
Anchor Suma Question To Ram Charan In Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ 'ఆచార‍్య'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో స్పీడు పెంచింది 'ఆచార్య' చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం (ఏప్రిల్ 23) యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఆహ్లాదకరంగా సాగింది.
ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన యాంకర్ సుమ కనకాల అభిమానులు పంపిన ప్రశ్నలను అడగ్గా చిరంజీవి, చరణ్, కొరటాల శివ సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌ను సుమ 'ఇంట్లో ఎవరికీ భయపడతారు నాన్నకా? ఉపాసనాకా?' అని ఆసక్తికర ప్రశ్న అడిగింది. దానికి జవాబుగా 'తెలియదు గానీ.. మా నాన్న.. అమ్మ ముందు జాగ్రత్తగా ఉంటారు. నేను కూడా అదే నేర్చుకుని ఉపాసన దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటా. బాబాయికైనా, డాడీకైనా, నాకైనా.. మా అందరికీ బాసు మా అమ్మే.' అని తెలిపాడు రామ్ చరణ్. ఈ సమాధానం విన్న చిరంజీవి 'అది నన్ను చూసి నేర్చుకున్నావ్. సుఖపడతావ్. వాళ్లతో పెట్టుకోవద్దు.' అని నవ్వుతూ పేర్కొన్నారు.
చదవండి: ఇంతకుముందు చూడని మెగాస్టార్‌ను చూస్తారు: మెహర్ రమేష్
Comments
Please login to add a commentAdd a comment