
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆచార్య. ఇందులో రామ్ చరణ్ సిద్దా అనే కీలక పాత్ర పోషించాడు.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్‌గా నటించనుండగా, రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది. అయితే రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌లో మెయిన్ లీడ్ హీరోయిన్‌గా నటించిన కాజల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.
పూజా హెగ్డే మాత్రం రెండు సీన్స్‌లో కనిపించింది. దీంతో అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న సందేహం నెటిజన్లలో కలుగుతుంది. అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో నటించలేదని తెలుస్తోంది. కరోనా రావడంతో తొలుత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ షూటింగ్‌లో పాల్గొనలేదు.
బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ చేయమని నిర్మాతలు అడిగినా కాజల్ నో చెప్పడంతో మేకర్స్ అసహనానికి లోనయ్యారని తెలుస్తుంది. దీంతో కావాలనే ట్రైలర్‌లో కాజల్‌ని చూపించలేదని తెలుస్తుంది. సినిమాలో కూడా కాజల్ సీన్స్‌ని తొలగించారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment