
న్యూఢిల్లీ : బుధవారం నాటి రాజ్యసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు శ్రీ హర్దీప్ సింగ్ పురి, జి.కిషన్‌రెడ్డిలు సమాధానం ఇచ్చారు.
రియల్ ఎస్టేట్‌పై కరోనా ప్రభావానికి సంబంధించిన విజయసాయి రెడ్డి ప్రశ్నకు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి సమాధానమిస్తూ.. కరోనా మహమ్మారి ప్రభావంతో కార్మికులు వలస పోవడం, నిర్మాణ సామాగ్రి సరఫరా చైన్‌లు స్తంభించిపోవడం వంటి కారణాలు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశాయన్నారు.
మున్సిపాలిటీలకు 423 కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించిన ప్రశ్నకు.. ఆంధ్రప్రదేశ్లోని పట్టణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన పెర్ఫార్మన్స్ గ్రాంట్స్ బకాయిలు దాదాపు 423 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపారు.
మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన 75 కోట్ల రూపాయల విషయమై హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని విజయసాయిరెడ్డి ప్రశ్నించగా.. విశాఖపట్నం జిల్లాను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా గుర్తించినందున భద్రతా సంబంధిత ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం 2015-16 నుంచి 2019-20 వరకు 95 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment