ఈ గొడవలన్నింటికీ ఆవిడే కారణం.. చీఫ్‌ పదవి పాయే! | Bigg Boss Telugu 8 Promo: This Contestant Lost His Chief Post | Sakshi
Sakshi News home page

బెదిరించకు, మంచిగా అడిగితే చెప్తా.. సోనియాకు నబీల్‌ కౌంటర్‌

Published Thu, Sep 19 2024 4:19 PM | Last Updated on Thu, Sep 19 2024 4:45 PM

Bigg Boss Telugu 8 Promo: This Contestant Lost His Chief Post

బిగ్‌బాస్‌ హౌస్‌లో గుడ్ల పంచాయితీ నడుస్తోంది. ప్రభావతి అలియాస్‌ కోడి సమయానుసారం పెట్టే గుడ్లను రెండు టీమ్స్‌ సంపాదించి దాచుకోవాలి. అవతలివారు దోచుకోకుండా కాపలా కాయాలి. సంపాదించడం కన్నా కొట్టేయడం తేలిక అని భావించిన హౌస్‌మేట్స్‌ దొంగతనం మీదే ఎక్కువ దృష్టి సారించారు.

సంచాలకుడిగా నబీల్‌
ఇప్పటికే శక్తి టీమ్‌ లీడ్‌లో ఉండగా ఈ గేమ్‌లో అవుట్‌ అయిన నబీల్‌ సంచాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో సోనియా ఏదో పాయింట్లు చెప్తుండగా.. నబీల్‌ కలగజేసుకుంటూ నువ్వు నన్ను బెదిరించకు, మంచిగా అడుగు చెప్తా అని కౌంటరిచ్చాడు. మీరు మా దగ్గరకు రాకండి, మేము మీ గుడ్లకు రాము అని రెండు టీములు ప్రశాంతంగా ఆడుదామనుకుంటే అందుకు సోనియా ఒప్పుకోలేదట. 

చీఫ్‌ పది పాయే..
ఈ గొడవలన్నీ తన వల్లేనని కాంతార టీమ్‌ అభిప్రాయపడింది. మొత్తానికి లైవ్‌లో ఈ టాస్క్‌ అయిపోగా ఈ గేమ్‌లో శక్తి టీమ్‌ విజేతగా నిలిచింది. ఇంకో షాకింగ్‌ విషయమేంటంటే.. అభయ్‌ను చీఫ్‌గా తొలగించారట.. దీంతో అతడి లీడర్‌ పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే నిలిచింది.

బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement