నబీల్‌ ఇమ్మెచ్యూర్‌ అన్న ప్రేరణ.. మణికి గోల్డెన్‌ ఛాన్స్‌ | Bigg Boss Telugu 8: Gangavva Questions Mega chief Selection | Sakshi
Sakshi News home page

మెగా చీఫ్‌ కోసం పోటీ.. తన పేరు చెప్పలేదని కడిగి పారేసిన గంగవ్వ

Published Fri, Oct 11 2024 4:33 PM | Last Updated on Fri, Oct 11 2024 4:50 PM

Bigg Boss Telugu 8: Gangavva Questions Mega chief Selection

బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగిన హోటల్‌ టాస్క్‌ ఎప్పుడెప్పుడు అయిపోతుందా? అని ఎదురు చూశారు. అంత నీరసంగా సాగింది. టాస్క్‌ అయిపోగానే బెస్ట్‌ పర్ఫామర్లను సెలక్ట్‌ చేయాలన్నాడు. వీరే మెగా చీఫ్‌ కోసం పోటీపడతారని పేర్కొన్నాడు. ఓజీ టీమ్‌లో మెగా చీఫ్‌ కంటెండర్‌ను సెలక్ట్‌ చేసే క్రమంలో ప్రేరణ, నబీల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. 

ఇమ్మెచ్యూర్‌..
నీ మైండ్‌లో నాకు వ్యతిరేకంగా ఆలోచన పెట్టుకున్నావ్‌.. అందులే అలా ప్రవర్తిస్తున్నావ్‌ అని ప్రేరణ అనేసింది. నీ మాట వినకుండా ఆయన చెప్పింది మాత్రమే చేసినప్పుడు నాది తప్పు అను అని నబీల్‌ రిప్లై ఇచ్చాడు. అయినా తగ్గని ప్రేరణ.. వెటకారం వద్దు.. నువ్వు నన్ను నమ్మట్లేదు.. నువ్వు ఇమ్మెచ్యూర్‌ అనేయడంతో నబీల్‌ నేను ఇమ్మెచ్యూర్‌ కాదని అరిచాడు.

బెస్ట్‌ పర్ఫామర్లు ఎవరంటే?
ఓజీ టీమ్‌ నుంచి మణికంఠ, రాయల్‌ టీమ్‌ నుంచి అవినాష్‌, రోహిణి, హరితేజ, నయని పావని, మెహబూబ్‌, గౌతమ్‌లను బెస్ట్‌ పర్ఫామర్లుగా ఎంపిక చేశారు. తమ టీమ్‌లోని మిగతా ఇద్దరు కూడా బానే చేశారని అవినాష్‌ అనగా.. అలాంటప్పుడు ఫస్ట్‌ తమ పేరెందుకు చెప్పలేదని గంగవ్వ నిలదీసింది. 

కడిగి పారేసిన గంగవ్వ
నేను మహారాణి అయినప్పుడు నా దగ్గరకు వచ్చి ఎవరైనా సేవలు చేశారా? అని ప్రశ్నించింది. అందుకు విష్ణు.. నేను పెరుగన్నం తినిపించా కదా అని గుర్తు చేయగా డబ్బులిస్తే ఆ పని చేశావని గంగవ్వ కౌంటరిచ్చింది. గంగవ్వలో ఈ ఫైర్‌ చూసి అటు హౌస్‌మేట్స్‌, ఇటు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement