Nabeel Afridi
-
బిగ్‌బాస్ 8 హైలైట్స్: ఈ విషయాలు గమనించారా?
ఎన్నో ట్విస్టులు, టర్నులతో బిగ్‌బాస్ 8 మొదలైంది. అన్లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అంటూ షో మొదలుపెట్టాడు హోస్ట్ నాగార్జున. రానురానూ ఫన్ తగ్గిపోవడంతో వైల్డ్‌కార్డ్స్‌ను రంగంలోకి దింపాడు. అప్పటినుంచి షోపై హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లుగానే కంటెస్టెంట్లు కూడా హోరాహోరీగా పోరాడారు. చివరకు నిఖిల్ విజేతగా నిలిచాడు. మరి 105 రోజుల జర్నీలో ఏమేం జరిగాయో హైటైల్స్లో చూసేద్దాం..⇒ సెప్టెంబర్ 1న బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభం⇒ లాంచింగ్ రోజు హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు.. వీరిని జంటలుగా పంపించిన బిగ్‌బాస్⇒ ప్రైజ్‌మనీని జీరోగా ప్రకటించిన నాగార్జున.. హౌస్‌మేట్సే దాన్ని సంపాదించాలని వెల్లడి⇒ రెండో వారం శేఖర్ బాషాను పంపించేసిన హౌస్మేట్స్⇒ అక్టోబర్6న రీలోడ్ ఈవెంట్ ద్వారా 8 మంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ⇒ ఈ ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ గత సీజన్స్‌లో వచ్చినవాళ్లే కావడం గమనార్హం⇒ పాతవారిని ఓజీగా, వైల్డ్‌కార్డ్స్‌ను రాయల్స్ క్లాన్‌గా విభజించిన బిగ్‌బాస్⇒ తొమ్మిదోవారంలో క్లాన్స్ తీసేసి అందర్నీ కలిపేసిన బిగ్‌బాస్⇒ ఈ సీజన్లో కెప్టెన్ పదవికి బదులుగా మెగా చీఫ్ పదవిని పెట్టారు⇒ రేషన్ కూడా కంటెస్టెంట్లే సంపాదించుకోవాలన్నారు, కిచెన్‌లో టైమర్ ఏర్పాటు చేశారు⇒ ఈ సీజన్లో జైలుకు వెళ్లిన ఏకైక కంటెస్టెంట్ మణికంఠ⇒ ఏడోవారంలో నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ వల్ల బతికిపోయిన గౌతమ్⇒ పదోవారంలో గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్⇒ 12 వారం.. ఎలిమినేట్ అయినవారితో నామినేషన్స్⇒ ఎవిక్షన్ షీల్డ్ గెలిచిన నబీల్⇒ పదమూడోవారంలో ఎవిక్షన్ షీల్డ్‌ను అవినాష్‌కు వాడిన నబీల్.. ఫలితంగా తేజ ఎలిమినేట్⇒ ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్⇒ బీబీ పరివారం వర్సెస్ మా పరివారం ఛాలెంజ్‌లో అన్ని గేముల్లోనూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లదే గెలుపు⇒ ఈ సీజన్ చిట్టచివరి టాస్క్ గెలిచి ప్రైజ్‌మనీకి రూ.1 యాడ్ చేసిన గౌతమ్⇒ దీంతో టోటల్ ప్రైజ్‌మనీ రూ.55 లక్షలకు చేరింది.⇒ తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ⇒ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా రామ్‌చరణ్⇒ బిగ్‌బాస్ 8 విన్నర్‌గా నిఖిల్, రన్నరప్‌గా గౌతమ్⇒ తర్వాతి మూడు స్థానాల్లో నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నారు.నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవకపోయినా, నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడకపోయినా గౌతమ్, అవినాష్ ఫైనల్స్‌లో ఉండేవారే కాదు. అప్పుడు వీళ్లకు బదులుగా వేరే ఇద్దరికి ఫైనల్స్‌లో చోటు లభించేది!చదవండి: ఫినాలేలో గౌతమ్‌పై నాగ్ సెటైర్లు.. కానీ చివర్లో మాత్రం..! -
Bigg Boss 8: నబీల్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ 8వ సీజన్లో మరో ఎలిమినేషన్. వరంగల్ బిడ్డ, యూట్యూబర్ నబీల్ టాప్-5లో నిలిచినప్పటికీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో హౌస్ నుంచి స్టేజీపైకి వచ్చేశాడు. ఫినాలే వరకు వచ్చినా సరే విజేత కాలేకపోయిన ఇతడు రెమ్యునరేషన్ మాత్రం బాగానే సంపాదించాడు. ఇంతకీ ఎంత మొత్తం అందుకుంటాడనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే)14 మందితో సెప్టెంబరు 1వ తేదీన బిగ్‌బాస్ 8వ సీజన్ మొదలైంది. యూట్యూబర్ నబీల్ అఫ్రిది పెద్దగా అంచనాల్లేకుండానే హౌసులోకి వచ్చాడు. ఒక్కోవారం తనదైన ఫెర్ఫార్మెన్స్ ఇస్తూ నెగ్గుకొచ్చాడు. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటికీ.. వాళ్లతో కూడా మంచి బాండింగ్ పెంచుకుంటూ ఇప్పుడు టాప్-5 ఫినాలే వరకు వచ్చాడు. కానీ విజేత రేసులో ఇతడు లేడని ఇప్పుడు ఎలిమినేట్ కావడంతో అర్థమైంది.ఫినాలే వరకు అంటే 15 వారాల పాటు నబీల్.. బిగ్‌బాస్ హౌసులో ఉన్నాడు. ఇకపోతే వారానికి రూ.2 లక్షలుగా నబీల్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ.30 లక్షల పారితోషికం అందుకున్నట్లే. ఏది ఏమైనా ఓ యూట్యూబర్‌గా హౌసులోకి అడుగుపెట్టి, ఫినాలే వరకు వచ్చి ఇంత మొత్తం రెమ్యునరేషన్‌గా అందుకోవడం విశేషమే. విజేత కానప్పటికీ మంచి మొత్తాన్ని అయితే అందుకున్నట్లేగా!(ఇదీ చదవండి: బిగ్‌బాస్: తేజకు నాగార్జున బంపరాఫర్.. అతడి పెళ్లికి..!) -
ఆ బాధతో 18వ అంతస్తు నుంచి దూకేద్దామనుకున్న గౌతమ్..
గత కొన్నిరోజులుగా నవ్వుతూ తుళ్లుతూ ఎంజాయ్ చేస్తున్న ఫైనలిస్టులను చివరిసారి ఏడిపించే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్. మీ జీవితంలోని అత్యంత బాధాకరమైన సంఘటనను పంచుకోమని చెప్పడంతో అందరూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. మరి ఎవరెవరు ఏమేం చెప్పారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..సోనియాను బ్లాక్ చేస్తానన్న ప్రేరణషో అయిపోయాక ఎవరితో కలిసుండాలనుకుంటున్నారు? ఎవరిని కలవకూడదనుకుంటున్నారో చెప్పమంటూ ఫాలో- బ్లాక్ గేమ్ ఆడించాడు బిగ్‌బాస్. దాదపు అందరితోనూ కలవాలనుకుంటున్న చెప్పారు టాప్ 5 కంటెస్టెంట్లు. ఎవరిని కలవకూడదన్న విషయానికి వస్తే.. సోనియా పర్సనాలిటీ నచ్చలేదంటూ తనను బ్లాక్ చేస్తానంది ప్రేరణ. తక్కువ పరిచయం వల్ల పృథ్వీని టెంపరరీగా బ్లాక్ చేశాడు గౌతమ్. నబీల్.. హరితేజ, సోనియాను బ్లాక్ చేస్తానన్నాడు. నిఖిల్.. బేబక్క, సీతను బ్లాక్ చేశాడు. అవినాష్.. పృథ్వీని టెంపరరీగా బ్లాక్ చేస్తానన్నాడు.మూడేళ్లు ఇంట్లో ఖాళీగా..తర్వాత చలిమంట వేసిన బిగ్‌బాస్.. జీవితంలోని బెస్ట్, వరస్ట్ సంఘటనలను పంచుకోమన్నాడు. నబీల్ మాట్లాడుతూ.. బైక్ యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్పాలయ్యాను. అదే నా చేదు జ్ఞాపకం అన్నాడు. నిఖిల్ మాట్లాడుతూ.. నేను ఆర్కిటెక్ట్ కోర్స్ చేస్తున్నప్పుడు సినిమా ఆఫర్ వచ్చింది. చదువు మధ్యలోనే వదిలేశాను. మూడేళ్లపాటు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను. రోజూ అమ్మ దగ్గర రూ.30 అడుక్కునేవాడిని. నువ్వు ఇంటికి భారమయ్యావు, నీకు తిండి పెట్టడమే కాకుండా ఖర్చులకు కూడా డబ్బివ్వాలా? అని తిట్టింది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చాకే..తర్వాత కన్నడ సీరియల్లో ఆఫర్ వచ్చింది. రోజుకు రూ.2500 ఇస్తామన్నారు. అంటే నెలకు రూ.75వేలు వస్తాయనుకున్నాను. కానీ పదిరోజులే షూటింగ్ జరిగింది. ఆ తర్వాత తెలుగు సీరియల్ చేశాను. అప్పటినుంచి నేను వెనుదిరిగి చూసుకోలేదు అని చెప్పాడు. ప్రేరణ నానమ్మ చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేసింది.ఏ పాపం చేశానో..గౌతమ్ మాట్లాడుతూ.. మెడిసిన్ చదువుతున్నప్పుడు ఒకమ్మాయితో బ్రేకప్ అయింది. ఆ బాధ తట్టుకోలేక నేను ఉంటున్న 18వ అంతస్థులోని బాల్కనీలో నుంచి దూకి చనిపోదామనుకున్నాను. కానీ నాతోపాటు నన్ను ప్రేమించేవాళ్లు గర్వపడేలా చేస్తే ఈ ప్రపంచమే దాసోహం అవుతుందని ఆలోచించి ఆగిపోయాను అన్నాడు. అవినాష్ మాట్లాడుతూ.. నేను, నా భార్య అను ఎన్నో కలలు కన్నాం. ఏ జన్మలో ఏ తప్పు చేశానో మాకు బాబు పురిటిలోనే చనిపోయాడు. నా చేతిలో కొడుకున్నాడు, కానీ వాడికి ప్రాణం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.యష్మిపై ఫీలింగ్స్?తర్వాత యాంకర్ సుమ వచ్చి సరదా టాస్కులు ఆడించింది. అలాగే ప్రేక్షకుల మనసులోని ప్రశ్నలను ఫైనలిస్టులను అడిగేసింది. కావాలని స్ట్రాటజీతో రెచ్చగొట్టి గొడవలు పెట్టుకుంటారా? అని గౌతమ్‌ను అడగ్గా అలా ఏం లేదని, దేనికైనా హర్ట్ అయితేనే గొడవపడతానన్నాడు. యష్మిపై నీకు నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయా? లేదా లవ్ యాంగిల్ కోసం వేసిన స్ట్రాటజీయా? అని అడగ్గా మొదట్లో కొంచెం ఫీల్ ఉండేది కానీ ఒకసారి అక్క అన్నాక అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవని గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు.ఫైర్ తగ్గలేదన్న నబీల్రాయల్స్(వైల్డ్ కార్డ్స్) వచ్చాక నీలో ఎందుకు ఫైర్ తగ్గింది? అని నబీల్ను అడగ్గా.. తనలో ఫైర్ ఎక్కడా తగ్గలేదని, కాకపోతే కొన్నిసార్లు కనిపించకపోయుండొచ్చన్నాడు. పృథ్వీ కాకుండా ఈ ఇంట్లో ఎవరిని ఎక్కువ నమ్ముతారు? అని నిఖిల్‌ను అడగ్గా ఆ రేంజ్లో ఎవరినీ నమ్మలేనన్నాడు. సీజన్ 4 లేదా సీజన్ 8లో ఏది బెస్ట్ అని ప్రశ్నించగా అవినాష్ క్షణం ఆలోచించుకోకుండా నాలుగో సీజన్ అని చెప్పాడు.అక్కడే అసలు గొడవనిఖిల్, గౌతమ్.. మీరిద్దరూ ఎందుకు ఎప్పుడూ గొడవపడతారు? అన్న ప్రశ్నకు అభిప్రాయబేధాలు అని ఇద్దరూ బదులిచ్చారు. తర్వాత ఓ టాస్క్‌లో నిఖిల్ గెలవడంతో అతడి తమ్ముడి వీడియో సందేశాన్ని చూపించాడు. అనంతరం ప్రేరణ గెలవడంతో తనకు ఓ ఫోటోఫ్రేమ్ ఇచ్చారు. అలా ఎమోషన్స్, ఆటపాటలతో ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎవర్నీ వాడుకోలేదన్న నిఖిల్.. ప్రేరణ బెస్ట్ మెగా చీఫ్!
టాప్ 5 ఫైనలిస్టుల్లో గౌతమ్, అవినాష్ జర్నీ వీడియోలు అయిపోయాయి. ఈరోజు మిగతా ముగ్గురి వీడియోలు ప్లే చేశారు. మరి బిగ్‌బాస్ వారిని ఏ రేంజ్లో పొగిడారో నేటి (డిసెంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..మీ మనసు ఒప్పుకోలేదుఒక్క బొట్టుతో మొదలై మహానదిగా మారే నదిలా మీ ప్రయాణం సాగింది. ఎన్నో నిందలు వేసినా ఏకాగ్రత కోల్పోలేదు. ఎన్నో బంధాలు మీతో చివరివరకు కలిసి నడవలేకపోయాయి. ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు. మీరిద్దరూ ఒకరితో ఒకరు, ఒకరికోసం ఒకరు నిలబడ్డారు, ప్రత్యర్థులతో తలపడ్డారు. గ్రూప్ గేమ్ అని మీ ఆటను వేలెత్తి చూపించినప్పుడు మీ మనసు అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు మీ స్నేహం కోసం ఆడారు. రక్తాన్ని చిందించావ్మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. అప్పుడు మీ మనసుకైన గాయాన్ని మనసులోనే దాచుకున్నారు. మీరొక స్మార్ట్ గేమర్. మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్‌గా ఉన్నారు. మీ సత్తాను పరీక్షించే టాస్కుల్లో రక్తాన్ని సైతం చిందించి దూకుడు చూపించారు. మీరు నిజమైన జెంటిల్మెన్. రాయల్స్(వైల్డ్ కార్డ్స్) ఇంట్లోకి వచ్చినప్పుడు ఓజీ (పాత కంటెస్టెంట్ల)కోసం లీడర్లా నిలబడ్డారు. మీకన్నా ఇంటికోసమే ఎక్కువ ఆలోచించారు. ఆ లోటు నాకు తెలుసుసరదాకు మీరేం చేసినా హద్దులు దాటలేదు. మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చినా మీ మనసులోని ఆ ఒక్క లోటు నాకు తెలుసు. మనసుకు దగ్గరైన ప్రతీది మీకు దక్కాలని కోరుకుంటున్నా అంటూ అతడి ప్రియురాలు కావ్య తిరిగి అతడితో కలిసిపోవాలని పరోక్షంగా కోరుకున్నాడు. తర్వాత జర్నీ వీడియోలో నిఖిల్‌కు రాఖీ భాయ్ లెవల్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ప్రేక్షకుల రుణం తీర్చుకోలేనన్న నిఖిల్. ఎవరినీ ఆడుకుని, వాడుకుని ఇక్కడిదాకా రాలేదని కుండబద్ధలు కొట్టి చెప్పాడు.ఆ పట్టుదల వల్లే..తర్వాత ప్రేరణ వంతు రాగా.. సందర్భోచితంగా మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరే ఈ స్థాయిలో నిలబెట్టింది. పసిపాపలాంటి అమాయకత్వం అందరికీ దగ్గర చేసింది. ఓటమిని ఒప్పుకోని తత్వమే మిమ్మల్ని ఎన్నోసార్లు గెలుపు అంచులవరకూ తీసుకెళ్లింది. ఆ పట్టుదల వల్లే మెగా చీఫ్ అయ్యారు. కానీ అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. తనమన బేధం లేకుండా మెగా చీఫ్‌గా వ్యవహరించారు. కానీ ఇంటిసభ్యుల దృష్టిలో వరస్ట్ మెగా చీఫ్ అయ్యారు. మనసారా ఏడ్చేసిన ప్రేరణఅయితే బిగ్‌బాస్ దృష్టిలో మాత్రం మీరు బెస్ట్ మెగా చీఫ్. తప్పు జరిగితే స్నేహితుల్నైనా నామినేట్ చేసేందుకు వెనుకాడలేదు. మీలోని మొండిఘటం మిమ్మల్ని ప్రశ్నించినవారికి చెమటలు పట్టించింది. ఆ లక్షణమే టాప్ 5కు తీసుకొచ్చింది. వివాహితలు కూడా ఎంతో సాధించివచ్చని, మీ ప్రయాణంతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తారని భావిస్తున్నా.. అంటూ బిగ్‌బాస్ తన జర్నీ వీడియో చూపించాడు. దీన్నంతటినీ ఆస్వాదిస్తూనే మనసారా ఏడ్చేసింది ప్రేరణ.వరంగల్ కా షేర్ నబీల్అనంతరం నబీల్ అఫ్రిది గురించి బిగ్‌బాస్ మాట్లాడుతూ.. వరంగల్ కా షేర్ నబీల్ అన్న పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లో సుపరిచితం. మీ టాలెంట్, వ్యక్తిత్వాన్ని కోట్లమందికి తెలియజేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎవిక్షన్ షీల్డ్ త్యాగం చేసి ఉన్నతంగా ఆలోచించే గుణానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. మీరు సెల్ఫ్ మేడ్. అందుకే ఆత్మగౌరవం కూడా ఎక్కువే. దాన్ని ప్రశ్నించినవారికి ఆటతోనే ధీటుగా జవాబిచ్చారు. బలహీనత కాదు బలంఈ ఇంటి మొదటి మెగా చీఫ్‌గా నిలిచారు. మీలో ఫైర్ తగ్గిందన్నప్పుడు మీ సామర్థ్యాన్ని ప్రశ్నించుకున్నారు. మీ చుట్టూ ఉన్న తారల తళుకుబెళుకుల మధ్య ఒక సామాన్యుడిలా ఒంటరై నిల్చున్నట్లు మీకనిపించింది. కానీ అది మీ బలహీనత కాదు మీ బలం అంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు. అది చూసి నబీల్ ఓపక్క సంతోషిస్తూనే మరోపక్క కంటతడి పెట్టుకున్నాడు. మొత్తానికి అందరి జర్నీ వీడియోలు పూర్తయ్యాయి. ఇక విన్నర్‌ను తేల్చడం మాత్రమే మిగిలింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేమ పెళ్లి ముద్దు అన్న నిఖిల్.. అవినాష్‌ను ఆడుకున్న బిగ్‌బాస్
నామినేషన్స్ అయిపోయాయి. బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 5 ఫైనలిస్టులు మాత్రమే మిగిలారు. ఈ చివరివారంలో కూడా ప్రైజ్‌మనీ పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ గేమ్స్‌లో గెలవకపోతే ప్రైజ్‌మనీ కట్ అవుతుందన్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..సీరియల్ పరివారం వర్సెస్ బీబీ పరివారంసీరియల్ సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌస్‌కు వస్తారని చెప్పాడు బిగ్‌బాస్. మా సీరియల్ పరివారంతో బీబీ పరివారం పోటీపడి ఆటలు ఆడి గెలిచి ప్రైజ్‌మనీని పెంచుకోవచ్చన్నాడు. ఓడిపోతే ప్రైజ్‌మనీ కూడా తగ్గుందన్నాడు. మొదటగా నువ్వుంటే నా జతగా సీరియల్ టీమ్ అర్జున్ కళ్యాణ్, అను హౌస్‌లోకి వచ్చారు. వీరితో ఆడాల్సిన గేమ్‌కు రూ.12,489 ప్రైజ్‌మనీ నిర్ణయించారు. ఒగ్గుకథ చెప్పిన అవినాష్ఈ ఆటలో సీరియల్ పరివారంతో నబీల్-ప్రేరణ ఆడి గెలిచారు. అలా పన్నెండువేల రూపాయల్ని ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. తర్వాత అవినాష్ టాప్ 5 ఫైనలిస్టులపై ఒగ్గుకథ చెప్పి అలరించాడు. ఇప్పుడెలాగూ చేసేదేం లేదని కాసేపు దాగుడుమూతలు ఆడారు. ఈ క్రమంలో అవినాష్ యాక్షన్ రూమ్‌లో దాక్కున్నాడు. ఇంతలో బిగ్‌బాస్ ఆ గదికి తాళం వేసి లైట్లు ఆఫ్ చేశాడు. కాసేపటికి ఘల్లు ఘల్లుమంటూ గజ్జెల శబ్దం ప్లే చేశాడు.అవినాష్‌ను ఆటాడుకున్న బిగ్బాస్దీంతో అవినాష్ దడుసుకుని చచ్చాడు. తలుపు తీయండి బిగ్‌బాస్ అని వేడుకున్నా కనికరించలేదు. దెయ్యం కేకలు, కాంచన అరుపుల సౌండ్స్ వినిపించడంతో అవినాష్ ఏడ్చినంత పని చేశాడు. చివరకు గది తాళం తీయడంతో బయటకు పరిగెత్తాడు. అతడిని చూసి హౌస్మేట్స్ అందరూ ఘొల్లుమని నవ్వారు.ప్రేమ వివాహం చేసుకుంటా: నిఖిల్అనంతరం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీమ్ నుంచి ప్రభాకర్, ఆమని వచ్చారు. తమ సీరియల్ స్టోరీలైన్ గురించి చెప్తూ హౌస్‌మేట్స్‌ను మీలో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారని అడిగారు. అందుకు నిఖిల్.. ప్రేమవివాహం చేసుకుంటానన్నాడు. పెద్దలను ఒప్పించాకే తన పెళ్లి జరుగుతుందన్నాడు. ఇక ప్రభాకర్- ఆమనితో ప్రేరణ - అవినాష్ బాల్స్ గేమ్ ఆడారు. ఇందులో సీరియల్ పరివారంపై బీబీ పరివారం గెలిచి రూ.15,113 పొందారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నువ్వేం ఆడావో తెలీట్లేదు.. గౌతమ్‌పై విషం కక్కిన విష్ణు
ప్రైజ్‌మనీ గెలిస్తే ఏం చేస్తావ్? ప్రతి సీజన్లో అడిగినట్లే ఈ సీజన్లోనూ టాప్ 6 కంటెస్టెంట్లను ఇదే ప్రశ్న అడిగాడు నాగార్జున. ముందుగా అవినాష్.. మా అన్నయ్యకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో పెద్దమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని తన గొప్ప ఆలోచనను బయటపెట్టాడు. మరి మిగతావారు ఏమేం అన్నారు? విష్ణు వెళ్లేముందు ఏం చెప్పిందో తెలియాలంటే నేటి (డిసెంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే!అందరికీ పంచిపెడతానన్న విష్ణునబీల్ ప్రైజ్‌మనీ గెలిస్తే తన కెరీర్‌పై ఇన్వెస్ట్ చేస్తానని, మంచి సినిమా తీస్తానని చెప్పాడు. ప్రేరణ.. నా పేరెంట్స్‌కు ఉన్న అప్పులు తీర్చేస్తా.. మిగిలిన డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెడతా అని తెలిపింది. విష్ణుప్రియ.. అభయ్ నవీన్ ఫారిన్ ట్రిప్‌కు రూ.2 లక్షలు, మణికంఠ కారుకు రూ.1.5 లక్ష, గంగవ్వ ఇంటికోసం రూ.5 లక్షలు, పృథ్వీకి గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఇలా అందరికీ పంచాలనుకుంటున్నాను అని చెప్పింది.ప్రైజ్‌మనీతో ఏం చేస్తానంటే?నిఖిల్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నా.. అమ్మానాన్నలకు ఓ ఇల్లు కట్టాలి. ఇప్పటిదాకా నాకోసం ఎంతో ఖర్చుపెట్టిన మా అన్న, తమ్ముడి కోసం ఈ డబ్బు ఉపయోగిస్తాను అన్నాడు. గౌతమ్.. మా అమ్మానాన్న రిటైర్మెంట్ కోసం ప్రైజ్‌మనీ వాడతాను. అలాగే గంగవ్వ తన కూతురికి కట్టివ్వాలనుకున్న ఇంటి కోసం రూ.10 లక్షలు ఇద్దామనుకుంటున్నాను అని తెలిపాడు.మీ వాడిగా స్వీకరించారు: నిఖిల్అనంతరం నాగార్జున నిఖిల్‌ను సెకండ్ ఫైనలిస్ట్‌గా ప్రకటించాడు. ఈ సందర్భంగా నిఖిల్.. నేను ఆర్టిస్టుగా ఇక్కడికి వచ్చినప్పుడు బయటివాడిని అని కామెంట్స్ చేశారు. కానీ మీరు అది తప్పని రుజువు చేశారు. నన్ను మీ వాడిగా స్వీకరించారు అని ఎమోషనలయ్యాడు. మూడో ఫైనలిస్ట్‌గా గౌతమ్‌ను ప్రకటించాడు. నాలుగో ఫైనలిస్ట్‌గా ప్రేరణను ప్రకటించగానే ఆమె షాకై, ఆ వెంటనే సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది.నిఖిల్‌కు ముద్దుపెట్టిన గౌతమ్ఈ సీజన్లో ఎవరికైనా థాంక్యూ, సారీ చెప్పాలనుకుంటే చెప్పేయమన్నాడు నాగ్. విష్ణుప్రియ.. తనతో స్నేహం చేసిన సీతకు థాంక్యూ.. తెలిసీతెలియకుండా కొన్నిసార్లు బాధపెట్టినందుకు రోహిణికి సారీ చెప్పింది. నబీల్.. ఏదున్నా మణికంఠకు షేర్‌తో చేసుకునేవాడినంటూ అతడికి థాంక్యూ.. ప్రేరణను నామినేట్ చేసినందుకు సారీ చెప్పాడు. నిఖిల్.. నేనెలా ఉన్నానో అలాగే యాక్సెప్ట్ చేసినందుకు పృథ్వీకి థ్యాంక్స్.. గౌతమ్‌పై నోరు జారినందుకు క్షమించమన్నాడు. ఈ సందర్భంగా గౌతమ్.. నిఖిల్‌కు బుగ్గపై ముద్దు పెట్టాడు.థాంక్స్, సారీ.. రెండూ నిఖిల్‌కు చెప్పిన గౌతమ్అవినాష్.. ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చిన నబీల్‌కు థాంక్స్.. నా ఫ్రెండ్ అయిన విష్ణును నామినేట్ చేసినందుకు సారీ అన్నాడు. గౌతమ్ వంతు రాగా.. ఇప్పటివరకు జరిగిన అన్నింటికీ సారీ అంటూ నిఖిల్‌ను హత్తుకున్నాడు. అలాగే అందరికీ వండిపెట్టినందుకు అతడికి థాంక్యూ చెప్పాడు. ప్రేరణ.. ప్రతీది నబీల్‌కు చెప్పుకుంటానని అతడికి థాంక్యూ చెప్పింది. విష్ణుపై నోరు జారినందుకు క్షమాపణలు తెలిపింది. చివరగా నాగ్.. నబీల్ను ఐదో ఫైనలిస్ట్‌గా పేర్కొంటూ విష్ణు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.గౌతమ్‌పై విష్ణు సెటైర్లుఎప్పుడూ గ్రహాలు అంటూ వేదాంతం మాట్లాడే విష్ణుతో అందుకు సంబంధించిన గేమ్ ఆడించాడు నాగ్. ట్రోఫీ అనే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం/ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలన్నాడు. దీంతో విష్ణు.. గౌతమ్ ఆట ఇప్పటికీ తెలియట్లేదు.. అర్జంట్‌గా నువ్వేం ఆడావో చూసేయాలంటూ అతడిని ఐదో స్థానంలో పెట్టింది. అవినాష్‌ను నాలుగు, నబీల్ను మూడో స్థానంలో ఉంచింది. ప్రేరణ గెలవాలంటూనే ఆమెను రెండో స్థానంలో పెట్టింది.డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలేట్రోఫీకి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం నిఖిల్ అంటూ అతడికి విన్నర్ స్థానంలో కూర్చోబెట్టింది. ఈ పిచ్చిపిల్లను, నత్తిబుర్రను ఇన్నాళ్లు భరించినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ వీడ్కోలు తీసుకుంది. వచ్చేవారమే గ్రాండ్ ఫినాలే అని ప్రకటించిన నాగార్జున.. ఎపిసోడ్ అయిపోయిన క్షణం నుంచి శుక్రవారం వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయన్నాడు. మరి నబీల్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్, అవినాష్‌లలో ఎవరు గెలవాలనుకుంటున్నారో వారికి ఓట్లు వేసేయండి.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రోహిణి ఎలిమినేట్.. తప్పు ఒప్పుకొన్న ప్రేరణ
బిగ్‌బాస్ 8 ముగింపుకు ముహూర్తం పెట్టేసినట్లు నాగార్జునే స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉండగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌తో ఇద్దర్ని పంపించేస్తున్నట్లు తెలిపాడు. ఈ పద్నాలుగు వారాల జర్నీలో మీరు రిగ్రెట్ ఫీలైన వారమేంటో చెప్పాలన్నాడు. అందుకు ప్రేరణ పదకొండో వారం అని చెప్పింది. మెగా చీఫ్ అయినప్పుడు సాఫ్ట్‌గా ఉండాల్సింది. కానీ బ్యాలెన్స్ కోల్పోయానని తప్పు ఒప్పేసుకుంది. సంచాలక్‌గా బాగా చేశావా?నిజమే, అప్పటిదాకా ప్రేరణ గ్రాఫ్ రయ్యిమని పైకెళ్లింది. కానీ మెగా చీఫ్ అయిన వెంటనే తన డౌన్‌ఫాల్ మొదలైంది. ఇక నిన్నటి రంగుపడుద్ది టాస్క్‌లో సంచాలక్‌గా బాగా చేశావని అనుకుంటున్నావా? అని నాగ్ ప్రశ్నించగా లేదంటూ నిజం ఒప్పేసుకుంది. మరోవైపు పోల్‌కు సరిగా తాడు చుట్టాల్సిన గేమ్‌లో నబీల్ ఇష్టమొచ్చినట్లు తాడును కట్టి తానే గెలిచానని వాదించాడు. అప్పుడు స్వయంగా బిగ్‌బాసే కలగజేసుకుని అది చుట్టడమా? అని కౌంటర్ ఇచ్చాడు. స్వార్థంగా ఆలోచించా..ఇప్పుడు నాగ్ కూడా సరిగ్గా చుట్టడమేంటో ఏంటో తెలుసా? అంటూ అతడికి క్లాస్ పీకాడు. నీ తిత్తర ఎప్పుడు తగ్గుతుంది? అని ప్రశ్నించాడు.ఫైనలిస్ట్ అవడం కోసం చెక్‌పై రూ.15 లక్షలు రాశావు, అలాంటప్పుడు దాన్ని ఎందుకు చించేశావని అడిగాడు. కొంచెం సెల్ఫిష్‌గా ఉందామనే రాశా.. కానీ తర్వాత మరీ ఎక్కువ డబ్బు రాసేశాననిపించింది అని తెలిపాడు. డబుల్ ఎలిమినేషన్సెల్ఫిష్గా ఉండి గేమ్ సరిగా ఆడకపోతే ఎవరూ గెలవలేరన్నాడు నాగ్. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్నాడు. ఇప్పటికే శనివారం షూటింగ్ పూర్తవగా అందులో రోహిణిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇంకో ఎలిమినేషన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ను తప్పుపట్టిన బిగ్‌బాస్.. అయినా అతడిదే గెలుపు!
ప్రేరణ ఆటలో గెలిచింది. కానీ సంచాలకురాలిగా మాత్రం తడబడింది. నిన్న ప్రేరణ ఓట్లు అడిగే ఛాన్స్ పొందగా నేడు ఆ అదృష్టం నబీల్ను వరించింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అడ్డదిడ్డంగా చుట్టేసిన నబీల్ఓట్ అప్పీల్ గెలిచేందుకు బిగ్‌బాస్ క్రాసింగ్ పాత్ అనే మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో నబీల్ అడ్డదిడ్డంగా తన తాడును పోల్‌కు చుట్టేసి అందరికంటే ముందు గంట కొట్టాడు. తర్వాత రోహిణి గంట కొట్టింది. అనంతరం ప్రేరణ, గౌతమ్, నిఖిల్ వరుసగా గంట కొట్టారు. అయితే నిఖిల్ తన పోల్‌కు బదులు వేరేవారి పోల్‌కు తాడు చుట్టాడు. దీంతో నాలుక్కరుచుకుని మళ్లీ తన పోల్‌కు తిరిగి చుట్టాడు. విష్ణుప్రియ, అవినాష్ చివరి స్థానాల్లో ఉన్నారు.నేనే గెలిచా: ప్రేరణహౌస్మేట్స్ అందరూ కలిసి ఎవరు గెలిచారో చెప్పాలన్నాడు. నబీల్ తాడు సరిగా చుట్టలేదని, తానే గెలిచానని ప్రేరణ వాదించింది. లేదు, నేనే ఫస్ట్ అని నబీల్ అరుస్తూ ఉండటంతో ఆమె అతడిని ఇమిటేట్ చేసింది. ఇన్నాళ్లూ అవతలివారిని వెక్కిరించిన నబీల్.. తనను ఒకరు ఇమిటేట్ చేయడంతో తట్టుకోలేకపోయాడు. నన్ను వెక్కిరిస్తే బాగోదంటూ వార్నింగ్ ఇచ్చాడు.నబీల్‌కు బిగ్‌బాస్ కౌంటర్చివరకు అందరూ కలిసి నబీల్ గెలిచినట్లు ప్రకటించారు. అప్పుడు బిగ్‌బాస్.. మీరు తాడును సరిగా చుట్టారని అనుకుంటున్నారా? అని అడగడంతో అందరూ మనసు మార్చుకుని ప్రేరణ పేరు చెప్పారు. అయినా నబీల్ తనది కరెక్టే అనడంతో మీకు చుట్టడమంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించాడు. దీంతో అతడు కిక్కురుమనకుండా ఉండిపోయాడు.అయోమయం.. గందరగోళంఈ ఆటలో ఎవరు ఓడిపోయారని ప్రేరణను అడగ్గా ఆమె మొదట అవినాష్ పేరు చెప్పింది. గంట కొట్టేశాక మళ్లీ ఆడటం తప్పు కాదా? అని అవినాష్ అడగడంతో ఆమె మనసు మార్చుకుని నిఖిల్ పేరు చెప్పింది. అందుకతడు అభ్యంతరం చెప్పడంతో ఆమె మళ్లీ యూటర్న్ తీసుకుని అవినాష్ పేరు చెప్పి ఇదే ఫైనల్ నిర్ణయమంది. దాంతో అవినాష్ రేసు నుంచి తప్పుకున్నాడు.నబీల్‌కు ఓట్లు అడిగే ఛాన్స్టర్ఫ్ వార్ అని బిగ్‌బాస్ మరో ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో చివరివరకు సర్కిల్లో ఉన్నవారు విజేతగా నిలుస్తారు. మొదటగా ప్రేరణను తోసేశారు. తర్వాత వరుసగా గౌతమ్, నిఖిల్, రోహిణిని తోసేశారు. చివర్లో నబీల్, విష్ణుప్రియ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ పొందాలో ఇంటిసభ్యులు నిర్ణయించాలన్నాడు. అందరూ కలిసి నబీల్ను సెలక్ట్ చేశారు.ప్రాణం పోయినా సరేనని..నబీల్ మాట్లాడుతూ.. నేనొక సామాన్యుడిని. సినిమాల్లో నటుడవ్వాలని కలలు కన్నాను. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినా ఎక్కడా అవకాశం రాలేదు. ఎవరో అవకాశాలివ్వడమేంటని సోషల్ మీడియాలో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. తొమ్మిది సంవత్సరాల్లో నాకు వచ్చిన పెద్ద అవకాశం బిగ్‌బాస్. ప్రాణం పోయినా సరే అని టాస్కులు గెలవాలని ఆడాను. నన్ను విజేతగా చూడాలన్నది మా అమ్మ కల. దాన్ని మీరే నిజం చేయాలి అంటూ ప్రేక్షకులను ఓట్లు వేయమని అభ్యర్థించాడు.ఎన్నాళ్లకెన్నాళ్లకు..అనంతరం ప్రముఖ చెఫ్ సంజయ్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. అలాగే వారికోసం రుచికరమైన భోజనం వండి మరీ తీసుకొచ్చాడు. నిఖిల్, గౌతమ్ మధ్య దూరాన్ని చెరిపేస్తూ ఒకరికొకరు ఫుడ్ తినిపించుకోమన్నాడు. స్టార్టర్, బిర్యానీ, ఐస్‌క్రీమ్స్ అన్నీ కడుపారా తిన్న కంటెస్టెంట్లు ఇది జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమంటూ ఫుల్ ఖుషీ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: తనదే కరెక్ట్ అన్న ప్రేరణ.. ఒప్పుకోని నబీల్
హౌస్‌లో నామినేషన్స్‌కు స్వస్తి పలికారు. బిగ్‌బాసే స్వయంగా అందర్నీ(ఫైనలిస్ట్ అవినాష్ మినహా) నామినేట్ చేశారు. అంటే ఇకనుంచి ఇంట్లో కొట్లాటలుండవా.. ఈ రెండువారాలు పిక్నిక్లా ఎంజాయ్ చేస్తారా? అనుకునేరు. ఫినాలేకు ఇంకో రెండురోజులుందనగా కూడా మేము గొడవపడేందుకు రెడీ అన్నట్లుగానే ఉన్నారు కంటెస్టెంట్లు.ఓట్ అప్పీల్ఓట్ అప్పీల్ కోసం బిగ్‌బాస్ టాస్కులు ఇస్తున్నాడు. ఇప్పటికే ఓసారి ప్రేరణ గెలిచి ప్రేక్షకుల్ని తనకు ఓటేయమని అభ్యర్థించే ఛాన్స్ గెలిచింది. నేడు మరొకరికి ఛాన్స్ ఇచ్చేందుకు రెండు గేమ్స్ పెట్టనున్నాడు. అందులో మొదటిదే క్రాసింగ్ పాత్స్. ఇందులో నిఖిల్ తన తాళ్లను తనకు సంబంధించిన పోల్‌కు కాకుండా మరో పోల్‌కు పెట్టి బెల్ కొట్టాడు. నిఖిల్‌ను విజేతగా ప్రకటించిన ప్రేరణఈ తప్పు గురించి అవినాష్ అడుగుతుంటే అదసలు తప్పే కాదని వాదించింది ప్రేరణ. అటు నబీల్ తన తాడును అడ్డదిడ్డంగా కట్టడంతో అతడినసలు లెక్కలోకే తీసుకోలేదు. దీంతో నబీల్ గొడవకు దిగాడు. నా పోల్ సరిగ్గానే ఉంది.. నువ్వే కావాలని నేను చుట్టిన తాడును చెడగొడుతున్నావ్.. అని మండిపడ్డాడు. దీంతో ప్రేరణ ఇమిటేట్ చేయగా.. నన్ను వెక్కిరించకు, ఇది జోక్ కాదంటూ గద్దించాడు. మొత్తానికి ఈ గేమ్‌లో ప్రేరణ గెలిచింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నీచంగా మాట్లాడిన గౌతమ్.. కొంపముంచేంత పని చేసిన నబీల్!
నిన్నమొన్నటివరకు కిచెన్‌లో ఎంత సేపు వంట చేసుకోవాలన్నది బిగ్‌బాసే డిసైడ్ చేసేవాడు. గంట, రెండు గంటలు మాత్రమే టైమ్ ఇచ్చేవాడు. సీజన్ ముగింపుకు వచ్చేసిన సందర్భంగా కిచెన్ టైమర్‌ను అన్లిమిటెడ్ చేసేశాడు. నామినేషన్స్ లేకపోయినా అలాంటి ఓ ప్రక్రియ పెట్టడంతో గౌతమ్, నిఖిల్ రెచ్చిపోయి మాట్లాడుకున్నారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..రోహిణిని ఆటపట్టించిన గౌతమ్చాలాకాలంగా మనసులో దాచుకున్న మాటను చెప్పేస్తున్నానంటూ రోహిణి దగ్గర తెగ సిగ్గుపడిపోయాడు గౌతమ్. కానీ నోరు తెరుస్తూనే.. ఈ హౌస్‌లో ఉన్న అమ్మాయిలందరూ నా అక్కలు. ఓ సహోదరుడిగా నీకు ఎల్లప్పటికీ తోడుగా, నీడగా ఉంటాను అని చెప్పాడు. ఆ మాటతో అవాక్కయిన రోహిణి.. ఎవడ్రా నీకు అక్క అంటూ గౌతమ్‌ను సరదాగా తిట్టిపోసింది.సెకండ్ ఫైనలిస్ట్ ఎంపికతర్వాత బిగ్‌బాస్.. ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ మినహా మిగతా అందరూ నేరుగా నామినేట్ అయినట్లు ప్రకటించాడు. రెండో ఫైనలిస్ట్ ఎంపిక కోసం ఓ టాస్క్ పెట్టాడు. ఎవరైతే ఫినాలేలో ఉండకూడదనుకుంటున్నారో వారి ఫోటోను కాల్చేయాలన్నాడు. చివరకు ఎవరి ఫోటో అయితే కాలకుండా ఉంటుందో వాళ్లు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పాడు. మొదటగా అవినాష్.. విష్ణుప్రియ ఫోటో కాల్చేశాడు. విష్ణుప్రియ వంతురాగా.. ఎవరితోనూ ఎక్కువగా కలవట్లేదు, నీ గేమ్ అర్థం కావట్లేదంటూ గౌతమ్ ఫోటో కాల్చేసింది. అమ్మాయిలను వాడుకున్నావ్గౌతమ్.. పదేపదే పోట్రే చేస్తున్నానని నాపై లేనిపోని నింద వేశావంటూ నిఖిల్‌ను రేసులో నుంచి తీసేయాలనుకున్నాడు. నిఖిల్ స్పందిస్తూ.. వచ్చినప్పటినుంచి నువ్వు అదే చేస్తున్నావని వాదనకు దిగాడు. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని వాడుకుంది నువ్వు, అమ్మాయిలను వాడుకున్నావ్ అంటూ నీచంగా మాట్లాడాడు. ఇలానే మరోసారి కాస్త వల్గర్‌గా మాట్లాడటంతో నిఖిల్ కోపాన్ని అణుచుకోలేకపోయాడు. ఇంకోసారి నోరు జారి మాట్లాడితే బాగోదని హెచ్చరించాడు.రోహిణిని తప్పించిన నిఖిల్ఈ గొడవను ఆపేయమని చెప్తున్నా కూడా.. గౌతమ్ వినకుండా విషయాన్ని సాగదీస్తూనే ఉన్నాడు. యష్మికి గాజులు సెట్ చేస్తూ ఆమెకు హోప్స్ పెట్టడం తప్పంటూ తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి మరింత ఇరిటేషన్ తెప్పించాడు. అనంతరం నిఖిల్.. నామినేషన్స్‌లోకి రాలేదంటూ రోహిణిని రేసు నుంచి తప్పించాడు. నామినేషన్స్‌లోకి రాకపోయినా నేను అన్ని గేమ్స్ గట్టిగానే ఆడాను అని రోహిణి సమాధానమిచ్చింది. చివర్లో ప్రేరణ, నబీల్.. ఇద్దరు మాత్రమే మిగిలారు. వీరికి బిగ్‌బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఇమ్యూనిటీ కొనుక్కోవాలన్న బిగ్బాస్మీ ముందున్న చెక్‌పై రూ.15 లక్షల వరకు ఎంతైనా రాసి ఇమ్యూనిటీ కొనుక్కోవచ్చన్నాడు. ఆ డబ్బు విన్నర్ ప్రైజ్‌మనీలో నుంచి కట్ అవుతాయన్నాడు. కాసేపు ఆలోచించుకున్నాక ఇద్దరూ తమకు తోచినంత అమౌంట్ రాశారు. ఇంతలో మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇమ్యూనిటీ కొనుక్కోకుండా వారిని నామినేషన్స్‌లో ఉంచేందుకు హౌస్మేట్స్ ఒప్పించవచ్చన్నాడు.చెక్కులు చింపేయమన్న హౌస్మేట్స్ప్రైజ్మనీని ఒక్కో రూపాయి సంపాదిస్తూ ఇక్కడివరకు తేవడానికి అందరం ఎంతో కష్టపడ్డాం. మీకు జనాలు ఓటు వేశారు కాబట్టే పద్నాలుగోవారం దాకా వచ్చారు అని నిఖిల్ చెక్ చించేయమన్నాడు. మిగతావాళ్లు కూడా అదే సలహా ఇచ్చి ఎలాగోలా ఒప్పించడంతో ప్రేరణ, నబీల్.. ఫైనలిస్ట్ స్థానాన్ని కొనుక్కోవాలనుకోవడం లేదని చెప్పారు. రాసిన చెక్కులు చింపేయడానికంటే ముందు ఇద్దరు ఎంత రాశారో చెప్పాలన్నాడు. నబీల్ స్వార్థంప్రేరణ.. రూ.4,30,000 రాయగా నబీల్ ఏకంగా రూ.15 లక్షలు రాసేశాడు. అది విని హౌస్మేట్స్ నోరెళ్లబెట్టారు. కంటెస్టెంట్లే కాదు చూసే జనాలు కూడా వీళ్లు ఇంత స్వార్థంగా ఉన్నారేంటని ఈసడించుకోవడం ఖాయం. ఏదేమైనా వీరిద్దరూ మనసులు మార్చుకుని చెక్కులు చించేయడంతో నేరుగా ఫైనల్‌కు వెళ్లే అవకాశం కోల్పోయారు. ఈ వారం గౌతమ్, రోహిణి, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అమ్మలా ప్రేమను పంచాడు, నెత్తిన పెట్టుకున్నాడు: విష్ణుప్రియ లవ్‌స్టోరీ
అవినాష్‌ను తక్కువ అంచనా వేసిన నబీల్, ప్రేరణకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. ఇచ్చిన రెండు గేమ్స్‌లోనూ అతడే గెలిచి విన్నరయ్యాడు. కంటెండరవ్వాలనుకున్న నబీల్ రేసులోనే లేకుండా పోయాడు. అటు విష్ణుప్రియ... తన మాజీ ప్రియుడిని గుర్తు చేసుకుంది. తన ప్రేమ కహానీని పృథ్వీతో పంచుకుంది. అదేంటో నేటి (నవంబర్ 27) ఎపిసోడ హైలైట్స్‌లో చదివేయండి..తక్కువ అంచనా వేశారుటికెట్ టు ఫినాలే కోసం హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడించేందుకు మానస్, ప్రియాంక జైన్ బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చారు. వీళ్లు ప్రేరణ, నబీల్ను గేమ్ ఆడేందుకు సెలక్ట్ చేశారు. అయితే ఈ రోజు బ్రెయిన్ గేమ్‌లో నలుగురు ఆడే ఛాన్స్ ఉందంటూ మరో ఇద్దర్ని ఎంపిక చేయమన్నాడు బిగ్‌బాస్. దీంతో ప్రేరణ, నబీల్.. ఐక్యూ అంతగా లేదు, బ్రెయిన్ గేమ్ ఆడలేరంటూ అవినాష్, పృథ్వీని సెలక్ట్ చేశారు.సుడోకు గేమ్అలా ఈ నలుగురికి సుడోకు గేమ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ముందుగా నబీల్ గంట కొట్టి గెలిచేసినంత బిల్డప్ ఇచ్చాడు. తీరా చూస్తే అన్నీ తప్పులతడకగానే ఉంది. ఏ ఒక్కరూ సుడోకు పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్ క్లూ ఇచ్చాడు. ఆ క్లూ అందుకుని అవినాష్ చకచకా సుడోకు పూర్తి చేసి గంట కొట్టాడు. తర్వాత ప్రేరణ, పృథ్వీ, నబీల్ గేమ్ కంప్లీట్ చేశారు. వీళ్లందరికీ బిగ్‌బాస్ కొన్ని మూటలు ఇచ్చాడు. అందులో అవినాష్‌కు 8 బాల్స్, ప్రేరణకు 6, పృథ్వీకి 5, నబీల్‌కు 4 బంతులు ఉన్నాయి.అవినాష్ గెలుపుపై నబీల్ డౌట్అవినాష్ గెలుపుపై నబీల్ అనుమానపడ్డాడు. తేజ, నువ్వేమైనా సాయం చేశావా? అని అడిగాడు. ఎవరూ సాయం చేయలేదని హౌస్మేట్స్ అందరూ క్లారిటీ ఇచ్చారు. అంతా అయిపోయాక నబీల్.. నువ్వు ఆడలేవని అనలేదు, ఎవరైనా సాయం చేశారనిపించి అడిగానంతే.. నీకు కోపం వస్తే అప్పుడే తిట్టాల్సిందంటూ అవినాష్‌కు సారీ చెప్పాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ కలిసి కామెడీ స్కిట్‌తో కడుపుబ్బా నవ్వించారు.మళ్లీ గెలిచేసిన అవినాష్అనంతరం పృథ్వీ, ప్రేరణ, అవినాష్, నబీల్.. వారు పొందిన బంతులతో నేర్పుగా సాగు- స్కోర్ పొందు అని మరో గేమ్ ఆడారు. ఈ టాస్క్‌లో అవినాష్ అందరికంటే ఎక్కువగా 43 పరుగులు చేసి గెలిచాడు. పృథ్వీ, ప్రేరణ.. 30 పరుగులు చేయగా, నబీల్ 24 పరుగులు చేశాడు. చివర్లో రెండు బంతుల్ని ఎవరికైనా ఇవ్వొచ్చు అని మానస్, ప్రియాంకకు బిగ్‌బాస్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ వాళ్లు అందుకు అంగీకరించలేదు.విష్ణుప్రియ బ్రేకప్ స్టోరీరెండు టాస్కులు గెలిచిన అవినాష్‌కు కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చారు. నబీల్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టు ఫినాలే రేసులో నుంచి తొలగించారు. చివర్లో విష్ణు, మానస్ కలిసి జరీజరీ పంచె కట్టి.. పాటకు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. మాజీ బాయ్‌ఫ్రెండ్ గుర్తురావడంతో అర్ధరాత్రి పృథ్వీపక్కన చేరి ముచ్చట్లు పెట్టింది విష్ణు. కలలో తనకు మాజీ బాయ్‌ఫ్రెండ్ వచ్చాడంది. బ్రేకప్ నువ్వు చెప్పావా? అని పృథ్వీ అడగ్గా.. అవును, నేనే బ్రేకప్ చెప్పానంది. తల్లి స్థానమిచ్చా..తెలీకుండా రెండు తప్పులు చేశాడు. నా మంచి కోసమే చేశాడు. నాకు తెలిస్తే భరించలేనని చెప్పలేదు. తీరా తెలిశాక నేను నిజంగా భరించలేకపోయాను. నాకోసమే కొన్ని పనులు చేసినా అవి నాకస్సలు నచ్చలేదు. అవి నా ముఖంపై చెప్పేంత ధైర్యం లేని వ్యక్తితో ఉండకూడదనుకున్నాను, బ్రేకప్ చెప్పాను. కానీ అతడికి నా తల్లి స్థానమిచ్చాను.నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడుకాబట్టి తనను చూడకుండా ఉండలేకపోతున్నాను. అతడు నా బలం. తనను హత్తుకుంటే మా అమ్మను హత్తుకున్నట్లే ఉంటుంది. నన్ను నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నాడు. అమ్మలాగా స్వచ్ఛంగా ప్రేమించాడు అంటూ అతడి జ్ఞాపకాలను పృథ్వీతో పంచుకుంది. అయితే అతడెవరనేది మాత్రం బయటపెట్టలేదు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బొక్కబోర్లా పడ్డ నబీల్.. తన సత్తా చూపించిన అవినాష్
టికెట్ టు ఫినాలే కోసం మాజీ కంటెస్టెంట్లు హౌస్‌లోకి వస్తున్నారు. ఇప్పటికే అఖిల్, హారిక వచ్చి గేమ్స్ ఆడించగా అందులో కమెడియన్ రోహిణి గెలిచి ఫస్ట్ కంటెండర్‌గా నిలిచింది. తాజాగా హౌస్‌లో మానస్, ప్రియాంక జైన్ అడుగుపెట్టారు. వీళ్లు పృథ్వీ, నబీల్, ప్రేరణ, అవినాష్‌తో సుడోకు గేమ్ ఆడించారు. నబీల్ అత్యుత్సాహంఇందులో నబీల్ తాను అందరికంటే ముందు విజయవంతంగా పూర్తి చేసేశాననుకుని సంతోషంతో గెంతులేశాడు. తీరా మానస్ వెళ్లి చూస్తే అక్కడ అన్నీ తప్పులే ఉన్నాయి. ఏ ఒక్కరూ ఈ గేమ్ పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్ చిన్న క్లూ వదిలాడు. ఆ క్లూ సాయంతో అవినాష్ అందరికంటే ముందు సుడోకు పూర్తి చేశాడు. అతడి విజయాన్ని జీర్ణించుకోలేకపోయిన నబీల్.. అవినాష్‌కు ఏమైనా సాయం చేశావా? అంటూ తేజను ప్రశ్నించాడు. కంటెండర్‌గా మరో కమెడియన్అది విని అవినాష్ షాకవగా.. ఏమో, అక్కడ జనాలు దగ్గరున్నారని అడిగానంటూ తన కుళ్లు, అనుమానాన్ని బయటపెట్టాడు. మొత్తానికి కమెడియన్ అవినాష్ తనకు ఇచ్చిన టాస్కులు గెలిచి కంటెండర్‌గా నిలిచాడు. ఎంటర్టైనర్లకు టాస్కులు ఆడి గెలిచే సత్తా కూడా ఉందని రోహిణి, అవినాష్ నిరూపించారు. ఇకపోతే ఈరోజు నబీల్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి అతడిని రేసులో నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఓపక్క తిట్టుకుంటూ మరోపక్క బుగ్గ గిల్లుతూ నామినేషన్స్
నామినేషన్స్‌లో ఫైర్ చూపించాలని నబీల్ బాగా తాపత్రయపడ్డాడు. నాగార్జున మాటలతో గౌతమ్ డిస్టర్బ్ అయ్యాడో, ఏమోకానీ ఓపక్క కోప్పడుతూనే మరోపక్క బాధపడుతున్నట్లు కనిపించింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఫైర్ లేదుబిగ్బాస్ హౌస్‌లో పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైనలిస్టుగా చూడకూడదనుకుంటున్న ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు బిగ్‌బాస్. మొదటగా నబీల్.. నామినేషన్స్‌లో తప్ప గేమ్‌లో ఫైర్ లేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. నబీల్‌తో పెట్టుకుంటే బొరాన్ ఉంటదంటూ దమ్కీ ఇచ్చాడు.ఆ ఫోకస్ గేమ్‌పై చూపించునీ గేమ్ కనిపించడం లేదు, నీకు సీరియస్‌నెస్ లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఒక మనిషిపై పెట్టిన ఫోకస్ గేమ్‌పై పెడ్తే గెలుస్తావని సలహా ఇచ్చాడు. కానీ ఈ సలహాలు పట్టించుకునే పరిస్థితిలో విష్ణు లేదు. పృథ్వీ వంతురాగా.. అమ్మాయిలు గొడవపడ్తున్నప్పుడు మెగా చీఫ్‌గా నువ్వు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించలేదంటూ అవినాష్‌ను నామినేట్ చేశాడు.తొడగొట్టిన అవినాష్ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ చేయట్లేదు, ఆడియన్స్ నిన్ను నామినేషన్స్‌లోకి వచ్చినవారమే ఎలిమినేట్ చేశారు, కానీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ చేశాడని ఎగతాళి చేశాడు. దీంతో అవినాష్.. నేను వచ్చిన ఏడువారాల్లో రెండుసార్లు మెగా చీఫ్ అయ్యానంటూ తొడగొట్టి చెప్పాడు. తర్వాత పృథ్వీ.. కెమెరాలతో మాట్లాడటం, ఏం పీకుతావనడం నచ్చలేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. ఇక్కడ వీళ్లిద్దరూ బుగ్గలు గిల్లుకోవడం గమనార్హం.విష్ణు ఎవర్ని నామినేట్ చేసిందంటే?ప్రేరణ.. గెలవాలన్న స్పిరిట్ నీలో లేదంటూ విష్ణుప్రియను, నువ్వు గెలవకూడదంటూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ప్రేరణ, గౌతమ్ చాలాసేపు గొడవపడ్డారు. తేజ.. నీ గేమ్ నచ్చలేదంటూ విష్ణును, ఎదుటివారిని రెచ్చగొడుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. తేజను, ప్రేరణను నామినేట్ చేసింది.మాట తప్పావ్: గౌతమ్గౌతమ్.. ఫిజికల్ అవకూడదని చెప్పిన నువ్వే చాలా గేమ్స్‌లో ఫిజికల్ అయ్యావని నిఖిల్‌ను నామినేట్ చేశాడు. పృథ్వీ ఎందరినో అవమానించాడు, అలాంటప్పుడు అతడినెందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించాడు. వీళ్లిద్దరూ గొడవపడుతుంటే మరోసారి పృథ్వీ మధ్యలో దూరడంతో ఇది చిలికిచిలికి గాలివానలా మారింది.నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణతర్వాత ప్రేరణను నామినేట్ చేశాడు. నువ్వు కావాలని ట్రిగ్గర్ చేస్తావని ఆమె అనడంతో.. నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణ.. నేను ట్రిగ్గర్ చేయలేదు, ఏదో సరదాగా చేశానంటూ గౌతమ్ ఫ్రస్టేట్ అయ్యాడు. అవినాష్ వంతు రాగా.. మూటల టాస్క్‌లో ఫౌల్ గేమ్ ఆడావు, ఎదుటివారికి గౌరవమర్యాదలు ఇవ్వడం లేదంటూ పృథ్వీని, కసిగా ఆడట్లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.మెగా చీఫ్ తప్ప అందరూ నామినేషన్లోనిఖిల్ వంతు రాగా గౌతమ్, ప్రేరణను నామినేట్ చేశాడు. చివరగా మెగా చీఫ్ రోహిణి.. నేను పక్కవాళ్లను తొక్కుకుంటూ వెళ్తానని చెప్పడం నచ్చలేదని విష్ణును నామినేట్ చేసింది. గేమ్‌లో నిన్నెవరైనా సైడ్ చేస్తుంటే భరించలేవు, అలాగే నన్ను వీక్ అన్నావంటూ నబీల్ను నామినేట్ చేసింది. అలా ఈ వారం విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
డేంజర్ జోన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. అతడి ఎలిమినేషన్ పక్కా?
తెలుగు బిగ్‌బాస్ షోలో 12వ వారం చివరకొచ్చేసింది. లెక్క ప్రకారం గతవారం అవినాష్ ఎలిమినేట్ కావాల్సింది. ఇక అయిపోతుంది అనుకునేలోపు నబీల్.. తన దగ్గరున్న ఎవిక్షన్ షీల్డ్ ఉపయోగించడంతో బతికిపోయారు. ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చిన.. ఈ వారం నామినేషన్స్ పూర్తిచేశారు. అలా అందరూ కన్నడ బ్యాచ్‌ని టార్గెట్ చేసి వాళ్లందరూ నామినేషన్స్‌లో ఉండేలా చేశారు. మరి ఈసారి వీళ్లలో ఎవరు బయటకెళ్లిపోయే ఛాన్స్ ఉంది?12వ వారం నామినేషన్స్‌లో కన్నడ బ్యాచ్ అయిన ప్రేరణ, నిఖిల్, యష్మి, పృథ్వీ ఉన్నారు. వీళ్లతో పాటు నబీల్ కూడా ఉన్నాడు. వీళ్లలో ప్రస్తుతం ప్రేరణ.. ఓటింగ్‌లో టాప్‌లో కొనసాగుతోంది. దాదాపు 26 శాతం ఓట్లతో ఈమె లీడింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానంలో నిఖిల్ ఉన్నాడట. అలా వీళ్లిద్దరూ టాప్ ప్లేయర్స్ అనిపించుకున్నారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)వీళ్ల తర్వాత అంటే మూడో స్థానంలో యష్మి, నాలుగో స్థానంలో నబీల్ ఉన్నట్లు సమాచారం. చిట్టచివరగా పృథ్వీ ఉన్నాడట. చివరి రెండు స్థానాల్లో ఉన్న నబీల్, పృథ్వీ మధ్య ఓటింగ్ పరంగా 3 శాతం మాత్రమే వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. అంటే పృథ్వీతో పాటు నబీల్ డేంజర్ జోన్లో ఉన్నట్లేగా!ఈ సీజన్లో వరస్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు పృథ్వీ. కానీ నామినేట్ అయిన ప్రతిసారి ఎలాగోలా తప్పించుకుంటూ వస్తున్నాడు. ఈసారి మాత్రం ఎలిమినేషన్ గ్యారంటీ అనిపిస్తుంది. ఒకవేళ ఇతడు సేవ్ అయితే మాత్రం నబీల్ బయటకెళ్లిపోతాడు. మరి ఈవారం ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్‌పై బన్నీ) -
Bigg Boss 8: అమ్మ రాకతో నబీల్ ఫుల్ హ్యాపీ.. బాధతో తేజ కన్నీళ్లు
ఈ వారం నామినేషన్ ఒక్కరోజులోనే పూర్తయ్యాయి. గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు. ప్రతి సీజన్లో మిగతా ఎపిసోడ్స్ గురించి జనాలు ఎంత తిట్టుకున్నా సర 'ఫ్యామిలీ వీక్' వస్తే మాత్రం తప్పకుండా చూస్తారు. ఈ వారం అదే జరగనుంది. తల్లి రాకతో నబీల్ ఫుల్ హ్యాపీగా ఫీలవగా.. తేజ మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. గడ్డం గురించి నిఖిల్-యష్మీ సోదిలో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంతకీ మంగళవారం (నవంబర్ 12) ఎపిసోడ్లో అసలేం జరిగిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడికి చేదు అనుభవం)స్వీట్ రూల్ బ్రేక్గతంలో హౌస్మేట్స్ కోసం వారంరోజుల పాటు అన్లిమిటెడ్ ఫుడ్ అందించేందుకు నబీల్.. సీజన్ అంతా స్వీట్స్ తిననని త్యాగం చేశాడు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసిన బిగ్‌బాస్.. యాక్షన్ రూంకి రమ్మని పిలిచి హల్వా ఇచ్చాడు. ఇది జరిగిన కాసేపటికి మరోసారి యాక్షన్ రూంకి పిలిచి ప్లేటులో స్వీట్స్ పెట్టాడు. ఇవి తింటుండగానే ఇతడి తల్లి నజ్మా నూష్రత్ హౌసులోకి వచ్చారు.నీ ఆట నువ్వు ఆడాలిహౌసులోకి వచ్చిన తర్వాత అందరూ నబీల్ తల్లిని పలకరించారు. ఆ తర్వాత నబీల్-అతడి తల్లి కూర్చుని మాట్లాడుకున్నారు. ఎలా ఆడుతున్నా, టీవీలో కనిపిస్తున్నానా లేదా అని నబీల్.. తన గేమ్ గురించి తల్లిని అడిగాడు. నబీల్ అడిగితే బాగా ఆడుతున్నావ్, ఇండివిడ్యువల్‌గా అట్లనే ఆడు, ఎమోషనల్ కావద్దు, నీ ఆట నువ్వు ఆడు.. ఎవరి గురించీ పట్టించుకోవద్దు.. ఎవరో ఏదో అన్నారని ఏం ఫీల్ కాకు.. అందరితో మంచిగానే ఉండు అని విలువైన సూచనలు ఇచ్చారు.(ఇదీ చదవండి: రోహిణికి సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్‌బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న టేస్టీ తేజ!)నబీల్ కోసం గేమ్ఇంతలో నబీల్ తల్లి బయటకు వెళ్లాల్సిన టైమ్ వచ్చిందని బిగ్‌బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. కాకపోతే మీరు బయటకెళ్లేముందు మీ అబ్బాయి కోసం ఓ గేమ్ ఆడాలని చెప్పి.. టేబుల్ ముందున్న ఓ డిస్క్ విసరమని చెప్పాడు. అది ఓ చోట ఆగడంతో ఎన్వలప్ కవర్లో ఏముందా అని చూడగా.. అమ్మ చేతి గులాబ్ జామున్ 20 పీస్ అని రాసుంది. దీంతో ఆ స్వీట్లని తీసుకున్న నబీల్.. హౌస్మేట్స్ అందరికీ ఇచ్చాడు. వెళ్లేముందు 'మనం' మూవీలోని 'కనిపించిన మా అమ్మకి..' పాట ప్లే చేయగా.. అందరూ కలిసి డ్యాన్స్ చేసి నబీల్ తల్లికి టాటా చెప్పేశారు. తల్లి వెళ్లిపోవడంతో నబీల్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.గడ్డం గురించి డిస్కషన్నబీల్ తల్లి వెళ్లిపోయిన తర్వాత నిఖిల్ ఒంటరిగా కూర్చుని ఉంటే.. యష్మీ టీజ్ చేసింది. గడ్డం గురించి మాట్లాడుతూ.. మంచి గడ్డం వద్దురా వద్దురా అంటే అస్సలు విన్నాడా అని నిఖిల్ గురించి పృథ్వీకి చెప్పింది. దీంతో నువ్వు (నిఖిల్) గడ్డం పెంచుకోరా అని నిఖిల్ అన్నాడు. అవును నువ్వు తీసేసి రెడ్ ఫ్లాగ్ అయ్యావ్ అని నిఖిల్‌ని పరోక్షంగా కౌంటర్ వేసింది. హౌస్‌లో గడ్డం ఉన్నవాడివి నువ్వు (పృథ్వీ) ఒక్కడివే.. ఆ గడ్డానికి పడిపోయా నేను.. అని పృథ్వీతో యష్మి ఫ్లర్ట్ చేసింది. ఇది విని నవ్వేసిన నిఖిల్.. ఈ డైలాగ్ వింటే 'విష్ణు ఏం చేస్తది తెలుసా.. నైట్‌కి నైట్ నిన్ను చంపేస్తాది' అని యష్మిని ఆటపట్టించాడు.(ఇదీ చదవండి: అక్కినేని ఇంట పెళ్లిసందడి.. ఆ విషయంలో సెంటిమెంట్!)తేజ ఏడ్చేశాడునబీల్ తల్లి వచ్చి వెళ్లిన తర్వాత తన తల్లిని గుర్తుచేసుకుని తేజ తెగ బాధపడ్డాడు. అందరి పేరెంట్స్ వస్తారు, కానీ నా కోసం మాత్రం రారు.. ప్లీజ్ బిగ్‌బాస్.. నేను ఏడిస్తే మా అమ్మకి నచ్చదు.. కానీ అమ్మ కోసం ఏడుస్తా అనుకోలేదు బిగ్‌బాస్.. ఇంకా కష్టపడి ఆడతా బిగ్‌బాస్ ప్లీజ్.. ఇంత పెద్ద పనిష్మెంట్ నాకు ఇవ్వొద్దు.. మీరు ఏదంటే అదే.. నాకు ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏం ఉండదు.. కావాలంటే ఎవ్రీ వీక్ డైరెక్ట్ నామినేషన్ అవుతా అని తనలో తానే అనుకుంటూ తేజ ఏడ్చాడు.ఇక కాసేపటి తర్వాత అవినాష్ దగ్గర నిఖిల్ ఓపెన్ అయ్యాడు. నాకు తేజదే గిల్ట్ అవుతుంది.. నాకేం తెలుసురా అలా అవుతుందని.. ఇప్పుడు మా అమ్మ వచ్చినా నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేను అని నిఖిల్ అన్నాడు. దీని తర్వాత ఫ్రీజ్-రిలీజ్ అనే గేమ్‌ని బిగ్‌బాస్ పెట్టాడు. మిగతా వాళ్ల సంగతేమో గానీ విష్ణుప్రియ, పృథ్వీ దగ్గరికి రాగానే పలుమార్లు ఫ్రీజ్ చేశాడు. దీంతో విష్ణు.. పృథ్వీ మీద వాలిపోయి తెగ ఫీలైపోయింది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!) -
బిగ్‌బాస్‌లోకి వచ్చిన నబీల్ తల్లి.. ఏడ్చేసిన టేస్టీ తేజ
బిగ్‌బాస్ ఏ సీజన్ తీసుకున్నా సరే మిగతా రోజులు హౌస్మేట్స్ ఎవరెలా ప్రవర్తించినా, ఎన్ని తిట్టుకున్నా సరే ఓ వారం మాత్రం అందరూ ఒక్కటైపోతారు. అదే 'ఫ్యామిలీ వీక్'. ప్రతి సీజన్లో ఉన్నట్లే ఈసారి కూడా వచ్చేసింది. ఈ వారమే కుటుంబ సభ్యులు.. హౌస్‌లోకి రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేశారు.షో ప్రారంభంలో కాస్త హడావుడి చేసిన ఓరుగల్లు కుర్రాడు నబీల్.. ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఫ్యామిలీ వీక్‌లో మొదటిగా ఇతడి తల్లి హౌస్‌లో అడుగుపెట్టింది. అంతకు ముందు నబీల్‌ని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్‌బాస్.. తినమని స్వీట్స్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)మరోసారి లోపలికి పిలిచి కాసేపు అలానే ఉండమన్నాడు. ఆ తర్వాత టీవీ స్క్రీన్‌పై అమ్మ హౌసులోకి వచ్చిన విషయాన్ని చూపించాడు. దీంతో 70 రోజుల తర్వాత తల్లిని కలిసిన నబీల్.. ఎమోషనల్ అయ్యాడు. చాలాసేపు మాట్లాడుకున్నాడు. ఇదంతా చూసి టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నాడు.గత వీకెండ్లో తేజకి చిన్న తప్పుకి పెద్ద క్లాస్ పీకిన నాగార్జున.. ఫ్యామిలీ వీక్కి అనర్హుడిని చేశాడు. అంటే తేజ కోసం కుటుంబ సభ్యులు ఎవరూ హౌస్‌లోకి రారు. దీంతో నబీల్ కోసం అతడి తల్లి రావడం చూసి.. ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడు. దీంతో మిగతా హౌస్మేట్స్ అతడిని ఓదార్చుతూ కనిపించారు.(ఇదీ చదవండి: 'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?) -
తేజకు దారుణమైన పనిష్మెంట్.. త్యాగానికి రోహిణి రెడీ!
టేస్టీ తేజకు దెబ్బమీద దెబ్బ పడింది. ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో అతడు చేసిన తప్పిదం వల్ల వచ్చేవారం కంటెండర్ అయ్యే అవకాశం కోల్పోయాడు. అటు హౌస్మేట్స్ వల్ల తన ఫ్యామిలీ హౌస్‌లోకి వచ్చే ఆస్కారమే లేదట.. అదెలాగో నేటి ఎపిసోడ్ (నవంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..సిగ్గు లేకుండా..మెగా చీఫ్ ప్రేరణ మాట ఎవరూ వినడం లేదు. పెండింగ్‌లో ఉన్న పని చేయమంటే విష్ణు కస్సుబుస్సులాడుతుంది. సీతాఫలం తినొద్దు అని చెప్పినా ఉన్న ఒక్కదాన్ని లటుక్కుమని గౌతమ్ ఆరగించేశాడు. వద్దని చెప్పినా ఎలా తిన్నావు? సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నావని గౌతమ్‌పై ఫైర్ అయింది. అటు స్వీట్లు తినను అని బిగ్‌బాస్‌కు మాటిచ్చిన నబీల్.. హల్వా తిని ఆ నియమాన్ని ఉల్లంఘించాడు.తేజకు శిక్షఇక నాగార్జున వచ్చీరావడంతోనే ఎవిక్షన్ షీల్డ్ గేమ్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణమైన తేజను వాయించాడు. నీకంటే ముందు వచ్చిన జంటలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. నువ్వు మాత్రం యష్మితో కలిసి ఒక అభిప్రాయానికి రాకుండా నీకు నచ్చింది చేశావని సీరియస్ అయ్యాడు. అతడు చేసిన తప్పుకుగానూ వచ్చేవారం చీఫ్ కంటెండర్‌వి కాలేవని శిక్ష విధించాడు.ఎవిక్షన్ షీల్డ్ ఎవరికివ్వాలో డిసైడ్ చేసిన ప్రేరణఇక ఎవిక్షన్ షీల్డ్ రేసులో మిగిలిన రోహిణి, నబీల్, నిఖిల్‌లలో ఎవరికి ఆ షీల్డ్ ఇవ్వాలో హౌస్మేట్స్ డిసైడ్ చేయాలన్నాడు. ఈ క్రమంలో రోహిణికి ప్రేరణ, గంగవ్వ, తేజ సపోర్ట్ చేయగా నిఖిల్‌కు హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ సపోర్ట్ చేశారు. నబీల్‌కు గౌతమ్, యష్మి, అవినాష్ మద్దతిచ్చారు. ముగ్గురికీ సమాన ఓట్లు పడటంతో చీఫ్ ప్రేరణపై భారం వేశారు. ఆమె నబీల్‌కు సపోర్ట్ ఇవ్వడంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ అందుకున్నాడు.అంతరాత్మపై ఒట్టేసి..అనంతరం నాగార్జున.. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలుస్తూ.. నీపై నువ్వు ప్రమాణం చేసుకుని ఈ సీజన్లో వరస్ట్ ప్లేయర్ ఎవరో చెప్పాలన్నాడు. మొదటగా నబీల్.. తన ఫోటోపై ఒట్టేసి విష్ణుప్రియను వరస్ట్ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. నిఖిల్.. తప్పు చేసినా రుబాబు చూపిస్తాడు, వెటకారం ఎక్కువ అంటూ తేజ వరస్ట్ ప్లేయర్ అన్నాడు. హరితేజ, యష్మి.. రోహిణిని, గౌతమ్, తేజ.. పృథ్వీని, అవినాష్.. హరితేజను, రోహిణి, గంగవ్వ.. యష్మిని, విష్ణుప్రియ, పృథ్వీ.. తేజను చెత్త ప్లేయర్ అని పేర్కొన్నారు. తేజకు కోలుకోలేని దెబ్బప్రేరణ.. గెలవాలన్న ఆసక్తి లేదంటూ విష్ణుప్రియ వరస్ట్ ప్లేయర్ అని తెలిపింది. వరస్ట్ హౌస్మేట్స్ అని ఎక్కువ ఓట్లు పడ్డ వ్యక్తికి ఫ్యామిలీ వీక్‌లో వారి కుటుంబసభ్యులు రాబోరని నాగ్ బాంబు పేల్చాడు. ఈ సీజన్లో తేజను వరస్ట్ ప్లేయర్‌గా డిసైడ్ చేశారు. కేవలం తల్లిని తీసుకురావడానికే ఈ సీజన్‌కు వచ్చాను సర్ అంటూ తేజ కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేశాడు.గంగవ్వ ఎలిమినేట్దీంతో రోహిణి.. నా ఫ్యామిలీకి బదులుగా నీ కుటుంబసభ్యులు రావాలని బిగ్‌బాస్‌ను అభ్యర్థిస్తానంది. అటు గంగవ్వ ఆరోగ్యం గురించి నాగ్ ఆరా తీశాడు. ఆమె తన ఒళ్లంతా మంట లేస్తోందంటూ.. సంతోషంగానే ఉన్నాను కానీ చేతనవడం లేదని తెలిపింది. దీంతో ఆమెను హౌస్ నుంచి పంపించేశారు. గంగవ్వ వెళ్లిపోతుంటే రోహిణి, తేజ గుక్కపెట్టి ఏడ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గంగవ్వ ఎలిమినేట్.. ఆ కోరిక నెరవేరకుండానే..
ఎవిక్షన్ షీల్డ్ కోసం బిగ్‌బాస్ ఓ టాస్క్ పెట్టాడు. చివర్లో తేజ, యష్మితో ఏకాభిప్రాయానికి రాకుండా నిఖిల్ ఎగ్‌ను పాము నోట్లో వేశాడు. ఆ కోపంతో యష్మి కూడా రోహిణి ఎగ్‌ను పాముకు ఆహారంగా వేసింది. ఒక జంట ఒక ఎగ్ మాత్రమే వేయాలన్నది రూల్. ఈ నియమాన్ని ఇద్దరూ బ్రేక్ చేయడంతో ఎవిక్షన్ షీల్డ్ గేమ్ అర్ధాంతరంగా ఆగిపోయింది.ఎలిమినేషన్దీంతో నాగ్ సమక్షంలో ఎవిక్షన్ షీల్డ్ కోసం హౌస్మేట్స్ అభిప్రాయాలు కోరాడు. అలా ఈ షీల్డ్ నబీల్ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ అవుతాడని, లేదు యష్మి వెళ్లిపోతుందని తెగ ప్రచారం జరుగుతోంది. చివరకు ఈ రెండూ ఉట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి.అనారోగ్యం వల్లే.అనారోగ్య కారణాల వల్ల గంగవ్వను హౌస్ నుంచి బయటకు పంపించేశారట. చలాకీగా మాట్లాడుతూ.. చిన్నపాటి ఆటల్లోనూ పాల్గొంటూ అలరించింది అవ్వ. ఎలాగైనా ఫ్యామిలీ వీక్ వరకు ఉండాలనుకుంది. ఇందుకోసం తనను నామినేట్ చేయొద్దని హౌస్‌మేట్స్‌ను కోరింది. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో హౌస్‌లో ఉండలేక వెళ్లిపోవడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియకు చుక్కలు చూపిస్తున్న ప్రేరణ.. బలైపోయిన తేజ!
ఎన్నాళ్లనుంచో చీఫ్ పోస్ట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రేరణ కల ఎట్టకేలకు సాకారమైంది. మెగా చీఫ్ పదవిని అధిరోహించింది. అలా డ్యూటీ ఎక్కిందో లేదో తన పనితనం మొదలుపెట్టేసింది. అప్పుడే విష్ణుప్రియకు చుక్కలు చూపించేస్తోంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి..మాట తప్పాడన్న కోపంతో..మెగా చీఫ్ గేమ్‌లో పృథ్వీ, నబీల్ ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ముందుగానే డీల్ చేసుకున్నారు. కట్ చేస్తే నబీల్ను ఓడించమని నిఖిల్‌కు సూచించాడు పృథ్వీ. చేసిందంతా చేశాక తాను అలా అనలేదని మాట మార్చాడు. తను ఓడిపోవడంతో నబీల్ కూడా పృథ్వీని ఓడించాలని డిసైడయ్యాడు. ఈ క్రమంలో అతడు కూర్చున్న బాక్స్‌లో మూటలు వేశాడు. అయితే అవి తన మీద పడటం, అలాగే ఇచ్చిన మాట తప్పాడన్న కోపంతో పృథ్వీ.. నబీల్‌పై సీరియస్ అయ్యాడు. ఈ రౌండ్లో పృథ్వీ ఓడిపోయాడు.ప్రేరణ మెగా చీఫ్చివర్లో ప్రేరణ, రోహిణి ఇద్దరే మిగిలారు. విష్ణు, గంగవ్వ, అవినాష్, తేజ.. రోహిణికి సపోర్ట్ చేయగా మిగతా అందరూ ప్రేరణకు మద్దతిచ్చి ఆమెను చీఫ్ చేశారు. ఇకపోతే హరితేజ హౌస్‌లో ఉన్నవారందరిపైనా హరికథ చెప్పి అలరించింది. అనంతరం మెగా చీఫ్ అయిన ప్రేరణ మొదట విష్ణునే టార్గెట్ చేసినట్లు ఉంది. విష్ణును కప్బోర్డ్ ఖాళీ చేయమందట.. అలాగే విష్ణు బెడ్ దగ్గరున్న సామాను నీట్‌గా పెట్టుకోమని చెప్పింది. ఆమె వినకపోవడంతో ప్రేరణ వెళ్లి సర్దింది. ఇంట్లో చేయాల్సిన పనులు కూడా సరిగా చేయడం లేదని విష్ణును తప్పు పట్టింది.పాము- ఎగ్స్బిగ్బాస్ ఎవిక్షన్ షీల్డ్‌ను ప్రవేశపెట్టాడు. సమయానుసారం ఆకలిగా ఉన్న పాముకు గోల్డెన్ ఎగ్స్ ఇవ్వాలన్నాడు. ఎవరికి చెందిన గోల్డెన్ ఎగ్ పాముకు ఆహారమవుతుందో వారు ఎవిక్షన్ షీల్డ్‌కు దూరమవుతారు. మెగా చీఫ్ ప్రేరణ.. ఎవిక్షన్ షీల్డ్ రాకూడదనుకున్న ఐదుగురి ఎగ్స్ పాముకు ఆహారంగా పెట్టాలన్నాడు. అలా విష్ణుప్రియ, గంగవ్వ, పృథ్వీ, గౌతమ్, హరితేజ ఫోటోలున్న ఎగ్స్‌ను పాము నోట్లో వేసింది.అవినాష్‌పై ఎగిరెగిరి పడ్డ యష్మిఅనంతరం.. అవినాష్, నబీల్ను పిలిచి ఒక ఎగ్‌ను పాము నోట్లో పెట్టమన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయంతో యష్మి ఎగ్ తొలగించారు. అందుకు కారణం చెప్పమని యష్మి అడగ్గా.. నువ్వు వీక్ కాబట్టే నబీల్ నీకు సూట్‌కేస్ ఇచ్చాడు. అయినా ఈ వారం నీకు వచ్చిన అవకాశం సరిగా వాడుకోలేదని అవినాష్ అన్నాడు. ఆ మాటతో యష్మికి కోపం కట్టలు తెంచుకుంది. అందరూ అన్ని గేమ్స్ గెలవరు, స్ట్రాంగ్ ఉన్నవాళ్లు కూడా చాలా గేమ్స్‌లో ఓడిపోయారు.. నన్ను వీక్ అంటూ డీమోటివేట్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చింది.నిఖిల్ గేమ్‌ను అడ్డుకున్న గౌతమ్నిఖిల్, గౌతమ్ వంతు రాగా నిఖిల్ త్యాగం చేసేందుకు రెడీ అయ్యాడు. అందుకు గౌతమ్ ఒప్పుకోలేదు. ప్రేరణ ఎగ్ తీసేద్దామంటే నిఖిల్ ఒప్పుకోడు. చివరకు ఇద్దరూ కలిసి తేజను బలి చేశారు. విష్ణుప్రియ, పృథ్వీ వంతురాగా.. ప్రేరణ ఎగ్ తీసేశారు. తర్వాత రోహిణి, హరితేజ వంతు వచ్చింది. నిఖిల్ ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అవడానికి రెడీగా ఉన్నాడని రోహిణి అంటుంటే హరితేజ మాత్రం నామినేషన్స్‌లోకి రావట్లేదంటూ అవినాష్‌ను తీసేద్దామంది. అందుకు రోహిణి ఒప్పుకోలేదు. అటు హరితేజ కూడా వినకపోవడంతో తప్పని పరిస్థితిలో రోహిణి.. అవినాష్ ఎగ్‌ను పాము నోట్లో వేసింది.తేజ చేసిన పనికితేజ, యష్మి వంతు వచ్చింది. యష్మి.. ఎఫర్ట్స్ కనిపించడం లేదంటూ రోహిణి పేరు చెప్పగా తేజ.. నబీల్, నిఖిల్లో ఎవరైనా ఓకే అన్నాడు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తేజ.. నబీల్, రోహిణి, నిఖిల్ అభిప్రాయాలు అడిగాడు. తనకు అక్కర్లేదని నిఖిల్ క్లియర్‌గా చెప్పడంతో మరో సెకన్ ఆలోచించకుండా అతడి ఎగ్‌ను పాము నోట్లో వేశాడు.నబీల్‌కు ఎవిక్షన్ షీల్డ్అది చూసిన యష్మి.. కావాలని రోహిణి ఎగ్ కూడా వేసేసింది. దీంతో నిఖిల్, పృథ్వీ, హరితేజ, విష్ణు.. అందరూ తేజపై పడి అరిచారు. ఏకాభిప్రాయానికి రాకుండా ఎగ్ ఎలా వేస్తావంటూ మండిపడ్డారు. కానీ ఏ ఒక్కరూ యష్మి ఎగ్ వేయడాన్ని తప్పుపట్టలేదు. చివర్లో నబీల్ ఎగ్ మాత్రమే మిగిలి ఉండటంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ గెలుపొందినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: ఎవిక్షన్ షీల్డ్ గెలిచిన ఓరుగల్లు బిడ్డ
ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి లేదా ఎలిమినేషన్లో ఉన్నవారిని సేవ్ చేయడానికి బిగ్‌బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ప్రవేశపెడుతుంటాడు. అలా ఈసారి కూడా ఎవిక్షన్ షీల్డ్ తీసుకొచ్చాడు. ఈ షీల్డ్ గెలిచినవారు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా సేవ్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే అది ఒక్కవారమా? ఏంటనేది క్లారిటీ లేదు.ఆటలో ఐదుగుర్ని తీసేసిన మెగా చీఫ్అయితే ఎవిక్షన్ షీల్డ్‌కు అర్హత లేదనకున్న ఐదుగురురిని గేమ్‌లో నుంచి తీసేయాలని మెగా చీఫ్ ప్రేరణకు బాధ్యత అప్పగించాడు. అలా ప్రేరణ.. పృథ్వీ, గౌతమ్, గంగవ్వ, హరితేజ, విష్ణుప్రియలను సైడ్ చేసేసింది. మిగిలిన హౌస్మేట్స్ షీల్డ్ కోసం పోటీపడ్డారు.ఎవిక్షన్ షీల్డ్ఈ క్రమంలో నబీల్.. యష్మిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అవినాష్ వివరణ ఇస్తుండగా యష్మి ఒంటికాలిపై లేచింది. ఒకర్ని వీక్ అని చెప్పొద్దు.. స్ట్రాంగ్ ఉన్న ప్లేయర్స్ కూడా చాలా గేమ్స్‌లో ఓడిపోయారు అని పేర్కొంది. ఇకపోతే ఎవిక్షన్ షీల్డ్ చివరకు నబీల్ను వరించినట్లు తెలుస్తోంది. నబీల్‌కు మైనస్?అయితే ఇది అతడికి ఏరకంగా ప్లస్ అయ్యేట్లు లేదు. నామినేషన్లో ఉంటేనే జనాలు ఓట్లు గుద్దుతూ అతడికి అండగా ఉంటారు. ఇలా నామినేషన్స్‌లో లేకుండా ఉంటే అతడికి ఓట్లు వేసేవారందరూ మిగతా హౌస్‌మేట్స్‌కు ఓట్లు వేసే ఆస్కారం ఉంది. అలా తన ఓట్ బ్యాంక్ పడిపోయే ఆస్కారం ఉంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: తిడుతుంటే నవ్వుతుందేంటి? ఈ పగ చల్లారదు!
గంగవ్వ హౌస్‌లో అడుగుపెట్టి నాలుగువారాలవుతోంది కానీ కొందరి పేర్లు ఇప్పటికీ తనకు నోరు తిరగదు. యష్మిని కాస్త అశ్విని అనేసింది. దీంతో నామినేషన్స్‌లో అందరూ పడీపడీ నవ్వారు. గంగవ్వ యష్మిని నామినేట్ చేస్తూ.. గౌతమ్ బాగానే ఆడుతున్నాడుడు. కానీ నువ్వు.. ఆటలో గెలవకపోతే మాత్రం చించి సంచి కోసుకుంటవ్ అంటూ పక్కా తెలంగాణ యాసలో సెటైర్లు వేసింది. నబీల్ రివేంజ్ నామినేషన్?అది ఆమెకు ఏమర్థమైందో కానీ పకాపకా నవ్వింది. విష్ణుప్రియ.. ప్రేరణను అగ్రెసివ్ అంటూ నామినేట్ చేసింది. ఇక ఈ రోజు కోసం నబీల్ వారం రోజులనుంచి ఎదురుచూస్తున్నాడు. పోయినవారం మన క్లాన్లోని వారిని నామినేట్ చేసుకోవద్దని మరీ చెప్పాడు నబీల్. కట్ చేస్తే విష్ణుప్రియ నబీల్ను నామినేట్ చేసింది. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?అది గుర్తుపెట్టుకుని మరీ విష్ణుప్రియపై ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక హరితేజ, ప్రేరణల మధ్య సైలెంట్‌వార్ కొనసాగుతూనే ఉంది. మొత్తానికి ఈ వారం హరితేజ, గౌతమ్, ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ నామినేషన్స్‌లో ఉన్నారు. -
బిగ్‌బాస్ 8: హౌస్‌మేట్స్‌కు దీపావళి సర్ప్రైజ్
గత వారం దీపావళి ప్రత్యేక ఎపిసోడ్లో హౌస్‌మేట్స్‌కు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు నాగ్. పేరెంట్స్ మాట్లాడిన వీడియోలను కంటెస్టెంట్లకు చూపించాడు. అయితే కొందరికే ఆ అవకాశాన్ని ఇచ్చాడు. మరికొందరిని నిరాశపర్చాడు. వారి బాధను అర్థం చేసుకున్న బిగ్‌బాస్ వాళ్లందరికీ ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు.ముందు ఆటపట్టించి..ఇంటి నుంచి వీడియో మెసేజ్‌లను ప్లే చేసి చూపించాడు. కానీ అంత ఈజీగా ఇవ్వలేదు. ముందుగా గార్డెన్ ఏరియాలో ఓ టెలిఫోన్ పెట్టి తనే కాల్ చేసి ఆటపట్టించి ఆ తర్వాత సర్ప్రైజ్ రివీల్ చేశాడు. ఏదైతేనేం.. ఇంటి నుంచి వచ్చిన వీడియోలు చూసి హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అడగకుండానే..తేజ, నబీల్, నయని కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తానికి నేటి ఎపిసోడ్ ఫుల్ ఎమోషనల్‌గా సాగనుందని అర్థమవుతోంది. అడగందే అమ్మయినా అన్నం పెట్టదు.. కానీ మీరు అడగకుండానే అన్నీ పెడతారంటూ చివర్లో హరితేజ బిగ్‌బాస్‌కు థాంక్యూ చెప్పింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్: ఇచ్చిపడేసిన నబీల్.. విలన్‌గా విష్ఱుప్రియ.. దెబ్బకు!
అవినాష్‌ను స్కానింగ్ కోసం బయటకు తీసుకెళ్లారు. ఆరోగ్యం బాగోలేక ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్నాడేమోనని హౌస్ మొత్తం ఏడ్చేసింది. కట్ చేస్తే కొన్ని గంటలకే లోనికి వచ్చాడు. నామినేషన్స్ ఈసారి డిఫరెంట్‌గా జరిగాయి. ముఖ్యంగా మెగా చీఫ్‌కు ఇది కత్తి మీద సామే అయింది. అదెలాగో తెలియాలంటే నేటి (అక్టోబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..హౌస్ మొత్తం ఏడుపుకడుపు నొప్పితో అవినాష్ మెడికల్ రూమ్‌కు వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యుడు స్కానింగ్ కోసం హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుందన్నారు. కడుపు నొప్పి భరించలేకపోతున్నాను, అందుకే హౌస్ నుంచి వెళ్లిపోతున్నా అంటూ అవినాష్ హౌస్‌లో ఎమోషనల్ అయ్యాడు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే అవి ఎలిమినేట్ అవుతున్నాడనుకుని దాదాపు హౌస్మేట్స్ అందరూ భారంగా ఏడుస్తూ వీడ్కోలు చెప్పారు. అవినాష్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి స్కాన్ చేయించిన బిగ్‌బాస్ టీమ్.. అతడిని తిరిగి హౌస్‌లోకి పంపారు.నామినేషన్స్.. మెగా చీఫ్‌పై భారంమెగా చీఫ్ విష్ణుప్రియ.. ఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఐదుగురు సభ్యులను నామినేట్ చేసి జైల్లో పెట్టి తాళం వేయాలన్నాడు. చీఫ్‌ను చేయడంతో పాటు విలన్‌ను కూడా చేసేస్తున్నారని మనసులో అనుకుంటూనే ముందుగా గౌతమ్‌ను నామినేట్ చేసింది. లేడీస్ వీక్ అంటూ ఆడాళ్లకు గౌరవమిస్తానంటావ్.. కానీ ఒకరిపై నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అరవడం బాగోలేదని తెలిపింది. అందుకు గౌతమ్.. ప్రేరణతో మాట్లాడుతుంటే యష్మి మధ్యలో వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పాయింట్లు వెతకడానికే నీతో ఉన్నాతన పేరు రావడంతో యష్మి గొడవకు దిగింది. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని అక్కా అనేశాడు. క్రష్ అంటావ్, అక్కా అంటావ్.. నన్ను అక్కా అని పిలవకు అని యష్మి హెచ్చరించగా అది చూసి విష్ణు పకాపకా నవ్వింది. నాకంటే ఎక్కువపాయింట్లు ఉన్నోళ్లు నీ చుట్టూ ఉన్నా నామినేట్ చేయవని గౌతమ్.. విష్ణుపై అసహనం వ్యక్తం చేశాడు. నిన్ను నామినేట్ చేయడానికి దగ్గరుండి పాయింట్లు వెతికానంది విష్ణు. ఈమె మాటలు విన్న పృథ్వీ వెటకారంగా నవ్వాడు. మనసు చివుక్కుమంది, అందుకే..నన్ను ఫేక్ ఫ్రెండ్ అన్నావ్, అందర్నీ గాలికొదిలేసి నీ కోసమే బజ్జీలు వేసుకున్నావంటూ ప్రేరణను జైల్లో పడేసింది. సంచాలకుడిపై అరవడం వల్ల నా మనసు చివుక్కుమందంటూ తేజను నామినేట్ చేసింది. పృథ్వీ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో నయనిని సైతం జైల్లో వేసింది. వైల్డ్‌కార్డ్స్ వచ్చాక నీలో పన్ యాంగిల్ కనిపించడం లేదంటూ నబీల్ను నామినేట్ చేసింది. వెంటనే నబీల్.. నువ్వు పృథ్వీతో ఉంటే నేనెక్కడ కనిపిస్తానంటూ భలే కౌంటరిచ్చాడు. నీలో ఫైర్ ఏముందని నాకు చెప్తున్నావ్ అని తిరిగి ప్రశ్నించాడు. నామినేషన్స్‌లో రెండో లెవల్అలా విష్ణుప్రియ వల్ల గౌతమ్, ప్రేరణ, నయని పావని, తేజ, నబీల్ నామినేట్ అయ్యారు. మన టీమ్వాళ్లు మెగా చీఫ్ అవ్వాలని ఆడితే ఇప్పుడు నన్నే నామినేట్ చేసిందని నబీల్ ఏడ్చాడు. చేసిందంతా చేసిన విష్ణు.. నబీల్‌కు సారీ చెప్పింది. తర్వాత నామినేషన్స్‌లో రెండో లెవల్ మొదలైంది. జైల్లో ఉన్నవారిని విడిపించే అవకాశాన్ని హౌస్‌మేట్స్‌కు ఇచ్చాడు. బజర్ మోగిన ప్రతిసారి జైలు తాళం చెవిని పట్టుకున్నవారికి ఒకరిని నామినేషన్ నుంచి సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఆ వ్యక్తికి బదులుగా మరొకరిని నామినేట్ చేసి జైల్లో వేయాల్సి ఉంటుంది.ఫైనల్ లిస్ట్ ఇదేమొదటగా పృథ్వీ తాళం అందుకుని.. నబీల్ను జైలు నుంచి విడిపించాడు. అతడి స్థానంలోకి అవినాష్‌ను పంపించాడు. తర్వాత బజర్‌కు యష్మి.. ప్రేరణను విడిపించి హరితేజను జైల్లోకి పంపింది. రోహిణి.. అవినాష్‌ను బయటకు తీసి పృథ్వీని లోనికి పంపించింది. అవినాష్.. తేజను విడిపించి యష్మిని జైల్లో వేశాడు. ప్రేరణ.. పృథ్వీని విడిపించి తేజను లోనికి పంపించింది. ఫైనల్‌గా ఈ వారం గౌతమ్, నయని, హరితేజ, యష్మి, తేజ నామినేట్ అయినట్లు ప్రకటించారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణపై పగ తీర్చుకున్నారు.. ప్రైజ్‌మనీని ఖాతరు చేయని నబీల్
నామినేషన్స్.. ఈసారి అన్నీ రివేంజ్ నామినేషన్సే పడ్డాయి. ప్రైజ్‌మనీ తగ్గినా తనకేం పర్వాలేదన్నట్లు ప్రవర్తించాడు నబీల్. ఇంతకీ నామినేషన్స్‌కు, ప్రైజ్‌మనీకి ఏం సంబంధం? ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి (అక్టోబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నామినేషన్స్ షురూఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఇద్దరు ఇంటిసభ్యుల దిష్టిబొమ్మలపై కుండ పెట్టి పగలగొట్టాలని బిగ్‌బాస్ చెప్పాడు. నామినేషన్ షీల్డ్ ఎవరిదగ్గరైతే ఉంటుందో వారిని నామినేట్ చేసినప్పుడల్లా ప్రైజ్‌మనీలో నుంచి రూ.50 వేలు పోతాయని హెచ్చరించాడు. మెగా చీఫ్ గౌతమ్.. ఈ నామినేషన్ షీల్డ్‌ను హరితేజకు ఇచ్చాడు.పృథ్వీ మీద ప్రేమతో.. పోయినవారం తేజకు బదులుగా పృథ్వీని నామినేట్ చేయడం నచ్చలేదని పరోక్షంగా చెప్తూ ప్రేరణను నామినేట్ చేసింది విష్ణు. గేమ్ స్లో అయిపోతుందంటూ, లైటర్ కోసం పాయింట్ ఇవ్వడం నచ్చలేదని నిఖిల్ దిష్టిబొమ్మపై కుండ పగలగొట్టింది. అలాగైతే నువ్వు అందరికంటే ముందు బ్రేక్‌ఫాస్ట్ చేసి పాయింట్ ఇచ్చేశావ్గా అని నిఖిల్ అనడంతో విష్ణు నీళ్లు నమిలింది. తర్వాత రోహిణి.. ఆటలో ఫిజికల్ అవడం నచ్చలేదని నిఖిల్‌ను నామినేట్ చేసింది. సెల్ఫిష్‌గా ఆలోచిస్తావ్, గేమ్‌లో అగ్రెసివ్ అవుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేసింది. బాడీ షేమింగ్పృథ్వీ.. పోయినవారం కిల్లర్ గర్ల్‌గా తనను నామినేట్ చేసినందుకు ప్రేరణ కుండ పగలగొట్టి తనపై ప్రతీకారం తీర్చుకున్నాడు. టాస్క్‌లో వీక్, ఆటలో జీరో.. నీకు రన్నింగ్ కూడా రావాలి, అది అంత ఈజీ కాదు అని రోహిణిని పై నుంచి కింది వరకు చూశాడు. తనను బాడీ షేమింగ్ చేయడంతో రోహిణికి చిర్రెత్తుకొచ్చింది. ఆ చూపేంటి? బాడీ షేమింగా? ఓవరాక్షన్ చేయకు.. తొక్కలో నామినేషన్స్ చేయకు అని ఇచ్చిపడేసింది.సెల్ఫిష్ గేమ్నయని పావని.. బ్యాటరీ టాస్కులో సెల్ఫిష్‌గా ఆడారంటూ మెహబూబ్, నిఖిల్‌ను నామినేట్ చేసింది. హరితేజ వంతురాగా.. ప్రేరణను నామినేట్ చేస్తూ కొంపలు మునిగాక రావడం మానేయమని సలహా ఇచ్చింది. సెల్ఫిష్‌గా ఆడావంటూ మెహబూబ్‌ను నామినేట్ చేసింది. ప్రైజ్‌మనీ తగ్గినా పర్లేదంటూ..నబీల్.. నన్ను ఇమ్మెచ్యూర్ అనడం నచ్చలేదు, అలాగే వేరేవాళ్ల పనుల్లో దూరకు అంటూ ప్రేరణ దిష్టిబొమ్మపై కుండ పగలగొట్టాడు. ప్రైజ్‌మనీలో నుంచి రూ.50 వేలు పోయినా పర్లేదంటూ హరితేజను నామినేట్ చేశాడు. మీకు డెసిషన్ తీసుకోవడం రావట్లేదు. అలాగే నాకు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని నా సూట్‌కేస్ బయటపెట్టడం నచ్చలేదని కుండ పగలగొట్టాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రతివారం అరతులం బంగారమిస్తా.. గంగవ్వకు మణి బంపరాఫర్
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అంతా అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్నాడు నబీల్. అయితే ఇది గొంతెమ్మ కోరికగా భావించిన బిగ్‌బాస్ ఈ వారం మాత్రమే కావాల్సినంత ఫుడ్ ఇస్తానన్నాడు. కానీ ఓ తిరకాసు పెట్టాడు. అదేంటో తెలియాలంటే నేటి (అక్టోబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నా జీవితంలో జరిగిన ఘోరంవిష్ణుప్రియ తన మనసులోని బాధను చెప్పడంతో గంగవ్వ ఎమోషనలైంది. అమ్మకు ఇష్టం లేదని చిన్నప్పటినుంచి నాన్నతో మాట్లాడేవాళ్లం కాదు. నాన్నపై ఎంత ప్రేమ ఉన్నా, అమ్మ కోసం ఆయనతో మాట్లాడలేదు. చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు.. అది నా జీవితంలో జరిగిన ఘోరం.. ఇది ఎవరికీ జరగకూడదు. అమ్మ చనిపోయాక ఇప్పుడిప్పుడే తనతో మాట్లాడుతున్నాం అని చెప్పింది. ఇది విని గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.హౌస్మేట్స్ కోసం నబీల్ త్యాగంఇకపోతే ఇన్ఫినిటీ రూమ్‌లో నబీల్ అన్లిమిటెడ్ ఫుడ్ కావాలన్న సంగతి తెలిసిందేగా! దాని గురించి బిగ్‌బాస్ ప్రస్తావిస్తూ.. ఇంట్లో ఉన్నంతకాలం నబీల్ స్వీట్లు, కూల్‌డ్రింక్స్, చాక్లెట్లు త్యాగం చేస్తే ఈ ఒక్క వారం అన్లిమిటెడ్ రేషన్ లభిస్తుందన్నాడు. ఇంటిసభ్యులందరికోసం ఆ కండీషన్‌కు నబీల్ ఓకే చెప్పాడు. దీంతో మెహబూబ్.. సూపర్ మార్కెట్లో ఉన్న రేషన్ అంతా ఊడ్చేశాడు.బంగారం ఇస్తానన్న మణికంఠతర్వాత నాగమణికంఠ.. తాను నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయితే గంగవ్వకు బంగారు ముక్కుపుడక ఇస్తానన్నాడు. సేవ్ అయిన ప్రతివారం అరతులం ఇస్తానంటూ గంగవ్వ మీద ఒట్టేశాడు. మరి నాకేం ఇస్తావని రోహిణి అనగా ఒక ముద్దిస్తానన్నాడు. ఇక అవినాష్-రోహిణి నామినేషన్స్‌ను రీక్రియేట్ చేసి నవ్వించారు. వీరి పర్ఫామెన్స్ మెచ్చిన బిగ్‌బాస్ కిచెన్‌లో మరో రెండు గంటలు ఎక్కువ సేపు వంటచేసుకునే ఛాన్సిచ్చాడు. మెగా చీఫ్ కంటెండర్‌గా గంగవ్వఅనంతరం రాయల్ టీమ్ గెలుపొందిన మెగా చీఫ్ కంటెండర్ షీల్డ్‌ను గంగవ్వకిచ్చారు. బిగ్‌బాస్.. రాయల్ టీమ్‌ను ఓవర్ స్టార్ట్ఫోన్లుగా, ఓజీ టీమ్‌ను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా విభజించారు. హౌస్ అంతా రాయల్ టీమ్ ఆధీనంలో, గార్డెన్ ఏరియా ఓజీ టీమ్ ఆధీనంలో ఉంటుందన్నాడు. కిచెన్, బెడ్రూమ్, వాష్‌రూమ్ వంటి వసతులు అందిస్తూ చార్జింగ్ పొందవచ్చని తెలిపాడు.బెంబేలెత్తిపోయిన మణికంఠటాస్క్ పూర్తయ్యేలోపు బతికున్న సభ్యులే మెగాచీఫ్ కంటెండర్లవుతారన్నాడు. టాస్క్ ప్రారంభానికి ముందే మణి బెంబేలెత్తిపోయాడు. నాకంటూ ఫ్యామిలీ ఉంది. బొక్కలిరగ్గొట్టుకుని బయటకు వెళ్లలేను. ఆరోగ్యం ముఖ్యం.. టీమ్‌కు ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలో అంతే ఇస్తానని చెప్పాడు. ఆట మొదలవగానే అవినాష్.. నబీల్‌కు తెలియకుండా అతడి చార్జర్‌ను తన ప్లగ్‌కు కనెక్ట్ చేశాడు. హరికథ చెప్పి చార్జింగ్హరితేజ.. హరికథతో మణికంఠను మెప్పించి అతడి దగ్గర నిమిషం పాటు చార్జింగ్ పొందింది. నయని కూడా యష్మి దగ్గర బలవంతంగా చార్జ్ పొందడానికి ట్రై చేసింది. కానీ నిఖిల్ ఆమెను అడ్డుకుని అవతలకు విసిరేయడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అలా నేటి ఎపిసోడ్ ముగిసింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి