్ని జీర్ణించుకోలేకపోయిన నబీల్.. అవినాష్‌కు ఏమైనా సాయం చేశావా? అంటూ తేజను ప్రశ్నించాడు. కంటెండర్‌గా మరో కమెడియన్అది విని అవినాష్ షాకవగా.. ఏమో, అక్కడ జనాలు దగ్గరున్నారని అడిగానంటూ తన కుళ్లు, అనుమానాన్ని బయటపెట్టాడు. మొత్తానికి కమెడియన్ అవినాష్ తనకు ఇచ్చిన టాస్కులు గెలిచి కంటెండర్‌గా నిలిచాడు. ఎంటర్టైనర్లకు టాస్కులు ఆడి గెలిచే సత్తా కూడా ఉందని రోహిణి, అవినాష్ నిరూపించారు. ఇకపోతే ఈరోజు నబీల్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి అతడిని రేసులో నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓపక్క తిట్టుకుంటూ మరోపక్క బుగ్గ గిల్లుతూ నామినేషన్స్
నామినేషన్స్‌లో ఫైర్ చూపించాలని నబీల్ బాగా తాపత్రయపడ్డాడు. నాగార్జున మాటలతో గౌతమ్ డిస్టర్బ్ అయ్యాడో, ఏమోకానీ ఓపక్క కోప్పడుతూనే మరోపక్క బాధపడుతున్నట్లు కనిపించింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఫైర్ లేదుబిగ్బాస్ హౌస్‌లో పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైనలిస్టుగా చూడకూడదనుకుంటున్న ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు బిగ్‌బాస్. మొదటగా నబీల్.. నామినేషన్స్‌లో తప్ప గేమ్‌లో ఫైర్ లేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. నబీల్‌తో పెట్టుకుంటే బొరాన్ ఉంటదంటూ దమ్కీ ఇచ్చాడు.ఆ ఫోకస్ గేమ్‌పై చూపించునీ గేమ్ కనిపించడం లేదు, నీకు సీరియస్‌నెస్ లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఒక మనిషిపై పెట్టిన ఫోకస్ గేమ్‌పై పెడ్తే గెలుస్తావని సలహా ఇచ్చాడు. కానీ ఈ సలహాలు పట్టించుకునే పరిస్థితిలో విష్ణు లేదు. పృథ్వీ వంతురాగా.. అమ్మాయిలు గొడవపడ్తున్నప్పుడు మెగా చీఫ్‌గా నువ్వు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించలేదంటూ అవినాష్‌ను నామినేట్ చేశాడు.తొడగొట్టిన అవినాష్ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ చేయట్లేదు, ఆడియన్స్ నిన్ను నామినేషన్స్‌లోకి వచ్చినవారమే ఎలిమినేట్ చేశారు, కానీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ చేశాడని ఎగతాళి చేశాడు. దీంతో అవినాష్.. నేను వచ్చిన ఏడువారాల్లో రెండుసార్లు మెగా చీఫ్ అయ్యానంటూ తొడగొట్టి చెప్పాడు. తర్వాత పృథ్వీ.. కెమెరాలతో మాట్లాడటం, ఏం పీకుతావనడం నచ్చలేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. ఇక్కడ వీళ్లిద్దరూ బుగ్గలు గిల్లుకోవడం గమనార్హం.విష్ణు ఎవర్ని నామినేట్ చేసిందంటే?ప్రేరణ.. గెలవాలన్న స్పిరిట్ నీలో లేదంటూ విష్ణుప్రియను, నువ్వు గెలవకూడదంటూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ప్రేరణ, గౌతమ్ చాలాసేపు గొడవపడ్డారు. తేజ.. నీ గేమ్ నచ్చలేదంటూ విష్ణును, ఎదుటివారిని రెచ్చగొడుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. తేజను, ప్రేరణను నామినేట్ చేసింది.మాట తప్పావ్: గౌతమ్గౌతమ్.. ఫిజికల్ అవకూడదని చెప్పిన నువ్వే చాలా గేమ్స్‌లో ఫిజికల్ అయ్యావని నిఖిల్‌ను నామినేట్ చేశాడు. పృథ్వీ ఎందరినో అవమానించాడు, అలాంటప్పుడు అతడినెందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించాడు. వీళ్లిద్దరూ గొడవపడుతుంటే మరోసారి పృథ్వీ మధ్యలో దూరడంతో ఇది చిలికిచిలికి గాలివానలా మారింది.నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణతర్వాత ప్రేరణను నామినేట్ చేశాడు. నువ్వు కావాలని ట్రిగ్గర్ చేస్తావని ఆమె అనడంతో.. నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణ.. నేను ట్రిగ్గర్ చేయలేదు, ఏదో సరదాగా చేశానంటూ గౌతమ్ ఫ్రస్టేట్ అయ్యాడు. అవినాష్ వంతు రాగా.. మూటల టాస్క్‌లో ఫౌల్ గేమ్ ఆడావు, ఎదుటివారికి గౌరవమర్యాదలు ఇవ్వడం లేదంటూ పృథ్వీని, కసిగా ఆడట్లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.మెగా చీఫ్ తప్ప అందరూ నామినేషన్లోనిఖిల్ వంతు రాగా గౌతమ్, ప్రేరణను నామినేట్ చేశాడు. చివరగా మెగా చీఫ్ రోహిణి.. నేను పక్కవాళ్లను తొక్కుకుంటూ వెళ్తానని చెప్పడం నచ్చలేదని విష్ణును నామినేట్ చేసింది. గేమ్‌లో నిన్నెవరైనా సైడ్ చేస్తుంటే భరించలేవు, అలాగే నన్ను వీక్ అన్నావంటూ నబీల్ను నామినేట్ చేసింది. అలా ఈ వారం విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ నలుగురు ఫ్రెండ్స్.. గౌతమ్ శత్రువన్న యష్మి.. అతడిపైనే బిగ్‌బాంబ్
ఒకరి గురించి ఒకరు రాసిన కంప్లైంట్లు చదవడంతోనే సగం ఎపిసోడ్ అయిపోయింది. యష్మి వెళ్లిపోతూ.. ఎవరేమనుకున్నా నిఖిల్ తన ఫ్రెండ్ అని బల్లగుద్ది చెప్పింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నేను చెప్పేదే నిజంనాగార్జున.. ప్రేరణను సేవ్ అయినట్లు ప్రకటించడంతో ఆమె ఎమోషనల్ అయింది. తర్వాత హౌస్మేట్స్ అందరూ తమపై వచ్చిన ఫిర్యాదుల చిట్టా చదివి వినిపించారు. తేజ.. తను మాట్లాడాలనుకుంది మాట్లాడి వెళ్లిపోతాడు, నేను చెప్పేదే నిజం అన్న మైండ్‌సెట్ నుంచి బయటకు రావాలని నబీల్, నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడటం చాలాసార్లు చూశా.. అని పృథ్వీ కంప్లైంట్స్ చేశారు. గౌతమ్‌పై వచ్చిన కంప్లైంట్స్..అన్‌ప్రిడక్టబుల్‌గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను, త్వరగా ట్రిగ్గర్ అవడం నాకు నచ్చదు అని యష్మి గురించి ప్రేరణ ఫిర్యాదు చేసింది. నీ ఇండివిడ్యువాలిటీ కనిపించడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు. అసలైన నువ్వు ఎవరనేది అర్థం కావట్లేదు.. అని రోహిణి పేర్కొంది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు, ఫుడ్ అందరితో షేర్ చేసుకో అని పృథ్వీ.. కొన్నిసార్లు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడేమో అనిపిస్తుందని అవినాష్ .. గౌతమ్ గురించి అభిప్రాయపడ్డారు. ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలీదునీకు అవినాష్ రక్షణ కవచంలా అనిపిస్తోంది.. అవినాష్, తేజతోనే ఎక్కువగా ఉంటున్నావ్ అని పృథ్వీ. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తోందని తేజ రోహిణి గురించి రాసుకొచ్చారు. తను ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలియదు, నామినేషన్స్‌లో క్లారిటీ లేదు, ఆట పట్ల ఆసక్తి అంతకన్నా లేదు అని అవినాష్, మేమందరం కష్టపడి తనను మెగా చీఫ్ చేశాం. తనను గెలిపించినవారికంటే యూనివర్స్కే ఎక్కువ కృతజ్ఞత చూపిస్తుంది అని నబీల్.. విష్ణు గురించి కంప్లైంట్ చేశారు.ఎక్కువ విని తక్కువ మాట్లాడాలినువ్వొక్కడివే బలవంతుడివని ఆలోచించడం మానేయ్.. ప్రతి ఒక్కరికీ టాలెంట్ ఉంది. కాబట్టి ఎవర్నీ తక్కువ అంచనా వేయకు అని రోహిణి.. గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే గొడవ సృష్టిస్తున్నావ్.. అభ్యంతరకర పదాలతో అటాక్ చేస్తావ్.. అని గౌతమ్.. పృథ్వీ గురించి ఫిర్యాదు చేశారు. ఆటలో అయినా, చర్చలో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని నబీల్, మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు తన డిక్టేటర్ ప్రవర్తన నచ్చలేదని అవినాష్.. ప్రేరణకు చెప్పారు.నబీల్‌పై ఫిర్యాదులుకామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం చూపించాలని ప్రేరణ, నీ అరుపు ఎక్కువైందని యష్మి.. అవినాష్‌పై ఫిర్యాదు చేశారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక నువ్వు మారిపోయి అందరితో బాగుండాలని ప్రయత్నిస్తున్నావని పృథ్వీ, ఒక్కోవారం ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు, పెద్ద విషయాల్ని వదిలేసి నిన్ను ప్రశ్నించినవారిని మాత్రం టార్గెట్ చేస్తున్నావని గౌతమ్.. నబీల్ గురించి తెలిపారు.యష్మి ఎలిమినేట్మనసులో మాట డైరెక్ట్‌గా చెప్పుంటే నా గేమ్ ఎఫెక్టయ్యేదే కాదు. ఈ జర్నీలో నువ్వు ఫైటర్ కన్నా సేఫ్ గేమర్గానే ఎక్కువ కనిపించావని యష్మి, అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావ్.. అతడి గేమ్ ప్లానేంటో తెలియదు, అందుకే తనను నమ్మలేనని ప్రేరణ.. నిఖిల్ గురించి రాసుకొచ్చారు. అనంతరం నాగార్జున.. నబీల్, పృథ్వీని సేవ్ చేసి యష్మి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నా మాటల వల్ల, ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడుంటే సారీ అంటూ యష్మి కన్నీటితో వీడ్కోలు తీసుకుంది. నిఖిల్ నా ఫేవరెట్ ఫ్రెండ్స్టేజీపైకి వచ్చాక ఆమెతో ఫ్రెండ్స్ ఎవరు? శత్రువులు ఎవరు? అన్న గేమ్ ఆడించాడు నాగ్. ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ తన ఫ్రెండ్స్ అంది. నిఖిల్ తన ఫేవరెట్ ఫ్రెండ్ అని, ఎవరేమన్నా తమ స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. శత్రువుల లిస్ట్‌లో గౌతమ్, అవినాష్, రోహిణిని చేర్చింది. స్నేక్ అండ్ లాడర్ గేమ్‌లో గౌతమ్, నిఖిల్ పాములని మెజారిటీ హౌస్మేట్స్ అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకర్ని నామినేట్ చేయాలని యష్మిపై భారం వేశాడు నాగ్. దీంతో ఆమె గౌతమ్‌పై బిగ్‌బాంబ్ వేసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అతడి నిజస్వరూపం బయటపడాలన్న యష్మి
ఒకరి పొరపాట్లను మరొకరు పేపర్‌పై రాయాలన్నాడు బిగ్‌బాస్. తన మీద వచ్చిన ఫిర్యాదు చదివిన కంటెస్టెంట్.. అది ఎవరు రాయాలో గెస్ చేయాల్సి ఉంటుంది. అలా తేజ. తనపై వచ్చిన కంప్లైంట్ చదివాడు. తను మాట్లాడదల్చుకుంది మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తను చెప్పేది మాత్రమే నిజమని భావిస్తాడు అని రాసుంది. ఇది కచ్చితంగా విష్ణుప్రియ, యష్మి రాసుంటారని తేజ అభిప్రాయపడ్డాడు.ఫిర్యాదుల గోలఅన్ప్రిడక్టబుల్గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను. చాలా త్వరగా ట్రిగ్గర్ అవుతుంది. అది నాకు నచ్చదు.. ఈ ఫిర్యాదు తనపై గౌతమ్ చేసి ఉంటాడని యష్మి గెస్ చేసింది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు.. ఫుడ్ విషయంలో అందరికోసం ఆలోచించు అని గౌతమ్‌కు ఫిర్యాదు వచ్చింది. ఇది విష్ణు, అవినాష్ కంప్లైంట్ చేసుంటారన్నాడు.నిజస్వరూపం చూపించాలిఆటపట్ల ఆసక్తి ఉన్నట్లు అనిపించలేదు, అందర్నీ నిరుత్సాహపరుస్తుంది అని అవినాష్.. విష్ణుప్రియపై కంప్లైంట్ చేశాడు. కామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం అందరికీ చూపించాలి అని యష్మి.. అవినాష్ గురించి రాసింది. ప్రోమోలో చివర్లో పృథ్వీ, యష్మి డేంజర్ జోన్లో ఉన్నట్లు చూపించారు. అయితే యష్మి ఎలిమినేట్ అన్న విషయం ఇదివరకే తెలిసిందే! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్సేన్ దగ్గర అవినాష్ కక్కుర్తి!
ఈసారి మెగా చీఫ్ పోస్టు అందుకోవడం అంత ఈజీ పనిలా లేదు. బిగ్‌బాస్ పెట్టిన పలు టాస్కులు ఆడి గెలిస్తేనే హౌస్‌లో చివరిసారి చీఫ్ అవుతారు. ఇకపోతే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హౌస్‌లో అడుగుపెట్టి అందరితో ఇట్టే కలిసిపోయాడు. మరి షోలో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..చివరి కంటెండర్పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, తేజ మెగా చీఫ్ కంటెండర్లవగా చివరగా నిఖిల్, రోహిణి మాత్రమే మిగిలారు. వీరిలో ఎవర్ని కంటెండర్ చేస్తారో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఈ క్రమంలో గౌతమ్.. చాలామంది వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేద్దామని ప్లాన్ చేశారు. అవన్నీ తట్టుకుని రోహిణి ఇక్కడిదాకా వచ్చిందంటూ ఆమెకు సపోర్ట్ చేశాడు. యష్మి, ప్రేరణ, తేజ కూడా రోహిణికే సపోర్ట్ ఇచ్చారు.గ్రూప్ గేమ్‌ను ప్రశ్నించిన గౌతమ్విష్ణుప్రియ నిఖిల్‌కు మద్దతిచ్చింది. ఇక పృథ్వీ.. వైల్డ్ కార్డ్స్‌ను పంపించేయాలని ప్లాన్ చేశామన్నారు. ఓజీ, రాయల్ టీమ్స్‌గా ఉన్నప్పుడు అది జరిగింది. కానీ ఇప్పుడు క్లాన్స్ లేవు కాబట్టి అలాంటి ప్లానింగ్స్ ఏవీ చేయడం లేదని క్లారిటీ ఇస్తూనే నిఖిల్‌కు సపోర్ట్ ఇచ్చాడు. ఇక గ్రూపిజం ఉందని గౌతమ్.. పృథ్వీతో గొడవపడుతుంటే యష్మి, విష్ణుప్రియ, నిఖిల్ వెంటనే దూసుకువచ్చి ఆ మాట నిజమేనని నిరూపించారు. నా వెంట్రుక కూడా పీకలేవుపృథ్వీ.. గౌతమ్ పైపైకి వెళ్తూ వాడు, వీడు అని మాట్లాడాడు. వాడు అని పిలవొద్దని చెప్తున్నా పృథ్వీ వెనక్కు తగ్గలేదు. దీంతో గౌతమ్ నువ్వు నన్నేం పీకలేవన్నాడు. దానికి పృథ్వీ.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు అని మరింత రెచ్చిపోయాడు. ఇలా వీరిద్దరూ చాలాసేపు గొడవపడ్డారు. మెజారిటీ ఓట్లు రోహిణికి రావడంతో ఆమె కంటెండర్ అయింది. విశ్వక్సేన్ ఎంట్రీమెగా చీఫ్ అవడానికి ఒకటి కంటే ఎక్కువ టాస్కులుంటాయన్నాడు బిగ్‌బాస్. అలా మొదటగా పట్టువదలని విక్రమార్కుడు టాస్క్ ఇచ్చాడు. ఇందులో విష్ణుప్రియ 10, యష్మి 20, పృథ్వీ 30, రోహిణి 40, తేజ 50 పాయింట్లు సాధించారు. అనంతరం విశ్వక్సేన్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ కక్కుర్తివస్తూనే రుచికరమైన ఇంటి భోజనం తీసుకువచ్చి అందరితో కలిసి తిన్నాడు. విశ్వక్ కోరిక మేరకు తేజ, అవినాష్ పోల్ డ్యాన్స్ చేశారు. అనంతరం రోహిణి, అవినాష్‌తో కలిసి విశ్వక్ స్కిట్ కూడా చేశాడు. తర్వాత అవినాష్.. విశ్వక్ దగ్గర టీషర్ట్ దోచేశాడు. చివరగా అందరితో కలిసి స్టెప్పులేసి వీడ్కోలు తీసుకున్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్ గొప్పతనాన్ని చెప్పిన అమర్, బిగ్‌బాస్ మాస్టర్ ప్లాన్
కొందరి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ శనివారం ఎపిసోడ్లో స్టేజీపైకి వచ్చేసి మాట్లాడారు. మిగిలినవారి ఫ్యామిలీస్ నేడు స్టేజీపై సందడి చేశారు. మరి ఎవరెవరు వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారు? అనేది నేటి (నవంబర్ 17) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..మందు తాగుతానన్న యష్మియష్మి కోసం ఆమె ఫ్రెండ్స్ శ్రీసత్య, సంయుక్త స్టేజీపైకి వచ్చారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత యష్మిని మీరు చూడలేరని నాగార్జునతో అన్నారు. అందుకు కారణమేంటో ఎలాగైనా తెలుసుకోవాలనుకున్న నాగ్.. ఆ సీక్రెట్ చెప్తే ప్రైజ్‌మనీకి రూ.3 లక్షలు యాడ్ అవుతాయన్నారు. ఈ బంపరాఫర్‌కు టెంప్ట్ అయిపోయిన యష్మి.. తాను మందు తాగుతానని ఒప్పేసుకుంది. నిన్నటిలాగే వీరితోనూ టాప్ 5 ఎవరనేది గేమ్ ఆడించాడు. టాప్ 5లో ఎవరంటే?తమ కంటెస్టెంట్‌ను పక్కనపెట్టి మిగతావారిలో ఐదుగురిని ఫైనలిస్టులుగా సెలక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా గౌతమ్ 1, నిఖిల్ 2, నబీల్, అవినాష్, ప్రేరణ మిగతా మూడు స్థానాల్లో ఉన్నారు. తర్వాత యష్మిని సేవ్ చేశారు. తేజ తండ్రి శ్రీనివాసరెడ్డి, ఫ్రెండ్ వీజే సన్నీ వచ్చారు. తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలన్న కలను నెరవేర్చుకున్నావు.. నిన్ను ఫినాలేలో చూడాలనుకున్న అమ్మ కలను కూడా నెరవేర్చు అని తేజపై భారం వేశాడు అతడి తండ్రి.అవినాష్‌తో సినిమాసన్నీ.. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్‌ను వరుసగా టాప్ 5లో పెట్టాడు. అందరి అంచనాలను మనం అందుకోలేము.. నువ్వు నీలా ఉండు అంటూ నిఖిల్‌కు గోల్డెన్ సలహా ఇచ్చాడు. అనంతరం ముక్కు అవినాష్ కోసం అతడి తమ్ముడు అశోక్‌తో పాటు దర్శకుడు కోన వెంకట్ వచ్చారు. బిగ్‌బాస్ నుంచే చాలామంది నటుల్ని తీసుకుంటున్నాను.. అవినాష్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు కోన వెంకట్. కంటెస్టెంట్లందరికీ తన సినిమా టైటిల్స్‌ను డెడికేట్ చేశాడు. అవినాష్ అదుర్స్, నబీల్ దూకుడుఅలా నిఖిల్‌కు బాద్షా, పృథ్వీకి బలుపు, విష్ణుప్రియకు నిన్ను కోరి, యష్మికి దేనికైనా రెడీ, ప్రేరణకు గీతాంజలి, రోహిణికి హ్యాపీ, గౌతమ్‌కు శివమణి, అవినాష్‌కు అదుర్స్, తేజకు ఢీ, నబీల్‌కు దూకుడు సినిమా టైటిల్స్ అంకితమిచ్చాడు. వీరు.. నబీల్ను 1, నిఖిల్‌ను 2, రోహిణిని 3, విష్ణుప్రియను 4, గౌతమ్‌ను 5వ ర్యాంకులో ఉంచారు. తర్వాత నిఖిల్ కోసం అతడి తండ్రి శశికుమార్, నటుడు అమర్దీప్ వచ్చేశారు. రెండు రోజులు నాతోనేఅమర్దీప్ మాట్లాడుతూ.. ఓ షో తర్వాత నా రెండు కాళ్లు నొప్పితో కదల్లేని స్థితికి వచ్చేశాయి. పూర్తిగా బిగుసుకుపోయాయి. షో నుంచి ఇంటికి వెళ్లకుండా సరాసరి నాతో పాటే నా రూమ్‌కు వచ్చాడు. రెండు రోజులు నాతోనే ఉన్నాడు. నన్ను వాష్‌రూమ్‌కు కూడా ఎత్తుకుని తీసుకుపోయాడు అంటూ నిఖిల్ స్నేహానికిచ్చే విలువను చాటిచెప్పాడు. అలాగే విష్ణుప్రియ, నబీల్, రోహిణి, గౌతమ్, తేజకు వరుస ఐదు ర్యాంకులిచ్చాడు.మగాళ్లపై ఆడాళ్ల విజయంర్యాంకుల గోల అయిపోవడంతో నాగ్.. హౌస్‌మేట్స్‌తో చిన్న గేమ్ ఆడించాడు. అమ్మాయిలను, అబ్బాయిలను రెండు టీములుగా విడగొట్టాడు. సినిమా పేరు చెప్పగానే హీరో, దర్శకుడు, హీరోయిన్ ఫోటోలను బోర్డుపై పెట్టాలన్నాడు. అలా ఈ ఆటలో మహిళల టీమ్ గెలిచింది. తర్వాత విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించాడు.అవినాష్‌ను సేవ్ చేసిన నబీల్చివరగా అవినాష్, తేజ నామినేషన్లో మిగిలారు. ఈ క్రమంలో నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడిగాడు. నాకు షీల్డ్ రావడానికి అవినాష్ కూడా ఓ కారణమే.. అందుకే అతడి కోసం వాడాలనుకుంటున్నాను. నేను గేమ్ ద్వారా మాత్రమే ముందుకు వెళ్తాను అని నబీల్ తన నిర్ణయం చెప్పాడు. దీంతో అవినాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగ్.. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడటం వల్ల అతడు సేవ్ అయినట్లు తెలిపాడు. టెన్షన్‌తో చచ్చిపోయిన తేజబిగ్బాస్ నాలుగో సీజన్లో ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ అయ్యానని.. ఇప్పుడు మరోసారి అదే షీల్డ్ తనను కాపాడిందన్నాడు అవినాష్ మరి నా పరిస్థితి ఏంటని తేజ అయోమయానికి లోనయ్యాడు. అతడిని కాసేపు టెన్షన్ పెట్టిన నాగ్.. చివరకు సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఈ వారం ఎలిమినేషనే లేదని తెలిపాడు. అయితే రేపు మాత్రం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్స్ చేయించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో సోనియా.. నిఖిల్‌ను నామినేట్ చేయడం గమనార్హం. ఆ తతంగమంతా రేపు చూసేయండిమరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ సేఫ్.. ఎంటర్టైనర్ అవుట్? అంతలోనే ట్విస్ట్
బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్ సంపూర్ణమైందన్నాడు కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది. హౌస్‌లో వచ్చేవాళ్లు అయిపోయారు కానీ స్టేజీపైకి వచ్చి మాట్లాడేవాళ్లు ఇంకా మిగిలే ఉన్నారు. ఈ రోజు కంటెస్టెంట్ల ఇంటిసభ్యులతో పాటు స్నేహితులు కూడా వచ్చి విజయం నీదేనంటూ ధైర్యం చెప్పనున్నారు.పృథ్వీ సేఫ్కానీ ఈపాటికే ఆ పదిమందిలో ఒకరి ఎలిమినేషన్ కన్ఫామ్ అయిపోయింది. ఈ వారం అవినాష్, తేజ, గౌతమ్, పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి నామినేషన్లో ఉన్నారు. పృథ్వీ వెళ్లిపోయే సూచనలున్నాయి, జంట పక్షులు విడిపోవడానికి సమయం ఆసన్నమైందని ఊరించారు కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతెందుకు సండేవరకు ఆగకుండా నేటి ఎపిసోడ్‌లోనే పృథ్వీ సేవ్ అయ్యాడట!ఎంటర్టైనర్ గుడ్బైఅంటే తన ఓటు బ్యాంక్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలినవారిలో అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నాడు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన ఇతడు నామినేషన్స్ అంటేనే జంకాడు. చివరకు అతడి భయమే నిజమైంది. గేమ్ ఆడి మెగా చీఫ్ అయినప్పటికీ ప్రేక్షకులు అతడిని బయటకు పంపించేందుకే మొగ్గుచూపారు. ఈ వారం ఎంటర్టైనర్ను ఎలిమినేట్ చేశారు.నబీల్ వల్ల బతికిపోయిన అవినాష్కానీ ఇక్కడే ట్విస్ట్ ఇచ్చారు. చివర్లో తేజ, అవినాష్ ఇద్దరూ మిగిలారు. నబీల్‌తో ఎవిక్షన్ షీల్డ్ బలవంతంగా వాడేలా చేశారు. దీంతో అతడు అవినాష్ కోసం ఎవిక్షన్ షీల్డ్ వాడటంతో అతడు సేవ్ అయిపోయాడట. అలా ఈ వారం నో ఎలిమినేషన్ అని తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గాల్లో తేలుతున్న తేజ.. హింట్లు వదిలేసి ప్రేమ పంచిన శ్రీపాద
అమ్మను మించిన సెంటిమెంట్ మరొకటి ఏముంటుంది? మీ అమ్మ రాదు, రానివ్వను అని తేజను భయపెట్టి ఏడిపించిన బిగ్‌బాస్ చివరకు పట్టువదిలాడు. తల్లిని లోనికి పంపించాడు. దానికంటే ముందు, తర్వాత ఏం జరిగిందో నేటి (నవంబర్ 15) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..కటౌట్ తీసేయమన్న బిగ్బాస్ఫ్యామిలీ వీక్ అయిపోంది.. కాబట్టి ప్రేరణ.. తన భర్త శ్రీపాద కటౌట్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టేయాలన్నాడు బిగ్‌బాస్. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కాసేపటికే ఆమె పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.. శ్రీపాదను హౌస్‌లోకి పంపించాడు. అతడు రావడంతోనే భార్య నుదుటన తిలకం దిద్దాడు. వీరికి బ్యూటిఫుల్ డిన్నర్ డేట్ కూడా ఏర్పాటు చేయడం విశేషం.ప్రేమ కావాలి..అది చూసిన విష్ణు, రోహిణి తెగ ఫీలైపోయారు. విష్ణు అయితే.. పృథ్వీ తనను ప్రేమించట్లేదంటూ బాధపడింది. అతడికి నువ్వంటే ఇష్టం ఉంది కానీ ప్రేమ కాదు అని యష్మి క్లారిటీ ఇచ్చింది. అయినా సరే నాకు ప్రేమ కావాలని విష్ణు పిచ్చిపట్టినట్లే ప్రవర్తించింది. మరోవైపు శ్రీపాద.. గొడవలన్నింటికీ మూలకారణమైన కిచెన్ నుంచి బయటకు వచ్చేయమని ప్రేరణకు సూచించాడు. తెగేదాక గొడవలు లాక్కురావద్దన్నాడు. లవ్ సాంగ్తర్వాత భార్యతో కలిసి గేమ్ ఆడాడు. ఈ గేమ్ వల్ల కిచెన్ టైమర్‌కు రెండు గంటలు యాడ్ అయింది. అందరి ఫ్యామిలీస్ వచ్చాయి కానీ తన తల్లి మాత్రం రాలేదని తేజ బెంగపెట్టుకున్నాడు. అనంతరం బిగ్‌బాస్ సరదాగా లవ్ సాంగ్ ప్లే చేస్తే నిఖిల్-యష్మి, పృథ్వీ-విష్ణు అందులో లీనమై స్టెప్పులేశారు. తర్వాత మెగా చీఫ్ కోసం గేమ్ పెట్టారు. ఇందులో తేజ తప్ప మిగతా అందరూ పాల్గొనాల్సి ఉంటుందన్నాడు. ఏడుస్తుంటే చూడలేకపోతున్నా..ఈ గేమ్‌లో అవినాష్ గెలిచి మెగా చీఫ్‌గా నిలిచాడు. తల్లి కోసం తేజ ఏడుస్తూనే ఉన్నాడు. అతడి బాధను అర్థం చేసుకున్న బిగ్‌బాస్ ఆమెతో ఫోన్ కాల్ మాట్లాడిపించాడు. నేను రావట్లేదని బాధపడకు, నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నా అని ఫోన్లో ఓదార్చింది. కాసేపటికే నేరుగా ప్రత్యక్షమైంది. అమ్మను చూడగానే తేజ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. గోరుముద్దలుతల్లి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. నువ్వు బాగా ఆడుతున్నావు. ఫినాలేలో చూడాలనుందని తన కోరిక బయటపెట్టింది. అలాగే తను ప్రేమగా వండుకొచ్చిన చికెన్, ఆలుగడ్డ కూరను అన్నంలో కలిపి అందరికీ గోరుముద్దలు తినిపించింది. అమ్మను బిగ్‌బాస్ షోలో చూపించాలన్న కల నెరవేరిందంటూ తేజ తెగ సంబరపడిపోయాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణ నుంచి హౌస్‌మేట్స్‌కు విముక్తి.. కొత్త చీఫ్ ఎవరంటే?
ఏంటో.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరి గ్రాఫ్ ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరూ ఊహించలేరు. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ అదే వారం బ్యాగు సర్దుకుని వెళ్లాల్సింది. కానీ ఇప్పుడేకంగా విన్నర్ రేసులో నిలబడ్డాడు. వార్ వన్ సైడ్ అయింది, నిఖిల్ ట్రోఫీ ఎత్తడం ఖాయమనుకుంటే అతడికే పోటీ ఇస్తున్నాడు.అంతా తలకిందులువిష్ణుప్రియ.. పృథ్వీపైనే కోపం తెచ్చుకుని రెబల్‌గా మారిందనుకునేలోపే అతడిని కన్నందుకు థాంక్యూ అంటూ ఏకంగా పృథ్వీ తల్లి కాళ్లపై పడింది. ఎంతో కూల్‌గా ఉండే తేజ ఈమధ్య ఆవేశం స్టార్‌గా మారిపోయాడు. చాలామందికంటే ప్రేరణ నయం అనుకునేలోపే ఆమె తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. చీఫ్ అయ్యాక చీప్‌గా..అందరి మీదా నోరు పారేసుకుని విపరీతమైన నెగెటివిటీ సంపాదించుకుంది. మెగా చీఫ్ అవ్వాలని ఫస్ట్ వీక్ నుంచి ఆశపడింది. ఎట్టకేలకు పదోవారంలో చీఫ్ అయింది.. కానీ చీప్ బిహేవియర్‌తో తన గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. ఆమె.. విష్ణుప్రియ, గౌతమ్‌లను టార్గెట్ చేయడం జనాలకు అస్సలు మింగుడుపడలేదు. చీఫ్ అయ్యాక తన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కొత్త చీఫ్‌గా అవినాష్మొత్తానికి హౌస్‌లో ఆమె చీఫ్ పదవి ముగిసినట్లు తెలుస్తోంది. ఈసారి అందరూ చీఫ్ పదవి కోసం పోటీపడగా ముక్కు అవినాష్‌కే ఆ పోస్టు దక్కినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. హౌస్‌మేట్స్‌కు ప్రేరణ నుంచి విముక్తి లభించినట్లేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్‌కు హింట్లిస్తూనే హెచ్చరించిన తల్లి.. గౌతమ్ జోలికి మాత్రం..!
ఫ్యామిలీ వీక్ అంటేనే సంతోషం, దుఃఖం రెండూ కలగలసి ఉంటాయి. అయితే అవినాష్ మాత్రం దుఃఖాన్ని దాచేస్తూ సంతోషాన్ని పంచేందుకే ప్రయత్నించాడు. అటు నిఖిల్ తల్లి.. ఏమాత్రం సంకోచించకుండా చెప్పాల్సిన హింట్లన్నీ చెప్పేసింది. అవేంటో నేటి (నవంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..యష్మికి హింట్ ఇచ్చిన తండ్రితండ్రిని చూడగానే యష్మి.. పప్పా అంటూ సంతోషంతో ఏడ్చింది. కూతుర్ని ఓదార్చిన ఆయన అందరితోనూ కలివిడిగా మాట్లాడారు. తర్వాత కూతురికి అవసరమైనన్ని హింట్లు ఇచ్చాడు. 'నువ్వు నీకోసమే ఆడాలి.. ఇండివిడ్యువల్ గేమ్ ఆడు.. టాస్కులు ఆడకుండా ఊరికే కూర్చుంటే నీపై బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. నువ్వు మనసులో అనుకుంది అందరికీ చెప్పేయకు.. నువ్వు చేయాలనుకుంది నేరుగా చేసేయు. కూతురి తరపున సారీఇన్నివారాలున్నావ్.. నిన్ను స్టేజీపై చూడాలనుంది. నీకోసమే ఆడితే కప్పు గెలుస్తావు.. నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు అని చెప్పాడు. గారాలపట్టికి గోరుముద్దలు కూడా తినిపించాడు. నాన్నతో యష్మి డ్యాన్స్ చేస్తుంటే.. నబీల్‌కు తండ్రి గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. యష్మి తండ్రి ఆడిన గేమ్‌లో వచ్చిన రూ.21 వేలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. వెళ్లిపోయేముందు.. నా కూతురు ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే.. దయచేసి ఎవరూ ఏమనుకోవద్దు అంటూ కూతురి తరపున క్షమాపణలు చెప్పి ఓ మెట్టు పైకి ఎక్కేశాడు. .కుమిలిపోతున్న తేజఆయన వెళ్లిపోతుంటే యష్మితో పాటు తేజ కూడా ఏడ్చేశాడు. అందరి పేరెంట్స్ వచ్చినప్పుడల్లా కుమిలి కుమిలి ఏడుస్తున్న తేజను ఎలా ఓదార్చాలో హౌస్‌మేట్స్‌కు అర్థం కాలేదు. అతడి బాధను చూడలేకపోయిన గౌతమ్.. తన ఫ్యామిలీకి బదులుగా తేజ పేరెంట్స్‌ను పంపించమని బిగ్‌బాస్‌ను అభ్యర్థించాడు. అనంతరం నిఖిల్ తల్లి హౌస్‌లో అడుగుపెట్టింది. ఏయే కారణాల వల్ల నిఖిల్ గ్రాఫ్ పడిపోతుందో.. అవన్నీ పూసగుచ్చినట్లు చెప్పి మార్చుకోమని సూచించింది. నిఖిల్‌ను జాగ్రత్తపడమన్న తల్లిగ్రూప్ గేమ్ ఆడకు, ఇకపై ఇండివిడ్యువల్‌గానే ఆడు. నెల రోజులు మాత్రమే ఉంది. G (గౌతమ్)తో ఎక్కువగా ఫైట్, డిఫెన్స్‌కు వెళ్లొద్దు, నామినేషన్ దాకా అసలే వెళ్లొద్దు అని హింట్లు ఇచ్చింది. తప్పు చేస్తేనే నామినేట్ చేస్తున్నా అని నిఖిల్ సంజాయిషీ ఇవ్వగా.. నీతో జరిగిన దానికే మాత్రమే నామినేట్ చేయు, వేరే వాళ్ల గురించి చేయకు. Y(యష్మి)ని కొంచెం కంట్రోల్ చేయు. ఆమెకు దూరంగా ఉండుP (ప్రేరణ) అనే అమ్మాయి నుంచి కొంచెం దూరంగా ఉండు.. గ్రూపిజం ఆడకు.. నీకోసమే ఆడు అంటూ ఎవరూ ఇవ్వనన్ని హింట్లు ఇచ్చేసింది. తర్వాత ఆమె గేమ్ ఆడి మటన్ సంపాదించింది. తమకు నాన్‌వెజ్ రావడంతో హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఆమె వెళ్లిపోయాక బిగ్‌బాస్ హౌస్మేట్స్ అందరికీ ఓ గంటసేపు నిద్రపోయే అవకాశం ఇచ్చాడు. ఈ సమయంలో అనూజ వచ్చి నిద్రలో ఉన్న అవినాష్‌ను హత్తుకుంది.భార్య కోసం డ్రెస్ మార్చుకున్న అవినాష్భార్యను చూడగానే దెబ్బకు నిద్రమత్తు వదిలింది. అనూజ బ్లాక్ డ్రెస్‌లో వచ్చిందని వెంటనే అతడు కూడా వెళ్లి డ్రెస్ మార్చుకున్నాడు. బిగ్‌బాస్ వీళ్లిద్దరికీ కంపారిబులిటీ టెస్ట్ పెట్టాడు. ఈ గేమ్ ద్వారా రూ.51,000 ప్రైజ్‌మనీ కావాలా? లేదా మూడుగంటలు కిచెన్ టైమింగ్ కావాలా? అని అడిగాడు. అందుకు వీళ్లు ప్రైజ్‌మనీని ఎంచుకున్నారు. ఇక ఈ దంపతుల కోసం బిగ్‌బాస్ పెద్ద జే ప్లాన్ చేశాడు. బిగ్‌బాస్ సర్ప్రైజ్యాక్షన్ రూమ్‌ను హార్ట్ షేప్ బెలూన్లతో నింపేసి డిన్నర్ డేట్ ఏర్పాటు చేశాడు. అది చూసి మురిసిపడ్డ అవినాష్.. ఇది తన జీవితంలోనే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఇంతలో బిగ్‌బాస్ అవినాష్ ముచ్చటపడినట్లుగా లైట్లు ఆఫ్ చేశాడు. దాంతో అతడు తన భార్యపై ముద్దుల వర్షం కురిపించాడు. చివరగా అనూజ నవ్వుతూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అవినాష్ దంపతులకు బిగ్‌బాస్ సర్ప్రైజ్
ఫ్యామిలీ వీక్‌లో ఏ కంటెస్టెంట్ అయినా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే! కానీ అవినాష్ మాత్రం అక్కడ కూడా నవ్వించాడు. తన భార్య అనూజ సడన్ ఎంట్రీతో షాకైన అవినాష్‌కు బిగ్‌బాస్ మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇద్దరికీ సెపరేట్‌గా డిన్నర్ డేట్ ఏర్పాటు చేశాడు. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్న గదిని బెలూన్లతో నింపేశాడు.బిగ్‌బాస్ సర్ప్రైజ్ఆ సెటప్ చూసి అవినాష్‌కు దిమ్మతిరిగిపోయింది. ఇది జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పాడు. అయితే అనూజ వచ్చినప్పుడు లైట్లు ఆఫ్ చేయమని అవినాష్ ఇటీవలే సరదాగా బిగ్‌బాస్‌తో అన్నాడు. కానీ ఆ పెద్దాయన ఇది సీరియస్‌గా తీసుకుని నిజంగానే వీళ్లున్న గదిలో లైట్లు ఆఫ్ చేశాడు. దీంతో అవినాష్ తెగ సిగ్గుపడిపోయాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎంటర్టైనర్లు ఉట్టి జోకర్లేనా? విన్నర్‌గా పనికి రారా?
రియాలిటీ షో అంటేనే రియల్/నిజ స్వరూపం చూపించడం. ఎలా ఉంటున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం? భావోద్వేగాలను ఎలా నియంత్రించుకుంటున్నాం? ఇలా అన్నీ తెల్లకాగితంలా జనాలకు చూపించాలి. నచ్చినవాళ్లు ఓటేస్తారు, నచ్చనివాళ్లు లెక్క చేయరు .రియల్ ఎంటర్టైనర్స్ఎలాంటి ముసుగు లేకుండా స్వచ్ఛంగా ఉంటూ నలుగుర్ని నవ్వించేవారే రియల్ ఎంటర్టైనర్స్! కానీ ఇప్పటివరకు తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ప్రేక్షకుల్ని నవ్వించి కప్పు ఎగరేసుకుపోయినవాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. టాస్కులు ఆడినవారు లేదా సింపతీ సాధించినవారు, ఆల్రెడీ ఫ్యాన్‌బేస్ ఉన్నవాళ్లే విజేతలుగా నిలుస్తూ వస్తున్నారు తప్ప కమెడియన్లు కప్పు అందుకున్న దాఖలాలే లేవు. ఆ ఒక్కటి లేకపోతే అసంపూర్ణమే!అసలు వీళ్లు లేకపోతే బిగ్‌బాస్ షోనూ ఎవరూ పట్టించుకోరు. అన్నీ ఉన్నా వినోదం లేకపోతే అది సంపూర్ణంగా ఉండదు. అందుకే ఈ సీజన్లో రీలోడ్ పేరిట వైల్డ్‌కార్డ్స్‌ను దింపారు. ఇందులో ఎంటర్టైనర్స్ రోహిణి, అవినాష్, తేజ ఉన్నారు. ఫిజికల్ టాస్కులే కాకుండా బుర్రకు పదునుపెట్టే టాస్కుల్లోనూ ఒక అడుగు ముందే ఉన్నారు. వెనకాల గోతులు తవ్వడం, చాడీలు చెప్పడం, కావాలని గొడవపెట్టుకోవడం వంటి ఎన్నో అవలక్షణాలకు వీరు దూరంగా ఉన్నారు. ఈ లెక్కన విజేతగా నిలవడానికి ఆస్కారం ఉన్నవారు!టాప్ 5 మాత్రమేనా?కానీ రియాలిటీలో అది జరగడం లేదు. నిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వీడియో మెసేజ్‌లో నువ్వు టాప్ 5లో ఉండాలి అని తేజకు అతడి పేరెంట్స్ చెప్పారు. విన్నర్ అనకుండా టాప్ 5 అని ఎందుకన్నారు? అని తేజ అమాయకంగా రోహిణిని అడిగాడు. అప్పుడు రోహిణి కప్పు ఎలాగో రాదని తెలుసుగా.. అందుకే టాప్ 5 అన్నారు. మన పర్సనాలిటీలకు కప్పు రావురా.. ఏదో ఆడుకుంటూ వెళ్లిపోవడమే! నామినేషన్స్‌లో మేనరిజం చూపిస్తూ అరవడంలాంటివేమీ మనం చేయలేము అని చేదు సత్యాలను వివరించింది. కమెడియన్ విన్నర్ కాకూడదా?అందుకు తేజ.. ఎంటర్టైనర్లను ప్రేక్షకులు విన్నర్లుగా చూడరు అని అభిప్రాయపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కమెడియన్ విన్నర్ కాకూడదా? అన్న చర్చ మొదలైంది. జనాల్లోనూ ఈ ఆలోచన వస్తే ఎంటర్టైనర్లకు మంచి రోజులు వచ్చినట్లే! View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ మ్యాచ్‌ఫిక్సింగ్.. బిగ్‌బాస్ సర్ప్రైజ్లు.. కంటెస్టెంట్ల ఏడుపులు
బిగ్‌బాస్ హౌస్‌లో అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. దీపావళికి హౌస్‌మేట్స్‌కు వీడియో మెసేజ్‌ల రూపంలో కానుకలు అందాయి. తర్వాత అందరూ కలిసి సంతోషంగా డ్యాన్సులు వేశారు. దీంతో బిగ్‌బాస్ హౌస్ ఆనందాల హరివిల్లుగా మారింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (నవంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..అవినాష్‌తో డీల్నిన్న బిగ్‌బాస్ ఇచ్చిన బీన్ బ్యాగ్ గేమ్‌లో మొదట హరితేజ, తేజ ఎలిమినేట్ అయ్యారు. ఆ గేమ్ కొనసాగింపుతో నేటి ఎపిసోడ్ మొదలైంది. ఈ ఆటలో నిఖిల్.. నబీల్ను టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో నబీల్.. నిఖిల్‌ను మోచేయితో కొట్టాడు. నిఖిల్-ప్రేరణ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారని అర్థమైపోవడంతో నబీల్.. అవినాష్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. నిఖిల్‌ను అవుట్ చేద్దామని.. తర్వాత తాను ఓడిపోయి అవినాష్‌ను చీఫ్ చేస్తానని మాటిచ్చాడు. అలా చివరకు అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు.నబీల్‌కు స్వీట్లు తినే ఛాన్స్తర్వాత హౌస్‌లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో భాగంగా అబ్బాయిలు, అమ్మాయిలు అందంగా ముగ్గులు వేశారు. తర్వాత బిగ్‌బాస్ స్వీట్లు పంపించాడు. ఇక ఈ సీజన్ మొత్తం స్వీట్లు తిననని శపథం చేసిన నబీల్‌కు ఈ ఒక్కరోజు మాత్రం స్వీట్లు తినవచ్చని బిగ్‌బాస్ మినహాయింపు ఇచ్చాడు. అనంతరం బిగ్‌బాస్.. కంటెస్టెంట్ల ఇంటిసభ్యుల వీడియో సందేశాలను చూడవచ్చన్నాడు. ఎమోషనలైన తేజఅయితే ఇక్కడ కూడా అందరికీ అవకాశం ఇవ్వకుండా ప్రతి ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉంటుందన్నాడు. అలా మొదటగా నబీల్, పృథ్వీలలో.. నబీల్‌కు అమ్మ, అన్నయ్య నుంచి వీడియో మెసేజ్ వచ్చింది. తల్లిని టీవీలో చూడగానే నబీల్ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. రోహిణి, తేజలలో ఒకరికే వీడియో ఛాన్స్ అని బిగ్‌బాస్ చెప్పగా రోహిణి త్యాగంతో తేజకు ఫ్యామిలీ వీడియో ప్లే చేశాడు. తల్లిని స్క్రీన్‌పై చూడగానే తేజ ఎమోషనలయ్యాడు. యష్మి త్యాగంఅనంతరం నయని, యష్మిలలో ఒకరికే వీడియో ఛాన్స్ ఇవ్వగా నయనికి తల్లి మెసేజ్ ప్లే చేశారు. లైఫ్‌లో ఎన్నో ఎదుర్కొంటూ ఈ స్టేజ్‌కు వచ్చావు.. స్ట్రాంగ్‌గా ఆడు అని తల్లి ధైర్యం చెప్పడంతో నయని కళ్లలో నీళ్లు తిరిగాయి. అవినాష్ త్యాగంతో రోహిణి ఫ్యామిలీ వీడియో చూడగలిగింది. తర్వాత యష్మి త్యాగంతో విష్ణుప్రియ ఆంటీ వీడియో చూసి సంతోషపడిపోయింది. చివరగా యష్మి, అవినాష్, పృథ్వీలో ఒక్కరికే ఛాన్స్ అని చెప్పగా వీరు పృథ్వీ పేరు సూచించారు. అంతా ఏకమై సంతోషంగా..అలా పృథ్వీ తన తమ్ముడి వీడియో చూసి ఖుషీ అయ్యాడు. తర్వాత అందరూ పటాసులు కాల్చి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. పండగ పూట హౌస్‌మేట్స్‌ను బాధపట్టడం ఇష్టం లేని బిగ్‌బాస్ సడన్‌గా అవినాష్, యష్మి, హరితేజ ఫ్యామిలీ వీడియోస్ ప్లే చేశాడు. కూతురిపై బెంగ పెట్టుకున్న హరితేజ.. చిన్నారి భూమిని చూడగానే గుక్కపెట్టి ఏడ్చింది. భావోద్వేగాలతో గుండె భారమైన కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ ప్రత్యేక భోజనం పంపించడం విశేషం.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్టామినా లేదంటూ తేజ కన్నీళ్లు.. గౌతమ్‌ను మెంటల్ అన్న గంగవ్వ
బీబీ ఇంటికి దారేది గేమ్‌లో ఎల్లో టీమ్ ఎటూ కాకుండా పోయింది. కనీసం కంటెండర్లు కూడా అవలేకపోయారు. రెడ్ టీమ్‌లో నుంచి ఒకరు, గ్రీన్, బ్లూ టీమ్ నుంచి ఇద్దరు చొప్పున కంటెండర్లు అయ్యారు. ఇదిలా ఉంటే అవినాష్, రోహిణి వల్లే ఇంటిసభ్యులు పస్తులుండకుండా తినగలిగారు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 31)ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఏడుపు అనేది నా ఎమోషన్గేమ్లో కావాలనే ఏడ్చావ్ అంటూ యష్మిపై సెటైర్లు వేశాడు నిఖిల్. ఆ జోకుల్ని సరదాగా తీసుకోలేకపోయిన యష్మి నేను కష్టపడి ఆడాను.. ఏడుపు అనేది నా ఎమోషన్ అని సీరియస్‌గా బదులిచ్చింది. దీంతో నిఖిల్ చివరకు సారీ చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే కిచెన్‌లో వంట చేసుకునేందుకు బిగ్‌బాస్ టైం కండీషన్ పెట్టిన సంగతి తెలిసిందే కదా! ఈరోజు వంట చేస్తుండగానే ఆ సమయం ముగియడంతో బిగ్‌బాస్ ఉన్నఫళంగా గ్యాస్ ఆఫ్ చేశాడు.ఆ ఇద్దరిల్లే అందరికీ భోజనం..దీంతో వంట చేసేదెలాగా? అని హౌస్మేట్స్ కంగారుపడ్డారు. అంతలోనే బిగ్‌బాస్.. ఆ టైం యాడ్ చేయాలంటే అవినాష్, రోహిణి చిన్న పిల్లలుగా మారి నవ్వించాలన్నాడు. ఎంటర్టైన్మెంట్ అనేది వీళ్లిద్దరికీ కొట్టిన పిండి కావడంతో పిల్లల్లా కాదు ఏకంగా చిచ్చర పిడుగుల్లా మారిపోయారు. వీరి వినోదాన్ని చూసి ముచ్చటపడిపోయిన బిగ్‌బాస్ కిచెన్ టైమర్‌కు రెండు గంటలపాటు టైం యాడ్ చేశాడు. దీంతో కంటెస్టెంట్లు వంట చేసుకుని తినగలిగారు.గౌతమ్ అవుట్ఇక బీబీ ఇంటికి దారేది టాస్క్‌లో తాడోపేడో అని చివరి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో నిఖిల్ తన బ్లూ టీమ్‌ను గెలిపించాడు. బ్లూ టీమ్ లీడర్ హరితేజ రెండు సార్లు డైస్ రోల్ చేసే ఛాన్స్ పొందింది. అలా డైస్ ద్వారా వచ్చిన మూడు పాయింట్లను నిఖిల్‌కు ఇవ్వగా ఐదు పాయింట్లు తనకు ఇచ్చుకుంది. వీరికి రెండు ఎల్లో కార్డ్స్ రాగా.. అందులో ఒకటి రెడ్ టీమ్‌కు, మరొకటి గ్రీన్ టీమ్‌కు ఇచ్చారు. అలా రెడ్ టీమ్ నుంచి గౌతమ్, గ్రీన్ టీమ్ నుంచి విష్ణుప్రియ ఆటలో నుంచి వైదొలిగారు.కరివేపాకులా తీసిపారేసిన గంగవ్వగేమ్ నుంచి అవుట్ అవడంతో గౌతమ్ డీలా పడిపోయాడు. అదే విషయం విష్ణుప్రియ.. గంగవ్వతో చెప్తే.. అతడికేమైనా మెంటలా? ఎక్కువ ఆవేశపడతాడు. బిత్తిరి అంటూ.. కూరలో కరివేపాకులా తీసిపారేసింది. ఇక బీబీ ఇంటికి దారేది టాస్క్‌లో బీబీ ఇంటికి చేరువైన హరితేజ, నిఖిల్, అవినాష్, నబీల్, ప్రేరణ, తేజను కంటెండర్లుగా ప్రకటించారు. వీరికి తిరుగుతూనే ఉండు- గెలిచేవరకు అనే గేమ్ పెట్టాడు. ఇందులో పోటీదారులు బ్యాగులు ధరించి సర్కిల్లో తిరుగుతూ ఉండాలి.ఏడ్చేసిన తేజఫస్ట్ రౌండ్లో హరితేజ బాగానే ఆడింది కానీ తన బ్యాగు ఎక్కువ ఖాళీ అవడంతో ఆమె ఆటలో నుంచి అవుట్ అయింది. ఆటలో ఎన్నోసార్లు కింద పడుతూ లేస్తూ ఫైట్ చేసిన తేజ నెక్స్ట్ అవుట్ అయ్యాడు. దీంతో హర్టయిన తేజ.. తనకు స్టామినా ఉంటే బాగుండేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తయింది. ఇకపోతే ఈ గేమ్‌లో ఫైనల్ వరకు అవినాష్ నిలిచి మెగా చీఫ్ పదవి గెలిచాడని తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గౌతమ్‌పై పగ తీర్చుకున్నారుగా.. కొత్త చీఫ్ ఎవరంటే?
క్లాన్ (టీమ్) గొడవలకు చెక్ పెడుతూ బిగ్‌బాస్.. ఓజీ, రాయల్ క్లాన్స్‌ను ఏకం చేసేశాడు. ఇకపై హౌస్ అంతా ఒకే ఒక్క మెగా టీమ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. వీరికి బీబీ ఇంటికి దారేది అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌ను నాలుగు టీమ్స్‌గా విభజించాడు.పగ తీర్చుకున్న నిఖిల్ టీమ్ఈ క్రమంలో నిన్న రెడ్ టీమ్.. బ్లూ టీమ్‌కు మొత్తం మూడు ఎల్లో కార్డ్స్ ఇచ్చింది. దీంతో బ్లూ టీమ్‌లో గంగవ్వను గేమ్ నుంచి సైడ్ చేశారు. తాజా ప్రోమోలో బ్లూ టీమ్ రెడ్ టీమ్‌పై పగ తీర్చుకుంది. ఇదివరకే ఓ ఎల్లోకార్డ్ ఇవ్వగా ప్రోమోలో మరో ఎల్లో కార్డ్ ఇచ్చారు. దీంతో ప్రేరణ, యష్మి, గౌతమ్.. తమలో ఎవరు సైడ్ అవ్వాలనేదానిపై చర్చించుకున్నారు. చివరకు గౌతమ్‌ను సైడ్ చేసేశారు.కొత్త చీఫ్ ఎవరంటే?ఇక తాడో పేడో టాస్కులో విజృంభించి ఆడిన నిఖిల్.. టాస్కుల్లో తనకు ఎవరూ సాటి లేరని నిరూపించుకున్నాడు. ఇకపోతే ఈ వారం నిఖిల్ బ్లూ టీమ్‌లోని సభ్యులే చీఫ్ అయ్యారట. ముక్కు అవినాష్ మెగా చీఫ్ అయినట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: ఇచ్చిపడేసిన నబీల్.. విలన్‌గా విష్ఱుప్రియ.. దెబ్బకు!
అవినాష్‌ను స్కానింగ్ కోసం బయటకు తీసుకెళ్లారు. ఆరోగ్యం బాగోలేక ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్నాడేమోనని హౌస్ మొత్తం ఏడ్చేసింది. కట్ చేస్తే కొన్ని గంటలకే లోనికి వచ్చాడు. నామినేషన్స్ ఈసారి డిఫరెంట్‌గా జరిగాయి. ముఖ్యంగా మెగా చీఫ్‌కు ఇది కత్తి మీద సామే అయింది. అదెలాగో తెలియాలంటే నేటి (అక్టోబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..హౌస్ మొత్తం ఏడుపుకడుపు నొప్పితో అవినాష్ మెడికల్ రూమ్‌కు వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యుడు స్కానింగ్ కోసం హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుందన్నారు. కడుపు నొప్పి భరించలేకపోతున్నాను, అందుకే హౌస్ నుంచి వెళ్లిపోతున్నా అంటూ అవినాష్ హౌస్‌లో ఎమోషనల్ అయ్యాడు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే అవి ఎలిమినేట్ అవుతున్నాడనుకుని దాదాపు హౌస్మేట్స్ అందరూ భారంగా ఏడుస్తూ వీడ్కోలు చెప్పారు. అవినాష్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి స్కాన్ చేయించిన బిగ్‌బాస్ టీమ్.. అతడిని తిరిగి హౌస్‌లోకి పంపారు.నామినేషన్స్.. మెగా చీఫ్‌పై భారంమెగా చీఫ్ విష్ణుప్రియ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఐదుగురు సభ్యులను నామినేట్ చేసి జైల్లో పెట్టి తాళం వేయాలన్నాడు. చీఫ్‌ను చేయడంతో పాటు విలన్‌ను కూడా చేసేస్తున్నారని మనసులో అనుకుంటూనే ముందుగా గౌతమ్‌ను నామినేట్ చేసింది. లేడీస్ వీక్ అంటూ ఆడాళ్లకు గౌరవమిస్తానంటావ్.. కానీ ఒకరిపై నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అరవడం బాగోలేదని తెలిపింది. అందుకు గౌతమ్.. ప్రేరణతో మాట్లాడుతుంటే యష్మి మధ్యలో వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పాయింట్లు వెతకడానికే నీతో ఉన్నాతన పేరు రావడంతో యష్మి గొడవకు దిగింది. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని అక్కా అనేశాడు. క్రష్ అంటావ్, అక్కా అంటావ్.. నన్ను అక్కా అని పిలవకు అని యష్మి హెచ్చరించగా అది చూసి విష్ణు పకాపకా నవ్వింది. నాకంటే ఎక్కువపాయింట్లు ఉన్నోళ్లు నీ చుట్టూ ఉన్నా నామినేట్ చేయవని గౌతమ్.. విష్ణుపై అసహనం వ్యక్తం చేశాడు. నిన్ను నామినేట్ చేయడానికి దగ్గరుండి పాయింట్లు వెతికానంది విష్ణు. ఈమె మాటలు విన్న పృథ్వీ వెటకారంగా నవ్వాడు. మనసు చివుక్కుమంది, అందుకే..నన్ను ఫేక్ ఫ్రెండ్ అన్నావ్, అందర్నీ గాలికొదిలేసి నీ కోసమే బజ్జీలు వేసుకున్నావంటూ ప్రేరణను జైల్లో పడేసింది. సంచాలకుడిపై అరవడం వల్ల నా మనసు చివుక్కుమందంటూ తేజను నామినేట్ చేసింది. పృథ్వీ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో నయనిని సైతం జైల్లో వేసింది. వైల్డ్‌కార్డ్స్ వచ్చాక నీలో పన్ యాంగిల్ కనిపించడం లేదంటూ నబీల్ను నామినేట్ చేసింది. వెంటనే నబీల్.. నువ్వు పృథ్వీతో ఉంటే నేనెక్కడ కనిపిస్తానంటూ భలే కౌంటరిచ్చాడు. నీలో ఫైర్ ఏముందని నాకు చెప్తున్నావ్ అని తిరిగి ప్రశ్నించాడు. నామినేషన్స్‌లో రెండో లెవల్అలా విష్ణుప్రియ వల్ల గౌతమ్, ప్రేరణ, నయని పావని, తేజ, నబీల్ నామినేట్ అయ్యారు. మన టీమ్వాళ్లు మెగా చీఫ్ అవ్వాలని ఆడితే ఇప్పుడు నన్నే నామినేట్ చేసిందని నబీల్ ఏడ్చాడు. చేసిందంతా చేసిన విష్ణు.. నబీల్‌కు సారీ చెప్పింది. తర్వాత నామినేషన్స్‌లో రెండో లెవల్ మొదలైంది. జైల్లో ఉన్నవారిని విడిపించే అవకాశాన్ని హౌస్‌మేట్స్‌కు ఇచ్చాడు. బజర్ మోగిన ప్రతిసారి జైలు తాళం చెవిని పట్టుకున్నవారికి ఒకరిని నామినేషన్ నుంచి సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఆ వ్యక్తికి బదులుగా మరొకరిని నామినేట్ చేసి జైల్లో వేయాల్సి ఉంటుంది.ఫైనల్ లిస్ట్ ఇదేమొదటగా పృథ్వీ తాళం అందుకుని.. నబీల్ను జైలు నుంచి విడిపించాడు. అతడి స్థానంలోకి అవినాష్‌ను పంపించాడు. తర్వాత బజర్‌కు యష్మి.. ప్రేరణను విడిపించి హరితేజను జైల్లోకి పంపింది. రోహిణి.. అవినాష్‌ను బయటకు తీసి పృథ్వీని లోనికి పంపించింది. అవినాష్.. తేజను విడిపించి యష్మిని జైల్లో వేశాడు. ప్రేరణ.. పృథ్వీని విడిపించి తేజను లోనికి పంపించింది. ఫైనల్‌గా ఈ వారం గౌతమ్, నయని, హరితేజ, యష్మి, తేజ నామినేట్ అయినట్లు ప్రకటించారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు
బిగ్‌బాస్ 8లో ఎనిమిదో వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఇతడు.. ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్లు ప్రవర్తించాడు. పెద్దగా ఇంప్రెసివ్ అనిపించలేదు. దీంతో ఓట్లు తక్కువ పడి ఎలిమినేట్ అయిపోయాడు. అదే టైంలో అవినాష్ కూడా సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు ఆదివారం ఎపిసోడ్ చివరలో చూపించారు. కానీ అదంతా ఉత్తిదే.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)మెహబూబ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బెడ్రూంలోకి వచ్చిన అవినాష్.. రిపోర్ట్ వచ్చింది. కడుపులో ఏదో సమస్యగా ఉంది. మీకు కష్టం అవుతుంది. బయటకు వచ్చేసేయండి అని డాక్టర్స్ చెప్పారు. 'ఏది పడితే చెప్పకు.. అను (అవినాష్ భార్య) మీద ఒట్టేసి చెప్పు' అని నిఖిల్ అడిగేసరికి.. ఫొటోపై ఒట్టేసి మరీ నిజంగానే వెళ్లిపోతున్నా అని అవినాష్ చెప్పాడు. నాపై ఒట్టేసి నిజం చెప్పు అని నయని పావని అడిగినప్పుడు కూడా అవినాష్ అదే చెప్పాడు. 'నొప్పి తట్టుకోలేకపోతున్నా' అని ఏడ్చాడు. హౌస్‌లో అందరూ ఇతడిని ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.అయితే ఇదంతా ప్రాంక్‌లో భాగంగానే అవినాష్ చేశాడు. సోమవారం ఎపిసోడ్‌తో ఈ విషయం క్లారిటీ వస్తుంది. 24 గంటల స్ట్రీమింగ్ వల్ల అవినాష్.. తిరిగి ఇంట్లోకి వచ్చిన వీడియోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సెల్ఫ్ ఎలిమినేట్ అని చెప్పి అవినాష్.. ప్రాంక్ చేయడం వరకు బాగుంది కానీ మరీ భార్య మీద ఒట్టేసి అబద్ధాలు చెప్పడమే కాస్త ఇబ్బందిగా అనిపించింది.(ఇదీ చదవండి: మీడియాకు క్షమాపణలు చెప్పిన నటుడు శ్రీకాంత్ అయ్యంగర్)#Avinash Back To BB House 😁 Andarini Housemates Ni Kasepu Erri Pap*alni Chesadu Ga 😂😂#BiggBossTelugu8 pic.twitter.com/LbDV2UFXs7— BiggBossTelugu8 (@Boss8Telugu) October 27, 2024 -
హడలెత్తించిన నిఖిల్, పృథ్వీ.. కూతురి కోసం హరి కన్నీళ్లు!
ఫిజికల్ టాస్క్ వస్తే పృథ్వీకి తెలియకుండానే పూనకం వస్తుంది. మనుషుల్ని పిట్టల్లా విసిరేస్తూ, పురుగుల్లా నలిపేస్తుంటాడు. ఈ రోజూ ఇదే జరిగింది. ఈసారి నిఖిల్ తోడయ్యాడు. టాస్కులో ఈ దోస్తులిద్దరూ అరాచకం సృష్టించారు. మరి వీరితో పోటీపడిందెవరు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నిఖిల్, పృథ్వీ అరాచకంబీబీ రాజ్యం ఛాలెంజ్ కొనసాగింపుగా నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఎనిమిది ధాన్యపు బస్తాలను తోపుడు బండిపై ఎవరు ముందుగా పెడతారో ఆ టీమ్‌కు రాజ్యంలో వ్యవసాయం దక్కుతుందన్నాడు. ఓజీ టీమ్ నుంచి నిఖిల్, పృథ్వీ విజృంభించి ఆడారు. వారిని అడ్డుకునేందుకు గౌతమ్, మెహబూబ్ చాలావరకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొట్టుకున్నారు, తోసేసుకున్నారు. నానా అరాచకం సృష్టించడంతో బిగ్‌బాస్ కొన్ని సెకన్లపాటు గేమ్‌ను పాజ్ చేశాడు. అదుర్స్ అనిపించిన తేజ, అవినాష్అలాగే ఈ ఆటలో పోటీదారులను మార్చుకోవచ్చని వెసులుబాటు కల్పించాడు. అలా గౌతమ్, మెహబూబ్ స్థానంలోకి అవినాష్, తేజ వచ్చారు. వీళ్లు కూడా తమ శక్తికి మించి ప్రయత్నించి ఆడారు. వాళ్లు ఎంతో కష్టపడి ఓ సంచిని బండిపై పెట్టారు. కానీ అది ముందు ఓజీ తోపుడు బండికి టచ్ అయిందంటూ వారికే పాయింట్ ఇస్తానని సంచాలకురాలు యష్మి వితండ వాదం చేసింది. ఒక్క బస్తా కూడా రాయల్ టీమ్‌ను పెట్టనివ్వకపోవడం నిఖిల్, పృథ్వీల శక్తికి నిదర్శనం.మనలో ఒకరే విన్నర్ఫైనల్గా ఈ గేమ్‌లో ఓజీ టీమ్ గెలవడంతో వ్యవసాయ భూమి గెలిచారు. అలాగే తన టీమ్‌లో నుంచి పృథ్వీని మెగా చీఫ్ కంటెండర్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో కంటెండర్ అవ్వాలనుకున్న ప్రేరణకు, యష్మికి మధ్య గొడవ జరిగింది. ఈ ఇద్దరికీ సర్ది చెప్పిన నిఖిల్.. ఇది మన సీజన్.. మన టీమ్‌లోని ఒకరే ట్రోఫీ ఎత్తాలి. మనలో మనకు గొడవలొద్దు అని టీమ్ సభ్యులకు హితోపదేశం చేశాడు. ఓడిన రాయల్స్ టీమ్ నుంచి గంగవ్వను మెగా చీఫ్ కంటెండర్ పోస్టు నుంచి తప్పించారు.కూతుర్ని తల్చుకుని హరితేజ ఎమోషనల్వచ్చినప్పటినుంచి మేమే గెలిచాం అని రాయల్స్ ఫీల్ అవుతున్నారు. మనం మిగతా టాస్కులు గెలిచి ఆ పొగరును తగ్గించేయాలని ప్రేరణ.. నబీల్‌తో అంది. అన్నట్లుగానే తర్వాత టాస్కుల్లోనూ దూకుడు ప్రదర్శించారు. మరోవైపు హరితేజ.. తన కూతురు భూమిని తల్చుకుని ఎమోషనలైంది. అమ్మ గురించి బెంగపెట్టుకోకు, స్కూలుకు వెళ్లు, పిన్నితో ఆడుకో.. వీకెండ్లో నాన్న వస్తాడు. అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉన్నారు, నీకోసం ఏడవట్లేదు. నువ్వు కూడా ఏడవొద్దంటూనే కన్నీళ్లు పెట్టుకుంది.మళ్లీ ఓజీ టీమ్‌దే గెలుపుబీబీ రాజ్యంలో సైన్యం, హాస్పిటల్‌ను పొందడానికి బిగ్‌బాస్ వైరల్ అటాక్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఓజీ టీమ్ నుంచి నిఖిల్, నబీల్ ఆడగా రాయల్ టీమ్ నుంచి గౌతమ్, తేజ ఆడారు. మరోసారి ఓజీ టీమ్ గెలిచి హాస్పిటల్, సైన్యం పొందింది. అలాగే తన టీమ్‌లో నుంచి నిఖిల్‌ను మెగా చీఫ్ కంటెండర్‌గా ప్రకటించారు. రాయల్స్ నుంచి గౌతమ్‌ను మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పించారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్‌పై మనసు పారేసుకున్న యష్మి, అవ్వకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!
సమయం దొరికినప్పుడల్లా అవినాష్ అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు. అటు తేజ, అవినాష్.. గంగవ్వను దెయ్యం పట్టినట్లు యాక్ట్ చేయమన్నారు. కానీ గంగవ్వ ఏకంగా జీవించేసింది. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..తిక్క కుదిర్చిన బిగ్బాస్ఇంటిని శుభ్రంగా ఉంచట్లేదని, తన ఆదేశాలను లెక్కచేయట్లేదని బిగ్‌బాస్ హర్టయ్యాడు. అందుకని ఈ వారం సూపర్మార్కెట్లో షాపింగ్ చేసే సమయాన్ని కాస్త కట్ చేసిపారేశాడు. దీంతో మెగా చీఫ్ గౌతమ్.. నిఖిల్‌ను మార్కెట్‌కు పంపించి అతడితో షాపింగ్ చేయించాడు.యష్మి- నిఖిల్ లవ్ ట్రాక్?ఇక యష్మి.. నిఖిల్‌ను తనతో మాట్లాడమని బతిమాలింది. ఫ్రెండ్స్‌గా ఉన్నప్పుడే బాగుండేది.. నా వల్ల నీ గేమ్‌కు ప్రాబ్లం కానివ్వను. నాది పడిపడి చచ్చే క్యారెక్టర్ అయితే కాదు, ఇకపై జస్ట్ ఫ్రెండ్‌గా ఉంటా అని చెప్పుకుంటూ పోయింది. నిఖిల్ శిలావిగ్రహంలా స్తబ్దుగా కూర్చోవడంతో కోపంతో వెళ్లిపోయింది. ఆమె అలకను తీర్చేందుకు నిఖిల్.. యష్మిని హత్తుకుని ముద్దిచ్చాడు.ఇంకా పృథ్వీ వెనకే పడుతోన్న విష్ణుపృథ్వీ మెడలో గోల్డ్ చెయిన్ చూసి నిలువెత్తు బంగారం.. మళ్లీ బంగారం వేసుకుని తిరగడమేంటో అని మురిసిపోయింది. ఈ మాట విన్న హౌస్మేట్స్ ఇక మా వల్లకాదు, వెళ్లిపోతాం అని జోక్ చేశారు. బిగ్‌బాస్ కూడా సరే, మీ సరదా నేనెందుకు కాదంటాను అన్నట్లు గేట్లు తెరిచాడు. దీంతో అబ్బాయిలంతా కలిసి అవినాష్‌ను లాక్కెళ్లి మరీ బయట పడేసేందుకు ప్రయత్నించారు.మనసు మార్చుకున్న బిగ్బాస్అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ మేరకు అవినాష్ జిమ్ ట్రైనర్‌గా మారి హౌస్‌మేట్స్‌తో చిత్రవిచిత్రమైన కసరత్తులు చేయించి నవ్వించాడు. దీంతో కిచెన్ టైమర్‌కు మరో రెండు గంటల సమయం యాడ్ చేశాడు. అలాగే మార్కెట్లో మర్చిపోయిన కూరగాయలు, పండ్లను సైతం పంపించి తన మనసు వెన్న అని నిరూపించుకున్నాడు.అవ్వకు ఆస్కార్ ఇవ్వాల్సిందే!అవినాష్, తేజ.. గంగవ్వను దెయ్యంలా రెడీ అయి భయపెట్టాలన్నాడు. ఇంకేముంది.. అర్ధరాత్రి గంగవ్వ జుట్టు విరబోసుకుని కేకలు వేయడంతో హౌస్మేట్స్ నిద్రలో నుంచి లేచి జడుసుకున్నారు. ఇది చూసిన తేజ.. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ పక్కా అని భయపడిపోయాడు. నిఖిల్, పృథ్వీ, నబీల్ మాత్రం నిద్రలో నుంచి లేవలేదు. అయితే ఇది ప్రాంక్ అని, అవినాష్ చేయించి ఉంటాడని గౌతమ్ అనుమానపడ్డాడు.మెగా చీఫ్ కంటెండర్‌గా రోహిణిబీబీ రాజ్యం ఏర్పాటు చేసుకునేందుకు రెండు క్లాన్స్ పోటీపడతాయన్నాడు. మొదటగా అక్వేరియంలో నీళ్లను నింపే టాస్కులో రాయల్ టీమ్ గెలిచింది. అందుకు గానూ రాజ్యంలో మంచినీటి సరస్సును పొందారు. అలాగే రాయల్ టీమ్‌లో నుంచి రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అయింది. అలాగే ఓజీ టీమ్‌లో యష్మి మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పుకుంది. రోహిణిని కంటెండర్‌గా సెలక్ట్ చేయడంపై హరితేజ రాద్దాంతం చేసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అవినాష్ సరదా.. నిజంగానే డోర్ తెరిచిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ హౌసులో ఎనిమిదో వారం నామినేషన్ పూర్తయ్యాయి. మొత్తంగా ఆరుగురు నామినేట్ అయ్యారు. మెహబూబ్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, నయని పావని లిస్టులో ఉన్నారు. హరితేజ కూడా నామినేట్ అయింది. కాకపోతే మెగాచీఫ్ గౌతమ్.. సూపర్ పవర్ ఉపయోగించిన ఆమెని తప్పించాడు. ఈ వారానికి సంబంధించి కీలక ఘట్టం ముగియడంతో కంటెస్టెంట్స్ ఎంటర్టైన్మెంట్ మొదలుపెట్టారు.(ఇదీ చదవండి: ఉదయనిధి స్టాలిన్ రూ. 25 కోట్లు చెల్లించాల్సిందే.. కోర్టుకెళ్లిన నిర్మాత)పృథ్వీ మెడలోని బంగారు గొలుసు గురించి తేజ అడగ్గా.. 'గోల్డ్, గోల్డ్ వేసుకుని తిరగడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా' అని విష్ణుప్రియ మధ్యలో దూరి కామెంట్ చేసింది. అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అని సరదాగా కామెంట్ చేశారు. అయితే అవినాష్ అన్నప్పుడు బిగ్‌బాస్ నిజంగానే డోర్ తెరిచాడు. దీంతో అందరూ అతడిని పట్టుకుని మరీ బయటకు తోసేయడానికి ప్రయత్నించారు. ఇదంతా కూడా ఫన్నీగా సాగింది.దీని తర్వాత అవినాష్ జిమ్ ట్రైనర్‌గా మారి, ఇంటి సభ్యులు వర్కౌట్స్ ఎలా చేయాలో చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఆ తర్వాత టేస్టీ తేజతో వర్కౌట్స్ చేయించాడు. ఇదంతా కూడా ఫన్నీగా సాగేసరికి మిగిలిన హౌస్మేట్స్ అందరూ పగలబడి నవ్వారు. పదేపదే అవినాష్, రోహిణి, టేస్టీ తేజతో తప్పితే మిగిలిన వాళ్ల నుంచి ఎంటర్టైన్మెంట్ అనేది రావట్లేదు. బుధవారం కూడా అవినాష్ తన కామెడీతో నవ్విస్తాడని అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి ఫొటోలతో ప్రభాస్ చెల్లి) -
చేతనైతలే.. వెళ్లిపోతా, ఓట్లు వేయకండి: ఏడ్చేసిన మణికంఠ
హౌస్మేట్స్ ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో తెలియజేసేందుకు నాగార్జున ఓ టాస్క్ పెట్టాడు. మరోవైపు హౌస్‌లో గౌతమ్ కృష్ణ.. యష్మి అంటే తనకు క్రష్ అంటున్నాడు. అటు బిగ్‌బాస్ కప్పు గెలుస్తానన్న మణి.. ఇంటికి వెళ్లిపోతానని ఏడ్చాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (అక్టోబర్ 19) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..వెళ్లిపోతా..ఈ గొడవలు, కొట్లాటలు నావల్ల కావడం లేదు, వెళ్లిపోతానంటూ కెమెరాల ముందు మొరపెట్టుకున్నాడు నాగమణికంఠ. దయచేసి ఓట్లు వేయొద్దని ప్రేక్షకులను వేడుకున్నాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉందామనుకున్నా.. కానీ నా వల్ల కావట్లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.యష్మిపై గౌతమ్ క్రష్అటు గౌతమ్.. 'నేను సింగిల్, నీపై నాకు క్రష్ ఉంది.. ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్‌లా ఉందాం. మన మధ్య బాండింగ్ ఎటువైపు వెళ్తుందో చూద్దాం.. అందరిలో నువ్వు నాకు స్పెషల్' అని యష్మితో మాటలు కదిపాడు. తర్వాత నాగార్జున బీబీటైమ్స్ హెడ్‌లైన్స్ అని ఓ గేమ్ ఆడించాడు. అందులో భాగంగా కంటెస్టెంట్లకు సరిపోయే హెడ్‌లైన్స్‌ను బోర్డ్‌పై పెడతాడు. అది నిజంగా ఎంతమేరకు సూట్ అవుతుందన్నది హౌస్మేట్స్ చెప్పాలి. నిన్న హీరో- ఈరోజు జీరోఅలా మొదటగా కండబలం ఎక్కువ- బుద్ధిబలం తక్కువ అన్న హెడ్డింగ్ గౌతమ్‌కు సరిగ్గా సరిపోతుందన్నారు. ఈ క్రమంలో నిఖిల్, గౌతమ్ కొట్లాడుకున్న వీడియో చూపించిన నాగ్.. కసిగా ఆడండి కానీ ఉన్మాదంగా ఆడొద్దని హెచ్చరించాడు. నిఖిల్‌కు నిన్న హీరో- ఈరోజు జీరో అన్న ట్యాగ్ కరెక్ట్‌గా సరిపోతుందన్నాడు. హరితేజ.. ఒకప్పుడు ఫైర్- ఇప్పుడు ఫ్లవర్‌లా మారిపోయిందన్నారు.ఆట కంటే నాకు నేనే ముఖ్యంపృథ్వీకి.. 'కింగ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్- వాంట్స్ రెస్పెక్ట్ (అగౌరవపరుస్తాడు కానీ తనను గౌరవించాలనుకుంటాడు)', 'ఆట కంటే నాకు నేనే ముఖ్యం' అన్న రెండు ట్యాగులు సరిగ్గా సూటవుతాయన్నారు. గడ్డం, మీసం తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేశావని నాగ్ ఆరా తీశాడు. పోనీ రూ.5 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేస్తా, గడ్డం తీసుకుంటావా? అన్నాడు. పృథ్వీ ఒప్పుకోకపోవడంతో దాన్ని రూ.8 లక్షలకు పెంచాడు. అయినా అడ్డంగా తలూపడంతో నామినేషన్స్‌తో పని లేకుండా నేరుగా పదో వారంలోకి అడుగుపెట్టేందుకు ఛాన్స్ ఇస్తానన్నాడు. అయినా పృథ్వీ అంగీకరించలేదు.అశ్వత్థామ 3.0ఇక నామినేషన్స్‌లో పృథ్వీ- ప్రేరణపై రివేంజ్ నామినేషన్ చేయడాన్ని నాగ్ సమర్థించడం విశేషం. అనంతరం అవినాష్‌కు పైకి నవ్విస్తా- వెనక ప్లాన్ వేస్తా అన్న హెడ్డింగ్ సరిగ్గా సరిపోతుందన్నారు. ఆ వెంటనే భార్య అనూజ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పిన ఆడియో ప్లే చేయగా అవినాష్ ఎమోషనలయ్యాడు. ఇక గౌతమ్ అశ్వత్థామ 3.0 అని చెప్తూ నాగ్ అతడిని మెచ్చుకున్నాడు. ముందు ఒక ఆట-వెనక ఒక ఆట హెడ్డింగ్ యష్మికి కాస్త సూట్ అవుతుందన్నారు. ఆటలో వీక్- డ్రామాలో పీక్తర్వాత నాగ్.. ప్రేరణ, తేజను నాగ్ సేవ్ చేశాడు. 'ఆటలో వీక్- డ్రామాలో పీక్' హెడ్డింగ్ మణికంఠకు సెట్ అవుతుందని హౌస్మేట్స్ అన్నారు. ఈ సందర్భంగా మణి.. కూర్చుంటే లేవలేకపోతున్నా.. నా శరీరం నా కంట్రోల్లో లేదు, ఇంకా ఆడాలని ఉంది.. కానీ ఇలాగే ఉంటే నా శరీరం, మెదడు సహకరించదు. నేను వెళ్లిపోతాను సర్. నాకు నేనే వీక్ అయిపోయాను అని తన గోడు వెల్లబోసుకున్నాడు. అయితే ప్రేక్షకుల ఓటింగ్ ఎలా ఉందో చూద్దామని నాగ్ అతడిని కూర్చోబెట్టాడు.మత్తు వదలరా..తేజకు హౌస్ అంతా కలిసి మత్తు వదలరా ట్యాగ్ ఇచ్చేసింది. ప్రేరణకు.. గుంపులో గుర్తింపు కోరుకోవద్దని చెప్పారు. నయని పావనికి క్రై బేబీ అన్న ట్యాగ్ ఇచ్చారు. మెహబూబ్.. ఈ సీజన్‌కు ఫ్లాప్ చీఫ్ అని నిర్ణయించారు. కత్తిలాంటి నా నాలుక.. కాదు మీకు తేలిక శీర్షిక గంగవ్వకు పర్ఫెక్ట్గా సెట్ అయిందన్నారు. ఈ సందర్భంగా గంగవ్వ.. తనను ఎవరూ నామినేట్ చేయొద్దని మీరైనా చెప్పండని నాగార్జునను వేడుకుంది.మాటలో పులి- ఆటలో పిల్లిఇక రోహిణికి.. మనసులే కాదు ఆట కూడా గెలవాలన్నారు. విష్ణుప్రియకు 'రివేంజ్ నా సరికొత్త ఆట', 'వీకెండ్లో ఆట, మిగతా రోజులు టాటా' అన్న రెండు హెడ్‌లైన్స్ కరెక్ట్‌గా సరిపోయాయన్నారు. నబీల్.. 'మాటలో పులి- ఆటలో పిల్లి' అన్నారు. అలా ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రతివారం అరతులం బంగారమిస్తా.. గంగవ్వకు మణి బంపరాఫర్
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అంతా అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్నాడు నబీల్. అయితే ఇది గొంతెమ్మ కోరికగా భావించిన బిగ్‌బాస్ ఈ వారం మాత్రమే కావాల్సినంత ఫుడ్ ఇస్తానన్నాడు. కానీ ఓ తిరకాసు పెట్టాడు. అదేంటో తెలియాలంటే నేటి (అక్టోబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నా జీవితంలో జరిగిన ఘోరంవిష్ణుప్రియ తన మనసులోని బాధను చెప్పడంతో గంగవ్వ ఎమోషనలైంది. అమ్మకు ఇష్టం లేదని చిన్నప్పటినుంచి నాన్నతో మాట్లాడేవాళ్లం కాదు. నాన్నపై ఎంత ప్రేమ ఉన్నా, అమ్మ కోసం ఆయనతో మాట్లాడలేదు. చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు.. అది నా జీవితంలో జరిగిన ఘోరం.. ఇది ఎవరికీ జరగకూడదు. అమ్మ చనిపోయాక ఇప్పుడిప్పుడే తనతో మాట్లాడుతున్నాం అని చెప్పింది. ఇది విని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.హౌస్మేట్స్ కోసం నబీల్ త్యాగంఇకపోతే ఇన్ఫినిటీ రూమ్‌లో నబీల్ అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్న సంగతి తెలిసిందేగా! దాని గురించి బిగ్‌బాస్ ప్రస్తావిస్తూ.. ఇంట్లో ఉన్నంతకాలం నబీల్ స్వీట్లు, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు త్యాగం చేస్తే ఈ ఒక్క వారం అన్లిమిటెడ్ రేషన్ లభిస్తుందన్నాడు. ఇంటిసభ్యులందరికోసం ఆ కండీషన్‌కు నబీల్ ఓకే చెప్పాడు. దీంతో మెహబూబ్.. సూపర్ మార్కెట్లో ఉన్న రేషన్ అంతా ఊడ్చేశాడు.బంగారం ఇస్తానన్న మణికంఠతర్వాత నాగమణికంఠ.. తాను నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయితే గంగవ్వకు బంగారు ముక్కుపుడక ఇస్తానన్నాడు. సేవ్ అయిన ప్రతివారం అరతులం ఇస్తానంటూ గంగవ్వ మీద ఒట్టేశాడు. మరి నాకేం ఇస్తావని రోహిణి అనగా ఒక ముద్దిస్తానన్నాడు. ఇక అవినాష్-రోహిణి నామినేషన్స్‌ను రీక్రియేట్ చేసి నవ్వించారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్‌బాస్ కిచెన్‌లో మరో రెండు గంటలు ఎక్కువ సేపు వంటచేసుకునే ఛాన్సిచ్చాడు. మెగా చీఫ్ కంటెండర్‌గా గంగవ్వఅనంతరం రాయల్ టీమ్ గెలుపొందిన మెగా చీఫ్ కంటెండర్ షీల్డ్‌ను గంగవ్వకిచ్చారు. బిగ్‌బాస్.. రాయల్ టీమ్‌ను ఓవర్ స్టార్ట్ఫోన్లుగా, ఓజీ టీమ్‌ను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా విభజించారు. హౌస్ అంతా రాయల్ టీమ్ ఆధీనంలో, గార్డెన్ ఏరియా ఓజీ టీమ్ ఆధీనంలో ఉంటుందన్నాడు. కిచెన్, బెడ్రూమ్, వాష్‌రూమ్ వంటి వసతులు అందిస్తూ చార్జింగ్ పొందవచ్చని తెలిపాడు.బెంబేలెత్తిపోయిన మణికంఠటాస్క్ పూర్తయ్యేలోపు బతికున్న సభ్యులే మెగాచీఫ్ కంటెండర్లవుతారన్నాడు. టాస్క్ ప్రారంభానికి ముందే మణి బెంబేలెత్తిపోయాడు. నాకంటూ ఫ్యామిలీ ఉంది. బొక్కలిరగ్గొట్టుకుని బయటకు వెళ్లలేను. ఆరోగ్యం ముఖ్యం.. టీమ్‌కు ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలో అంతే ఇస్తానని చెప్పాడు. ఆట మొదలవగానే అవినాష్.. నబీల్‌కు తెలియకుండా అతడి చార్జర్‌ను తన ప్లగ్‌కు కనెక్ట్ చేశాడు. హరికథ చెప్పి చార్జింగ్హరితేజ.. హరికథతో మణికంఠను మెప్పించి అతడి దగ్గర నిమిషం పాటు చార్జింగ్ పొందింది. నయని కూడా యష్మి దగ్గర బలవంతంగా చార్జ్ పొందడానికి ట్రై చేసింది. కానీ నిఖిల్ ఆమెను అడ్డుకుని అవతలకు విసిరేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అలా నేటి ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ను బోల్తా కొట్టించిన అవినాష్.. చాలా స్మార్ట్ గురూ!
నామినేషన్స్‌తో హీటెక్కిన బిగ్‌బాస్ హౌస్‌ను కూల్ చేసేందుకు ఉదయాన్నే ఓ ఫన్ టాస్క్ ఇచ్చినట్లున్నారు. ఇందులో ఒకరనొకరు ఇమిటేట్ చేసి నవ్వుకున్నారు. తర్వాత స్మార్ట్ ఫోన్స్ వర్సెస్ చార్జర్స్ అని ఓ గేమ్ పెట్టాడు. ఇందులో రాయల్ టీమ్ ఫోన్స్ అయితే ఓజీ టీమ్ మెంబర్స్ చార్జర్లుగా ఉంటారు. ఇక రాయల్ క్లాన్ ఆధీనంలో హౌస్ ఉంటే.. ఓజీ క్లాన్ ఆధీనంలో గార్డెన్ ఏరియా ఉంటుంది.నబీల్‌కు తెలియకుండా..చార్జింగ్ అవకపోతే ఫోన్ బ్యాటరీ తగ్గిపోతూ ఉంటుంది. ఆ బ్యాటరీ తగ్గకుండా ఉండేందుకు రాయల్ టీమ్.. ఓజీ టీమ్ దగ్గరున్న చార్జర్‌ను వినియోగించుకోవాలి. ఈ క్రమంలో అవినాష్.. నబీల్‌కు తెలియకుండానే అతడి దగ్గరున్న చార్జర్‌ను వాడేశాడు. హౌస్ లోపల ఉన్న ఫుడ్ కోసం ఓజీ టీమ్, గార్డెన్ ఏరియాలో ఉన్న వాష్‌రూమ్స్ కోసం రాయల్ టీమ్ ఏమైనా కాంప్రమైజ్ అవుతారా? లేదంటే గొడవలు పడైనా సరే వాటిని ఉపయోగించుకుంటారా? అనేది నేటి ఎపిసోడ్లో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!
బిగ్‌బాస్ 8లో ఏడో వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగింది. ఎంతలా అంటే పృథ్వీ నిజంగా పిచ్చోడిలా ప్రవర్తించాడు. ప్రేరణని టార్గెట్ చేశాడు. అవినాష్ వ్యక్తిగత విషయాలు తీసి దారుణంగా మాట్లాడాడు. ఇంతా చేశాడు గానీ ఏదైనా గట్టిగా అనుకున్నాడో అది మాత్రం సాధించలేకపోయాడు. వీళ్లిద్దరి వల్ల హరితేజ అడ్డంగా బుక్ అయింది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో (అక్టోబర్ 15) ఏమేం జరిగిందనేది హైలైట్స్‌లో చూద్దాం.యష్మి డబుల్ ఫేస్ఏడో వారం నామినేషన్స ప్రక్రియ మధ్యలో ఆగడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. మళ్లీ అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. టోపీని ప్రేరణకి దక్కకుండా చేయాలని నయని, పృథ్వీ అడ్డుకున్నారు. ప్రేరణకి సపోర్ట్ చేస్తూ, వీళ్లని డిఫెండ్ చేసే క్రమంలో యష్మి కింద పడిపోయింది. తనకు కాలు విరిగినా పర్లేదు కానీ ఏది కరెక్టో దానివైపే నిలబడతా అని చెప్పింది.యష్మి కన్ఫ్యూజన్ మాటలుపోడియం పైకి తేజ, నబీల్ వచ్చారు. నబీల్.. తేజని నామినేట్ చేశాడు. సొంత ఫ్రెండ్‌ని చెప్పి ప్రేరణని నామినేట్ చేస్తానని యష్మి చెప్పిందని, ఇది తనకు నచ్చలేదని యష్మిని నామినేట్ చేశాడు. అయితే యష్మి.. ఫ్రెండ్ అనే ముసుగు వేసుకుని మరీ ప్రేరణని మోసం చేస్తోంది అని, యష్మిది డబుల్ స్టాండర్డ్ అని చెప్పుకొచ్చాడు. ఈ హంగామా అంతా కాసేపు నడిచింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చేసిన కంటెస్టెంట్.. అదే కారణం!)టార్గెట్ తేజఓజీ క్లాన్ అందరూ కలిసి తేజని టార్గెట్ చేయాలనుకున్నారు. నిఖిల్ చాలా తెలివిగా తన క్లాన్ అందరికీ ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో పోడియంపైకి వచ్చిన విష్ణుప్రియ.. నయని పావనిని రివేంజ్ నామినేషన్ చేయాలనుకుంటున్నానని చెప్పింది. ఇదంతా చెల్లదు అని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే ఇదంతా తనని టార్గెట్ చేయడానికే అని తేజ బయటపెట్టాడు. విష్ణుప్రియ డమ్మీ నామినేషన్ వేస్తే.. పక్కనోళ్లు తన పేరు చెబుతారని.. అలా తను నామినేషన్ లోకి వచ్చేలా ఇదంతా చేస్తున్నారని ఓజీ క్లాన్ బండారాన్ని తేజ బయటపెట్టాడు. కానీ నిఖిల్, తేజ పేరే చెప్పాడు. టోపీ ఉన్న హరితేజ.. తేజ పేరునే నామినేట్ చేస్తూ ఫైనల్ చేసింది. దీని తర్వాత గౌతమ్ మరోసారి పసలేని వాదన తీసుకొచ్చి నబీల్ పేరు చెప్పాడు. కాస్త హంగామా నడిచిన తర్వాత ఊహించని విధంగా నబీల్ నామినేట్ అయ్యాడు.పృథ్వీ చీప్ కామెంట్స్బిగ్బాస్ ఎపిసోడ్స్ ఏం చూడకుండా తనని గతవారం అవినాష్ నామినేట్ చేశాడని, అందుకే ఈ వారం అతడిని నామినేట్ చేస్తున్నానని పృథ్వీ చెప్పాడు. దీంతో అవినాష్ నిజాయతీగా తన వాదన వినిపించాడు. షూటింగ్స్ వల్ల తాను అన్ని ఎపిసోడ్స్ చూడలేదని, ఈ విషయాన్ని నాగ్ సర్కి కూడా చెప్పానని అన్నాడు. తన భార్య ఎపిసోడ్స్ అన్నీ చూసి తనకు కొన్ని పాయింట్స్ చెప్పిందని, వాటి వల్ల పృథ్వీని నామినేట్ చేశానని అన్నాడు. అలాంటప్పుడు మీరెందుకు వచ్చారు, మీ భార్యనే ఇక్కడకు రావాల్సింది అని పృథ్వీ చీప్ కామెంట్స్ చేశాడు. వైఫ్ మ్యాటర్ తీయకు అని అవినాష్ ఫుల్ సీరియస్ అయ్యాడు.నోరు జారిన పృథ్వీషూటింగ్స్లో బిజీగా ఉండటం తాను చూడలేకపోయానని అవినాష్ ఎంత చెబుతున్నా సరే పృథ్వీ ఊరుకోలేదు. సరికదా సైకోలా ప్రవర్తించి బిగ్‌బాస్‌లోకి వచ్చేందుకు షూటింగ్స్ లేవా? అని వెటకారంగా మాట్లాడాడు. పృథ్వీ పనేం చేయట్లేదని, గంగవ్వ కూడా అదే పాయింట్ చెప్పిందని గుర్తుచేశాడు. 'గంగవ్వ అని ఎందుకు చెప్తావ్ రా' అని పృథ్వీ అనేసరికి.. 'రేయ్ రా అనకు' అని అవినాష్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నేను అలానే అంటాను అని పృథ్వీ పైపైకి వచ్చాడు. అలా తన్నుకోవడం ఒక్కటే తక్కువైంది అనే రేంజులో తగాదా పడ్డారు. మరో పోడియంపై నిలబడ్డ నయని.. విష్ణుప్రియ పేరు చెప్పింది. కానీ పాయింట్లో బలం లేకపోయింది. దీంతో పృథ్వీ చెప్పిన అవినాష్ పేరునే పరిగణలోకి తీసుకుంది.అనుకున్నది జరగలేఈ తతంగం అంతా పూర్తయిన తర్వాత గౌతమ్, నిఖిల్, పృథ్వీ, యష్మి, టేస్టీ తేజ, నబీల్, మణికంఠ నామినేషన్స్‌లో ఉన్నారని.. అలానే తక్కువసార్లు టోపీ పట్టుకున్న కారణంగా ప్రేరణ నామినేట్ అయిందని బిగ్‌బాస్ ప్రకటించాడు. ఓజీ క్లాన్ దగ్గర ఇమ్యూనిటీ ఉన్నందున ఒకరిని సేవ్ చేసుకోవచ్చని కానీ మరొకరిని ఆ స్థానంలో పెట్టాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో అవినాష్.. తన బదులు హరితేజ పేరుని చెప్పాడు. అలా ఈసారి ఓజీ క్లాన్ నుంచి ఆరుగురు.. రాయల్ క్లాన్ నుంచి ముగ్గురు నామినేషన్స్‌లోకి వచ్చారు.పృథ్వీ మనిషి కాదు సైకో?రెండు రోజుల పాటు జరిగిన నామినేషన్స్‌లో అందరూ గేమ్ పరంగా ఎంత ఉండాలో అంతలా కనిపించారు. పృథ్వీ మాత్రం సైకోలా ప్రవర్తించాడు. ప్రేరణ తనని కావాలనే టార్గెట్ చేసిందని, ఆమెని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక అవినాష్‌తో అయితే కనీసం బుర్ర లేని పిచ్చోడిలా ప్రవర్తించాడు. ఇలాంటి వాడిని అసలు బిగ్‌బాస్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడో? ప్రేక్షకుల మైండ్ ఎందుకు కలుషితం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. -
అవినాష్ భార్యపై పృథ్వీ చీప్ కామెంట్స్.. మరీ ఇలానా?
బిగ్‌బాస్ 8 షో మరీ హద్దులు దాటేస్తున్నట్లు కనిపిస్తుంది. మాట్లాడుకోవడం, తన్నుకోవడం అనేది గేమ్స్ వరకు అయితే పర్లేదు. కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లడం మాత్రం కరెక్ట్ కాదు. మంగళవారం ఎపిసోడ్లో అలాంటి గొడవే జరిగింది. నామినేషన్ సందర్భంగా అవినాష్ భార్య గురించి పృథ్వీ చీప్ కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఫ్రెండ్షిప్ అనే పదాన్ని తీసి మరీ తనని బాధపెట్టారని యష్మి ఏడ్చింది. దీంతో ప్రేరణ ఆమెని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇక గ్రూప్‌గా ఫామ్ అయిన నిఖిల్.. నబీల్, పృథ్వీ, మణికంఠతో మాట్లాడుతూ తేజని ఎలాగైనా సరే టార్గెట్ చేయాలని అన్నాడు. గుర్రం సౌండ్ వినిపించగానే యష్మి టోపీ లాగేసుకుని ప్రేరణకి ఇచ్చింది. పోడియంపై నిలబడ్డ విష్ణుప్రియ.. రివేంజ్ పేరుతో నయని పావనిని నామినేట్ చేయాలనుకుంది. కానీ రివేంజ్ అనేది ఇక్కడ కుదరదని బిగ్‌బాస్ అల్టిమేటం ఇచ్చేశాడు. ఇదంతా చూసిన తేజ.. ఓజీ క్లాన్ బండారాన్ని బయటపెట్టాడు. తనని కావాలనే టార్గెట్ చేస్తున్నారని.. ఓజీ vs తేజ చేసేస్తున్నారని, ఇక మీ ఆట మీరు ఆడండి, నా ఆట నేను ఆడతా అని తేజ.. వాళ్లకు సవాలు విసిరాడు.(ఇదీ చదవండి: బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక.. ప్రభుత్వంతో కలిసి)తర్వాత వచ్చిన పృథ్వీ.. ప్రోమో చూసి తను టాస్క్‌లు ఆడుతున్నానని చెప్పడం అస్సలు నచ్చలేదని అవినాష్‌ని నామినేట్ చేశాడు. దీంత ఇద్దరి మధ్య తగువు మొదలైంది. 'నేను చూసిన ఎపిసోడ్స్‌లో రెండు మూడు టాస్క్‌లు తప్పితే ఎక్కడా కనిపించలేదు. మా వైఫ్ చూసింది' అని అవినాష్ అనగానే.. మరి అలాంటిప్పుడు మీ భార్యనే బిగ్‌బాస్‌కి రావాల్సింది, మీరెందుకు వచ్చారు అని పృథ్వీ నోరు జారాడు. వైఫ్ టాపిక్ తీయకు అని అవినాష్ సీరియస్ అయ్యాడు.సోఫాలు కూర్చోవడం తప్పితే ఇంకేం చేయవ్ అని అవినాష్ అనేసరికి.. కామెడీ తప్ప ఇంకేం చేశావ్ నువ్వు అని పృథ్వీ అన్నాడు. పోయిన వారం నేను ఏ పాయింట్ చెప్పానో, ఈ వారం కూడా గంగవ్వ అదే పాయింట్ చెప్పిందని అవినాష్ అనేసరికి.. 'గంగవ్వ పేరు ఎందుకు చెబుతావ్ రా' అని పృథ్వీ మరోసారి నోరు జారాడు. 'రేయ్ రా అనకు' అని అవినాష్ వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చాడు. 'ఇది నీ సంస్కారం. బిగ్‌బాస్‌కి వచ్చావ్ కదా నేర్చుకో' అవినాష్-పృథ్వీ ఒకరిపై ఒకరు వెళ్లారు.(ఇదీ చదవండి: 'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత) -
సిగరెట్ తాగడం తప్ప ఏం చేశావన్న గంగవ్వ.. ఆ కోపం ప్రేరణపై..!
బిగ్‌బాస్ హౌస్‌లో ఏడోవారం నామినేషన్స్ జరిగాయి. అయితే కిల్లర్ గర్ల్స్ చేతికి నామినేషన్స్‌ను ఫైనల్ చేసే అధికారం ఇచ్చారు. మరి ఆ కిల్లర్ గర్ల్స్ ఎవరు? వీళ్లు ఎవర్ని నామినేట్ చేశారు? ఎవర్ని సేవ్ చేశారనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే!ఆ ఇద్దరికీ స్పెషల్ డ్రెస్గౌతమ్, తేజ, పృథ్వీ.. ఈ ముగ్గురిలో గౌతమ్ సూట్ కేసు మాత్రమే వెనక్కు వచ్చింది. దీంతో మిగతా ఇద్దరు బిగ్‌బాస్ ఇచ్చిన చిరిగిన బస్తా డ్రెస్ వేసుకున్నారు. ఆ వెంటనే నామినేషన్స్ మొదలయ్యాయి. బిగ్‌బాస్ ప్రేరణ, హరితేజను కిల్లర్ గర్ల్స్‌గా నియమించాడు. గుర్రం సౌండ్ వినిపించినప్పుడు ప్లాట్‌ఫామ్స్‌పై నిలబడే ఇద్దరు హౌస్మేట్స్ ఇంటిసభ్యులను నామినేట్ చేస్తారు. అందులో ఒకరి నామినేషన్‌ను అంగీకరించి, మరొకరి నామినేషన్ తిరస్కరించే హక్కు హ్యాట్ మొదట పట్టుకున్న కిల్లర్ గర్ల్‌కు ఉంటుంది.అతిగా రియాక్టయిన అవినాష్మొదటగా రోహిణి.. నీకు బాధేసినప్పుడు మైక్ విసిరేయడం నచ్చలేదని గౌతమ్‌ను నామినేట్ చేసింది. అందుకు గౌతమ్ స్పందిస్తూ.. అవినాష్ చేసిన కామెడీ తనకు బుల్లీయింగ్లా ఉందన్నాడు. దీంతో అవినాష్ మధ్యలో కలగజేసుకుంటూ కామెడీ తీసుకోకపోతే షోకి రావొద్దంటూ చొక్కా విప్పి మరీ ఫైర్ అయ్యాడు. ఇది కామెడీ షో కాదని గౌతమ్ అనడంతో.. అంతలోనే సారీ భయ్యా, తెలియక అనేశాను.. అంటూ అవినాష్ చేతులు జోడిస్తూ కాస్త అతిగా రియాక్టయ్యాడు. నిఖిల్.. తేజ యాక్టివ్‌గా లేడని నామినేట్ చేశాడు.ఏడ్చేసిన గౌతమ్హ్యాట్ అందుకున్న కిల్లర్ గర్ల్ ప్రేరణ.. రోహిణి చెప్పిన పాయింట్లకు ఏకీభవిస్తూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. అయిపోయినదాన్ని (ట్రోలింగ్ గుర్తు చేస్తున్నారంటూ..) మళ్లీ మళ్లీ తీసుకొస్తున్నారంటూ గౌతమ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు బుల్లీయింగ్ అనడం ఎంత పెద్ద తప్పు? అసలు ఆ పదానికి అర్థం తెలుసా? అని రోహిణి, అవినాష్ సీరియసయ్యారు. రెండో రౌండ్లో నిఖిల్, గంగవ్వ ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్నారు. నిఖిల్ మరోసారి తేజను నామినేట్ చేశాడు. ప్రేరణపై పీకలదాకా కోపం..గంగవ్వ.. నాతో మాట్లాడట్లేదు, హోటల్ టాస్క్‌లో పెద్దగా ఆడలేదు.. సిగరెట్ తాగుతూ కూర్చుంటావంటూ పృథ్వీని నామినేట్ చేసింది. ఇద్దరి పాయింట్లు విన్న ప్రేరణ.. పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో ప్రేరణపై పగ పెంచుకున్న పృథ్వీ.. ఆమె హ్యాట్ పట్టుకోనివ్వకుండా అడ్డుకున్నాడు. తను నామినేట్ అవ్వాల్సిందేనని బలంగా కోరుకున్నాడు. అతడికి సపోర్ట్‌గా నయని కూడా దిగింది. ప్రేరణ నామినేట్ అవడమే తనకూ కావాలంది.నీ గ్రాఫ్ పడిపోయిందిపృథ్వీకి నిఖిల్ సర్ది చెప్పాలని చూశాడు కానీ వర్కవుట్ కాలేదు. నాకు అన్యాయం జరిగింది.. ఇల్లు మొత్తం అడ్డొచ్చినా నేను తను నామినేట్ అయ్యేలా చూస్తానన్నాడు. అది విని ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. మూడో రౌండ్లో యష్మి.. హోటల్ టాస్క్‌లో పెద్దగా పర్ఫామ్ చేయలేదంటూ తేజ పేరు చెప్పింది. నాగమణికంఠ.. గ్రాఫ్ పడిపోయిందని, హోటల్ టాస్క్‌లో ఫన్ చేయలేదని నిఖిల్ పేరు చెప్పాడు. హ్యాట్ పట్టుకున్న హరితేజ.. నిఖిల్‌ను నామినేషన్స్‌లో వేసింది.యష్మి ఎమోషనల్నాలుగో రౌండ్లో అవినాష్.. టాస్కుల్లో వీక్ అనిపించాడంటూ మణికంఠ పేరు చెప్పాడు. గౌతమ్.. హోటల్ టాస్క్‌లో పెద్దగా ఆసక్తి చూపించలేదంటూ విష్ణుప్రియ పేరు చెప్పాడు. పృథ్వీ.. ప్రేరణను అడ్డుకోవడంతో మరోసారి హరితేజ హ్యాట్ పట్టుకుంది. ఈమె మణికంఠను నామినేట్ చేసింది. ఇక పృథ్వీ ప్రవర్తన చూసి బెంబేలెత్తిపోయిన యష్మి అది కరెక్ట్ కాదంటూ ఏడ్చేసింది. ఈ నామినేషన్స్ రేపటి ఎపిసోడ్‌లోనూ కొనసాగనున్నాయి. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కమెడియన్లని అవమానించిన గౌతమ్? రెచ్చిపోయిన అవినాష్
బిగ్‌బాస్ షోలో మిగతా వాటి సంగతి పక్కనబెడితే కాస్తంత కామెడీ ఉంటేనే జనాలు చూస్తారు. ఈసారి అది లేకపోవడం వల్లే గత సీజన్లలో పాల్గొన్న పలువురిని వైల్డ్ కార్డ్స్ పేరిట మళ్లీ తీసుకొచ్చారు. ఉన్నంతలో రోహిణి, అవినాష్ కాస్త ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గౌతమ్ వాళ్లిద్దరినీ అవమానించేలా కామెంట్స్ చేశాడు. ఇదేం కామెడీ షో కాదు అని చెబుతూనే గొడవ చేశాడు. దీంతో అవినాష్ రెచ్చిపోయాడు.గతవారం ఫన్ టాస్క్ సందర్భంగా గౌతమ్‌ని ఇమిటేట్ చేసిన అవినాష్. అశ్వద్ధామ 2.0 అని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ గౌతమ్ అది ఇబ్బందిగా అనిపించింది. దీంతో మైక్ తీసి నేలకేసి కొట్టాడు. అయితే అప్పుడు మైక్ తీసి పడేయడం తనకు నచ్చలేదని కారణం చెప్పిన రోహిణి.. గౌతమ్‌ని ఈ వారం నామినేట్ చేసింది. కామెడీ, మరేదైనా గానీ బుల్లీయింగ్ (పరోక్షంగా బాధపెట్టడం) లాంటిదని గౌతమ్ నోరు జారాడు. ఇది చాలా పెద్ద మాట అని హౌస్మేట్స్ అందరూ సీరియస్ అయ్యారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: ఆ కల నెరవేరలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సీత)బుల్లీయింగ్ అంటే ఓ మనిషికి నచ్చని విషయాన్ని మళ్లీ మళ్లీ గుచ్చి గుచ్చి చెబుతారా అని గౌతమ్ ఆవేశపడిపోయాడు. పక్కనే ఉన్న అవినాష్ ఇక తట్టుకోలేకపోయాడు. మాకు తెలీదు తెలీదు తెలీదు అని ఫైర్ అయ్యాడు. మేం కావాలని చెయ్యలేదు, వేలు పెట్టి కెలకలేదు అన్నాడు. దీంతో ఇదేం కామెడీ షో కాదు, మనం వచ్చింది బిగ్‌బాస్ షోకి అని గౌతమ్ మరోసారి మాట తూలాడు. ఫలితంగా అవినాష్ రెచ్చిపోయాడు.'కామెడీ తీసుకోలేనప్పుడు డబ్బులు తీసుకోకండి. షోకు రాకండి. కామెడీ అంటే ఏమనుకుంటున్నారో' అని అవినాష్ తన జాకెట్ విసేరేశాడు. గౌతమ్‌ని అశ్వద్ధామ 2.0 అనకండ్రా, మీకు దండం పెడతాను అని కెమెరా చూస్తూ అతడి ఫ్యాన్స్‌కి చెప్పాడు. పక్కనే ఉన్న గౌతమ్‌కి క్షమాపణలు కూడా చెబుతూనే సారీ భయ్యా, నాకు తెలీదు అని అన్నాడు. ఇదంతా చూస్తుంటే కామెడీ చేయడం ఏమో గౌతమ్‌కి తీరా చేస్తేనేమో తీసుకోలేకపోతున్నాడు. చూస్తుంటే ఈ గొడవే సోమవారం ఎపిసోడ్ అంతా ఉండేలా కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు) -
నబీల్ ఇమ్మెచ్యూర్ అన్న ప్రేరణ.. మణికి గోల్డెన్ ఛాన్స్
బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన హోటల్ టాస్క్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా? అని ఎదురు చూశారు. అంత నీరసంగా సాగింది. టాస్క్ అయిపోగానే బెస్ట్ పర్ఫామర్లను సెలక్ట్ చేయాలన్నాడు. వీరే మెగా చీఫ్ కోసం పోటీపడతారని పేర్కొన్నాడు. ఓజీ టీమ్‌లో మెగా చీఫ్ కంటెండర్‌ను సెలక్ట్ చేసే క్రమంలో ప్రేరణ, నబీల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇమ్మెచ్యూర్..నీ మైండ్‌లో నాకు వ్యతిరేకంగా ఆలోచన పెట్టుకున్నావ్.. అందులే అలా ప్రవర్తిస్తున్నావ్ అని ప్రేరణ అనేసింది. నీ మాట వినకుండా ఆయన చెప్పింది మాత్రమే చేసినప్పుడు నాది తప్పు అను అని నబీల్ రిప్లై ఇచ్చాడు. అయినా తగ్గని ప్రేరణ.. వెటకారం వద్దు.. నువ్వు నన్ను నమ్మట్లేదు.. నువ్వు ఇమ్మెచ్యూర్ అనేయడంతో నబీల్ నేను ఇమ్మెచ్యూర్ కాదని అరిచాడు.బెస్ట్ పర్ఫామర్లు ఎవరంటే?ఓజీ టీమ్ నుంచి మణికంఠ, రాయల్ టీమ్ నుంచి అవినాష్, రోహిణి, హరితేజ, నయని పావని, మెహబూబ్, గౌతమ్‌లను బెస్ట్ పర్ఫామర్లుగా ఎంపిక చేశారు. తమ టీమ్‌లోని మిగతా ఇద్దరు కూడా బానే చేశారని అవినాష్ అనగా.. అలాంటప్పుడు ఫస్ట్ తమ పేరెందుకు చెప్పలేదని గంగవ్వ నిలదీసింది. కడిగి పారేసిన గంగవ్వనేను మహారాణి అయినప్పుడు నా దగ్గరకు వచ్చి ఎవరైనా సేవలు చేశారా? అని ప్రశ్నించింది. అందుకు విష్ణు.. నేను పెరుగన్నం తినిపించా కదా అని గుర్తు చేయగా డబ్బులిస్తే ఆ పని చేశావని గంగవ్వ కౌంటరిచ్చింది. గంగవ్వలో ఈ ఫైర్ చూసి అటు హౌస్మేట్స్, ఇటు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గతాన్ని తల్చుకుని కుంగిపోయిన గౌతమ్.. ఈసారి కప్పు కొడతా!
వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్ కళకళలాడుతోంది. బిగ్‌బాస్ 8లో ప్రస్తుతం 16 మంది ఉన్నారు. వీరితో కలిసి ఫన్ గేమ్ ఆడించాడు. అదే బిగ్‌బాస్ హోటల్. ఈ టాస్క్‌లో పాతవాళ్లంతా హోటల్ సిబ్బందిగా, కొత్తవాళ్లంతా గెస్టులుగా ఉన్నారు. మరి ఈ టాస్క్ ఏమేరకు వర్కవుట్ అయిందో నేటి (అక్టోబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఫన్ టాస్క్బిగ్బాస్ అమ్మాయిలను ఒక టీమ్‌గా, అబ్బాయిలను ఒక టీమ్‌గా విభజించి ఫన్నీ టాస్కు ఇచ్చాడు. ఆడాళ్ల టీమ్‌కు ముక్కు అవినాష్, అబ్బాయిల టీమ్‌కు రోహిణిని లీడర్‌గా పెట్టారు. గేమ్ ఏంటంటే.. టీమ్సభ్యులంతా వారి నోటిని నీటితో నింపుకోవాలి. వీళ్లను ఇతర టీమ్‌లోని వారు నవ్వించి ఆ నీళ్లు బయటకు వచ్చేలా చేయాలి. ఈ గేమ్‌లో అబ్బాయిలను నవ్వించే క్రమంలో అవినాష్.. మణికంఠ దగ్గరకు వెళ్లి పాట పాడాడు. కప్పు కొడతా: గౌతమ్తర్వాత గౌతమ్ దగ్గరకు వెళ్లి అశ్వత్థామ 2.0 అని ఇమిటేట్ చేశాడు. అది విని హర్టయిపోయిన గౌతమ్.. అయిపోయినదాన్ని మళ్లీ మళ్లీ తీసి ఇరిటేషన్ తెప్పించొద్దు. వెళ్లిపోమంటే వెళ్లిపోతా.. అని మైక్ విసిరేసి ఇంట్లోకి వెళ్లి ఏడ్చాడు. నాన్న ఐయామ్ సారీ, నీతో గొడవపడి మాట్లాడకుండా వచ్చేశా.. కానీ ఈసారి నన్ను నేను నిరూపించుకుంటాను. కప్పు కొడతాను అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు.ఉప్పు గెల్చుకున్న అవినాష్, రోహిణిమరోవైపు తనను నవ్వించమని అవినాష్, రోహిణికి బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. ఎంటర్టైన్మెంట్ వీరికి కొట్టిన పిండి కావడంతో ఇరగదీశారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్‌బాస్.. ఇంటిసభ్యులు రేషన్‌లో మర్చిపోయిన ఉప్పును కానుకగా ఇచ్చాడు. ఇక తర్వాతి రోజు ఉదయం విష్ణు ధ్యానం చేస్తుంటే గంగవ్వ చెడగొట్టేందుకు ప్రయత్నించడం భలే సరదాగా అనిపించింది. అనంతరం బిగ్‌బాస్ హోటల్ టాస్క్ పెట్టాడు. ఇందులో ఓల్డ్ కంటెస్టెంట్లు హోటల్ సిబ్బంది కాగా రాయల్ టీమ్ అతిథులుగా ఉంటారు. ఎవరెవరు ఏ పాత్రలో..పాత్రల విషయానికి వస్తే.. నబీల్.. అప్పుల్లో కూరుకుపోయిన హోటల్ యజమాని, ప్రేరణ.. మతిమరుపు మేనేజర్, నిఖిల్.. హెడ్ చెఫ్, సీత.. అసిస్టెంట్ చీఫ్, పృథ్వీ.. అందరినీ ఫ్లర్ట్ చేసే గార్డ్, విష్ణు.. పృథ్వీతో లవ్‌లో ఉండే పర్సనల్ బట్లర్, యష్మి.. హౌస్ కీపింగ్, మణికంఠ.. హౌస్ కీపింగ్(దొంగిలించడం, దాన్ని తిరిగిచ్చేయడం)గా వ్యవహరిస్తారు.తికమక మనిషిగా హరితేజగంగవ్వ.. రాజవంశానికి చెందిన మహారాణి, నయని పావని.. మహారాణి అసిస్టెంట్, అవినాష్.. సూపర్‌స్టార్, రోహిణి- పొగరుబోతు రిచ్ కిడ్ (అవినాష్ గర్ల్‌ఫ్రెండ్), మెహబూబ్.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ (రోహిణి తండ్రి అపాయింట్ చేస్తాడు) హరితేజ.. మెహబూబ్ అసిస్టెంట్(తికమక మనిషి), తేజ.. పాపులర్ ఫుడ్ బ్లాగర్, గౌతమ్.. పోలీసుల నుంచి దాక్కుని తిరుగుతున్న క్రిమినల్‌గా పాత్రలు పోషించారు.మణిని ఆడుకున్న రోహిణిటాస్కు ప్రారంభానికి ముందే సీత.. ఒక పర్సు కొట్టేయడం గమనార్హం. ఈ టాస్కులో హౌస్మేట్స్ తమ పర్ఫామెన్స్ చూపించారు. నన్నెవరూ పట్టించుకోవట్లేదని రోహిణి అనగా.. మణి.. నువ్వో మాడియపోయిన కందిపప్పు, మీ ఆయనో పెసరపప్పు అని సెటైర్ వేశాడు. దీంతో రోహిణి సీరియస్ అయింది.. ఒకసారి, రెండుసార్లు ఓకే.. కానీ మూడోసారి ఒప్పుకోను. నీ క్యారెక్టర్లో నుంచి బయటకు వచ్చి నీకు నచ్చినట్లు మాట్లాడటం ఫన్ కాదు.. అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతలోనే జోక్ చేశానంటూ నవ్వేసింది. నీ కళ్లలో భయమే నాకు కావాలంటూ నవ్వుతూ చెప్పడంతో మణి ఊపిరి పీల్చుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!
బిగ్‌బాస్ సీజన్ ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఈ రియాలిటీ షో మొదలై ఇన్ని రోజులవుతున్నా ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఒక్క విష్ణు ప్రియ మినహాయిస్తే అంతా కొత్త వాళ్లే కావడంతో షో చప్పచప్పగా సాగిపోతోంది. అందుకే బిగ్‌బాస్ సరికొత్త ఐడియాతో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టేశాడు.అందులో భాగంగానే గతంలో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్‌గా అలరించిన వారిని ఏరికోరి మరీ సెలెక్ట్ చేసుకున్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీల్లో మాత్రం కొత్తవాళ్లకు చోటివ్వలేదు. బుల్లితెర ఇండస్ట్రీలో బాగా ఫేమ్ ఉన్నవాళ్లనే పట్టుకొచ్చారు. హరితేజ, టేస్టీ తేజ, గంగవ్వ, ముక్కు అవినాష్, గౌతమ్, నయని పావని, మెహబూబ్, రోహిణి లాంటి హౌస్‌లోకి తోసేశారు. ఇక నుంచైనా అభిమానులను ఆకట్టుకునేందుకు బిగ్‌బాస్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.(ఇది చదవండి: Bigg Boss 8: ఏడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ముక్కు అవినాష్)వైల్డ్ కార్డ్ ద్వారా ఎనిమిది మంది హౌస్‌లో అడుగుపెట్టాక మొదటి ప్రోమో విడుదలైంది. ఇందులో గంగవ్వ హౌస్‌లో నవ్వులు పూయించారు. రోహిణి- గంగవ్వ మధ్య ఫన్నీ సంభాషణ నడించింది. ఇక తొలిరోజే ముక్కు అవినాశ్ అడ్డంగా బుక్కయ్యాడు. మొదటి రోజే పాత్రలు క్లీన్ చేసే పనికి పూనుకున్నాడు. నేనేదో యుద్ధానికి పోతున్నట్లు అందరూ క్లాప్స్ కొడుతున్నారంటూ కామెడీ పండించాడు. ఈ ప్రోమో చూస్తే కొత్త, పాత వాళ్లతో కలిసి బిగ్‌బాస్ హౌస్ కళకళలాడుతోంది. ఇక నామినేషన్స్ ప్రక్రియ మొదలైతే అసలు కథ స్టార్ట్ అవుతుంది. -
Bigg Boss 8: టాప్ 5వ స్థానంలో అవినాష్ ఎలిమినేట్
ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న ఆశతో ఎంతోమందిలాగే ఇతడూ కృష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాకపోయినా చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా ఓ కామెడీ షోలో ఛాన్స్ రావడంతో అతడి దశ తిరిగిపోయింది. ఎనిమిదేళ్లలోనే టీం లీడర్‌గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే మిమిక్రీలు చేసే ఈ జగిత్యాలవాసికి బిగ్‌బాస్ నాలుగో సీజన్లో ఆఫర్ వచ్చింది. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే.. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు.అప్పటికే అమ్మ అనారోగ్యం, కొత్త ఇంటి లోన్ వల్ల పీకల్లోతు అప్పులో ఉన్నాడు. ఈ అప్పులు తీర్చడం కోసం ఆ ఫైన్ కట్టి మరీ బిగ్‌బాస్‌కు వెళ్లాడు. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన అవినాష్.. 12 వారాలు హౌస్‌లో ఉన్నాడు. ఎంటర్టైనర్ అని నిరూపించుకున్నాడు. బిగ్‌బాస్ ద్వారా అప్పులు తీర్చేసి మరింత ఎదిగాడు. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచి తానేంటో నిరూపించుకున్న అవినాష్ ఫినాలేలో ఐదో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. -
బిగ్‌బాస్ 8 రీలోడ్: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు ఇమ్యూనిటీ.. వాటే ట్విస్ట్
గత ఏడు సీజన్లకంటే కూడా ఈసారి బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు అత్యధిక టీఆర్పీ వచ్చింది. కానీ కంటెస్టెంట్లు ఆ రేటింగ్‌ను అలాగే కాపాడుకోలేకపోయారు. నెమ్మదిగా షో బోరింగ్‌గా మారుతుండటంతో బిగ్‌బాస్ ఇక లాభం లేదనుకుని పాత సీజన్లలో పాల్గొన్న పలువురినే వైల్డ్ కార్డ్ ఎంట్రీల పేరిట హౌసులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం.. 'బిగ్‌బాస్ గ్రాండ్ రీలోడ్' పేరిట ఎపిసోడ్ ప్రసారమైంది. ఇంతకీ హౌస్‌లోకి వచ్చిందెవరో చూసేయండి..నైనిక ఎలిమినేట్'జవాన్' టైటిల్ సాంగ్, 'గేమ్ ఛేంజర్' నుంచి రీసెంట్గా రిలీజైన 'రా మచ్చా' పాటలకు స్టెప్పులేసి ఆదివారం ఎపిసోడ్‌కి హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే డేంజర్ జోన్లో ఉన్న మణికంఠ, విష్ణుప్రియ, నైనికని నిలబెట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలని ఎలా ఎదుర్కోబోతున్నారో ఎదుర్కోబోతున్నారని హౌస్‌మేట్స్‌ను అడగ్గా వారంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నైనిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో సీత ఎప్పటిలాగే కన్నీటి కుళాయిని ఓపెన్ చేస్తూ బోరున ఏడ్చేసింది.ఎవరికి ఏ ట్యాగ్?స్టేజీపైకి వచ్చిన నైనికని హౌసులో ఎవరు ఎలాంటి వారనేది నాగ్ అడగ్గా.. ప్రేరణ మ్యానిప్యులేటర్, మణికంఠ వెన్నుపోటు పొడిచే వ్యక్తి, విష్ణుప్రియ నకిలీ స్నేహితురాలు, పృథ్వీ అటెన్షన్ సీకర్, నబీల్ అవకాశవాది, సీత నిజమైన ఫ్రెండ్, నిఖిల్ గేమ్ ఛేంజర్, యష్మిది మంద బుద్ధి అని చెప్పుకొచ్చింది.ఉత్తరాలు వచ్చాయ్..ఈ వారం హౌస్మేట్స్ కోసం ఉత్తరాలు వచ్చాయి. కానీ అవి కొందరికి అందకుండానే వెనక్కు వెళ్లిపోయాయి. వాటిని నాగ్ తిరిగి తీసుకొచ్చాడు. సీత, నబీల్, యష్మి, మణికంఠ తమ లెటర్స్ అందుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక హౌస్‌లో ఉన్న ఎనిమిది మంది ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్) టీమ్‌గా, కొత్తగా వచ్చే ఎనిమిది వైల్డ్ కార్డ్స్ రాయల్ టీమ్‌గా ఉంటాయని నాగ్ వెల్లడించాడు.. తొలి వైల్డ్ కార్డ్‌గా హరితేజసీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గలగలా మాట్లాడే ఈమె గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ షో తర్వాత సినిమాల్లో బిజీ అవడమే కాకుండా హోస్ట్‌గానూ అవతారమెత్తింది. అఆ, యూ టర్న్, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే, హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. ఇటీవలే రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది. యాక్టింగ్, యాంకరింగ్ రెండింట్లోనూ ఆరితేరిన ఈమె ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. తనకు నవదీప్.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న వీడియో పంపించారు. అలానే హౌసులోకి వెళ్లేముందు స్టేజీపైకి హరితేజ కూతురుని తీసుకురావడంతో ఆమె ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.రెండో వైల్డ్ కార్డ్‌గా టేస్టీ తేజతేజ అసలు పేరు తేజ్‌దీప్. తెనాలో పుట్టిపెరిగిన ఇతడు 2017లో సాఫ్ట్వేర్ ఉద్యోగం హైదరాబాద్‌లో సెటిలయ్యాడు. చిన్నప్పటినుంచి నటన, సినిమాలంటే ఆసక్తి ఉన్న తేజకు కరోనా సెలవులు కలిసొచ్చాయి. 2020లో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నప్పుడు తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు. ఆ వీడియో యూట్యూబ్‌లో పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేదో బాగుందనిపించి హైదరాబాద్ వచ్చాక అదే కొనసాగించాడు. యూట్యూబర్‌గా తిండి వీడియోలు చేస్తూ బిజీ అయ్యాడు. అలా బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొన్నాడు. తొమ్మిదివారాలపాటు హౌస్‌లో ఉన్నాక షోకి టాటా బైబై చెప్పాడు. ఇప్పుడు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అమ్మ చేసిన పాల తాళికలను నాగార్జున కోసం తీసుకొచ్చాడు. అలానే తేజకి శోభాశెట్టి బెస్ట్ విషెస్ చెప్పింది.మరో రూ.20 లక్షలుసెట్పైకి వచ్చిన స్వాగ్ టీమ్ (శ్రీవిష్ణు, రీతూ వర్మ, దక్ష నగార్కర్) తన సినిమా కబుర్లు చెప్పింది .తర్వాత హౌస్‌లోకి వెళ్లి హౌస్మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్‌తో గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు హరి-తేజ గెలిచి రూ.20 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. అనంతరం మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా నయని పావని హౌస్‌లో అడుగుపెట్టింది.మూడో వైల్డ్ కార్డ్‌గా నయని పావనిఈమె అసలు పేరు సాయిరాజు పావని. టిక్‌టాక్ స్టార్‌గా ఫేమస్. షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్, చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ కనువిందు చేసిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ ఏడో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయిపోయింది. అయితే నయని నెక్స్ట్ సీజన్లో రావడం పక్కా అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సీజన్లో అడుగుపెట్టింది. కాకపోతే మరోసారి వైల్డ్‌కార్డ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఇక శివాజీ.. నయనికి బెస్ట్ విషెస్ చెప్పాడు.నాలుగో వైల్డ్ కార్డ్‌గా మెహబూబ్డ్యాన్స్, యాక్టింగ్ అంటే పిచ్చి. అందుకోసం మెహబూబ్ చేయని ప్రయత్నం లేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల సాఫ్ట్వేర్ కొలువులో చేరినా కళను వదిలేయలేకపోయాడు. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.అలా తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్లో అడుగుపెట్టిన టాస్కుల్లో సత్తా చూపించాడు. కండబలం బాగానే ఉన్నా బుద్ధి బలం తక్కువగా ఉండటంతో ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు. ఇప్పుడు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. ఇక మెహబూబ్ కోసం సొహైల్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలానే నాలుగో సీజన్లో ఎలా అయితే ఆడావో ఈసారి అంతకు మించి ఆడి గెలవాలన్నాడు.'జనక అయితే గనక' మూవీ ప్రమోషన్లో భాగంగా సుహాస్, దిల్ రాజ్ టీమ్ వచ్చారు. సుహాస్, హీరోయిన్ సంగీర్తన హౌసులోకి వెళ్లి ఓజీ, రాయల్ టీమ్స్‌తో గేమ్ ఆడించారు. ఇందులో గెలిచిన సీత-మణికంఠ.. బెడ్ రూమ్, రేషన్ కంట్రోల్ చేసే అధికారాన్ని సొంతం చేసుకున్నారు.ఐదో వైల్డ్ కార్డ్‌గా రోహిణిఒకప్పుడు సీరియల్స్‌లో మెప్పించిన రోహిణి.. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ రచ్చ చేస్తోంది. తన కామెడీ టైమింగ్స్‌తో అందరికీ వినోదాన్ని పంచుతోంది. ఆ మధ్య కాలు సర్జరీ వల్ల కొన్ని నెలలపాటు తెరపై కనిపించలేదు. కానీ కోలుకున్న వెంటనే మళ్లీ స్క్రీన్‌పై ప్రత్యక్షమై నవ్వుల జల్లు కురిపిస్తోంది. బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్న రోహిణి.. మరోసారి ఈ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఇక శివజ్యోతి.. రోహిణి కోసం స్పెషల్ వీడియో పంపింది. హౌసులో కామెడీ లోటు బాగా ఉందని, దాన్ని ఫుల్ ఫిల్ చేయాలంది.ఆరో వైల్డ్ కార్డ్‌గా గౌతమ్ కృష్ణగౌతమ్ కృష్ణ.. బిగ్‌బాస్‌కు రావడానికి ముందు పలు సినిమాలు చేశాడు. కానీ జనాలకు సుపరిచితుడైంది మాత్రం బిగ్‌బాస్ ఏడో సీజన్‌తోనే! చిన్నప్పటినుంచే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. తన కోరికను చంపుకోలేక 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. ఆ మరుసటి ఏడాది ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాడు.బాలీవుడ్‌లోనూ సిద్దూ: ది రాక్‌స్టార్ సినిమా చేశాడు. సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈ డాక్టర్ బాబు గత సీజన్లో సీక్రెట్ రూమ్‌కు వెళ్లాడు. అశ్వత్థామ 2.0 అంటూ భారీ డైలాగులతో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫినాలే వరకు రాలేకపోయాడు. తాజాగా మరోసారి వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.ఏడో వైల్డ్ కార్డ్‌గా అవినాష్ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్న ఆశతో ఎంతోమందిలాగే ఇతడూ కృష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాకపోయినా చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా ఓ కామెడీ షోలో ఛాన్స్ రావడంతో అతడి దశ తిరిగిపోయింది. ఎనిమిదేళ్లలోనే టీం లీడర్‌గా ఎదిగాడు. చిన్నప్పటి నుంచే మిమిక్రీలు చేసే ఈ జగిత్యాలవాసికి బిగ్‌బాస్ నాలుగో సీజన్లో ఆఫర్ వచ్చింది. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే.. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు.ఆర్థిక అవసరాల వల్ల స్నేహితుల సాయం తీసుకుని మరీ ఆ డబ్బు కట్టేసి బిగ్‌బాస్‌కు వెళ్లాడు. వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన అవినాష్.. 12 వారాలు హౌస్‌లో ఉండి ఎంటర్టైనర్ అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడికి శ్రీముఖి ఆల్ ది బెస్ట్ చెప్పింది. అలానే స్టేజీపై మణికంఠ, నబీల్, విష్ణుప్రియలా యాక్ట్ చేసి నవ్వించాడు.ఎనిమిదో వైల్డ్ కార్డ్‌గా గంగవ్వవయసైపోయాక ఏ పనీ చేతకాక ఓ మూలన కూర్చోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పని నిరూపించింది గంగవ్వ. టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చని నిరూపించింది. జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. కానీ ఇప్పుడు తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.తన కట్టుబొట్టు, అమాయకత్వం, గడుసుతనం.. జనాలకు నచ్చేశాయి. బిగ్‌బాస్ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్లో అడుగుపెట్టింది. స్వచ్ఛమైన పల్లెలో బతికిన మట్టిమనిషికి ఏసీలు పడలేదు. ఈ గోస నావల్ల కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది. అయితే సొంతింటి కలను నెరవేర్చుకుంది. తర్వాత సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు మరోసారి ధైర్యం చేసి బిగ్‌బాస్ 8లోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.రాయల్ టీమ్‌కు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ టీమ్‌కు చివరగా మరో గేమ్ ఆడించారు. ఇందులో రాయల్ టీమ్ నుంచి అవినాష్, గంగవ్వ ఆడారు. ఓజీ టీమ్‌పై వీరు విజయం సాధించడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఈ వారం ఇమ్యూనిటీ లభించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్‌లో మూడో వైల్డ్ కార్డ్.. ఎవరో గుర్తుపట్టారా?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌ను రీలోడ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా, ఆదిత్య ఎలిమినేట్ అవగా హౌస్‌లో 9 మంది మాత్రమే మిగిలారు. వీరితో షో లాక్కురావడం కష్టమని భావించిన బిగ్‌బాస్ టీమ్.. రేపు హౌస్‌లోకి ఎనిమిది మంది వైల్డ్‌కార్డ్ ఎంట్రీలను పంపనుంది.గుర్తుపట్టారా?ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను గుర్తుపట్టండి అంటూ టేస్టీ తేజ, రోహిణిల ఫోటోలు షేర్ చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌ను గుర్తుపట్టండి అంటూ హాట్‌స్టార్ ఓ ఫోటో వదిలింది. ఈ ఫోటో చూసిన బిగ్‌బాస్ ప్రియులు అతడెవరో ఇట్టే గుర్తుపట్టేశారు.మరోసారి డాక్టర్‌బాబు రీఎంట్రీగత సీజన్లో రెండుసార్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ బాబు అని చెప్తున్నారు. బిగ్‌బాస్ ఏడో సీజన్లో డాక్టర్ బాబు అలియాస్ గౌతమ్ కృష్ణ పాల్గొన్నాడు. అతడిని ఫేక్ ఎలిమినేషన్ ద్వారా సీక్రెట్ రూమ్‌కు పంపించి తిరిగి హౌస్‌లోకి వెళ్లనిచ్చారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హౌస్‌లో అడుగుపెట్టబోతున్నాడు. నాలుగో వైల్డ్ కార్డ్‌ను గుర్తుపట్టండంటూ బిగ్‌బాస్ టీమ్ మరో ఫోటో రిలీజ్ చేసింది. అది చూసిన నెటిజన్లు.. మెహబూబ్, అవినాష్‌లలో ఎవరో ఒకరు అయి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. On his way to cause trouble ‼️ Who could it be? 🤔#biggbosstelugu8 pic.twitter.com/TSKkS8tkrH— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 5, 2024 All set to cause Chaos 🔥Who could this be? #biggbosstelugu8 pic.twitter.com/RnQinEQDb7— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) October 5, 2024మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 8.కొత్త పోకడ, మాజీ కంటెస్టెంట్లతో వర్కవుట్ అవుతుందా?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డులను తీసుకురావాలన్న ఆలోచన ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాదు. సీజన్ ప్రారంభమయ్యే రోజు కేవలం 14 మందినే హౌస్‌లోకి పంపించి.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని స్పష్టంగా చెప్పేశారు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో చాలామందికి గేమ్ మీదకన్నా కొట్లాటలు, ముచ్చట్ల మీదే ఫోకస్ ఎక్కువగా ఉంది. ఒకరిద్దరికి తప్ప ఎవరికీ విజేత లక్షణాలు లేవు.ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీలువీరితో షో నెట్టుకురావడం కష్టమని భావించిన బిగ్‌బాస్ టీమ్ వైల్డ్‌గా ఉంటే కంటెస్టెంట్లను తీసుకురావాలని ప్లాన్ చేసింది. కొత్తవాళ్లను తీసుకొస్తే వర్కవుట్ అవుతుందో, లేదోనని డౌట్ పడ్డారో ఏమో కానీ పాత సీజన్ల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేశారు. ఒక్కో సీజన్లో నుంచి ఒక్కో ఆణిముత్యాన్ని తీసుకుని హౌస్‌లోకి పంపించనున్నారు. అలా హరితేజ, గంగవ్వ, గౌతమ్ కృష్ణ, నయని పావని, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, మెహబూబ్ దిల్సేను ఎంపిక చేసినట్లు భోగట్టా! హౌస్‌లో ఉన్నవాళ్లతో పోలిస్తే వీళ్లు చాలా బెటర్.గంగవ్వఇకపోతే గంగవ్వను తీసుకురావడమే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బిగ్‌బాస్ నాలుగో సీజన్లో గంగవ్వతోనే ఐదు వారాలు ఆటను నెట్టుకొచ్చారు. అయితే ఏసీ పడట్లేదు, హౌస్‌లో ఉండలేను, నన్ను పంపించండి మహాప్రభో.. అని బతిమాలడంతో ఆమెను ఎలిమినేట్ చేసేశారు. కానీ సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న కోరికతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గంగవ్వ కలను నాగార్జున సాకారం చేశాడు. ప్రస్తుతం హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మాజీ కంటెస్టెంట్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట! (చదవండి: బిగ్‌బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆదిత్య ఔట్)ముచ్చటగా మూడోసారి..అందుకే గంగవ్వను బతిమాలో, బలవంతపెట్టోగానీ హౌస్‌కు తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తనవల్ల కాదని గంగవ్వ చేతులెత్తేయడంతో ఆమె స్థానంలో వితికా షెరును తీసుకువస్తున్నారన్నది లేటెస్ట్ టాక్ గౌతమ్ కృష్ణ.. అశ్వత్థామ 2.0 అంటూ అప్పట్లోనే సీక్రెట్‌రూమ్‌కు వెళ్లి వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా మళ్లీ హౌస్‌లో అడుగుపెట్టాడు. ముచ్చటగా మూడోసారి హౌస్‌లోకి వెళ్లబోతున్న ఇతడు ఎలా మెప్పిస్తాడో చూడాలి. రోహిణి, అవినాష్, హరితేజల గురించి భయపడాల్సిన పనేలేదు.నయని పావనిఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో వీళ్లెప్పుడూ ముందుంటారు. గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఒక్కవారంలోనే ఎలిమినేట్ అయింది. కానీ వారం రోజుల్లోనే తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది. మరి ఈసారైనా ఎక్కువవారాలు ఉంటుందేమో చూడాలి. మెహబూబ్ టాస్కులు బాగా ఆడతాడు, తేజ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. మరి ఈ ఎనిమిది మంది హౌస్‌లో ఉన్నవారికి టఫ్ కాంపిటీషన్ ఇస్తారేమో వేచి చూడాలి!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ బుల్లితెరపై ప్రసారమయ్యే షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. జగిత్యాల జిల్లాలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన ఈ కమెడియన్ అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. 2021లో అనూజతో పెళ్లి జరగ్గా గతేడాది ఆమె ప్రెగ్నెన్సీ వార్తను వెల్లడించాడు. కానీ ఈ ఏడాది ప్రారంభంలో అబార్షన్ అయిందని బ్యాడ్ న్యూస్ చెప్పాడు.ఐదు నెలల క్రితమే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ.. నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. 2021లో అనూజతో నా పెళ్లి జరిగింది. గతేడాది తను గర్భవతి. ఐదు నెలల క్రితమే బిడ్డను కోల్పోయాం. తెల్లవారితే డెలివరీ అనగా సడన్‌గా అనూజ కడుపులో బేబీ కదలికలు ఆగిపోయాయి. ఆస్పత్రికి తీసుకెళ్తే బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. ఉమ్మునీరు మింగడం వల్ల అలా జరిగి ఉండొచ్చన్నారు.అర్ధరాత్రి రోడ్డుపై..అప్పుడు నేను స్టేజీపై షూటింగ్లో ఉన్నాను. వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఏదో ఒకటి చేయండని డాక్టర్ కాళ్ల మీద పడ్డాను. హార్ట్‌బీట్ ఆగిపోతే ఏం చేయలేమన్నారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఎటు వెళ్తున్నానో కూడా తెలీకుండా రోడ్డుపై ఏడ్చుకుంటూ ఒంటరిగా సాగిపోయాను. ఆ శిశువును బయటకు తీస్తే అచ్చం నాలాగే ఉన్నాడు. 2.75 కిలోల బరువుతో పుట్టాడు. కానీ వాడిలో ప్రాణం లేదు. ఇప్పటికీ నా భార్య అర్ధరాత్రిళ్లు కుమిలి కుమిలి ఏడుస్తోంది. తొమ్మిది నెలలు మోసింది కదా.. ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతోంది' అని అవినాష్ ఎమోషనలయ్యాడు.చదవండి: Satish Joshi: స్టేజీపై కుప్పకూలి తుదిశ్వాస విడిచిన నటుడు -
‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ రివ్యూ
టైటిల్: మార్కెట్ మహాలక్ష్మినటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులునిర్మాణ సంస్థ: బి2పి స్టూడియోస్ నిర్మాత: అఖిలేష్ కలారుదర్శకత్వం: వియస్ ముఖేష్సంగీతం: జో ఎన్మవ్ నేపథ్య సంగీతం: సృజన శశాంకసినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుములఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘కేరింత’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పార్వతీశం. ఆ సినిమాలో తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(ఏప్రిల్ 19) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రివ్యూ ఏర్పాటు చేసింది చిత్రబృందం. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసే వ్యక్తి(కేదార్ శంకర్) తన కుమారుడు (పార్వతీశం)ని ఇంజనీరింగ్ చదివిస్తాడు. అతని చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌లని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం లభిస్తోంది. లక్షల్లో జీతం సంపాదించే తన కుమారుడికి కోటి రూపాయలు కట్నంగా ఇచ్చే అమ్మాయితోనే పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటాడు తండ్రి. అలాంటి సంబంధాలనే తీసుకొస్తాడు. కానీ పార్వతీశం(ఈ సినిమాలో హీరో పాత్రకి పేరు లేదు) మాత్రం అన్నింటిని రిజెక్ట్ చేసి, మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మి అలియాస్ ‘మార్కెట్ మహాలక్ష్మి(ప్రణీకాన్వికా)ని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు.కానీ మహాలక్ష్మి మాత్రం అతని ప్రేమను తిరస్కరిస్తుంది.దీంతో తనను ఒప్పించేందుకు మార్కెట్లోనే తిష్టవేస్తాడు. చివరకు మహాలక్ష్మి పెళ్లికి ఒప్పుకుందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన పార్వతీశం.. కూరగాయలు అమ్ముకునే అమ్మాయినే ఎందుకు ఇష్టపడ్డాడు? మహాలక్ష్మి ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? తన సంపాదనతోనే బతకాలని మహాలక్ష్మి ఎందుకు డిసైడ్ అయింది? మహాలక్ష్మి కోసం సాఫ్ట్వేర్ కుర్రాడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..?పెళ్లి తర్వాత అమ్మాయి.. అబ్బాయి వాళ్ల ఇంటికే ఎందుకు వెళ్లాలి? అబ్బాయియే అమ్మాయి వాళ్ల ఇంటికి వచ్చి ఎందుకు కాపురం చేయకూడదు? ఉద్యోగ రిత్యా చాలా మంది తమ పెరెంట్స్కి దూరంగా ఉంటున్నారు కదా? మరి అమ్మాయి ఇంటికి వెళ్లి ఉంటే జరిగే నష్టమేంటి? అనే ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరకదు. అది మన సంప్రదాయం అని.. ఫాలో అవ్వడమే తప్ప అలానే ఉండాలని ఎక్కడా రాసి పెట్టిలేదు. ఇదే విషయాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు వియస్ ముఖేష్.పెరెంట్స్కి దూరంగా ఉన్నా సరే..వారి బాగోగులను చూసుకునే బాధ్యత మనదనే విషయం గుర్తుంటే చాలు అనే సందేశాన్ని వినోదాత్మకంగా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఒక ఆడపిల్ల ఇండిపెండెంట్‌గా ఎందుకు బతకాలో ఈ చిత్రం ద్వారా తెలియజేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా, సందేశాత్మకంగా ఉంది కానీ.. ఆ పాయింట్‌ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో పూర్తిగా సఫలం కాలేదు. కథలోని ఎమోషన్ని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యారు. హీరో.. హీరోయిన్ని చూసి ప్రేమలో పడే సీన్‌తో పాటు చాలా సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. అలాగే ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు కూడా అంతగా ఆకట్టుకోవు. అక్కడ మరింత కామెడీ పండించే స్కోప్ ఉన్నా.. సరిగా వాడుకోలేదోమో అనిపిస్తుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం దర్శకుడు బలమైన సన్నివేశాలను రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో ప్రేక్షకులను ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథే ఇది. కట్నం కోసం కొడుకును ఇంజనీరింగ్ చదివించాలని గుమాస్తాగా పని చేసే తండ్రి ఆలోచించే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. హీరో ఎంట్రీ సీన్ కూడా అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం స్లోగా సాగుతుంది. మార్కెట్లో మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడిన తర్వాత వచ్చే కొన్ని సీన్లు వినోదాన్ని అందిస్తాయి. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్ కథంతా మార్కెట్ చుట్టే తిరుగుతుంది. మహాలక్ష్మిని ఇంప్రెస్ చేయడం కోసం హీరో చేసే పనులు పాత సినిమాలను గుర్తు చేస్తాయి. అలాగే చాలా వరకు కథనం నెమ్మదిగా, ఊహకందేలా సాగుతుంది. మహాలక్ష్మి ఎందుకు ఇండిపెండెంట్‌గా బతకాలని అనుకోవాడానికి గల కారణం కన్విన్సింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ బాగుటుంది. ఎవరెలా చేశారంటే.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పార్వతీశం చక్కగా నటించాడు. గత సినిమాలతో పోల్చితే నటన పరంగా ఆయన బాగా మెప్పించాడని చెప్పొచ్చు. ఇక మార్కెట్ మహాలక్ష్మిగా ప్రణికాన్విక ఒదిగిపోయింది. ఇది తనకు తొలి చిత్రమే అయినా.. తెరపై ఆ విషయం తెలియకుండా చక్కగా నటించింది. హీరో ప్రెండ్‌గా ముక్కు అవినాష్ కనిపించేంది కాసేపే అయినా నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ బ్రదర్, తాగుబోతుగా మహబూబ్ బాషా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ‘కోటర్ ఇస్తే చెబుతా’ అంటూ ఆయన పండించిన కామెడీ బాగుంది. కేదార్ శంకర్, జయ, పద్మ, హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా సినిమా పర్వాలేదు. సృజన శశాంక భ్యాగ్రౌండ్ స్కోర్, జో ఎన్మవ్ మ్యూజీక్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
'మార్కెట్ మహాలక్ష్మి' మూవీ ట్రైలర్ వేడుక (ఫొటోలు)
-
'కూరగాయలు అమ్మేదాన్ని ఎలా చేశావ్ బ్రో'.. ఆసక్తిగా ట్రైలర్!
కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం, హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తోన్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వీఎస్ ముఖేష్ దర్శకత్వంలో అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బీ2పీ స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో పార్వతీశం మాట్లాడుతూ.. 'ఫ్రాంక్‌గా చెప్పాలంటే.. కేరింత తర్వాత మంచి హిట్ కొట్టలేకపోయాను. వరుస ఫ్లాప్‌లతో చాలా డిప్రెషన్లో ఉన్నా. అప్పుడే మనోడు ముఖేష్ నాకు కథ చెప్పాడు. మొదట్లో దర్శకుడిపై నమ్మకం లేదు. కానీ 4-5 రోజుల షూటింగ్ తర్వాత అతనిపై నాకు నమ్మకం ఏర్పడింది. కేరింత చిత్రానికి ఎంత మంచి పేరు వచ్చిందో అదే విధంగా మార్కెట్ మహాలక్ష్మికి కూడా వస్తుందని నమ్ముతున్నా.' అని అన్నారు. హీరోయిన్ ప్రణీకాన్విక మాట్లాడుతూ..'తెలుగులో ఇది నా మొదటి సినిమా. సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ని చూస్తున్నా. మంచి టాలెంట్‌ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారు. మార్కెట్ మహాలక్ష్మిలో నన్ను ఆదరిస్తారని నమ్మకం ఉంది' అని అన్నారు. ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. "మార్కెట్ మహాలక్ష్మిలో నేను రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా. పార్వతీశం, ప్రణీకాన్వికతో నా కాంబినేషన్ సీన్స్ నవ్విస్తాయి. దర్శకుడు నా క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. మార్కెట్ మహాలక్ష్మిని థియేటర్లలో చూసి మా టీమ్‌కి సపోర్ట్ చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతకి థాంక్స్" చెప్పారు. డైరెక్టర్ వీఎస్ ముఖేష్' మాట్లాడుతూ.. ‘నేను కథ రాసుకున్నప్పుడు టైటిల్ వెంటనే తట్టింది మార్కెట్ మహాలక్ష్మి. అప్పుడే ఫిక్స్ అయ్యా. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ లాంటి హీరోలు, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు అయితే బాగుంటుంది. కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా తీసుకోలేకపోయామని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జో ఎన్మవ్ సంగీతమందిస్తున్నారు. -
బిడ్డను కోల్పోవడంపై తొలిసారి పెదవి విప్పిన అవినాష్
గర్భం దాల్చింది మొదలు.. పొట్టలో ఉన్న బుజ్జాయి ఎప్పుడు బయటకు వస్తుందా? ఆ బిడ్డను ఎప్పుడు ఎత్తుకుందామా? అని ఆ మహిళ తెగ ఆరాటపడుతూ ఉంటుంది. ఇక తండ్రి కాబోతున్నానోచ్ అని గాల్లో తేలే భర్త పుట్టబోయే బిడ్డ కోసం అన్నీ ముందస్తుగానే సిద్దం చేసి పెడతాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వారికి తల్లిదండ్రులుగా ప్రమోషన్ లభించినట్లే! జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్- అనూజ కూడా త్వరలోనే అమ్మానాన్న కాబోతున్నామని సంతోషించారు. సీమంతం చేశారు. మెటర్నటీ షూట్ చేశారు. బాధను భరిస్తూ నవ్వించాడు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ వారి కలలు కల్లలయ్యాయి. పురిటిలోనే బిడ్డ మరణించింది. ఈ విషాద వార్తను జనవరి 7న సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు అవినాష్. అంతటి బాధను పంటి కిందే భరిస్తూ సినిమాలు, ఈవెంట్లు చేస్తున్నాడు. అందరినీ నవ్విస్తున్నాడు. తాజాగా తొలిసారి ఆ బాధాకర ఘటన గురించి మాట్లాడాడు. 'నా బిడ్డ చనిపోయినప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది కాల్స్ చేశారు. వారికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. దేవుడు మాకలా రాసిపెట్టాడు పైగా నేను మాట్లాడే స్థితిలో లేకపోవడం వల్ల ఎవరి ఫోనూ లిఫ్ట్ చేయలేదు. దీని గురించి అడగొద్దు అని చెప్పినప్పటికీ మానవత్వంతో ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉన్నారు. చాలా ఫోన్లు చేశారు, మెసేజ్‌లు చేశారు. మా మీద అంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా జీవితంలో అదొక కరిగిపోయిన మేఘంలాంటిది. దేవుడు మాకు అలా రాసిపెట్టాడు. భవిష్యత్తులో ఏదైనా ఇంకా బెస్ట్ రాబోతుందేమో చూడాలి! అని చెప్పుకొచ్చాడు. కాగా అవినాష్-అనూజ 2021వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) చదవండి: ప్రజలకు రుణపడి ఉంటా.. చేతనైనంతలో సాయం చేయాలనుకున్నా.. పుష్ప 3 ఉందని రూమర్స్.. అలా చేస్తే చిక్కులు గ్యారంటీ! -
బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్
'జబర్దస్త్' షోతో చాలామంది వెలుగులోకి వచ్చారు. వీరిలో ఒకడు అవినాష్. అయితే ముక్కు అవినాష్ అనే పేరుతో ఇతడు పాపులర్ అయ్యాడు. ప్రసుత్తం పలు ఈవెంట్స్, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. 2021 నవంబరులో అవినాష్.. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు స్వయంగా అవినాష్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు బిడ్డని కోల్పోయిన విషయాన్ని పంచుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా భార్యతో కలిసి ప్రెగ్నెన్సీ విషయమై పలు వీడియోస్ చేస్తూ వచ్చిన అవినాష్ దంపతులు.. ఇప్పుడు బిడ్డ చనిపోవడంతో బాధపడుతున్నారు. ఈ విషయం ఎప్పటికీ జీర్ణించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన అవినాష్.. దీని గురించి ఎలాంటి ప్రశ్నలు అడిగి మరింత బాధపెట్టొద్దని చెప్పుకొచ్చాడు. అయితే పురిట్లోనే బిడ్డ చనిపోయిందా? లేదా ప్రసవించిన తర్వాత చనిపోయిందా? అనే విషయం అవినాష్ చెప్పలేదు. (ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న ఆ తెలుగు సినిమా.. డేట్ ఫిక్స్) 'నా లైఫ్‌లో సంతోషమైన, బాధ అయినా.. నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటివరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కోల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది' 'అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకు థాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్' అని కమెడియన్ అవినాష్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలోనే పలువురు అతడికి ధైర్యంగా ఉండాలని కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: విమాన ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం) View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
చిల్లిగవ్వ లేదు, ఫ్యాన్‌కు ఉరేసుకుందామనుకున్నాడు: అవినాష్ సోదరుడు
ముక్కు అవినాశ్.. జబర్దస్త్ కామెడీ షోతో కమెడియన్‌గా గుర్తింపు పొందాడు. బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పాల్గొని ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించాడు. తర్వాత కూడా పలు రియాలిటీ షోలలో పాల్గొని మెరిశాడు. ఇప్పటికీ బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. షోలు, ఈవెంట్ల ద్వారా బాగానే వెనకేసిన అవినాష్ ఒకానొక సమయంలో మాత్రం తినడానికి తిండి లేక అలమటించాడు. తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుని ఎమోషనలయ్యాడు అవినాష్ సోదరుడు అజయ్. చికెన్ కూడా వద్దన్నాడు! అతడు మాట్లాడుతూ.. 'లాక్డౌన్లో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. ఆ సమయంలో ఇల్లు, కారు తీసుకున్నాం. ఈ రెండు ఈఎమ్ఐలతో పాటు బయట చిన్నపాటి అప్పులు కూడా ఉండేవి. ఈఎమ్ఐలు కట్టకపోవడంతో నోటీసులు వచ్చాయి. మరోవైపు షూటింగ్స్ ఆగిపోవడంతో చేతిలో డబ్బులు లేకుండా పోయాయి. ఈ పరిణామాలతో అన్న మానసికంగా కుంగిపోయాడు. ఒకరోజు సరదాగా చికెన్ వండుకుందాం అని అడిగాను. మన పరిస్థితే బాలేదు, రోజూ పప్పు తింటున్నాం కదా.. ఇప్పుడు కూడా అదే తిందాం.. చికెన్ అవసరమా? అన్నాడు. అలాంటి రోజులు కూడా మా జీవితంలో ఉన్నాయి. వాళ్ల సాయంతోనే.. అన్న ఒక రూమ్‌లో, నేను ఇంకో రూమ్‌లో నిద్రించేవాళ్లం. అన్న ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉదయం 5 గంటల వరకు పడుకునేవాడే కాదు. ఈ అప్పులు, ఒత్తిళ్ల వల్ల ఒకానొక సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోదామన్న ఆలోచన కూడా వచ్చింది! బిగ్‌బాస్‌కు వెళ్లే ముందు తాను చనిపోదామనుకున్న విషయాన్ని నాతో చెప్పాడు. అప్పుడు అంత దారుణంగా ఉండేది మా పరిస్థితి! అన్న జేబులో రూపాయి లేదు. ఆ సమయంలో బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో ఒప్పుకున్నాడు. జబర్దస్త్‌కు రూ.10 లక్షలు ఇచ్చి ఆ షో నుంచి బయటకు వచ్చాడు. శ్రీముఖి రూ.5 లక్షలు, గెటప్ శ్రీను రూ.1 లక్ష, చమ్మక్ చంద్ర రూ.2 లక్షలు.. ఇలా అందరి దగ్గరా అప్పు చేసి ఆ డబ్బు ఇచ్చేశాడు. దేవుడి దయ వల్ల బిగ్‌బాస్ తర్వాత తన కెరీర్ ఇంకా బాగుంది' అని చెప్పాడు అజయ్. బిగ్‌బాస్ హౌస్‌లో కష్టాలు చెప్పుకున్న అవినాష్ బిగ్‌బాస్ హౌస్‌లోనూ లాక్డౌన్లో తాను పడ్డ కష్టాలను చెప్పాడు అవినాష్. లాక్డౌన్లో ఇంటి ఈఎమ్ఐ కట్టలేకపోయానన్నాడు. ఎందుకంటే అదే సమయంలో తండ్రికి గుండెపోటు రావడంతో మూడు స్టంట్లు వేయడానికి ఇంటి కోసం ఉంచిన రూ. 4 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. అలాగే అమ్మకు కీళ్లు అరిగిపోతే వైద్యం చేయించినట్లు పేర్కొన్నాడు. అప్పుల వల్ల ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపాడు. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com చదవండి: నాగార్జున స్పెషల్ గిఫ్ట్.. ఆనందంలో తేలియాడుతున్న శోభ -
Mukku Avinash: బేబీ బంప్‌తో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ భార్య (ఫొటోలు)
-
ముక్కు అవినాశ్ భార్య సీమంతం ఫంక్షన్లో సోహైల్ రచ్చ..
బిగ్‌బాస్ షోతో బడా క్రేజ్ సంపాదించుకున్న నటుడు సయ్యద్ సోహైల్ రియాన్. అప్పటిదాకా చిన్నాచితకా పాత్రలు చేసిన సోహైల్ ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో హీరోగా మారాడు. ప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించగా మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటివ్ టాక్ అందుకుంటోంది. ఇకపోతే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోహైల్ జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ ఇంట జరిగిన ఫంక్షన్‌కు వెళ్లాడు. అవినాశ్ భార్య అనూజ సీమంతం వేడుక జరిగిన విషయం తెలిసిందే! ఈ వేడుకకు వెళ్లిన సోహైల్ తనకూ సీమంతం చేయాలని పట్టుపట్టాడు. తాను కూడా ప్రెగ్నెంటేనని, తనకెందుకు ఫంక్షన్ చేయరని అడిగాడు. మగవాళ్లకు గర్భం రావడం ఏంటి? అని తిడుతూనే అవినాశ్ అతడిని కూర్చోబెట్టి పట్టు బట్టలు పెట్టి నెత్తిన అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. చివర్లో ఆగస్టు 18 డెలివరీ డేట్.. మిస్టర్ ప్రెగ్నెంట్ థియేటర్లలో చూడండి అని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా చేశాక సోహైల్‌పై చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే అతడిని ప్రేమించే వారు ఉన్నట్లే, ఇష్టం లేని వారూ ఉంటారని లైట్ తీసుకున్నాడు. అంతదాకా ఎందుకు, ఈ సినిమా గురించి అతడి తల్లి కూడా మొదట్లో నెగిటివ్‌గా మాట్లాడింది. కానీ సినిమా చూశాక గర్వంగా ఫీలైంది. కన్నీళ్లు పెట్టుకుంది. ఓ మంచి సినిమా చేశావంటూ సోహైల్‌ను మెచ్చుకుంది. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) చదవండి: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’మూవీ రివ్యూ జైలర్‌లో డ్యాన్స్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫేమస్ అవ్వడానికి ముందే గదిలో శవమై.. -
Mukku Avinash Buys New Car: కొత్త కారు కొన్న జబర్దస్త్ షో కమెడియన్ ముక్కు అవినాశ్
-
కొత్త కారు కొన్న ముక్కు అవినాశ్, తిట్టిపోస్తున్న నెటిజన్లు
జబర్దస్త్ షోతో కమెడియన్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు ముక్కు అవినాశ్. తన పంచులతో, కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో కూడా అవినాశ్ పార్టిసిపేట్ చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆ మధ్య బిగ్‌బాస్‌కు కూడా వెళ్లి తన కామెడీతో షోకి కొత్త కళను తీసుకొచ్చాడు. మొత్తంగా అవినాశ్ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండగే అన్న పేరు తెచ్చుకున్నాడు. ఇకపోతే అవినాశ్ భార్య అనూజ ప్రస్తుతం గర్భిణి అన్న సంగతి తెలిసిందే! ఓపక్క తండ్రి కాబోతున్నాడని సంతోషించే లోపే అతడి తల్లి మల్లమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిపాలైంది. ఇటీవలే మల్లమ్మకు గుండెలో స్టంట్స్ పడ్డాయి. ఈ విషయాన్ని అవినాశ్ స్వయంగా యూట్యూబ్ ఛానల్లో వెల్లడించాడు. ఇప్పుడిప్పుడే ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ సమయంలో అవినాశ్ కొత్త కారు కొన్నాడు. పాత కారుకు యాక్సిడెంట్ అయిందని, అది డ్యామేజ్ కావడంతో దాన్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త కారు కొన్నట్లు తెలిపాడు. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. దీని ధర దాదాపు రూ.25 లక్షల మేర ఉంటుందని తెలుస్తోంది. ఈ కారుకు పూజ చేయించిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేశాడు. చాలామంది అభిమానులు అతడికి శుభాకాంక్షలు చెప్తుంటే కొంతమంది మాత్రం అవినాశ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'అమ్మకు గుండెపోటు వచ్చి స్టంట్స్ వేయించుకుని అనారోగ్యంతో బాధపడుతుంటే ఇప్పుడు కొత్త కారు తీసుకోవడం అవసరమా?' అని కామెంట్లు చేస్తున్నారు. 'మీ అమ్మకు ఆరోగ్యం బాగోలేదని వీడియో తీశావు. ఆ వీడియో ద్వారా వచ్చిన డబ్బుతో అప్పుడే కొత్త కారు కొన్నావు. మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయే' అని సెటైర్లు వేస్తున్నారు. చదవండి: గుంటూరు కారం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అవుట్ -
జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ తల్లి మల్లమ్మ అస్వస్థతకు లోనైంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెలో బ్లాక్స్ ఉండటంతో వైద్యులు స్టంట్స్ వేశారు. ఈమేరకు ఓ వీడియోను ముక్కు అవినాశ్ తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాడు. 'ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఇలా ఇబ్బందిపడటం చూడలేకపోతున్నా. తను ముందు నుంచే షుగర్ వ్యాధితో బాదపడుతోంది. ఈ షుగర్ వల్ల నచ్చిన ఫుడ్ కూడా తినలేకపోతోంది. ఈ మధ్యే అమ్మకు గుండెపోటు(హార్ట్ స్ట్రోక్) వచ్చింది. తనను ఊరిలో ఆస్పత్రికి తీసుకెళ్తే అమ్మ గుండె వీక్ ఉందన్నారు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడే ఒక ఆస్పత్రిలో చూపించాను. గుండెలో రెండు పెద్ద బ్లాక్స్ ఏర్పడ్డాయి. ఆంజియోగ్రామ్ చేయించాం, రెండు స్టంట్స్ వేయించాం. తననిప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి' అని చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన పరిస్థితిని తలుచుకుని అవినాశ్ తల్లి కన్నీటిపర్యంతమైంది. 'నా కొడుకులు బతికించారు, అందుకే బతికినా. జరగబోయేది నాకు తెల్వదు. మీ దయ వల్ల మంచిగుండి డ్యాన్స్ చేశిన, అన్నీ చేశిన. నాకిప్పుడు ఈ కష్టం వచ్చింది. మీరు లేకుంటే బతకలేను, నా పెద్ద కొడుకు లేకపోయుంటే ఊరిలోనే నా ప్రాణం పోయేది. వాడు తొందరగా నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించడం వల్లే బతికి ఉన్నాను' అంటూ ఏడ్చేసింది. కొద్దిరోజులపాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ముక్కు అవినాశ్ తల్లిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లాడు. చదవండి: శామీర్‌పేట్ ఘటన.. నాకు సంబంధమే లేదంటున్న నటుడు మనోజ్ -
గుడ్‌న్యూస్ చెప్పిన జబర్దస్త్ అవినాష్.. త్వరలో బుజ్జి పాపాయి!
ముక్కు అవినాష్.. ఇతడు ఎక్కడుంటే అక్కడ నవ్వుల పంట పండాల్సిందే! ఏ షోలో అడుగుపెట్టినా 100% ఎంటర్టైన్మెంట్ అందిస్తాడు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఇతడు జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ రియాలిటీ షోలోనూ అడుగుపెట్టి మరింత ఫేమస్ అయ్యాడు. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్‌గా పేరు తెచ్చుకున్నాడు. తన భార్యతో కలిసి రియాలిటీ షోలు కూడా చేసిన అవినాష్ తాజాగా ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. త్వరలో తాము పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందబోతున్నామని శుభవార్త తెలిపాడు. ఈ మేరకు ఇద్దరం ముగ్గురం కాబోతున్నామంటూ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. 'నా భార్య అనూజ ప్రెగ్నెంట్. మా ఇంట్లోకి బాబు లేదా పాపాయి రాబోతోంది. మా పెళ్లై ఏడాదిన్నర అవుతోంది. అక్టోబర్‌లో మా పెళ్లి రోజు. పిల్లల్నెప్పుడు కంటారు? అని మమ్మల్ని ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పాం. పెళ్లైన ఏడాదిన్నరకే మేము తల్లిదండ్రులం కాబోతుండటం ఆనందంగా ఉంది. మూడు నెలల వరకు ఎవరికీ చెప్పొద్దని వైద్యులు సలహా ఇచ్చారు. ఇప్పుడు తనకు నాలుగో నెల. అందుకే ఇన్నాళ్లకు ఈ విషయం బయటకు చెప్తున్నాం. మా కంటే కూడా మా అమ్మానాన్న, అత్తామామలు సంతోషంగా ఫీలయ్యారు. నాలుగో నెలలో బేబీ గుండెచప్పుడు కూడా విన్నాం. అప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను' అని ఆనందం వ్యక్తం చేశాడు అవినాష్. చదవండి: ప్రియుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా.. నాన్నకు తెలిసి గుండెపోటు: నటి -
ఫోటో తీసెయ్.. కమెడియన్ అవినాష్‌కి బన్నీ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ ఇది. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్గా బన్నీ బర్త్‌డే సందర్భంగా పుష్ప-2 నుంచి అదిరిపోయే స్పెషల్ వీడియోతో పాటు బన్నీ లుక్‌ని రివీల్ చేసి మేకర్స్ షాక్ ఇచ్చారు. ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన క్షణాల్లోనే పుష్ప-2 పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. చీరకట్టు, ముక్కు పుడకతో కనిపించి బన్నీ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పుష్ప-2 లుక్‌ని ఇమిటేట్ చేస్తూ అరకొర ఎడిటింగ్‌తో పుష్పరాజ్‌లా మారిపోయాడు కమెడియన్ అవినాష్. జబర్దస్త్ స్కిట్స్, బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన ముక్కు అవినాష్ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా బన్నీ లుక్‌ని కాస్త మార్ఫింగ్ చేసి తన ఫోటోను పెట్టుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవినాష్‌పై ఫైర్ అవుతున్నారు.అల్లు అర్జున్ చేస్తే.. గంగమ్మ తల్లిలా ఉంది.. నువ్వు చేస్తే పక్కింటి మంగమ్మలా ఉంది అంటూ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. అర్జెంట్‌గా ఫోటో డిలీట్ చేయకపోతే బాగోదు అంటూ వార్నింగ్‌లు ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
బిగ్‌బాస్ హౌస్‌లో బీబీ జోడీలు.. ఎంటర్టైన్మెంట్ అదిరిపోలా!
రేపటితో బిగ్‌బాస్ షో కథ క్లోజ్ కానుంది. శ్రీసత్య ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఐదుగురు మిగిలారు. వీరంతా ఫైనల్‌కు చేరుకున్నామన్న సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇకపోతే గత బిగ్‌బాస్ సీజన్లలో అలరించిన కొందరు కంటెస్టెంట్లతో త్వరలో బీబీ జోడీ రానుంది. ఈ షోలో ముక్కు అవినాష్- అరియానా, అఖిల్-తేజస్వి, అర్జున్- వాసంతి, సూర్య- ఫైమా, రవికృష్ణ- భాను, మెహబూబ్- అషు, చైతు- కాజల్, రోల్ రైడా-స్రవంతి జంటలుగా పాల్గొననున్నారు. ఈ షోను ప్రమోట్ చేసే క్రమంలో నేడు అషు, మెహబూబ్, అవినాష్, అరియానా హౌస్‌లో అడుగుపెట్టారు. ఇక ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్ అయిన అవినాష్ ఇంట్లో బెల్లీ డ్యాన్స్, నాగిని డ్యాన్స్ చేసి అందరినీ నవ్వించారు. మరి మాజీ కంటెస్టెంట్ల రచ్చ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! చదవండి: డబ్బు కోసమే వచ్చానన్న శ్రీసత్య ఎంత సంపాదించిందంటే? తుస్సుమన్న అవతార్ 2, ఆసినిమాను కూడా దాటలేకపోయింది -
ఏడేళ్ల కష్టార్జితంతో కొన్న ముక్కు అవినాష్ ఇల్లు చూశారా?
Mukku Avinash Shares Home Tour Video: కామెడీ షోలో ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించిన ముక్కు అవినాష్ బిగ్‌బాస్ షోతో వారికి మరింత దగ్గరయ్యాడు. బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్లో పాల్గొన్న అతడు కంటెస్టెంట్లందరితో కలిసిపోతూనే వారిని సరదాగా ఓ ఆటాడిస్తూ ఫుల్ కామెడీ చేసి జనాలను తెగ నవ్వించాడు. బుల్లితెరపై కమెడియన్‌గానే కాకుండా సినిమాల్లో నటుడిగానూ రాణిస్తున్నాడు. ఇటీవల అవినాష్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఈ క్రమంలో భార్య అనుజతో కలిసి యూట్యూబ్ వీడియోలు, రీల్స్, ఫొటోషూట్స్ అంటూ తెగ సందడి చేస్తున్నాడు. తాజాగా అతడు తన ఇంటిని ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశాడు. సుమారు ఏడేళ్ల కష్టపడ్డ అనంతరం ఆ డబ్బుతో ఇల్లు, కారు కొనుక్కున్నానని తెలిపాడు. తనది ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అంటూ ఇల్లు మొత్తాన్ని కెమెరాలో బంధించాడు. స్కూల్‌ఫ్రెండ్ జగదీశ్ తన ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేశాడన్న అవినాష్ తనకు వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను చూపిస్తూ వాటి వెనక స్టోరీని వెల్లడించాడు. బాల్కనీ, కిచెన్, డైనింగ్ టేబుల్, పూజా గది, బెడ్ రూమ్.. ఇలా అన్నింటినీ చూపించాడు. పుట్టబోయే పిల్లల కోసం, ఇంటికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన మరో రెండ్ బెడ్ రూమ్స్‌ను సైతం చూపించాడు. వారి అభిరుచికి తగ్గట్లుగా ఆయా గదుల్లో థీమ్ పోస్టర్లను అతికించారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. మీ జంట చూడముచ్చటగా ఎలా ఉందో మీ హౌస్ కూడా అంతే బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. -
దీపావళికి ఎంటర్టైన్మెంట్ మోత, బిగ్‌బాస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు!
Bigg Boss 5 Telugu, Diwali Episode: పండగ వచ్చిందంటే చాలు సంబరాలు రెట్టింపు చేస్తుంది బిగ్‌బాస్ టీమ్. దసరాకు స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేసిన బిగ్‌బాస్ ఈసారి దీపావళికి మరో కొత్త ప్లాన్‌తో ముందుకు రాబోతోంది. ఎంటర్టైన్మెంట్ను రెట్టింపు చేసేందుకు మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లను రంగంలోకి దించుతోందట! అంటే ఈ వారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం బిగ్‌బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్ బాబా భాస్కర్, నాలుగో సీజన్ కంటెస్టెంట్లు అరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్, దివి, సోహైల్, ముక్కు అవినాష్ సండే రోజు నాగ్‌తో కలిసి సందడి చేయబోతున్నారట! మరి వీరిని లోనికి పంపిస్తారా? లేదా గతేడాది లాగే ఓ ప్రత్యేక గదిలో పెట్టి అక్కడినుంచే గేమ్స్ ఆడిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే మరోసారి వారిని బిగ్‌బాస్‌లో చూసే అవకాశం రావడంతో తెగ సంబరపడిపోతున్నారు వారి అభిమానులు. వారి రాకతో ఈ దీపావళి మరిత కలర్ఫుల్గా ఉండటం ఖాయమని జోస్యం చెప్తున్నారు. ఏదేమైనా ఈ మాజీ కంటెస్టెంట్లు షోలోకి వస్తున్నారన్న వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు బిగ్‌బాస్ లవర్స్, -
అవినాష్ పెళ్లిలో యాంకర్ శ్రీముఖి హల్ చల్
-
ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి!
టీవీ కమెడియన్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ వివాహ వేడుక ముగిసింది. ఇటీవల తన చిన్ననాటి స్నేహితురాలైన అనుజను నిశ్చితార్థం చేసుకున్న అవినాష్ ఈ రోజు ఆమె మెడలో మూడు మూళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. కుటుంబ సభ్యులు, కొద్ది మంది నటీనటుల మధ్య అవినాష్ వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ దివి, అరియాన గ్లోరీ, సయ్యద్ సోహైల్‌తో పాటు పలువురు వివాహ వేడుకకు హజరై సందడి చేశారు. చదవండి: పెళ్లి కొడుకుగా ముస్తాబైన ముక్కు అవినాష్..ఫోటోలు వైరల్ ఇక అవినాష్, అనుజ మెడలో తాళి కడుతున్న వీడియోను కమెడియన్ రాంప్రసాద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే అవినాష్ తన పెళ్లి వీడియోను తన సొంత యుట్యూబ్లో చానల్ ద్వారా విడుదల చేసి అందరికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. కానీ ముందుగానే రాంప్రసాద్ ‘సారీ అవినాష్ బ్లండర్ మిస్టేక్ జరిగింది. కానీ తప్పడం లేదు’ అంటూ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. అలాగే అరియాన, దివితో పాటు పలువురు నటీనటులు పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: పూజా నాకొక్కడికే స్పెషల్ అనుకున్నా.. కానీ కాదు: అల్లు అర్జున్ View this post on Instagram A post shared by Jabardasth Ram Prasad (@jabardasth_ramprasad) -
పెళ్లికొడుకుగా ముస్తాబైన ముక్కు అవినాష్
-
పెళ్లి కొడుకుగా ముస్తాబైన ముక్కు అవినాష్..ఫోటోలు వైరల్
Mukku Avinash Haldi Function: టీవీ కమెడియన్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఇంట పెళ్లి గంటలు మోగాయి. ఇటీవలె అనుజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న అవినాష్ అతి మరికొద్ది గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత బిగ్‌బాస్ సీజన్ 4లో పెళ్లి పెళ్లి అంటూ కలవరించిన అవినాష్ ఎట్టకేలకు పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. సోమవారం అవినాష్ స్వస్థలంలోనే హల్దీ ఫంక్షన్ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు టీవీ నటులు సహా నెటిజన్ల నుంచి అవినాష్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన ముక్కు అవినాష్
Mukku Avinash Engagement Video: బుల్లితెర షోలపై తనదైన కామెడీతో సందడి చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న ముక్కు అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల అనుజ అనే అమ్మాయితో అవినాష్ నిశ్చితార్థం జరిగింది. గత బిగ్‌బాస్ సీజన్ 4లో పెళ్లి పెళ్లి అంటూ కలవరించిన అవినాష్ ఇలా గుట్టు చప్పుడుగా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదేమైతేనే పెళ్లి పెళ్లి అంటూ తహతహలాడిన అవినాష్ ఎట్టకేలకు వివాహం చేసుకోబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ సంతోషించారు. చదవండి: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే! అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో కానీ, ఫుల్ ఫొటోలు కానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అవినాష్ తన ఎంగేజ్మెంట్ వీడియోను విడుదల చేశాడు. ‘జత కలిసే’ అంటూ నిశ్చితార్థం వీడియోను సోషల్ మీడియా వేదికగా అవినాష్ అభిమానులతో పంచుకున్నాడు. పూలు పండ్లు మార్చుకోవడం, ఆ తర్వాత అనుజతో అవినాష్ ఫొటో షూట్ చేయడం, కాబోయే శ్రీమతికి రొమాంటిక్‌గా ముద్దు పెట్టుకొని డ్యాన్స్ చేయడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో అవినాష్ ఎంగేజ్మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
అవినాష్ పెళ్లిపై స్పందించిన బిగ్‌బాస్ బ్యూటీ..
Ariyana Glory On Avinash Engagement: ముక్కు అవినాష్ జబర్దస్త్ కార్యక్రమంతో మంచి గుర్తింపే కాకుండా బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. బుల్లితెరపై తనదైన కామెడీతో సందడి చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ నటుడు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న అవినాష్ ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బిగ్‌బాస్ బ్యూటీ అరియాన గ్లోరీ స్పందించింది. బిగ్ బాస్ హౌస్‌లో అవినాష్, అరియానతో చనువుగా ఉండటం, ఈ షో అయ్యాక కూడా తరచూ వీరు కలిసి ఈవెంట్స్ చేయడం, గోవా ట్రిప్‌లు, వీడియోలు చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని పుకార్లు వచ్చాయి. అయితే అవినాష్ తన పెళ్లి వార్తతో ఆ పుకార్లకు బ్రేక్ వేశాడు. ఇక దీనిపై అరియాన.. అవినాష్ పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందంటూ తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ‘మా మధ్య ఏదో ఉందని చాలా పుకార్లు ఉన్నాయి కానీ అలాంటిదేమీ లేదు. తను నాకు మంచి స్నేహితుడు మాత్రమే. అవినాష్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’..అని క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న అరియాన బాగా డబ్బు సంపాదించి, సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. చదవండి: Tollywood Drug Case: అమ్మతోడు ఈడీ కార్యాలయానికి అందుకే వచ్చా: బండ్ల గణేశ్ -
త్వరలోనే అవినాష్ పెళ్లి.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్, అమ్మాయి ఎవరంటే..
Mukku Avinash Engagement Photos: తెలుగు బుల్లితెరపై తనదైన కామెడీతో సందడి చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న ముక్కు అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల అవినాష్ నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అవినాష్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘సరైన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆలస్యం ఉండదు. మా కుటుంబాలు కలుసుకున్నాయి.. తర్వాత మేము కలుసుకున్నాం. ఇది మా నిశ్చితార్థం. చాలా మంది చాలా సార్లు నా పెళ్లి గురించి అడిగారు. అతి త్వరలోనే నా అనూజతో పెళ్లి. ఎప్పటి లాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఓ పోస్టు పెట్టాడు అవినాష్. ఇక అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం తెలియగానే.. అమ్మాయి ఎవరన్న విషయంపై అంతా చర్చించుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ అమ్మాయి పూర్తి పేరు అనూజ వాకిటి. అవినాష్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయే తను. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
ముక్కు అవినాష్ తల్లికి అనారోగ్యం: CMRF నుంచి చెక్
బిగ్‌బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ తల్లి అనారోగ్యానికి లోనైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆమె వైద్యానికి అవసరమయ్యే డబ్బును చెక్ రూపంలో అందించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ళ లక్ష్మిరాజం (ముక్కు అవినాష్ తల్లి) అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నగదుకు సంబంధించిన చెక్కును శనివారం నాడు మంత్రి కొప్పుల ఈశ్వర్ లక్ష్మీరాజం కుమారుడు అవినాష్‌కు అందజేశారు. అనంతరం ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా అవినాష్ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తూ ప్రేక్షకులకు నాన్‌స్టాప్ కామెడీని పంచాడు. అరియానాతో స్నేహం చేస్తూ మోనాల్‌ను ఆటపట్టిస్తూ తెగ సందడి చేసిన అతడు ప్రస్తుతం పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: 'అవ్వ బంగారం' అంటూ అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్ 'ఆర్ఆర్ఆర్' నుంచి రామ్‌చరణ్‌కు స్పెషల్ సర్ప్రైజ్ -
వాళ్ళ వల్లే మంచి సినిమా తీయగలిగాను: విజయ్ కిరణ్
‘సక్సెస్ అనేది రెండు రకాలు. ఒకటి డబ్భుతో వచ్చేది, మరొకటి పేరుతొ వచ్చేది. ‘పైసా పరమాత్మ’ నాకు మంచి దర్శకుడిగా శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చింది. ఒక దర్శకుడిగా నేను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నానో దానిని పర్ఫెక్ట్ గా వందశాతం స్క్రీన్ పై ప్రెజెంట్ చేయగలిగాను. సినిమా చూసిన ప్రేక్షకులు వందశాతం మార్కులు దర్శకుడికి వేశారు’అని అన్నారు పైసా పరమాత్మ దర్శకుడు విజయ్ కిరణ్ తిరుమల. యువకులు, బ్రహ్మతో క్రియేటివ్ స్టార్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ కిరణ్ తిరుమల కొంతకాలం గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టి రీసెంట్ గా ‘పైసా పరమాత్మ’ చిత్రానికి దర్శకత్వం వహించారు. సాకేత్, సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై టి.కిరణ్ కుమార్ నిర్మించారు. మార్చి 12న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి మంచి స్పందన లభిస్తోంది. కాగా ఈ చిత్ర దర్శకుడు విజయ్ కిరణ్ తిరుమల మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘పూర్తిగా స్టోరీ ని నమ్మి చేసిన చిత్రమిది. ఇప్పటితరానికి ఈ సినిమా నచ్చుతుంది. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం మేము అనుకున్న ధియేటర్స్ కన్నా ఎక్కువ ధియేటర్స్ లో రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నటీనటులు అందరూ సూపర్బ్ గా నటించారు. క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయి ప్రతి పాత్రకు న్యాయం చేశారు. ఈ సందర్బంగా మా టీం అందరికీ నా స్పెషల్ థాంక్స్. అలాగే నేను కృతజ్ఞతలు చెప్పుకునేవారు ఇద్దరు వ్యక్తులు వున్నారు. మా అమ్మా, నాన్న. ఇంకోటి మా గురువుగారు. వాళ్ళ వల్లే నేను ఇంత మంచి సినిమా తీయగలిగాను. సక్సెస్ అనేది రెండు రకాలు. ఒకటి డబ్భుతో వచ్చేది, మరొకటి పేరుతొ వచ్చేది. ఈ సినిమా నాకు మంచి దర్శకుడిగా శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చింది. ఒక దర్శకుడిగా నేను ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నానో దానిని పర్ఫెక్ట్ గా వందశాతం స్క్రీన్ పై ప్రెజెంట్ చేయగలిగాను. సినిమా చూసిన ప్రేక్షకులు వందశాతం మార్కులు దర్శకుడికి వేశారు. అంటే నేను సక్సెస్ అయినట్టే . ఫ్రెష్ విజువల్స్ తో కొత్త కంటెంట్ వున్నా మా పైసా పరమాత్మ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. పూరి జగన్నాద్, త్రివిక్రమ్, కృష్ణ వంశీ గారు వాళ్ళ మార్క్ ఏంటో క్రియేట్ చేసుకున్నారు. అలా నాకంటూ నా స్టయిల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించగలిగాను. క్యారెక్టర్స్ ఎలివేషన్ హైలెట్ గా చూపించడం జరిగింది. ఆర్టిస్టుల దగ్గరనుండి పాత్రకు తగ్గట్లు పెర్ఫార్మెన్స్ రాబట్టుకోగలిగాను. అన్ని ప్రధాన పాత్రలు బాగా ఈ చిత్రంలో పండాయి. టైటిల్ కి ఎంత మంచి పేరు వచ్చిందో సినిమాకి కూడా అంతే హ్యుజ్ రెస్పాన్స్ వస్తోంది. త్వరలో ఓటిటి లో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇక నుంచి నేను చేయబోయే చిత్రాలు కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి టయ్యప్ అయి చేయాలనీ ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా వున్నాయి.. ప్రాపర్ గా అవి బౌండ్ స్క్రిప్ట్స్ రెడీ చేసి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరపాలి. మా లక్ష్మి సుచిత్ర బ్యానర్ లో కొత్త కంటెంట్ వున్నా అన్ని జానర్ మూవీస్ చేయాలనీ నిర్ణయించుకున్నాం. నా జీవితం అంతా సినిమానే.. సినిమా అంటే నాకు విపరీతమైన ఇష్టం. మంచి స్టార్ కాస్ట్ తో బ్లాక్ బస్టర్స్ మూవీస్ చేయాలనీ దర్శకుడిగా నా గోల్. త్వరలో డి యమ్ కే టైటిల్ తో ఒక పవర్ ఫుల్ కాఫ్ స్టోరీ తో సినిమా చేయబోతున్నాను’అని అన్నారు. -
మార్చి 12న 'పైసా పరమాత్మ'
కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అలా సరికొత్త కాన్సెప్టుతో రాబోతున్న చిత్రం 'పైసా పరమాత్మ'. సాంకేత్, సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై టి.కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ కిరణ్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ కాగా ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని మార్చి 12 న విడుదల సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత టి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. "పూర్తిగా స్టోరీని నమ్మి చేసిన చిత్రమిది. ఇప్పటితరానికి ఈ సినిమా నచ్చుతుంది. దర్శకుడు కథ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా సినిమా చేశాడు. అయన మీద నమ్మకంతోనే ఈ సినిమాను పూర్తి చేయగలిగాము.. ఈ చిత్రానికి మొదటినుంచి సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా సినిమా పోస్టర్లను ఆవిష్కరించి మమ్మల్ని ఆశీర్వదించిన రాజ్ కందుకూరి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం మార్చి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరు సినిమాను ఆదరించండి" అని అన్నారు. బ్యానర్ : లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్, మ్యూజిక్ : కనిష్క్, దర్శకుడు : విజయ్ కిరణ్ తిరుమల, నిర్మాత : టి.కిరణ్ కుమార్ చదవండి: పిచ్చెక్కిపోయింది, నేను ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు: అషూ 16 పాటలు రాశావా గోవిందా.. ఏంటో అవి?! -
కొమురవెల్లిలో ముక్కు అవినాష్
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామిని జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం కుటుంబసమేతంగా స్వామి వారికి పట్నం వేసిన అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలావుంటే మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో వారాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. పలువురు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చదవండి: వివేక్ ఒబెరాయ్‌పై కేసు నమోదు -
స్టార్ డైరెక్టర్ హామీ ఇచ్చారు: అవినాష్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ముగిసిన ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్లో జబర్ధస్త్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి చప్పగా సాగుతున్న బిగ్‌బాస్ హౌజ్‌ను తన కామెడితో ఆసక్తికరంగా మార్చాడు. అయితే అతడు బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టేందుకు జబర్ధస్త్ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని బ్రేక్ చేసి పెద్ద రిస్క్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యలో జబర్ధస్త్‌ను వదిలి వెళుతున్నందుకు గాను నిర్మాతలకు అవినాష్ 10 లక్షల రూపాయల జరిమాన కూడా చెల్లించాడు. అయితే బిగ్‌బాస్ ద్వారా అవినాష్ బాగానే లాభపడినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌తో మరింత ఫేంను సంపాదించుకున్న అవినాష్‌కు.. డబ్బులు కూడా భారీ మొత్తంలో అందినట్లు సమాచారం. అయితే ఇటీవల బిగ్‌బాస్ ముగియడంతో కంటెస్టెంట్స్ అంతా టీవీ, న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిబీ బిజీగా ఉన్నారు. (చదవండి: బిగ్‌బాస్: అవినాష్‌కు నాగ్ ఊహించని గిఫ్ట్) అదే విధంగా అవినాష్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా అయిపోయాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో అవినాష్ మాట్లాడుతూ.. తన సహా కంటెస్టెంట్ అరియాన గ్లోరితో వివాహం అంటూ వస్తున్న పుకార్లను ఖండించాడు. అనంతరం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాల్లో మంచి పాత్ర ఇస్తానని తనకు హామీ ఇచ్చినట్లు వెల్లడించాడు. అయితే గత ఆదివారం జరిగిన ఫైనల్ ఎపిసోడ్లో దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా బిగ్‌బాస్‌లో హౌజ్‌లో అడుగుపెట్టి టాప్ 5లోని ఒకరిని ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనను కలిసిన దర్శకుడు అనిల్ తన తదుపరి సినిమాల్లో నటించే అవకాశం ఇస్తానని, ఒకసారి కలవమని కూడా చెప్పినట్లు అవినాష్ చెప్పుకొచ్చాడు.