ఎన్టీఆర్ 'దేవర' టీమ్ ముందు జాగ్రత్తలు గట్టిగానే తీసుకుంటున్నారు. ప్రమోషనల్ కంటెంట్ పరంగా పక్కాగా వెళ్తున్నారు. ఇప్పుడు నిడివి విషయంలో పక్కా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి కాగా.. ఇప్పుడు మరోసారి పునరాలోచన చేశారు. అలా దాదాపు 7 నిమిషాల సీన్లు ట్రిమ్ చేశారు.
ఇంతకు ముందు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల నిడివితో సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇప్పుడు ఇందులో ఏడు నిమిషాల కట్ అంటే 2 గంటల 50 నిమిషాల రన్ టైమ్‌తో థియేటర్లలో ప్రదర్శితం కానుంది. వీటిలో యాడ్స్ అన్ని తీసేస్తే మూవీ నిడివి సరిగ్గా 2 గంటల 42 నిమిషాలు వస్తుంది.
(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు పెట్టిన యువతి)
ఈ మధ్య కాలంలో సినిమాలు రిలీజైన తర్వాత నిడివిపై ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ముందు అన్నీ పక్కాగా చూసుకుని 'దేవర' టీమ్ రన్ టైమ్ తగ్గించినట్లున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?
ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన 'దేవర'లో సైఫ్ అలీ ఖాన్ విలన్. అనిరుధ్ సంగీతమందించాడు. కొరటాల శివ దర్శకుడు. 'ఆర్ఆర్ఆర్' లాంటి సూపర్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఆలియా కూతురి విషయంలో నెరవేరిన ఎన్టీఆర్ కోరిక!)
Comments
Please login to add a commentAdd a comment