ఆలియా కూతురి విషయంలో నెరవేరిన ఎన్టీఆర్ కోరిక! | Alia Bhatt Reveals Ntr Named Her Daughter Raha | Sakshi
Sakshi News home page

Ntr: ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసిన ఆలియా భట్

Published Tue, Sep 24 2024 5:39 PM | Last Updated on Tue, Sep 24 2024 5:51 PM

Alia Bhatt Reveals Ntr Named Her Daughter Raha

ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. రీసెంట్‪‌గా అమెరికా వెళ్లాడు. అక్కడే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొనడంతో పాటు ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ కూడా చూస్తాడు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇంటర్వ్యూ ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఆలియా భట్ కూతురి గురించి తారక్ అనుకున్న ఓ విషయం బయటపడింది.

'దేవర'ని బాలీవుడ్‌లో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరణ్.. ఆలియా-ఎన్టీఆర్‌ని కలిపి ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో చాలా విషయాలు మాట్లాడుకున్నారు. అయితే ఆలియా చెప్పిన విషయం మాత్రం ఆసక్తికరంగా అనిపించింది.

(ఇదీ చదవండి: అత్యాచార కేసులో ప్రముఖ నటుడికి అరెస్ట్ వారెంట్)

'బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వస్తే.. రాత్రి మా ఇంట్లోనే డిన్నర్ చేయాలని తారక్ చెప్పాడు. దీంతో అతడి ఇంటికి వెళ్లాం. ఆ రోజు సాయంత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటికే నాకు 9వ నెల. దీంతో పుట్టబోయే బిడ్డకి పేరు ఏం పెట్టాలా అని డిస్కస్ చేసుకున్నాం. అ‍బ్బాయి పుడితే ఇది, అమ్మాయి పుడితే ఈ పేరు పెట్టాలని రణ్‌బీర్ చెప్పాడు' అని ఆలియా అప్పటి విషయాన్ని గుర్తుచేసుకోగా.. తారక్ మాట్లాడుతూ.. 'రాహ పేరు పెట్టాలని నేను కోరుకున్నా. అది కాస్త నిజమైంది' అని నవ్వేశాడు.

అంటే ఆలియా భట్ కూతురికి పేరు పెట్టే విషయంలో ఎన్టీఆర్ కోరిక నెరవేరిందనమాట. ఇదలా ఉండితే 'దేవర'.. ఈ శుక్రవారం (సెప్టెంబరు 27న) థియేటర్లలోకి రాబోతుంది. ఇ‍ప్పటికే టికెట్ బుకింగ్స్ తెరవగా.. పెట్టిన నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ తొలిరోజు వసూళ్లలో రికార్డులు బద్దలు కొట్టడం గ్యారంటీ అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: 'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ))

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement