కాపీ కొట్టారంటూ డైరెక్టర్‌ శంకర్‌ కామెంట్‌.. 'దేవర' గురించేనా..? | Director Shankar Comments On Devara Or Kanguva Movie Over Use Of Content From Tamil Novel Vel Paari, Deets Inside | Sakshi
Sakshi News home page

కాపీ కొట్టారంటూ డైరెక్టర్‌ శంకర్‌ కామెంట్‌.. 'దేవర' గురించేనా..?

Published Tue, Sep 24 2024 6:47 AM | Last Updated on Tue, Sep 24 2024 9:07 AM

Director Sankar This Coments On Devara Movie

సినిమా పరిశ్రమలో కథలను, సన్నివేశాలను కాపీ కొట్టడం అనేది నేడు సాధారణ విషయంగా మారింది. ఇలాంటి విషయాలపై ఇంతకు ముందు చాలా ఫిర్యాదులు వచ్చాయి కూడా. తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఇలాంటి హెచ్చరికలనే చేశారు. భారీ బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్‌గా పేరు తెచ్చుకున్న శంకర్‌ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్‌– 2 చిత్రం నిరాశపరిచింది. దీంతో ఆయన చాలా ట్రోలింగ్స్‌ను ఎదుర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో తెరపైకి రానుందని సమాచారం. 

ఈ చిత్రం తరువాత రచయిత ఎస్‌.వెంకటేశన్‌ రాసిన వేల్పారి అనే నవలను తెరకెక్కించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నవల హక్కులను శంకర్‌ అధికారికంగా పొందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నవలలోని ముఖ్య విషయాలు వేరే చిత్రాల్లో చోటు చేసుకోవడంతో దర్శకుడు శంకర్‌ షాక్‌కు గురయ్యారు. 

దీనిపై స్పందించిన ఆయన తన ఎక్స్‌ మీడియాలో పేర్కొంటూ ఎస్‌.వెంకటేశన్‌ రాసిని ప్రాచుర్యం పొందిన వేల్పారి నవలను సినిమాగా తెరకెక్కించడానికి తాను హక్కులు పొందినట్లు చెప్పారు. అయితే ఈ నవలలోని ముఖ్య అంశాలు అనుమతి లేకుండా కొన్ని చిత్రాల్లో వాడడం బాధగా ఉందన్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఓ చిత్రం ట్రైలర్‌లో వేల్పారి నవలలోని కొన్ని సన్నివేశాలు అక్రమంగా వాడటం చూసి షాక్‌ అయ్యానన్నారు. 

దయచేసి ఈ నవలలోని సన్నివేశాలను ఏ చిత్రాల్లో గానీ, వెబ్‌ సిరీస్‌లోగానీ ఉపయోగించరాదన్నారు. దర్శకుల హక్కులను గౌరవించాలని అన్నారు. అనుమతి లేకుండా నవలలోని సన్నివేశాలను చిత్రీకరించరాదన్నారు. అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని దర్శకుడు శంకర్‌ హెచ్చరించారు. ఇంతరీ వేల్పారి నవలలోని సన్నివేశాలను ఏ చిత్రంలో వాడారో అన్న విషయాన్ని మాత్రం శంకర్‌ వెల్లడించలేదు. 

దేవర గురించే కామెంట్‌..?
దేవర సినిమా గురించే శంకర్‌ కామెంట్‌ చేశారని నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈమేరకు తమిళ మీడియాలో కథనాలు కూడా రావడం జరిగింది. దేవర ట్రైలర్‌ వచ్చిన తర్వాతనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దేవరలో తారక్‌ నటించడం వల్లే ఆయన డైరెక్ట్‌గా సినిమా పేరు చెప్పడం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. కాపీ కొట్టారనేది నిజమే అయితే లీగల్‌ యాక్షన్‌ కూడా తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. దేవర విడుదల తర్వాత ఏమైనా రియాక్ట్‌ అవుతారేమో చూడాల్సి ఉంది. అయితే, వేల్పారి నవలను ఆధారం చేసుకుని శంకర్‌ ఒక సినిమా తెరకెక్కించడం అనే విషయం మాత్రం కన్ఫామ్‌ అయ్యిందన్నమాట.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement