Bigg Boss 8: సోనియా చీప్ బిహేవియర్.. బండారం బయటపెట్టిన యష్మి | Bigg Boss 8 Telugu Sep 25th Full Episode Review And Highlights: Words Of War Between Sonia And Yashmi Gowda, Deets Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu Day 23 Highlights: హర్ట్ బ్రేక్ చేశావ్.. నిఖిల్-సోనియా మధ్య చిచ్చు

Published Wed, Sep 25 2024 7:49 AM | Last Updated on Wed, Sep 25 2024 8:36 AM

Bigg Boss 8 Telugu Day 23 Episode Highlights Sonia Vs Yashmi

బిగ్‌బాస్ 8లో ఈసారి పృథ్వి, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్‌ నామినేషన్స్‌లో ఉన్నారు. సోమవారమే ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. కానీ యష్మి-సోనియా మధ్య జరిగిన గొడవ మాత్రం ఆ తర్వాత కూడా చాలాసేపు కొనసాగింది. మంగళవారం ఎపిసోడ్‌లోనూ ఈ రచ్చనే సగం ఎపిసోడ్‌లో చూపించారు. ఈ క్రమంలోనే సోనియా బండారాన్ని యష్మి బయటపెట్టగా.. నిఖిల్-సోనియా మధ్య మనస్పర్థలు వచ్చినట్లు అనిపించింది. ఇంతకీ బిగ్‌బాస్‌లో 23వ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం.

సోనియా బండారం
నామినేషన్స్‌లో సోనిమా తీసిన పాయింట్స్.. యష్మికి ఎక్కడలేని కోపాన్ని తీసుకొచ్చాయి. మరీ ముఖ్యంగా నిఖిల్-పృథ్వీలనే నువ్వు చూస్తుంటే నా గేమ్ నీకు ఎందుకు కనబడతుందని యష్మికి కౌంటర్‌గా సోనియా చెప్పింది. దీని వల్ల నామినేషన్స్ పూర్తయిన తర్వాత సోనియా-యష్మి గొడవపడుతూనే ఉన్నారు. 'నిఖిల్, పృథ్వీని వేరే ఉద్దేశంతో చూడలేదని, సోనియా చెప్పింది కరెక్ట్ అయితే మీరు మాట్లాడాలి' అని పృథ్వీతో చెప్పింది. సోనియా ఇంత లూజ్‌గా మాటలు వదులుతుంటే నేను వంద మాట్లాడతా.. కానీ నేను అంత చీప్‪‌గా దిగజారను అని సోనియా బండారాన్ని యష్మి బయటపెట్టింది.

(ఇదీ చదవండి: తగ్గిన 'దేవర' రన్ టైమ్.. ఇప్పుడు ఎంతంటే?)

యష్మి ఏడుపు
ఇంతలో సోనియా వచ్చి యష్మితో మరోసారి వాదన పెట్టుకుంది. వాడు (పృథ్వీ) ఎలా పట్టుకున్నాడు, ఎలా వదిలాడు అని అంత క్లియర్‌గా నువ్వు చెబుతుంటే.. ఎంత అబ్జర్వ్ చేశావో అదే నేను చెప్పా అని సోనియా ఏదో కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ యష్మి కోపం పట్టలేకపోయింది. ఎక్స్‌క్యూజ్‌ మీ.. గేమ్ పరంగా నేను చెప్పాను.. నీలా ఆలోచించలేదు.. నువ్వు మాత్రం దానికి ఒక రిలేషన్ తగిలించి.. చేయి చేయి పట్టుకొని మాట్లాడుతున్నావ్. మేము తప్పుగా మాట్లాడకూడదా.. అంటే ఎవరు హౌస్‌లో తప్పుగా ఆలోచిస్తున్నారో నువ్వు గుర్తుపెట్టుకో.. నువ్వు వాళ్లకి సిస్టర్ కాదు మదర్ కాదు.. నీ ఇష్టమచ్చినట్లు వాళ్లని వాడుకుంటున్నావని నాకు అనిపిస్తుంది.. ఈరోజు అది క్లియర్ అయింది అని యష్మి గుక్కపట్టి ఏడ్చింది.

నిఖిల్ ఓదార్పు
సోనియా పెట్టిన చిచ్చు వల్ల యష్మి చాలా బాధపడింది. ఇంట్లో ఏ అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడినా తను ఎక్కడ నోరు జారి ఏం అనేస్తుందోనని భయంతో మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది. అంటే ఇన్నాళ్లూ నీతో (నిఖిల్) మాట్లాడతుంటే ఎంత తప్పుగా అర్థం చేసుకుంది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది. నోటికొచ్చింది మాట్లాడుతుంది అని యష్మి ఏడ్చేసింది. దీంతో నిఖిల్ దగ్గరుకు తీసుకుని ఆమెని ఓదార్చాడు.

(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి)

హర్ట్ బ్రేక్ చేశావ్
ఈ గొడవంతా అయిపోయిన తర్వాత అర్థరాత్రి నిఖిల్-సోనియా డిస్కషన్ పెట్టారు. చేతిలో చేయి వేసి మరీ సోనియాకు నిఖిల్ సారీ చెప్పాడు. దీంతో ఈమె ఎమోషనల్ అయిపోయింది. ఫస్ట్ ఎవరితో మాట్లాడినావ్ అన్నది పాయింట్ కాదురా.. ఏం విన్నాము ఏం అర్థం చేసుకున్నాం అన్నది కదా అని అంది. అలానే ఫేక్ బతుకు బతుకున్నావ్ అని, వాళ్లని యూజ్ చేసుకుంటున్నావ్ అని యష్మి అందని.. అయితే ఇవన్నీ నువ్వు వినను కూడా వినలేదని.. కానీ ఎక్కడో ఆమె చెప్పిన పాయింట్స్ నీకు కరెక్ట్ అనిపిస్తోంది. నీ వరకు నువ్వు కరెక్ట్‌గానే ఉన్నప్పటికీ ఈరోజు నా మనసు విరిచేశావ్ అని నిఖిల్‍‌తో సోనియా అంది. ఇదంతా చూస్తుంటే వీళ్లిద్దరి దూరం పెరిగినట్లే అనిపిస్తోంది.

కొత్త చీఫ్‌గా సీత
ఇక రాత్రంతా సోనియా-యష్మి గొడవ జరగ్గా.. ఉదయం లేచేసరికి కొత్త చీఫ్ గురించి బిగ్‌బాస్ పోటీ పెట్టాడు. శక్తి క్లాన్‌కి ఇప్పటికే నిఖిల్ ఉండగా.. కాంతార క్లాన్ చీఫ్‌గా ఉన్న అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఎవరికి చీఫ్ అయ్యే అర్హత లేదే వాళ్ల బొమ్మ విరగ్గొట్టాలని, దీనికోసం బజర్ మోగినప్పుడు సుత్తిని పట్టుకుని.. దాన్ని మరో వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. ఈ ప్రొసెస్‌లో చివరగా సీత మిగిలింది. అలా కాంతార క్లాన్‌కి చీఫ్‌గా బాధ్యతలు అందుకుంది. అయితే ఏ క్లాన్‌లో ఎవరెవరు ఉండబోతున్నారనేది నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో తెలుస్తోంది. ఏదేమైనా మంగళవారం ఎపిసోడ్ దెబ్బకు సోనియా చీప్ బిహేవియర్ బయటపడింది. అలానే యష్మి మంరింత స్ట్రాంగ్ అయిపోయింది.

(ఇదీ చదవండి: 'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ))

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement