questions and answers
-
రూ. కోటి ఉంది, నెలకు లక్ష రూపాయలు కావాలంటే ఎలా?
నేను మరో 10 - 15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నాను. రూ.2.5 - 3 కోట్ల బడ్జెట్లో ఇల్లు కొనాలన్నది నా ఆలోచన. గృహ రుణం తీసుకునే విషయంలో నా వంతు డౌన్ పేమెంట్‌ను సమకూర్చుకోవాలి కదా. వచ్చే 10 - 15 ఏళ్లలో గృహ రుణం డౌన్ పేమెంట్‌ను సమకూర్చుకునేందుకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? టాటా స్మాల్ క్యాప్ లేదా, మిరే అస్సెట్ మిడ్‌క్యాప్ ఫండ్ లేదా పీజీఐఎం ఇండియా మిడ్‌క్యాప్ ఫండ్ పథకాలు నా డౌన్ పేమెంట్‌కు అనుకూలమైనా..? – ఆదిత్య బి 10 - 15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేద్దామన్న నిర్ణయం సరైన దారిలోనే ఉంది. మీ పెట్టుబడులు వృద్ధి చెందడానికి సరిపడా సమయం మీ చేతుల్లో ఉంది. ఈ కాలంలో ఈక్విటీ పథకాల నుంచి సహేతుక రాబడులు వస్తాయని ఆశించొచ్చు. తద్వారా గృహ కొనుగోలుకు కావాల్సిన డౌన్ పేమెంట్‌ను సమకూర్చుకోవచ్చు. మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కొనుగోలు చేద్దామనుకుంటున్న ఇంటి బడ్జెట్ రూ.2.5 - 3 కోట్లు అని చెప్పారు కదా. ఇది నేటి ధరల ఆధారంగా అంచనా వేశారా? అయితే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు. అప్పుడు 10 - 15 ఏళ్ల తర్వాత ఇల్లు కొనుగోలుకు అసలు ఎంత అవుతుందన్న వాస్తవ అంచనాకు రావడానికి ఉంటుంది. ఆ తర్వాత నెలవారీ సిప్ మొత్తాన్ని రెండు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీరు ఒకటి నుంచి రెండు వరకు మిడ్, స్మాల్‌క్యాప్ పథకాలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే మిడ్, స్మాల్‌క్యాప్ అన్నవి మొత్తం పోర్ట్‌ఫోలియోలో 25 - 30 శాతం మించి ఉండకూడదు. మీ పోర్ట్‌ఫోలియోలో ఏ పథకాలు ఉండాలన్నది మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఈక్విటీ పెట్టుబడుల్లో మీకున్న అనుభవం కీలకంగా మారతాయి. ఇల్లు కొనుగోలు చేయడం అన్నది ఆర్థికంగా అతిపెద్ద నిర్ణయం. కనుక చాలా జాగ్రత్తగా దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చాలా కేసుల్లో నివాసం ఉండేట్టు అయితే రుణంపై ఇల్లు కొనుగోలు చేయడం న్యాయమే అవుతుంది. గృహ రుణంపై పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. పైగా ఇది దీర్ఘకాలం పాటు కొనసాగే రుణ బాధ్యత. అలాగే, గృహ రుణానికి మీరు చెల్లించే ఈఎంఐ అన్నది నెలవారీ నికరంగా చేతికి అందుకునే మొత్తంలో మూడింట ఒక వంతు మించకుండా చూసుకోండి. పెట్టుబడి కోణంలో అయితే రుణంపై ఇల్లు కొనుగోలు చేయడం మంచి నిర్ణయం కాబోదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్‌లో లిక్విడిటీ తక్కువ. కొనుగోలు, విక్రయం వేగంగా సాధ్యపడదు. డబ్బులు కావాలంటే వెంటనే అడిగిన రేటుకు విక్రయించాల్సి వస్తుంది. అధిక విలువ కలిగిన ఇంటిని అమ్మడం అంత సులభమైన విషయం కాదు. నా వయసు 59 ఏళ్లు. వచ్చే నెలలో పదవీ విరమణ తీసుకోబుతున్నాను. రిటైర్మెంట్ తర్వాత నా వద్ద రూ.కోటి నిధి ఉంటుంది. నెలవారీ ఖర్చులు రూ.లక్ష వరకు ఉంటాయి. కనుక నా వద్ద ఉండే రూ.కోటిని నెలనెలా రూ.లక్ష వచ్చేలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో సూచించగలరు. – భానుప్రకాశ్ మీరు రూ.కోటి పెట్టుబడిపై ప్రతి నెలా రూ.లక్ష ఆదాయం కోరుకుంటున్నారు. అంటే వార్షిక రాబడి 12 శాతం ఉండాలి. ఈ స్థాయి రాబడి అన్నది ఈక్విటీలలో, అదీ దీర్ఘకాలంలోనే (ఏడేళ్లకు మించి) సాధ్యపడతాయి. ఏటా ఇదే స్థాయిలో ఈక్విటీలు కూడా రాబడులు ఇస్తాయని గ్యారంటీ ఉండదు. అలాగే, ఒక ఏడాదిలో వచ్చిన రాబడులన్నింటినీ వినియోగించుకోకూడదు. మీ పెట్టుబడి నిధి ద్రవ్యోల్బణ ప్రభావం (5 - 6 శాతం) మేర ఏటా వృద్ధి చెందుతూ ఉండాలి. అప్పుడే కావాల్సినంత మొత్తం సమకూర్చుకోగలరు. ఉదాహరణకు మీ రూ.కోటి నిధి.. ఐదు, ఏడేళ్ల తర్వాత కూడా అక్కడే ఉంటే.. ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల అప్పటికి నెలవారీగా రూ.లక్ష ఆదాయం సరిపోదు. పెరిగే ధరలకు అనుగుణంగా మీకు మరింత మొత్తం ఆదాయం వచ్చేంత నిధి ఉండాలి. కనుక మీ పెట్టుబడిపై వచ్చే రాబడిలో కొంత మొత్తాన్ని అక్కడే వృద్ధి చెందేందుకు వీలుగా ఉంచేయాలి. మీ విషయంలో మీరు ఆశించే రాబడి రేటు ఎక్కువగా ఉంది. దాన్ని తగ్గించుకోండి. మీరు కోరుకున్నట్టు ప్రతి నెలా రూ.లక్ష చొప్పున ఉపసంహరించుకుంటూ వెళితే.. మీ వద్దనున్న పొదుపు నిధి కూడా తగ్గిపోతుంది. ద్రవ్యోల్బణం అధిగమించి నిధి వృద్ధి చెందాలంటే.. పెట్టుబడి నుంచి రాబడి 6 శాతానికి మించి ఉపసంహరించుకోకూడదు. అంటే రూ.కోటి నిధిపై ఏటా రూ.6 లక్షల వరకే ఉపసంహరించుకోవాలి. పెట్టుబడి నిధిలో మూడింట ఒక వంతును ఈక్విటీలకు కేటాయించుకోవాలి. మిగిలిన రెండు భాగాలకు ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు (డెట్) కేటాయించుకోవాలి. ప్రభుత్వ హామీ ఉన్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (పీవో ఎంఐఎస్), ప్రధాన మంత్రి వయవందన యోజన (పీఎం వీవీవై) పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో పీఎం వీవీవై, ఎస్సీఎస్ఎస్ 8 శాతం రాబడిని ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో పీఎం వీవీవై ఈ ఏడాది మార్చితో ముగియనుంది. ఈ పథకాలకు కేటాయించుకోగా మిగిలే మొత్తాన్ని అధిక నాణ్యత కలిగిన షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ధీరేంద్ర కుమార్ సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
చరణ్‌కు ఉపాసన అంటే భయమా ? నాన్న అంటే భయమా ?..
Anchor Suma Question To Ram Charan In Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ 'ఆచార్య'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో స్పీడు పెంచింది 'ఆచార్య' చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం (ఏప్రిల్ 23) యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఆహ్లాదకరంగా సాగింది. ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన యాంకర్ సుమ కనకాల అభిమానులు పంపిన ప్రశ్నలను అడగ్గా చిరంజీవి, చరణ్, కొరటాల శివ సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌ను సుమ 'ఇంట్లో ఎవరికీ భయపడతారు నాన్నకా? ఉపాసనాకా?' అని ఆసక్తికర ప్రశ్న అడిగింది. దానికి జవాబుగా 'తెలియదు గానీ.. మా నాన్న.. అమ్మ ముందు జాగ్రత్తగా ఉంటారు. నేను కూడా అదే నేర్చుకుని ఉపాసన దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటా. బాబాయికైనా, డాడీకైనా, నాకైనా.. మా అందరికీ బాసు మా అమ్మే.' అని తెలిపాడు రామ్ చరణ్. ఈ సమాధానం విన్న చిరంజీవి 'అది నన్ను చూసి నేర్చుకున్నావ్. సుఖపడతావ్. వాళ్లతో పెట్టుకోవద్దు.' అని నవ్వుతూ పేర్కొన్నారు. చదవండి: ఇంతకుముందు చూడని మెగాస్టార్‌ను చూస్తారు: మెహర్ రమేష్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అవే రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశాయి
న్యూఢిల్లీ : బుధవారం నాటి రాజ్యసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు శ్రీ హర్దీప్ సింగ్ పురి, జి.కిషన్‌రెడ్డిలు సమాధానం ఇచ్చారు. రియల్ ఎస్టేట్‌పై కరోనా ప్రభావానికి సంబంధించిన విజయసాయి రెడ్డి ప్రశ్నకు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి సమాధానమిస్తూ.. కరోనా మహమ్మారి ప్రభావంతో కార్మికులు వలస పోవడం, నిర్మాణ సామాగ్రి సరఫరా చైన్లు స్తంభించిపోవడం వంటి కారణాలు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశాయన్నారు. మున్సిపాలిటీలకు 423 కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించిన ప్రశ్నకు.. ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన పెర్ఫార్మన్స్ గ్రాంట్స్ బకాయిలు దాదాపు 423 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన 75 కోట్ల రూపాయల విషయమై హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని విజయసాయిరెడ్డి ప్రశ్నించగా.. విశాఖపట్నం జిల్లాను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా గుర్తించినందున భద్రతా సంబంధిత ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం 2015-16 నుంచి 2019-20 వరకు 95 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. -
విశాఖ మెట్రో..రేసులో ఐదు సంస్థలు
న్యూఢిల్లీ: విశాఖపట్నంలో పీపీపీ విధానంలో మెట్రో రైల్ నిర్మాణం చేపట్టడానికి ఐదు సంస్థలను రాష్ర్ట ప్రభుత్వ షార్ట్‌లిస్ట్ చేసింది. వారికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)ను జారీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తమకు సమాచారం ఇచ్చినట్లు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. విశాఖపట్నం మెట్రోరైల్ ప్రాజెక్ట్‌ను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీ ప్రభుత్వం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్(ఈఓఐ)ని ఆహ్వానించగా పలు సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన పిమ్మట ఆర్‌ఎఫ్‌సీలను జారీ చేయడానికి ఐదు సంస్థలను రాష్ర్ట ప్రభుత్వం ఎంపిక చేసినట్లు మంత్రి చెప్పారు. మెట్రో రైల్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించిన తర్వాత విశాఖపట్నం మెట్రోరైల్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టులో ఎన్ని కారిడార్లు ఉంటాయి. ప్రతి కారిడార్ పొడవు ఎంత అన్న ప్రశ్నలకు మంత్రి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. నగర రవాణా వ్యవస్థ నగర అభివృద్ధిలో ఒక అంతర్భాగం. ఇది పూర్తిగా రాష్ర్ట ప్రభుత్వం పరిధిలో మాత్రమే ఉంటుంది. అందువలన మెట్రో రైలు ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఆయా రాష్ర్ట ప్రభుత్వాలే రూపొందిస్తాయి. అందువలన విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు అలైన్మెంట్ ఎలా ఉండాలి, మొత్తం ఎంత వ్యయం అవుతుందో ఏపీ ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయం కోరుతున్నట్లయితే ఆ ప్రతిపాదనలు మెట్రో రైల్ విధానంలోని పలు అంశాలకు అనుగుణంగా ఉండి తీరాలని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం 20,500 మంది సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు ఉద్వాసన పలికిన అంశంపై విజయసాయి రెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి మంత్రి ఉపేంద్ర కుష్వాహా జవాబిస్తూ..వారిని తొలిగించినట్లుగా రాష్ర ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. త్వరలోనే సాక్షర భారత్ స్థానంలో కొత్త పథకం అమలులోకి వస్తుంది. సాక్షర భారత్‌లో కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న వారి సేవలను కొత్త పథకంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించవచ్చునని మంత్రి స్పష్టం చేశారు. గడచిన నాలుగేళ్ల కాలంలో సాక్షర భారత్ పథకం అమలు కోసం మొత్తం 498.99 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. -
పోలవరం బాధితులకు సాయంపై వివరణ
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందిన సాయంపై రాజ్యసభలో బుధవారం కేంద్ర ట్రైబల్ అఫైర్స్ శాఖ వివరణ ఇచ్చింది. పోలవరం నిర్వాసితులకు సంబంధించి మొత్తం నాలుగు అంశాల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ(రాజ్యసభ) వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు ట్రైబల్ అఫైర్స్ శాఖ మంత్రి జస్వంత్ సిన్హ్ భాభోర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 1. పోలవరం నిర్వాసితులకు పరిహారం, ప్రత్యమ్నాయ ఏర్పాట్లలో జరిగిన లోపాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) నుంచి ప్రభుత్వం నోటీసులు అందుకుందా? ఈ ప్రశ్నపై స్పందించిన ట్రైబల్ అఫైర్స్ మంత్రి.. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) నుంచి నోటీసులు అందుకున్నట్లు చెప్పారు. అందుకు ప్రతిగా స్పందించినట్లు కూడా వెల్లడించారు. 2. అటవీ హక్కులు-2006 కింద అడవి బిడ్డలు, గిరిజనులకు పరిహారాలు అందుతున్నాయా? ఎఫ్ఆర్-2006 చట్టం కింద అటవీ ప్రాంతాల్లో నివసించే(అర్హత కలిగిన) గిరిజనులను ఎస్టీ కేటగిరీలోకి చేర్చి నిబంధలనల ప్రకారం సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ చట్టం కిందే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన గిరిజనులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 3. 20 ఏళ్ల క్రితం చేసిన సర్వే ఆధారంగానే గిరిజనులకు పరిహారాన్ని అందజేస్తున్నారా? గోదావరి జిల్లాల్లోని పైడిపాక, దేవ్రగొండి, మామిడిగొండి, తోటగాంధీ, చేగొండపల్లి, అంగులూర, పుడిపల్లిల్లో సర్వేకు ఏ అంశాలను ప్రమాణికంగా తీసుకున్నారు? 2005-2006 సంవత్సరంలో సోషియో ఎకనమిక్ సర్వేను నిర్వహించినట్లు చెప్పారు. 1894 ల్యాండ్ అక్విసిషన్ యాక్ట్ ఆధారంగా గోదావరి జిల్లాల పోలవరం నిర్వాసితులకు పరిహారాన్ని చెల్లించినట్లు తెలిపారు. 2014 జనవరి 1న సేకరించిన భూమినంతటినీ వాటర్ రీసోర్స్ డిపార్ట్ మెంటుకు అందిచినట్లు చెప్పారు.