Koratala shiva
-
త్రివిక్రమ్ ని పక్కన పెట్టి.. కొరటాలకు లైన్ క్లియర్ చేసిన ఐకాన్?
-
'దేవర'కు 50 రోజులు... ఎన్ని కేంద్రాల్లో అంటే..?
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఆఫ్ సెంచరీ కొట్టేసింది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా పది రోజులు థియేటర్స్‌లో రన్ కావడమే గొప్ప విషయమని చెప్పవచ్చు. ఒక సినిమా హిట్ అయిందని చెప్పుకునేందుకు కలెక్షన్స్ కొలమానం అని చెప్పుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక సినిమా 100రోజులు, 50 రోజులు ఆడిందనే మాట వినిపించడమే లేదు. అయితే, దేవర ఆ లోటును పూర్తి చేసింది.దేవర సినిమా 52 కేంద్రాల్లో 50 రోజుల పాటు ఆడిందని మేకర్స్ ఒక పోస్టర్ విడుదల చేశారు. చాలారోజుల తర్వాత ఇలా సెంటర్స్ లిస్ట్ చూడటం జరిగిందని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. నవంబర్ 15న దేవర 50 రోజుల వేడుక చేసుకుంటున్నాడు. దీంతో నేడు థియేటర్స్ అన్నీ మళ్లీ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. అయితే, దేవర సినిమా ఇప్పటికే ఓటీటీలో విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. దేవర పార్ట్2 కూడా ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. -
ఓటీటీలో 'దేవర'.. అధికారిక ప్రకటన వచ్చేసింది
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఓటీటీ విడుదల విషయంలో అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తారక్ సింగిల్‌గా నటించిన చిత్రాల్లో దేవరనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీతో జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు.దేవర ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్ శుభవార్త చెప్పింది. నవంబర్ 8న తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా తెలిపింది. అయితే, హిందీ వర్షన్ మాత్రం నవంబర్ 22న ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచింది.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ. -
'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?
'దేవర' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. బ్లాక్‌బస్టర్ అనడం లేదు. అలా అని తీసిపారేయదగ్గ మూవీ అయితే కాదు. ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ బీజీఎం టమెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే సగటు ప్రేక్షకుడు ఎంటర్టైన్ అయితే అవుతాడు. అయితే చివర్లో వచ్చే ట్విస్ట్ 'బాహుబలి'ని గుర్తు చేస్తుందని చాలామంది అంటున్నారు. మూవీలోని సీన్లు కూడా గతంలో వచ్చిన పలు చిత్రాల్లోని సన్నివేశాలని పోలినట్లు ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)ఏదేమైనా 'దేవర' సినిమా చూడగానే స్టోరీ అంతా ఇప్పుడు చెప్పేశారు. ఇక సీక్వెల్ కోసం ఏం దాచి ఉంచారా అనే సందేహం వస్తుంది. సరిగా గమనిస్తే బోలెడన్ని ప్రశ్నలు వస్తాయి. ఒకటి రెండు కాదు దాదాపు అరడజను ప్రశ్నలు ఉండనే ఉంటాయి. ఇంతకీ అవేంటి? సీక్వెల్ స్టోరీ ఏమై ఉండొచ్చు. ఈ సినిమాని చూసి ఉంటేనే దిగువన పాయింట్స్ చదవండి. లేదంటే మళ్లీ ట్విస్టులన్నీ చెప్పేశామని అంటారు.'దేవర' చూసిన తర్వాత సందేహాలుసినిమా ప్రారంభంలో ప్రభుత్వ పెద్దలు చెప్పే యతి, దయ ఎవరు?ఎర్రసముద్రం వాళ్లతో స్మగ్లింగ్ చేయించుకున్న మురుగన్ ఎలా చనిపోయాడు?మురుగన్‌తో పాటు ఉండే డీఎస్పీ తులసికి ముఖం, ఒంటిపై దెబ్బలు ఎలా తగిలాయి?నీటి లోపలున్న అస్థి పంజరాలు ఎవరివి?అంత మత్తులో ఉన్నాసరే తనని చంపడానికి వచ్చిన వాళ్లని అందరినీ 'దేవర' మట్టుబెడతాడు. అలాంటి 'దేవర'ని చంపింది ఎవరు? ఎందుకు చంపాల్సి వచ్చింది? 'దేవర' ఊరు వదలి వెళ్లిపోయాడని ఇంటర్వెల్లో చెబుతారు. అప్పటికే చనిపోయి ఉంటాడు. ఇక సెకండాఫ్‌లో సముద్రంలోకి వెళ్లిన భైర మనుషులు చనిపోతారు. అప్పటికీ వర ఇంకా చిన్న పిల్లాడే. మరి ఇక్కడ భైర మనుషుల్ని చంపింది ఎవరు?'దేవర' స్టోరీ అంతా చెప్పిన ప్రకాశ్ రాజ్ ఎవరు? ఇంతకీ ప్రకాశ్ రాజ్ చెప్పిన స్టోరీ అంతా నిజమేనా?జాన్వీని వర పెళ్లి చేసుకుంటాడా? సీక్వెల్ లో ఆమె పాత్ర తీరు ఇంతేనా?పైన చెప్పిన ప్రశ్నలన్నింటికి సమాధానాలనే రెండో పార్ట్‌లో స్టోరీగా చూపిస్తారేమో అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ లైనప్ చూస్తే ప్రస్తుతం 'వార్-2', ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత 'దేవర 2' ఉంటుందా? లేదంటే వీటితో సమాంతరంగా ఏమైనా చేస్తాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'దేవర' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత ఇచ్చారు?) -
దేవరకు ఎన్ని సీక్వెల్స్ వస్తాయి...
-
కాపీ కొట్టారంటూ డైరెక్టర్ శంకర్ కామెంట్.. 'దేవర' గురించేనా..?
సినిమా పరిశ్రమలో కథలను, సన్నివేశాలను కాపీ కొట్టడం అనేది నేడు సాధారణ విషయంగా మారింది. ఇలాంటి విషయాలపై ఇంతకు ముందు చాలా ఫిర్యాదులు వచ్చాయి కూడా. తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఇలాంటి హెచ్చరికలనే చేశారు. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్‌గా పేరు తెచ్చుకున్న శంకర్ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్– 2 చిత్రం నిరాశపరిచింది. దీంతో ఆయన చాలా ట్రోలింగ్స్‌ను ఎదుర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రం 'గేమ్ ఛేంజర్'. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో తెరపైకి రానుందని సమాచారం. ఈ చిత్రం తరువాత రచయిత ఎస్.వెంకటేశన్ రాసిన వేల్పారి అనే నవలను తెరకెక్కించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నవల హక్కులను శంకర్ అధికారికంగా పొందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నవలలోని ముఖ్య విషయాలు వేరే చిత్రాల్లో చోటు చేసుకోవడంతో దర్శకుడు శంకర్ షాక్‌కు గురయ్యారు. దీనిపై స్పందించిన ఆయన తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ ఎస్.వెంకటేశన్ రాసిని ప్రాచుర్యం పొందిన వేల్పారి నవలను సినిమాగా తెరకెక్కించడానికి తాను హక్కులు పొందినట్లు చెప్పారు. అయితే ఈ నవలలోని ముఖ్య అంశాలు అనుమతి లేకుండా కొన్ని చిత్రాల్లో వాడడం బాధగా ఉందన్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఓ చిత్రం ట్రైలర్లో వేల్పారి నవలలోని కొన్ని సన్నివేశాలు అక్రమంగా వాడటం చూసి షాక్ అయ్యానన్నారు. దయచేసి ఈ నవలలోని సన్నివేశాలను ఏ చిత్రాల్లో గానీ, వెబ్ సిరీస్లోగానీ ఉపయోగించరాదన్నారు. దర్శకుల హక్కులను గౌరవించాలని అన్నారు. అనుమతి లేకుండా నవలలోని సన్నివేశాలను చిత్రీకరించరాదన్నారు. అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని దర్శకుడు శంకర్ హెచ్చరించారు. ఇంతరీ వేల్పారి నవలలోని సన్నివేశాలను ఏ చిత్రంలో వాడారో అన్న విషయాన్ని మాత్రం శంకర్ వెల్లడించలేదు. దేవర గురించే కామెంట్..?దేవర సినిమా గురించే శంకర్ కామెంట్ చేశారని నెట్టింట వైరల్ అవుతుంది. ఈమేరకు తమిళ మీడియాలో కథనాలు కూడా రావడం జరిగింది. దేవర ట్రైలర్ వచ్చిన తర్వాతనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దేవరలో తారక్ నటించడం వల్లే ఆయన డైరెక్ట్‌గా సినిమా పేరు చెప్పడం లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. కాపీ కొట్టారనేది నిజమే అయితే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. దేవర విడుదల తర్వాత ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది. అయితే, వేల్పారి నవలను ఆధారం చేసుకుని శంకర్ ఒక సినిమా తెరకెక్కించడం అనే విషయం మాత్రం కన్ఫామ్ అయ్యిందన్నమాట. -
తెలంగాణలో 'దేవర'కు అదనపు షోలకు అనుమతి.. టికెట్ ధరలు ఇలా
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'దేవర'. సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.తెలంగాణలో టికెట్ ధరలు ఇలాదేవర సినిమాకు అదనపు షోలు ప్రదర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 27న అర్ధరాత్రి 1గంట షో కోసం 29 థియేటర్స్‌కు అవకాశం ఇస్తున్నట్లు తాజాగా జీఓ విడుదల చేసింది. అయితే, టికెట్ ధర విషయంలో రూ. 100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అదే రోజు ఉదయం 4 గంటల ఆటతో పాటు మొత్తం 6 షోల వరకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ అన్నీ థియేటర్స్ కూడా ఆ ఒక్కరోజు టికెట్ ధర రూ. 100 పెంచుకునేందుకు అవకాశం ఉంది. అయితే, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు మాత్రం రోజుకు 5 షోల వరకు మాత్రమే అనుమతి ఉంది. ఈ తొమ్మిది రోజులకు టికెట్ ధరల్లో మార్పులు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయితే టికెట్‌పై రూ. 25, మల్టీఫ్లెక్స్ అయితే రూ. 50 మాత్రమే పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. దేవర విడుదల రోజు సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ. 295 ఉంటే మల్టీఫ్లెక్స్‌లో మాత్రం రూ. 413 ఉంటుంది.ఏపీలో టికెట్ ధరలు ఇలా'దేవర' విడుదల రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు ఏపీ అనుమతిచ్చింది. ఆ తర్వాత రోజు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇలా 9రోజుల వరకు అదనపు షోలు ఉండనున్నాయి. ఇదే క్రమంలో దేవర టికెట్ల ధరలను సైతం పెంచుకునే అవకాశం ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ మొదటి తరగతి టికెట్స్‌కు రూ. 110, దిగువ తరగతి రూ.60 వరకు పెంచింది. మల్టీప్లెక్స్‌లలో అయితే రూ. 135 చొప్పున పెంచింది. జీఎస్టీతో కలుపుకొనే ఈ ధరలు ఉండనున్నాయి. అంటే ఈ లెక్కన సింగిల్ స్క్రీన్‌లో దేవర టికెట్ ధర రూ. 225 ఉంటే మల్టీప్లెక్స్‌లలో మాత్రం రూ.320 ఉండనుంది. ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్ 27 నుంచి 14 రోజుల పాటు ఉండనున్నాయి. #Devara Nizam 1 AM Shows permitted screens. Total 29 properties 👌👍 pic.twitter.com/gFGaXqDtbP— Vinay Gudapati (@gudapativinay) September 23, 2024 -
'దేవర'ఈవెంట్ రద్దుకు కారణం ఇదే.. ఆర్గనైజర్ల వివరణ
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో జూ ఎన్టీఆర్ అభిమానులు చాలా నిరుత్సాహం చెందారు. దీనంతటికి కారణం ఈవెంట్‌ను నిర్వహించిన శ్రేయాస్ సంస్థ అంటూ నిర్వాహకులపై ఫ్యాన్స్ మండిపడ్డారు. దీంతో తాజాగా తారక్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ అధికారికంగా ఆ ఆర్గనైజేషన్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.'దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చోటు చేసుకున్న దురదృష్టకర పరిస్థితి వల్ల మేము చింతిస్తున్నాం. ఎన్టీఆర్ పట్ల మీ అందరికీ ఉన్న అపారమైన అభిమానం, ప్రేమను మేము అర్థం చేసుకున్నాం. ఈవెంట్ రద్దు కావడంతో మీలో చాలామంది ఎంత నిరుత్సాహానికి లోనయ్యారు. దానిని తెలుసుకుని బరువెక్కిన హృదయంతో ఈ నోట్‌ని విడుదల చేస్తున్నాం. దయచేసి అక్కడి పరిస్థితిని అర్థం చేసుకుని , మీకు జరిగిన అసౌకర్యానికి మా నుంచి క్షమాపణలు కోరుతున్నాం. వాస్తవంగా తారక్ అభిమానులను దృష్టిలోపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించాలని అనుకున్నాం. అందుకు తగ్గట్లు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించాం. అనుమతి కోసం చాలా ప్రయత్నంచాం. కానీ, వినాయక చవితి వేడుకలు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో నోవాటెల్‌ను ఎంపిక చేయాల్సి వచ్చింది.వాస్తవంగా మేము 5500 మంది వ్యక్తులకు సరిపడేలా నోవాటెల్‌లో హాల్ 3 నుంచి హాల్ 6 వరకు బుక్ చేశాం. 4వేల మందికి మాత్రమే ఎంట్రీ ఉండేలా పోలీసుల నుంచి అనుమతి పొందాం. ఆమేరకు మాత్రమే పాస్‌లను ముద్రించాం. అంతకు మించి అదనపు పాస్‌లు మేము ఇవ్వలేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, 30వేలకు పైగానే అభిమానులు వచ్చారు. మేం అంచనా వేసినదానికంటే పెద్ద ఎత్తున రావడంతో గందరగోళం నెలకొంది. దీంతో అక్కడి గేట్లన్నీ కిక్కిరిసిపోయాయి. కొందరు తప్పని పరిస్థితిలో బారికేడ్లు పగలగొట్టడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆ సమయంలో పరిస్థితి కంట్రోల్ తప్పింది. దీంతో ఈవెంట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. గతంలో మా ఆర్గనైజేషన్ ద్వారా సుమారు 2 లక్షల మందికి పైగా ప్రజలతో కూడా భారీ ఈవెంట్లను విజయవంతంగా చేశాం. ఈ క్రమంలోనే దేవర ఈవెంట్‌ను కూడా మరింత సక్సెస్ చేయాలని 100కు పైగా యూట్యాబ్ చానల్స్‌లో లైవ్ కూడా ఏర్పాటుచేశాం.ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సినిమా సింగిల్‌గా వస్తుండటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. తారక్ మీద ప్రేమతో చాలా దూరప్రాంతాల నుంచి వచ్చారు. అయితే, మీ అందరినీ చాలా నిరుత్సా నిరుత్సాహపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నాం. ఎన్టీఆర్‌పై మీ ప్రేమ చాలా గొప్పది. అందుకే ఆయన కోసం ఇంతలా తరలి వచ్చారు. తారక్‌పై మీ ప్రేమ, బలం ఎంతటిదో నిన్న రాత్రి ప్రపంచానికి చాటి చెప్పారు. కానీ, మికు అసౌకర్యం కల్పించినందుకు చింతిస్తున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. ఎప్పటికీ మీ సపోర్ట్ మాపై ఉంటుందని ఆశిస్తున్నాం.' అని శ్రేయాస్ మీడియా లేఖ విడుదల చేసింది.దేవర ఈవెంట్ రద్దు అయిన తర్వాత జూ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ఒక వీడియో ద్వారా అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న దేవర విడుదల కానుంది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. -
'దేవర' కోసం జాన్వీ ఇలా ముస్తాబు.. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు (ఫొటోలు)
-
Devara Pre Release Event: 'దేవర' అభిమానులపై పోలీసుల లాఠీ ఛార్జ్
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం దేవర. సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమంలో దేవర ఫ్యాన్స్ మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. నేడు సెప్టెంబర్ 22న హైదరాబాద్ హైటెక్స్‌లోని నోవాటెల్‌లో దేవర ప్రీరిలీజ్ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. అయితే, అక్కడ కేవలం 5వేల మందికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. కానీ, సుమారు 15 వేలకు మంది పైగానే అభిమానులు చొచ్చుకుని వచ్చారు.ఇదీ చదవండి: 'దేవర' రెండో ట్రైలర్ విడుదలదేవర ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని ముందే అంచనా వేశారు. అందువల్ల ఎలాంటి ప్రచారం లేకుండా కేవలం తారక్ అభిమానుల కోసం 5వేలు పాస్‌లు మాత్రమే జారీ చేశారు. కానీ, ప్రీరిలీజ్ కార్యక్రమం ప్రారంభానికి గంట ముందు నుంచే సుమారు 15వేలకు పైగానే ఫ్యాన్స్ వచ్చారు. వారందరూ ఒక్కసారిగా హైదరాబాద్ హైటెక్స్ నోవాటెల్ లోపలికి రావడంతో అక్కడి ఫర్నీచర్ కూడా ధ్వంసం అయింది. ఇదీ చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్ చిరంజీవికి చోటునోవాటెల్ యాజమాన్యానికి సుమారుగా రూ. 11 లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈవెంట్ పాస్‌లు లేని వారు కూడా భారీ సంఖ్యలో లోపలికి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేయడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే దేవర అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.Police boss warning ichhi vellaru ippatlo start ayyela ledu #Devara@tarak9999#Devaraprereleaseevent pic.twitter.com/oFqC2Wi5na— మాచర్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ (పల్నాడు జిల్లా) (@ntrkaadda) September 22, 2024To any other hero this is a night mare.But, for #ManOfMassesNTR this is sample.దీన్ని మించిన ప్రీరిలీజ్ ఈవెంట్ గాథరింగ్ ఉంటే లైఫ్ టైం సెటిల్మెంట్ #దేవర #Devara #DevaraJatharaaBegins pic.twitter.com/HoKgGaB2om— B1_Viking (@B1Viking) September 22, 2024 -
'దేవర' రెండో ట్రైలర్ విడుదల
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' నుంచి రెండో ట్రైలర్ విడుదలైంది. కొరటాల శివ డైరెక్షన్లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అశలు ఉన్నాయి. నేడు సెప్టెంబర్ 22న దేవర ప్రీ రిలీజ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ పాల్గొననున్నారు.'దేవర' రిలీజ్ ట్రైలర్‌ను ఆదివారం ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రైలర్ విడుదల సమయంలో మార్పులు చేశారు. మధ్యాహ్నం 2:07 నిమిషాలకు దేవర రెండో ట్రైలర్ విడుదల చేశారు. తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో అందుబాటులో ఉంది.దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. -
వాణిజ్య రాజధాని ముంబైలో 'దేవర'.. ప్రమోషన్స్‌లో బిగ్ ప్లాన్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రం రిలీజ్ దగ్గరపడుతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే ముంబై వేదికగా ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివ పాల్గొన్నారు. పాన్ ఇండియా రేంజ్లో ట్రైలర్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. ఓవర్సీస్లో కూడా దేవర క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.ఇదీ చదవండి: భయంతోనే అలా చేయాల్సి వచ్చింది.. నన్ను క్షమించండి: రవీనా టాండన్దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై నగరంలోని దాదర్ చౌపత్తి బీచ్ వద్ద ఎన్టీఆర్ కటౌట్స్ వెలిశాయి. ఆయన అభిమానులు వినూత్న రీతిలో వాటిని సముద్రంలో ఏర్పాటు చేశారు. దీంతో నెట్టింట అవి వైరల్ అవుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణేశ్ నిమజ్జనం దాదర్ చౌపత్తి బీచ్ వద్దే జరుగుతుంది. దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ పాల్గొంటారు. నిమజ్జనం రోజున సుమారు 10 లక్షల మంది అక్కడి బీచ్‌కు చేరుకుంటారని అంచనా ఉంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అదే బీచ్‌లో భారీగా దేవర పోస్టర్స్‌ను ఏర్పాటు చేశారు. సినిమాకు ఈ అంశం భారీగా కలిసొస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్లో దేవరను కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారు.సెప్టెంబర్ 27వ తేదీన దేవర విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి అయింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ సెన్సార్ బోర్డు ఇచ్చింది. ఈ చిత్రం 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల (సుమారు 178 నిమిషాలు) రన్టైమ్తో రానుంది. అంటే దాదాపు మూడు గంటల నిడివి ఉండనుంది. దేవరలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో పవర్ఫుల్ విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించగా శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, కలైయారాసన్, శృతి మరాఠే కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.#Devara cutout is standing tall in the sea at Dadar Chowpatty in Mumbai ❤️#DevaraOnSep27th pic.twitter.com/fI0oKTlcap— NTR Arts (@NTRArtsOfficial) September 14, 2024 -
'దేవర' రన్ టైమ్.. ఎన్టీఆర్‌కు గిఫ్ట్ ఇచ్చిన రవి బస్రూర్
ఎన్టీఆర్ (NTR)పై అభిమానాన్ని చాటుకున్నారు సంగీత దర్శకుడు రవి బస్రూర్ (Ravi Basrur). ‘వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం’ అంటూ ఎన్టీఆర్‌పై ప్రత్యేక పాటను రూపొందించారు. కుటుంబంతో కలిసి ఎన్టీఆర్ ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. నటుడు రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి రవి బస్రూర్ స్టూడియోను సందర్శించారు. తన స్టూడియోకు ఎన్టీఆర్ వెళ్లడంపై ఆనందం వ్యక్తం చేసిన రవి తనదైన శైలి సాంగ్‌ను కానుకగా ఇచ్చారు. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్- రవి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. 'వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం' అంటూ సాగే పాట అభిమానులను ఆకట్టుకుంది. అలా తారక్‌పై తనకున్న అభిమానాన్ని రవి బస్రూర్ చాటుకున్నాడు. ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో సోనియా ఏడుపు.. హగ్గులతో ఓదార్పు ఎన్టీఆర్-నీల్ సినిమాకు రవి బస్రూర్ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా రవి బస్రూర్ అని తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా.. పాన్ ఇండియా రేంజ్లో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.దేవర రన్‌టైమ్'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో విడుదల కానున్న సినిమా దేవర. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌కు భారీగా రెస్పాన్స్ వస్తుంది. సప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దేవర సెన్సార్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. దేవర్ రన్‌టైమ్ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లుగా ఉంది. -
Devara Trailer: 'దేవర' ట్రైలర్ వచ్చేసింది
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' ట్రైలర్ విడుదలైంది. కొరటాల శివ డైరెక్షన్లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అశలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓవర్సీస్లో భారీగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటికే అక్కడ సుమారు 11 లక్షలకు పైగా టికెట్ల విక్రయం జరిగింది.దేవర విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ముంబైలో ప్రమోషన్స్ కార్యక్రమాన్ని మేకర్స్ ప్రారంభించారు. బాలీవుడ్ వేదికగా దేవర ట్రైలర్‌ను తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో విడుదల చేశారు. ట్రైలర్లో ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. బ్లాక్ షేడ్‌లో కనిపించే విజువల్స్‌తో పాటు సముద్ర తీరంలో జరిగే పోరాట సన్నివేశాలు కేక పుట్టించేలా ఉన్నాయి.దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. -
ఏకైక ఇండియన్ సినిమాగా 'దేవర' రికార్డ్
సముద్ర తీరంలో కెరటంలా సోషల్‌మీడియాలో 'దేవర' విరుచుకుపడుతుంది. కొద్దిరోజులుగా ఈపేరు ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ అభిమానులతో పాటు నెటిజన్లను కూడా మెప్పిస్తున్నాయి. జూ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఓవర్సీస్ నుంచి దేవరకు మంచి ఆదరణ లభిస్తుంది. అక్కడ ఇప్పటికే ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. టికెట్స్ అన్నీ కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయి రికార్డ్ కొట్టింది.దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. అయితే, ఓవర్సీస్లో ఇప్పటికే టికెట్స్ సేల్ ప్రారంభమైంది. సినిమా రిలీజ్ కావడానికి ముందే అక్కడ వన్ మిలియన్ (పది లక్షలు) 'దేవర' టికెట్స్ సేల్ అయ్యాయి. నార్త్ అమెరికన్ బాక్సాఫీస్‌లో టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ మార్క్‌ను వేగంగా అందుకున్న సినిమాగా 'దేవర' రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా అక్కడ ఈ రికార్డ్ అందుకోలేదు. దీంతో మొదటి భారతీయ చిత్రంగా 'దేవర' రికార్డు నెలకొల్పింది. కేవలం తారక్ మాత్రమే దానిని నెలకొల్పాడంటూ ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. కనీసం ట్రైలర్ కూడా విడుదల కాకుండానే ఇలా భారీ రికార్డ్స్ కొట్టేస్తే.. సెప్టెంబర్ 10న సాయింత్రం ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇంకెన్ని లెక్కలు మారిపోతాయో అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10 సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ కానుంది. ముంబైలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఎన్టీఆర్, కొరటాల శివ ఇప్పటికే ముంబై చేరుకున్నారు. తెలుగు, తమిళ్,కన్నడ,మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. -
ముంబైలో దిగిన 'దేవర'
జూ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబో నుంచి వస్తున్న సినిమా దేవర. సెప్టెంబర్ 27న తెలుగుతోపాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అయితే, దేవర ట్రైలర్ సెప్టెంబర్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలో ముంబైలో అడుగుపెట్టాడు తారక్. ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావటంతో దేవరపై పాన్ ఇండియా రేంజ్లో భారీగా క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలోనే మేకర్స్ కూడా ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభించారు. బాలీవుడ్ నుంచే దేవర సినిమా ప్రమోషన్లను తారక్ ప్రారంభిస్తున్నాడు. ఇప్పటికే ముంబై చేరుకున్న ఆయన సెప్టెంబర్ 10న ట్రైలర్ కార్యక్రంలో పాల్గొననున్నారు. ఇదే ఈవెంట్లో హిందీ మీడియాతో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది.ధర్మతో దేవర'దేవర' నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్‌కి చెందిన ఈ నిర్మాణ సంస్థ మొదట 'బాహుబలి' సినిమాను బాలీవుడ్ పబ్లిక్‌లోకి బాగా తీసుకెళ్లింది. ఇప్పుడు ‘దేవర’ చిత్రాన్ని నార్త్ బెల్ట్‌లో విడుదల చేసేందుకు భారీ ధరకు రైట్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాలీవుడ్లో దేవర వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్స్, ప్రమోషన్స్ అన్నీ ఈ సంస్థ పక్కాగా ప్లాన్ చేస్తుంది. ఒక సినిమాను కరణ్ జోహార్ అండ్ టీమ్ ఎలా పబ్లిక్‌లోకి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న దేవర ట్రైలర్ కోసం ఫ్యాన్స్‌తో పాటు బాలీవుడ్ కూడా ఎదురుచూస్తుంది. -
'దేవర' ట్రైలర్ విడుదలపై జూ ఎన్టీఆర్ ప్రకటన
జూ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబో నుంచి వస్తున్న సినిమా దేవర. వినాయకచవితి సందర్భంగా ట్రైలర్ విడుదల తేదీని తారక్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 27న తెలుగుతోపాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. అయితే, దేవర ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అని సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతున్న సమయంలో తారక్ గుడ్‌న్యూస్ చెప్పారు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సిస్లోనూ భారీ ఎత్తున రిలీజ్ కానున్న దేవర ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 10న దేవర ట్రైలర్ చేస్తున్నట్లు తారక్ ప్రకటించారు. బాలీవుడ్లో దేవర మార్కెట్ పెంచుకునేందుకు ముంబైలో ఒక భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి అక్కడ ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కాగా ఒవర్సీస్లో అడ్వాన్స్ బుక్కింగ్స్ దేవర అదరగొడుతుంది. ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీ సేల్స్ స్టార్ట్ చేశారు. USA, కెనాడాలో టికెట్లు ఓపెన్ అయిన కొన్ని నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. ప్రీ సేల్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటికి సుమారు రూ. 6 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కల్కి అడ్వాన్స్ కలెక్షన్స్ ను దేవర దాటేశాడు. ఇంకా రిలీజ్ కు 20 రోజుల ముందుగానే ఈ రికార్డ్స్‌ను తారక్ నమోదు చేశాడు .దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
జూ ఎన్టీఆర్ 'దేవర' టికెట్లు.. ఫస్ట్ షో ఎప్పుడంటే..?
స్టార్ హీరో ఎన్టీఆర్- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా చిత్రం ‘దేవర’. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, దేవర్ ఫస్ట్ షో గురించి ఒక వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు పాన్ ఇండియా రేంజ్లో పెద్ద సంచలనమే క్రియేట్ చేశాయి. మిలియన్ల కొద్ది రీల్స్ రూపంలో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. సెప్టెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా దేవర విడుదల కానుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, సెప్టెంబరు 27న అభిమానుల కోసం తెల్లవారుజామున 1:08 గంటలకు బెన్ ఫిట్ షోస్ వేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్.. ఓవర్సీస్లో కూడా ఇదే సమయంలో షో పడనుంది. ఈమేరకు UKలో ఇప్పటికే దేవర బుకింగ్స్ ఓపెన్ చేశారు. టికెట్లు దక్కించుకున్న అభిమానులు నెట్టింట షేర్ చేస్తున్నారు కూడా.. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ను సితార ఎంటైర్మెంట్స్ నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారు. సోలోగా దేవర వస్తుండటంతో బాక్సాఫీస్ షేక్ చేయడం గ్యారెంటీ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. -
'దేవర' సాంగ్ కాపీపై కామెంట్ చేసిన ఒరిజినల్ కంపోజర్
'దేవర' సినిమా నుంచి రీసెంట్గా రెండో సాంగ్ విడుదలైంది. అయితే, ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ కెమిస్ట్రీపై మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ, ఈ పాటని శ్రీలంక హిట్ సాంగ్ 'మనికే మనహేతే' అనే దానితో నెటిజన్లు పోలుస్తున్నారు. దీంతో నెట్టింట ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. తాజాగా ఈ పాట ఒరిజినల్ కంపోజర్ అయిన చమత్ సంగీతే ఈ వివాదంపై స్పందించారు.శ్రీలంకకు చెందిన మ్యూజిక్ కంపోజర్ చమత్ సంగీత్ 2021లో ‘మనికే మాగే హితే’ అనే సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. అప్పట్లో ఈ పాట పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రికార్డ్ స్థాయిలో మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. అయితే, ఈ సాంగ్‌ను బేస్ చేసుకొని దేవర చిత్రంలో 'చుట్టమల్లే' పాటను మేకర్స్ క్రియేట్ చేశారని చర్చ జరుగుతుంది.ఈ వివాదంపై చమత్ సంగీత్ స్పందించారు. సంగీత దర్శకులు అనిరుధ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పాటలతో పాటు వర్క్‌ని కూడా అభిమానిస్తా. నా పాట ఆయనకు స్పూర్తి ఇచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది. అని చమత్ పంచుకున్నారు. ఇప్పుడాయన కూడా పరోక్షంగా అచ్చూ తన పాట మాదిరే ఉందని చెప్పడంతో ఆ కామెంట్ కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, ఈ వివాదంపై అనిరుధ్, మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. జూనియర్ ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘దేవర’ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
'దేవర' నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది
దేవర సినిమా నుంచి జూ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త వచ్చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌తో పాటు రెండో సాంగ్ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కుస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్‌తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి.దేవర సినిమా నుంచి రెండో పాట ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు విడుదల చేసిన పోస్టర్లో తారక్ చాలా గ్లామర్‌గా కనిపిస్తున్నారు. అందులో జాన్వీ కపూర్‌తో తారక్ ఉన్న ఫోటో తొలిసారి విడుదల కావడంతో నెట్టింట వైరల్ అవుతుంది. దేవర ఫియర్ సాంగ్ విడుదలైన నుంచి ఈ చిత్రానికి భారీగా బజ్ క్రియేట్ అయింది. ఈ పాటకు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు రెండో పాటు విడుదల కానుంది. ఈ మెలోడీ సాంగ్‌కు ఏ రేంజ్లో ట్యూన్స్ ఉంటాయోనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.విడుదల విషయంపై క్లారిటీదేవర సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ చిత్రం మరోసారి వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తాజా పోస్టర్‌తో తేలిపోయింది. విడుదల విషయంలో ఎలాంటి జాప్యం ఉండదని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.. కొత్త పోస్టర్లో సెప్టెంబర్ 27వ తేదీన దేవర విడుదల అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. Time for hearts to go full ❤️🔥The most awaited #DevaraSecondSingle arriving on August 5th 🌊💕#DevaraonSep27th#Devara Man of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @Yugandhart_ @YuvasudhaArts… pic.twitter.com/aJXGD3uqUB— NTR Arts (@NTRArtsOfficial) August 2, 2024 -
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా రేంజ్లో మోస్ట్ అవైటెడ్ మూవీగా దేవర ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా దేవర నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్‌విడుదల చేశారు.బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించాడు. తాజాగా విడుదలై ఫియర్ సాంగ్ అభిమానులను మెప్పించేలా ఉంది. ఇందులోని ప్రతి పదం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ పాట కోసం గేయ రచయతలు ఎంతో ప్రత్యేకంగా దీనిని రచించారని ఇప్పటికే మేకర్స్ చెప్పారు. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి ,హిందీలో మనోజ్ ముంతాషిర్, తమిళంలో విష్ణు ఏడవన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, మలయాళంలో గోపాలకృష్ణన్ రచించారు. -
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో తారక్ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అటవి ప్రాంతంలో దేవర షూటింగ్ జరుగుతున్న సమయంలో జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడి చేసినట్లు తెలుస్తుంది. షూటింగ్ స్పాట్లో ఉన్న 20 మందికి పైగా గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వారందరూ కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. ప్రమాదం జరిగిన సమయంలో జూ ఎన్టీఆర్ లేరు. ఆయన ప్రస్తుతం 'వార్2' సెట్స్‌లో ఉన్నారు.జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న దేవరలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నరైన్, సైఫ్ అలీఖా న్ , టామ్ షైన్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజాగ్ షెడ్యూల్లో తొలుత ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. -
ఎన్టీఆర్ 'దేవర'.. చలో గోవా
గోవాకు వెళ్లనున్నారట దేవర. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘దేవర’. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కల్యాణ్‌రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలకానుంది. తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. కాగా ‘దేవర’ సినిమా యూనిట్ పాటల చిత్రీకరణ కోసం గోవా వెళ్లనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అతి త్వరలో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది తెలిసింది. గోవా షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వీలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరిస్తారట మేకర్స్. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. -
సెట్స్‌లో దేవర
‘దేవర’ తాజా షెడ్యూల్లో జాయిన్ అయ్యారట ఎన్టీఆర్. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘దేవర’. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైందని తెలిసింది. ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్లో ముఖ్యంగా టాకీ పార్ట్ తీస్తారని తెలిసింది. అలాగే ఈ షెడ్యూల్లోనే ఓ పాట కూడా చిత్రీకరించే ఆలోచనలో ఉందట యూనిట్. న్యూ ఇయర్, సంక్రాంతి సెలవుల తర్వాత ఎన్టీఆర్ ‘దేవర’ షూటింగ్లో జాయిన్ కావడం ఇదే. రెండు భాగాలుగా కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ‘దేవర’ తొలి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
కొరటాల శివ దేవర సినిమాపై ప్లానింగ్ సూపర్
-
సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న దేవర
-
'దేవర' నుంచి సర్ప్రైజ్.. బాహుబలి, పుష్ప రూట్లోనే
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయిన ఎన్టీఆర్.. ప్రస్తుతం దేవర మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇలాంటి టైంలో క్రేజీ అప్డేట్తో దర్శకుడు ఓ వీడియో రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: హీరోయిన్ పూజాహెగ్డేకి గాయం.. ఆ ఫొటో వైరల్!) బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి పెరిగింది. భారీ బడ్జెట్ చిత్రాలు, సీక్వెల్స్ వస్తున్నాయి. అలా బాహుబలి రెండు భాగాలుగా వచ్చి వేల కోట్ల వసూళ్లు చూపించింది. 'పుష్ప' కూడా అలానే సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు 'దేవర' కూడా రెండు భాగాలుగానే రానుందని స్వయంగా దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌తో తీస్తున్న 'దేవర' తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు కొరటాల మరోసారి స్పషం చేశారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా సైఫ్ అలీఖాన్ విలన్, అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. అయితే ఇలా ఓ సినిమాకు సీక్వెల్‌తో రావడం ఎన్టీఆర్‌కి ఇదే తొలిసారి. మరి 'దేవర'తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి? (ఇదీ చదవండి: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మంగ్లీ? స్పందించిన సింగర్!) #Devara will be released in two parts, with the first part scheduled for release on April 5, 2024. @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @anirudhofficial @sabucyril @sreekar_prasad @Yugandhart_ @YuvasudhaArts @DevaraMovie pic.twitter.com/SpOBSnx0pL — NTR Arts (@NTRArtsOfficial) October 4, 2023 -
స్టార్ట్ యాక్షన్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ‘దేవర’ లోని ఓ యాక్షన్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ఆగస్టు తొలివారంలో ప్రారంభం అవుతుందనీ, ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తారని టాక్. ఈ ఫైట్ ఇంట్రవెల్ సమయంలో వస్తుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ్స ఈ యాక్షన్ సీక్వెన్ ్సను డిజైన్ చేయనున్నట్లు టాక్. అలాగే ఈ సినిమాలోని ప్రధాన తారాగణం అయిన సైఫ్ అలీఖాన్ , జాన్వీకపూర్‌లతో పాటు, కొందరు కీలక పాత్రధారులపై ఈ షెడ్యూల్లోనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారట కొరటాల. ‘దేవర’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
భారీ యాక్షన్ ఎపిసోడ్లో ఎన్టీఆర్
‘దేవర’ సినిమా కోసం ఎన్టీఆర్ యాక్షన్ మోడ్ కంటిన్యూ అవుతోంది. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన లెంగ్తీ షూటింగ్ షెడ్యూల్ ముగిసింది. ఎన్టీఆర్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటు, ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. పీటర్ హెయిన్స్ కొరియోగ్రఫీ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సముద్రతీరం నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. కాగా అతి త్వరలో మరో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట కొరటాల శివ. సో.. దేవరగా ఎన్టీఆర్ యాక్షన్ మోడ్ మరికొన్ని రోజులు కంటిన్యూ అవుతుందనుకోవచ్చు. కాగా హీరో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ‘దేవర’ సినిమాలో ఒక పాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. కల్యాణ్‌రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. ప్రత్యేక శిక్షణ.. బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ నటిస్తారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్న ‘వార్ 2’ లో తన పాత్ర కోసం ఎన్టీఆర్ స్పెషల్ గెటప్‌లో కనిపిస్తారట. ఇందుకు సంబంధించిన ఫిజికల్ ట్రాన్ఫర్మేషన్ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకమైన శిక్షణ తీసుకోనున్నారని ఇండస్ట్రీ టాక్. -
'దేవర' ఒకటి కాదు రెండు
-
దేవర సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడానికి ఎన్టీఆర్, కొరటాల మాస్టర్ ప్లాన్..
-
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దేవర డబుల్ బొనాంజా
-
చిరంజీవి దారిలో దూసుకుపోతున్న బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్
-
NTR30: ఎన్టీఆర్30 ఫస్ట్‌లుక్ పోస్టర్.. టైటిల్ అదిరిపోయింది!
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఎన్టీఆర్30'. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఇది చదవండి: గ్లోబల్ స్టార్ NTR గురించి మీకు తెలియని విషయాలు!) అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఎన్టీఆర్ 30 టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి అందరూ ఊహించినట్లుగానే దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కత్తి చేతిలో పట్టుకుని సముద్రం పక్కన నిలబడి ఉన్న ఎన్టీఆర్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. (ఇది చదవండి: ఎన్టీఆర్30 టైటిల్ నాదే.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్) జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ లుక్‌ని రివీల్ చేయగా.. ఇంతవరకు ఎన్టీఆర్ లుక్‌ని రిలీజ్ చేయలేదు. తారక్ బర్త్‌డేకు ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించనుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. #Devara pic.twitter.com/bUrmfh46sR — Jr NTR (@tarak9999) May 19, 2023 -
NTR30: ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ కోసం బీ రెడీ
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 అనే వర్కింగ్‌లో టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తారక్‌కి జోడీగా నటిస్తుంది. ఇప్పటికే పట్టాలెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కొనసాగుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా తారక్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ అదిరిపోయే అప్డేట్ను అందించారు. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈరోజు(శుక్రవారం)రాత్రి 7.02 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే జాన్వీ లుక్‌ని రివీల్ చేయగా ఇంతవరకు ఎన్టీఆర్ లుక్‌ని రిలీజ్ చేయలేదు. దీంతో ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. తారక్ బర్త్‌డేకు ఒకరోజు ముందుగానే సర్ప్రైజ్ లభిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. -
ఎన్టీఆర్ బర్త్ డేకి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న కొరటాల తగ్గేదేలే అంటున్న తారక్ ఫ్యాన్స్
-
NTR 30 పై అదిరిపోయే లీక్ ఇచ్చిన సైఫ్ అలీ ఖాన్.. ఫాన్స్ కి పండగే
-
వార్ కి టైమ్ అవుతుంది..
-
సినీ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఫోటోలు వైరల్
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతుంది. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి తారక్ తన నివాసంలో గ్రాండ్ పార్టీని అరెంజ్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రెల్ కూడా ఈ పార్టీకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పార్టీకి సంబంధించిన పలు ఫోటోలను ఎన్టీఆర్ స్వయంగా ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'నా ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్లతో ఈవ్నింగ్ సరదాగా గడిచింది. పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్ జేమ్స్'.. అంటూ తారక్ ట్వీట్ చేశారు. ఈ పార్టీకి రాజమౌళి, కొరటాల శివ,నిర్మాతలు శోభు యార్లగడ్డ, శిరీష్, మైత్రీ నవీన్ యెర్నేని, రవి శంకర్, దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డితో పాటు అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. అయితే ఆ పార్టీకి రామ్‌చరణ్ మాత్రం రాలేదు. రీసెంట్‌గానే మాల్దీవులు ట్రిప్ నుంచి హైదరాబాద్ వచ్చేసిన చరణ్ మరి తారక్ ఏర్పాటు చేసిన పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇక గత నెలలో రామ్‌చరణ్ బర్త్‌డే పార్టీలో కూడా తారక్ కనిపించలేదు. తాజాగా సినీ ప్రముఖులకు ఎన్టీఆర్ విందు ఎందుకు ఇచ్చాడన్నది తెలియలేదు. ఈ పార్టీకి అమెజాన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రావడం మరింత సస్పెన్స్‌గా మారింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) An evening well spent with friends and well wishers. Was great catching up with James and Emily. Thanks for keeping your word and joining us for dinner. pic.twitter.com/Zy0nByHQoq — Jr NTR (@tarak9999) April 12, 2023 -
గ్రాండ్‌గా ఎన్టీఆర్ 30 సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
అఫీషియల్: ఎన్టీఆర్తోనే శ్రీదేవి కూతురు టాలీవుడ్ ఎంట్రీ..
ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NTR30 వర్కింగ్ టైటిల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. తాజాగా నేడు(సోమవారం)జాన్వీ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్గా జాన్వీ కపూర్‌ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో జాన్వీ పక్కా పల్లెటూరు అమ్మాయిగా హాఫ్ సారీలో కనిపిస్తుంది. -
ఎన్టీఆర్ 30 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్
-
ముహూర్తం ఫిక్స్?
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో కొత్త సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటించనున్న ఈ 30వ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదిరిందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిస్తోంది. ఈ నెల 23న ఈ మూవీని గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారట ఎన్టీఆర్, కొరటాల శివ అండ్ కో. అలాగే మార్చి మూడోవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌కి యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ పోర్టు సెట్‌ను కూడా వేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారట కొరటాల శివ. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ఎన్టీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఎన్టీఆర్ 30 అదిరిపోయే అప్డేట్.. నిరాశలో ఫ్యాన్స్
-
తగ్గేదేలే అంటున్న తారక్..!
-
మహేష్ ,ఎన్టీఆర్ సినిమాలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు
-
ఎన్టీఆర్30: హీరోయిన్ ఇప్పటికైనా కుదిరిందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కానుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యుశసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్30 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. గతంలో ఈ సినిమాలో ఆలియా భట్ నటించనుందనే రూమర్స్ వినిపించినా పెళ్లి తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరన్నదానిపై రకరకాల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఫైనలైజ్ అయ్యిందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. -
ఊరమాస్.. ఎన్టీఆర్30 సర్ప్రైజ్ చూస్తే పూనకాలే
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో మరింత హైప్ నెలకొంది. రేపు(శుక్రవారం)ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్‌కు గిఫ్ట్ అందించారు మేకర్స్. మోషన్ పోస్టర్‌తో పూనకాలు తెప్పించారు. 'అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు. అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. వస్తున్నా'.. అంటూ ఎన్టీఆర్ వాయిస్‌తో పవర్ ఫుల్ వీడియోను వదిలారు. ఇందులో కత్తి పట్టుకొని ఎన్టీఆర్ మాస్ లుక్‌తో అదరగొట్టాడు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉండబోతుందని ఈ స్పెషల్ వీడియోను చూస్తే అర్థమవుతుంది. యుశసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా ఎవరు నటించనున్నారన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌గా కొనసాగుతుంది. My next with Koratala Siva… https://t.co/iPyKSQ9Sjs pic.twitter.com/xaEB1ZbwON — Jr NTR (@tarak9999) May 19, 2022 -
'ఆచార్య'పై ప్రేక్షకుల రివ్యూ.. ఆడియెన్స్ ఏం అంటున్నారంటే..
మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటేనే అభిమానులకు పండగలా ఉంటుంది. అలాంటిది మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ఉండటంతో మెగా అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆచార్య' సినిమా ఎట్టకేలకు శుక్రవారం(ఏప్రిల్29)విడుదలయ్యింది. ‘సైరా నరసింహారెడ్డి’లాంటి సూపర్‌హిట్ తర్వాత సుమారు 4ఏళ్ల తర్వాత చిరు నటించిన సినిమా కావడం, రామ్‌చరణ్ కూడడా ఉండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆచార్య సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? సినిమాపై వాళ్ల రివ్యూ ఏంటన్నది 'సాక్షి ఆడియన్స్ పోల్'లో తెలుసుకుందాం. -
Acharya: నా జీవితంలో మర్చిపోలేని రోజులవి: రామ్ చరణ్
‘‘ఆచార్య’ సినిమాలో నాన్నగారి(చిరంజీవి) ఆచార్య, నేను చేసిన సిద్ధ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. నా పాత్ర సెకండాఫ్‌లో వస్తుంది. నాన్నతో కలిసి ఈ సినిమాలో 45నిమిషాల నిడివి ఉన్న పాత్ర చేసేందుకు నాకు 13ఏళ్లు పట్టింది. అలాంటిది ఆయనతో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర అంటే ఇంకా చాలా సమయం పడుతుంది’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో రామ్‌చరణ్ పంచుకున్న విశేషాలు... ► ‘ఆచార్య’ లో మీ పాత్ర ఉంటుందని మీకు ముందే తెలుసా? తెలియదు.. ఎందుకంటే ‘ఆచార్య’ సినిమాకి నేను ఓ నిర్మాతగా ఎంటర్ అయ్యానే కానీ నటుడిగా కాదు. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన చిన్న పాత్ర ఉంటుందని ఆ తర్వాతే తెలిసింది. పైగా ఈ పాత్ర కథకి ఎంతో ముఖ్యం అని కొరటాల శివగారు చెప్పారు. అలాగే ‘ఆచార్య’ నాన్నగారి సినిమా కావడంతో ఓకే చెప్పాను. ► కొరటాల శివ ‘ఆచార్య’ కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? ‘మిర్చి’ సినిమా తర్వాత నుంచి నేను–కొరటాలగారు ఓ సినిమా చేద్దామనుకున్నాం. కానీ, ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అయినప్పటికీ మా కాంబినేషన్ కుదరలేదనే బాధ నాకెప్పుడూ లేదు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య బలమైన స్నేహ బంధం ఉంది. అందుకే తొందరపడకుండా వీలు కుదిరినప్పుడు మంచి ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం. ► ‘ఆచార్య’కి మీరు పచ్చజెండా ఊపాక మీ కోసం కథలో ఏవైనా మార్పులు చేశారా? ఎలాంటి మార్పులు లేవు. అయితే తొలుత నాది, పూజా హెగ్డేది 15 నిమిషాలే అనుకున్నాం. కానీ నా పాత్ర 45 నిమిషాలు ఎలా అయిందో నాకే తెలియడం లేదు. ఆచార్య, సిద్ధ పాత్రలకి చాలా తేడా ఉంటుంది. ఈ పాత్రలు వేరే ఏ హీరోలు చేసినా కూడా హిట్ అవుతాయి. కాకపోతే నాన్నగారు, నేను చేయడం వల్ల మరింత క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో చాలా సన్నివేశాలు సహజంగా ఉంటాయే కానీ ఎక్కడా కావాలని యాడ్ చేసినట్లు ఉండవు. ► సిద్ధ పాత్ర ఎలా ఉంటుంది? ‘ఆచార్య’ లో నాన్నది, నాది తండ్రీ కొడుకుల పాత్ర కాదు. నేను ‘ధర్మస్థలి’ లోని గురుకులంలోని యువకునిగా కనిపిస్తాను. నాన్నగారు ఒక ఫైటర్‌లా కనిపిస్తారు. మా ఇద్దరి పాత్రలు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. అయితే ధర్మం కోసం ఇద్దరూ ఎలా కలుస్తారు? అధర్మంపై ఎలా పోరాటం చేశారు? అనేది కొరటాలగారు చాలా బాగా చూపించారు. ► ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నప్పుడు ‘ఆచార్య’ కోసం రాజమౌళిని ఎలా ఒప్పించారు? రాజమౌళిగారు ‘బొమ్మరిల్లు’ ఫాదర్లాంటివారు. ఆయన సినిమా అంగీకరించామంటే అది పూర్తయ్యే వరకూ ఆర్టిస్ట్‌ల చేయి వదలరు. కానీ సిద్ధ పాత్ర గురించి కొరటాలగారు రాజమౌళిగారికి చెప్పారు. ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను రాజమౌళిగారు గుర్తించి, నేను చేస్తేనే బాగుంటుందన్నారు. పైగా మా నాన్నమీద గౌరవంతో, అమ్మ(సురేఖ) డ్రీమ్ ప్రాజెక్ట్ అని ‘ఆచార్య’ చేసేందుకు నాకు అవకాశం ఇచ్చారు రాజమౌళిగారు. ఇందుకు ఆయనకు రుణపడి ఉంటాను. ► ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నప్పుడే ‘ఆచార్య’ కి మేకోవర్ కావడం కష్టంగా అనిపించిందా? ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కష్టం అనిపించదు. అటు ‘ఆర్ఆర్ఆర్’ లో రామరాజు పాత్ర కానీ, ఇటు ‘ఆచార్య’ లో సిద్ధ పాత్రకి కానీ మేకోవర్ కావడం కష్టంగా అనిపించలేదు. ఎందుకంటే నాకు బాగా నచ్చిన పాత్రలు ఇవి.. అందుకే చాలా ఇష్టంగా చేశాను. ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ నా మనసుకి బాగా దగ్గరైన చిత్రాలు. ఆ కోవలో నిర్మించిన ‘ఆచార్య’ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ► ‘ఆచార్య’ కి పనిచేస్తున్నప్పుడు చిరంజీవి నుంచి ఏం నేర్చుకున్నారు? ఈ 35 ఏళ్లల్లో నేను చూసిన నాన్నగారు వేరు.. ‘ఆచార్య’ కోసం మారేడుమిల్లి అడవుల్లో 20 రోజులు షూటింగ్ చేసినప్పుడు చూసిన నాన్నవేరు. అయితే మారేడుమిల్లి అడవుల్లో ‘ఆచార్య’ షూటింగ్ కోసం ఇద్దరం ఒక కాటేజ్‌లో ఉన్నాం. కలిసి వ్యాయామం, భోజనం చేశాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. నా జీవితంలో మర్చిపోలేని రోజులవి. ఆ 20 రోజుల షూటింగ్లో నాన్న నుంచి ఎంతో నేర్చుకున్నా. ► ‘ఆచార్య’ కి మీరు నిర్మాతనా? హీరోనా? కొణిదెల ప్రొడక్షన్స్‌లోనే ‘ఆచార్య’ నిర్మించాలనుకున్నాం. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తో నేను బిజీగా ఉండటం వల్ల ప్రొడక్షన్‌పై పూర్తిగా దృష్టి సారించలేననిపించింది. అప్పుడు నిరంజన్ రెడ్డిగారు ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కూడా మా సొంత బ్యానర్లాంటిదే. అందుకే ఇప్పటికి కూడా నాన్న, నేను ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. ప్రస్తుతానికి నా దృష్టి నటనపైనే. ‘సైరా, ఆచార్య’ లాంటి బలమైన కథలు వచ్చినప్పుడు కొణిదెల ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తాను. ► ‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద సక్సెస్ అయింది. మరి ‘ఆచార్య’ ని పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్‌కి ఎందుకు ప్లాన్ చెయ్యలేదు? ‘ఆచార్య’ ని దక్షిణాదిలో చేయాలనుకునే కొరటాలగారు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ విడుదలకి మధ్య ఎక్కువ గ్యాప్ లేదు. పాన్ ఇండియా రిలీజ్ అంటే చాలా ప్లా¯Œ ్స ఉంటాయి. సమయం తక్కువ ఉంది. అందుకే తెలుగులో రిలీజ్ చేసిన తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేయాలనుకుంటున్నాం. ► స్ట్రైట్ బాలీవుడ్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు? నేనేదీ ప్లాన్ చేసుకోను. ఏ డైరెక్టర్ అయినా నాకు కరెక్ట్ కథ తీసుకొస్తే ఏ భాషలో అయినా చేస్తాను. నేను కావాలనుకుని డిజైన్ చేసిన సినిమాలకంటే డైరెక్టర్స్ ఆలోచించి చేసిన సిని మాలే నాకు సూపర్ హిట్స్ ఇచ్చాయి. ‘ఆరెంజ్’ సరిగ్గా ఆడలేదు కానీ, ఇప్పటికీ నా ఫేవరేట్ సినిమాల్లో అది ఒకటి. ► సౌత్ సినిమాలు పాన్ ఇండియన్ హిట్స్ కావడం ఎలా అనిపిస్తోంది? ఇటీవల వచ్చిన ‘పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2’ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో హిట్స్ కావడం చాలా గర్వంగా ఉంది. ఇది వరకు ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా అనే వారు. కానీ, ఇప్పుడు మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ► మీ తర్వాతి చిత్రాలేంటి? శంకర్‌గారి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 60రోజులు షూటింగ్ పూర్తయింది. ఆ సినిమా తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తాను. నానమ్మ ఎప్పుడూ నాన్నవైపే.. ‘ఆచార్య’ సెట్స్‌లో నానమ్మ(అంజనాదేవి), అమ్మ(సురేఖ)ల మధ్య సరదా పోటీ ఉండేది. నా కొడుకు బాగా చేశాడంటే, కాదు.. నా కొడుకు అనేకునేవారు. నానమ్మ ఎప్పుడూ నాన్నవైపే ఉండేవారు. -
NTR 30: ఆలియా గురించి క్లారిటీ ఇచ్చిన కొరటాల
జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరోసారి ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఎన్టీఆర్ కెరీర్లో ఇది 30వ సినిమా. ప్రస్తుతం ఆచార్య సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కొరటాల శివ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య సినిమా ఈనెల 29న రిలీజ్ కానుంది. ఆచార్య తర్వాత చిన్న విరామం తీసుకొని ఎన్టీఆర్‌తో సినిమా స్టార్ట్ చేస్తానని స్వయంగా కొరటాల వెల్లడించారు. స్క్రిప్ట్ చాలా వరకు పూర్తయింది. ఎన్టీఆర్‌ను చాలా పవర్ ఫుల్ రోల్లో చూడబోతున్నారు అని పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా ఆలియా భట్ నటిస్తుందా అన్న ప్రశ్నకు.. స్క్రిప్ట్‌ని కేవలం ఎన్టీఆర్కే వివరించానని,ఇంకా హీరోయిన్ విషయం ఫైనలైజ్ కాలేదని చెప్పుకొచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టుకి ఆలియా నో చెప్పిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. త్వరలోనే ఈ సినిమాలోని హీరోయిన్ను ప్రకటించే అవకాశం ఉంది. -
ఆచార్య నుంచి కాజల్ సీన్స్ డిలీట్? అదే కారణమా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆచార్య. ఇందులో రామ్ చరణ్ సిద్దా అనే కీలక పాత్ర పోషించాడు.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్గా నటించనుండగా, రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది. అయితే రీసెంట్గా విడుదలైన ట్రైలర్లో మెయిన్ లీడ్ హీరోయిన్గా నటించిన కాజల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. పూజా హెగ్డే మాత్రం రెండు సీన్స్‌లో కనిపించింది. దీంతో అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న సందేహం నెటిజన్లలో కలుగుతుంది. అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో నటించలేదని తెలుస్తోంది. కరోనా రావడంతో తొలుత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ షూటింగ్లో పాల్గొనలేదు. బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ చేయమని నిర్మాతలు అడిగినా కాజల్ నో చెప్పడంతో మేకర్స్ అసహనానికి లోనయ్యారని తెలుస్తుంది. దీంతో కావాలనే ట్రైలర్లో కాజల్‌ని చూపించలేదని తెలుస్తుంది. సినిమాలో కూడా కాజల్ సీన్స్‌ని తొలగించారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. -
మెగా ఫ్యాన్స్‌కి కన్నుల పండుగ.. ఇరగదీసిన చిరు, చరణ్
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇందులో సిద్ధ అనే పాత్రలో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ‘ఆచార్య’చిత్రం ఈనెల 29 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా నుంచి `భలే భలే బంజారా` అనే పాటని విడుదల చేశారు. సాధారణంగానే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ల డ్యాన్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతుంటారు. అలాంటిది వీరిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే అది అభిమానులకు పండుగే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి విజువల్ ట్రీట్‌నే ఇచ్చారు మేకర్స్. ఈ పాటలో ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌లు పోటీ పడి డ్యాన్స్ చేయడం అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంటుంది. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను లెజెండ్ సింగర్ శంకర్ మహదేవన్, టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా, రామ్‌చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. A memorable song for me ♥️ Happy to tap my feet with my energetic @AlwaysRamCharan for #BhaleBhaleBanjara. Hope I dominated him with my grace 😎 ▶️ https://t.co/k3PmmUFkQt#AcharyaOnApr29#SivaKoratala #ManiSharma @NavinNooli @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/yWGdXmZVBq — Acharya (@KChiruTweets) April 18, 2022 -
ఆలియా భట్ షాకింగ్ నిర్ణయం! అదేంటంటే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా రిలీజ్ కాగానే ఈ సినిమా పట్టాలెక్కించడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఎన్టీఆర్30 ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: 'అందుకే ఇలా పెళ్లి చేసుకున్నాం'.. రివీల్ చేసిన ఆలియా అయితే తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి ఆలియా తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని దర్శక నిర్మాతలకు కూడా చెప్పేసిందట. బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లి కారణంగా వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించేందుకు ఆలియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. చదవండి:ఆలియాను ఎత్తుకొని తీసుకెళ్లిన రణ్‌బీర్.. వీడియో వైరల్ -
ఎన్టీఆర్ ఎంత మారిపోయాడో.. వైరల్ అవుతున్న లుక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో తారక్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కొమరం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివతో తారక్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కొమరం భీమ్ కోసం రఫ్ లుక్‌లో కనిపించిన ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం కంప్లీట్ లుక్‌ని మార్చేశాడు. స్లిమ్‌గా, స్టైలిష్ లుక్‌లోకి మారిపోయాడు. స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఫిట్ గా ఉండాలని కొరటాల సూచించడంతో అందుకు తగ్గట్లు తారక్ మారిపోయాడు. మాంచి ట్రిమ్డ్ లుక్‌లోకి వచ్చి సరికొత్త స్టైల్లో కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన దీపికా పదుకొనె నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. -
మహేష్ బాబుకు సడన్ సర్ప్రైజ్
విమానాశ్రయం(గన్నవరం): సినీ నటుడు మహేష్‌బాబుకు గురువారం చిరంజీవి, ప్రభాస్, దర్శక, నిర్మాతలు ఎస్ఎస్.రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్‌రెడ్డి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. 17వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మహేష్‌బాబుకు వీరంతా శుభాకాంక్షలు తెలియజేశారు. రొటీన్‌కు భిన్నంగా ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలో వారు మహేష్‌బాబుకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ నిమిత్తం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సమయంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. వీరి సడన్ సర్ప్రైజ్తో మహేష్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. -
సీఎం జగన్‌తో భేటీ తర్వాత టాలీవుడ్ పెద్దల స్పందన
-
టాలీవుడ్ సెలబ్రిటీల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం హైలైట్స్
-
సీఎం జగన్ స్పందన చూసి ప్రభాస్, మహేష్: మంత్రి పేర్ని నాని
-
నేను చిరంజీవి అన్న కలిసి ఇండస్ట్రీ కోసం చాలా చర్చించాం: సీఎం వైఎస్ జగన్
-
సినీ ఇండస్ట్రీకి సీఎం బంపర్ ఆఫర్
-
సినీ పరిశ్రమలకు కీలక సూచనలు.. అక్కడా కూడా షూటింగులు
-
సీఎం గారికి ఆవిషయంలో చాలా థాంక్స్: ఎస్ ఎస్ రాజమౌళి
-
సీఎంతో భేటీ.. హాట్‌టాపిక్‌గా మారిన చిరంజీవి కామెంట్స్
Megastar Chiranjeevi Sensational Comments: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల సమావేశంపైనే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా చర్చిస్తుంది. చిరంజీవి, మహేశ్‌బాబు, కొరటాల శివ, ప్రభాస్ సహా ఇతర ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నారు. సినిమా టికెట్ల ధర సహా మొత్తం 17 అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా భేటికి హాజరుకానున్న నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవి ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'నాకు సీఎంఓ నుంచి ఆహ్వానం అందింది. మిగతా ఎవరు వస్తారో తెలియదు. మీడియాలో చూసి తెలుసుకుంటున్నా' అని పేర్కొన్నారు. ఈ భేటీతో ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డ్ పడుతుందని భావిస్తున్నా అని పేర్కొన్నారు. అయితే సినీ ప్రముఖుల భేటీ విషయంలో ఎవరెవరు పాల్గొంటారో తెలిదు అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. -
ఎండ్ కార్డు కాదు.. శుభం కార్డే..
-
చివరి నిమిషంలో గైర్హాజరైన నాగార్జున, ఎన్టీఆర్..అందుకేనా?
Nagarjuna And Jr NTR Afar From Meeting With CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపైనే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం చర్చ జరుగుతుంది. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరిన టాలీవుడ్ బృందం రోడ్డు మార్గంలో సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సినిమా టికెట్ల ధర సహా ఇతర అంశాలపై ప్రధానంగా ఈ భేటీ జరగనుంది. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి, అలీ, పోసాని కృష్ణమురళి వంటి ప్రముఖులు సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. అయితే ఈ భేటీలో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనకపోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం జగన్‌ను కలిసే లిస్ట్‌లో వీరిద్దరి పేర్లు ఉన్నా చివరి నిమిషంలో ఎందుకు గైర్హాజరయ్యారు అన్నదానిపై ఇప్పుడు చర్చకు దారితీసింది. కాగా అక్కినేని అమలకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అవడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్న నాగార్జున ఈ కారణంగానే భేటికి దూరంగా ఉన్నట్లు సమాచారం. మరి తారక్ విషయంలో వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అన్నదానిపై ఇంకా తెలియాల్సి ఉంది. -
'చిరంజీవి వెళ్లారు.. ఒకే ఇంటి నుంటి నుంచి ఇద్దరు ఎందుకు'?
Allu Aravind Comments On Tollywood Celebrities Meeting With AP CM Jagan: సీఎం జగన్‌తో టాలీవుడ్ సినీ ప్రముఖల భేటీపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. 'ఈ భేటీతో టికెట్ల ధరల అంశంపై ఎండ్ కార్డ్ పడుతుందని ఆశిస్తున్నాం. ఇరు పక్షాలకు మంచి జరగుతుందని భావిస్తున్నా. మా కుటుంబం నుంచి చిరంజీవి వెళ్లారు. కాబట్టి నేను వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకే ఇంటి నుంచి ఇద్దరు ఎందుకు? ఇండస్ట్రీకి మేలు జరిగేలా ప్రకటన వస్తుందని ఆశిస్తున్నా' అని పేర్కొన్నారు. కాగా ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి, మహేశ్‌బాబు, కొరటాల శివ, రాజమౌళి వంటి సినీ ప్రముఖులు భేటీ కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ భేటీపైనే ఉంది. -
సీఎం జగన్‌తో ముగిసిన టాలీవుడ్ ప్రముఖుల భేటీ
Chiranjeevi, Mahesh Babu And Others To Meet Cm Ys Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. టికెట్ ధరలు, సినీ ఇండస్ట్రీ సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణ మూర్తి, నిరంజన్ రెడ్డి, అలీ వంటి ప్రముఖులు సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. 17 అంశాలపై చర్చ? సినిమా టికెట్ల ధరను నిర్ణయించడానికి ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భేటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. టికెట్ ధరలు, ఏసీ, నాన్ఏసీ థియేటర్లలో టికెట్ ధరల పెంపు సహా ఇండస్ట్రీకి చెందిన 17 అంశాలపై సినీ పెద్దలు సీఎంతో చర్చించినట్టు తెలుస్తోంది. కాగా బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు టాలీవుడ్ బృందం గన్నవరం విమనాశ్రయానికి చేరుకుంది. అక్కడినుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి సినీ ప్రముఖులు బయల్దేరి వెళ్లారు. -
ఎన్టీఆర్- కొరటాల మూవీ: వచ్చే నెలలో షూటింగ్!
ఎన్టీఆర్ ఓ హీరోగా చేసిన ‘ఆర్ఆర్ఆర్’ (రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ మరో హీరో) చిత్రం విడుదల ఈ వేసవికి వాయిదా పడింది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యేలోపు తన తదుపరి చిత్రంపై ఎన్టీఆర్ దృష్టి పెట్టాలనుకుంటున్నారని తెలిసింది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను స్పీడప్ చేశారు దర్శకుడు కొరటాల శివ. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ఆరంభించడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్, ఇతర కీలక పాత్రల్లో నటించనున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారని తెలిసింది. -
NTR30: ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్టుపై లేటెస్ట్ అప్డేట్..
NTR30: Jr Ntr And Koratala Siva Movie Update: రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించాడు తారక్. 2018లో అరవింద సమేతతో చివరిసారిగా థియేటర్లో సందడి చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ కారణంగా మరో సినిమా చేయలేదు. దీంతో గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేసేందుకు ఎన్టీఆర్ సిద్ధమయినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారట. వచ్చే నెలలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా పనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కెరీర్ పరంగా ఎన్టీఆర్‌కి ఇది 30వ సినిమా. ఈ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు తారక్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. -
జూనియర్ ఎన్టీఆర్ సరసన చాన్స్ కొట్టేసిన రష్మిక!
పరిశ్రమలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది రష్మక మందన్నా. కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన రష్మిక సౌత్ స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతోంది. ఈ క్రమంలో పాన్ ఇండియా చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగింది. అంతేకాదు ఇండియన్ నేషనల్ క్రష్ 2019గా అరుదైన గుర్తింపు కూడా పొందింది ఈ భామ. ఇలా తన కేరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటూ వరస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక తాజాగా మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: ఆహాతో నాకు సంబంధం లేదు, గమనించగలరు: అల్లు శిరీష్ ట్వీట్ వైరల్ టాలీవుడ్ అగ్ర హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన త్వరలోనే ఆడిపాడనుందట ఈ నేషనల్ క్రష్. కాగా ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‌తో బిజీ ఉన్న క్రమంలోనే తారక్ కొరటాల శివతో ఎన్టీఆర్ 30(#NTR30) సినిమా చేస్తున్న సంగతి తెలిసింసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే ఈ చిత్రంపై ఇటీవల చిత్ర బృందం అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో ఎన్టీఆర్‌కు సరసన మొదట అలియా భట్, కియారా అద్వానీలు నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ జాబితాలో కథానాయికగా రష్మిక పేరు తెరపైకి వచ్చింది. ఈ మూవీ ఆనౌన్స్మెంట్ సమయంలో రష్మిక పుష్ప మూవీతో పాటు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. చదవండి: నా జిమ్ ట్రైనర్ టార్చర్ చేస్తుంటాడు, నేను ఆ చాన్స్ మిస్సయ్యా: రష్మిక ఇక ఇప్పుడు పుష్ప విడుదల కావడం, హిందీలో ఆమె చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 30 కోసం రష్మికను సంప్రదించగా ఆమె ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కాగా ప్రస్తుతం రష్మిక, విజయ్ తదుపరి సినిమాలో హీరోయిన్గా సంతకం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగులో ఆమె 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాయిక ప్రధానమైన సినిమా కూడా ఒకటి చేయనుందని వినికిడి. -
మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ఆచార్య మూవీ వాయిదా
అందరూ ఊహించిందే నిజమైంది. పాన్ ఇండియా చిత్రాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల జాబితాలో తాజాగా ఆచార్య మూవీ కూడా చేరింది. ఒమిక్రాన్, కరోనా ప్రభావంతో ఈ సంక్రాంతికి థియేటర్లో సందడి చేసే చిత్రాలన్ని వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 4వ తేదీకి వస్తుందనుకున్న ఆచార్య మూవీని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘కరోనా, ఒమిక్రాన్ దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది. చదవండి: తొలి రోజు ‘బంగార్రాజు’ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆచార్య మూవీని వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌తో మీ ముందుకు వస్తాం. అందరికి హ్యాపీ సంక్రాంతి. కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి హీరోగా కాగా కొరటాల శివ రూపొందించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే సందడి చేయనుంది. The release of #Acharya stands postponed due to the pandemic. The new release date would be announced soon. Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/oVjqcvfl9U — Konidela Pro Company (@KonidelaPro) January 15, 2022 -
సెంటిమెంట్ ఫాలో అవుతున్నకొరటాల ?
-
స్టార్ హీరోకు బాబాయ్‌గా హీరో రాజశేఖర్!, ఏ సినిమాలో అంటే..
ప్రస్తుతం హీరో రాజశేఖర్ హీరోగా పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తాజాగా నటించిన శేఖర్ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరో ప్రాజక్ట్స్ లైన్లో ఉన్నాయి. ఈ క్రమంలో రాజశేఖర్ సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ కాంబో ఎన్టీఆర్30(#NTR30) ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకు క్రేజీ ఆఫర్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: డబ్బు కోసం ఇంత దిగజారాలా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్ కాగా చిత్రంలో ఎన్టీఆర్ బాబాయ్‌ది చాలా పవర్ ఫుల్ రోల్ అని, ఆ పాత్రకు రాజశేఖర్ అయితే సరిగ్గా సరిపోతారని కొరటాల భావించాడట. దీంతో వెంటనే ఆయనను సంప్రదించి పాత్ర గురించి వివరించగా రాజశేఖర్ దీనిక ఫిదా అయ్యారని వినికిడి. దీంతో ఎన్టీఆర్‌కు బాబాయ్‌గా నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. మరి ఈ ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. చదవండి: పేర్ని నానితో ముగిసిన వర్మ భేటీ, మీడియాతో ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు కాగా గతంలో పవర్ఫుల్ క్యారెక్టర్స్.. విలన్ రోల్స్ చేసే అవకాశం వస్తే నటించేందుకు తాను రెడీ అని గతంలో రాజశేఖర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ పాత్ర చేయాలనుకుంటున్నారని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ఫ్యామిలీ హీరోలుగా ఆకట్టుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోయిన జగపతి బాబు, శ్రీకాంత్‌లు ఇప్పటికే విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తన విలక్షణ నటనతో విలన్‌గా జగపతి బాబు పరిశ్రమలో సెటిలైపోయాడు. ఇక తాజాగా అఖండతో ప్రతికథానాయకుడిగా తన అదృష్టాన్ని పరిక్షించుకున్నాడు శ్రీకాంత్. -
‘ఆచార్య’ మూవీ టీంకు షాక్, మెగాస్టార్ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు
Acharya Saana Kastam Song Controversy: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరు తనయుడు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ.. అభిమానుల కోసం వరసగా ఓక్కో అప్డేట్ ఇస్తూ మూవీపై ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్. అంతేగాక ఫిబ్రవరి విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన చిత్ర బృందం సరైన సమయంలో కోసం ఎదురుచూస్తున్న ఆచార్య మూవీ టీంకు తాజాగా షాక్ తగిలింది. ఇటీవల విడుదలై ఆచార్య స్పెషల్ సాంగ్ వివాదంలో చిక్కుకుంది. చదవండి: అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ఆర్జీవీ, ట్వీట్ వైరల్ ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ‘సానా కష్టం అంటూ సాగే ఈ పాటలో ఓ చోట లిరిక్స్ తమ మనోభవాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో ఓ చోట ‘ఏడేడో నిమురోచ్చని కుర్రోళ్ళు ఆర్ఎంపీలు అవుతున్నారు’ అని ఉంది. ఇప్పుడు ఇదే లైన్ వివాదానికి దారితీసింది. పాటలోని ఈ లిరిక్స్ ఆర్ఎంపీ వృత్తిని కించపరిచేలా ఉందని, ఆర్ఎంపీ, పీఎంపీల మనోభవాలను దెబ్బతీసేలా ఉందంటూ రాష్ట్ర ఆర్ఎంపీల సంఘం నాయకులు ఆరోపించారు. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్ అంతేగాక జనగామలోని రాష్ట్ర ఆర్ఎంపీల సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పాట రచయిత, సినిమా దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని, సినిమాలో ఈ పాటను నిలిపివేయాలంటూ వారు డిమాండ్ చేశారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ఇటీవల పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామ.. ఊఊ ఉంటావా’ సాంగ్‌ను కూడా వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ పాట ఎంతటి రచ్చకు దారితీసేందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూస్తుంటే పుష్ప సాంగ్ మాదిరిగానే ఆచార్య స్పెషల్ సాంగ్ కూడా వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిసోంది. మరి ఇది ఎంతవరకు దారితీస్తోంది చూడాలి. -
ఆచార్య నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్.. చిరుతో రెజీనా స్టెప్పులు
Saana Kastam Lirical Song From Acharya movie Is Out: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా నుంచి ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ స్పెషల్ సాంగ్‌లో చిరంజీవితో కలిసి రెజీనా స్టెప్పులేసింది. భాస్కర్ భట్ల లిరిక్స్ అందించగా, రేవంత్, గీతా మాధురి ఈ పాటను ఆలపించారు. 'సానా కష్టం వచ్చిందే మందాకినీ... చూసేవాళ్ల కళ్లు కాకులు ఎత్తుకుపోనీ.. సానా కష్టం వచ్చిందే మందాకినీ.. నీ నడుము మడతలోన జనం నలిగేపోనీ..' అంటూ ఈ పాట సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని లాహె లాహె, నీలాంబరి పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి4న విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ నటించగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
NTR30: ఎన్టీఆర్30వ చిత్రంలో సమంత!
Samantha To Play Female Lead Role In Jr NTR Koratala Siva Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30వ సినిమా రూపొందనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా సమంతను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన జనతా గ్యారేజ్‌లో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ కాంబినేషన్‌ను రిపీట్ చేయనున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సినిమాల విషయంలో దూకుడు పెంచిన సామ్ వరుస సినిమాలు సైన్ చేస్తుంది. కాగా పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. -
ఆ వార్తల్లో నిజం లేదు, అప్పుడే ఆచార్య వచ్చేది
‘ఆచార్య’ సినిమా విడుదల తేదీ మారుతుందని ప్రచారం జరుగుతున్న వార్తల్లో వాస్తవం లేదని ఆదివారం చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలు పోషించారు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించిన ‘ఆచార్య’ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించారు. అయితే తాజాగా ‘ఆచార్య’ చిత్రం వాయిదా పడనుందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపించింది. దీంతో ఈ విషయంపై నిర్మాతలు స్పందిస్తూ – ‘‘ఆచార్య’ సినిమా రిలీజ్‌డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆల్రెడీ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ముందుగా ప్రకటించినట్లే ఫిబ్రవరి 4న ‘ఆచార్య’ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని పేర్కొన్నారు. దీంతో ‘ఆచార్య’ రిలీజ్ ఆన్ ట్రాక్‌లో ఉందని హ్యాపీ ఫీలవుతున్నారు మెగా ఫ్యాన్స్. ‘ఆచార్య’ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. -
ఈ వేదికపై వారిని మిస్ అవుతున్న: అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం స్మిగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తొలి పార్ట్‌ను ‘పుష్ప ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పుష్ప టీం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీంతో ఆదివారం పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి దర్శకు ధీరుడు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిలుగా వచ్చారు. ఈ సందర్భంగా బన్నీ ఇండస్ట్రీకి దొరికిన గిఫ్ట్ అంటూ రాజమౌళి అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురింపించాడు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘సుకుమార్, దేవి, నేను ఒకేసారి జర్నీ స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఈ వేదికపై వారిని మిస్ అవుతున్నాను. ఆర్ఆర్ఆర్ బాగా ఇచ్చేందుకు దేవి ఇక్కడికి రాలేకపోయాడు. ఈ ఒక్క సినిమా.. అన్ని విధాలుగా నాలుగు సినిమాల కష్టం లాంటిది. మైత్రీవారితో పాటు ఈ సినిమాలో ముత్తం శెట్టివారు నిర్మాణంలో భాగమయ్యారు. మా మావయ్య (రవి, విజయ్, కృష్ణ, రాజేంద్రప్రసాద్) లతో ముత్తంశెట్టి మీడియా బ్యానర్ పెట్టించి వారితో ఓ సినిమా చేయించాను. నేను పెరిగిన రోజుల్లో మా మావయ్యలు నాకెంతో ప్రేమను చూపించారు. ఇవాళ నా ప్రేమను చూపించుకునేందుకు ఓ అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అయితే ‘పుష్ప’ మొదలైన తర్వాత రాజేంద్రప్రసాద్‌గారు చనిపోయారు. ఈ సినిమాను ఆయన కూడా చూసి ఉంటే బాగుండేది’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇక సుకుమార్ కూతురు సుకృతి మాట్లాడుతూ ‘‘నాన్న ఈ మధ్య అస్సలు ఇంటికి రావడంలేదు. ‘పుష్ప’ క్లిప్స్ చూశాను. బాగున్నాయి. ఈ చిత్రాన్ని సపోర్ట్ చేయండి’’ అని సుకుమార్ కుమార్తె పేర్కొంది. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, కెమెరామ్యాన్ క్యూబా, దర్శకులు మారుతి, వెంకీ కుడుముల, బుచ్చిబాబు సన, అల్లు అర్జున్ కుమారుడు అయాన్, తనయ అర్హ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆచార్య’ వచ్చేది అప్పుడేనా.. అదే రోజున ఫైనలా?
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఆచార్య విడుదల విషయం చర్చనీయాంశంగా మారింది. తొలుత దర్శకుడు ఆచార్యను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. అయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం జనవరి 7వ తేదీకి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు తేదీలకు పెద్దగా గ్యాప్ లేకపోవడంతో డిసెంబర్ 17న ‘ఆచార్య’ విడుదల చేయాలని కొరటాల నిర్ణయించారట. చదవండి: ‘లవ్‌స్టోరీ’ చిత్రం చూసి భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యాంకర్ సుమ ఇదే తేదీకి చిరు కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. అయితే అదే రోజున ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ కూడా రిలీజ్ కానుంది. దీనిపై ఇదివరకే మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. కానీ పుష్ప షూటింగ్‌ను ఇంకా పూర్తి చేసుకోలేదు. దీంతో ఆ తేదీలోగా షూటింగ్ పూర్తవుతుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. మరీ ఆ తేదీలోగా ‘పుష్ప’ షూటింగ్‌ను పూర్తి చేసుకుంటుందా? లేదా ఆ డేట్‌ను ‘ఆచార్య’కు కెటాయిస్తారా? అనేది తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. -
కొరటాల మూవీకి ఎన్టీఆర్ షరతు!, అందుకే ఈ నిర్ణయం..
Jr NTR And Koratala Shiva Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ తర్వాత తారక్ వరుసగా మూడు ప్రాజెక్ట్‌లకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్‌ల ప్రాజెక్ట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి కావడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేస్తుకుంటున్నాడట. ఈ క్రమంలో ముందుగా కొరటాలతో ఎన్టీఆర్ 30(#NTR 30) మూవీ చేయన్నాడు. చదవండి: మూడింతల ఎక్కువ ఫన్‌తో `ఎఫ్ 3`.. మేకింగ్ వీడియో వైరల్ ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎన్టీఆర్ ఓ నిర్ణయం తీసుకున్నాడట. ఈ మూవీని 6 నెలల్లోగా పూర్తి చేయాలని కొరటాలకు చెప్పినట్లు టాలీవుడ్లో టాక్. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎక్కువ సమయం తీసుకోవడంతో ఈ ఎడాది ఆయన సినిమాల సంఖ్య తగ్గింది. దీంతో వచ్చే ఏడాదిలో అయిన కనీస సినిమాలు చేయాలనే ఉద్దేశంతో శరవేగంగా షూటింగ్స్‌ను పూర్తి చేయాలనుకుంటున్నాడట. అంతేగాక ఇప్పటికే త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ప్రకటించి నెలలు గడుస్తున్నాయి. చదవండి: సమంతే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవర్.. రీట్వీట్ చేసిన సామ్ ఆ సినిమాలకు కూడా డేట్స్ ఇచ్చేందుకే ఎన్టీఆర్, కొరటాలకు ఈ షరతు పెట్టినట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ మూవీకి ‘డైమండ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి సంఘ నాయకుడిగా కనిపించబోతున్నాడట. ఈ చిత్రంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడకు చెందిన ప్రముఖ నటీనటులను కూడా దర్శకుడు భాగస్వామ్యం చేయనున్నాడని వినికిడి. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ పేరు వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న కొరటాల అనంతరం ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. -
కొరటాల, జక్కన్నలను ఓ ఆటాడుకున్న తారక్!
Evaru Meelo koteeswarulu Promo: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బుల్లితెర షో ‘ఎవరు మీలో కోటీశ్వరు’లు. తన వాక్చతుర్యంతో కంటెస్టెంట్లను, ప్రేక్షకులను అలరిస్తున్నాడు తారక్. ఈ షో ద్వారా మరింత వినోదం పంచేందుకు ప్రముఖు దర్శక దిగ్గజాలు సందడి చేయాడికి వస్తున్నారు. సోమవారం జరిగే ఎపిసోడ్లో ముఖ్యఅతిథులుగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ రాబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా జెమిని టీవీ విడుదల చేసింది. ఈ ప్రోమోలో హాట్సీట్లో కూర్చున్న జగ్గన్న, కొరటాల శివలు రోల్ కెమెరా, యాక్షన్ అంటూ హంగామా చేశారు. చదవండి: సమంతే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవర్.. రీట్వీట్ చేసిన సామ్ ఈ క్రమంలో వారికి ఎన్టీఆర్ ఓ ప్రశ్న ఇవ్వగా దాని గురించి దర్శకులు ఇద్దరూ చర్చించుకుంటున్నారు. దీంతో ఎన్టీఆర్ ఎంతసేపూ మీలో మీరే మాట్లాడుకుంటే మాకు ఏం వినిపిస్తుందని అంటాడు. ఆ తర్వాత ఇలా చేసినందుకు వీరికి ఆప్షన్లు ఇవ్వకుండా తీసేయొచ్చా గురువు గారు(కంప్యూటర్) అని తారక్ అనగానే.. తప్పండి అలా చేయకూడదు అంటూ దర్శకులు విన్నవించుకుంటారు. ఆ తర్వాత మరి మరోసారి.. అంటూ ఎన్టీఆర్ ఆగిపోయి వెంటనే ఇక్కడ లోకేషన్ నాది, డైరెక్షన్ నాది... ఇక్కడ నేనే బాస్’ అంటూ వారిని ఓ ఆటాడుకున్నాడు. మీరు కూడా ఈ ప్రొమో చూసి ఎంజాయ్ చేయండి. చదవండి: జోరు పెంచిన ఎన్టీఆర్.. ఇక వరుస సినిమాలతో సందడి కాగా రాజమౌళి తెరకెక్కిస్తున్నా ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు మిగిలిపోయిన చివరి షూటింగ్‌ను జరపుకుంటోంది. ఇదిలా ఉంచితే కొరటాల శివతో ఎన్టీఆర్ ఓ మూవీ చేస్తున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కొరటాల ఈ షోకు అతిథిగా రావడం చూస్తుంటే కొరటాల-ఎన్టీఆర్‌ల ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్‌పైకి రానుందేమో అంటూ నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. -
చెప్పినదే జరుగుతుందా?
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సౌత్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే అవుననే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో రామ్‌చరణ్ సరసన నటించారు ఆలియా భట్. తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా ప్రారంభోత్సవం అక్టోబరులో జరుగుతుందని, నవంబరు రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం అవుతుందని సమాచారం. ఇందులో హీరోయిన్ పాత్రకు పూజా హెగ్డే, రష్మికా మందన్నా, కియారా అద్వానీల పేర్లు వినిపించాయి. తాజాగా ఆలియా పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ సరసన చాన్స్ వస్తే తప్పక నటిస్తానని ఆలియా పలు సందర్భాల్లో చెప్పా రు. మరి.. ఆమె చెప్పినదే జరుగుతుందా? -
జోరు పెంచిన ఎన్టీఆర్.. ఇక వరుస సినిమాలతో సందడి
మూడేళ్లుగా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాడు తారక్.ఇప్పుడు ఈ సినిమా పూర్తైంది.సరైన సమయంలో మూవీ రిలీజ్ కానుందని యూనిట్ ప్రకటింది.చరణ్ ఇప్పటికే శంకర్ మేకింగ్ లో కొత్త సినిమా స్టార్ట్ చేసాడు.మరి టైగర్ సంగతి ఏంటి? కొరటాల తో సినిమా ఎప్పుడు? దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ పూర్తైంది. దీంతో రామ్ చరణ్‌తో పాటు ఎన్టీఆర్ కూడా ఫ్రీ అయిపోయాడు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి కొరటాల మేకింగ్ లో ప్యాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేయనున్నాడు.ఈ సినిమాలో టైగర్ స్టూడెంట్ లీడర్‌గా నటించబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. హీరోయిన్ గా ఆలియా భట్ పేరు వినిపిస్తోంది.కొరటాలతో మూవీ తర్వాత చాలా మంది దర్శకులను లైన్ లో పెట్టాడు తారక్. ఇప్పటికే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు మేకింగ్ లోనూ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే సిరీస్ లో తమిళ దర్శకుడు వెట్రీమారన్ మేకింగ్ లోనూ నటించబోతున్నాడట. ఈ మూవీతో కోలీవుడ్ మార్కెట్ ను సీరియస్ గా టార్గెట్ చేయబోతున్నాడు జూనియర్. వడా చెన్నై, అసురన్ లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు వెట్రీమారన్. ప్రస్తుతం సూర్యతో వాడివసల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన తర్వాత తారక్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట. -
మళ్లీ సన్నగా, స్టయిలిష్‌గా కనిపించబోతున్న ఎన్టీఆర్!
Jr NTR: బరువు పెరగడం... తగ్గడం... ఇలా పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా మేకోవర్ కావడానికి రెడీ అయిపోతారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో చేస్తున్న కొమురం భీమ్ పాత్ర కోసం కాస్త బరువు పెరిగారు. తర్వాత చేయనున్న చిత్రం కోసం బరువు తగ్గనున్నారని సమాచారం. అయితే రెగ్యులర్‌గా కన్నా కూడా కాస్త సన్నబడాలనుకుంటున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమా కోసమే ఈ మేకోవర్ అని భోగట్టా. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని పాట చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ ఉక్రెయిన్ వెళ్లారు. ఆ పాటతో సినిమా పూర్తవుతుందట. దాంతో ఇండియా చేరుకున్న వెంటనే ప్రత్యేక డైట్, స్పెషల్ వర్కవుట్స్‌తో తగ్గే పని మీద ఉంటారని తెలిసింది. కొరటాల దర్శకత్వంలో చేసిన ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ స్టయిలిష్‌గా కనిపించారు. తాజా చిత్రంలోనూ అలా స్టయిలిష్‌గా కనిపించనున్నారని టాక్. -
Acharya: కాకినాడ కాలింగ్
హైదరాబాద్ నుంచి కాకినాడకు ‘ఆచార్య’ లొకేషన్ షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ను కాకినాడలో ప్లాన్ చేశారని టాక్. మూడు నుంచి ఐదు రోజులు జరగనున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా చిరంజీవి, సోనూసూద్ కాంబినేషన్లో సీన్స్ తెరకెక్కిస్తారట. ఇదిలా ఉంటే... చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ ‘లూసిఫర్’గా తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘గాడ్‌ఫాదర్’, ‘ఫిల్మ్ మేకర్’ వంటి టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారట. -
తేజ్‌కు సక్సెస్ వస్తే నాకు వచ్చినట్లే!
‘‘సాయితేజ్‌ని చూస్తే నాకేదో చిన్న ఎమోషనల్ కనెక్ట్. తేజ్‌కు సక్సెస్ వస్తే నాకు వచ్చినట్లే ఆనందపడతాను’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. సాయితేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో జె. భగవాన్, పుల్లారావు నిర్మించిన చిత్రం ‘రిపబ్లిక్’. ఈ సినిమాలోని ‘ఎయ్ రారో.. ఎయ్ రారో.. ఎయ్‌రో.. నా ప్రాణంలోని ప్రాణం.. నా దేహంలోని దాహం..’ లిరికల్ వీడియోను శనివారం హైదరాబాద్‌లో కొరటాల శివ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘ఈ పాటలో స్వేచ్ఛ గురించి బాగా చెప్పారు. కంటెంట్‌ను దేవ కట్టా చాలా ఇంటెన్స్‌గా చెబుతారని ‘ప్రస్థానం’ చూసినప్పుడే అనుకున్నాను. ‘రిపబ్లిక్’లో కూడా అందరూ ఆలోచించే విషయాన్ని గట్టిగా, ఇంటెన్స్‌తో చెప్పి ఉంటారని ఆశిస్తున్నాను. మణిశర్మగారిని మెలోడీ బ్రహ్మ అని ఎందుకు అన్నారో తెలిసింది. భగవాన్, పుల్లారావు ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. సాయితేజ్ మాట్లాడుతూ – ‘‘పెద్ద స్క్రీన్‌లో సాంగ్ చూసి చాలా రోజులయింది. నా పాట అనే కాదు... ఏ సినిమా పాటనైనా పెద్ద స్క్రీన్‌లో చూస్తే ఉండే కిక్కే వేరు. ఒక ఆర్టిస్ట్ నటనను వెండితెరపై చూస్తే ఆ సంతోషమే వేరు. ‘రిపబ్లిక్’ను థియేటర్స్‌లోనే విడుదల చేస్తాం. నా చిన్నప్పుడే మణిశర్మగారి పాటలు విన్నాను. అప్పట్నుంచే నా మైండ్‌లో ఆయనతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నానేమో. అది ఇప్పుడు కుదిరింది. మంచి స్క్రిప్ట్, మంచి రోల్ ఇచ్చిన దేవాగారికి, రాజీ పడకుండా తీసిన భగవాన్, పుల్లారావు, జీ స్టూడియోస్‌కు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘మణిశర్మగారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. మంచి లిరిక్స్ ఇచ్చిన రెహమాన్‌కు థ్యాంక్స్’’ అన్నారు దేవ కట్టా. మణిశర్మ మాట్లాడుతూ – ‘‘తేజ్‌తో సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది. భగవాన్‌తో ఎప్పట్నుంచో మంచి పరిచయం ఉంది. దేవాతో ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకుంటున్నాను. ‘రిపబ్లిక్’తో కుదిరినందుకు సంతోషం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలోని తొలి పాట కొరటాల శివగారి చేతుల మీదగా లాంచ్ కావడమే మా సినిమా సక్సెస్‌కు నిదర్శనం’’ అన్నారు భగవాన్. కో ప్రొడ్యూసర్ జయ ప్రకాష్, ‘జీ’ సంస్థ ప్రతినిధి ప్రసాద్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్, రచయిత–దర్శకుడు రవి పాల్గొన్నారు అలాగే నేడు (జూలై 11) మణిశర్మ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ కార్యక్రమంలో చిత్రబృందం సెలబ్రేట్ చేసింది. -
అప్పుడే డైరెక్టర్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన కొరటాల శివ!
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకడు. నేడు జూన్ 15 ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు శుభాకంక్షలు తెలుపుతున్నారు. కాగా ఆయన బర్త్‌డే నేపథ్యంలో కొరటాలకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా రాణిస్తున్న కొరటాల శివ తన రిటైర్మెంట్ గురించి ముందుగానే ప్లాన్ చేసుకున్న విషయం తెలుసా!. దర్శకుడిగా మారినప్పుడే తాను10 చిత్రాలను తెరకెక్కించాలని, ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నట్లు ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలోనే ఉన్నప్పటికి దర్శకుడిగా మాత్రం ఉండనని చెప్పుకొచ్చేవాడు. అంతేగాక నిర్మాతగా చేయాలనేది ఆయన కోరిక అని, అందుకే దర్శకుడిగా మారడానికి ముందే 10 కథలను రాసిపెట్టుకున్నట్లు చెప్పాడు. వాటిని పూర్తి చేసి.. డైరెక్షన్‌కు గుడ్‌బై చెప్పేసి.. నిర్మాతగా మారి చిన్న సినిమాలను నిర్మిస్తానంటు గతంలో ఓ స్టెట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇంతటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అతి తక్కువ కాలంలోనే రిటైర్మెంట్ తీసుకోవడమనేది నిజంగా బాధకరమైన విషయమే. మరీ ఆయన ఫిక్స్ అయినట్లుగా రిటైర్మెంట్ తీసుకుంటారా? లేదా? అనేది 10 సినిమాల తెరకెక్కించేవరకు వేచి చూడాలి. కాగా ప్రభాస్ ‘మిర్చి’ మూవీతో దర్శకుడిగా మారిన కొరటాల ఇప్పటి వరకు నాలుగు సినిమాలను రూపొందించాడు. ఈ నాలుగు చిత్రాలు కూడా సూపర్ కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నాయి. అంతటి సక్సెఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన మిర్చి మూవీకి ముందు ‘బృందావనం, మున్నా, భద్ర’ వంటి చిత్రాలకు రచయితగా పని చేయగా.. సింహా సినిమాకు కథ, స్ర్కీన్‌ప్లేను అందించాడు. దీనితో పాటు మరిన్ని సినిమాలకు కూడా ఆయన కథలు అందించాడు. ప్రస్తుతం కొరటాల చిరంజీవి ఆచార్య మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. -
అలాంటి అరుదైన స్నేహితుడు కొరటాల : ఎన్టీఆర్
కొరటాల శివ.. డైరెక్టర్‌గా తొలి చిత్రం మిర్చితో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. తొలుత భద్ర, సింహా, మున్నా సహా పలు సినిమాలకు రచయితగా పనిచేసిన కొరటాల ఆ తర్వాత దర్శకుడిగా మారి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఓ సందేశంతో పాటు ఆలోచనాత్మక చిత్రాలు తీయడంతో కొరటాలకు ప్రత్యేక స్టైల్ ఉంది. మంగళవారం కొరటాల బర్త్‌డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కొరటాలకు విషెస్ తెలియజేస్తే ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ఎంతో ఎన్టీఆర్ విషెస్ అందించారు. ఇక ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్లో జనతా గ్యారేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూర్తవగానే కొరటాలతో తారక్ సినిమా చేయనున్నారు. స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Wishing my dear friend and well wisher, @sivakoratala garu a very Happy Birthday — Jr NTR (@tarak9999) June 15, 2021 Happy Birthday @sivakoratala Garu! pic.twitter.com/Ijnw8Ikfnz — Ram Charan (@AlwaysRamCharan) June 15, 2021 Happy Birthday @SivaKoratala garu.Thank you for always being there whenever we needed you. Wishing you good health, happiness and peace sir. pic.twitter.com/jiJiEuiKdt — Sai Dharam Tej (@IamSaiDharamTej) June 15, 2021 Happy birthday @sivakoratala garu, Have a great year ahead with lots of success and happiness. Wishing you the best for #Acharya. 🤗#HBDSivaKoratala pic.twitter.com/TsVMBGNmuo — Bobby (@dirbobby) June 15, 2021 చదవండి : NTR30: ఫార్మల్ డ్రస్, స్మార్ట్ లుక్.. ఎన్టీఆర్ ఫోటో వైరల్ లాక్డౌన్ టైంలోనూ రెండు చేతులా సంపాదిస్తున్న సుమ.. ఎలాగంటే.. -
NTR 30: మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్!
సినిమాల విషయంలో కొన్ని కాంబినేషన్స్ విడుదలకు ముందే అంచనాలను పెంచుతుంది. అది హీరో-డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కావొచ్చు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా హీరో సినిమాను మార్కెట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు. కాగా కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో సన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో ఈ మ్యూజిక్ డైరెక్టర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రం ‘అరవింద సమేత వీరా రాఘవ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు మూవీ మేకింగ్ సమయంలో జోరుగా ప్రచారం సాగింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ చివరకు అనిరుధ్ స్థానంలో తమన్ మ్యూజిక్ అందించాడు. దీంతో ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమాను అనిరుధ్ మిస్సయ్యాడు. అయితే ఈ సారి మాత్రం ఎన్టీఆర్‌తో అనిరుధ్ పనిచేయనున్నాడని టాలీవుడ్లో వినికిడి. కాగా కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్30 సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడన్నుట్లు సమాచారం. -
అఖిల్ కోసం కొరటాలతో సంప్రదింపులు జరిపిన నాగార్జున!
అఖిల్ హీరోగా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇంతవరకు సరైన హిట్ పడలేదు. ఈ ఏడాదిలో విడుదల కానున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్పైనే అఖిల్ అన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో ఎలా అయినా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ ఓ మూవీకి సైన్ చేశాడు. ఇక అఖిల్ చేయబోయే తదుపరి చిత్రం కోసం నాగార్జున స్టార్ డైరెక్టర్ కొరటాల శివను రంగంలోకి దింగినట్లు తెలుస్తోంది. అఖిల్ చేయబోయే 6వ సినిమా కావడంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం మంచి కథను సిద్ధం చేయాలని నాగార్జున కొరటాలను కోరినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవితో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తికాగానే అఖిల్ కోసం ఓ క్రేజి కథను రెడీ చేయనున్నట్లు సమాచారం. చదవండి : 'సిక్స్ ప్యాక్ బాడీ సీక్రెట్స్ చెప్పమని ఆ హీరోలు అడుగుతారు' Most Eligible Bachelor: పూజా హెగ్డే క్యారెక్టర్ ఇదేనట -
అప్పుడు రాజమౌళి గొడ్డలితో నా వెంటపడతారు!
ఇటీవల కరోనా బారిన పడ్డ జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తున్నారు? ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఏం చెబుతున్నారు? ఓటీటీలపై ఎన్టీఆర్ అభిప్రాయం ఎలా ఉంది? రాజమౌళి (ఆర్ఆర్ఆర్), కొరటాల శివ తర్వాత ఎన్టీఆర్ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నారు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎన్టీఆర్ నోట వస్తే అది ఆయన ఫ్యాన్స్‌కు ఫుల్ హ్యాపీ. హాలీవుడ్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పిన ఆసక్తికర విషయాలు ఈ విధంగా... ► మొదటి సినిమా (‘నిన్ను చూడాలని’) చేసే సమయానికి నా వయసు 17 ఏళ్లు. 365 రోజులూ పని చేయాలనుకునే వ్యక్తిని నేను. కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఇంటికి పరిమితం కావడం పంజరంలో ఉన్నట్లుగా ఉంది. అయితే నా పిల్లలు (భార్గవ్ రామ్, అభయ్ రామ్), కుటుంబసభ్యులతో సమయం గడిపే అవకాశం లభించడం కాస్త ఊరట కలిగించే విషయం. ► ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం..రణం..రుధిరం) చిత్రం ప్రొడక్షన్ వర్క్ 2018లో మొదలైంది. కానీ కరోనా ఫస్ట్ వేవ్ వల్ల దాదాపు ఎనిమిది నెలలు మేజర్ షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్, సాంకేతికతకు సంబంధించిన పని కూడా చాలానే ఉంది. యాక్షన్ సన్నివేశాల గురించి చెప్పాలంటే ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు అయితే ‘ఆర్ఆర్ఆర్’ను అక్టోబరులోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి.. దర్శక–నిర్మాతలు మరోసారి ఆలోచించుకునే అవకాశాలు లేకపోలేదు. ► కరోనా ప్రభావం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బడ్జెట్‌ని కానీ, కథను కానీ ప్రభావితం చేయలేదు. కానీ మా వర్కింగ్ స్పీడ్‌ని బాగా దెబ్బతీసింది. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత ప్రేక్షకులు ధియేటర్స్‌కు వస్తారా? అనిపించింది. అయితే ప్రేక్షకులు సినిమాలు థియేటర్స్‌కు రావడం మాతో పాటు ఇండస్ట్రీలో ఓ కొత్త ఆశను రేపింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ విషయం గురించి నాకు తెలిసి నిర్మాతలు ఎప్పుడూ ఆలోచించలేదు. ‘బాహుబలి’, ‘జురాసిక్ పార్క్’, ‘అవెంజర్స్’ వంటి సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఆడియన్స్ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేరని నా భావన. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా థియేటర్స్‌లోనే విడుదలవుతుంది. ► ‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఇలా దేశవ్యాప్తంగా సినీ మార్కెట్స్‌ను కలిపేశారు. ఇంతకుముందు ఒక తెలుగు సినిమా చైనా, యూకే, అమెరికా వంటి దేశాల్లోని మూవీ మార్కెట్‌ను సైతం ప్రభావితం చేయగలదని మనం ఊహించామా? లేదు. ఇండియన్ సినిమాలు ‘బాహుబలి, దంగల్’ వంటి వాటికి అంతర్జాతీయ మార్కెట్స్‌లో మంచి ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’లో నేను, రామ్‌చరణ్ నటిస్తున్నాం. ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. ► రాజమౌళితో నాకిది నాలుగో (స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ.. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’) చిత్రం. 2001లో తొలిసారి ఆయన సినిమాలో నటించాను. ఇండియన్ సినిమాలో ఏదో సాధించాలనే తపన, ఆలోచనలు అప్పట్నుంచే రాజమౌళిలో ఉన్నాయి. నటీనటుల్లో ఉన్న నటనా నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించునే అవకాశం ఇస్తారు రాజమౌళి. అలాగే ఆయన విజన్‌కు తగ్గట్లు మనల్ని కూడా మౌల్డ్ చేస్తారు. ► ‘ఆర్ఆర్ఆర్’ కోసం 18 నెలలుగా కష్టపడుతూనే ఉన్నాను. ఫిజికల్ అప్పియరెన్స్ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాను. ఈ సినిమాకు ముందు నేను 71 కేజీల బరువు ఉండేవాడిని. కానీ ఈ సినిమా కోసం దాదాపు తొమ్మిది కిలోల మజిల్స్ పవర్ పెంచాల్సి వచ్చింది. ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే... వెండితెరపై ఆడియన్స్ చూస్తున్నప్పుడు థియేటర్స్‌లోని సీట్లలో కూర్చోలేరు. అంతలా ఆస్వాదిస్తారు. ఆశ్చర్యపోతారు. ఇంతకన్నా ఈ సినిమా గురించి చెబితే, రాజమౌళి ఓ గొడ్డలి పట్టుకుని నా వెంట పడతారు (సరదాగా..) నిర్మాత తారక్ యాక్టర్‌గానే కొనసాగాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి దర్శకత్వం ఆలోచనలు లేవు. కానీ నిర్మాతగా ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూపించాలని ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కనిపించే ఆలోచనలు ఇప్పటికైతే లేవు. కానీ భవిష్యత్తు మనల్ని ఏ దిశగా నడిపిస్తుందో తెలియదు కదా! ప్రశాంత్ నీల్‌తో కన్ఫార్మ్ ‘జనతాగ్యారేజ్’ తర్వాత దర్శకుడు కొరటాల శివతో నేను మరో సినిమా చేయనున్నాను. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’లో నా వంతు షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. ‘ఆర్ఆర్ఆర్’లానే ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాను. తారక్‌కు చిరు ఫోన్ ఎన్టీఆర్‌కు కరోనా సోకిన నేపథ్యంలో అతనితో ఫోన్లో మాట్లాడానని చిరంజీవి ట్వీట్ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు తారక్ (ఎన్టీఆర్) చెప్పా రని, తను ఎనర్జిటిక్‌గా ఉండటం సంతోషంగా ఉందని, త్వరలో తారక్ పూర్తి స్థాయిలో కోలుకుంటారని తాను ఆశిస్తున్నట్లు ట్విట్టర్లో చిరంజీవి పోస్ట్ చేశారు. -
జూనియర్ ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ?
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఆయన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఉండనుంది. ఇప్పటికే ఈ మూవీపై పాజిటివ బజ్ క్రియేట్ అయ్యింది. జనతా గ్యారేజ్’(2016) తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఎన్టీఆర్, కొరటాల శివ ఇప్పుడు కలిసి పని చేయనుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి మొదలైంది. కొరటాల ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌తో ఓ భారీ బడ్జెట్ మూవీ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఎన్టీఆర్ సరసన ఎవరు నటించనున్నారనే సస్పెన్స్‌కు తెర పడినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని రూపొందించాలని భావిస్తున్నారట. దీంతో కియారా అద్వాని కానీ, రష్మికను కూడా కథానాయికగా తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే భరత్ అనే నేను మూవీతో కియారాకు కొరటాల పెద్ద హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి కియారాకే ఈ ప్రాజెక్టు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఓ వార్త నెట్టింట వైరలవుతుంది. ఇక ఈ సినిమాలో తారక్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని, పొలిటికల్ టచ్‌తో సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి : ఇద్దరు కజిన్స్‌ను కోల్పోయా..నేనేమీ చేయలేకపోయా : నటి ఎన్టీఆర్‌కు కరోనా.. హెల్త్ అప్డేట్స్ ఇచ్చిన చిరంజీవి -
స్టూడెంట్ లీడర్‌గా జూనియర్ ఎన్టీఆర్?
‘జనతా గ్యారేజ్’ (2016) తర్వాత దర్శకుడు కొరటాల శివ, హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో మరో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర గురించి పలు వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు కాస్త పొలిటికల్ టచ్ కూడా ఇస్తున్నారట కొరటాల. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం కొరటాల ‘ఆచార్య’, ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గి, ఈ ఇద్దరూ చేతిలో ఉన్న సినిమా పూర్తి చేయాలి. ఆ తర్వాత వీరి కాంబినేషన్ సినిమా చిత్రీకరణ ఆరంభమవుతుంది. అయితే విడుదల తేదీని మాత్రం ఫిక్స్ చేసేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కాంబినేషన్ కుదిరేనా?
ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా చేయనున్న దర్శకుడి పేరు ఇదేనంటూ ఇప్పటికే కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రశాంత్ నీల్, అనిల్æరావిపూడి వంటి దర్శకుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కాంబినేషన్ దాదాపు కుదిరినట్లేనని టాక్. ఇదిలా ఉంటే.. దర్శకుడు వేణు శ్రీరామ్‌తో అల్లు అర్జున్ ‘ఐకాన్: కనపడుటలేదు’ సినిమా కమిటయ్యారు. అలాగే కొరటాల శివతో ఓ సినిమా ఫిక్స్ అయింది. మరి... ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేస్తారో చూడాలి. -
కొరటాల మూవీలో ఎన్టీఆర్ పాత్ర ఇదే!
జూనియర్ ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో ఓ సినిమా రానుందని అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. జనతా గ్యారేజ్’(2016) తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఎన్టీఆర్, కొరటాల శివ ఇప్పుడు కలిసి పని చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ .‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ చేస్తుండగా, కొరటా ‘ఆచార్య’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన వెంటనే ఈ ఇద్దరూ కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొరటాల- ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది? ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందది? ఈ సినిమా కథేంటి?.ఇలా రకరకాల ప్రశ్నలు ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పొలిటికల్ టచ్ ఉంటుందని, స్టూడెంట్ పాలిటిక్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నారట. రాజకీయాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో బరిలోకి దిగిన హీరోకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా అధిగమిస్తాడు? చివరికి ఆయన అనుకున్నది సాధిస్తాడా లేదా? అనే అంశాలతో ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. చదవండి : వైరల్ అవుతోన్న జూ. ఎన్టీఆర్ అరుదైన వీడియో.. కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన విజయ్.. కారణం ఇదేనట -
మరోసారి తొందరపడ్డ చిరంజీవి..షాక్‌లో ఫ్యాన్స్!
ఎంత సీక్రెట్‌గా ఉంచాలనుకున్నా సినిమా విడుదలకు ముందే కొన్ని ముఖ్యమైన సీన్స్ లీకవడం చూస్తుంటాం. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఒక్కొసారి అవి నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కథను హీరో ముందే రివీల్ చేయడంతో నిర్మాతలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఆ ప్రముఖ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్లో 152వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. చిరంజీవికి జోడిగా హీరోయిన్ కాజల్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ - మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డితో కలిసి మెగా పవర్‌స్టార్ రాం చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో పలు సినిమా వేడుకలకు హాజరవుతున్న చిరంజీవి.. తాజాగా రానా, సాయిపల్లవి నటిస్తోన్న విరాటపర్వం ట్రైలర్‌ను మార్చి 18న లాంచ్ చేశారు. ఈ సందర్భంగా విరాటపర్వం టీంను ప్రశంసిస్తూనే ఆయన ఆచార్య కథను రివీల్ చేసేశారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘విరాటపర్వం’ టీజర్ చూస్తుంటే ఇది నక్సల్ బ్యాక్ గ్రౌండ్ మూవీ అని తెలుస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే.. నా సినిమా ఆచార్య కూడా నక్సల్ బ్యాక్ గ్రౌండ్ మూవీనే. అయితే ‘ఆచార్య’ ఒక యూనిక్ ఫిల్మ్ అని భావిస్తున్నాను. అలాంటి సినిమా ఈ మధ్య రాలేదనుకుంటున్నాను. కానీ నక్సల్ కథతోనే ‘విరాటపర్వం’ మూవీ రావడం కొంత నిరాశ కలిగించింది. కానీ ఇది మా ‘ఆచార్య’ కంటే ముందు వస్తుంది కాబట్టి ‘విరాటపర్వం’ హిట్ అవ్వాలని కోరుకొంటున్నాను. అలాగే మా సినిమాకు ఈ కథ ప్లస్ అవ్వాలని కూడా నేను ఆశపడుతున్నా' అని పేర్కొన్నారు. ఇంతకుముందు దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో అచార్య కథ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథలో నక్సల్స్ నేపథ్యం కూడా ఉందంటూ ప్రచారం జరుగుతుంది. వీటిపై చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించకపోయినా...చిరంజీవి మాత్రం ఆచార్య కథపై తొందరపడి క్లారిటీ ఇచ్చేశారు. గతంలోనూ పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి..తాను నటిస్తున్న కొరటాల శివ సినిమా గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ అనౌన్స్ కాకముందే.. ఆ వేడుకలో తాను నటిస్తున్న సినిమా పేరు ఆచార్య అంటూ టైటిల్‌ను రివీల్ చేశారు. చదవండి : బ్రేక్ లేకుండా బిజీబిజీగా మారనున్న మెగాస్టార్ డాక్టర్ రవి శంకర్ నక్సలైట్ రవన్నగా ఎలా మారాడు? -
‘జయమ్మ’కు బంపర్ ఆఫర్: స్టార్ హీరో మూవీలో!
రవితేజ ‘క్రాక్’ సినిమాలో ‘జయమ్మ’గా విమర్శల ప్రశంసలు అందుకున్నారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ఇటీవల విడుదలైన అల్లరి నరేశ్ ‘నాంది’ మూవీలోనూ ‘ఆద్య’గా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం ఓ క్రేజీ టాలీవుడ్ ప్రాజెక్టులో నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కొరటాల గత సినిమాల మాదిరే #AA21ను కూడా సామాజిక సందేశంతో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో బన్నీ తొలుత విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత పొలిటికల్ లీడర్‌గా కనిపించనున్నారంటూ ఫిల్మీ దునియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో బన్నీ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. రాజకీయ నాయకురాలి పాత్రలో ఆమె నటించనున్నారంటూ ప్రచారం సాగుతోంది. కాగా గతంలో తెలుగులో సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాలో ఈ విలక్షణ నటి పొలిటికల్ లీడర్‌గా విలనిజం పండించిన సంగతి తెలిసిందే. అంతేగాక ఇళయదళపతి విజయ్ ‘సర్కారు’ మూవీలోనూ ఇదే తరహా నటన కనబరిచారు. ఈ నేపథ్యంలో బన్నీ సినిమాలోనూ ఆమె అదరగొట్టడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగా వరలక్ష్మీ ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే! చదవండి: ‘బేబమ్మ’.. చిన్నప్పటి యాడ్స్ చూశారా? -
‘ఆచార్య’కు తెలంగాణ మంత్రి బంపరాఫర్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ తెలంగాణ మంత్రిని కలిశారు. ఖమ్మం జిల్లాలో మంత్రిని కలిసి గనుల్లో సినిమా షూటింగ్ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి అనుమతి ఇప్పించారని తెలిసింది. అయితే షూటింగ్ జరిగినన్ని రోజులు చిరంజీవి తన నివాసంలో ఉండాలని మంత్రి కోరారు. ఆయన విజ్ఞప్తితో చిరు మంత్రి నివాసంలో బస చేయనున్నారు. మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో ఆచార్య సినిమా షూటింగ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ మేరకు అనుమతుల కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను దర్శకుడు కొరటాల శివ కలిసి విజ్ఞప్తి చేశారు. అనుమతులు ఇవ్వడంతో పాటు మెగాస్టార్ చిరంజీవికి తానే ఆతిథ్యం ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ఇల్లందులోని జేకే మైన్స్‌లో షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జేకే మైన్స్ ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైనింగ్‌లో షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవితో పాటు రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారని చిత్రబృందం తెలిపింది. మంత్రిని కలిసిన అనంతరం దర్శకుడు కొరటాల శివ మాట్లాడారు. ‘ప్రస్తుతం ఖమ్మం జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందుతోందని… సినిమా షూటింగ్‌లకు జిల్లాలో చాలా అనువైన ప్రాంతాలున్నాయి. గతంతో పోల్చితే ప్రస్తుతం ఖమ్మం స్వరూపం నేడు పూర్తిగా మారిపోయింది’ అని తెలిపారు. దీనికి కృషి చేసిన మంత్రి పువ్వాడకు ఈ సందర్భంగా దర్శకుడు అభినందనలు తెలిపారు. అయితే కొన్నిరోజుల కిందట ఆచార్య షూటింగ్‌లోనే చిరంజీవిని, కొరటాల శివను మంత్రి కలిసిన విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. -
ఆచార్య: రేపే బిగ్ అనౌన్స్మెంట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా టీజర్ గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు (జనవరి 26) గణతంత్య దినోత్సవం కావడంతో టీజర్ విడుదల చేస్తారని అందరూ వేయికళ్లతో చూస్తున్నారు. కానీ ఇప్పటికీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవడంతో చిరు అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఓ ఆసక్తికరమైన అప్డేట్ అందించారు. ఆచార్య టీజర్ అప్డేట్ రేపు ప్రకటించనున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రకటన మెగాస్టార్ కాస్తా వినూత్నంగా వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్లో చిరంజీవి, కొరటాల శివ మధ్య టీజర్ విడుదల ఎప్పుడన్న విషయంపై సరదా సంభాషణ జరుగుతున్నట్లు వివరించారు. చదవండి: గణతంత్ర వేడుకల్లో మెగా ఫ్యామిలీ ఇక మెగాస్టార్ నుంచే టీజర్ విషయం బయటికి రావడంతో రేపటి కోసం అభిమానులు ఈ సారి క్లారిటీగా ఉన్నారు. కాగా చందమామ కాజల్ ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నటిస్తోంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనుండగా అతనికి జోడీగా పూజాహెగ్డే నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి దశ చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక ఆచార్య తర్వాత చిరు మోహన్‌రాజా దర్శకత్వంలో 'లూసీఫర్' రీమేక్‌లో నటించనున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. చదవండి: ఆచార్య: రామ్ చరణ్‌కు జోడీ కుదిరింది So here goes.. @sivakoratala @MatineeEnt@KonidelaPro @AlwaysRamCharan #Acharya pic.twitter.com/YdZ84lkXhL — Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2021 -
అల్లు అర్జున్ తదుపరి చిత్రంలో బాలీవుడ్ భామ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్పా’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఈ మూవీ తర్వాత బన్నీ కొరటాల శివ డైరెక్షన్లో వచ్చే ఓ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో బన్నీకి జోడీగా బాలీవుడ్ భామ సయూ మంజ్రేకర్‌ను అనుకుంటున్నట్లుగా టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. కండల వీరుడు ‘దబాంగ్ 3’ చిత్రంలో హీరోయిన్గా సయూ బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఆమె అడవి శేష్ హీరోగా వస్తున్న ‘మేజర్’ సినిమాలో నటిస్తోంది. (చదవండి: ఆ హీరోయిన్ నా లక్కీ చామ్: అల్లు అర్జున్) కాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ‘పుష్పా’ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై డైరెక్టర్ సుక్కు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారిగా పూర్తిస్థాయిలో మాస్ రోల్లో కనిపించనున్నాడు. కరోనా నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన మూవీ షూటింగ్.. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో తిరిగి సెట్స్‌పైకి వచ్చింది. ఈసారి పక్కా షెడ్యూల్ రెడీ చేసి త్వరగా సినిమాను పూర్తి చేయాలని చిత్ర బృందం కసరత్తులు చేస్తోంది. (చదవండి: వైరల్ అవుతున్న అల్లు అర్జున్ జర్నీ సాంగ్) -
ఆచార్య ఆటాపాటా
ఖుషీఖుషీగా ఆటాపాటా మోడ్‌లో ఉన్నారట ఆచార్య. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక. రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో పాట చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ పాటలో చిరు స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయట. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు చిత్రబృందం. -
ఆచార్య: భారీ సెట్.. అన్ని కోట్ల ఖర్చా!
దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’.. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. రెజీనా స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు. కోవిడ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ గత నెలలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకోగా ఆచార్య ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ వారం ఉదయ్‌పూర్‌లో నాగబాబు కూతురు నిహారిక వివాహం ఉండటంతో దానికి హాజరైన తర్వాత వెంటనే చిరంజీవి సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఆచార్యలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలోనూ యాక్ట్ చేయబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జనవరి మూడో వారంలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. చదవండి: జనవరిలో రామ్ చరణ్ ఎంట్రీ తాజాగా ఈ సినిమాకు చెందిన ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆచార్య షూటింగ్లో భాగంగా ఓ భారీ సెట్ వేయనున్నారు. ఇందుకు ఏకంగా రూ. 20 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిత్ర నిర్మాతలు 4 కోట్లతో ఒక ఆలయ సెట్‌ను నిర్మించారు. ఇప్పుడు ఇదే సెట్లో చిరంజీవితో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించేందుకు కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు హైదరాబాద్‌లోనే కేరళ బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్రామాన్ని నిర్మించారు. దీంతో ఆలయంతోపాటు గ్రామాన్ని నిర్మించేందుకు సుమారు 20 రూపాయల కోట్లు ఖర్చు చేశారు. కొత్తగా నిర్మించిన ఈ సెట్ 16 ఎకరాలలో విస్తరించి ఉండగా.. దీని పర్యవేక్షణ బాధ్యతలన్ని దర్శకుడు కొరటాల శివ దగ్గరుండి చూసుకుంటున్నారు. చదవండి: ఆచార్య సెట్లో సోనూసూద్‌కు సత్కారం -
స్టూడెంట్ లీడర్
అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ఆ మధ్య ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్నారు. విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో బన్నీ (అల్లు అర్జున్) పాత్ర కొంత భాగం స్టూడెంట్ లీడర్‌గా ఉంటుందట. ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా మారతారని సమాచారం. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘పుష్ప’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ సినిమాను ప్రారంభిస్తారట అల్లు అర్జున్. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 2022 ఆరంభంలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
జనవరిలో ఎంట్రీ
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలానే ఓ కీలక పాత్రలోనూ యాక్ట్ చేయబోతున్నారు చరణ్. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జనవరిలో ప్రారంభం అవుతుందని తెలిసింది. కోవిడ్ బ్రేక్ తర్వాత ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నుంచి కాజల్ సెట్లో అడుగుపెట్టనున్నారు. చిరంజీవి లొకేషన్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారనేది తెలియాల్సి ఉంది. కాగా జనవరి మూడో వారంలో ‘ఆచార్య’ సెట్లోకి అడుగుపెడతారట రామ్‌చరణ్. ఒకే షెడ్యూల్లో ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేస్తారట. వచ్చే ఏడాది వేసవిలో ‘ఆచార్య’ను థియేటర్స్‌లోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. -
ఆచార్య సెట్లో సోనూసూద్‌కు సత్కారం
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో చిరంజీవి షూటింగ్లో పాల్గొననున్నాడు. ఈ క్రమంలో తాజాగా నటుడు సోనూసూద్ ఆచార్య సినిమా షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా లాక్డౌన్లో సోనూసూద్ అందించిన మానవత సేవలను ప్రశంసిస్తూ సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు కొరటాల శివ, చిత్ర యూనిట్‌తో కలిసి ఆచార్య సెట్లో సత్కరించారు. శాలువ కప్పి, మెమొంటో అందజేశారు. ఈ ఫోటోలను నిర్మాత బీఏ రాజు తన ట్విటర్లో పోస్టు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్లో సోనూసూద్ పాల్గొన్న విషయం తెలిసిందే. చదవండి: పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా ‘రియల్ హీరో’ Tanikella Bharani & @sivakoratala felicitated @SonuSood on the sets of #Acharya for his humanitarian work during the pandemic. pic.twitter.com/LpY7xED2pu — BARaju (@baraju_SuperHit) November 21, 2020 కాగా కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ అందించిన సేవలు మరువరానివి. అనేక మంది వలస కార్మికులకు తన సొంత ఖర్చులతో బస్సులు, రైలు, విమానం ఏర్పాటు చేసి గమ్య స్థానాలకు చేర్చారు. విదేశాల్లోని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విమానాన్ని వేసి, ఆపదలో ఉన్న వారిని ఆదుకొని ప్రజల మనస్సుల్లో ‘రియల్ హీరో’గా నిలిచాడు. తన దృష్టికి వచ్చిన ఏ సమస్యకైనా తోచినంత సాయం చేస్తూ మానవత్వం చాటుకున్నారు. ఓవైపు షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ.. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని సోనూసూద్ కలుసుకొని వారి సమస్యలను ఓపికగా విని పరిష్కరిస్తున్నాడు. చదవండి: వైరల్ అవుతున్న సోనూసూద్ వీడియో -
ఆచార్య వర్సస్ అరవింద్ స్వామి?
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. నిర్మించడంతో పాటు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు చరణ్. ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా ఎవరు నటిస్తారు? అనేది ఇప్పటివ రకూ తెలియలేదు. తాజాగా ‘ఆచార్య’ను ఢీ కొనేది అరవింద్ స్వామి అని తెలిసింది. మెయిన్ విలన్ పాత్రలో ఆయన నటించనున్నారని సమాచారం. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’ సినిమాలో స్టయిలిష్ విలన్‌గా అరవింద్ స్వామి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో జాయిన్ అవుతారట. ఈ సినిమాలో చిరంజీవి ఉద్యమకారుడిగా, రామ్‌చరణ్ విద్యార్థి నాయకుడిగా కనిపిస్తారట. ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
అప్పుడు తనయుడికి.. ఇప్పుడు తండ్రికి..
సాక్షి, హైదరాబాద్: ‘రోజా’ సినిమాతో హీరోగా పరిచయమై ఆ తర్వాత ‘ముంబాయి’ వంటి చిత్రాలతో లవర్ బాయ్‌గా పెరుతెచ్చుకున్నారు నటుడు అరవింద్ స్వామి. అదే విధంగా వెండితెరపై అందగాడిగా అమ్మాయిల మనసు దోచుకున్న అరవింద్ స్వామి కొద్ది రోజులకు కనుమరుగయ్యారు. ఇక కొంతకాలనికి విలన్‌గా తిరిగి సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో 2016లో వచ్చిన రామ్‌చరణ్ ‘ధృవ’ చిత్రంలో విలన్‌గా నటించి విలన్‌గా వందకు వందశాతం మార్కులు కొట్టేశారు. అంతేగాక పలు సినిమాల్లో కూడా ప్రతినాయకుడిగా నటిస్తూ ఆయన విలన్‌గా సెటిల్ ఆయిపోయరు. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ చిత్రంలో అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. (చదవండి: చిరంజీవికి కరోనా రాలేదు) అయితే ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం దర్శకుడు కొంతమంది స్టార్ విలన్లను పరిశీలించగా చివరకు అరవింద్ స్వామిని ఒకే చేసినట్లు తెలుస్తోంది. ‘ఆచార్య’లో హీరోకు, విలన్‌కు మధ్య ఉండే సన్నివేశాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయంట. దీంతో ప్రధాన విలన్‌గా అరవింద్ స్వామి కరెక్ట్‌గా సరిపోతారని భావించిన దర్శకుడు ఆయనను ఖారారు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంతవరకు సినిమా యూనిట్ స్పష్టత ఇవ్వలేదు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమలైన లాక్డౌన్ కారణంగా షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇటీవల షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో ప్రస్తుతం ‘ఆచార్య’ హైదరాబాద్‌లోని రామోజీ ఫీలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. మరికొద్ది రోజుల్లో చిరంజీవి షూటింగ్లో పాల్గొననున్నారు. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ వచ్చే నెల మొదటి వారంలో షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. (చదవండి: పారితోషికం తీసుకోవడంలేదు) -
నవ్వించడానికి రెడీ
నాగశౌర్య హీరోగా ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేష¯Œ ్స పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నారా రోహిత్ కెమెరా స్విచాన్ చేయగా, డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్క్రిప్ట్‌ను అనీష్ కృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నాగశౌర్య విభిన్న కథాచిత్రాలతో సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నా మొదటి సినిమా ‘అలా ఎలా?’తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని ఫుల్‌గా నవ్విస్తాను. సినిమా అంతా వినోదాత్మకంగా సాగుతుంది’’ అన్నారు అనీష్ కృష్ణ. ‘‘డిసెంబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ కోవిడ్ టైమ్‌లో మేం పిలవగానే వచ్చిన కొరటాల శివ, అనిల్ రావిపూడి, నారా రోహిత్, నాగవంశీగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు ఉషా ముల్పూరి. ఈ కార్యక్రమంలో సహనిర్మాత బుజ్జి, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
కొరటాల శివతో ఏజెంట్?
ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఎక్కువ శాతం బ్యాలెన్స్ ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తోనూ ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు కొరటాల. తాజాగా ఆయన నెక్ట్స్ సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఆచార్య’ పూర్తి చేసి, అల్లు అర్జున్ సినిమా ప్రారంభం అయ్యేలోగా ఓ చిన్న ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయాలనుకుంటున్నారట. ఈ సినిమా కోసం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో నవ్వులు పంచిన నవీన్ పోలిశెట్టిని హీరోగా తీసుకోవాలనుకుంటున్నారని టాక్. ఇదో పూర్తి స్థాయి ప్రేమకథ అని సమాచారం. -
చెక్ ఎవరికి?
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘చెక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను, ప్రీ లుక్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు. ఈ సినిమా గురించి ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో నితిన్ విశ్వరూపం చూస్తారు. సినిమాలో ఎవరు ఎవరికి చెక్ పెడతారన్నది సస్పెన్స్’’ అన్నారు. ‘‘ఉరిశిక్ష పడ్డ ఖైదీ పాత్రలో నితిన్ కనిపిస్తారు. చదరంగం నేపథ్యంలో చిత్రకథ ఉంటుంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది’’ అన్నారు చంద్రశేఖర్ యేలేటి. పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, సాయిచంద్, సంపత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. -
ప్రీలుక్ రిలీజ్: ‘చెక్’ పెట్టనున్న నితిన్
ఈ ఏడాది ‘భీష్మ’ సినిమాతో అందరిని ఆకట్టుకున్న హీరో నితిన్ ప్రస్తుతం ‘రంగ్‌దే’ సినిమా చేస్తున్నాడు. కీర్తీ సురేశ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రంగ్‌దే సినిమానే కాకుండా నితిన్.. బాలీవుడ్ ‘అంధాధున్’ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్‌రెడ్డి(నితిన్ తండ్రి), నిఖితారెడ్డి(నితిన్ సోదరి) నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. నవంబరులో సినిమాను సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ మధ్యే పెళ్లి చేసుకున్న నితిన్ ఇటు కొత్త సినిమాలను కూడా వెనువెంటనే ఓకే చెప్పెస్తున్నాడు. ఈ రెండు సినిమాలు చేతిలో ఉండగానే నితిన్ త్వరలో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. (అన్ని జాగ్రత్తలతో సెట్స్ పైకి...) ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం,సాహసం, మనమంతా వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో కొత్త సినిమాను చేసేందుకు నితిన్ తయారయ్యాడు. దీనికి సంబంధించిన ప్రకటనను ఈ రోజు(గురువారం) డైరెక్టర్ కొరటాల శివ అధికారికంగా విడుదల చేశారు. సినిమా పేరును చెక్‌గా ప్రకటిస్తూ ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘నాకు ఇష్టమైన దర్శకుడు చంద్రశేఖర యేలేటి, హీరో నితిన్‌ల కొత్త సినిమా ప్రీ లుక్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. Happy and delighted to launch the title and pre look of my favourite director #ChandraSekharYeleti and @actor_nithiin’s new movie. Wishing all the best to #BhavyaCreations pic.twitter.com/bmyT8KPPjy — koratala siva (@sivakoratala) October 1, 2020 వీ ఆనంద్ నిర్మాతగా వ్యవహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ సోస్టర్‌ను చూస్తుంటే చేతికి సంకేళ్లు, చెస్‌లోని కాయిన్స్‌తోపాటు ఇనుప కంచె కన్పిస్తోంది. దీంతో డిఫరెంట్ జోనర్లో సాగే థ్రిల్లర్ మూవీగా, ఇప్పటి వరకు నితిన్ నటించిన అన్ని సినిమాల కంటే కాస్తా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉత్తమ జాతీయ అవార్డుతోపాటు చంద్రశేఖర్ రెండు నంది అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. (డైరెక్టర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నితిన్) -
ఆగేది లేదు!
సినిమా షూటింగ్‌లను మళ్లీ ఎలా ప్రారంభించాలి? ప్రారంభిస్తే ఎలా పూర్తి చేయాలి? ఎంత త్వరగా పూర్తి చేయాలి? అనే ప్లానింగ్‌లో అన్ని సినిమా బృందాల వాళ్లు ఉన్నారు. అయితే ‘ఆచార్య’ చిత్రబృందం ఓ ప్లాన్ సిద్ధం చేసినట్టు సమాచారం. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మాతలు. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన మిగతా చిత్రీకరణ మొత్తాన్ని ఏకధాటిగా సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని ‘ఆచార్య’ చిత్రబృందం భావిస్తున్నారట. ఆల్రెడీ సగానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని మొదలుపెడితే పూర్తి చేసేదాకా ఆగేది లేదన్నది యూనిట్ ఆలోచన అని సమాచారం. ఈ సినిమాలో రామ్‌చరణ్ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. -
'ఆచార్య' కథ వివాదంపై చిత్రయూనిట్ క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమా మోషన్ పోస్టర్ చూసిన తర్వాత ఓ యువ రచయిత ఇది తన కథే అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను ఆచార్య చిత్ర యూనిట్ తోసిపుచ్చింది. ఆచార్య కథపై వస్తున్న కాపీ ఆరోపణలు నిరాధారమైనవని గురువారం అధికారికంగా ప్రకటన వెలువడించింది. "ఆచార్య ఒరిజినల్ కథ. ఈ కథ, కాన్సెప్ట్ పూర్తిగా దర్శకుడు కొరటాల శివకు మాత్రమే చెందుతుంది. ఈ కథ కాపీ అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారం. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఆచార్య పోస్టర్‌ను రిలీజ్ చేశాం. దీనికి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజ్ చూసి కొందరు రచయితలు ఇది వారి కథే అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. (చదవండి:చిరు ఫ్యాన్స్‌కు పండుగే.. డబుల్ ధమాకా!) నిజానికి ఈ సినిమా కథ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అలాంటిది కేవలం మోషన్ పోస్టర్ చూసి కథ కాపీ చేశారనడం హాస్యాస్పదంగా ఉంది. ఆచార్య కథ పూర్తిగా ఒరిజినల్. కొరటాల శివలాంటి దిగ్గజ దర్శకులపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న రూమర్ల ఆధారంగా ఈ ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారం, ఎవరికి వారు ఊహించుకున్నవి మాత్రమే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆచార్య చిత్రాన్ని త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం" అని చిత్రయూనిట్ తెలిపింది. (చదవండి: ఆచార్య కోసం ఆలయం) -
థ్యాంక్యూ మోహన్‌బాబు: చిరంజీవి
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. మెడలో ఎర్ర తుండు, చేతిలో కత్తితో సీరియస్ లుక్‌లో ఉన్నారు చిరు. మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మోషన్ పోస్టర్లో ఓ ఆకర్షణలా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో చిరంజీవి ఉద్యమకారుడిగా నటిస్తున్నారని సమాచారం. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది. మిత్రుడికి చిరు కానుక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చెక్కతో తయారు చేసిన హ్యార్లీ డేవిడ్సన్ బైక్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు మోహన్‌బాబు. ‘నా చిరకాల మిత్రుడు తొలిసారిగా నా పుట్టినరోజునాడు ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. థ్యాంక్యూ మోహన్‌బాబు’ అని ఆ బైక్‌తో దిగిన ఫోటోను ట్వీట్ చేశారు చిరు. మోహన్‌బాబు కానుక ఇచ్చిన చెక్క బైక్‌తో చిరంజీవి -
క్రేజీ కాంబినేషన్
‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్‌పైన ఉండగానే వరుస హిట్లతో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారు అల్లు అర్జున్. ఈ క్రేజీ కాంబినేషన్లో యువ సుధ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్నారు. ప్యాన్ ఇండియా రేంజ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రానికి మరో అగ్ర నిర్మాణ సంస్థ జీఏ 2 పిక్చర్స్ భాగస్వామిగా ఉండనుంది. అల్లు అర్జున్ మిత్రులు శాండీ, స్వాతి, నట్టిలు జీఏ 2 పిక్చర్స్ సారథ్యంలో ఈ చిత్రానికి సహనిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. -
మెగాస్టార్ సినిమాలో మిల్కీ బ్యూటీ!
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాను చిరంజీవి తనయుడు మెగా పవర్‌స్టార్ రాంచరణ్, నిరంజన్‌రెడ్డిలు కొణిదెల ప్రొడక్షన్లో నిర్మిస్తున్నారు. హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పేరును ప్రకటించినప్పటి నుంచి చిరు సినిమాలో పలువురు అగ్రనటులు కీలక పాత్రలో కనిపించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి: మెగాస్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ?) ఈ పాత్ర కోసం మొదట దర్శక నిర్మాతలు కీర్తి సురేష్ పేరును అనుకున్నట్లు గత వారం వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్‌గా తమన్నా పేరును ఖరారు చేశారంట. ఇటీవల తమన్నాకు వీడియో కాల్ ద్వారా దర్శకుడు పాత్రను వివరించగా వెంటనే మిల్కీ బ్యూటీ ఓకే చెప్పినట్లు సినీ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇప్పటికే చిరు ‘సైరా నర్సింహారెడ్డి’లో తమన్నా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ ఇందులో ఆమె పాత్రకు మంచి స్పందన కూడా వచ్చింది. మెగాస్టార్ 152వ చిత్రమైన ‘ఆచార్య’కు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను మార్చి మొదటి వారంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ‘ఆచార్య’ షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభంకానుంది. (చదవండి: ‘ఆచార్య’లో మహేశ్.. చిరు స్పందన) -
మరో కమిట్మెంట్
ఓ ప్లాన్ ప్రకారం కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లున్నారు అల్లుఅర్జున్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమా కమిట్ అయ్యారు. ఈ చిత్రం తర్వాత కూడా మరో చిత్రానికి కమిట్మెంట్ ఇచ్చారట అల్లు అర్జున్. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అంటే ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో కొరటాల శివ పేరు వినిపిస్తోంది. మరి.. అల్లు అర్జున్ – కొరటాల శివ కాంబినేషన్ కుదురుతుందా? వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాతో కొరటాల శివ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
‘ఆచార్య’ నుంచి తప్పుకోవడం లేదు
మెగాస్టార్ చిరంజీవి సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరాటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు సగం వరకు పూర్తయింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదాపడింది. ఇక ఈ సినిమా గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. తొలుత ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషను తీసుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అచార్య నుంచి త్రిష తప్పుకున్నారు. త్రిష స్థానంలో కాజల్ అగర్వాల్‌ను చిత్ర బృందం తీసుకున్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఆచార్య నుంచి కాజల్ కూడా తప్పుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఈ వార్తలను కాజల్ సన్నిహితులు కొట్టిపారేశారు. ఆచార్యలో చిరంజీవితో నటించేందుకు కాజల్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని, ఈ సినిమా కోసం కాల్షీట్లు కూడా ఎక్కువనే కేటాయించారని చెబుతున్నారు. చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ (2017)లో కాజల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ జంట స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో ‘ఆచార్య’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్యతో పాటు పవన్ సినిమాకు కూడా కాజల్ సైన్ చేసినట్లు టాక్. చదవండి: సినిమాల్లోకి రీఎంట్రీ.. రేణు దేశాయ్ గ్రీన్‌సిగ్నల్ మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నెక్ట్స్ ఫిక్స్?
ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్లో 152వది. చిరంజీవి హీరోగా నటించే 153వ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే చర్చ జరుగుతోంది. దర్శకులు మెహర్ రమేష్, సుజిత్, కేఎస్ రవీంద్ర (బాబీ)లతో సినిమాలు చేయాలనుకుంటున్నానని చిరంజీవి ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు. మరి ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరి కథతో ఆయన 153వ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందంటే దర్శకుడు బాబీ చెప్పిన కథ అని తాజా సమాచారం. బాబీ స్టోరీ మొత్తం రెడీ చేసి, చిరంజీవికి వినిపించారట. కథ నచ్చి, చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. -
10 కోట్ల వ్యూస్.. సంబరంలో మహేశ్ ఫ్యాన్స్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, సందేశాత్మక చిత్రాల డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘శ్రీమంతుడు’ . ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూమీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ‘ఆగడు’వంటి డిజాస్టర్ తర్వాత మహేశ్‌ను నిలబెట్టడంతో పాటు, అయన మార్కెట్‌ను అమాంతం పెంచింది ‘శ్రీమంతుడు’ . తాజాగా ఈ సినిమా మరో ఘనతను అందుకుంది. యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా శ్రీమంతుడు రికార్డుల్లోకెక్కింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తెలిపింది. 2015లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు టీవీల్లో ప్రసారమైంది. అయితే కేవలం యూట్యూబ్‌లో 10 కోట్లకు పైగా మంది వీక్షించడం విశేషం. మామూలుగా తెలుగు సినిమా హిందీలో డబ్ అయితే ఇన్ని వ్యూస్ వస్తాయి. కానీ ఓ తెలుగు సినిమాకు ఏకంగా ఇన్ని వ్యూస్ రావడం ‘శ్రీమంతుడు’కే దక్కింది. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, జగతిబాబు, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిగా మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై మహేష్ బాబు, నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్ సంయుక్తంగా నిర్మించారు. #Record100MForSRIMANTHUDUhttps://t.co/XaQuDXKl7j pic.twitter.com/3YK21BdMWP — Mythri Movie Makers (@MythriOfficial) April 17, 2020 చదవండి: మీ నిస్వార్థ సేవకు సెల్యూట్: మహేశ్ బాబు పుష్ప కోసం హోమ్‌వర్క్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
త్వరలోనే రిటైర్మెంట్ : కొరటాల శివ
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే త్వరలో కొరటాల రిటైర్మెంట్ తీసుకోనున్నారట. దర్శకుడిగా తాను కేవలం 10 సినిమాలు మాత్రమే తెరకెక్కించాలని నిర్ణయించుకుని ఇండస్ట్రీకి వచ్చినట్లు కొందరి సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం. దర్శకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. ఇదే విషయాన్ని పలువురు నిర్మాతలకు సైతం చెప్పినట్లు తెలుస్తోంది. తన దగ్గరున్న 10 కథలు మాత్రమే డైరెక్ట్ చేసి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో కొనసాగినా కూడా దర్శకత్వం వైపు మాత్రం వెళ్లనని, నిర్మాతగా సినిమాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కొరటాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. (కొబ్బరిబొండాం చికెన్ రైస్ తింటారా.. ) 2013లో మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కొరటాల.. ఆ తరువాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాల ద్వారా వరుసగా నాలుగు హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక స్టైల్ ఉంటుంది. తన ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక అంశాన్ని ప్రధానంగా చూపించే ఆయన.. ప్రేక్షకుల్లో అవేర్నెస్ తీసుకొస్తుంటారు. ఇక ప్రస్తుతం కొరటాల, మెగాస్టార్ చిరంజీవితో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆచార్య అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. (విద్యార్థులూ.. ‘లాక్డౌన్’లో ఇలా ప్రిపేర్ అవ్వండి! ) కాగా మరో టాప్ దర్శకుడు సుకుమార్ సైతం.. నాన్నకు ప్రేమతో సినిమా తరువాత తాను ఇంకో రెండు, మూడు సినిమాలు తీసి రిటైర్మెంట్ తీసుకుంటానని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు సైతం సుకుమార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ అప్పట్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. (మహమ్మారి నీడన దక్షిణ కొరియాలో పోలింగ్ ) -
‘ఆచార్య’ ఫస్ట్‌లుక్ ఆరోజే..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. చిరు సరసన కాజల్ నటిస్తోంది. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్‌పై గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నా ఇటీవలే ‘ఓ పిట్ట కథ’ సినిమా ఆడియో వేడుకలో చిరంజీవి అనుకోకుండా టైటిల్ ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ మీద సస్పెన్స్ వీడిపోవడంతో ఇప్పుడంతా ఈ చిత్ర ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది సందర్భంగా ఫస్ట్‌లుక్ విడుదల చేస్తారని ఆశగా ఎదురు చూసిన ఫ్యాన్స్‌కు కొంత నిరాశ ఎదురైంది. చిరు సోషల్ మీడియా ఎంట్రీ ఆ లోటును భర్తీ చేసింది. (చదవండి : కరోనాపై పోరాటం: చిరంజీవి, మహేశ్‌లు సైతం) అయితే తాజాగా ఆచార్యకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 2న ఆచార్య నుంచి చిరంజీవి ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని చిత్రం బృందం భావిస్తోందట. లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన చిత్ర బృందం.. అక్కడి నుంచే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం కోసం కృషి చేస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. అన్ని కుదిరితే రాములోరి పండక్కి.. మెగా ఫ్యాన్స్‌కు పెద్ద అదిరిపోయే గిఫ్ట్ అందినట్లే. మరోవైపు ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. తొలి రోజు నుంచే కరోనావైరస్పై అవగాహన కల్పిస్తున్నారు. సినీ కార్మికులకు విరాళాలు అందజేసిన వారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు సి. సి. సి. మనకోసం (కరోనా క్రై సిస్ చారిటీ మనకోసం) అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు చిరంజీవి చైర్మన్‌గా ఉన్నారు. ఇప్పటికే పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు కరోనా క్రై సిస్ చారిటీకి పెద్దమొత్తంలో విరాళాలు అందజేశారు. -
చిరంజీవి హీరోయిన్ ఎవరో ఫిక్సయింది!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషను ఎంపిక చేశారు. అయితే పలు కారణాలతో ‘ఆచార్య’ నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష అధికారికంగా ప్రకటించింది. దీంతో మరో కథానాయిక వేటలో పడ్డారు చిత్ర బృందం. ఈ క్రమంలో తొలుత అనుష్కతో ‘ఆచార్య’ బృందం చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అనుష్కతో పాటు మరి కొంతమంది బామల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. సౌతిండియాలో ఆగ్రనటిగా వెలుగొందుతున్న నయనతార చిరు చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నప్పటికీ భారీ పారితోషకం అడగడంతో ఆమెను పక్కకు పెట్టారు. ఇక అన్ని ప్రయత్నాలు చేసిన కొరటాల శివ బృందం చివరికి కాజల్ అగర్వాల్‌ను ఫైనల్ చేశారట. ‘ఖైదీ నంబర్ 150’ లో చిరు-కాజల్‌ల కాంబినేషన్ కూడా ఫర్ఫెక్ట్ సెట్ అవడంతో మరోసారి ఇదో జోడిని రిపీట్ చేస్తే బాగుంటుందని ‘ఆచార్య’ బృందం బావించిందని విశ్వసనీయ సమాచారం. చిరు సరసన నటించే అవకాశం మరోసారి రావడంతో కాజల్ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పెసిందని టాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్‌చరణ్ సరసన నటించే మరో హీరోయిన్ కోసం కూడా చిత్రం బృందం వెతుకులాటా ప్రారంభించింది. -
ఆయనను క్షమాపణలు కోరిన మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా టైటిల్‌ను దర్శకుడు ఇంతవరకూ రిలీజ్ చేయలేదు. దీంతో చిరు సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. సినిమా పేరు ఏమై ఉంటుందా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా దర్శకుడు శివ ఈ సినిమా టైటిల్‌ను సీక్రెట్‌గా ఉంచి అభిమానులకు థ్రిల్ ఇద్దామనుకుంటే.. చిరు నీళ్లు జల్లారు. కాగా నటుడు బ్రహ్మాజీ కొడుకు నటిస్తున్న ‘ఓ పిట్టకథ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అదివారం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరు స్టేజీపై తన సినిమా గురించి మాట్లాడారు. ఇక మాటల మధ్యలో సినిమా టైటిల్ ‘ఆచార్య’ అని చెప్పేశాడు. ఇక అభిమానులకు తమ సినిమా టైటిల్ తెలిసిపోయిందని దర్శకుడు తలపట్టుకుంటున్నాడు. కాగా చిరు అనుకోకుండా టైటిల్ చెప్పడంతో దర్శకుడికి ఆయన సారీ కూడా చెప్పారు. కష్టపడితే స్టార్లు అవుతారు -
చిరు సినిమాలో మహేశ్‌బాబు..!
మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్ కనిపించబోతున్నారా? మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్త ఇది. మెగాస్టార్ చిరంజీవికి సూపర్ స్టార్ మహేశ్‌బాబు అతిథి కాబోతున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమాలోనే ఈ విశేషం జరగనుందని టాక్. ఇప్పటివరకూ మహేశ్‌బాబు తాను హీరోగా నటించని ‘జల్సా’, ‘బాద్షా’, ‘శ్రీశ్రీ’, ‘మనసుకు నచ్చింది’ చిత్రాలకు వాయిస్ అందించారు. ఒకవేళ వార్తల్లో ఉన్నట్లు చిరంజీవి సినిమాలో మహేశ్ నటిస్తే మొదటిసారి అతిథి పాత్రలో కనిపించినట్లు అవుతుంది. (చదవండి : బోర్ కొట్టట్లేదా.. ఎప్పుడూ ఇదే పనా : మహేశ్) కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే... చిత్రదర్శకుడు కొరటాల శివతో ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ చిత్రాల్లో మహేశ్ నటించిన విషయం తెలిసిందే. మరి.. చిరు–కొరటాల సినిమాకి మహేశ్ అతిథి అవుతారా? వెయిట్ అండ్ సీ. -
ఆచార్య... లుక్ అదుర్స్
ప్రత్యర్థులపై పులిలా పంజా విసురుతున్నారట చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోలవరం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని సమాచారం. చిరంజీవిపై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అయితే తాజాగా ‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి లుక్ ఇదేనంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక్కడున్న ఫొటో చూసిన చిరంజీవి అభిమానులు ‘ఆచార్య.. లుక్ అదిరిందయ్యా!’ అంటున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ ఓ కీలక పాత్ర చేయబోతున్నట్లు ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు. -
‘లూసిఫర్’ బాధ్యతలు సుకుమార్‌కు?
మలయాళంలో సంచలన విజయం సాధించిన చిత్రం ‘లూసిఫర్’. మోహన్‌లాల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆక్కడ ఎంతటి ట్రెండ్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ సినిమాలోని హీరో ఎలివేషన్ సీన్స్ చాలా కొత్తగా సూపర్బ్‌గా ఉంటాయి. కాగా, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కోసం ‘లూసిఫర్’ చిత్ర తెలుగు హక్కులను మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ చిత్రంతో బిజీగా ఉన్న చిరంజీవి ఆ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్‌ను పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించే బాధ్యతను క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్‌కు రామ్‌చరణ్ అప్పగించనట్టు టాలీవుడ్ టాక్. అంతేకాకుండా లూసిఫర్‌లో పృథ్వీరాజ్ పాత్రను రామ్‌చరణ్ పోషించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ముందుగా డైరెక్టర్ పరుశురామ్‌తో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావించినప్పటికీ యూత్‌లో ఉన్న క్రేజ్‌తో ఆ బాధ్యతను సుకుమార్‌కు అప్పగించారని టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్ చిత్రంతో సుకుమార్, కొరటాల శివ చిత్రంతో చిరంజీవి బిజీబిజీగా ఉన్నారు. వీరిద్దరి సినిమాలు ఈ ఏడాది చివర్లో పూర్తి కానున్నాయి. ఆ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్‌ను పట్టాలెక్కించే అవకాశం ఉంది. అయితే చిరంజీవి తన తదుపరి చిత్రం త్రివిక్రమ్‌తో తీసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. సినిమాల్లో రీఎంట్రీ తర్వాత ‘ఖైదీ 150’, ‘సైరా’, ప్రస్తుతం ‘ఆచార్య(అనధికారిక టైటిల్)’ వంటి సామాజిక, పీరియాడిక్ అంశాలను ఎంచుకున్న మెగాస్టార్ తన తదుపరి చిత్రం వినోదాత్మకంగా ఉండాలనే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా లూసిఫర్‌ను మరికొంత కాలం ఆపి త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేశాక ఆ చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నారట. అంతేకాకుండా లూసిఫర్‌ను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసేందుకు తగిన సమయం కావాలని సుకుమార్ బృందం కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆలస్యమైనా ‘లూసిఫర్’ చిత్రాన్ని సుకుమార్‌తోనే తెరకెక్కించాలని రామ్‌చరణ్ భావిస్తున్నాడట. చదవండి: ‘పారాసైట్’ విజయ్ మూవీ కాపీనా..! అప్పుడు అభిమన్యుడు.. ఇప్పుడు శక్తి -
రాజమండ్రి ప్రయాణం
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తు న్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిత్రబృందం ఈ నెల 24న రాజమండ్రి ప్రయాణం కానున్నారని సమాచారం. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. రాజమండ్రిలో ఓ కీలక షెడ్యూల్ ప్లాన్ చేశారట చిత్రబృందం. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు, కీలక సన్నివేశాలు ప్లాన్ చేశారని టాక్. ఈ షెడ్యూల్లోనే త్రిష షూటింగ్లో జాయిన్ అవుతారట. ఆల్రెడీ ఒక పాట కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేశారు. 80–90 రోజుల మధ్యలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, ఆగస్ట్‌లో విడుదల చేయాలను కుంటున్నారట. -
మోహన్‌బాబు న్యూలుక్.. చిరు కోసమే..!
టాలీవుడ్ కథానాయకుడు, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు న్యూలుక్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవీ సినిమా కోసమే ఆయన న్యూలుక్‌తో ఫోటోషూట్‌లో పాల్గొన్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. చిరు సినిమాలో విలన్ పాత్ర కోసం మోహన్‌బాబును కొరటాల శివ కలిశాడని, దానికి ఆయన అంగీకరించారని టాలీవుడ్ టాక్. ఈ నేపథ్యంలో తాజాగా వైరల్ అయిన మోహన్‌బాబు న్యూలుక్ ఫోటోలు పుకార్లకు ఆజ్యం పోస్తున్నాయి. చిరు సినిమా కోసమే ఆయన కొత్త లుక్‌లో ఫోటోషూట్ చేశారని వార్తలు వస్తున్నాయి. నెటిజన్లు సైతం ఆయన లుక్‌ను ప్రశంసిస్తున్నారు. కాగా, గతంలో వీరింద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బిల్లా రంగా’,‘పట్నం వచ్చిన ప్రతివతలు’మంచి విజయాన్ని సాధించాయి. చిరంజీవీ హీరోగా చేసిన పలు చిత్రాలలో మోహన్‌బాబు విలన్‌గా నటించారు. ప్రస్తుతం మోహన్‌బాబు సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ఆకాశం నీ హద్దురాలో నటిస్తున్నారు. -
పిట్టకథే కానీ పెద్ద కథ
‘‘పిట్టకథ టైటిల్ చాలా బాగుంది. ఇండస్ట్రీలో ఈ మధ్య పిట్టకథ గురించే చర్చ జరుగుతోంది. ఇది పిట్టకథే కానీ చాలా పెద్ద కథ అని నమ్ముతున్నాను. ‘ఓ పిట్టకథ’ ఈ వేసవిలో ప్రేక్షకులకు చల్లటి ఉపశమనం ఇస్తుంది’’ అని డైరెక్టర్ కొరటాల శివ అన్నారు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేష¯Œ ్స పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా క్యారెక్టర్స్ పోస్టర్‌ను కొరటాల శివ ఆవిష్కరించారు. చెందు ముద్దు మాట్లాడుతూ– ‘‘ఒక పల్లెటూరులో జరిగే కథ ఇది. వినోదం, ఉత్కంఠను రేకెత్తిస్తుంది’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు వి.ఆనందప్రసాద్. ‘‘మార్చిలో సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి. ఈ చిత్రానికి కెమెరా: సునీల్ కుమార్ య¯Œ , సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
చిరు సినిమాలో విలన్‌గా స్టార్ హీరో.!
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు విలన్‌గా నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మోహన్‌బాబును కొరటాల శివ సంప్రదించారని టాక్. మోహన్ బాబుకు కొరటాల స్క్రిప్ట్‌ను నెరేట్ చేశారట. అయితే, మోహన్ బాబు ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని సమాచారం. ఒకవేళ మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే విలన్ పాత్ర ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. కాగా, గతంలో వీరింద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ బిల్లా రంగా’, ‘పట్నం వచ్చిన ప్రతివతలు’ మంచి విజయాన్ని సాధించాయి. చిరంజీవీ హీరోగా చేసిన పలు చిత్రాలలో మోహన్‌బాబు విలన్‌గా నటించారు. -
యాక్షన్
మాట వినని రౌడీలకు చేత్తో సమాధానం చెబుతున్నారు చిరంజీవి. మరి దెబ్బలు తిన్నాకైనా మాట విన్నారా? ఆ సంగతి సినిమా చూసి తెలుసుకోవాలి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు సుమారు 20 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ నగర శివార్లలో ఓ భారీ సెట్‌ను నిర్మించారని తెలిసింది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఆ సెట్లో చిత్రీకరిస్తారట. ఆగస్ట్‌లో ఈ సినిమా విడుదల కానుంది. -
కొబ్బరికాయ కొట్టిన ‘టక్ జగదీష్’
నేచురల్ స్టార్ నాని తన 26వ సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘టక్ జగదీష్’అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలై ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో పలువురు టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాల అనంతరం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేవుడి చిత్ర పటాలపై టాలీవుడ్ ఆగ్ర నిర్మాత దిల్ రాజ్ క్లాప్ కొట్టారు. చిత్ర యూనిట్‌కు దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ అందించగా, నవీన్ ఎర్నేని కెమెరా స్విచ్చాన్ చేశాడు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల ఆరంభం నుంచి జరుపుకోనుంది. నిన్ను కోరి, మజిలీ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న దర్శకుడు శివ నిర్వాణ. ఈ లవ్ డైరెక్టర్ తనకు తొలి అవకాశం ఇచ్చిన హీరో నానితో చేస్తున్న చిత్రమే ‘టక్ జగదీష్’ . ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో సినిమాపై పాజిటీవ్ బజ్ క్రియేట్ అయింది. హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మించనున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక విడుదలకు సిద్దంగా ఉన్న ‘వి’ చిత్రంతో నాని బిజీగా ఉన్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావు హైదరిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చదవండి: నేనే నానీనే! ‘దిల్’ రాజుకి ఏమైనా మెంటలా అనుకున్నారు -
152.. షురూ
‘సైరా: నరసింహారెడ్డి’ వంటి భారీ పీరియాడికల్ చిత్రం తర్వాత చిరంజీవి హీరోగా నటించనున్న కొత్త చిత్రం చిత్రీకరణ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇది చిరంజీవి కెరీర్లో 152వ చిత్రం. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన తొలి షెడ్యూల్లో ఓ పాటతో పాటు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. ఇందులో చిరంజీవి రైతుగా, ప్రొఫెసర్‌గా రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తిరు ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు. కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో చిత్రబృందం ప్రకటిస్తుంది. -
చిరు ఆగయా.. ప్రచారంలో ఆ మూడు!
‘సైరా నరసింహారెడ్డి’చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ మధ్య ఓ మంచి రోజు చూసి కొబ్బరికాయ కొట్టి షూటింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఇన్ని రోజులు ప్రి ప్రొడక్షన్స్ పనులు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి ఆరంభమైంది. హైదరాబాద్ శివార్లలో వేసిన ఓ సెట్లో బాస్(చిరంజీవి) అడుగుపెట్టారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అయితే మెగాస్టార్ షూటింగ్లో అడుగుపెట్టిన రోజునే చిత్ర బృందం సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ను ఫ్యాన్స్‌కు తెలిపింది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. దీంతో చిరు-మణిల కాంబో సంగీత ప్రియుల్ని మరోసారి మైమరిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అయితే లీకువీరులు అందించిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష నటించనుందని సమాచారం. అంతేకాకుండా ఐటమ్ సాంగ్ కోసం చిత్ర బృందం రెజీనాను సంప్రదించగా ఆమె తిరస్కరించిందని టాలీవుడ్ టాక్. అయితే టాలీవుడ్ మెగాస్టార్ సినిమాలో అందివచ్చిన అవకాశాన్ని రెజీనా చేజేతులా వృథా చేసుకుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇక ఈ ఐటమ్ సాంగ్‌ను మాస్ ఆడియన్స్ ఊగిపోయే రీతిలో మణిశర్మ కంపోజ్ చేశారని కూడా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్ కొరటాల శివ.. ఈ చిత్రాన్ని తనదైన రీతిలో కాన్సెప్ట్ బేస్డ్తో పాటు మాస్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో చాలా హుందాతనం కలిగిన రోల్ కావడంతో చిరు ఈ పాత్రకు తగ్గట్లుగా రెడీ అవ్వడానికి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో చిరు లుక్ ఇదేనంటూ ఓ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు.. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘గోవిందాచార్య’ మరియు ‘గోవిందా హరి గోవిందా’ ‘ఆచార్య’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే మూవీ టైటిల్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని ఆగష్టు 14న విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం మోహన్‌బాబును ఆలింగనం చేసుకున్న చిరంజీవి We are delighted to announce that Mani Sharma garu is scoring music for #Chiru152. Welcome onboard sir! — Konidela Pro Company (@KonidelaPro) January 2, 2020 -
కొరటాల మూవీలో మెగా రోల్ ఇదే!
హైదరాబాద్ : సైరా మూవీతో గ్రాండ్ పీరియాడికల్ మూవీలో నటించాలన్న కోరిక నెరవేర్చుకున్న మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సామాజిక సందేశం అందించే విలక్షణ పాత్రను రక్తికట్టించనున్నారు. రాంచరణ్ ప్రొడ్యూస్ చేస్తూ చిరంజీవి 152వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీలో ఆయన దేవాదాయ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి క్యారెక్టర్లో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం తీరైన ఆకృతితో అభిమానులను అలరించేందుకు మెగాస్టార్ రెగ్యులర్‌గా జిమ్‌లో చెమటోడుస్తున్నారు. ఈ మూవీతో చిరు సరసన ఆడిపాడేందుకు భారీ విరామం తర్వాత చెన్నై భామ త్రిష తెలుగులో రీఎంట్రీ ఇవ్వనున్నారు. జనవరి మాసాంతంలో లేదా ఫిబ్రవరి తొలివారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ మూవీకి మణిశర్మ స్వరాలు సమకూర్చనున్నట్టు తెలిసింది. -
ఛలో రాజమండ్రి
చిత్రబృందంతో కలసి రాజమండ్రిలో ల్యాండ్ అవడానికి స్కెచ్ గీస్తున్నారు కొరటాల శివ. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిచాలనుకుంటున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటించనున్నారని సమాచారం. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను రాజమండ్రిలో చిత్రీకరించాలనుకుంటున్నారట. అక్కడ లొకేషన్స్ వెతికే పనిలో ఉందట యూనిట్. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
టైటిల్ నాకు బాగా నచ్చింది
విజయ్‌రామ్, శివశక్తి సచ్దేవ్ జంటగా జోనాథన్ ఎడ్వర్డ్ దర్శకత్వంలో వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘అమరం అఖిలం ప్రేమ’. ‘ప్రేమించటం అంటే ప్రేమిస్తూనే ఉండటం’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ దర్శకులు సుకుమార్, కొరటాల శివ ఆవిష్కరించారు. ‘‘అమరం అఖిలం ప్రేమ’ టైటిల్ నాకు బాగా నచ్చింది. ప్రసాద్‌గారు నిర్మాతగా సక్సెస్ కావాలి’’ అన్నారు కొరటాల శివ. ‘‘ప్రసాద్, నేను లెక్చరర్స్‌గా కలిసి పనిచేశాం. ఆయన ఈ సినిమాతో నిర్మాతగా మారడం చాలా సంతోషంగా ఉంది. ఆర్టిస్టుగా బాగా పెర్ఫార్మ్ చేయగలిగితే, హీరోగా చేయడానికి అంత కన్నా పెద్ద లక్షణం అవసరం లేదు. అది విజయ్‌రామ్‌లో చూశాను. జోనాథన్ తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ చూసి స్ఫూర్తి పొందాను. జోనాథన్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ సినిమాకు శ్రీకాంత్ మంచి డైలాగ్స్ రాశాడు. అల్లు అర్జున్‌తో నేను తెరకెక్కిస్తున్న సినిమాకు శ్రీకాంత్ మాటలు రాస్తున్నాడు’’ అన్నారు. ‘‘సుకుమార్‌గారు లేకుంటే ఈ సినిమా ప్రారంభం అయ్యేది కాదు. ప్రసాద్‌గారు సహనశీలి’’ అన్నారు జోనాథన్. ‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. ఆడిన సినిమా పెద్ద సినిమా అవుతుంది. విజయ్‌రామ్ హీరోగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత ప్రసాద్. కెమెరామెన్ రసూల్ ఎల్లోర్, సంగీత దర్శకుడు రధన్, దర్శకుడు హరి ప్రసాద్ జక్కా, మాటల రచయిత శ్రీకాంత్ విస్సా తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ ట్యూన్ అయ్యారు
చిరంజీవి సినిమా అంటే అభిమానులకు ఒకటో రెండో మాస్ పాటలు ఉండాల్సిందే. అయితే ఇటీవల విడుదలైన ‘సైరా’ కథలో ఆ స్కోప్ లేదు. అందుకే తన తాజా చిత్రంలో ఆ కొరతను తీర్చనున్నారు చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని సమాచారం. చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’లో ‘రామ్మా చిలకమ్మా..’, ‘ఇంద్ర’లో ‘దాయి దాయి దామ్మా..’, ‘జై చిరంజీవా’లో ‘జై జై గణేశా.. జై కొడతా గణేశా..’ వంటి సూపర్ హిట్ పాటలను ఇచ్చిన మణిశర్మ తాజా చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సంగీత చర్చలు విదేశాల్లో జరుగుతున్నాయిని టాక్. చిరంజీవి–మణిశర్మ కాంబినేషన్లో మరో హిట్ ఆల్బమ్ వస్తుందని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తారు. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలవుతుందట. -
కొరటాల మూవీలో మెగా క్యారెక్టర్ ఇదే..!
హైదరాబాద్ : సైరాలో స్వాతంత్ర సమరయోధుడిగా వెండితెరపై అద్భుత నటనను ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే తన 152వ సినిమాలో నక్సలైట్ పాత్ర పోషిస్తారనే ప్రచారం ఊహాగానమేనని వెల్లడైంది. కొరటాల మూవీలో మెగాస్టార్ లెక్చరర్ పాత్రలో అభిమానులను ఆకట్టుకుంటారని తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదలైన సైరా రూ 250 కోట్ల కలెక్షన్లతో చిరు కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంలా నిలిచింది. ఇక కొరటాల శివ మూవీలో తమ హీరోను కొరటాల ఎలా ప్రజెంట్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ మూవీలో చిరును స్లిమ్‌గా కనిపించాలని దర్శకుడు కోరడంతో మెగాస్టార్ జిమ్ చేస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. క్లాస్ లుక్‌తో తనదైన మాస్ స్టైల్‌తో మెగా స్టార్ ఈసారి దుమ్మురేపడం ఖాయమని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కొరటాల మూవీలో మెగాస్టార్ 30 సంవత్సరాల యువకుడిగా, పెద్దవయసు వ్యక్తిగా రెండు పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. అయితే చిరంజీవి యువకుడిగా ఉన్న పాత్రలో దర్శకుడు కోరిన మీదట ఆయన కుమారుడు రామ్‌చరణ్ పోషస్తారని తెలిసింది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి గోవింద్ ఆచార్య, గోవింద హరి గోవింద టైటిల్స్‌ను చిత్ర బృందం పరిశీలిస్తోంది. -
అమెరికా నుంచి రాగానే...
‘‘సైరా’ తర్వాత చేయబోయే సినిమాలో సన్నగా కనిపించడానికి కసరత్తులు మొదలుపెట్టారు చిరంజీవి’’... ఇదిగో ఇక్కడున్న ఫొటో చూసి చాలామంది అలానే అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఎంతో బరువు తగ్గిన చిరంజీవి ఇప్పుడు ఎందుకు బరువు తగ్గాలనుకుంటారు? నిజానికి ఇప్పుడు చిరంజీవి అమెరికాలో ఉన్నారు. మరి.. ఈ ఫిట్నెస్ ట్రైనింగ్‌కి సంబంధించిన ఫొటో సంగతేంటి? అంటే ఇది పాత ఫొటో. ఇక కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేయనున్న సినిమా విషయానికి వస్తే... ఇందులో కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఫొటోషూట్ కూడా అయిపోయింది. ప్రస్తుతం వ్యక్తిగత పనుల మీద అమెరికా వెళ్లిన చిరంజీవి తిరిగి రాగానే డిసెంబర్ మొదటివారం నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తారట. -
సాంగ్‌తో షురూ
చిరంజీవి సినిమా అంటే పాటలు, అందులో ఆయన వేసే స్టెప్స్ హైలైట్. అయితే ‘సైరా’ సినిమాలో అవి మిస్ అయ్యాయి. అందుకే ఇప్పుడు చేసే సినిమాలో ఆ కొరతను తీర్చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ హైలైట్ పాయింట్‌తోనే చిరంజీవితో చేయబోయే సినిమాను ప్రారంభిస్తున్నారట దర్శకుడు కొరటాల శివ. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సామాజిక చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇందులో త్రిష హీరోయిన్గా నటించబోతున్నారని టాక్. ఈ సినిమా చిత్రీకరణను పాటతో మొదలుపెట్టాలని చిత్రబృందం ప్లాన్ చేశారని తెలిసింది. డిసెంబర్ మొదటివారంలో సెట్స్ మీదకు వెళ్లనుందట. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తారని సమాచారం. -
ఆ హీరోయన్‌కు ‘మెగా’ ఆఫర్
ఎక్కడో చూసినట్లుందా ఈ అమ్మాయిని! తెలుగమ్మాయి కనుక సహజంగానే మనకు అలా అనిపిస్తుంది. అనిపించడం కాదు లెండి, చూసే ఉంటారు.. ‘అంతకుముందు, ఆ తర్వాత’ చిత్రంలో అనన్య తను. ‘బందిపోటు’లో జాహ్నవి. ‘అమీతుమీ’లో దీపిక. ‘దర్శకుడు’లో నమ్రత. ‘బ్రాండ్ బాబు’లో రాధ. ‘అరవింద సమేత వీర రాఘవ’లో సునంద. అసలు పేరు ఈషా రెబ్బా! హైదరాబాద్ అమ్మాయి. ఇప్పుడీ అమ్మాయి.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న సినిమాలో కనిపించబోతోంది. హీరోయిన్గా కాకపోవచ్చు. అయినా చిరంజీవితో కలిసి నటిస్తే వచ్చే స్టార్డమ్ కన్నా హీరోయిన్ అవడం ఏమంత ఎక్కువని?! ‘సైరా’ తర్వాత చిరంజీవి నటించబోతున్న ఆ కొత్త సినిమా సోషల్ డ్రామా అంటున్నారు. నిర్మాత.. రామ్ చరణ్. -
ప్రయాణానికి సిద్ధం
‘ప్రణాళిక సిద్ధమైంది. నవంబర్ ద్వితీయార్ధం నుంచి బరిలోకి దిగడమే’ అంటున్నారు చిరంజీవి 152వ సినిమా చిత్రబృందం. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కొణిదెల ఎంటర్టైన్మెంట్స్, మ ాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. త్రిష పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ సెకండ్ హాఫ్ నుంచి ప్రారంభం కానుందని సమాచారం. అజయ్–అతుల్ ద్వయం ఈ చిత్రానికి సంగీత దర్శకత్వ బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తారని టాక్. -
చిరు సందర్శన
చిరంజీవి 152వ సినిమా పనులు వేగంగా సాగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది. కొరటాల శివ ఆఫీస్‌ను సరదాగా సందర్శించారు రామ్‌చరణ్. ఆ సందర్భంలో కొరటాలతో దిగిన ఈ ఫొటోను రామ్‌చరణ్ షేర్ చేసి, ‘‘శివగారి ఆఫీస్‌లో ఎనర్జీ చాలా నచ్చింది. నాన్న 152వ సినిమా తెరకెక్కించబోతున్నందుకు ఆయనకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇక ఇక్కడి ఫొటో చూస్తే చరణ్ అయ్యప్ప దీక్షలో ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. దాదాపు ప్రతి ఏడాదీ చరణ్ అయ్యప్ప మాల వేసుకుంటారు. -
శివను కలిసి వచ్చాను: రాంచరణ్
హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రాంచరణ్ అనుకోకుండా దర్శకుడు కొరటాల శివను కలిశారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన 152వ సినిమాని కొరటాల శివ డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శివ కార్యాలయానికి అలా వెళ్లివచ్చానని రాంచరణ్ శుక్రవారం ఫేస్బుక్లో వెల్లడించారు. ‘శివగారి ఆఫీస్‌కు వెళ్లి వచ్చాను. ఆయన ఎనర్జీ ఎంతగానో నచ్చింది. చిరంజీవి 152వ సినిమాకు ఆల్‌ది బెస్ట్’ అని రాంచరణ్ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చార్లీ చాప్లిన్ ఫొటో ఎదుట తాను, శివతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసుకున్నారు. చారిత్రక నేపథ్యంతో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు రాంచరణ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’. సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు. రాంచరణ్ సరసన ఆలియా భట్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిరు152షురూ
‘ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న 152వ సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్తో వరుస బ్లాక్ బస్టర్స్‌ను సొంతం చేసుకున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం దేవుడి చిత్రపటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్ ఇచ్చారు. ‘‘ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తాం. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి తల్లి అంజనాదేవి, హీరో రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి, చిరంజీవి కుమార్తె సుస్మిత తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: తిరు. -
నా జీవితంలో ఇదొక మార్పు
‘ఆది, దిల్, ఠాగూర్, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ వంటి ఎన్నో హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వీవీ వినాయక్ ‘సీనయ్య’ చిత్రంతో తొలిసారి హీరోగా మారారు. నరసింహ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వినాయక్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకులు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఆది’ సినిమాతో వినయ్(వినాయక్)తో నా ప్రయాణం మొదలైంది. మా సంస్థను స్థాపించిన తర్వాత తొలి సినిమా వినాయక్ దర్శకత్వంలో ‘దిల్’ చేశాం. ఈ సినిమా పేరే మా ఇంటిపేరుగా మార్చేంత హిట్ సాధించింది. 1982–1984 నేపథ్యంలో సాగే కంప్లీట్ ఎమోషనల్ స్టోరీ ‘సీనయ్య’. ఈ సినిమాలో ఎవర్ని హీరోగా అడుగుదామా? అనుకుంటున్న తరుణంలో మా సంస్థలో సినిమాలు చేసిన దర్శకులు గుర్తుకువచ్చారు. ఈ కథకు వినయ్ అయితే సరిపోతాడనిపించి నరసింహతో చెప్పగానే ఎగై్జటింగ్‌గా ఫీలయ్యాడు. ఆ తర్వాత వినయ్‌కు కథ చెప్పడంతో నటిస్తా అన్నాడు. ఈ కథలో భాగమైన హరిని భవిష్యత్‌లో దర్శకుడిగా పరిచయం చేస్తా. వచ్చే ఏడాది వేసవిలో ‘సీనయ్య’ విడుదల చేస్తాం’’ అన్నారు. వినాయక్ మాట్లాడుతూ– ‘‘రాజుగారు ఓ రోజు వచ్చి...‘నువ్వు నన్ను ‘దిల్’ రాజుని చేశావ్. నేను నిన్ను హీరోని చేద్దాం అనుకుంటున్నా’ అన్నారు. నరసింహ చెప్పిన కథ నచ్చి, పాత్ర కోసం బరువు తగ్గాను. ఇప్పుడు ఎలాంటి దుస్తులైనా వేసుకోగలుగుతున్నా (నవ్వుతూ). జీవితంలో నాకు ఇదొక మార్పు’’ అన్నారు. ‘‘మంచి ఎమోషనల్ కథ ఇది’’ అన్నారు నరసింహ. దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, సి.కల్యాణ్, డీవీవీ దానయ్య, అనిల్ సుంకర, బెల్లంకొండ సురేష్, బెక్కం వేణుగోపాల్, వల్లభనేని వంశీ, రచయిత హరి పాల్గొన్నారు. -
చిరంజీవి కొత్త సినిమా షురూ
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని సినిమాకు సంబంధించిన పూజా కార్యాక్రమాన్ని చిత్ర సభ్యులు నిర్వహించారు. ఎలాంటి పెద్ద హడావుడి లేకుండా ఈ వేడుక జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం దేవుడి చిత్రపటాలపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్ కొట్టారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్‌చరణ్, కొరటాల శివతో పాటు అంజనీ దేవి, సురేఖ తదితరులు పాల్గొన్నారు. కాగా సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ రికార్డు కలెక్షన్లతో దూసుకపోతోంది. సినిమా విడుదలై దాదాపు వారమైనా థియేటర్లలో ఇంకా అభిమానుల హడావుడి తగ్గలేదు. ఇప్పటికీ పలు థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయంటే ‘సైరా’ ఏ రేంజ్లో హిట్ అయిందే అర్థం చేసుకోవచ్చు. కాగా, ఇంతటి భారీ విజయం అందుకున్న టాలీవుడ్ మెగాస్టార్ తన తదుపరి చిత్రానికి ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఉగాదికి ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సామాజిక అంశాలతో ఈ చిత్రం స్క్రిప్ట్‌ను కొరటాల శివ రూపొందించినట్లు తెలుస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)