మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ సినిమా పరిశ్రమలో మహిళలపై ఎలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయో ఈ కమిటీ బయటపెట్టింది. ఇందులో ప్రముఖ హీరోలు, నటులు, దర్శకులు ఇరుక్కున్నారు. ప్రముఖ నటుడు సిద్ధిఖీపైన కూడా ఓ మహిళ అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ కేసులోనే సదరు నటుడికి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పటికే ముందస్తు బెయిల్ కోసం సిద్ధిఖీ ప్రయత్నించగా.. దాన్ని కోర్టు తిరస్కరించింది.
(ఇదీ చదవండి: కాపీ కొట్టారంటూ డైరెక్టర్ శంకర్ కామెంట్.. 'దేవర' గురించేనా..?)
కేసు ఏంటి?
మాజీ నటి ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం.. ఓ తమిళ సినిమాలో అవకాశమిస్తానని సిద్ధిఖీ చెప్పాడు. అందుకోసం లైంగిక అవసరాలు తీర్చమన్నాడు. కుదరదనే సరికి బలవంతంగా ఓ హోటల్‌లో అత్యాచారం చేశాడు. 2016లో తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ ఘటన గురించి గతంలో ఇదే నటి మాట్లాడుతూ.. తనతో సిద్ధిఖీ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.
ఇప్పుడే ఎందుకు?
తాజాగా హేమ కమిటీ రిపోర్ట్ రిలీజ్ చేయడంతో పలువురు నటీమణులు తమపై జరిగిన అఘాయిత్యాలని బయటపెడుతున్నారు. అలా సదరు నటి.. నటుడు సిద్ధిఖీపై పోలీస్ కేసు పెట్టింది. ఈ క్రమంలోనే విచారించిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కానీ సిద్ధిఖీ ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకునే పనిలో ఉన్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)
Comments
Please login to add a commentAdd a comment