Sonia Akula
-
మల్లన్న పట్నం వేసి బోనం చేసిన సోనియా ఆకుల (ఫోటోలు)
-
శ్రీలంకలోని శంకరి దేవి శక్తిపీఠం సందర్శించిన బిగ్‌బాస్ సోనియా (ఫోటోలు)
-
జూబ్లీహిల్స్ : హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ సోనియా ఆకుల (ఫొటోలు)
-
తాళి కళ్లకద్దుకుని, అత్తామామల ఆశీర్వాదం తీసుకుని.. (ఫోటోలు)
-
Soniya Akula-Yash: వేములవాడ రాజన్నను దర్శించుకున్న కొత్త జంట (ఫోటోలు)
-
Soniya Akula: బిగ్‌బాస్ బ్యూటీ సోనియా ఆకుల మెహందీ ఫంక్షన్ (ఫోటోలు)
-
గతేడాది విషాదం..! విడాకులైన వ్యక్తితో సోనియా పెళ్లి (ఫోటోలు)
-
Soniya Akula: సోనియా పెళ్లికి పెద్దోడు డుమ్మా! ఎందుకబ్బా? (ఫోటోలు)
-
సోనియా పెళ్లిలో పెద్దోడు మిస్సింగ్.. కానీ పుష్ప లెవల్లో రైతుబిడ్డ ఎంట్రీ
సోనియా ఆకుల.. బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో సెన్సేషన్ అయిన పేరు. నిర్భయంగా, నిర్మొహమాటంగా తనకు ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది. ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా నచ్చింది చేసుకుంటూ పోతుంది. బిగ్‌బాస్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన పృథ్వీ, నిఖిల్‌తో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడింది. ఆ ఇద్దరినీ తన గుప్పిట్లో పెట్టుకుందన్న విమర్శలు కూడా మూటగట్టుకుంది. కట్ చేస్తే షో నుంచి ఎలిమినేట్ అయ్యాక తనపై నెగెటివిటీ వచ్చిందని తెలుసుకుని దాన్ని ఎలాగోలా కవర్ చేసేయాలనుకుంది.నిఖిల్‌కు ఆహ్వానం.. కానీ!అందుకుగానూ తన గుప్పిట్లో పెట్టుకున్న పెద్దోడు అలియాస్ నిఖిల్‌నే నామినేట్ చేసింది. సోషల్ మీడియాలోనూ అతడికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టింది. ఇప్పుడు షో పూర్తయింది కాబట్టి అంతా కలిసిపోయారు. తన పెళ్లికి రమ్మని శుభలేఖ ఇచ్చిందట. ఆమెపై అలిగాడో, కోపమో, పనివల్లో కానీ సోనియా వివాహానికి నిఖిల్ డుమ్మా కొట్టాడు. అయితే గత సీజన్ విజేత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం సోనియా రిసెప్షన్‌కు హాజరై ఆమెను ఆశీర్వదించాడు. పుష్ప లెవల్లో ఎంట్రీఈమేరకు తన గ్రాండ్ ఎంట్రీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ చుట్టూ ఇద్దరు, ముగ్గురు బౌన్సర్లు కూడా ఉన్నారు. కొత్త జంటను కలిసిన అనంతరం బిగ్‌బాస్ సెలబ్రిటీలందర్నీ పలకరించాడు. ఇక ఈ వీడియోకు పుష్ప 2 మూవీలోని గంగో రేణుక తల్లి పాటను యాడ్ చేయడం గమనార్హం. ఇది చూసిన జనాలు ఇతడేంటి? హీరోలా ఫీలైపోతున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) చదవండి: ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్ -
సోనియా పెళ్లిలో బిగ్‌బాస్ 8 సెలబ్రిటీస్.. మొత్తం రచ్చ రచ్చ (ఫొటోలు)
-
పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. ఫొటోలు వైరల్
ఈసారి బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది సోనియా ఆకుల. అయితే హౌస్‌లో ఎక్కువ వారాలు ఉండకుండానే ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. గతనెలలో నిశ్చితార్థం చేసుకున్న ఈమె.. ఇప్పుడు గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. యష్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు బిగ్‌బాస్ 8లో పాల్గొన్న కంటెస్టెంట్స్ చాలామంది హాజరయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)శుక్రవారం రాత్రి రిసెప్షన్ జరగ్గా.. శనివారం వేకువజామున 3 గంటలకు అలా పెళ్లి జరిగింది. బిగ్‌బాస్ ఫ్రెండ్స్ పలువురు రిసెప్షన్ ఫొటోలు పోస్ట్ చేశారు. పెళ్లి ఫొటోలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.తెలంగాణలోని మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆర్జీవీ తీసిన ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అలా బిగ్‌బాస్ 8లోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది.బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. అతడికి ఆల్రెడీ పెళ్లి అయిందని, కాకపోతే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని.. త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఇప్పుడు నవంబర్ 21న నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంది. వివాహానికి హాజరైన వాళ్లలో జెస్సీ, అమర్ దీప్-తేజస్విని, బేబక్క, రోహిణి, టేస్టీ తేజ, కిరాక్ సీత తదితరులు ఉన్నాయి. బిగ్‌బాస్ 8 విన్నర్ నిఖిల్ మాత్రం మిస్ అయ్యాడు. మరి కావాలనే రాలేదా? లేకపోతే వేరే కారణాల వల్ల మిస్సయ్యాడో!(ఇదీ చదవండి: ఉపేంద్ర 'యూఐ' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Tasty Teja (@tastyteja) -
పెళ్లి మూడ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ సోనియా ఆకుల.. ప్రముఖులకు ఆహ్వానాలు! (ఫొటోలు)
-
పెళ్లి డేట్ ప్రకటించిన సోనియా.. నాగార్జునకు ఆహ్వానం
బిగ్‌బాస్ షో వల్ల కంటెస్టెంట్ల కెరీర్ ముందుకెళ్తుందో, లేదో కానీ జనాల్లో పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. అయితే పాజిటివ్ కంటే నెగెటివ్ పబ్లిసిటీ మూటగట్టుకున్నవారే ఎక్కువ. ఆ జాబితాలోకి సోనియా ఆకుల వస్తుంది.దూకుడుకు చెక్మంథనికి చెందిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పాల్గొంది. హౌస్‌లో అందరికంటే స్ట్రాంగ్ అనుకున్న నిఖిల్‌తో మొదట తలపడింది. కానీ కొద్దిరోజుల్లోనే అతడిని గుప్పిట్లో పెట్టుకుంది. అయితే అతడితో ప్రవర్తించిన తీరు కూడా జనాలకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో ఆమెను త్వరగానే ఎలిమినేట్ చేశారు.పెళ్లికి రెడీఇకపోతే సోనియా ఆకుల పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ప్రియుడు యష్‌తో ఏడడుగులు వేసేందుకు ఆత్రంగా ఎదురుచూస్తోంది. గత నెలలో వీరిద్దరి నిశ్చితార్థం జరగ్గా ఇటీవలే పెళ్లిపత్రికలు కూడా అచ్చు వేయించారు. డిసెంబర్ 21న మధ్యాహ్నం 3.40 గంటలకు తమ వివాహం జరగనుందని తెలియజేస్తూ సోనియా సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. అయితే రిసెప్షన్ మాత్రం పెళ్లికి ఒకరోజు ముందే ప్లాన్ చేసినట్లు పేర్కొంది. View this post on Instagram A post shared by Yash Veeragoni (@yashveeragoni) View this post on Instagram A post shared by Yash Veeragoni (@yashveeragoni) మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'బిగ్‌బాస్' ఫేమ్ సోనియా ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ (ఫొటోలు)
-
'బిగ్‌బాస్ 8' సోనియా ఆకుల నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే? (ఫొటోలు)
-
నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?
బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లకంటే నెగిటివ్ అయిన వాళ్లే ఎక్కువ. అలా ప్రస్తుత సీజన్లో పాల్గొని ఎలిమినేట్ అయిన బ్యూటీ సోనియా ఆకుల. ఇప్పుడు ఈమె తన ప్రియుడు యష్ పాల్‌తో నిశ్చితార్థం చేసుకుంది. పెద్దగా హడావుడి లేకుండా గురువారం ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలా బిగ్‌బాస్ 8వ సీజన్ అంటే ఈసారి ఓ కంటెస్టెంట్‌గా హౌసులోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది.బయటకొచ్చిన తర్వాత నిఖిల్ నిజ స్వరూపం తెలుసుకుని పలు ఇంటర్వ్యూలో అతడిని కడిగిపారేసింది. బిగ్‌బాస్ లోనే తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. అతడికి ఆల్రెడీ పెళ్లి అయిందని, కాకపోతే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని.. త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఇప్పుడు నవంబర్ 21న నిశ్చితార్థం చేసుకుంది. డిసెంబరు రెండో వారంలో పెళ్లి జరిగే అవకాశముంది.(ఇదీ చదవండి: 'జీబ్రా' సినిమా రివ్యూ) -
ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ల టార్గెట్.. ట్రోఫీకి మరింత దగ్గరైన నిఖిల్
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్ చేయిద్దాం అని బిగ్‌బాస్‌కు ఏ ముహూర్తాన అనిపించిందో కానీ ఇది ఒకరకంగా నిఖిల్‌కు ప్లస్సే అయింది. వచ్చినవాళ్లంతా.. నిఖిల్ ఆట గురించి కాకుండా పర్సనల్ టార్గెట్ చేశారు. సింహంలా ఉండే నిఖిల్‌ను పిల్లిలా మార్చి తనవైపు తిప్పుకున్న సోనియా కూడా అతడిని తప్పుపట్టింది.క్లారిటీ ఇవ్వకపోవడం తప్పే!యష్మి విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం తప్పని కుండ బద్ధలు కొట్టింది. సీత అయితే మరో అడుగు ముందుకేసి స్ట్రాంగ్‌గా ఉండే ఆడవారిని టార్గెట్ చేస్తున్నావని, వారిని గేమ్ కోసం వాడుకుంటున్నావంటూ నిందలేసింది. ఇది మరీ విడ్డూరం.. నిఖిల్‌తో డ్యాన్స్ చేయాలనుంది, నిఖిల్‌తో ఓ కలగన్నాను అంటూ యష్మినే అతడి వెంట పడింది. కనీసం ఫ్రెండ్‌లా అయినా ఉండమని అర్థించింది. అటు సీత కూడా నిఖిల్‌పై ఇష్టం చూపించింది. జీవితంలో క్షమించనన్న నిఖిల్వీరిని పెద్దగా పట్టించుకోని నిఖిల్.. మీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని ముక్కుసూటిగా చెప్పలేకపోయాడు. అదే అతడికి పెద్ద మైనస్ అయింది. అయితే యష్మితో కొన్ని సందర్భాల్లో ఫీలింగ్స్ పెట్టుకోవద్దన్నట్లు ఛూఛాయగా చెప్పినప్పటికీ అదంత హైలైట్ అవలేదు. ఫలితంగా 12వ వారం నామినేషన్స్‌లో సీత.. ఆడవారి ఎమోషన్స్‌తో ఆడుకుంటావ్ అని నిందేయడంతో నిఖిల్ చాలా హర్టయ్యాడు. ఆమెను జీవితంలో క్షమించనన్నాడు. ఆ బాధతో భోజనం కూడా తినకుండా నిద్రపోయాడు.నిఖిల్‌కు సింపతీబిగ్బాస్ హౌస్‌లో ఎవరినైనా టార్గెట్ చేస్తే ప్రేక్షకులు అస్సలు ఊరుకోరు. అతడిపై చాలా సింపథీ చూపిస్తారు.. అదీ ఓట్ల రూపంలో! ఈ నామినేషన్ ప్రక్రియతో నిఖిల్‌పై జనాల్లో సింపథీ వచ్చింది. పైగా నటి కావ్యతో ప్రేమస్టోరీ చెప్తూ.. తమ మధ్య దూరం వచ్చింది, కానీ ఈ జీవితానికి తనే భార్య అని ఏడ్చేయడంతో జనాలు తెగ కనెక్ట్ అయిపోయారు. నిఖిల్ ప్రేమ సఫలం కావాలని కోరుకున్నారు. అలా ఈ వారం నిఖిల్‌కు నెగెటివిటీ కంటే సింపథీయే ఎక్కువ వచ్చింది. దీంతో విన్నింగ్ రేస్‌లో గౌతమ్‌ను వెనక్కు నెట్టి మరీ ముందుకు దూసుకొచ్చేశాడు. మరి తర్వాతి వారాల్లో వీరిద్దరి గేమ్ ఎలా ఉంటుందో చూడాలి!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గ్రూప్ గేమ్ ఆడినోళ్లను మడతెట్టేశారు.. గౌతమ్‌పై ప్రేరణ కుళ్లు
బిగ్‌బాస్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చి వారితో నామినేషన్స్ వేయించాడు. వచ్చిన ప్రతిఒక్కరూ నిఖిల్ గ్యాంగ్పైనే విరుచుకుపడ్డారు. మరి ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి (నవంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..గౌతమ్‌పై ప్రేరణ కుళ్లుగత వారం అవినాష్, తేజ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే వీరికి బదులు గౌతమ్ ఉండాల్సిందని ప్రేరణ అభిప్రాయపడింది. వచ్చినవారమే గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సింది.. ఇప్పుడు ఏకంగా స్ట్రాంగ్ ప్లేయర్ అయి కూర్చున్నాడు. అదెలాగో నాకర్థం కావట్లేదు. ఈ వారం గౌతమ్, విష్ణుప్రియ, యష్మిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనుకున్నాను. అంతా రివర్స్‌లో జరుగుతోంది అని నబీల్‌తో ముచ్చట్లు పెట్టింది.వచ్చావా అక్క..తర్వాత బిగ్‌బాస్ ఆసక్తికర ఘట్టానికి తెరదీశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి ఇద్దర్ని నామినేట్ చేస్తారన్నాడు. మొదటగా సోనియా.. ప్రేరణను నామినేట్ చేసింది. వచ్చావా అక్క అని ప్రేరణ అనడంతో గొడవ పీక్స్‌కు వెళ్లింది. నాకు అక్క కాదు, నిఖిల్‌కు అక్కవి అని ప్రేరణ సంజాయిషీ ఇవ్వడంతో సోనియాకు మరింత తిక్క రేగింది. అతడికి అక్కను అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? అంటూ గట్టిగా నిలదీసింది. అందుకు బదులుగా దాదాపు మూడునాలుగుసార్లు ప్రేరణతో సారీ చెప్పించుకుంది.తేజది తప్పయినప్పుడు యష్మిది కూడా తప్పేగా?అనంతరం నా పెద్ద కొడుకు నిఖిల్‌ను నామినేట్ చేస్తున్నా అంటూ నైస్‌గా మొదలుపెట్టి వైల్డ్‌గా మారిపోయింది. అప్పట్లో పృథ్వీని చిన్న కారణంతో నామినేట్ చేశావు. ఎప్పుడైనా కరెక్ట్ కారణంతో ఎవర్నైనా నామినేట్ చేశావా? యష్మి, ప్రేరణను ఎందుకు నామినేట్ చేయలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎవిక్షన్ షీల్డ్గేమ్లో తేజ ముందుగా ఎగ్ వేశాడని అతడిని వరస్ట్ కంటెస్టెంట్ అన్నావు.. మరి తేజ ఎగ్ వేసేవరకు ఆగి కావాలని యష్మి మరో గుడ్డు వేసింది. ఆమె చేసింది తప్పని ఎందుకు ఒప్పుకోవట్లేదు అని నిలదీసింది.ఆమె ముందు మాట్లాడు.. నిఖిల్‌కు సలహాఅతడి లవ్‌ట్రాక్ గురించి మాట్లాడుతూ.. యష్మి నీపై ఫీలింగ్స్ చూపించింది.. ఒక మహిళకు గౌరవమిచ్చేవాడివే అయితే.. ఆమె రిలేషన్షిప్ కోసం హౌస్‌కు రాలేదు, ఆమె ఏం చేస్తే అది పడటానికి రాలేదు అని తన వెనకాల మాట్లాడాల్సిన అవసరం లేదు. అవన్నీ తన ముందే చెప్పాలని గద్దించింది. తన మీద ఇష్టం లేనప్పుడు ఆమె జోలికి వెళ్లకూడదు అని తేల్చేసింది.ఏడ్చేసిన యష్మిసోనియా మాటలతో యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు క్లారిటీగా చెప్పుంటే నీ జోలికే వచ్చేదాన్ని కాదని నిఖిల్‌పై మండిపడింది. నిఖిల్‌తో ఒక కలగన్నానే తప్ప తనపై నాకు పెద్ద ఫీలింగ్సే లేవని ప్లేటు తిప్పేసింది యష్మి. చివరగా సోనియా.. నువ్వు నీలా ఉండు నిఖిల్, నువ్వు గెలిస్తే సంతోషపడే మొదటి వ్యక్తిని నేనే అంటూ అతడి తలపై గాజు బాటిల్ పగలగొట్టింది.బేబక్కపై సెటైర్లుతర్వాత బేబక్క హౌస్‌లోకి వచ్చి అవతలివాళ్లను తక్కువ చేయడం నచ్చలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో అతడు.. ప్రేక్షకులు మాకు ఓట్లు వేసి ఇక్కడిదాకా ఉంచారు. మీకు ఓట్లు వేయకుండా ఎలిమినేట్ చేశారంటూ సెటైర్లు వేశాడు. చీఫ్‌గా ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేయలేదంటూ బేబక్క.. నిఖిల్‌ను నామినేట్ చేసింది.గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్అనంతరం శేఖర్ బాషా హౌస్‌లో అడుగుపెట్టాడు. ప్రేరణలో చిన్నపిల్లల మనస్తత్వం ఎంతో నచ్చేవి. కానీ రానురానూ రూడ్‌గా మారిపోయింది.. కొందర్ని పురుగుల్ని చూసినట్లు చూస్తోందంటూ ఆమెను నామినేట్ చేశాడు. గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్ అని సలహా ఇచ్చాడు. యష్మిని సైతం గ్రూపిజం కనిపిస్తోందంటూ నామినేట్ చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అగ్గి రాజేసిన సోనియా.. నిఖిల్ వల్ల బ్యాడ్ అయ్యానన్న యష్మి
ఈసారి నామినేషన్స్ ప్రక్రియను బిగ్‌బాస్ వెరైటీగా ప్లాన్ చేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను హౌస్‌లోకి రప్పించి.. ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు. అలా మొదటగా సోనియా ఆకుల హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే నిఖిల్ బ్యాచులో పుల్లలు పెట్టింది. పృథ్వీని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నావ్ అంటూ ప్రేరణను నామినేట్ చేసింది.సిల్లీ రీజన్స్‌తో నామినేషన్ఇక నిఖిల్‌ను అయితే ఓ ఆటాడేసుకుంది. మొదట్లో పృథ్వీని ఎందుకు నామినేట్ చేశావ్? అని అడిగింది. అందుకతడు నిర్లక్ష్యంగా ఉన్నందుకు చేశానన్నాడు. అది విని అవాక్కైన పృథ్వీ.. ఆ కారణంతో నామినేట్ చేశావా? అని నోరెళ్లబెట్టాడు. మంచి పాయింట్లతో ఎప్పుడైనా నామినేట్ చేశావా? అని నిఖిల్‌ను నిలదీసింది. ఇక యష్మితో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ.. యష్మి తన మనసులో ఫీలింగ్ చెప్పింది.. కానీ నువ్వు అంటూ సోనియా మాట్లాడుతుండగా.. మధ్యలో నిఖిల్ అందుకున్నాడు. నిఖిల్ జోలికే వెళ్లేదాన్ని కాదుతన ఫీలింగ్ చెప్పగానే అక్కడే కట్ చేసేశాను అని క్లారిటీ ఇచ్చాడు. అది అబద్ధమని యష్మి గట్టిగా అరిచింది. క్లారిటీగా తనకు చెప్పుంటే నిఖిల్ జోలికే వెళ్లేదాన్ని కాదంది. అతడి వల్ల తాను బ్యాడ్ అయ్యానంది. అలా సోనియా నిఖిల్ నెత్తిపై బాటిల్ పగలగొట్టి నామినేట్ చేసింది. మరి హౌస్‌లోకి ఇంకా ఎవరెవరు వచ్చారు? ఎవర్ని నామినేట్ చేశారు? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విన్నర్ గురించి చెప్పడం వేస్ట్
-
Bigg Boss 8 Telugu: సోనియా ఆకుల స్పెషల్ ఇంటర్వ్యూ
-
బిగ్‌బాస్‌ను వదిలిపెట్టనంటున్న సోనియా.. కొత్తగా ఏం చేసిందంటే?
బిగ్‌బాస్ షో వల్ల నెగెటివ్ అయినవారు చాలామందే ఉన్నారు. అయితే తాను కరెక్ట్‌గా ఉన్నానని.. కానీ, బిగ్‌బాసే తప్పుగా చూపించాడని ఫైర్ అయింది సోనియా ఆకుల. తన మాటల్ని, ప్రవర్తనని మరో కోణంలో ప్రేక్షకులకు చూపించాడని, అందువల్లే జనాలు తనను విమర్శిస్తున్నారంటోంది. ఎక్కడికి వెళ్లినా, ఏమాత్రం ఛాన్స్ దొరికినా బిగ్‌బాస్‌ను తిడుతూనే ఉంది. కొత్త యూట్యూబ్ ఛానల్..మితిమీరిన హగ్గులు, పర్సనల్ టార్గెట్ వంటి స్వయంకృతపరాధాలను సైతం ఒప్పుకోకపోవడం గమనార్హం. తాజాగా ఈ బిగ్‌బాస్ (ఎనిమిదో సీజన్) బ్యూటీ తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినట్లు వెల్లడించింది. సామాజిక సేవ నుంచి బిగ్‌బాస్ వరకు మీరు నన్ను ఫాలో అవుతూ వచ్చారు. ఇప్పుడు మీ అందరికీ మరింత దగ్గరయ్యేందుకు కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఒక్కటేం ఖర్మ.. అన్నీ ఉంటాయ్యువర్స్ సోనియా.. ఇక్కడ బిగ్‌బాస్ షోలో ఎపిసోడ్ వెనకాల జరిగిన స్టోరీలను, నా యాక్టింగ్ కెరీర్‌కు సంబంధించిన కథనాలను, వ్యక్తిగత విషయాలను, లైఫ్‌స్టైల్ కంటెంట్.. ఇలా అన్నీ మీతో పంచుకుంటాను. అలాగే సెలబ్రిటీల ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి అని చెప్పుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కచ్చితంగా సపోర్ట్ చేస్తామని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం నిన్ను బిగ్‌బాస్‌లోనే చూడలేకపోయాం.. ఇంకా యూట్యూబ్‌లో ఏం చూస్తామని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్ బాస్,అదిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన సోనియా
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో సోనియా ఆకుల పేరు సోషల్‌మీడియాలో ట్రెండ్ అయింది. అయితే, బిగ్ బాస్‌లో పాల్గొన్న ఒక అమ్మాయిపై ఈ రేంజ్లో నెగెటెవిటీ, ట్రోలింగ్ జరగడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇదంతా ఆమె మాటల వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన సోనియా ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇక్కడ కూడా వైరల్ అవుతుంది.షో నుంచి ఎలిమినేషన్ అయిన తర్వాత ఆమె ఇప్పటికే బిగ్ బాస్ మీద కూడా పలు ఆరోపణలు చేసింది. తన మాటల్ని ఇష్టమొచ్చినట్లుగా కట్ చేసి చూపించడమే కాకుండా.. తనను చాలా క్లోజప్ యాంగిల్స్‌లో ప్రేక్షకులకు చూపించారని తెలిపింది. బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి మీద కేసు పెట్టినట్లు ఇంటర్వ్యూ ద్వారా సోనియా తెలిపింది. రివ్యూల పేరుతో తనను కించపరిచేలా చాలా ఎక్కువగా చేసినట్లు ఆదిరెడ్డిపై ఆమె ఫైర్ అయింది. అయితే, ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదని తన కుటుంబ సభ్యులు చెప్పడంతో కేసు విషయంలో కాస్త తగ్గానని ఆమె తెలిపింది.'నా వల్ల నెలరోజుల పాటు రివ్యూవర్లు బాగా బతికారు.. నా గురించి వీడియోలు చేసుకుంటూ చాలామంది పంపాదించుకున్నారు. బిగ్ బాస్ షో కూడా ఈ 30 రోజులు నా వల్లే రేటింగ్‌తో బతికింది. వాళ్లందరికీ ఇంతటి మంచి ఆదాయం ఇచ్చిన సంతోషం నాకు ఉంది. నా వల్ల సుమారు 40 మంది కొత్త యూట్యూబర్స్కు బతుకుదెరువు దొరికింది. నేను ఎక్కడున్నా తిండి పెట్టే పనిలోనే ఉంటా.' అంటూ సోనియా పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.సోనియా కామెంట్లపై నెటిజన్ల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. బిగ్ బాస్ షో గురించి అన్ని విషయాలు తెలిసే లోపలికి వెళ్లావ్ కదా అంటూ చెప్పుకొస్తున్నారు. గత సీజన్లలోని కొందరి కంటెస్టెంట్స్ పేర్లు గుర్తు చేస్తూ.. వారందరికంటే మరీ చెడ్డపేరు తెచ్చుకున్నావ్ అంటూ ఆమెపై మండి పడుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఆమెను కావాలనే బిగ్ బాస్ చెడుగా చూపించే ప్రయత్నం చేశాడంటూ తప్పుపడుతున్నారు. ఏదేమైనా తనపై ఎన్ని ట్రోల్స్ వస్తున్నా వాటిని దాటుకొను సోనియా ముందుకు వెళ్తుంది. ఇక్కడే ఆమె ఎంత బలమైనదో తెలుస్తుందని అభిమానులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by BigbossaaMajaakaa (@bigbossaamajaaka) -
నేను తప్పు చేయలేదు, బిగ్‌బాస్ నన్ను రోడ్డున పడేశాడు
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో గతవారం జరిగిన సోనియా ఆకుల ఎలిమినేషన్ అందరూ ఊహించింది మాత్రమే కాదు, ఎంతోమంది కోరుకుంది కూడా! ఒక అమ్మాయిపై ఈ రేంజ్లో నెగెటెవిటీ, ట్రోలింగ్ జరగడం ఇదే తొలిసారి! బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన సోనియా తొలిసారి తన అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.నన్ను టార్గెట్ చేసిందిరియాలిటీ షో అంటే జీవితానికి సరిపడా అనుభవాలను నేర్చుకోవచ్చు అనుకున్నాను. కానీ బిగ్‌బాస్ నన్ను రోడ్డున పడేశాడు. నన్ను కావాలని బ్యాడ్ చేశాడు. నేను విష్ణుప్రియను టార్గెట్ చేశానంటున్నారు కానీ విష్ణుయే నన్ను టార్గెట్ చేసింది. నిఖిల్ విషయానికి వస్తే అతడు డిప్రెషన్లో ఉన్నాడు. నన్ను ఫ్యామిలీ అని భావించాడు. ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాడు కదా అని సపోర్ట్ చేశాను. నా పెళ్లికి నిఖిల్‌కు చెయిన్, పృథ్వీకి ఇయర్ రింగ్స్ ఇస్తానని కూడా చెప్పాను. తప్పు చేయలేదునా మాటల్ని ఇష్టమొచ్చినట్లుగా కట్ చేసి చూపించడం తప్పు కదా.. నేను హౌస్‌లో ఏ తప్పూ చేయలేదు, బిగ్‌బాసే తప్పుగా చూపించాడు. సాధారణంగా బయట గైడెన్స్ ఎలా ఇస్తానో హౌస్‌లో కూడా అలాగే ఇచ్చాను. అందులో తప్పేముంది? నా సలహాలు తీసుకోవడం, తీసుకోకపోవడం వాళ్లిష్టం. బిగ్‌బాస్ హౌస్‌లో నేను నాలాగే ఉన్నాను. ఎక్కడా యాక్టింగ్ చేయలేదు. నిజాయితీ ఏమైపోయింది?ప్రతిచోటా గేమ్ గురించే మాట్లాడానే తప్ప ఎవరినీ పర్సనల్‌గా టార్గెట్ చేయలేదు. గేమ్‌లో నిఖిల్, పృథ్వీని మాత్రమే చూస్తే ఎలా? నన్ను కూడా చూడు అని యష్మితో అన్నాను. దీన్ని తప్పుగా చూపించారు. నాగార్జునగారు కూడా నావైపు నిలబడలేదు. ఇక్కడ నీ నిజాయితీ ఏమైపోయింది? అప్పుడు నాకు హౌస్‌లో ఉండాలనిపించలేదు.అందులో నిజం లేదుబిగ్బాస్ లైఫ్ షో అనుకున్నాను, కానీ అది తప్పని తెలుసుకున్నాను. ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తితో నేను లవ్‌లో ఉన్నానని పుకారు లేపారు. అందులో నిజం లేదు. యష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఆయన తండ్రి నాకోసం ఓటింగ్ క్యాంపెయిన్ కూడా చేశాడు అని సోనియా చెప్పుకొచ్చింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ 4వ వారం విశ్లేషణ.. ఫోమ్‌తో ఫామ్‌లోకి వస్తే
బిగ్‌బాస్ 8వ సీజన్లో గడిచిన వారం(4వ) హౌస్‌లోని కంటెస్టెంట్స్ మనసులోని ముసుగులు తొలగించడానికి ఫోమ్‌ని నామినేషన్స్ పర్వంలో వాడాడు బిగ్‌బాస్. ఏ నురగైనా కరిగితే అసలు పదార్ధం బయట పడుతుందన్నట్టు ఈ ఫోమ్ ఉపయోగించిన తరువాత కంటెస్టెంట్ల అసలు రంగులు చాలానే బయటపడ్డాయని చెప్పొచ్చు. ఆ రంగులు బయటకు రాగానే ఆట మళ్ళీ ఫాంలోకి వచ్చింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?)యధావిధిగా నామినేషన్స్ లో వాడి వేడి రచ్చతో పాటు ఈ వారం క్లాన్స్ మధ్య పోటీగా నిర్వహించిన డిఫరెంట్ బెలున్ కాంటెస్ట్ ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి. ఒక్క నామినేషన్స్‌లో తప్ప మిగతా రోజులంతా కంటెస్టెంట్లు ఆనందంగా కనిపించారు. కానీ వారు ఆనందంగా ఉండటం చూసి బిగ్‌బాస్ తట్టుకోలేకపోయాడు. ఈ పోటీకి ముందే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని బాంబు పేల్చాడు. దాంతో ఇంకేముంది, ఓ పక్క తమను తాము కాపాడుకుంటూ వైల్డ్ కార్డ్స్‌ని హౌస్‌లోకి రానివ్వకుండా బిగ్‌బాస్ పెట్టే ఆటలన్నీ ప్రాణం పెట్టి ఆడారు.ఇదంతా ఓ ఎత్తయితే ఈ వారం ఊహించని ఎలిమినేషన్ సోనియా. కాకపోతే ఈమెని ప్రేక్షకులు ఎలిమినేట్ చేయలేదు. హౌస్‌లోని కంటెస్టెంట్స్ చేయడం విశేషం. ముఖ్యంగా మిగతా లేడీ హౌస్మేట్స్ సోనియాని వద్దనుకోవడం విడ్డూరం. ఈ విషయం ఎలిమినేట్ అయిన తరువాత సోనియా నాగార్జునతో బాహటంగానే అందరిముందు చెప్పింది. కండబలం వున్నవారికి గుండెబలం తక్కువుంటుందన్న విషయాన్ని నిరూపించాడు నిఖిల్.(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా బాగోతం.. గ్యాప్ ఇవ్వకుండా అర్జున్ రోస్టింగ్)సోనియా ఎలిమినేట్ అవ్వగానే ఒక్కసారిగా భోరుమన్నాడు హౌస్‌లోనే బలవంతుడైన నిఖిల్. ఇతడితో పాటు పృథ్వీ కూడా అదే తీరు. ఆఖరికి ఇద్దరికిద్దరూ ఓ అమ్మాయి కోసం ఏడవడం ప్రేక్షకులకు కాస్త నవ్వు తెప్పించి ఉండవచ్చు. ఈ వారం చివర్లో నాగార్జున ప్రేక్షకులకు ఓ ఝలక్ ఇచ్చి ముగించాడు. వారం మధ్యలో ఎలిమినేషన్ ఉంటుందని అన్నాడు.హౌస్‌లో ఉన్నవాళ్ళ నుంచి ఎక్కువ మసాలా రావట్లేదని అనుకున్నాడో ఏమో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పేరిట ఇంకొంతమందిని హౌస్‌లోకి పంపడానికి రెడీ అయ్యాడు బిగ్‌బాస్. ఏదేమైనప్పటికీ అటు బిగ్‌బాస్ ఇటు తెలుగు ప్రేక్షకులు ఒకింత సమానంగా ఆలోచిస్తారనుకోవచ్చేమో ఆలోచించండి.-ఇంటూరి హరికృష్ణ(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
Bigg Boss 8: సోనియా బాగోతం.. గ్యాప్ ఇవ్వకుండా అర్జున్ రోస్టింగ్
బిగ్‌బాస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. స్టేజీపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చేసింది. కానీ బిగ్‌బాస్ బజ్‌లో మాత్రం కచ్చితంగా మాట్లాడాలి. హోస్ట్ అర్జున్ అదే చేశాడు. గ్యాప్ ఇవ్వకుండా రోస్టింగ్ చేసి వదిలేశాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చిన సోనియా.. కొన్నింటికి మాత్రం ఆన్సర్ చెప్పలేక సైలెంట్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?)హౌసులో ఎవరితో ఎక్కువ బాండింగ్ ఏర్పడింది అని అడగ్గా.. అభయ్, నిఖిల్, పృథ్వీ పేర్లు చెప్పింది. నిఖిల్‌కి నీపై ఎలాంటి ఫీలింగ్ ఉందని అడగ్గా.. మా అన్నలాగా, అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడని సోనియా చెప్పింది. లోపల హౌసులో వాళ్లని ఏమారుస్తావేమో గానీ నన్ను వద్దులే అని అర్జున్ సైలెంట్‌గా సెటైర్ వేశాడు.పృథ్వీకి కోపమే మైనస్ అని తెలిసినా.. వాడిని మీరు ఓ ఆయుధంలా ఉపయోగించుకున్నారని మేం అంటున్నాం అని.. అలానే ముందుండి ఆట పట్టిస్తున్నారని మీరనుకుంటున్నారు గానీ వెనకుండి ఆట నడిపిస్తున్నారని ఆడియెన్స్‌కి తెలుసులే అని సోనియా బాగోతాలన్ని అర్జున్ బయటపెట్టాడు. చేయాల్సిందంతా చేసేసి నాకేం తెలియదన్నట్లు కూర్చుంటారు 'కపటనాటక సూత్రధారి' అని సోనియాకి కొత్త పేరు పెట్టాడు.(ఇదీ చదవండి: మణికంఠకి మెంటలెక్కించారు.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నదెవరు?)ఆడపులి అని సోనియా తనకు తానే అనుకోవడంపైన కూడా అర్జున్ కౌంటర్ వేశాడు. ఆడపులి అంటే ముందుకొచ్చి ఆడతుంది, పిల్లిలా వెనకుండదని అన్నాడు. ఇక నిఖిల్-పృథ్వీ గురించి అర్జున్ మాట్లాడుతూ.. వాళ్లు బాధితులు, మీరు బాధపెట్టినోళ్లు కాబట్టి ముందు మీరు బయటకొచ్చేశారు అని అన్నాడు. దీంతో కోపమొచ్చినా సరే సోనియా ఆపుకొంది. చూద్దాం వాళ్లు ఎన్నిరోజులు ఉంటారో? వాళ్లేం ఆట ఆడతారో చూద్దాం అని తనదైన శైలిలో సమాధానమిచ్చింది.ఇలా హౌసులో శివంగిలా చెలరేగిపోయింది గానీ ఇంటర్వ్యూలో మాత్రం పిల్లిలా అర్జున్ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక సౌండ్ చేయలేకపోయింది. మిగతా వాటి సంగతేమో గానీ నిఖిల్, తనకు అన్నయ్య లాంటోడు అని సోనియా చెప్పడం మాత్రం విడ్డూరంగా అనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?) -
Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?
బిగ్ బాస్ 8 నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. సోషల్ మీడియాలో చాలామంది పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే షో మొదలైన కొత్తలో సోనియా.. మిగిలిన వాళ్లతో పోలిస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్లా కనిపించింది. లా పాయింట్స్ చెబుతూ అవతలి వాళ్లని ఇరకాటంలో పెట్టింది.ఎప్పుడైతే నిఖిల్ పక్కన చేరిందో అప్పటి నుంచి సోనియా గేమ్ పక్కకు వెళ్లిపోయింది. యష్మి, మిగిలిన వాళ్లతో ప్రతిదానికి వాదిస్తూ పోయింది తప్పితే టాస్కులు కూడా ఆడాలి అనే సంగతి మర్చిపోయింది. అలానే హౌసులో ఉన్న అమ్మాయిలందరూ చాలా జాగ్రత్తగా గేమ్స్ ఆడుతూ స్ట్రాంగ్ అవుతూ వచ్చారు. ఈమె మాత్రం ఎప్పుడు చూడు పృథ్వీ-నిఖిల్‌తో కలిసి ముచ్చట్లు పెడుతూ వచ్చింది. అలా మిగిలిన వాళ్లందరికీ టార్గెట్ అయిపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్)విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా ఈసారి సోనియాని టార్గెట్ చేశారు. దీంతో ఓటింగ్‌లో చివరి స్థానంలో నిలిచింది. ఇదే విషయాన్ని ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున కూడా బయటపెట్టాడు. లెక్క ప్రకారం చూసుకుంటే నిఖిల్ ఫ్యాన్స్ అందరూ తనకు ఓట్లు వేస్తారని సోనియా అనుకుంది. కానీ అలా జరగలేదు.సోనియాని ఎలిమినేట్ చేసి బిగ్‌బాస్ మంచి పని చేశాడని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈమె వెళ్లిపోయింది కాబట్టి నిఖిల్ గేమ్ ఇకపై కరెక్ట్‌గా ఉంటుందనిపిస్తోంది. ఇదలా ఉంచితే వచ్చే వారం దాదాపు ఆరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?)Their Bond 💔 The way he said miss u machan in tears 🥺 ❤️Stay Strong Nikhil 💪#SoniyaAkula #NikhilMaliyakkal #Soniya #BiggBoss #BiggBossTelugu #BiggBossTelugu8 pic.twitter.com/OzPWuSSonx— GeethaRyder (@GeethaRyder) September 29, 2024 -
సోనియా ఎలిమినేట్, ఏడ్చిన నిఖిల్.. చివర్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నాగ్!
ఎంతోమంది బిగ్‌బాస్ ప్రియులు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సోనియా ఎలిమినేట్ అయింది. తను వెళ్లిపోతుంటే నిఖిల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. వెళ్లిపోయేముందు కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను వెలిబుచ్చింది సోనియా.. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 29) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ముందే ఊహించిన సోనియాఈ వారం తానే ఎలిమినేట్ అవుతానని సోనియా ముందే పసిగట్టింది. హౌస్ మొత్తం తనను తప్పుగా అర్థం చేసుకుంటోందంటూ తొలిసారి ఏడ్చేసింది. నాగ్ ఓదార్చే ప్రయత్నం చేయగా సోనియా తన కన్నీళ్లను దిగమించుకునేందుకు యత్నించింది. దీంతో యష్మి లేచి.. సోనియా ఒక సోదరిలా పృథ్వీ, నిఖిల్‌కు సలహాలు ఇస్తోందని, అక్కడ ఈమె తప్పే లేదని వెనకేసుకొచ్చింది. తర్వాత నాగ్ చిన్న ఫన్ గేమ్ ఆడించగా ఇందులో కాంతార టీమ్ గెలిచింది. సోనియా టాక్సిక్అనంతరం మీకే అంకితం అనే చిట్టీల గేమ్ ఆడించాడు. కంటెస్టెంట్లు ఓ చీటీ తీసి అందులో ఉన్న వాక్యాన్ని ఒకరికి అంకితం చేసి వారిని చెంపదెబ్బ కొట్టాలన్నాడు. అలా మొదటగా ప్రేరణ.. హౌస్‌లో సోనియా టాక్సిక్ అని ఆమెను కొట్టింది. నైనిక.. విష్ణుప్రియను లౌడ్ స్పీకర్ అంది. సీత.. మణికంఠ విక్టిమ్ కార్డ్ వాడతాడంది. ఆదిత్య.. మణికంఠ నెగెటివ్‌గా ఆలోచిస్తాడని పేర్కొన్నాడు. నబీల్.. నిఖిల్ సేఫ్ ప్లేయర్ అని తెలిపాడు. పృథ్వీ.. మణికంఠ మానిప్యులేట్ చేస్తాడన్నాడు.కంటెస్టెంట్ల చేతికి ఎలిమినేషన్ పవర్ యష్మి.. పృథ్వీ అటెన్షన్ సీకర్ అని తెలిపింది. నిఖిల్.. మణికంఠకు ఏ లక్ష్యం లేదన్నాడు. మణికంఠ వంతురాగా నిఖిల్ బయాస్డ్ అని పేర్కొన్నాడు. విష్ణు.. నైనిక ఇమ్మెచ్యూర్ అని అభిప్రాయపడింది. సోనియా.. విష్ణుకు సెల్ఫిష్ అన్న ట్యాగ్ ఇచ్చింది. తర్వాత నాగ్ ప్రేరణను, ఆదిత్యను సేవ్ చేశాడు. చివర్లో సోనియా, మణికంఠ మాత్రమే మిగిలారు. మణికంఠ హౌస్‌లో ఉండేందుకు పనికిరాడని మీరన్నారు. కానీ, సోనియాకు తక్కువ ఓట్లు పడ్డాయి.. మరి వీరిద్దరిలో ఎవరు హౌస్‌లో ఉండాలనేది మీరే నిర్ణయించాలంటూ కంటెస్టెంట్లకే పవర్ ఇచ్చాడు నాగ్.జైలుకు మణికంఠఈ క్రమంలో నిఖిల్, పృథ్వీ, నైనిక మాత్రమే సోనియాకు సపోర్ట్ చేయగా మిగతా అందరూ మణికంఠకు మద్దతిచ్చారు. దీంతో నాగ్.. అటు ప్రేక్షకుల ఓట్ల ప్రకారం, మెజారిటీ హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం సోనియా ఎలిమినేట్ అని ప్రకటించాడు. డేంజర్ జోన్లో ఉన్న మణి ఈ ఎపిసోడ్ అయిపోగానే జైల్లో ఉండాలన్నాడు. ఇక సోనియా ఎలిమినేట్ అవడంతో నిఖిల్, పృథ్వీ భావోద్వేగానికి లోనయ్యారు. (చదవండి: సోనియా ఎలిమినేషన్‌కు కారణాలివే!)నేనెవరికీ నచ్చనుస్టేజీపైకి వచ్చిన సోనియా.. నేను ఉన్నదున్నట్లు మాట్లాడటం వల్ల ఎవరికీ నచ్చను. కాలేజీలోనూ అంతే, ఇక్కడా అంతే.. కానీ, ఎవరికోసమూ నా స్వభావాన్ని మార్చుకోలేను. నిఖిల్, పృథ్వీకి సలహాలు ఇస్తాను. కానీ, వారు నా మాటలు వినరు, నేను వాళ్లను ఇన్ఫ్లూయెన్స్ చేయలేదు అని నొక్కి చెప్పింది. హౌస్మేట్స్ గురించి మాట్లాడుతూ.. విష్ణుప్రియ పులిహోర కలుపుతుందని, సీత.. కాకరకాయలా చేదుగా మాట్లాడుతుందని చెప్పింది. ప్రేరణ.. ఆవకాయ అని, నబీల్.. సాఫ్ట్ కుర్రాడు అని తెలిపింది. పృథ్వీ.. స్వీట్ పాయసం అని, యష్మి.. పెరుగన్నం అని పేర్కొంది. మిడ్ వీక్ ఎలిమినేషన్అన్నం లేకపోతే ఏదీ లేదు, అలాగే నిఖిల్ లేకపోతే బిగ్‌బాస్ హౌసే లేదంది. నైనిక.. అప్పడంలా ఈజీగా బ్రేక్ అవుతుందని చెప్పింది. సోనియా వెళ్లిపోతుండటంతో నిఖిల్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మిస్ యూ అంటూ ఒకరినొకరు కళ్లతోనే సంభాషించుకున్నారు. సోనియాను పంపించేశాక.. నాగ్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పాడు. అంటే.. వచ్చే ఆదివారం (అక్టోబర్ 5న) వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. వీరితోపాటే సోనియా కూడా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ తప్పే సోనియా కొంప ముంచింది! పారితోషికం లెక్కలివే!
తానే గొప్ప.. ఎదుటివాళ్లు తనముందు పిల్లబచ్చాలు.. అని విర్రవీగితే మొదటికే మోసం వస్తుంది. హౌస్‌లో చాలామందిని బయటకు పంపించేయాలని ఎదురుచూసింది ఆర్జీవీ బ్యూటీ సోనియా ఆకుల. కానీ నాలుగోవారానికే ఎలిమినేట్ అయ్యింది. అందుకుగల కారణాలు చాలానే ఉన్నాయి.గ్రూప్ గేమ్ఈ సీజన్లో కెప్టెన్సీకి బదులుగా చీఫ్స్ ఉంటారని బిగ్‌బాస్ ముందే వెల్లడించాడు. షో మొదలైన రెండు రోజుల్లోనే ఎవరి సత్తా ఏంటో తెలుసుకోవడం కష్టం కాబట్టి నిఖిల్.. తన ఫ్రెండ్ యష్మిని చీఫ్‌గా సెలక్ట్ చేశాడు. అందుకు సోనియా పెద్ద రాద్దాంతమే చేసింది. గ్రూప్ గేమ్ అంటూ నింద వేసింది.. కట్ చేస్తే వారానికే నిఖిల్‌ను అతడి గ్రూపులో నుంచి వెలేసి తనతో కొత్త టీమ్ ఏర్పాటు చేసుకుంది.విష్ణుతో వైరంచిన్నోడు పెద్దోడు అంటూ పృథ్వీ, నిఖిల్‌తోనే ఎక్కువ ముచ్చట్లు పెడుతూ సోఫాలో సెటిలైపోయింది. వారితో ఆమె ప్రవర్తించిన తీరుకు జనాలు తలకు జండూభామ్ రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిఖిల్‌తో స్నేహం ఎలా కుదిరింది? అని విష్ణుప్రియ క్యాజువల్‌గా అడిగిన పాపానికి అడల్ట్రేటెడ్ కామెడీ అంటూ ఆమెను నిందించింది.మితిమీరిన హగ్గులుకట్ చేస్తే నిఖిల్‌తో మితిమీరిన హగ్గులు, అతడిని అభ్యంతరకరంగా టచ్ చేయడం చూసి జనాలు చీదరించుకున్నారు. పైగా నిఖిల్‌ను గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పడం కూడా జనాలకు మింగుడుపడలేదు. ఈమె తన గేమ్ పాడుచేసుకోవడమే కాక నిఖిల్ గేమ్ కూడా చెడగొడుతోందని పేరు తెచ్చుకుంది. గేమ్‌లో వెనుకంజపైగా యష్మిని. ఎంతసేపూ నిఖిల్, పృథ్వీనే చూస్తే ఎలా అని సెటైర్లు వేసిన ఈమె మరి ఎంతసేపూ ఆ ఇద్దరినే వెంటేసుకుని తిరుగుతే జనాలేమనుకుంటారోనని కాస్తైనా ఆలోచించకపోవడం గమనార్హం. టాస్కుల్లోనూ పెద్దగా ఆడింది లేదు, కానీ ఆడినంత బిల్డప్ ఇచ్చింది.పారితోషికం ఎంతంటే?ఆడపులి అన్న ట్యాగ్‌కు కాస్తయినా న్యాయం చేయలేదు. వెరసి నాలుగోవారమే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఈ నాలుగు వారాలకుగానూ సోనియా దాదాపు రూ.6 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
నాగ్‌తో అడ్డంగా వాదించిన సోనియా.. హౌస్‌లో జీరో అతడే!
మాటలు హద్దులు దాటడంతో యష్మి, విష్ణు, సోనియాకు నాగ్ గట్టిగానే క్లాస్ పీకాడు. మణికంఠను అబ్బాయే కాదంటావా? నిఖిల్ చేతికి గాజులు ఒక్కటే తక్కువయ్యాయా? యష్మి దృష్టి ఎంతసేపూ ఇద్దరబ్బాయిల మీదే ఉందా? అని ముగ్గురిపైనా విరుచుకుపడ్డాడు. ఇంతకీ ఎవరిపై ఏ రేంజులో ఫైర్ అయ్యాడో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..హీరోగా నబీల్నాగార్జున వచ్చీరావడంతోనే హీరో-జీరో గేమ్ ఆడించాడు. మొదటగా మణికంఠ.. సీత హీరోలా గేమ్ ఆడుతుందని, నైనిక గేమ్‌లో జీరోలా అయిపోతోందని చెప్పాడు. మణికంఠ కరెక్ట్‌గా చెప్పాడని నాగ్ మెచ్చుకున్నాడు. తర్వాత యష్మి.. నబీల్ను హీరో, నైనికను జీరో అనేసింది. ఇక్కడ నాగ్.. నబీల్ ఆటకు చప్పట్లు కొట్టడమే కాకుండా ఆడియన్స్‌తోనూ సూపర్ అనిపించాడు. ఇతడు పృథ్వీ హీరో, మణిని జీరో అని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా మణికంఠ డబుల్ యాక్షన్ చేసిన వీడియోలు ప్లే చేశారు. గేమ్‌లో త్యాగం చేయలేదని ఓసారి, తనే త్యాగం చేశానని మరోసారి చెప్పాడు. ఏదైనా ఒక్కదానిపైనే నిలబడు, అతిగా ఆలోచించకు అని నాగ్ మణికి సలహా ఇచ్చాడు.సీత హీరో, మణి జీరోఆదిత్య వంతురాగా.. నిఖిల్ హీరో, మణి జీరో అని పేర్కొన్నాడు. నైనిక.. సీత హీరో, మణి జీరో అని తెలిపింది. ప్రేరణ వంతురాగా.. నబీల్‌కు హీరోగా కిరీటం పెట్టింది. పప్పులా ఆడుతున్నాడా? ఎవరి వల్లయినా ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నాడా? అనేది అర్థం కావట్లేదంటూ నిఖిల్‌ను జీరోగా అనేసింది. ఎందుకలా? అని నాగ్ అడగ్గా మిస్ బ్యాలెన్స్ అయ్యానని నిఖిల్ చెప్పాడు. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం? అని నిలదీశాడు. అంతేకాకుండా నీ క్లాన్లోకి రావడానికి హౌస్ అంతా ఇష్టపడలేదు, ఎందుకో తెలుసా? నీ ఆట నువ్వు ఆడట్లేదు, ఈజీగా ఇన్ఫ్లూయెన్స్ అయిపోతున్నావు.. అనే ఎవరూ ఇష్టపడలేదు అని అర్థమయ్యేలా వివరించాడు. చదవండి: సోనియా ఎలిమినేట్.. సీక్రెట్ రూంలాంటి ట్విస్టులేమైనా..?నా ఆట నేనే ఆడతాసోనియా, నిఖిల్.. పృథ్వీని హీరోగా, మణికంఠను జీరోగా అభిప్రాయపడ్డారు. సీత.. నబీల్ను హీరోగా పేర్కొనగా.. ఇండివిడ్యువల్ గేమ్ కనిపించడం లేదంటూ నిఖిల్‌ను జీరోగా అభిప్రాయపడింది. నెమ్మదిగా విషయం బోధపడుతున్న నిఖిల్.. ఇకమీదట నా ఆట నేనే ఆడతా, నా నిర్ణయాలు నేనే తీసుకుంటా అని మాటిచ్చాడు. పృథ్వీ.. నబీల్ను హీరోగా.. మణికంఠను జీరోగా పేర్కొన్నాడు. తర్వాత నాగ్ సోనియాకు క్లాస్ పీకాడు.. విష్ణును అడల్ట్రేటెడ్ కామెడీ అన్నావ్.. మరి నామినేషన్లో నువ్వు చేసిందేంటి? అని వీడియో ప్లే చేశాడు.నాగ్‌తో వాదించిన సోనియాఅందులో సోనియా.. ఎంతసేపు పృథ్వీ, నిఖిల్‌నే చూస్తే ఎలా? మమ్మల్ని కూడా చూడు అంటూ యష్మిపై సెటైర్లు వేసింది. ఇది తప్పు కాదా? అని నిఖిల్, పృథ్వీని ప్రశ్నించగా అబ్బే, తన ఉద్దేశం అది కాదంటూ వీళ్లు ఆమెను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో ప్రేరణ అందుకుని.. ఇందుకే, ఇలా తప్పు చేసినా సరే వారిని వారే సమర్థించుకోవడం వల్లే ఎవరూ ఆ క్లాన్లోకి వెళ్లలేదని ఉన్నమాట అనేసింది. తర్వాత సోనియా లేచి.. గేమ్‌లో వాళ్లతో పాటు నన్ను కూడా చూడు అని చెప్పానే తప్ప అందులో ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదని వాదించింది. ఇది జోక్ కాదువిష్ణుప్రియ.. ప్రేరణకు హీరోగా కిరీటం ఇవ్వగా, సోనియా జీరో అని తేల్చింది. ఈ సందర్భంగా విష్ణు.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టుబిళ్ల ఒక్కటే తక్కువ అని హేళన చేసిన వీడియోను నాగ్ ప్లే చేశాడు. అది సరదాగా అన్నానని విష్ణు నవ్వడంతో.. ఇది జోక్ కాదు, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావ్? ఇలాంటివి మళ్లీ రిపీట్ కావొద్దని నాగ్ హెచ్చరించాడు. అనంతరం మణికంఠను అబ్బాయిల లిస్టులో నుంచి పక్కనపడేసిన వీడియో ప్లే చేశారు.యష్మిపై ఫైర్అందులో.. ఇంట్లో నలుగురు అబ్బాయిలే ఉన్నామా? అయినా మణికంఠ ఉన్నాడుగా అని పృథ్వీ అనగా వాడు లెక్కలో లేడు అని యష్మి అనేసింది. ఇది చూసి నోరెళ్లబెట్టిన యష్మి.. అమ్మతోడు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, గేమ్పరంగా అతడు లెక్కలో లేడు అన్నానే తప్ప మరే ఉద్దేశం లేదంటూ క్షమాపణలు చెప్పింది. ఫైనల్‌గా నాగ్ ఈ రోజు నబీల్ ఒక్కడినే సేవ్ చేశాడు. రేపు సోనియా ఎలిమినేట్ అన్న విషయం అందరికీ తెలిసిందే!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుకు మొట్టికాయలు.. సోనియా గ్యాంగ్‌కు క్లాస్ పీకిన నాగ్
బిగ్‌బాస్ 8 ప్రారంభమైన తొలినాళ్లలో సోనియా.. తన తెలివిని ఉపయోగించి ఆటలో ముందుకు సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె అతి తెలివి ఉపయోగించడం వల్ల మొదటికే మోసం వచ్చింది. గ్రూప్ గేమ్ అంటూ నిఖిల్, యష్మిలపై నింద వేసిన ఆమె ఇప్పుడు నిఖిల్‌ను తన గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పుతోంది. ఇది చూసిన జనాలు సోనియాకు నిందించకుండా ఎలా ఉంటారు?గ్రూప్ గేమ్పైగా ఫైర్ బ్రాండ్లా ఉండే నిఖిల్.. సోనియా చెంత చేరాక ఆమె చేతిలో కీలుబొమ్మలా మారాడు. ఇక సోనియాను ఎవరైనా ఏమైనా అంటే చాలు నిఖిల్, పృథ్వి.. వారి మీద పడిపోయేవారు. ఈ ఇద్దరిని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడే సోనియా.. నామినేషన్లోనూ యష్మి.. ఆ ఇద్దరు అబ్బాయిలనే చూస్తోందని చులకనగా మాట్లాడింది. ఈ గ్రూప్ గేమ్‌ను చూసీచూడనట్లు ఊరుకున్న నాగ్ ఇన్నాళ్లకు పెదవి విప్పాడు. సోనియా ఆట కూడా చెడగొట్టండితాజా ప్రోమోలో.. నీ ఆట కనిపించడం లేదంటూ యష్మి సోనియాను నామినేట్ చేసింది. ఆ సమయంలో నిఖిల్, పృథ్వి పేర్లు ఎందుకు బయటకు వచ్చాయి? అని నాగ్ సూటిగా ప్రశ్నించాడు. ఇక్కడ పృథ్వీ సోనియాను వెనకేసుకురాబోయాడు. కానీ నాగ్ అందుకు ఒప్పుకోలేదు. ఇలాగే ఏం అర్థం చేసుకోకుండా మీ ఆటను పాడు చేసుకోండి.. అలాగే సోనియా ఆట కూడా చెడగొట్టండని క్లాస్ పీకాడు.బొట్టు ఒక్కటే తక్కువఇక బిగ్‌బాస్ షోకు పిక్నిక్ కోసమే వచ్చిన విష్ణుప్రియ.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టు ఒక్కటే తక్కువయ్యాయంటూ హేళన చేయడాన్ని సైతం తప్పుపట్టాడు. ఇది చాలా తప్పని నాగ్ చెప్తున్నా సరే విష్ణు దాన్ని నెత్తినెక్కించుకోకుండా ఊరికే నిఖిల్‌ను కాంచన అని ఆటపట్టిస్తామని కవర్ చేసేందుకు ప్రయత్నించింది. ఇది జోక్ కాదని, అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావని గద్దించడంతో అప్పుడు తన గొంతు తగ్గించింది. మరి ఇప్పటికైనా విష్ణు తన నోటిని అదుపులో పెట్టుకుంటుందేమో చూడాలి! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: సోనియా ఎలిమినేట్.. ఖుషీలో నిఖిల్ ఫ్యాన్స్
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో అడుగుపెట్టిందే 14 మంది కంటెస్టెంట్లు.. అందులో బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఈ మూడువారాలు అందరూ ఊహించి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవగా నాలుగోవారం మాత్రం ప్రేక్షకులు కోరుకున్న వ్యక్తి హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారట!సోనియాకే తక్కువ ఓట్లుఈ వారం ఆదిత్య ఓం, సోనియా ఆకుల, పృథ్వీ శెట్టి, ప్రేరణ, నబీల్, నాగమణికంఠ నామినేషన్లో ఉన్నారు. వీరిలో పృథ్వి, ఆదిత్య, సోనియాకు తక్కువ ఓట్లు వచ్చినట్లు భోగట్టా! ఈ ముగ్గురిలో కూడా సోనియాకే అత్యంత తక్కువ ఓట్లు పడ్డాయి. సోనియా తానే పెద్ద తోపు అని ఫీలవ్వడమే కాక నిఖిల్, పృథ్వీలను తన చేతివేళ్లపై ఆడిస్తోంది. ఈ టాలెంట్ నచ్చకనే ఆపరేషన్ సోనియా పేరిట తనను ఎలిమినేట్ చేయాలని ప్రేక్షకులు కంకణం కట్టుకున్నారు.సీక్రెట్ రూమ్?అయితే తనవల్ల అంతోఇంతో కంటెంట్ వస్తోంది కాబట్టి ఆమెను పంపించేందుకు బిగ్‌బాస్ టీమ్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ చివరికి తనను ఎలిమినేట్ చేశారట! ఎలిమినేట్ చేసినట్లే చేసి సీక్రెట్ రూమ్‌లోకి పంపించే ఆస్కారం కూడా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో పాటు తిరిగి తనను హౌస్‌లోకి అడుపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు!బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆమెను పెళ్లి చేసుకునేది నేను, నాకే ప్రాబ్లం లేదు: సోనియా ప్రియుడు
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో బాగా ట్రోల్ అవుతున్న కంటెస్టెంట్లలో సోనియా మొదటిస్థానంలో ఉంటుంది. తన ఆట తీరు, మాట తీరు వల్ల విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. మొదట్లో నిఖిల్‌ను గ్రూపిజం అంటూ పెద్దపెద్ద మాటలన్న ఆమె తర్వాత అతడినే తనవైపు తిప్పుకుంది. అటు పృథ్వీని సైతం తన చేతికింద పెట్టుకుని ఇద్దరిని తన గేమ్ కోసం అస్త్రంగా వాడుకుంటోంది.కావ్యతో బ్రేకప్?ఇక్కడ జనాలకు అర్థం కాని విషయాలు రెండున్నాయి. ఒకటి.. నిఖిల్‌కు ఆల్రెడీ నటి కావ్యతో బ్రేకప్ అయిందా? రెండు.. డిసెంబర్లో పెళ్లి పెట్టుకుని సోనియా.. అబ్బాయిలతో కాస్త అతి చనువుగా ప్రవర్తించడం! ఈ రెండు విషయాలపై సోనియా స్నేహితుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అభయ్ నవీన్ క్లారిటీ ఇచ్చాడు. ముందుగా సోనియా గురించి చెప్తూ.. ఆమె అబ్బాయిలు, అమ్మాయిలు అని తేడా ఏం చూపించదు. అందరితో ఒకేలా ఉంటుంది. బయటకు వచ్చాక తనపై వచ్చిన ట్రోల్స్ చూసి నేనే షాకయ్యాను. నాకు ఏ ప్రాబ్లం లేదుఆమె కుటుంబాన్ని, కాబోయే భర్తను కలిశాను. అతడేమన్నాడంటే.. 'సోనియా ఎలాంటిదో మాకు తెలుసు. ఇంట్లో వాళ్లను సోదరుల్లా చూస్తుంది. అబ్బాయైనా, అమ్మాయైనా తనకు నచ్చితే అలా చేతులు పట్టుకునే మాట్లాడుతుంది. అందులో నెగెటివిటీ ఏం లేదు. ఆమెను పెళ్లి చేసుకోబోయేది నేను కదా.. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు.. తనపై ట్రోలింగ్‌ను పట్టించుకోను అని చెప్పాడు.బ్రేకప్ అంటూ ఏడ్చేశాడునిఖిల్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్‌కు వచ్చేముందే తనకు బ్రేకప్ అయిందని క్లారిటీ ఇచ్చాడు. హౌస్‌లో సీత బ్రేకప్ స్టోరీ చెప్పినప్పుడు నిఖిల్.. తాను కూడా నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నానని, ఈమధ్యే బ్రేకప్ అయిందని చెప్పుకుంటూ ఏడ్చాడు. నిఖిల్ బ్రేకప్‌కు సోనియా కారణం కాదు అని పేర్కొన్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆడాళ్ల ప్రతాపం.. మాట్లాడాలంటే భయమేస్తోందని ఏడ్చిన మణి
పన్నెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని బాంబు పేల్చిన బిగ్‌బాస్.. వాటిని వీలైనంతవరకు తగ్గించవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అలా ఐదు ఛాలెంజ్‌లు ఇచ్చాడు. కానీ అందులో మూడు మాత్రమే గెలవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీల సంఖ్యను తొమ్మిది వరకే నరుక్కుంటూ రాగలిగారు. ఈ ఛాలెంజ్‌ల మధ్యలో బోలెడు గొడవలు. అవేంటో నేటి (సెప్టెంబర్ 26) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అదుర్స్ అనిపించిన నబీల్, పృథ్వీవైల్డ్కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు బిగ్‌బాస్ మూడో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో నబీల్, పృథ్వి పోటీపడ్డారు. పావుగంటసేపు బెలూన్ పగలకుండా చూసుకోమంటే వీళ్లు ఏకంగా మూడుగంటలకుపైగా అలానే ధ్వజస్థంభాల్లా నిలబడి ఔరా అనిపించారు. ఈ గేమ్‌లో పృథ్వి (శక్తి) టీమ్ విజయం సాధించడంతో 11 మందిలో ఒక వైల్డ్‌కార్డ్ ఎంట్రీని అరికట్టారు. అంతేకాదు, అవతలి టీమ్‌లో నుంచి ఒకరిని గేమ్‌లో నుంచి తీసేసే పవర్‌ను శక్తి టీమ్‌కు ఇచ్చాడు. చిల్లర గేమ్..దొరికిందే ఛాన్స్ అనుకున్న శక్తి క్లాన్.. కాంతార టీమ్‌లో నుంచి నబీల్ను అవుట్ చేసింది. బాగా ఆడే వ్యక్తిని ఎలా గేమ్‌లో నుంచి తీసేస్తారని కాంతార టీమ్ ఉడికిపోయింది. చిల్లర గేమ్ ఆడుతున్నారని ప్రేరణ మండిపడింది. సీత అయితే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను కలిసి ఆపుదామనుకున్నాక మళ్లీ నీ టీమ్ కోసం స్వార్థంగా ఆలోచించావని నిఖిల్‌ను తప్పుపట్టింది. విష్ణుప్రియ అయితే.. నిఖిల్ చేతికి గాజులు, నుదుటన బొట్టుబిళ్ల ఒక్కటే తక్కువైంది.. అలా అని ఆడవాళ్లను తక్కువ చేయట్లేదు అంటూనే నిఖిల్ మీద సెటైర్లు వేసింది. బలవంతమైన త్యాగం!అసలు శక్తి టీమ్‌లో మణిని ఎలా సైడ్ చేశారన్న డౌట్ ప్రేరణకు వచ్చింది. అదే ప్రశ్నను ముక్కుసూటిగా అడగ్గా మణికంఠయే స్వయంగా త్యాగం చేశాడని సోనియా అంది. అందుకు మణి.. అది నిజం కాదంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీంతో శక్తి టీమ్ బిక్కముఖం వేసింది. మన టీమ్‌లోని ముగ్గురు నేను సైడ్ అవ్వాలని కోరుకున్నారు. అందుకే నేను కూడా పక్కకు తప్పుకున్నానే తప్ప నా అంతట నేనుగా త్యాగం చేయాలనుకోలేదని మణి క్లారిటీ ఇచ్చాడు. కన్నీళ్లు పెట్టుకున్న మణికంఠఅయినా వెనక్కు తగ్గని సోనియా, యష్మి .. అప్పటిదాకా త్యాగం అని చెప్పి ఇప్పుడేమో మాట మార్చేశాడంటూ నోరేసుకుని పడిపోయారు. నీ వయసెంత? చిన్నపిల్లాడిలా ప్రవర్తించకు. ఎవర్నీ బ్యాడ్ చేయొద్దంటూ యష్మి వార్నింగే ఇచ్చింది. దీంతో ఎమోషనలైన మణి.. తప్పంతా నాదే! ఇకమీదట నోరు మూసుకుని కూర్చుంటాను అంటూ ఎమోషనలయ్యాడు. వీళ్ల అరుపులతో పసిపిల్లాడిలా భయపడిపోయిన మణికంఠ.. మాట్లాడాలంటేనే భయమేస్తోందంటూ ఏడ్చేశాడు. ధైర్యం నూరిపోసిన నబీల్అతడి బాధను అర్థం చేసుకున్న నబీల్.. ఎవరికీ భయపడాల్సిన పని లేదు, నీకు మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడాలంతే. అని తనకు ధైర్యం చెప్పాడు. ఇక బిగ్‌బాస్ రంగురంగుల పజిళ్లు అనే నాలుగో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో ఏ టీమ్ గెలవకలేకపోయింది. నచ్చిన స్టెప్పులేసుకోండి అంటూ ఐదో ఛాలెంజ్ ఇవ్వగా ఈ గేమ్‌లో శక్తి టీమ్ గెలుపొందింది. దీంతో 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కాస్తా తొమ్మిదికి చేరాయి. 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా..అప్పుడే బిగ్‌బాస్ ఓ బాంబు పేల్చాడు. ఇంతటితో ఛాలెంజ్‌లు పూర్తయ్యాయని, ఇప్పటివరకు మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మాత్రమే ఆపగలిగారని చెప్పాడు. అంటే ఇంకా తొమ్మిదిమంది హౌస్‌లోకి వచ్చేస్తున్నారని హౌస్మేట్స్ గుండెల్లో గుబులు పుట్టించాడు. వీరిలో ఆరేడుగురు మాజీ కంటెస్టెంట్లు కాగా మరో ఇద్దరు ఈ సీజన్లో ఎలిమినేట్ అయినవారితో రీఎంట్రీ ప్లాన్ చేయిస్తున్నట్లు టాక్!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణికి పట్టపగలే చుక్కలు.. నోరు మూసుకుంటా ప్లీజ్ అంటూ ఎమోషనల్
ఇప్పటిదాకా కంటెస్టెంట్లు తాము ఎలిమినేట్ కాకుండా మరిన్ని వారాలు హౌస్‌లో ఉండేందుకు ఆటాడారు. ఇప్పుడేమో బయట నుంచి వచ్చే వైల్డ్‌కార్డ్ ఎంట్రీలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ పెట్టిన రెండు ఛాలెంజ్‌లలో కాంతార ఒకటి గెలిచి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలను కాస్తా 11కి తీసుకొచ్చింది. ఈ సంఖ్యను ఇంకా తగ్గించుకునే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్.లవ్ సాంగ్..పట్టుకుని ఉండు, పగిలిపోతుంది అని మూడో టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో పృథ్వీ, నబీల్ హోరాహోరీగా పోరాడారు. చివరికి పృథ్వీ శక్తి టీమ్‌ను గెలిపించాడు. ఈ టాస్క్ మధ్యలో బిగ్‌బాస్.. పృథ్వీని ఓ పాట పాడమన్నాడు. అతడు లవ్ సాంగ్ పాడగా ఇది ఎవరికోసమో? అని నబీల్ అడిగాడు. అందుకు పృథ్వీ క్షణం ఆలోచించకుండా విష్ణుప్రియ పేరు చెప్పాడు. ఇంకేముంది.. ఆ మాటకు విష్ణు సిగ్గుపడుతూనే తెగ మురిసిపోయింది.త్యాగం చేయలేదన్న మణిమరో ప్రోమోలో గెలిచిన శక్తి టీమ్.. కాంతార టీమ్‌లో ఒకరిని తొలగించాలన్నాడు. అందుకు వాళ్లంతా స్ట్రాంగ్ ప్లేయర్ నబీల్ను సైడ్ చేశాడు. ఈ నిర్ణయం కాంతార టీమ్‌కు ఏమాత్రం నచ్చలేదు. ఈ క్రమంలో పెద్ద రభసే జరిగింది. అసలు మీ టీమ్‌లో నుంచి మణిని ఎందుకు తీసేశారని ప్రేరణ అడగ్గా అతడే త్యాగం చేశాడని సోనియా అంది. అవునా? అని ప్రేరణ ప్రశ్నించగా లేదని మణి బోర్డు తిప్పేశాడు. నోరు మూసుకుని కూర్చుంటాదీంతో సోనియా, యష్మి.. అతడికి చుక్కలు చూపించారు. నీ అంతట నువ్వే తప్పుకుంటానన్నావ్, ఇప్పుడేమో మాట మారుస్తూ అందరినీ బ్యాడ్ చేస్తున్నావని ఫైర్ అయ్యారు. దీంతో మణి.. ఏదీ మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చుంటా అని ఎమోషనల్ అవుతూ మైక్ నేలకేసి కొట్టాడు. నలుగురు కలిసి మణిపై ఎగబడటం చూసిన ప్రేరణ.. వారిని చెత్త ఫెల్లోస్ అని తిట్టింది. మరోవైపు సీత. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలను ఆపాలంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ గేమ్‌లో ఉండాలంది. నిజమే, కానీ ఆ మాటను ఎవరైనా పట్టించుకుంటారో? లేదో!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్ బాస్ 8: డేంజర్ జోన్లో ఆ ఇద్దరు.. కానీ అతడిపై వేటు?
బిగ్‌బాస్ 8లో నాలుగో వారం వచ్చేసింది. ఈ వారానికి సంబంధించి నామినేషన్స్ పూర్తయ్యాయి. కొత్త చీఫ్‌ని కూడా ఎంపిక చేసేశారు. క్లాన్స్ (గ్రూపులు) కూడా డిసైడ్ అయిపోయాయి. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. బిగ్‌బాస్ ముద్దుబిడ్డ కోసం ఊహించని వ్యక్తిని ఇంటినుంచి పంపేస్తారనే టాక్ వినిపిస్తోంది.హౌసులో ప్రస్తుతం 11 మంది ఉన్నారు. ఈసారి ప్రేరణ, మణికంఠ, పృథ్వీ, సోనియా, ఆదిత్య, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఓటింగ్‌లో నబీల్ టాప్‌లో కొనసాగుతున్నాడట. 35 శాతం మంది ఇతడు హౌసులో ఉండాలని కోరుకుంటున్నారు. ఇక తర్వాతి స్థానాల్లో నాగమణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా, పృథ్వీ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే డేంజర్ జోన్లో దోస్తులు సోనియా-పృథ్వీ ఉన్నారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా వల్ల నిఖిల్‌కి చెడ్డపేరు.. మొత్తం సీన్ ఛేంజ్)ప్రస్తుతం నిఖిల్ చీఫ్‌గా ఉన్న క్లాన్లోనే పృథ్వీ-సోనియా ఉన్నారు. గొడవల పడటం దగ్గర నుంచి గేమ్స్ వరకు అన్నింటిలోనూ వీళ్లిద్దరూ మంచి పోటీ ఇస్తున్నారు. అలానే సోనియా ఎన్ని తప్పులు చేస్తున్నా సరే ఎపిసోడ్లో వాటిని చూపించట్లేదు. అంటే ఈమె హౌస్‌లో ఉండాలని బిగ్‌బాస్ గట్టిగానే ఫిక్సయినట్లున్నాడు. పృథ్వీని కూడా పంపిస్తాడా అంటే డౌటే.ఇదంతా చూస్తుంటే ఈసారి ఆదిత్య ఓంపై వేటు పడుతుందా అనిపిస్తోంది. ఎందుకంటే అతడు హౌస్‌లో పెద్దగా యాక్టివ్‌గా కనిపించట్లేదు. మిగతా వాళ్లతో సరిగా ఇంకా కలవలేకపోతున్నాడు. మరి ఈ వారం బిగ్‌బాస్.. ఓటింగ్‌లో చివర్లో ఉన్న పృథ్వీ, సోనియాలలో ఒకర్ని ఎలిమినేట్ చేస్తాడా.. ఆదిత్యని బలి ఇచ్చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా చీప్ బిహేవియర్.. బండారం బయటపెట్టిన యష్మి) -
Bigg Boss 8: సోనియా వల్ల నిఖిల్‌కి చెడ్డపేరు.. మొత్తం సీన్ ఛేంజ్
బిగ్‌బాస్ 8లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు చెప్పలేం. ఎందుకంటే ఈరోజు వరకు స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవచ్చు. ఓ వైపు ఉన్నోళ్లంతా మరోవైపు జంప్ అయిపోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇలాంటి పరిస్థితే నిఖిల్‌కి ఎదురైంది. సోనియా వల్ల అతడికి చెడ్డపేరు రావడంతో పాటు నెగిటివిటీ కూడా మరింత ఎక్కువైపోతోంది. తాజా ప్రోమోలో ఇదే స్పష్టమైంది.(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా బండారం బయటపెట్టిన యష్మి.. నిఖిల్-సోనియా మధ్య మనస్పర్థలు)బిగ్‌బాస్ 8లో ప్రస్తుతమున్న వాళ్లలో నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. శక్తి క్లాన్‌కి ఇతడు చీఫ్‌గానూ ఉన్నాడు. అలానే పెట్టిన ప్రతి గేమ్‌లోనూ పోటీ పడుతూ బెస్ట్ ఇస్తున్నాడు. ఇతడి కూడా ఉంటున్న సోనియా మాత్రం ఆడటం సంగతి పక్కనబెడితే అందరి మధ్య పుల్లలు పెడుతోంది. ఈమె చేస్తున్న పనివల్ల నిఖిల్‌కి చెడ్డ పేరు వస్తోంది. ఈ వారం నామినేషన్స్‌లోనూ యష్మి-నిఖిల్ బంధం గురించి సోనియా మాట్లాడిన తీరు చాలా వరస్ట్. ఇదంతా అప్పుడు ఎవరూ చెప్పనప్పటికీ ఇప్పుడు బయటపెట్టారు.తాజాగా క్లాన్ కోసం జరిగిన పోటీల్లో గెలిచిన సీత.. కొత్త చీఫ్‌గా ఎంపికైంది. హౌస్‌లోని ఉన్నవాళ్లు ఎవరు ఏ క్లాన్ లో ఉండాలనేది నిర్ణయించుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఎప్పటిలానే నిఖిల్ చీఫ్‌గా ఉన్న శక్తి క్లాన్లోకి సోనియా, పృథ్వీ వెళ్లగా.. మిగిలిన వాళ్లందరూ సీత చీఫ్‌గా ఉన్న 'కాంతార' క్లాన్లోకి వెళ్లినట్లు చూపించారు. దీనిబట్టి చూస్తే సోనియా చీప్ బిహేవియర్ ఆమెకు మాత్రమే కాదు నిఖిల్‌కి కూడా మరింత చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉంది.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి) -
Bigg Boss 8: సోనియా చీప్ బిహేవియర్.. బండారం బయటపెట్టిన యష్మి
బిగ్‌బాస్ 8లో ఈసారి పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నారు. సోమవారమే ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. కానీ యష్మి-సోనియా మధ్య జరిగిన గొడవ మాత్రం ఆ తర్వాత కూడా చాలాసేపు కొనసాగింది. మంగళవారం ఎపిసోడ్‌లోనూ ఈ రచ్చనే సగం ఎపిసోడ్లో చూపించారు. ఈ క్రమంలోనే సోనియా బండారాన్ని యష్మి బయటపెట్టగా.. నిఖిల్-సోనియా మధ్య మనస్పర్థలు వచ్చినట్లు అనిపించింది. ఇంతకీ బిగ్‌బాస్‌లో 23వ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం.సోనియా బండారంనామినేషన్స్లో సోనిమా తీసిన పాయింట్స్.. యష్మికి ఎక్కడలేని కోపాన్ని తీసుకొచ్చాయి. మరీ ముఖ్యంగా నిఖిల్-పృథ్వీలనే నువ్వు చూస్తుంటే నా గేమ్ నీకు ఎందుకు కనబడతుందని యష్మికి కౌంటర్‌గా సోనియా చెప్పింది. దీని వల్ల నామినేషన్స్ పూర్తయిన తర్వాత సోనియా-యష్మి గొడవపడుతూనే ఉన్నారు. 'నిఖిల్, పృథ్వీని వేరే ఉద్దేశంతో చూడలేదని, సోనియా చెప్పింది కరెక్ట్ అయితే మీరు మాట్లాడాలి' అని పృథ్వీతో చెప్పింది. సోనియా ఇంత లూజ్‌గా మాటలు వదులుతుంటే నేను వంద మాట్లాడతా.. కానీ నేను అంత చీప్‌గా దిగజారను అని సోనియా బండారాన్ని యష్మి బయటపెట్టింది.(ఇదీ చదవండి: తగ్గిన 'దేవర' రన్ టైమ్.. ఇప్పుడు ఎంతంటే?)యష్మి ఏడుపుఇంతలో సోనియా వచ్చి యష్మితో మరోసారి వాదన పెట్టుకుంది. వాడు (పృథ్వీ) ఎలా పట్టుకున్నాడు, ఎలా వదిలాడు అని అంత క్లియర్‌గా నువ్వు చెబుతుంటే.. ఎంత అబ్జర్వ్ చేశావో అదే నేను చెప్పా అని సోనియా ఏదో కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ యష్మి కోపం పట్టలేకపోయింది. ఎక్స్క్యూజ్ మీ.. గేమ్ పరంగా నేను చెప్పాను.. నీలా ఆలోచించలేదు.. నువ్వు మాత్రం దానికి ఒక రిలేషన్ తగిలించి.. చేయి చేయి పట్టుకొని మాట్లాడుతున్నావ్. మేము తప్పుగా మాట్లాడకూడదా.. అంటే ఎవరు హౌస్‌లో తప్పుగా ఆలోచిస్తున్నారో నువ్వు గుర్తుపెట్టుకో.. నువ్వు వాళ్లకి సిస్టర్ కాదు మదర్ కాదు.. నీ ఇష్టమచ్చినట్లు వాళ్లని వాడుకుంటున్నావని నాకు అనిపిస్తుంది.. ఈరోజు అది క్లియర్ అయింది అని యష్మి గుక్కపట్టి ఏడ్చింది.నిఖిల్ ఓదార్పుసోనియా పెట్టిన చిచ్చు వల్ల యష్మి చాలా బాధపడింది. ఇంట్లో ఏ అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడినా తను ఎక్కడ నోరు జారి ఏం అనేస్తుందోనని భయంతో మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది. అంటే ఇన్నాళ్లూ నీతో (నిఖిల్) మాట్లాడతుంటే ఎంత తప్పుగా అర్థం చేసుకుంది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది. నోటికొచ్చింది మాట్లాడుతుంది అని యష్మి ఏడ్చేసింది. దీంతో నిఖిల్ దగ్గరుకు తీసుకుని ఆమెని ఓదార్చాడు.(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి)హర్ట్ బ్రేక్ చేశావ్ఈ గొడవంతా అయిపోయిన తర్వాత అర్థరాత్రి నిఖిల్-సోనియా డిస్కషన్ పెట్టారు. చేతిలో చేయి వేసి మరీ సోనియాకు నిఖిల్ సారీ చెప్పాడు. దీంతో ఈమె ఎమోషనల్ అయిపోయింది. ఫస్ట్ ఎవరితో మాట్లాడినావ్ అన్నది పాయింట్ కాదురా.. ఏం విన్నాము ఏం అర్థం చేసుకున్నాం అన్నది కదా అని అంది. అలానే ఫేక్ బతుకు బతుకున్నావ్ అని, వాళ్లని యూజ్ చేసుకుంటున్నావ్ అని యష్మి అందని.. అయితే ఇవన్నీ నువ్వు వినను కూడా వినలేదని.. కానీ ఎక్కడో ఆమె చెప్పిన పాయింట్స్ నీకు కరెక్ట్ అనిపిస్తోంది. నీ వరకు నువ్వు కరెక్ట్‌గానే ఉన్నప్పటికీ ఈరోజు నా మనసు విరిచేశావ్ అని నిఖిల్‌తో సోనియా అంది. ఇదంతా చూస్తుంటే వీళ్లిద్దరి దూరం పెరిగినట్లే అనిపిస్తోంది.కొత్త చీఫ్‌గా సీతఇక రాత్రంతా సోనియా-యష్మి గొడవ జరగ్గా.. ఉదయం లేచేసరికి కొత్త చీఫ్ గురించి బిగ్‌బాస్ పోటీ పెట్టాడు. శక్తి క్లాన్‌కి ఇప్పటికే నిఖిల్ ఉండగా.. కాంతార క్లాన్ చీఫ్‌గా ఉన్న అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఎవరికి చీఫ్ అయ్యే అర్హత లేదే వాళ్ల బొమ్మ విరగ్గొట్టాలని, దీనికోసం బజర్ మోగినప్పుడు సుత్తిని పట్టుకుని.. దాన్ని మరో వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. ఈ ప్రొసెస్‌లో చివరగా సీత మిగిలింది. అలా కాంతార క్లాన్‌కి చీఫ్‌గా బాధ్యతలు అందుకుంది. అయితే ఏ క్లాన్లో ఎవరెవరు ఉండబోతున్నారనేది నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో తెలుస్తోంది. ఏదేమైనా మంగళవారం ఎపిసోడ్ దెబ్బకు సోనియా చీప్ బిహేవియర్ బయటపడింది. అలానే యష్మి మంరింత స్ట్రాంగ్ అయిపోయింది.(ఇదీ చదవండి: 'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
వాళ్లిద్దరినీ ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నావ్.. సోనియాపై యష్మి ఫైర్
బిగ్‌బాస్ హోస్లో చీఫ్ పోస్ట్ పోయాక యష్మి ఆటలో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత మంగళవారం (సెప్టెంబర్ 24) ఎపిసోడ్‌కు సంబంధించి ఒక ప్రోమో వచ్చింది. అందులో యష్మి, సోనియాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈవారం నామినేషన్ల తంతు రచ్చరచ్చ అయింది. ఒకరిపై మరోకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకున్నారు. ముఖ్యంగా సోనియా, నబీల్ మధ్య మాటల యుద్ధం భారీగానే జరిగింది. ఈ గొడవలు ఇంతటితో క్లోజ్ అయ్యాయి అనుకుంటే.. మంగళవారం ఎపిసోడ్లో కూడా ఆ రచ్చ కొనసాగినట్లు ఉంది.సోనియాను యష్మి నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. సిస్టర్, మదర్ అంటూ రిలేషన్స్ కలుపుతూ సోనియా గేమ్ ఆడుతుందని యష్మి ఫైర్ అయింది. ఎవరిని ఎలా వాడుకోవాలో నీకు బాగా తెలుసంటూ సోనియాపై మండిపడింది. టాస్క్‌లలో పృథ్వి, నిఖిల్ ఇద్దరూ సోనియాకు హెల్ప్ చేస్తున్నారనేలా యష్మి మాట్లాడింది. దీంతో సోనియా కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తే మంగళవారం ఎపిసోడ్ రసవత్తరంగా ఉండేలా ఉంది. -
ఎవడిని కొడతానో నాకే తెలీదు.. పూనకంతో ఊగిపోయిన సోనియా
చీఫ్ పోస్ట్ పోయాక యష్మిలో చాలామార్పు వచ్చింది. ఆటలోనే కాదు మాటలోనూ రాటు తేలింది. అటు ప్రేరణ.. విష్ణుప్రియతో గొడవకు చెక్ పెడదామనుకుంటే అందుకు విష్ణు దాన్ని సాగదీసే పనిలో పడింది. మణికంఠకు హౌస్‌లో బొమ్మరిల్లు సినిమా కనిపిస్తోందట.. నామినేషన్స్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఆదిత్యపై సోనియా సెటైర్లుఇంట్లో ఉండటానికి అనర్హులనుకున్న వారి ముఖాలకు ఫోమ్ కొట్టి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటగా ఆదిత్య ఓం.. పృథ్వీని నామినేట్ చేశాడు. మైక్ పక్కనపెట్టి గుసగుసలు పెడుతున్నావ్, నీ ఫ్రెండ్ అయిన పృథ్వీ ఆవేశంతో ఉంటే తనను కూల్ చేసేందుకు ప్రయత్నించలేదని సోనియాను నామినేట్ చేశాడు. అందుకామె ఏదో ట్రై చేశావ్ కానీ ఫెయిలయ్యావ్ అని వెటకారంగా మాట్లాడింది.గొంతు పెంచితే తప్పా?నైనిక.. నేను సేఫ్ అయినప్పుడు నీ ముఖంలో సంతోషం కనిపించలేదంటూ నాగమణికంఠను నామినేట్ చేసింది. టాస్క్ సరిగా ఆడటం లేదంటూ ఆదిత్య ముఖంపై ఫోమ్ స్ప్రే చేసింది. నబీల్ వంతురాగా.. నువ్వు గట్టిగా మాట్లాడితే తప్పు లేదు కానీ నేను గట్టిగా రిప్లై ఇస్తే మాత్రం తప్పా? పైగా నీతో మాట్లాడితే నిఖిల్, పృథ్వీ నామీదకు దూసుకురావడమేంటోనని సోనియాను నామినేట్ చేశాడు. అతడు తన పాయింట్లు చెప్తున్నప్పుడు కూడా పృథ్వీ, నిఖిల్ సోనియా బాడీగార్డుల్లా నబీల్‌పై ఎగబడటం గమనార్హం. వెన్నుపోటు..తర్వాత అతడు పృథ్వీని నామినేట్ చేశాడు. అప్పుడు సోనియా మధ్యలో దూరి ఫెయిల్డ్ సంచాలక్ అంటూ పదేపదే అతడిపై ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. ప్రేరణ.. నువ్వు అందరితో బాగానే ఉండి ఎప్పుడు ఎవరికి వెన్నుపోటు పొడుస్తావో తెలియడం లేదంటూ మణికంఠను నామినేట్ చేసింది. నీ గేమ్ కనిపించడం లేదంటూ నైనికను నామినేట్ చేసింది. మనిషిగా కూడా ఫెయిల్ సోనియా వంతురాగా.. సంచాలకుడిగానే కాదు ఒక మనిషిగా కూడా నువ్వు ఫెయిల్ అని నబీల్ను నామినేట్ చేసింది. అవునా, నిన్ను నామినేట్ చేసినందుకు నేను తప్పు, ఫేక్ కదా అని కౌంటరిచ్చాడు. తర్వాత ఆమె ఆదిత్య గురించి మాట్లాడుతూ.. మీ పర్ఫామెన్స్ ఏం లేదు కాబట్టి పెద్దగా పాయింట్లులేవు. ఈ వారం వెళ్తానని మీరు ఫిక్సయ్యారు కాబట్టి ప్లీజ్, వెళ్లిపోండి అని నామినేట్ చేసింది.బొమ్మరిల్లు సిద్దు సీన్ రిపీట్నాగమణికంఠ వంతురాగా.. నీ వల్ల దెబ్బలు తగులుతాయేమోనని భయంగా ఉందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. మీరు బొమ్మరిల్లు సినిమాలో ప్రకాశ్ రాజ్‌లా ఎక్కువ గైడ్ చేసేస్తున్నారు, అది వద్దంటూ ఆదిత్యకు హీరో సిద్దార్థ్లా క్లాసు పీకాడు. విష్ణుప్రియ.. నిన్నొకరు(పృథ్వీ) బూతు తిడితే సైలెంట్‌గా ఉండటం నచ్చలేదని ప్రేరణను నామినేట్ చేసింది. అతడు తిట్టింది నన్నుకాదని నాకు తెలుసు.. నువ్వు కావాలని ఇలా ప్రతీకారం తీర్చుకుటున్నావని అసలు విషయం బయటపెట్టింది. నేను వీక్ కాదు: మణిపృథ్వీ.. నబీల్, నాగమణికంఠను; సీత.. ప్రేరణ, మణికంఠను నామినేట్ చేశారు. యష్మి వంతు రాగా హౌస్‌లో నువ్వు చాలా వీక్ అంటూ మణిని నామినేట్ చేసింది. నేను వీక్ అయితే ఎప్పుడో గేట్లు తీయండని చెప్పి బయటకు వెళ్లిపోయేవాడిని అని వాదించాడు. సోనియాను నామినేట్ చేస్తూ.. నిఖిల్, పృథ్విని ఆయుధంలా వాడుకుంటున్నావ్, ఆ ఇద్దరి సపోర్ట్ లేకుండా గేమ్ ఆడితే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఎవర్ని కొడతానో తెలీదుఅందుకు సోనియా.. నేను అందరికంటే అగ్రెసివ్.. నేను గ్రౌండ్లో దిగాక ఎవడిని కొడతానో నాకే తెలియదు. నా వల్ల ఎవరికీ ఇబ్బంది కావొద్దని ఆలోచించి నేను గుడ్ల దగ్గరే కూర్చున్నాను. నా గేమ్ నేను ఆడాను అని బదులిచ్చింది. ఫైనల్‌గా ఈ వారం పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్, నైనిక నామినేట్ అయ్యారు. అయితే నిఖిల్ చీఫ్ అయినందున అతడికి ఒకర్ని సేవ్ చేసే అవకాశం ఇవ్వడంతో అతడు నైనికను సేవ్ చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇంట్లో నుంచి వెళ్లిపోమన్న సోనియా.. నామినేషన్స్ ఆరుగురు!
నీళ్ల ట్యాంకర్ దగ్గర గొడవపడ్డట్లు ఆ కొట్లాటలేంటి? ఆ మాటలేంటి? అని విష్ణుప్రియ, ప్రేరణ.. ఇద్దరికీ క్లాస్ పీకాడు నాగ్. పోయినవారం గుడ్డు దగ్గర మొదలైన వైరం గుడ్డుతోనే ముగిసిపోవాలని ఐదు ఎగ్స్ ఇచ్చి మరీ ఒకరికొకరు తినిపించుకోమన్నాడు. అప్పుడు సరేనంటూ తలూపిన వీళ్లు నామినేషన్స్ రాగానే మళ్లీ ఒరిజినల్ క్యారెక్టర్లోకి దిగిపోయారు.నబీల్ వర్సెస్ సోనియావిష్ణుప్రియ.. ప్రేరణను నామినేట్ చేయడంతో ఆమె షాకైంది. అయితే ప్రేరణ మాత్రం విష్ణును వదిలేసి నైనిక, మణికంఠలను నామినేట్ చేసింది. ఇక సోనియా.. తన యాటిట్యూడ్ చూపించింది. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని నబీల్‌కు ట్యాగ్ ఇచ్చింది. అటు ఆదిత్య ఓంను నామినేట్ చేస్తూ.. మీరేం పర్ఫామెన్స్ ఇవ్వలేదు కాబట్టి చెప్పడానికి పెద్దగా పాయింట్లు కూడా లేవంది.వెళ్తాననుకున్నారుగా.. వెళ్లిపోండిఎలాగో ఈవారం వెళ్తాననుకున్నారు కదా.. కాబట్టి ఈ హౌస్ నుంచి వెళ్లిపోండి అని ఆదిత్య ముఖం మీదే చెప్పింది. మొత్తానికి ఈ వారం ప్రేరణ, నబీల్, ఆదిత్య, సోనియా, పృథ్వి, మణి ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. నిజానికి నైనిక కూడా నామినేషన్లో ఉండాల్సింది కానీ తనను నిఖిల్ సేవ్ చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'మా కూతుర్ని బద్నాం చేయొద్దు, తనకు పెళ్లి ఫిక్సయింది'
సోనియా ఆకుల.. బిగ్‌బాస్ ప్రారంభమైన మొదట్లో తనలోని ఫైర్ చూసి ఇలాంటి కంటెస్టెంట్ కదా కావాల్సింది అని అంతా అనుకున్నారు. నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడే తన వైఖరికి అందరూ ఫిదా అయ్యారు. కానీ అంతలోనే ఆమె గాడి తప్పింది. నిఖిల్, పృథ్వీల దోస్తాన్‌తో ఎక్కువ నెగెటివిటీ మూటగట్టుకుంటోంది. మితిమీరిన హగ్గుల వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది. ఈ ట్రోలింగ్‌పై సోనియా పేరెంట్స్ మల్లీశ్వరి- చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న పేరు కూడా పోతుందేమోనని..ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మాయి బాగా ఆడుతోంది. అయినా తననే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకలా బద్నాం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయి స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఎంతోమందికి సాయం చేసింది. తను సంపాదించుకున్న పేరుతో సినిమా అవకాశాలు వచ్చాయి. అలా బిగ్‌బాస్ ఆఫర్ అందుకుంది. కానీ ఈ ట్రోలింగ్ చూస్తుంటే.. తను సంపాదించిన మంచి పేరు పోతుందేమోనని బాధగా ఉంది.అందుకే ఆ ఇద్దరితో అంత చనువుఆమె నిఖిల్, పృథ్వీని పెద్దోడు, చిన్నోడు అని పిలిచింది. అంటే ఇద్దరినీ పెద్దన్నయ్య, చిన్నన్నయ్యలా ఫీలైంది. అందుకే వారితో అంత చనువుగా ఉంటోంది. దాన్ని కూడా వక్రీకరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. తను బిగ్‌బాస్ కప్పు గెలుస్తుందన్న నమ్మకముంది. ఆడవారికి ఆడవారే శత్రువు అన్నట్లు హౌస్‌లో ఉన్న మిగతా అమ్మాయిలు కూడా నా కూతురి గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. అలాంటప్పుడు కనీసం నిఖిల్, పృథ్వీ అయినా అన్నలా తోడున్నందుకు సంతోషంగా ఉంది. తన ఆటతో మున్ముందు అందరి నోళ్లు మూయిస్తుంది.సోనియా పెళ్లి ఫిక్స్సోనియాకు లవ్ ఎఫైర్స్ లేవు. ఆల్రెడీ పెళ్లి ఫిక్సయిపోయింది. డిసెంబర్లోనే వివాహం.. తనకు కాబోయే అత్తామామల అంగీకారంతోనే బిగ్‌బాస్ షోకి వెళ్లింది. త్వరలో పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇంత బద్నాం చేయొద్దు. తను ఐదుగురు అనాథ చిన్నారులను చదివిస్తోంది. ఇంకా 50 మంది అనాథలను చదివించాలన్నదే ఆమె ధ్యేయం. వారికోసమే తను తపిస్తోంది. అది అర్థం చేసుకోండి అని వేడుకున్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సోనియాకు బ్రేకప్ చెప్పిన నిఖిల్.. అటు విష్ణుప్రియ..
రెడ్ కార్డ్, సీరియస్ వార్నింగ్‌లతో బిగ్‌బాస్ హౌస్ నిన్న హీటెక్కింది. ఈ వాతావరణాన్ని కూల్ చేసేందుకు నాగ్ సండే రోజు కంటెస్టెంట్లతో ఫన్నీ గేమ్ ఆడించాడు. అటు హౌస్మేట్స్ కూడా సినిమా పాటలకు అద్భుతమైన పర్ఫామెన్స్తో అల్లాడించారు.హార్ట్ బ్రేక్అలాగే సెట్, కట్ గేమ్ ఆడించారు. హౌస్‌లో సెట్ అయ్యేవాళ్లకు హార్ట్, సెట్ అవని వాళ్లకు బ్రేక్ చేసిన హార్ట్ ఇవ్వమన్నాడు. దీంతో నిఖిల్.. పృథ్వీ సెట్ అని.. సోనియా తెలిసో తెలియకో కొన్ని మాటలు అనేస్తుందని, దానివల్ల హార్ట్ బ్రేక్ అవుతుందన్నాడు.సీతతో సెట్..మణికంఠ.. తన ఫ్రెండ్ నిఖిల్‌తో కట్, సోనియాతో సెట్ అని చెప్పాడు. విష్ణుప్రియ తనకు సీతతో సెట్టయిందని చెప్పింది. మంచి ఫ్రెండ్స్‌లా కనిపించే విష్ణుప్రియ, పృథ్వీ ఒకరికొకరు కటీఫ్ చెప్పుకోవడం గమనార్హం. యష్మి సెట్ అయిపోందంటూ ఆమెకు హార్ట్ సింబల్ ఇచ్చాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ గెలవాలంటే ఈ ఐదు తప్పనిసరి!
తెలివితేటలు ఉంటే ప్రపంచాన్ని ఏలవచ్చని అందరూ చెప్తుంటారు. కానీ జీవితంలో గెలవాలంటే తెలివితేటలు (Intelligence Quotient) మాత్రమే ఉంటే సరిపోదని భావోద్వేగ ప్రజ్ఞ/ ఈక్యూ (Emotional Intelligence) అవసరమని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఐక్యూ వ్యక్తి మేధస్సును, విశ్లేషణా సామర్థ్యాలను, సమస్యలను పరిష్కరించే ప్రతిభను కొలుస్తుంది. ఈక్యూ భావోద్వేగాలను గుర్తించడం, నియంత్రించడం, ఇతరులతో సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఐక్యూ ఉంటే విద్య, వృత్తి రంగాల్లో గొప్ప విజయాలు సాధించవచ్చేమో కాని సంతోషంగా జీవిస్తారన్న గ్యారంటీ లేదని టర్మన్ (1921) అధ్యయనంలో తెలిసింది. ఈక్యూ ఉంటే నాయకులుగా ఎదుగుతారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం 2001లో నిర్వహించిన అధ్యయనం తెలిపింది. ఈక్యూ ఉన్న వ్యక్తులు వృత్తిలో నాలుగురెట్లు ఎక్కువ విజయం సాధిస్తారని గోల్మన్ పరిశోధన పేర్కొంది. ఉద్యోగుల విజయంలో ఈక్యూ 30శాతం ప్రభావం చూపగా, ఐక్యూ 20శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని మరొక పరిశోధనలో వెల్లడైంది. అంటే, ఉద్యోగంలోనైనా, జీవితంలోనైనా, బిగ్ బాస్లోనైనా నిలవాలంటే, గెలవాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసినవారు సుఖంగా, సంతోషంగా జీవిస్తారు.ఈక్యూలో ఐదు ప్రధాన అంశాలు ఉంటాయని డేనియల్ గోల్మన్ తన ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ పుస్తకంలో ప్రతిపాదించాడు. 1. స్వీయ అవగాహన: వ్యక్తి తన భావోద్వేగాలను తెలుసుకోవడం.2. స్వీయ నియంత్రణ: కఠిన పరిస్థితుల్లో భావాలను నియంత్రించడం.3. ప్రేరణ: బాహ్య ప్రేరణ కంటే అంతర్గత విలువల ద్వారా ప్రేరేపించడం.4. సహానుభూతి: ఇతరుల భావాలను అర్థం చేసుకొని స్పందించడం.5. సామాజిక నైపుణ్యాలు: సంబంధాలను నిర్వహించడం, నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం.ఈక్యూ ఉన్నవారే బిగ్ బాస్..సరే, ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చేద్దాం. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటి వాతావరణంలో పార్టిసిపెంట్స్ ప్రవర్తన, నిర్ణయాలు, మాటలు వారి భావోద్వేగ ప్రజ్నను ప్రతిబింబిస్తాయి. మూడో వారం జరిగిన సంఘటనల్లో గ్రూప్ డైనామిక్స్, నిర్ణయం తీసుకోవడం, గొడవల పరిష్కారంలో ఈక్యూ ఎలాంటి పాత్ర పోషించిందనే విషయం తెలుసుకుందాం.స్వీయ అవగాహన (Self-Awareness)మన చర్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకోవడమే స్వీయ అవగాహన. ఈ అవగాహన లేకనే విష్ణుప్రియ అనుమతి లేకుండా గుడ్లు తినేసింది. ఆ విషయంలో ప్రేరణతో గొడవకు దారితీసింది. యష్మి, మణికంఠల మధ్య గొడవలకు కూడా ఇదే కారణం. ఒక వ్యక్తి తన ఎమోషన్స్ ను అర్థం చేసుకుని, ఎలా స్పందించాలో తెలుసుకుంటే బిగ్ బాస్ షోలోనైనా, జీవితంలోనైనా గొడవలు తగ్గుతాయి.స్వీయ నియంత్రణ (Self-Regulation)పృథ్వి ప్రతి ఆటలోనూ ఆవేశంగా కనిపించాడు. అతని భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో అతని ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కోసారి అదుపుతప్పి బూతులు కూడా మాట్లాడుతున్నాడు. విష్ణుప్రియ ‘పతివ్రత’ అనే పదాన్ని మళ్లీ వాడేసింది. మరోవైపు మణికంఠ తరచూ ఎమోషన్స్ వాడి ప్రేక్షకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనివల్ల మొదట్లో కొంత సానుభూతి ఏర్పడినా, తరచూ ప్రదర్శించడం చిరాకుకు దారితీస్తుంది. ఇక అభయ్ నేరుగా ‘బిగ్‌బాస్ వరస్ట్’ అంటూ కామెంట్స్ చేయడం అతనికి ఎమోషనల్ రెగ్యులేషన్ లేదనే విషయాన్ని సూచిస్తుంది. అందుకే ఎమోషన్స్ ను నియంత్రించుకోవడం, సరైన స్థాయిలో, సరైన రీతిలో ప్రదర్శించడం అవసరం.సహానుభూతి (Empathy)నిఖిల్ తన ప్రతి నిర్ణయం కోసం సోనియాను సలహా అడగడం సహానుభూతిని సూచిస్తుంది. కానీ, దాన్ని బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల సోనియాపట్ల పక్షపాతం చూపిస్తున్నాడనే అభిప్రాయం ఏర్పడుతోంది. మరోవైపు సోనియా గొడవలకు దూరంగా ఉండి సేఫ్ గేమ్ ఆడుతున్నప్పుడు, ఆమె ఎమోషనల్ బ్యాలెన్స్‌తో ఉన్నట్లు కనిపించినా, ప్రేక్షకులు ఆమెను బలహీనంగా భావించే ప్రమాదం ఉంది. ఇతరులపట్ల సహానుభూతి ఉండాలి, కానీ అది బలహీనతగా మారకూడదు.సామాజిక నైపుణ్యాలు (Social Skills)ప్రేరణ, విష్ణుప్రియల మధ్య వాగ్వాదంలో 'బ్రెయిన్లెస్', 'యూజ్లెస్' వంటి పదాలను ఉపయోగించడం సంఘర్షణలను మరింత పెంచుతుంది. మరోవైపు క్లాన్ లీడర్ కంటెస్టెంట్‌గా తనను పరిగణించనందుకు సీత బాధపడింది. కానీ ఆ విషయం నేరుగా నిఖిల్ కు చెప్పకుండా మరొకరితో చెప్పుకుని బాధపడింది. వ్యక్తి తన ఎమోషన్స్‌ను వ్యక్తీకరించాలి. కానీ వ్యక్తిగత దూషణలు లేకుండా. ఇదో ముఖ్యమైన సోషల్ స్కిల్. ఇది గొడవలు రాకుండా నిరోధిస్తుంది.ప్రేరణ (Motivation)అనేక నామినేషన్లు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ యష్మి తన నాయకత్వ శైలి సరైనదేనని కట్టుబడి ఉంది. ఇది తనలో మోటివేషన్ ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. కానీ తన మోటివేషన్ తో పాటు క్లాన్ ఎమోషనల్ ఫీలింగ్స్ ను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లనే అనేక నామినేషన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. పృథ్వి హై కాంపిటీటివ్ నైజం అతని తపనను చూపిస్తుంది. కానీ నియంత్రణ లేకపోవడం గ్రూప్ లో విభేదాలకు, గొడవలకు కారణమవుతుంది.ఎవరు ఎలిమినేట్ కావచ్చు? ప్రేక్షకులు సాధారణంగా భావోద్వేగ పరిపక్వత కలిగిన ఆటగాళ్లను కోరుకుంటారు. ఎక్కువ ఆవేశంగా ప్రవర్తించే పృథ్వి వంటి ఆటగాళ్లను నెగెటివ్‌గా పరిగణించే అవకాశం ఉంది. అదే విధంగా, మణికంఠ లాంటి ఆటగాళ్లు ఎమోషనల్ డ్రామాను ఉపయోగించడం వల్ల నమ్మకం కోల్పోతారు. ఇతరుల కేరక్టర్ పై తరచూ తప్పుడు కామెంట్స్ చేయడం విష్ణుప్రియకు నెగెటివ్ గా మారవచ్చు.నా పరిశీలన మేరకు నిఖిల్ లో మంచి ఐక్యూ కనిపిస్తోంది. షో చివరి వరకూ ఇలాగే ఉంటుందో లేదో పరిశీలించాలి. కోపం అందరికీ వస్తుంది. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎంత మోతాదులో ప్రదర్శించాలన్నది తెలుసుకున్నవారే సంతోషంగా జీవిస్తారు. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. జీవితంలోనైనా, బిగ్ బాస్ షోలోనైనా ఈక్యూ ఉన్నవారే విజేతగా నిలుస్తారు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.comబిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ అంటే లెక్కలేదా? నిఖిల్ అంత చేసినా సోనియా..!
బిగ్‌బాస్‌ను ధిక్కరిస్తే ఏమవుతుంది? వీకెండ్లో నాగార్జున క్లాస్ పీకుతాడు. కానీ ఈసారి అంతవరకు ఆగలేకపోయాడు బిగ్‌బాస్. తనమీద కామెడీ హద్దులు దాటడంతో కంటెస్టెంట్లందరికీ వార్నింగ్ ఇచ్చాడు. అటు నిఖిల్.. టీమ్‌లో అందరినీ పక్కన పెట్టి సోనియాను చీఫ్‌గా గెలిపించాలనుకున్నాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..చీఫ్ పదవి పాయే..నేను ఆడను, మరొకరిని ఆడనివ్వను.. అన్నట్లుంది చీఫ్ అభయ్ వాలకం. ఇదేం పనికిమాలిన గేమ్, బిగ్‌బాస్ బయాస్డ్.. బయట ఇంటర్వ్యూకు వెళ్లినా కూడా అదే మాట చెప్తా.. అని బిగ్‌బాస్‌నే తిట్టాడు. ఇదేదో తేడా కొడుతుందని భావించిన బిగ్‌బాస్ గుడ్ల టాస్క్‌ను ముగించేశాడు. ఈ గేమ్‌లో కాంతార టీమ్ ఓడిపోవడంతో అభయ్ చీఫ్ పదవి పోయిందన్నాడు.మరోసారి చీఫ్ రేసులో నిఖిల్శక్తి టీమ్ గెలవడంతో ఆ టీమ్ లీడర్ నిఖిల్ మరోసారి చీఫ్ పదవి కోసం పోటీపడవచ్చన్నాడు. అలాగే రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్లు కూడా చీఫ్ పోస్ట్ కోసం పోటీలో ఉంటారని బిగ్‌బాస్ చెప్పాడు. ఆ గుడ్డును ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారనేది నిఖిల్ ఆలోచించి తన నిర్ణయం చెప్పాలన్నాడు. అటు కాంతార టీమ్ చర్చించుకుని తమలో ముగ్గురిని కంటెండర్లుగా ప్రకటించాలన్నాడు. దీంతో హౌస్మేట్స్ ఆశ్చర్యపోయారు. బిగ్‌బాస్‌నే తీసేయాలట!ఓడిపోయిన టీమ్‌లో నుంచి ముగ్గురిని సెలక్ట్ చేయడమేంటని నోరు తెరిచారు. అభయ్ అయితే మరోసారి తన నోటికి పని చెప్పాడు. బిగ్బాస్కేమైనా క్లారిటీ ఉందా? నోటికేదొస్తే అది చెప్తున్నాడు. అసలు బిగ్‌బాస్‌నే మార్చేయాలి అని అసహనం వ్యక్తం చేశాడు. వీళ్ల నోటిదురుసుకు అడ్డుకట్ట వేయాలని భావించిన బిగ్‌బాస్ అర్ధరాత్రి హౌస్‌మేట్స్‌ను గార్డెన్ ఏరియాలో నిలబడెట్టాడు. ఇప్పుడే వెళ్లిపోండిగెలిచిన శక్తి టీమ్‌లో నిఖిల్ చీఫ్ పదవి కోసం ఒకరితో మాత్రమే తలపడాల్సి ఉంటుంది. అది అతడికి లభించిన ప్రయోజనం.. ఓడిన కాంతార టీమ్‌లో ముగ్గురు చీఫ్ పదవి కోసం పోట్లాడాల్సి ఉంటుంది. ఇదే బిగ్‌బాస్ గేమ్ అని క్లారిటీ ఇచ్చాడు. బిగ్‌బాస్ రూల్స్‌కు కట్టుబడి ఉంటేనే ఇక్కడ ఉండండి, కాదు కూడదనుకుంటే వెళ్లిపోండి, బిగ్బాస్కంటే తామే ఎక్కువని ఫీలైతే ఉండాల్సిన అవసరం లేదు అని గేట్లు తెరిచాడు.సారీ చెప్పమన్న సోనియాదీంతో సోనియా.. అభయ్‌ను పిలిచి సారీ అయినా చెప్పు అని సలహా ఇచ్చింది. అతడు అందుకు ఒప్పుకోకపోవడంతో హౌస్మేట్స్ అందరూ కలిసి బిగ్‌బాస్‌కు సారీ చెప్పారు. పైగా తనేం తప్పు చేయలేదని బుకాయించాడు. తన కామెడీని సీరియస్‌గా తీసుకోవద్దని బిగ్‌బాస్‌కే నీతులు చెప్పాడు. ఇదిలా ఉంటే నిఖిల్ సిగరెట్ తాగినందుకు సోనియా హర్ట్ అయింది.. ఎంతోమంది చెప్పినా మానుకోలేదు, ఈమె చెప్తే సడన్‌గా ఎలా మానేస్తానని నిఖిల్ తన బాధను అభయ్‌తో చెప్పుకున్నాడు. నిఖిల్ సుద్దపూసతన వ్యక్తిగత విషయాల్లో దూరడం నచ్చట్లేదన్నాడు. అటు సోనియా.. అభయ్ దగ్గరకు వెళ్లి నిఖిల్ సుద్దపూస అని సెటైర్లు వేసింది. తనతో రెండు రోజులదాకా మాట్లాడాలని లేదని పేర్కొంది. అసలతడికి నిర్ణయాలు తీసుకోవడమే సరిగా లేదంది. అలా అన్న కాసేపటికే మళ్లీ నిఖిల్ దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. సరిగ్గా అదే సమయంలో రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తావని సీత నిఖిల్‌ను అడిగింది. అందుకు యష్మి.. ఆన్సర్ అందరికీ తెలిసిందేగా అనేసింది.ఒక్కరు చేసిన తప్పుకు అందరికీ శిక్షఇక బిగ్‌బాస్.. అభయ్ తనపై అభ్యంతరకర పదజాలం వాడారని మండిపడ్డాడు. రాజు అలా ప్రవర్తిస్తే ప్రజల నుంచి ఇంకా ఏం ఆశించగలం? అతడు చేసిన పనికి టీమ్ సభ్యులందరూ శిక్ష అనుభవించాల్సిందేనంటూ కాంతార టీమ్‌కు చీఫ్ పదవి కోసం కంటెండర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయినట్లు ప్రకటించాడు. అటు అందరూ ఊహించినట్లుగానే నిఖిల్ రెడ్ ఎగ్‌ను సోనియాకు ఇచ్చాడు. మరోసారి చీఫ్‌గా నిఖిల్ఆ ఎగ్ తీసుకోమని సలహా ఇచ్చిన తననే పక్కన పెట్టేయడంతో సీత ఏడ్చేసింది. ఆమెను ఓదార్చడానికి నిఖిల్ రాగా.. వెళ్లిపో, ప్లీజ్ అని బతిమాలింది. ఇక నిఖిల్, సోనియాకు నిదానమే ప్రధానం అని టాస్క్ ఇవ్వగా ఇందులో నిఖిల్ గెలిచి మరోసారి చీఫ్‌గా నిలిచాడు. అయితే అతడిలో మరోసారి చీఫ్ అయ్యానన్న సంతోషం కన్నా సోనియా గెలవలేదన్న బాధే ఎక్కువగా ఉన్నట్లు కనిపించింది.చదవండి: నటుడితో ప్రేమ.. అమ్మకు అస్సలు ఇష్టం లేదన్న హీరోయిన్ -
సుద్దపూస అంటూ సెటైర్లు.. అంతలోనే ప్లేటు తిప్పిన సోనియా
కోడిగుడ్డు టాస్క్‌లో కంటెస్టెంట్లు కొట్టుకున్నంత పని చేశారు. దీంతో ఈ రోజు బిగ్‌బాస్ ఈ గేమ్‌కు స్వస్తి పలకనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నిఖిల్.. సోనియాను తిన్నావా? అని అడిగాడు. అందుకామె ఆకలేసినప్పుడు తింటానని బదులిచ్చింది. తను అలిగిందన్న విషయం అర్థమైన నిఖిల్.. గొడవ తర్వాత పెట్టుకుందాం కానీ ముందు తిను అని గోముగా బతిమాలాడు. అందుకు సోనియా.. నీకంత ఉంటే నువ్వు తినేటప్పుడే అడగాల్సింది అని కొట్టినట్లు సమాధానమిచ్చింది.సుద్దపూసతన మాటలతో హర్ట్ అయిన నిఖిల్.. నేను తనకు ఎలా కనిపిస్తున్నాను? నేను పర్సనల్ లైఫ్‌లో ఎలా ఉన్నాననేది అందరి ముందు జడ్జ్ చేస్తుంటే నాకు కోపం రాదా? అని అభయ్ దగ్గర గోడు చెప్పుకున్నాడు. అటు సోనియా కూడా కాసేపయ్యాక అదే అభయ్ దగ్గరకు వెళ్లి.. అందరూ తిన్నతర్వాత ఈ సుద్దపూస నిల్చుని తింటాడు. వీడు ఇప్పుడొచ్చి తినలేదా? అని అడుగుతున్నాడు అని నిఖిల్‌పై సెటైర్లు వేసింది.గుడ్డు కోసం ప్లేటు తిప్పిన సోనియాఇంతలో బిగ్‌బాస్ ఎర్రగుడ్డు ఎవరి దగ్గరుందని అడిగాడు. ఆ గుడ్డు ఎవరి దగ్గర ఉంటే వారు క్లాన్ చీఫ్ అయ్యే అవకాశాన్ని పొందుతారని చెప్పాడు. ఆ గుడ్డు నిఖిల్ దగ్గరే ఉంది. దాన్ని భద్రంగా దాచమని చెప్పిన సీత.. కుతూహలంగా ఆ ఎగ్ ఎవరికి ఇస్తున్నావని అడిగింది. ఇంతలో సోనియా.. తన గొడవకు ఫుల్స్టాప్ పెడుతూ నిఖిల్‌కు సారీ చెప్పింది. ఇంకేముంది, మంచులా కరిగిపోయిన నిఖిల్.. ఆ గుడ్డును సోనియాకు ఇచ్చేశాడు.సీత కన్నీళ్లుఎర్రగుడ్డుతో ప్రయోజనాలు ఉంటాయని చెప్పిన తనను నిఖిల్ పక్కనపెట్టేయడంతో సీత కన్నీళ్లు పెట్టుకుంది. నిఖిల్ మాట్లాడేందుకు వస్తే కూడా వెళ్లిపో అని అరిచేసింది. ఈ ప్రోమో చూసిన జనాలు నిఖిల్ సోనియా జపం చేస్తున్నాడు. ముందు పోట్లాడిన ఈమె ఎగ్ కోసం వెంటనే వెళ్లి సారీ చెప్పింది. తన గుంటనక్క స్వభావాన్ని నిఖిల్ అర్థం చేసుకోలేకపోతున్నడు అని కామెంట్లు చేస్తున్నారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పెళ్లాంబిడ్డ కావాలంటావ్, అంతలోనే హగ్గుకోసం వెంటపడ్తావ్!
నాకు బంధాలు, బాధ్యతలు నచ్చవు. నన్ను ఒంటరిగానే వదిలేయండి.. అని బిగ్‌బాస్ 8 ప్రారంభంలోనే మొరపెట్టుకున్నాడు నాగమణికంఠ. పెళ్లాం బిడ్డ దూరమయ్యారని, వారిని తిరిగి తనదగ్గరకు తెచ్చుకోవడం కోసమే ఈ షోకు వచ్చానని మొదటిరోజే ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు.సింపతీ వద్దు!నామినేషన్స్‌లోనూ అదే కథ మళ్లీ వినిపించాడు. సింపతీ గేమ్ ఆడుతున్నాడన్న కామెంట్స్ రావడంతో కాస్త పద్ధతి మార్చుకున్నాడు. ఇంటి నుంచి తన తల్లి శాలువా వచ్చినప్పుడు కూడా సింపతీ కోసమైతే తనకు ఇవ్వొద్దు అని నాగమణికంఠ కరాఖండిగా చెప్పాడు. అప్పుడతడిలో మెచ్యురిటీ చూసి జనాలు ముచ్చటపడిపోయారు.అపరిచితుడిలా మణికంఠటాస్కులు వస్తే చాలు పట్టుదల, ఏకాగ్రత చూపించే అతడి అంకితభావాన్ని మెచ్చి ఓట్లు గుద్ది నామినేషన్స్ నుంచి సేవ్ చేశారు. అంతా ఓకే అనుకునేలోపే మణికంఠ అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కోసారి ఏడుస్తూ, మరోసారి అమ్మాయిలతో సరదాలు చేస్తూ, ఇంకోసారి తన ముందు తప్పు చేస్తే సహించకుండా ఉంటూ ఎవరికీ అంతుచిక్కకుండా ప్రవర్తిస్తున్నాడు.హగ్గుల పిచ్చిఈ మధ్యే యష్మి ఇబ్బందిపడుతున్న విషయాన్ని అర్థం చేసుకోకుండా ఆమెను వెనక నుంచి హగ్ చేసుకున్నాడు. ఈ విషయంలో తను చాలా చిరాకుపడింది. మరోసారైతే తనకెవరూ ముద్దు ఇవ్వడం లేదు, ముద్ద(తిండి) పెట్టడం లేదని తనకు తానే ఏవేవో మాట్లాడుకున్నాడు. ఈసారైతే ఏకంగా తను అక్క అని పిలిచే సోనియాను ఒక హగ్ కావాలని అడుక్కున్నాడు. నీకో భార్య ఉంది, తెలుసా?ఎటు చూసినా కెమెరాలున్నాయని నిరాశపడుతూనే తనను హత్తుకున్నాడు. ఇతడి ప్రవర్తన అర్థమైపోయిన నైనిక మణికంఠను ముఖం పట్టుకుని అడిగేసింది. 'నువ్వు ఇక్కడ అందరితో ప్రేమలో ఉన్నావు, కానీ అంత వద్దమ్మా! నీకు భార్య ఉన్నప్పుడు తనతో మాత్రమే ప్రేమలో ఉండాలి. ఇలా అందరికీ ముద్దులు పెట్టడమేంటి? పెళ్లయ్యాక అసలు అవతలివారిని ఫ్లర్టింగే చేయకూడదు' అని క్లాస్ పీకింది.ఏదైనా చేసేయొచ్చా?చాలా తప్పుగా మాట్లాడుతున్నావని మణి అనగా.. నేను నిజం మాట్లాడుతున్నా అని నైనిక కుండ బద్ధలు కొట్టింది. దీంతో అతడు.. ఇక్కడే కదా చిల్ అయ్యేది.. ఇంటికెళ్లాక ఎలా కుదరదుగా అని డ్యాన్స్ చేశాడు. ఈ హగ్గులు, ముద్దుల గోల తగ్గించుకుంటేనే మణి ఇంకొన్నాళ్లయినా బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగలుగుతాడు. లేదంటే జనాలే తనను బయటకు నెట్టేయడం ఖాయం! ఇప్పటికే మణి వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. రానురాను రాజు గుర్రం గాడిద అయిందట.. నీ పేరు నువ్వే చెడగొట్టుకుంటున్నావ్ అని కామెంట్లు చేస్తున్నారు. Meeru friends eppudu aiyaru ante adulterated comedy annadhi Mari veedu hug adigithe tittalsindhi poyi task vundhi anatam enti 😬Girls meedha noru vesukoni padipothadhi mari veedini endhuku analedhu nee pempakam.baledhu ani#BiggBossTelugu8pic.twitter.com/6zorDLx77Y— anushkafan (@Anushkafan07) September 18, 2024Nainika deserves a big round of applause 👏🏻👏🏻👏🏻E #NagaManikanta gadu healthy flirting perutho intlo vese pervert veshalu meedha gatti rod vesindi vadikiAbba Sai Ram #BiggBossTelugu8 #Nainika pic.twitter.com/fCOi5O7BKF— Vamc Krishna (@lyf_a_zindagii) September 19, 2024 చదవండి: బెదిరించకు, మంచిగా అడిగితే చెప్తా.. సోనియాకు నబీల్ కౌంటర్ -
సోనియా దిగజారుడు ప్రవర్తన.. ఛీ కొడుతున్న జనం
ఆడపులి.. అసలు దీనికి అర్థం తెలుసా? అందులోని లక్షణాలేమైనా సోనియాకు ఉన్నాయా? పెద్దగా అరిస్తే చాలు, అందరూ తోకముడుచుకుని తనకు భయపడుతారనుకుంటుందేమో మరి! బహుశా జనాలెలాగో తనను ఆడపులిగా గుర్తించరని తనకు తానే ఈ ట్యాగ్ వేసుకుందేమో!విష్ణుప్రియను ఆడుకున్నావ్, మరి ఇదేంటో?పోనీ ఆ తోక తగిలించుకున్నందుకైనా ఆ పేరుకు న్యాయం చేస్తుందా? అంటే అదీ లేదు! పైగా రోజురోజుకీ తన ప్రవర్తనతో అందరితో ఛీ కొట్టించుకుంటోంది. మీకు గుర్తుందిగా.. నిఖిల్‌తో స్నేహం ఎలా బలపడింది? అని విష్ణుప్రియ అడిగినందుకు ఆమెను రాచిరంపాన పెట్టింది. నీకు కుటుంబం లేదేమో కానీ నాకు ఉంది, వాళ్లు ఇలాంటి ప్రశ్నలు వింటే ఏమనుకుంటారు? ఎంత బాధపడతారు? అని నానా రాద్దాంతం చేసింది.ఆ ముగ్గురికీ హగ్గుల దాతకట్ చేస్తే ఒక్క నిఖిల్ ఏం కర్మ? పృథ్వీ, అభయ్‌లకు సైతం నిత్య హగ్గులు పంచుతోంది. స్నేహం అన్న పదానికే అర్థాలు మార్చేస్తోంది. వాళ్లతో కూర్చున్నప్పుడు తన చేతులు ఆమె ఆధీనంలోనే ఉండట్లేదు. గడ్డం నిమరడమో, కాళ్లపై చేయి వేయడమో, చేతులో చేయేసి పట్టుకోవడమో.. ఇదే తంతు.. బిగ్‌బాస్ లైవ్ చూసేవారికైతే ఈమె ప్రవర్తన చూసి తల బొప్పి కడుతోంది.హౌస్‌లో చెండాలం పనిఇవన్నీ చాలదన్నట్లు ఈసారి ఇంకాస్త రెచ్చిపోయింది. నిఖిల్‌ను అసభ్యంగా తాకింది. అందుకు అతడు కూడా ఏమీ అభ్యంతరం తెలపకుండా వెంటనే హగ్ చేసుకోవడం గమనార్హం. ఈ విషయంపై సోషల్ మీడియాలో సోనియాను నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.ఎలిమినేట్ చేయండి మహాప్రభో'ఆమె స్థానంలో ఒక అబ్బాయి ఉంటే మాత్రం రెడ్ కార్డ్ ఇచ్చి వెంటనే హౌస్ నుంచి పంపించేసేవారు. అదే ఈ సోనియాకు కనీసం గడ్డి పెట్టేవాళ్లు కూడా లేరు', 'హౌస్‌లో ఇలాంటి పిచ్చి చేష్టలకు చెక్ పెట్టకపోతే బిగ్‌బాస్ షో ఫ్యామిలీతో కలిసి చూడటం కష్టమే', 'తనను ఎలిమినేట్ చేయండ్రా బాబూ' అని నెటిజన్లు బిగ్‌బాస్‌కు మొర పెట్టుకుంటున్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈ గొడవలన్నింటికీ ఆవిడే కారణం.. చీఫ్ పదవి పాయే!
బిగ్‌బాస్ హౌస్‌లో గుడ్ల పంచాయితీ నడుస్తోంది. ప్రభావతి అలియాస్ కోడి సమయానుసారం పెట్టే గుడ్లను రెండు టీమ్స్ సంపాదించి దాచుకోవాలి. అవతలివారు దోచుకోకుండా కాపలా కాయాలి. సంపాదించడం కన్నా కొట్టేయడం తేలిక అని భావించిన హౌస్మేట్స్ దొంగతనం మీదే ఎక్కువ దృష్టి సారించారు.సంచాలకుడిగా నబీల్ఇప్పటికే శక్తి టీమ్ లీడ్‌లో ఉండగా ఈ గేమ్‌లో అవుట్ అయిన నబీల్ సంచాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సోనియా ఏదో పాయింట్లు చెప్తుండగా.. నబీల్ కలగజేసుకుంటూ నువ్వు నన్ను బెదిరించకు, మంచిగా అడుగు చెప్తా అని కౌంటరిచ్చాడు. మీరు మా దగ్గరకు రాకండి, మేము మీ గుడ్లకు రాము అని రెండు టీములు ప్రశాంతంగా ఆడుదామనుకుంటే అందుకు సోనియా ఒప్పుకోలేదట. చీఫ్ పది పాయే..ఈ గొడవలన్నీ తన వల్లేనని కాంతార టీమ్ అభిప్రాయపడింది. మొత్తానికి లైవ్‌లో ఈ టాస్క్ అయిపోగా ఈ గేమ్‌లో శక్తి టీమ్ విజేతగా నిలిచింది. ఇంకో షాకింగ్ విషయమేంటంటే.. అభయ్‌ను చీఫ్‌గా తొలగించారట.. దీంతో అతడి లీడర్ పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే నిలిచింది.బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: టాస్క్‌ల్లో ముద్దుల గోల.. తప్పు చేసిన మణికంఠ?
బిగ్ బాస్ షోలో మెల్లమెల్లగా గీత దాటేస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్‌లో గేమ్స్ కంటే పులిహోర కబుర్లే ఎక్కువవుతున్నాయి. మంగళవారం ఎపిసోడ్‌లోనూ రేషన్ కోసం బిగ్‌బాస్ మూడు గేమ్స్ పెట్టాడు. వీటిలో ఎవరు గెలిచారు అనే దానికంటే పృథ్వీ-యష్మి, సీత-నిఖిల్ మధ్య నడిచిన ఫర్టింగ్ రచ్చ ఆసక్తికరంగా మారిపోయింది. అసలు ఇంతకీ 16వ రోజు (మంగళవారం) బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందనేది చూద్దాం.తట్టుకోలేకపోయిన యష్మియష్మిని నామినేట్ చేసిన మణికంఠ.. నామినేషన్స్ అయిన తర్వాత ఈమె దగ్గరకు వచ్చి ఐస్ చేయాలని గట్టగానే ప్రయత్నించాడు. నచ్చజెప్పడానికి చాలా ట్రై చేశాడు. కానీ యష్మి ఎంతకీ వినకపోయేసరికి వెనక నుంచి యష్మిని హగ్ చేసుకున్నాడు. దీనికి ఆమె చిరాకుపడి వదిలెయ్ అని గట్టిగా చెప్పింది. ఇలా మణికంఠ వింత ప్రవర్తనని తట్టుకోలేకపోతున్నానని యష్మి ఏడుస్తూ బిగ్‌బాస్‌కి చెప్పింది.(ఇదీ చదవండి: Bigg Boss 8: ప్రేరణ ఇంట్లో విషాదం)రేషన్ కోసం మూడు టాస్క్లుఈ వారం రేషన్ దక్కించుకోవడం కోసం రెండు కాన్స్ (గ్రూప్స్)కి మూడు పోటీలు పెట్టాడు. తొలుత 'ఫొటో పెట్టు ఆగేటట్టు' గేమ్‌లో శక్తి టీమ్ నుంచి పృథ్వీ, కాంతార టీమ్ నుంచి నబీల్ వచ్చారు. సీత సంచాలక్. టీమ్ లీడర్స్ ఫొటోలని స్టాండ్‌లో పెట్టే ఈ పోటీలో చివరకు నబీల్ విజేతగా నిలిచాడు. 'నత్తలా సాగకు ఒక్కటీ వదలకు' అని పెట్టిన రెండో పోటీలో పాకుతూ క్యాబేజీలని మరో చోటకు చేర్చాలనే గేమ్ పెట్టారు. ఇందులో నిఖిల్ శక్తి టీమ్ గెలిచింది.తొక్కలో సంచాలక్అయితే రెండో గేమ్‌లో క్యాబేజీ రెడీ చేసి పెట్టడంలో సంచాలక్ ఫెయిల్ అయ్యాడని ఒకే జట్టుకి చెందిన ప్రేరణ.. మణికంఠపై అగ్గిపై గుగ్గిలం అయింది. ఎన్ని క్యాబేజీలు ఉన్నాయో అక్కడి వరకే గేమ్ అని మణికంఠ చెప్పగా.. నువ్వెవరు చెప్పడానికి, తొక్కలో సంచాలక్ అని మణికంఠని రఫ్ఫాడించేసింది. సంచాలక్‌గా తప్పు చేశాడన్నట్లు తొలుత మాట్లాడిన ప్రేరణ.. తర్వాత వెళ్లి అతడికి సారీ చెప్పింది.బెలూన్ వల్ల గొడవ'బూరని కొట్టు రేషన్ పట్టు' అని మూడో గేమ్ పెట్టగా టీమ్ లీడర్స్ నిఖిల్, అభయ్ పోటీ పడ్డారు. ఇందులో భాగంగా ఒకరి ఒంటిపై అంటించిన బూరల్ని మరొకరు స్టిక్‌తో పగలగొట్టాల్సి ఉంటుంది. చివరకు ఎవరి బెలూన్స్ తక్కువ ఉంటే వాళ్లు గెలిచినట్లు అన్నది రూల్. అయితే ఈ పోటీలో బాక్స్ నుంచి అభయ్ పదే పదే బయటకొచ్చాడని హెచ్చరించిన సంచాలక్ సోనియా.. చివరకు బజర్ మోగేసరికి నిఖిల్‌ని విజేతగా ప్రకటించింది. చివరగా అభయ్ ఒంటిపై ఒక బూర ఉంది. నిఖిల్ ఒంటిపై ఏం లేవు. కింద మాత్రం నిఖిల్ బూరలు తక్కువగా ఉన్నాయి. అయితే ఓవరాల్‌గా లెక్కేసుకుంటే నిఖిల్ విజేత అని సోనియా ప్రకటించింది. దీంతో శక్తి టీమ్ రేషన్ టాస్క్‌లో విజేతగా నిలిచింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. తెర వెనక ఇంత జరిగిందా?)యష్మి vs సోనియాకొన్నాళ్లుగా యష్మి, సోనియాకు పడట్లేదు. చివరగా పెట్టిన గేమ్‌లో సంచాలక్ సోనియా స్వార్థంగా వ్యవహరించిందని, చీటర్ అని నిరూపించుకుందని, ఇష్టమొచ్చినట్లు రూల్స్ మార్చేసిందని యష్మి గట్టిగట్టిగా అరుస్తూ రెచ్చిపోయింది. నీకు కావాల్సినట్టుగా రూల్స్ మార్చేసుకొని విన్నర్‌ను డిక్లేర్ చేశావ్ అని ఫైర్ అయింది. ఏదేమైనా నిఖిల్ టీమ్ గెలిచింది కాబట్టి వాళ్లకు ఏమేం రేషన్ ఇస్తారో చూడాలి.పులిహోర కబుర్లుగేమ్ గురించి పక్కనబెడితే మంగళవారం ఎపిసోడ్లో పులిహోర కబుర్లు ఎక్కువయ్యాయి. యష్మితో ఫ్లర్ట్ చేస్తున్నావా అని నిఖిల్‌తో అంది. యష్మిని పిలిచి మరీ క్లారిటీ తీసుకుంది. అలాంటిదేం లేదని యష్మి చెప్పేసరికి తనకు లైన్ క్లియర్ అయిపోయిందని సీత తెగ ఆనందపడిపోయింది. తనతో ఫ్లర్ట్ చేసుకున్నా పర్లేదు అని తెగ హింట్స్ ఇచ్చింది. మరోవైపు పృథ్వీ-సోనియా మధ్య కూడా సమ్‌థింగ్ సమ్‌థింగ్. ఎందుకంటే యష్మి అంటే ఇష్టమా? అని పృథ్వీని సోనియా అడిగింది. అలాంటిదేం లేదే అని పృథ్వీ చెప్పినప్పటికీ నవ్వేసింది.ఇక రెండో గేమ్‌లో గెలిచిన తర్వాత సోనియా బుగ్గపై పృథ్వీ ముద్దుపెట్టేశాడు. అంతకు ముందు కిచెన్‌లోనూ సీత.. పృథ్వీని హగ్ చేసుకుంది. అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీల కోసం హౌస్మేట్స్ గట్టిగానే కష్టపడుతున్నారు. పులిహోర కబుర్లు చెప్పి మరీ కంటెంట్ ఇస్తున్నారు. మరి ఈ యవ్వారాలన్నీ ఏ తీరానికి చేరుతాయో చూడాలి?(ఇదీ చదవండి: Bigg Boss 8: రూల్స్ పాటించరు.. పైగా అరుస్తూ దబాయింపు) -
సోనియాని ఏకిపారేసిన యష్మి.. నామినేషన్లో ఎవరున్నారంటే?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. అప్పుడే అందులో ఇద్దర్ని బయటకు పంపించేశారు. ఒకరేమో చిచ్చుబుడ్డిలా ఫైర్ అయ్యే బేబక్క అయితే మరొకరు నవ్వులు పంచే ఎంటర్టైనర్ బాషా. ఈ ఇద్దరూ వెళ్లిపోవడంతో హౌస్‌లో 12 మంది మిగిలారు.త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుఆటలో తప్ప మాటలో మాత్రమే పౌరుషం చూపించే కంటెస్టెంట్లు హౌస్‌లో చాలామందే ఉన్నారు. ఇలాగైతే షోను నెట్టుకురావడం కష్టమేనని భావించిన బిగ్‌బాస్ టీమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ప్లాన్ చేస్తోంది. మరోవైపు హౌస్‌లో యథాతథంగా నామినేషన్స్ జరిగాయి. ఇందుకు సంబంధించిన రెండో ప్రోమో తాజాగా విడుదలైంది.గాలి తీసేసిన నైనికఇందులో పృథ్వీ, సోనియా.. నైనికపై చెత్త వేసి నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నైనిక.. నాకు మీరిప్పుడు కాంపిటీషనే అనిపించట్లేదని సోనియా గాలి తీసేసింది. అటు యష్మి కూడా.. నిఖిల్, అభయ్, పథ్వీ మీద చూపించిన ఇంట్రస్ట్ క్లాన్లో చూపించలేదు అని సోనియాను ఏకిపారేసింది.ఫుల్ టార్గెట్ నువ్వేతనకైతే మణికంఠ డేంజర్‌గా అనిపిస్తున్నాడని, హౌస్‌లో ఉన్నన్ని రోజులు అతడినే నామినేట్ చేస్తానంది యష్మి. విష్ణుప్రియ, ప్రేరణ మధ్య కూడా బాగానే ఫైట్ నడిచినట్లుంది. ఒకరిపై మరొకరు చెత్త గుమ్మరించి నామినేట్ చేసుకుంటూ బ్రెయిన్లెస్ పీపుల్, యూజ్లెస్ పీపుల్ అని తిట్టుకున్నారు.నామినేషన్లో ఎవరున్నారంటే?చివర్లో నబీల్.. అరుస్తే గెలుస్తామంటే నేను అందరికంటే ఎక్కువ అరవగలను అని ప్రేరణకు కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి ఈ వారం యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, సీత, పృథ్వీ, నైనిక, నాగమణికంఠతో పాటు చీఫ్ అభయ్ నామినేషన్లో ఉన్నారు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బాషాకు మూకుమ్మడిగా అన్యాయం.. బ్రేకప్ స్టోరీ చెప్పిన సీత
బయట జనాలు చూస్తున్నారు, చూస్తున్నారు అంటూ విష్ణుప్రియ విషయంలో జాగ్రత్తగా ఉండమని నాగార్జున సోనియాకు బాగానే హింట్లు ఇచ్చాడు. ఆటలో చివర్లో ఉంటుందేమో కానీ ఇలాంటివి క్యాచ్ చేయడంలో ముందుండే సోనియా నేడు మొత్తం విష్ణుప్రియ పక్కనే కూర్చుంది. అంటే అప్పుడే స్నేహం మొదలెట్టేసిందన్నమాట! అటు శేఖర్ బాషాను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 15) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నిఖిల్‌కు నా గైడెన్స్ అవసరం: సోనియాసోనియా పాటతో ఫండే ఎపిసోడ్ మొదలైంది. తర్వాత హౌస్‌ను రెండు టీములుగా విడగొట్టే పనికి పూనుకున్నాడు నాగ్. నిఖిల్, అభయ్ టీమ్స్‌లోకి ఎవరు వెళ్లాలనుకుంటున్నారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను అడిగాడు. అలా సీత, మణికంఠ, విష్ణుప్రియ, పృథ్వీ, సోనియా.. నిఖిల్ టీమ్‌ను ఎంచుకున్నారు. ఈ క్రమంలో సోనియా.. నా అవసరం, నా గైడెన్స్ నిఖిల్‌కు ఎక్కువ అవసరం అంటూ తన గురించి గొప్పగా చెప్పుకుంది. హౌస్‌లోనే టాప్ పర్ఫామర్ అయిన నిఖిల్‌కు ఇంతవరకు ఏ గేమ్‌లోనూ గెలవని సోనియా.. గైడెన్స్ ఇస్తాననడం కాస్త విడ్డూరంగా అనిపించకమానదు. విష్ణుప్రియతో గొడవలకు ఫుల్స్టాప్!అభయ్ టీమ్‌లో యష్మి, ప్రేరణ, ఆదిత్య, నబీల్, మణికంఠ ఉన్నారు. అభయ్ టీమ్‌కు కాంతార, నిఖిల్ టీమ్‌కు శక్తి అన్న పేర్లు ఫిక్స్ చేశారు. అనంతరం విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించడంతో సోనియా వెళ్లి ఆమెను హగ్ చేసుకుంది. నాగ్ ఇచ్చిన హింట్లను బాగానే తలకు ఎక్కించుకుందని చూసేవారికి ఇట్లే అర్థమైపోయింది. తర్వాత శక్తి, కాంతారల టీమ్స్‌తో సరదా గేమ్ ఆడించారు. ఇందులో రెండు టీమ్స్‌కు టై అయింది. దీంతో ఎవరైనా తన బ్రేకప్ స్టోరీ చెప్తే వారికి ఎక్స్ట్రా పాయింట్ ఇస్తానన్నాడు నాగ్. అలా అన్నాడో లేదో సీత టక్కున లేచి తన విషాద లవ్ స్టోరీని మొదలుపెట్టింది. ఆరు నెలల్లో 14 కిలోలు తగ్గానా ఐదేళ్ల ప్రేమ గతేడాది ఏప్రిల్‌తో ముక్కలైంది. మా ఇంట్లో చెప్పి పెళ్లికి సైతం ఒప్పించాక ఆ అబ్బాయి వదిలేశాడు. ఆరు నెలలపాటు తనను ఒప్పించేందుకు ఎంతో ప్రయత్నించాను. ఈ క్రమంలో అతడు నన్ను ఏడాది నుంచి మోసం చేస్తున్నాడని తెలుసుకున్నాను. ఆ బ్రేకప్ బాధ వల్ల 14 కిలోల బరువు తగ్గాను. బాధ నుంచి బయటపడేందుకు సైక్రియాట్రిస్ట్‌ను కలిశాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే బ్రేకప్ అవడమే మంచిదైందనిపిస్తోందని సీత పేర్కొంది. సీత పాయింట్ గెలవడంతో తన శక్తి టీమ్ విజేతగా నిలిచింది.హౌస్మేట్స్ చేతిలో ఎలిమినేషన్మీకు గిఫ్ట్ హ్యాంపర్ కావాలా? ప్రైజ్‌మనీలో మరో రూ.15 వేలు యాడ్ చేయాలా? అని నాగ్ రెండు ఆఫర్స్ ముందు పెట్టాడు. టీమ్ ముక్తకంఠంతో ప్రైజ్‌మనీ పెరగడమే ముఖ్యమని తేల్చి చెప్పింది. దీంతో ప్రైజ్‌మనీ రూ.5,60,000కు చేరింది. తర్వాత సీత సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. అనంతరం నాగార్జున పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్లో మిగిలిన బాషా, ఆదిత్యలలో ఎవరు సేవ్ అవ్వాలి? ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. సీత తప్ప ప్రతి ఒక్కరూ బాషా గేమ్‌పై ఫోకస్ చేయలేకపోతున్నాడని, తను వెళ్లిపోవడమే మంచిదని నిర్ణయించారు. సీత మాత్రమే బాషాకు సపోర్ట్ఆదిత్యకు పూలమాల వేసి ఇంట్లో ఉండాలని కోరుకున్నారు. శేఖర్ లేకుండా ఇంటిని ఊహించలేకపోతున్నా అని సీత మాత్రమే అతడికి సపోర్ట్ చేసింది. ఫైనల్‌గా శేఖర్ ఎలిమినేట్ అని చెప్పడంతో విష్ణుప్రియ, సీత, నైనిక ఏడ్చేశారు. వాళ్లను ఓదార్చిన బాషా.. వెళ్లేముందు కూడా అందర్నీ నవ్వించి పోయాడు. నేను జోక్ చేస్తే మీరు వినేస్తారో లేదో కానీ మీరు అందరి హార్టులు విన్ చేస్తారు అని తెలిపాడు.ఎవరు ఫేక్? ఎవరు రియల్?స్టేజీపైకి వచ్చిన బాషాతో.. ఎవరు ఫేక్, ఎవరు రియల్ అన్నది చెప్పమని గేమ్ ఆడించాడు. అలా బాషా ముందుగా.. సీత.. మనసులో ఏదనిపిస్తే అదే మాట్లాడుతుంది, విష్ణుప్రియ.. చాలా అమాయకురాలు, ప్రేరణ.. జెన్యూన్, తను కూడా మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది అంటూ ముగ్గురి ఫోటోలను రియల్ పర్సన్ లిస్టులో చేర్చాడు. సోనియాకు రెండు ముఖాలుఫేక్ మనుషుల గురించి ప్రస్తావిస్తూ సోనియా.. నవ్వు చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ నామినేషన్లో మాత్రం కాళి అవతారం చూశాను. తనకు రెండు ముఖాలున్నాయి. మణికంఠ కావాలనే ఫేక్ ఫేస్ పెట్టుకుంటాడు. బహుశా అది అతడి స్ట్రాటజీయేమో! ఆదిత్య.. తను నన్ను నామినేట్ చేసినప్పుడు స్పోర్టివ్‌గా తీసుకున్నాను. కానీ నేను నామినేట్ చేస్తే దాన్నతడు స్పోర్టివ్‌గా తీసుకోలేదు అని ఈ ముగ్గురినీ ఫేక్ లిస్టులో చేర్చాడు. మొత్తానికి ఒక మంచి వ్యక్తిని బిగ్‌బాస్ హౌస్ కోల్పోయింది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి, నైనికలకు షాకిచ్చిన నాగ్.. సోనియా ఇక మాట్లాడకు!
వీకెండ్లో క్లాసులు పీకే ఆనవాయితీని నాగ్ మళ్లీ మొదలుపెట్టాడు. లేకపోతే కంటెస్టెంట్లు దారితప్పడం ఖాయం. అందుకే నాగ్ కొందరికి చీవాట్లు పెట్టాడు, వార్నింగ్‌లు ఇచ్చాడు. టీమ్ లీడర్‌గా విర్రవీగిన యష్మి ఫెయిల్ అని ప్రకటించాడు. అసలు ఉన్న మూడు టీముల్లో రెండింటినీ పీకేశాడు. ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పృథ్వీకి వార్నింగ్నాగార్జున వచ్చీరాగానే టీమ్ లీడర్స్‌తో గేమ్ ఆడించాడు. మీ టీమ్‌లో బాగా ఆడిన వారి ఫోటోలను గ్రీన్ బాక్స్‌లో, సరిగా ఆడనివారి ఫోటోలను రెడ్ బాక్స్‌లో పెట్టాలన్నాడు. ముందుగా అఖండ టీమ్ చీఫ్ యష్మి.. అభయ్, పృథ్వీ బాగా ఆడారంది. ఈ సందర్భంగా నాగ్.. ఆటలో వాడకూడని పదాలు వాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని పృథ్వీకి వార్నింగ్ ఇచ్చాడు.సంచాలక్‌గా ఫెయిల్ప్రేరణ సంచాలకురాలుగా కన్ఫ్యూజ్ అయిందంటూ తన ఫోటోను రెడ్ బాక్స్‌లో పెట్టింది యష్మి. ఈ సందర్భంగా నాగ్.. సంచాలకురాలిగా నువ్వు కూడా ఫెయిలే అంటూ ఓ వీడియో చూపించాడు. అందులో రేషన్ టాస్క్‌లో పావుకిలోకు దగ్గరగా మరమరాలు తీసుకొచ్చినవారిని విజేతగా ప్రకటిస్తానంది. తీరా సీతకు బదులుగా మణికంఠ పావుకిలోకు దగ్గరగా తెచ్చినప్పుడు కరెక్ట్‌గా 250 గ్రాములు తేలేదు కాబట్టి ఎవరినీ విన్నర్‌గా ప్రకటించనంది. కావాలనే అలా చేశాను: యష్మిఈ వీడియో చూపించేసరికి యష్మి ఏడ్చేసింది. తను కావాలనే అలా చేసినట్లు నిజం ఒప్పుకుంది. అంతులేని వీరులు టీమ్ ఓడిపోతే ఐదుగురు ఆకలితో అలమటిస్తారని.. వారు గెలవాలన్న ఉద్దేశ్యంతోనే ఆ పని చేశానని అంగీకరించింది. తర్వాత సోనియా ఫోటోను సైతం రెడ్ బాక్స్‌లో పెట్టింది. అప్పుడు నాగ్ మాట్లాడుతూ.. సోఫాలో కూర్చుంటే అయిపోదు, గేమ్స్ ఆడాలని ఆమెకు హితవు పలికాడు. అలాగే నామినేషన్స్‌లో విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదని మాట్లాడిన వీడియో ప్లే చేసి క్లాసు పీకాడు.బెస్ట్ పర్ఫామర్ అతడేఅప్పటికీ సోనియా.. ఆ మాటలు అనుకోకుండా వచ్చాయే తప్ప కావాలని అనలేదని కవర్ చేసింది. దీంతో నాగ్ కోప్పడుతూ.. ఇంకేం మాట్లాడకు.. విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడావు, ప్రతీది జనాలు చూస్తున్నారు, నీ మంచి కోసమే చెప్తున్నా.. జాగ్రత్తగా ఉండు, నోరు అదుపులో పెట్టుకో అని హింటిస్తూనే, సుతిమెత్తగా హెచ్చరించాడు. యష్మి చివరగా శేఖర్ బాషా ఫోటోను రెడ్ బాక్స్‌లో పెట్టింది. అప్పుడు నాగ్.. బాషా తండ్రయ్యాడంటూ గుడ్‌న్యూస్ చెప్పాడు. అనంతరం యష్మి.. అవతలి టీమ్స్‌లో నబీల్‌కు బెస్ట్ పర్ఫామర్ అంటూ అతడికి గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చింది.అసలైన ఆడపులిఅనంతరం అంతులేని వీరులు టీమ్ చీఫ్ నైనిక వంతు రాగా.. నబీల్, విష్ణుప్రియ, సీతల ఫోటోలను గ్రీన్ బాక్స్‌లో పెట్టి ఆదిత్యను రెడ్ బాక్స్‌లో పడేసింది. సీత అద్భుతంగా ఆడిందని, తనే నాకు అసలైన ఆడపులి అని, మేము తింటున్న ఫుడ్ తనవల్లే గెలుచుకున్నామని పొగిడింది. ఈ సందర్భంగా నాగ్ సీత కోసం ఇంటి నుంచి వచ్చిన బహుమతిని ఇచ్చాడు. తర్వాత.. ఇతర టీమ్స్‌లో నుంచి నాగమణికంఠ బెస్ట్ పర్ఫామర్ అంటూ అతడికి నైనిక గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చింది.ఇద్దరికి బుల్లెట్లు దింపిన నాగ్మూడో టీమ్‌లో ఉన్నది ఇద్దరే ఇద్దరు. వీరి గురించి వీళ్లు చెప్పుకోనవసరమే లేదు. ఇద్దరూ అద్భుతంగా ఆడి ప్రైజ్‌మనీని పెంచడం గొప్ప విషయమని స్వయంగా నాగార్జునే మెచ్చుకున్నాడు. అటు నిఖిల్ కూడా మణికంఠ బాగా ఆడుతున్నాడని తన ఫోటోను గ్రీన్ బోర్డులో పెట్టాడు. బెస్ట్ పర్ఫామర్ అంటూ సీతకు గ్రీన్ బ్యాడ్జ్ తొడిగాడు. తర్వాత నాగ్.. చీఫ్‌గా నైనిక, యష్మి ఫెయిలయ్యారంటూ వారి ఫోటోలకు బుల్లెట్లు దింపాడు. అంతేకాకుండా ఆ క్లాన్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.చీఫ్‌ను మీరే ఎంచుకోండిఇప్పుడు చీఫ్‌ను ఎంచుకోవాల్సిన బాధ్యతను కంటెస్టెంట్లపైనే వేశాడు. ఎవరిని చీఫ్‌గా సెలక్ట్ చేయాలనుకుంటున్నారు? ఎవరిని వద్దనుకుంటున్నారో చెప్పాలన్నాడు. ఈ క్రమంలో మణికంఠ.. విష్ణుప్రియను సెలక్ట్ చేసుకోగా అభయ్‌ను వద్దనుకున్నాడు. నబీల్.. మణికి సపోర్ట్ చేస్తూ ప్రేరణ చీఫ్‌గా వద్దనుకున్నాడు. విష్ణుప్రియ వంతురాగా.. మణికంఠకు సపోర్ట్ చేయగా ఆదిత్య చీఫ్‌గా వద్దని పేర్కొంది. ఆదిత్య వంతురాగా.. సీత చీఫ్ కావాలని, పృథ్వీ మాత్రం లీడర్‌గా వద్దన్నాడు.కొత్త చీఫ్ ఎవరంటే?సోనియా.. అభయ్ చీఫ్ అవాలని, శేఖర్ బాషా చీఫ్‌గా వద్దని పేర్కొంది. సీత వంతురాగా అభయ్ చీఫ్ అవాలని, ప్రేరణ లీడర్‌గా వద్దంది. ప్రేరణ, పృథ్వీ.. అభయ్కు సపోర్ట్ చేయగా ఆదిత్యకు లీడర్ అయ్యే అర్హత లేదన్నారు. అభయ్ వంతురాగా సోనియా లీడర్ కావాలని, మణికంఠకు చీఫ్ కావొద్దన్నాడు. బాషా.. అభయ్కు మద్దతివ్వగా సోనియాకు లీడర్ అయ్యే అర్హత లేదన్నాడు. మెజారిటీ జనాలు అభయ్కు సపోర్ట్ చేయడంతో అతడు లీడర్‌గా నిలిచాడు. దీంతో హౌస్‌లో ఇప్పుడు రెండు క్లాన్సే మాత్రమే ఉన్నాయి. ఏ క్లాన్లో ఎవరు ఉంటారేంటనేది నాగ్ తర్వాత నిర్ణయిస్తానన్నాడు. చివర్లో నైనిక, నిఖిల్ సేవ్ అయినట్లు ప్రకటించాడు. చదవండి: విజయ్ చివరి సినిమా ఫిక్స్ -
బాషా, నీకో గుడ్‌న్యూస్.. సోనియా నోరు అదుపులో పెట్టుకో!
శేఖర్ బాషాకు బిగ్‌బాస్ ఒక గుడ్‌న్యూస్ చెప్పాడు. ఒక బ్యాడ్‌న్యూస్ రేపు సడన్‌గా రివీల్ చేయనున్నాడు.. తనకు బాబు పుట్టాడన్నది శుభవార్త అయితే... ఈ వారం తనే ఎలిమినేట్ కానున్నాడనేది బ్యాడ్‌న్యూస్. నిండు గర్భవతిని వదిలి బిగ్‌బాస్‌కు వచ్చిన బాషా.. తాను తండ్రినయ్యానన్న విషయం తెలిసి ఎమోషనలయ్యాడు.మరోవైపు సోనియా.. విష్ణుపప్రియ విషయంలో నోరు జారిన విషయాన్ని ప్రస్తావించాడు. నీకంటూ పట్టించుకునేవాళ్లు ఎవరూ లేరేమో.. నాకు ఫ్యామిలీ ఉంది. మమ్మల్ని పట్టించుకునేవాళ్లున్నారు అని విష్ణుప్రియ బాధపడేలా మాట్లాడింది. ఈ వీడియో ప్లే చేసిన నాగ్.. అలా మాట్లాడటం కరెక్టేనా? మాట అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం అని సోనియాను హెచ్చరించాడు. చదవండి: ఆ ముగ్గురిలో అతడే ఎలిమినేట్! బిగ్‌బాస్ ప్లాన్ ప్రకారమే జరిగిందా? -
కిందపడ్డ సోనియా.. గెలిచి చూపించిన విష్ణుప్రియ
బిగ్‌బాస్ హౌస్‌లో కిరాణా సామాను పంపిణీ ముగిసింది. యష్మి, నైనిక టీమ్ సభ్యులు రేషన్ గెలుచుకుని, దాన్ని హాయిగా వండుకుని కడుపు నింపుకున్నారు. కానీ నిఖిల్ టీమ్ మాత్రం రాగిముద్ద, ఉడకబెట్టిన కూరగాయలతో సరిపెట్టుకుంది. రేషన్ గొడవ అయిపోవడంతో బిగ్‌బాస్(#BiggBossTelugu8) ప్రైజ్‌మనీపై దృష్టి సారించాడు. ప్రస్తుతం రూ.3 లక్షలుగా ఉన్న ప్రైజ్‌మనీని హౌస్మేట్స్ వీలైనంతవరకు లాక్కుంటూ పోవచ్చన్నమాట!కిందపడ్డ సోనియాఈ ప్రైజ్‌మనీ టాస్కుల్లో భాగంగా మొదట విష్ణుప్రియ, సోనియా, మణికంఠలను స్విమ్మింగ్ పూల్‌లో దూకాలన్నాడు. ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లే క్రమంలో సోనియా కిందపడిపోయింది. విష్ణు అందరికంటే ముందు దూకి రూ.25 వేలు గెలిచింది. తర్వాతి టాస్కులో నిఖిల్, నబీల్, పృథ్వీ కలర్ బాల్ గేమ్ ఆడారు. ఇందులో నబీల్ ఆదిలోనే అవుట్ అయిపోగా నిఖిల్, పృథ్వీ హోరాహోరీగా పోరాడారు. అబ్బాయిల కష్టాలుఅంతిమంగా నిఖిలే గెలిచి రూ.50 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది. అనంతరం నిఖిల్, పృథ్వీ, నబీల్ను వ్యాక్స్ చేసుకోమన్నాడు బిగ్‌బాస్. ఈ వ్యాక్స్ చేసుకునేందుకు ముగ్గురూ నానాతంటాలు పడ్డారు. ఇకపోతే ఏదో పాల ప్యాకెట్ డస్ట్ బిన్లో కాకుండా కింద పడేసినందుకు విష్ణుప్రియకు యష్మి క్లాస్ పీకింది. మీరు మా చికెన్ దొంగిలించారుగా అని తనేదో చెప్పబోతుంటే యష్మి ఒంటికాలిపై లేచింది. సాక్ష్యం ఉందా? మేము తీసుకున్నట్లు మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? అని నిలదీసింది. ఎందుకు అరుస్తున్నావని అడిగితే నేనిలాగే మాట్లాడతానంటూ తన కోపాన్ని ప్రదర్శించింది. బహుశా ఇప్పటివరకు ప్రైజ్‌మనీ కోసం పెట్టిన గేమ్స్‌లో తన టీమ్ ఒక్కటి కూడా గెలవలేదన్న బాధను యష్మి ఇలా చూపిస్తుందేమో! -
నిజంగానే ఎమోషనల్ ఫూల్, ఇలాగైతే కష్టమే! మణి అదుర్స్!
బిగ్‌బాస్ హౌస్‌లో రెండోవారమే ఆకలికేకలు మొదలయ్యాయి. మూడు టీములకు పోటీపెట్టగా రెండు టీమ్స్ గెలిచి రేషన్ పొందింది. కానీ ఒక్క టీమ్ మాత్రం మంచి తిండి దొరక్క అల్లాడిపోయింది. ఓడిపోయేవారితో ఉండనంటూ నిఖిల్‌కు హ్యాండిచ్చింది సోనియా. తనను లూజర్ అని పదేపదే అనడంతో అతడు ఉండబట్టలేక ఏడ్చేశాడు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్న బిగ్బాస్వారానికి సరిపడా ఆహారాన్ని బిగ్‌బాస్(#BiggBoss8Telugu) సూపర్ మార్కెట్ నుంచి తీసుకోమని చీఫ్స్‌ను ఆదేశించాడు బిగ్‌బాస్. అలా చీఫ్స్ యష్మి, నైనిక, నిఖిల్ తమకు ఇచ్చిన గడువులో వీలైనంత ఆహారాన్ని తమ ట్రాలీలలో వేసుకున్నారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ మూడు టీమ్స్ సంపాదించిన రేషన్‌ను వాడుకోవాలంటే తాను ఇచ్చే టాస్కులు గెలవాలని మెలిక పెట్టాడు. మొదటగా మూడు టీమ్స్‌కు లెమన్ పిజ్జా టాస్క్ ఇచ్చాడు. ఇందులో యష్మి టీమ్ గెలిచింది.సోనియా ఏడుపు.. హగ్గులతో ఓదార్పుఇక వేరే టీమ్స్‌కు ఫుడ్ దొరకదనుకుందో, ఏమో కానీ ఆహారం అనేది అందరూ షేర్ చేసుకోవాలంటూ సోనియా ఏడ్చేసింది. దీంతో అభయ్, నిఖిల్, పృథ్వీ వరుసగా ఆమెకు హగ్గులిచ్చి ఓదార్చారు. తర్వాత నిఖిల్, నైనిక టీమ్స్‌కు బిగ్‌బాస్ పోటీపెట్టాడు. తాను అడిగే వస్తువులను తీసుకురావాలని ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ఆడేందుకు నిఖిల్ రెడీ అవగా అందుకు మణికంఠ ఒప్పుకోలేదు. తాను నామినేషన్లో ఉన్నానని, తానే ఆడతానని మంకుపట్టు పట్టాడు. ఆ ఒక్క నిర్ణయంతో కెరటం ఓటమిఅలా నిఖిల్ టీమ్ నుంచి మణి, నైనిక టీమ్ నుంచి సీత బరిలోకి దిగారు. పప్పులు, పిండి, నెయ్యి, యాపిల్.. ఇలా ఒక్కో వస్తువు చెప్పినకొద్దీ ఎవరు ముందు తీసుకొస్తే వారు ఆ రౌండ్లో గెలిచినట్లు! మరమరాలు పావుకిలో తెమ్మన్నప్పుడు మణికంఠ దానికి దగ్గర్లో (290 గ్రాములు) పట్టుకొచ్చాడు. అయితే సరిగ్గా 250 గ్రాములు ఉంటే మాత్రమే అంగీకరిస్తానని, ఈ రౌండ్లో ఎవరూ విజేతలు కాదని ప్రకటించింది యష్మి. సంచాలకురాలిగా తన నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించింది. వారమంతా రాగి ముద్దతోనే..ఫైనల్‌గా ఈ ఛాలెంజ్‌లో సీత తన అంతులేని వీరులు టీమ్‌ను గెలిపించింది. కెరటం టీమ్‌లోని నిఖిల్, మణికంఠకు రేషన్ లేదని బిగ్‌బాస్ తెలియజేయడంతో సీత ఏడ్చేసింది. రేషన్‌కు బదులుగా వారమంతా రాగిపిండితోనే సర్దిపెట్టుకోమన్నాడు. దీంతో యష్మి కూడా కంటతడి పెట్టుకుంది. ఇక రాత్రి యష్మి.. టీమ్ అన్నాక అందరూ ఒకే దగ్గర పడుకోవాలని ఆదేశించింది. దొంగతనం షురూఅందుకు సోనియా సరేనంటూ తలూపుతూనే నిఖిల్ దగ్గరకొచ్చి దానిపై అభ్యంతరం తెలిపింది. ఉదయాన్నేమో.. అందరూ దోసె చేద్దామనుకుంటే కుదరదు ఎగ్ రైసే చేయాలని యష్మి ఆదేశించింది. ఇంత కఠినంగా ఉండటం దేనికని తన టీమ్ సభ్యులే గుసగుసలాడారు. అప్పటిదాకా ఫుడ్ అందరికీ రాలేదని బాధపడిపోయిన ఇంటిసభ్యులు కాస్త ఫుడ్ కడుపులో పడగానే దొంగతనం మొదలుపెట్టేశారు. అటు బిగ్‌బాస్ పంపిన కూరగాయలు ఉడికించుకుని తిని నిఖిల్, మణి కడుపు నింపుకున్నారు.ఎమోషనల్ ఫూల్మరోవైపు నిఖిల్ నామినేషన్స్‌లో జరిగిన తంతు నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాడు. ఒంటరిగా కూర్చుని తనలో తానే బాధపడుతున్నాడు. అది చూసిన నైనిక.. నువ్వొక ఎమోషనల్ ఫూల్ అనేసింది. హౌస్‌లో ఏం చేసినా ప్రాబ్లమేనంటూ ఏడ్చేశాడు. నిజానికి ఆ ఏడుపు సోనియా అన్న మాటల వల్లేనని మనకు తర్వాత తెలుస్తుంది. అభయ్‌తో సోనియా.. నిఖిల్గాడిని చూస్తేనే కోపమొస్తుందని చెప్పింది. లూజర్స్‌తో ఉండనన్న సోనియాఅందుకు అభయ్.. నువ్వు నిఖిల్‌ను పదేపదే లూజర్ అన్నావంటగా.. లూజర్స్‌తో ఉండను అన్నావంట.. అలా అన్నప్పుడు తనతో ఇంకెలా మాట్లాడతానని నిఖిల్ ఫీలయ్యాడని ఆ సమాచారం సోనియాకు చేరవేశాడు. అందుకు సోనియా.. మరీ అంత కాకపోయినా, క్యాజువల్‌గా మాట్లాడితే అయిపోతుందిగా అని లైట్ తీసుకుంది. ఇక హౌస్‌లో అవతలివారిని రెచ్చగొట్టేది ప్రేరణ, విష్ణుప్రియ వీళ్లిద్దరు మాత్రమేనంది. అయినా మొన్నటి నామినేషన్స్‌తో రెచ్చగొట్టడంలో ఎవరు తోపు? అనేది జనాలకు ఈజీగా అర్థమైపోయిందిలే!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తడిబట్టలతో అబ్బాయిల ముందు! మళ్లీ విష్ణుప్రియకు నీతి సూక్తులు
పర్సనల్ వేరు, గేమ్ వేరు. దీనికి మధ్య తేడా తెలుసుకోవాలి.. ఇది సోనియా చెప్పిన మాటే!అయితే తాను అందరికీ సూక్తులు చెప్తాను కానీ పాటించనంటోందీ ఆర్జీవీ బ్యూటీ. మొన్న జరిగిన నామినేషనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నన్ను అడల్ట్రేటెడ్ జోకులు అనడం నచ్చలేదని విష్ణుప్రియ.. సోనియాను నామినేట్ చేసింది. విష్ణుప్రియ కౌంటర్తను పద్ధతిగా సోనియా గారు అని మాట్లాడుతుంటే సోనియా మాత్రం తనపై బురదజల్లే ప్రయత్నం చేసింది. నీకు అలాంటి జోకులే వచ్చని మాట్లాడింది. దీంతో సహనం కోల్పోయిన విష్ణుప్రియ.. అడల్ట్ అనేది నాలో లేదు, నీ బుర్రలో ఉంది. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని కౌంటర్ ఇచ్చింది.సోనియా దిగజారుడు వ్యాఖ్యలుతనకు ఎదురు తిరగడంతో సోనియా మరింత దిగజారుడు వ్యాఖ్యలు చేసింది. దుస్తులు సరిగ్గా వేసుకుని ఆ మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా తెలీదు. అతడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా కూడా మళ్లీ వెళ్లి అతడి పక్కనే నిలబడుతున్నావంటే నీ మాటలు, చేతలు అడల్ట్లాగే అనిపిస్తాయి అని దారుణంగా మాట్లాడింది. ఎవరి దగ్గర ప్రవర్తించానో చెప్పు అని విష్ణు సాఫ్ట్‌గానే అడిగినా.. అందరి దగ్గర అలాగే ప్రవర్తిస్తావని మండిపడింది. పొరపాటున..అసలు అంతగా ఇబ్బంది పడ్డ వ్యక్తి ఎవరు? ఏం జరిగింది? అంటే.. బాత్రూమ్లో చీర కట్టుకోవడం కష్టం కాబట్టి విష్ణుప్రియ బెడ్రూమ్లోకి వెళ్లింది. అది తెలియక పొరపాటున ఆదిత్య ఓం బెడ్రూమ్లోకి వెళ్లాడు. ఆమె చీర కట్టుకుంటుందని తెలిసి వెంటనే బయటకు వెళ్లిపోయాడు. అతడిని గమనించిన విష్ణు.. ఆదిత్య దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. ఇంతదానికి సోనియా.. ఏదో చెండాలం జరిగిపోయినంత బిల్డప్ ఇచ్చింది. మరి నీ డ్రెస్సింగ్ సెన్స్ ఏది?అక్కడ ఆదిత్య ఇబ్బందిపడకపోయినా సోనియానే తెగ ఫీలైపోయింది. నిఖిల్, అభయ్ దగ్గరకు వెళ్లి విష్ణుప్రియ చీర మార్చుకుంటుండగా ఏం జరిగిందో తెలిసా? అని మళ్లీ మొదలుపెట్టింది. పైగా తడిచిన బట్టల్లో, కేవలం టీషర్ట్‌తో ఉండగానే వాళ్ల ముందు నిలబడింది. విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి ఓవర్‌గా మాట్లాడిన సోనియా.. మరి ఇలా తడిచిన బట్టలతో వాళ్ల ముందు నిలబడటమేంటో తనకే తెలియాలి! Sonia is the cheapest contestant on #BiggBossTelugu8 She is slut-shaming #VishnuPriya to two guys over a genuine misunderstanding. Hefty PR can't hide her ugliness and no, she can never be Bindu👎pic.twitter.com/26Nz6JqXiI— 🍋 (@yunoforeva) September 10, 2024Enta galeez ga undi enti ah Soniya #Vishnupriya saree drape cheskunte ah Aditya om by mistake ah room Loki velipoyadu tanu sorry kuda chepindi adi edo tanu kavali ani ala chesinatu oka sexualize way lo cheptundi anduke ninu adultrated ananu ani antundi #BiggBossTelugu8 pic.twitter.com/kyDN5pFQ4a— Abhishek (@uniqueabhi18) September 10, 2024మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియపై నీచమైన కామెంట్స్.. సోనియాను తిట్టిపోస్తున్న నెటిజన్లు
బిగ్ బాస్ షో రెండో వారంలో అడుగుపెట్టింది. తాజాగా ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియలో తీవ్రమైన చర్చ జరిగింది. రెండో వారం నామినేషన్స్‌లో కిర్రాక్ సీత, యాంకర్ విష్ణుప్రియలను మాటలతో సోనియా టార్గెట్ చేసింది. ముఖ్యంగా యాంకర్ విష్ణుప్రియపై సోనియా చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగా ఉన్నాయంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. పర్సనల్ ఎటాక్‌కు దిగిందంటూ సోనియాపై ఫైర్ అవుతున్నారు.రెండో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా విష్ణుప్రియ ఇద్దరిని ఎంచుకుంటుంది. మొదట మణికంఠను నామినేషన చేసిన విష్ణు ఆపై సోనియాను నామినేట్ చేసింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇంతకు విష్ణుప్రియ మీద సోనియా ఎలాంటి కామెంట్లు చేసిందంటే.నువ్వు ముందు దుస్తులు సరిగ్గా వేసుకోవు.. అలాంటి దుస్తులతోనే ఇతరుల పక్కన నిల్చుంటావ్.. నీ వల్ల వారు డిస్కంఫర్ట్ అవుతున్నా సరే వారి పక్కన నిల్చుంటావ్. నీ మాటలు, చేతలు హౌజ్‌లో చాలా తేడా ఉన్నాయి.' అని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగని సోనియా మరింత వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగింది. విష్ణుప్రియను ఉద్దేశిస్తూ.. 'నీకు ఫ్యామిలీ లేదేమో.. నువ్ ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడకపోవచ్చు, కానీ, నన్ను మాత్రం నా కుటుంబం చూస్తుంది. నిన్ను అడల్ట్స్ జోక్స్ వేయడానికే బిగ్ బాస్ షోకి పిలిచారనుకుంటా.. నన్ను మాత్రం అలాంటివి చేయడానికి పిలవలేదు. గతంలో అడల్ట్ కామెడీ షోలో ఉన్నావ్ కాబట్టే బిగ్‌బాస్‌కు పిలిచారు' అంటూ విష్ణుప్రియను సోనియా దారుణంగా అవమానించింది. దీంతో సోనియాకు భారీగా నెగటివిటీ వచ్చింది. సోనియా నోరుని డ్రైనేజీతో పోల్చి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సోనియాకు కాస్త తిక్క ఉందంటూ చెప్పుకొస్తున్నారు. సోనియా చేసిన కామెంట్లకు నాగార్జున గట్టగా రియాక్ట్ కావాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ వారం నామినేషన్ లిస్ట్‌లో సోనియా పేరు ఉంటే వీకెండ్లో ఆమె ఎలిమినేషన్ కావడం పక్కా అని బిగ్ బాస్ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. -
విష్ణుప్రియను టార్గెట్ చేసిన సోనియా! ఇప్పటికీ అదే అంటా!
వంట చేస్తూ అందరి కడుపు నింపిన బేబక్కను మొదటివారమే పంపించేశారు. దీంతో నిఖిల్ గరిట తిప్పాల్సిన పరిస్థితి! కానీ ఒక్కరికోసం మాత్రమే స్పెషల్‌గా వండాడు. మరోవైపు బేబక్క ఎలిమినేషన్‌తో నైనిక, సీతకు బయట ఏం జరుగుతుందో అర్థమైపోయింది. జనాలు ఎటువంటి గేమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు? ఏంటనేది సినిమా క్లియర్‌గా తెలిసిపోయింది. ఇక నామినేషన్స్‌ను కంటెస్టెంట్లు యుద్ధంలా పూర్తి చేశారు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..చిట్టా పెద్దగానే ఉందే!ఎవరు ఎలిమినేట్ అవుతారనుకున్నానో వాళ్లే ఫస్ట్ సేవ్ అయ్యారంటూ తన బాధను బయటపెట్టింది విష్ణుప్రియ. అయినా సోనియా ఎలిమినేట్ అవుతుందని ఎలా అనుకున్నావని ప్రేరణ నోరెళ్లబెట్టింది. అనంతరం పృథ్వీ.. సోనియాకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడనేది కూపీ లాగింది. అందుకామె.. నన్ను అర్థం చేసుకోవాలి, ప్రోగ్రెసివ్‌గా ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ముఖ్యంగా నేను చేయాలనుకున్నదానికి అడ్డుపడొద్దు, నా అంత బుద్ధి ఉండొద్దు అని కోరికల చిట్టా బయటపెట్టింది.ఆమెకు ఇష్టమైన కూర చేసిన నిఖిల్మరోపక్క ఈమె మెంతి టమాట కూర తినాలని కోరిక పుట్టడంతో నిఖిల్ కిచెన్‌లో గరిట తిప్పాడు. ఈ విషయాన్ని సీత బయటపెట్టడంతో విష్ణుప్రియ నోరెళ్లబెట్టింది. తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్లు తమ టీమ్‌లోని సభ్యులను మినహాయించి అవతలి టీమ్స్‌లో ఎవరినైనా నామినేట్ చేయొచ్చని బిగ్‌బాస్ (#BiggBoss8Telugu) తెలిపాడు. పెద్ద టీమ్ చీఫ్ అయిన కారణంగా యష్మి నామినేషన్స్‌లో ఉండబోదని పేర్కొన్నాడు.కోరిక తీర్చేసుకున్న సీతమొదటగా సీత.. గతవారమే నిన్ను నామినేట్ చేయాలనుకున్నాను, ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికిందంటూ నిఖిల్‌పై రంగు పోసింది. చెత్తబుట్టలో నుంచి గ్లాస్ తీసి బయటపెట్టడం నన్ను అవమానించినట్లుగా అనిపించిందని ప్రేరణను నామినేట్ చేసింది. అభయ్.. ఇంకా బెస్ట్ ఇవ్వాలంటూ విష్ణుప్రియను, ఇన్వాల్వ్మెంట్ తక్కువైందంటూ ఆదిత్యను నామినేట్ చేశాడు. సోనియా వర్సెస్ సీతసోనియా.. చీఫ్‌గా ఫెయిలైందంటూ నైనికను నామినేట్ చేసింది. సీతను నిలబెట్టి.. టాస్కులు అర్థం చేసుకోలేకపోతున్నావంటూ క్లాసు పీకింది. అభయ్‌తో జరిగిన గొడవలోనూ నీకు పర్సనాలిటీ ప్రాబ్లమ్ ఉందని తేలిందని, నీకింకా మెచ్యూరిటీ రావాలంటూ తిట్టిపోసింది. అసలు టీమ్‌లో ఎలా ఉండాలో కూడా తెలియదని చులకన చేసింది. టోటల్‌గా గ్రూప్ అంతా ఫెయిలైందని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదంతా విన్న సీత.. నువ్వు గేమ్‌ను అర్థం చేసుకున్నాక నాతో మాట్లాడని కౌంటరిచ్చింది. నీకు మెచ్యూరిటీ లేదని తిరిగనేసరికి.. మెచ్యూరిటీ గురించి మాట్లాడొద్దని సోనియా హెచ్చరించింది.ఆదిత్యపై పడ్డారే!మణికంఠ.. ప్రతి మనిషి గురించి పాజిటివ్స్ చెప్తున్నారు. అది సేఫ్ గేమా? లేదంటే మీ వ్యక్తిత్వమే అలాంటిదా? అనేది అర్థం కావడం లేదు. అలాగే నామినేషన్స్ ఒత్తిడిని ఎలా తీసుకుంటావో చూడాలనుందని ఆదిత్యను నామినేట్ చేశాడు. అందుకతడు.. మీరు నాకు పబ్లిసిటీ చేస్తున్నారంటూ నవ్వుతూ స్వీకరించాడు. సీరియస్ టైంలో కుళ్లు జోకులు వేస్తున్నావని, అలాగే స్వీట్లు తీసుకెళ్లి దాచేశావని బాషాను నామినేట్ చేశాడు.ఆరని జ్వాలఆదిత్య వంతు రాగా.. స్ట్రాంగ్ కంటెండర్ అంటూ అభయ్ నవీన్‌ను, ఈ గేమ్‌కు మీరు ఫిట్ కాదంటూ శేఖర్ బాషాను నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. నా తప్పులు వెతకడానికి నాతో జర్నీ చేశానని గతవారం నామినేషన్లో చెప్పడం నచ్చలేదని మణికంఠపై రంగు చల్లింది. తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ.. మీకు కోపం వచ్చినప్పుడు అవతలివారిపై నిందలు వేస్తున్నారంది.దుస్తులు సరిగా వేసుకోవు!అందుకామె.. నీకు నాతో అంత ర్యాపో లేకపోయినా నాపై జోకులు వేశావు.. సారీ చెప్పినంత మాత్రాన మాటల్ని వెనక్కు తీసుకోలేం.. నువ్వు అడల్ట్రేటెడ్ జోకులు చేస్తావు.. ఇప్పటికీ అదే అంటాను. బట్టలు సరిగా వేసుకుని ఒక మనిషి పక్కన నిల్చోవాలనేది కూడా నీకు తెలియదు కదా.. ఒకరు కంఫర్ట్‌గా లేరని తెలిసినా కూడా అలా వారి పక్కన నిల్చున్నప్పుడే నీ వ్యక్తిత్వం తెలుస్తోంది అంటూ విష్ణుప్రియను మరింత రెచ్చగొట్టింది. పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని సెటైర్లు వేసింది విష్ణుప్రియ.ఒకే ఒక్కడితో ప్రాబ్లమ్బాషా వంతు రాగా.. నాకు ఒకే ఒక్కడితో ప్రాబ్లమ్.. అతడే మణికంఠ.. అతడు జనజీవన స్రవంతిలో కలవనంతవరకు నామినేట్ చేస్తూనే ఉంటానంటూ తనపై రంగు గుమ్మరించాడు. నేను బిగ్‌బాస్‌కు అన్‌ఫిట్ అని మీరు నిర్ణయించడం బాధేసిందంటూ ఆదిత్య ఓంను నామినేట్ చేశాడు. వీళ్ల రూటే సెపరేటుదీంతో ఆదిత్య.. నా వయసులో ఏం జరుగుతుందో మీకు తెలియదు.. నేను ఫ్యామిలీని వదిలేసి వచ్చాను. అన్ని పనులు చేస్తున్నాను అంటూ సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడాడు. నిజానికి వీళ్లిద్దరూ ఒకర్ని ఒకరు నామినేట్ చేసుకున్నారు కానీ మనసులో మాత్రం బాధపడుతున్నారని చూసే జనాలకు ఇట్టే తెలిసిపోతుంది. అందుకే నామినేషన్ అయ్యాక హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకున్నారు.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ పని చేస్తే నువ్వేమడిగినా ఇస్తా: నిఖిల్‌కు సోనియా ఆఫర్
నేను నీతులు చెప్తాను, కానీ పాటించను.. సోనియా ప్రవర్తన చూస్తున్న చాలామందికి ఈ డైలాగ్ గుర్తురాక మానదు. ఎవరు ఏం మాట్లాడినా అందులో తప్పులు, పెడార్థాలు తీయడమే పనిగా పెట్టుకుంది. పైగా హౌస్‌లోకి వచ్చిన కొత్తలో నిఖిల్ గురించి చెడుగా మాట్లాడి ఇప్పుడు అతడితోనే క్లోజ్‌గా ఉంటోంది.అంతేనా లైవ్‌లో విష్ణుప్రియ, యష్మి గురించి నిఖిల్‌కు నెగెటివిటీ ఎక్కిస్తోంది. మరోవైపు అతడి జుట్టుతో ఆడుకుంటూ.. మనం ఒక టీమ్ అంటూ.. జంట కలిపేసింది. ఇంకా తనతో సిగరెట్ అలవాటు కూడా మాన్పించే ప్రయత్నం చేసింది. సిగరెట్ తాగకుండా ఉంటే నువ్వేమడిగినా ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరోవైపుథ్వీ చేతిలో చెయ్యేసి మాట్లాడింది. ఇవన్నీ చూసిన జనాలు.. ఈమె ఇంకో రతిక అయ్యేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by GMK (@shindu.beautiful.souls) -
ఈ వారం నామినేషన్స్‌లో ఎనిమిదిమంది.. ఎవరెవరంటే?
బిగ్‌బాస్ షో రోజురోజుకీ రంజుగా మారుతోంది. ఫస్ట్ వీక్‌లోనే కంటెస్టెంట్లు తమ సత్తా ఏంటో చూపించారు. ఎవరికి ఏయే కళల్లో ప్రావీణ్యం ఉందో బయటపెట్టారు. ఒక్క టాస్కుల్లోనే ఇంకా అందరి బలం బయటపడలేదు. ఫస్ట్ వీక్ బేబక్క ఎలిమినేషన్‌తో హౌస్ కాస్త నిశ్శబ్ధంగా మారింది. ఈ సైలైన్స్ నాకు నచ్చదన్నట్లుగా బిగ్‌బాస్ వెంటనే రెండోవారం నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టాడు. ఆ హక్కు లేదుఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నామన్నట్లుగా కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఓ ప్రోమో విడుదలైంది. బయట ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్షిప్ను మీరు ఇంట్లో ఫాలో అవండి, కానీ పక్కవాళ్లు కూడా ఫాలో అవాలని చెప్పే హక్కు నీకు లేదంటూ ప్రేరణను నామినేట్ చేసింది సీత.మెచ్యూరిటీ రావాలి!ఈ సమయంలో వీరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. సోనియా.. నీకు పర్సనాలిటీ ప్రాబ్లమ్ ఉంది, నీకింకా మెచ్యూరిటీ రావాలని సూక్తులు చెప్పడంతో సీతకు మండిపోయింది. నాకెంత క్లారిటీ ఉందో నాకు తెలుసు, ముందు నువ్వు గేమ్‌ను అర్థం చేసుకుని నాకు వివరించు, అసలు నీకు క్లారిటీ లేదు.. అని ఇచ్చిపడేసింది. నామినేషన్లో..దీంతో సోనియా.. ఎక్కువ మాట్లాడొద్దు, పిచ్చి మాటలు మాట్లాడకు అని సీరియస్ అయింది. మొత్తానికి ఈ వారం నిఖిల్, నైనిక, సీత, మణికంఠ, శేఖర్ బాషా, ఆదిత్య, పృథ్వీ, విష్ణుప్రియ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇంకా లీడర్ అయ్యే ఛాన్స్ ఎక్కడ బేబక్క? టైం అయిపాయె!
మొన్నటిదాకా కూల్‌గా ఉన్న బేబక్క తన విశ్వరూపం చూపిస్తోంది. ఏదో పోనీలే అనుకుంటే అందరూ ఎక్కువ చేస్తున్నారని తన స్వరం పెంచింది. అయితే కిచెన్‌లో లేటుగా వంట చేయడం వల్ల లేనిపోని గొడవలకు కారణమవుతోంది. మరోవైపు తొలినాళ్లలో ఫైర్‌తో కనిపించిన నిఖిల్ కాస్తా చల్లబడిపోయాడు. ఇక ఈ వారం పర్ఫామెన్స్లో ఎక్కువమంది లేడీస్ ఫెయిలయ్యారని తీర్పునిచ్చాడు నాగ్. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి(సెప్టెంబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఆమె మీద కోపం అతడిపై..ఎప్పటిలాగే కిచెన్‌లో గొడవ మొదలైంది. బేబక్క.. 'సోనియా.. నన్ను పర్సనల్ అటాక్ చేస్తోంది. తనతో వైబ్ రావట్లేద చెప్తుంటే కూడా పట్టించుకోవట్లేదేంటి?' అని తన టీమ్ లీడర్ నిఖిల్ మీద ఫైర్ అయింది. సోనియా అయినా ముఖం మీద మాట్లాడుతుంది కానీ నువ్వు మాస్క్ వేసుకుని ఉన్నావంటూ అతడిపై నిందలు వేసింది. అయితే సోనియా మీద కోపం నిఖిల్ మీద చూపించినట్లు అనిపించింది.అడల్ట్ కామెడీ..మరోవైపు విష్ణుప్రియ.. మొదట్లో నీకు నిఖిల్‌తో పడలేదుగా, మరి ఇప్పుడెలా స్నేహం కుదిరిందని అడిగింది. ఈ ప్రశ్న నచ్చకపోవడంతో సోనియా.. అడల్ట్ జోకులు నాపై వేయొద్దని ఫైర్ అయింది. ఆ మాటతో చిర్రెత్తిన విష్ణుప్రియ మీ మధ్య ఏదో ఉందని అనలేదుగా.. దానికి అంత మాట అనాల్సిన అవసరం లేదని తిట్టిపోసింది. దీంతో సోనియా ఏడ్చేసింది. అయినా విష్ణుప్రియ వల్లేదు. నన్ను ఆ మాట ఎలా అంటావ్? నువ్వు ఒక్కదానివే పుణ్య స్త్రీ.. మేము మాత్రం ఇలాంటివాళ్లమా? అని చిర్రుబుర్రులాడింది. ఇవన్నీ శుక్రవారం జరిగాయి.కత్తి దింపిన కంటెస్టెంట్లుశనివారం నాడు.. నాగార్జున వచ్చీరాగానే వినాయక చవితి సందర్భంగా ఇంట్లో అందరికీ స్వీట్లు పంపించాడు. అలాగే ఓ టాస్క్ ఇచ్చాడు. మాటలతో గాయపర్చేవారిని చురకత్తితో, నెగెటివ్ అనిపించినవారిని నల్లకత్తితో, రెండునాలుకలు ఉన్నవారిని ఇరువైపులా పదునున్న కత్తితో, చలనం లేకుండా పడి ఉన్న కంటెస్టెంట్లను తుప్పుకత్తితో పొడవాలన్నాడు. మొదటగా బాషా.. మణికంఠలో నెగెటివ్ ఎనర్జీ చూస్తున్నానంటూ అతడు ధరించిన దిండుపై నల్లకత్తితో పొడిచాడు.నిఖిల్ టీమ్ నుంచి బయటకువిష్ణుప్రియ.. అడల్ట్రేటెడ్ కామెడీ చేస్తున్నానంటూ సోనియా తనపై మాటలు జారిందని చురకత్తితో పొడిచింది. ఈ విషయంలో నాగ్ సోనియాకే సపోర్ట్ ఇవ్వడం గమనార్హం. విష్ణు.. సోనియాను పుణ్య స్త్రీ అంటూ వెక్కిరించి మాట్లాడటాన్ని తప్పుపట్టాడు. నైనిక.. తన టీమ్‌తో ఎక్కువ పని చేయించిందంటూ యష్మిని చురకత్తితో పొడిచింది. బేబక్క.. నిఖిల్ తన టీమ్‌లో ఉన్న నాకు బదులుగా సోనియాను ఎక్కువ పట్టించుకున్నాడంటూ అడిని పదును కత్తితో పొడిచింది. మారిపోయిన నిఖిల్అలాగే అతడితో ఉండటం ఇష్టం లేదంటూ టీమ్ నుంచి బయటకు వచ్చేసింది. అభయ్.. నిఖిల్‌ను మాస్క్ తీసే కత్తితో పొడిచాడు. మొదట్లో అగ్రెసివ్‌గా ఉన్న నిఖిల్ ఇప్పుడు ఎవరితో ఏం మాట్లాడితే ఎలా ఫీల్ అవుతారోనన్న భయంలో పడిపోయాడు. అవన్నీ అవసరం లేదు, మొదట్లో ఎలా ఉన్నావో అలా ఉంటే చాలని సూచించాడు.వెగటు కామెడీనెగెటివ్ ఎనర్జీ అన్న కారణంతో సీత.. యష్మిని, సోనియా.. బేబక్కను నల్లకత్తితో పొడిచారు. నబీల్.. నిఖిల్ వెగటు కామెడీ నచ్చలేదని అతడిని చురకత్తితో పొడిచాడు. ప్రేరణ, పృథ్వి.. ఆదిత్య ఓంకు తుప్పు పట్టిన కత్తి దింపారు. మణికంఠ, యష్మి ఒకరినొకరు పదునుకత్తితో పొడుచుకున్నారు. నిఖిల్ వంతురాగా.. రెండు నాలుకలు ఉన్నాయంటూ బేబక్కను పదును కత్తితో పొడిచాడు. ఆదిత్య.. బాషాను తుప్పు పట్టిన కత్తితో పొడిచాడు.ఆ ఐదుగురు ఫ్లాప్అనంతరం నాగ్.. ఈ వారం కంటెస్టెంట్ల రిపోర్టు కార్డును బయటపెట్టాడు. పర్ఫార్మెన్స్ ఆధారంగా చూస్తే ప్రేరణ, సీత, బేబక్క, ఆదిత్య, విష్ణుప్రియ ఫ్లాప్ అయ్యారని తెలిపాడు. చివర్లో సోనియా సేవ్ అయినట్లు వెల్లడించాడు. ఇక సండే ఎపిసోడ్ షూట్ పూర్తవగా బేబక్కను ఎలిమినేట్ చేశారట! పాపం.. ఇది ముందు గ్రహించలేకపోయిన ఆమె తనే లీడరను అవుతానని శపథం చేసింది. ఇంతలోనే ఇల్లు వదిలి బయటకు వెళ్లాల్సి వచ్చింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏడ్చిన సోనియా.. విష్ణుప్రియకు క్లాస్ పీకిన నాగ్
బిగ్‌బాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ప్రోమో రానే వచ్చింది. వినాయక చవితి సందర్భంగా నాగార్జున హౌస్‌మేట్స్‌కు స్వీట్లు పంపించాడు. అలాగే ప్రతి వీకెండ్లో తప్పొప్పులు ఎత్తి చూపే నాగ్ మీ పొరపాట్లు ఏంటో మీరే చెప్పండని కంటెస్టెంట్లను ఆదేశించాడు. దీంతో అందరూ లేచి నిలబడ్డారు.మణిని గుచ్చిన బాషాతనలో తను మాట్లాడుకోవడం ఒంటరితనమో ఏంటో అర్థం కావడం లేదంటూ నాగమణికంఠను కత్తితో పొడిచాడు బాషా. ఆ ఒంటరితనం ఎందువల్ల ఏర్పడిందనేది తర్వాత చెప్పాడుగా అని నాగ్ బదులివ్వగా వాటిని నేను ఆమోదించలేనన్నాడు బాషా. తర్వాత విష్ణుప్రియ.. సోనియాకు కోపంలో అనే మాటలు మనసుకు బాధ కలిగిస్తున్నాయంది. దీంతో ఓ వీడియో ప్లే చేశారు. ఉన్నమాట అడిగిన విష్ణుప్రియఅందులో విష్ణుప్రియ.. నీకు ముందునుంచి నిఖిల్ అంతగా నచ్చలేదు. అలాంటిది మీ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది? అని ఉన్నమాట అడిగింది. ఇది కేవలం విష్ణుప్రియకు వచ్చిన డౌటే కాదు.. బిగ్‌బాస్ చూసే ఆడియన్స్‌కు వచ్చిన డౌట్ కూడా! కానీ ఆ ప్రశ్నకు సోనియా సమాధానం దాటవేసింది. అంతేకాకుండా ఇలాంటి అడల్ట్రేటెడ్ కామెడీ తన మీద ప్రయోగించొద్దని సీరియస్ అయింది. దీంతో విష్ణుప్రియకు చిర్రెత్తుకొచ్చింది. నువ్వొక్కదానివే పుణ్య స్త్రీవా?మీ మధ్య ఏమైనా నడుస్తుందా? అని ఆ టైప్‌లో ఏమైనా జోకులు వేశానా? లేదు కదా? అని నిలదీసింది. ఆ మాటతో సోనియా.. ఇక ఆపేయ్ అని అరుచుకుంటూ బయటకు వెళ్లి ఏడ్చేసింది. అది చూసిన విష్ణుప్రియ.. నేను కూడా ఏడుస్తాను.. నువ్వొక్కదానివే పుణ్య స్త్రీవా? అని నోరుపారేసుకుంది. ఇది చూసిన నాగార్జున.. తను ఏడుస్తున్నప్పుడు మళ్లీ గుచ్చేలా మాట్లాడటం అవసరమా? అని కోప్పడ్డాడు. మరి ఇంకా ఎవరెవరికి క్లాసులు పీకాడో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈమె ఓ బిందు మాధవి, అతడో పల్లవి ప్రశాంత్ మరి!
అందరూ ఏదో పగబట్టినట్లు ఒక్కరినే నామినేట్ చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి బాధనిపించడం ఖాయం. కానీ అంత బాధలోనూ నా గతం మీకు తెలీదంటూనే తన చరిత్రనంతా మళ్లీ చదివి వినిపించాడు నాగమణికంఠ. కష్టాలన్నీ తనకు మాత్రమే ఉన్నాయంటూ ఓరకంగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. సింపతీ గేమ్దీంతో బిగ్‌బాస్ అతడిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఓదార్చాడు. చూస్తుంటే ఇతడు పల్లవి ప్రశాంత్‌లా సింపతీ గేమ్ ఆడి గెలుద్దామనుకుంటున్నాడని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నాడు. మరోవైపు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సోనియా తనకు తానే ఆడపులి అన్న ట్యాగ్‌లైన్ ఇచ్చేసుకుంది. సెల్ఫ్ డబ్బా..ఈ మాట జనాలు చెప్పుంటే బాగుండేది కానీ మరీ రెండు రోజుల్లోనే తనను తాను పొగుడుకోవడం చూసిన బిగ్‌బాస్ ప్రియులు ఇది సెల్ఫ్ డబ్బా అని కామెంట్లు చేస్తున్నారు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ సీజన్లో బిందుమాధవిలా ఫీలవుతుందని సెటైర్లు వేస్తున్నారు. -
Bigg Boss 8: మొదటి వారం నామినేషన్లో ఉన్నది వీళ్లే!
బిగ్‌బాస్ హౌస్‌ను కంటెస్టెంట్లు మొదటిరోజే చేపలమార్కెట్ చేసేశారు. టాస్కులు గెలిచి చీఫ్లుగా అధికారంలోకి వచ్చిన నిఖిల్, సోనియా.. ఏకాభిప్రాయంతో యష్మిని మూడో చీఫ్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే! స్నేహితురాలన్న కారణంతోనే యష్మిని చీఫ్‌గా ఎన్నుకున్నారని సోనియా చాలాసేపు వాదించింది.గగ్గోలు పెట్టిన సీతమరోవైపు ఎగ్ బుర్జీ చేసుకుంటానంటే బేబక్క ఒప్పుకోవడం లేదని సీత బుంగమూతి పెట్టింది. అలాగే తనను కిచెన్ టీమ్‌లో నుంచి కావాలనే సైడ్ చేశారని గగ్గోలు పెట్టింది. అలాంటిదేమీ లేదని నిఖిల్ నచ్చజెప్పినా అస్సలు వినిపించుకోలేదు. ఇంతలో బిగ్‌బాస్ నామినేషన్ అనే ప్రక్రియతో అసలైన గొడవ మొదలుపెట్టాడు. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తుల ఫోటోలను బండరాయికి తగిలించాలని చెప్పాడు.చీఫ్‌లకు మినహాయింపుచీఫ్లకు నామినేషన్ నుంచి మినహాయింపు ఇచ్చాడు. అలాగే హౌస్మేట్స్ ఇద్దరిని చొప్పున నామినేట్ చేస్తే అందులో ఒకరి సేవ్ చేస్తూ మరొకిరిని నామినేట్ చేసే అధికారం చీఫ్‌లకు ఉందని పేర్కొన్నాడు. మొదటగా సోనియా... కిచెన్‌లో బాధ్యతారాహిత్యంగా ఉన్నారంటూ బేబక్కను నామినేట్ చేసింది. కుక్కర్ పని చేయకపోయినా అది నా తప్పేనా? అని బేబక్క సమాధానమిస్తుంటే తననసలు మాట్లాడనివ్వలేదు. బేబక్కను పూర్తిగా మాట్లాడనివ్వు అని చీఫ్‌లు కలగజేసుకున్న పాపానికి మీరేమీ జడ్జిలు కాదంటూ వారి నోరు కూడా మూయించింది.సోనియా వర్సెస్ ప్రేరణఅనంతరం ప్రేరణను నామినేట్ చేస్తూ.. ఇదేం పిక్నిక్ కాదు, ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటున్నావేమో.. కానీ, అవతలివారికి కోపం వచ్చినప్పుడు మధ్యలో వచ్చి ఆపే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ క్రమంలో ప్రేరణ.. తనతో పెద్ద గొడవే పెట్టుకుంది. చీఫ్ యష్మి.. వారిద్దరిలో బేబక్క నామినేషన్‌కు పచ్చజెండా ఊపింది.నాగమణికంఠకు ఎక్కువ ఓట్లునబీల్.. ఎవరితో కలిసిపోవట్లేదంటూ నాగమణికంఠను, తనతో ఎక్కువ కనెక్ట్ కాలేదంటూ బేబక్కను నామినేట్ చేశాడు. యష్మి పరిగెత్తుకుంటూ వచ్చి నాగమణికంఠ ఫోటోపై కత్తిగుచ్చి అతడి నామినేషన్‌ను ఫైనలైజ్ చేసింది. అనంతరం శేఖర్ బాషా.. నాగమణికంఠ, బేబక్కల ఫోటోలను బండరాయిపై అతికించాడు. చీఫ్ నైనిక.. వీరిలో నాగమణికంఠను నామినేట్ చేసింది.సాయం చేయలేదంటూతర్వాత బేబక్క.. నబీల్ను నామినేట్ చేసింది. తనకు కిచెన్‌లో సాయం చేయలేదంటూ పృథ్వీ ఫోటోను బండరాయికి అతికించింది. అయితే సీత.. అతడు కిచెన్‌లో బోళ్లు తోమాడంటూ పక్కనుంచి ఉప్పందించింది. ఇది చూసిన నిఖిల్.. మధ్యలో నువ్వు మాట్లాడొద్దని ఫైరయ్యాడు. అనంతరం అతడు పృథ్వీ నామినేషన్‌ను ఫైనల్ చేశాడు.నామినేషన్స్‌లో ఎవరంటే?ఈ నామినేషన్ పర్వం రేపటి ఎపిసోడ్‌లోనూ కొనసాగనుంది. అయితే ఈపాటికే బిగ్‌బాస్ హౌస్‌లో ఈ ప్రక్రియ ముగియడంతో నామినేషన్ లిస్టు బయటకు వచ్చేసింది. అందులో పృథ్వి, నాగమణికంఠ, శేఖర్ బాషా, విష్ణుప్రియ, సోనియా, బేబక్క ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ వీరిలో ఒకరిని సేవ్ చేసే అధికారం ఏమైనా చీఫ్స్‌కు ఇస్తారా? లేదంటే వీళ్లే నామినేషన్లో ఉంటారా? అనేది రేపు తేలనుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'బిగ్‌బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం?
బిగ్‌బాస్ షోలో నామినేషన్ రచ్చ మొదలైంది. ఈసారి కెప్టెన్ ఎవరు ఉండరని చెప్పారు. ఆ స్థానంలో చీఫ్ ఉంటారని చెప్పి కొన్ని గేమ్స్ పెట్టగా నిఖిల్, యష్మి, నైనిక చీఫ్స్‌గా ఎంపికయ్యారు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. మంగళవారం తొలి నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఇదంతా మంగళవారం రాత్రి ప్రసారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.ప్రోమో విషయానికొస్తే.. ముగ్గురు చీఫ్స్ ఆసనాల్లో కూర్చుని ఉంటారు. మిగిలిన వాళ్లలో ఒక్కో హౌస్‌మేట్ తలో ఇద్దరిని నామినేట్ చేయాలి. అలా సోమవారం గొడవలతో హాట్ టాపిక్ అయిపోయిన సోనియా... బేబక్క, ప్రేరణని నామినేట్ చేసింది. సోనియా-బేబక్క మధ్య కుక్కర్ పంచాయతీ నడిచింది.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)కిచెన్‌లో అజాగ్రత్తగా ఉన్నారని కారణం చెప్పిన సోనియా.. బేబక్కని నామినేట్ చేసింది. దీంతో కుక్కర్ లోపల ప్రెజర్ ఉంటది. అది దిగేవరకు మనం ఆగాలని చెప్పి బేబక్క వివరణ ఇవ్వడం చూస్తుంటే ఈసారి నామినేషన్లో కుక్కర్ పంచాయతీ హైలైట్ అవ్వడం పక్కా అనిపిస్తోంది. కుక్కర్ పనిచేయకపోతే తానేం చేయనని బేబక్క అసంతృప్తి వ్యక్తం చేసింది.మరోవైపు మణికంఠ.. శేఖర్ భాషాని నామినేట్ చేశాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడిచింది. చివర్లో యష్మి పరుగెత్తుకుంటూ వచ్చి కత్తిని బేబక్క ఫొటోపై గుచ్చడం చూస్తుంటే ఈ వారం మణికంఠ, బేబక్కపై ఎలిమినేషన్ అనే కత్తి వేలాడటం పక్క అనిపిస్తోంది. మిగతా వాళ్ల కంటే వీళ్లిద్దరే ఎక్కువ టార్గెట్ అవుతున్నారనిపిస్తోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ వివరాలు.. ఎక్కువ ఎవరికంటే..?) -
Bigg Boss 8: నామినేషన్స్‌కు లైన్ క్లియర్.. ఫస్ట్ రోజే రచ్చలేపిన కంటెస్టెంట్లు
ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మొదలైంది. ప్రేక్షకులకు ముక్కూముఖం తెలియని కంటెస్టెంట్ల సంఖ్యే ఈసారి ఎక్కువగా ఉంది. అయినా ప్రతి సీజన్ ప్రారంభంలో ఇది మామూలేలే! కొన్నాళ్లు పోతే వీళ్లకే మళ్లీ అభిమాన సంఘాలు పుట్టుకొస్తాయి. ఈసారైతే కంటెస్టెంట్లు మొదటిరోజే గొడవలుపడ్డారు. ఆ విషయాలు, విశేషాలేంటో సెప్టెంబర్ 2 నాటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..ఆవేశంగా నాగమణికంఠబిగ్బాస్ లాంచింగ్ రోజే కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టాడు నాగ్. అడుగుపెట్టిన మొదటిరోజే ఒకరు ఎలిమినేట్ అవుతారంటూ అనిల్ రావిపూడిని హౌస్‌లోకి పంపించి బాంబ్ పేల్చాడు. ఎవరిని బయటకు పంపిద్దామన్నప్పుడు మెజారిటీ జనాలు నాగమణికంఠకు ఓటేశారు. ఇలా వచ్చానో లేదో అప్పుడే వెళ్లగొట్టడమేంటని అతడిలో అగ్నిపర్వతం బద్ధలైంది. నాకు ఉన్న ఒకే ఒక్క అవకాశం బిగ్‌బాస్, మీరేమో ఎలిమినేట్ చేస్తున్నారంటూ ఫ్రస్టేట్ అయ్యాడు.అందరికీ నచ్చే వ్యూ..అయితే అనిల్ రావిపూడి అది ప్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు. దీంతో అతడిని పంపించేయమని సూచించిన కంటెస్టెంట్లు తనను కూల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మనోడు తగ్గేదేలే అన్నట్లుగా కోపాన్ని అలాగే కంటిన్యూ చేశాడు. ఇకపోతే బాత్రూమ్లో శేఖర్ బాషా.. అందరికీ నచ్చే వ్యూ.. ఐ లవ్యూ అనడంతో గలగలా మాట్లాడే బేబక్క సైతం అవాక్కయిపోయింది. రూల్స్ పెట్టడానికి నువ్వెవరు?తర్వాత కిచెన్ టీమ్‌లో ఉన్న ఆర్జీవీ బ్యూటీ సోనియా.. ఎవరికీ బాధ్యత లేదంటూ అందరిపైనా రంకెలేసింది. ఆరెంజ్‌తో గేమ్ ఆడినవారెవరూ ఆ పండ్లు తినడానికి వీల్లేదంటూ కొత్త చట్టాలు తీసుకొచ్చింది. దీంతో బాషాకు ఒళ్లు మండింది. రూల్స్ పెట్టడానికి నువ్వెవరు? అంటూ తనపై ఫైరయ్యాడు. తర్వాత కాసేపటికి కూలైపోయి మళ్లీ మామూలుగానే మాట్లాడుకున్నారు.బిగ్‌బాస్ ట్విస్ట్ ఈసారి కెప్టెన్‌కు బదులుగా ఇంటికి ముగ్గురు కంటెస్టెంట్లు చీఫ్లుగా ఉండనున్నారని బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. షో లాంచింగ్ రోజు పెట్టిన గేమ్స్‌లో గెలిచిన నిఖిల్, యష్మి, శేఖర్ బాషా, పృథ్వి, నైనిక, బేబక్క చీఫ్ పదవి కోసం పోటీపడనున్నట్లు ప్రకటించాడు. వీరికి.. పట్టుకుని ఉండండి- వదలకండి అనే టాస్క్ ఇచ్చాడు. మూడో చీఫ్‌గా..ఈ గేమ్‌లో ఎక్కువసేపు తాడును పట్టుకుని ఉన్న నిఖిల్ మొట్టమొదటి చీఫ్‌గా గెలిచాడు. రెండో గేమ్‌లో నైనిక గెలిచి రెండో చీఫ్‌గా నిలిచింది. యష్మి, బేబక్క, అఫ్రిది, బాషాలలో ఒకరిని మూడో చీఫ్‌గా సెలక్ట్ చేయండంటూ నిఖిల్, నైనికలకే నిర్ణయాన్ని వదిలేశాడు. అందరూ ఊహించినట్లుగానే నిఖిల్ తన ఫ్రెండ్ యష్మిని చీఫ్‌గా ఎంపిక చేశారు. గొడవకు దిగిన సోనియాఅఫ్రిదికి బదులు యష్మిని సెలక్ట్ చేయడంపై సోనియా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫ్రెండ్షిప్ను పక్కనపెట్టి నిజంగా అర్హులైనవారిని సెలక్ట్ చేయాలంటూ గొడవకు దిగింది. ఆల్రెడీ చీఫ్‌గా ప్రకటించాక మధ్యలో నీ గొడవేంటని సోనియామీద గరమైంది యష్మి. అలా ఈరోజు ఎపిసోడ్ వాడివేడిగానే ముగిసిపోయింది. నేటి గొడవలే రేపటి నామినేషన్‌కు దారి తీయనున్నాయి.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'బిగ్‌బాస్'లోకి వచ్చి రోజు కాలేదు.. అప్పుడే వాగ్వాదాలు
బిగ్‌బాస్ 8వ సీజన్ లాంచ్ అయిపోయింది. ఆదివారం ఎపిసోడ్లో 14 మంది, అది కూడా 7 జంటలుగా హౌసులోకి అడుగుపెట్టారు. వీళ్లలో తలో ఏడుగురు అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. హౌసులోకి వెళ్లేటప్పుడు నవ్వుతూ వెళ్లారు. కానీ రోజు కూడా పూర్తవలేదు. అప్పుడే గొడవలు షురూ అయిపోయాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: కోట్లు ఇచ్చినా 'బిగ్‌బాస్'లోకి వెళ్లనంది.. ఇప్పుడేమో విష్ణుప్రియ ఇలా)ఫ్రెషప్ అయిన తర్వాత నారింజ పండుతో కొందరు క్యాచ్ పట్టుకునే గేమ్ ఆడారు. దీన్నంతా దూరం నుంచి చూస్తూ వచ్చిన సోనియా ఆకుల.. ఇక ఉండబట్టలేక తినే ఫుడ్‌తో ఆటలేంటి అని ఫైర్ అయింది. ఈమె చెప్పడాన్ని తట్టుకోలేకపోయిన శేఖర్ భాషా.. గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. సోమవారం వీళ్లిద్దరి మధ్య గొడవనే కాస్త హైలైట్ అయ్యేలా ఉంది.మరోవైపు తొలిరోజు ఎలిమినేషన్ లాంటిది ఏం పెట్టకుండా బ్యాలెన్సింగ్ గేమ్ పెట్టాడు బిగ్ బాస్. 'పట్టుకునే ఉండండి' పేరుతో టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా తాళ్లు ఉంటాయి. వాటిపై ఉండాల్సి ఉంటుంది. బయట కూర్చున్న సభ్యులు.. ఒక్కో రంగు తాడుని కట్ చేస్తూ ఉంటారు. పైన ఉన్నవాళ్లు కింద కాళ్లు పెడితే ఔట్. మరి ఇందులో ఎవరు గెలిచారనేది రాత్రికి తెలుస్తుంది.(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8' లాంచ్ ఎపిసోడ్ హైలైట్స్.. 14 మంది హౌస్మేట్స్ వీళ్లే) -
Bigg Boss 8: నాలుగోవారం సోనియా ఎలిమినేట్
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి, లేదా తన సినిమాల్లో నటించిన బ్యూటీలకు క్రేజ్ వేరే లెవల్ ఉంటుంది. అలా వర్మ స్కూల్ నుంచి అరియానా గ్లోరీ, అషూ రెడ్డి, ఇనయ సుల్తానా గత బిగ్‌బాస్ షోలలో పాల్గొన్నారు. ఈసారి వర్మ మెచ్చిన హీరోయిన్ సోనియా ఆకుల బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈమె జార్జ్ రెడ్డి సినిమాలో జార్జ్ రెడ్డి చెల్లిగా నటించింది. వర్మ కరోనా వైరస్ మూవీలోనూ మెప్పించింది. దిశ ఎన్కౌంటర్ ఆధారంగా తెరకెక్కిన ఆశా ఎన్కౌంటర్లోనూ యాక్ట్ చేసింది. అంతేకాదు, దిశ అత్యాచార నిందితుడి భార్య రేణుకకు నెలకు రూ.15వేలు సాయం చేయడం విశేషం. సోనియా.. సొంత ఊరు పెద్దపల్లి జిల్లాలోని మంథని. కలెక్టర్ కావాలనుకుని యాక్టర్ అయింది. సమాజానికి తనవంతు సేవ చేయాలన్న కోరికతో ఆసా అనే సంస్థ ఏర్పాటు చేసింది. సేవలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్న ఈ బ్యూటీ బిగ్‌బాస్ 8లో రాణిస్తుందేమో చూడాలి!తను స్టేజీపైకి వెళ్లగానే ఆర్జీవీ వీడియో ప్లే చేశారు. అందులో వర్మ.. నువ్వు బిగ్‌బాస్‌కు వెళ్తున్నందుకు చాలా హ్యాపీ. మనసారా నీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. నువ్వు కచ్చితంగా గెలుస్తావని ఆశిస్తున్నాను. గెలిచొచ్చాక పార్టీ చేసుకుందాం అని తనకు బూస్ట్ ఇచ్చాడు. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ లా కనిపించిన సోనియా.. నాలుగోవారమే ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకొచ్చేసింది.