బిగ్ బాస్ 8: డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. కానీ అతడిపై వేటు? | Bigg Boss 8 Telugu 4th Week Elimination Details, This Contestant May In Danger Zone | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 4th Week Elimination: ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడా?

Published Wed, Sep 25 2024 12:48 PM | Last Updated on Wed, Sep 25 2024 12:59 PM

Bigg Boss 8 Telugu 4th Week Elimination Details

బిగ్‌బాస్ 8లో నాలుగో వారం వచ్చేసింది. ఈ వారానికి సంబంధించి నామినేషన్స్ పూర్తయ్యాయి. కొత్త చీఫ్‌ని కూడా ఎంపిక చేసేశారు. క్లాన్స్ (గ్రూపులు) కూడా డిసైడ్ అయిపోయాయి. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. బిగ్‍‌బాస్ ముద్దుబిడ్డ కోసం ఊహించని వ్యక్తిని ఇంటినుంచి పంపేస్తారనే టాక్ వినిపిస్తోంది.

హౌసులో ప్రస్తుతం 11 మంది ఉన్నారు. ఈసారి ప్రేరణ, మణికంఠ, పృథ్వీ, సోనియా, ఆదిత్య, నబీల్ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఓటింగ్‌లో నబీల్ టాప్‌లో కొనసాగుతున్నాడట. 35 శాతం మంది ఇతడు హౌసులో ఉండాలని కోరుకుంటున్నారు. ఇక తర్వాతి స్థానాల్లో నాగమణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం, సోనియా, పృథ్వీ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే డేంజర్ జోన్‌లో దోస్తులు సోనియా-పృథ్వీ ఉన్నారు.

(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా వల్ల నిఖిల్‌కి చెడ్డపేరు.. మొత్తం సీన్ ఛేంజ్)

ప్రస్తుతం నిఖిల్ చీఫ్‌గా ఉన్న క్లాన్‌లోనే పృథ్వీ-సోనియా ఉన్నారు. గొడవల పడటం దగ్గర నుంచి గేమ్స్ వరకు అన్నింటిలోనూ వీళ్లిద్దరూ మంచి పోటీ ఇస్తున్నారు. అలానే సోనియా ఎన్ని తప్పులు చేస్తున్నా సరే ఎపిసోడ్‌లో వాటిని చూపించట్లేదు. అంటే ఈమె హౌస్‌లో ఉండాలని బిగ్‌బాస్ గట్టిగానే ఫిక్సయినట్లున్నాడు. పృథ్వీని కూడా పంపిస్తాడా అంటే డౌటే.

ఇదంతా చూస్తుంటే ఈసారి ఆదిత్య ఓంపై వేటు పడుతుందా అనిపిస్తోంది. ఎందుకంటే అతడు హౌస్‌లో పెద్దగా యాక్టివ్‌గా కనిపించట్లేదు. మిగతా వాళ్లతో సరిగా ఇంకా కలవలేకపోతున్నాడు. మరి ఈ వారం బిగ్‌బాస్.. ఓటింగ్‌లో చివర్లో ఉన్న పృథ్వీ, సోనియాలలో ఒకర్ని ఎలిమినేట్ చేస్తాడా.. ఆదిత్యని బలి ఇచ్చేస్తారా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: Bigg Boss 8: సోనియా చీప్ బిహేవియర్.. బండారం బయటపెట్టిన యష్మి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement