152.. షురూ | chiranjeevi with koratala shiva new movie launch | Sakshi
Sakshi News home page

152.. షురూ

Published Fri, Jan 3 2020 1:46 AM | Last Updated on Fri, Jan 3 2020 1:46 AM

chiranjeevi with koratala shiva new movie launch - Sakshi

చిరంజీవి

‘సైరా: నరసింహారెడ్డి’ వంటి భారీ పీరియాడికల్‌ చిత్రం తర్వాత చిరంజీవి హీరోగా నటించనున్న కొత్త చిత్రం చిత్రీకరణ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇది చిరంజీవి కెరీర్‌లో 152వ చిత్రం. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన తొలి షెడ్యూల్‌లో ఓ పాటతో పాటు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. ఇందులో చిరంజీవి రైతుగా, ప్రొఫెసర్‌గా రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తిరు ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు. కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో చిత్రబృందం ప్రకటిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement