Rajya sabha session
-
రాజ్యసభ నిరవధిక వాయిదా
ఢిల్లీ: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగ తీర్మానం చర్చపై ప్రధాని మోదీ సమాధాన ప్రసంగం ముగిసింది. అనంతరం రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ సభను నిరవధికంగా వాయిదా చేశారు.Rajya Sabha adjourned sine die after PM Modi's speech on Motion of Thanks to President's Address pic.twitter.com/1tEpe6Tk1F— ANI (@ANI) July 3, 2024ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు...బంజారాల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేశాంమహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం: మోదీప్రజలు ఓడించినా వారిలో మార్పు రాలేదు: మోదీచర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారు.సభను విపక్షాలు అవమానిస్తున్నాయి.నా సమాధానం వినే ధైర్యం విపక్షాలకు లేదు.విపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. సన్నకారు రైతుల కోసం కాంగ్రెస్ ఎలాంటి పథకాలు తేలేదు: మోదీకిషాన్ సమ్మాన్ నిధి రైతులకు అండగా నిలిచింది.వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం.రైతుల కోసం పంటలకు మద్దతు ధరను భారీగా పెంచాం విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్ అసంతృప్తివిపక్షాలు ఇలా చేయటం సరికాదువిపక్షాలు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయి. నిజాలు చెబుతుంటే విపక్షాలు భరించటం లేదు: ప్రధాని మోదీవిపక్షాలు అవమానిస్తున్నాయి. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్విపక్ష సభ్యులను మాట్లాడనివ్వడం లేదని సభ నుంచి వాకౌట్ కిషాన్ సమ్మాన్ యోజనా ద్వారా రైతులకు అండగా ఉంటాం: ప్రధాని మోదీప్రధాని ప్రసంగానికి అడ్డుతగిలిన విపక్షాలుపదేళ్ల చేసిన అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాంప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళన నడుమ ప్రధాని ప్రసంగంరైతు సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.ఈ ఎన్నికలో దేశ ప్రజలు చూపిన విశ్వాసం పట్ల గర్వపడుతున్నాపదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం సేవాభావంతో ముందు వెళ్లుతోంది.అంబేద్కర్ ఆశయాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది.మా విజయాన్ని చూసి కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం చర్చలో 70 మంది ఎంపీలు పాల్గొన్నారు. రాజ్యాంగం మాకు చాలా పవిత్రమైంది.అంబేద్కర్ రాజ్యాంగం వల్లే మాకు ఈ అవకాశం దిక్కింది.ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందిఈ ప్రభుత్వానికి రాజ్యాంగమే దిక్చూచికరోనా కష్టకాలంలో కూడా భారత్ ఆర్థికంగా ముందుకు వెళ్లింది.గతపదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది.వచ్చే ఐదేళ్లలో పేదరికంపై యుద్ధం చేస్తాంఆర్థిక వృద్ధిలో భారత్‌ను ఐదోస్థానం నుంచి మూడో స్థానానికి తీసుకువెళ్తాంవచ్చే ఐదేళ్లలోమ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాంవిపక్షాల నిసనల మధ్య మోదీ ప్రసంగిస్తున్నారు.గతంలో రిమోట్ ప్రభుత్వం నడిచింది. ప్రజలు మూడోసారి ఎన్డీయేకు పట్టం కట్టారు. స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు.60 ఏళ్ల తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ఓ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ప్రజాతీర్పును కొందరు ఇష్టపడటం లేదు. హత్రాస్ సత్సంగ్ తొక్కిసలాట ఘటనపై రాజ్యసభలో ఎంపీలు సంతాపం తెలిపారు.మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు 121 మంది భక్తులు మృతి చెందారు.#WATCH | Delhi: Rajya Sabha observes silence to mourn the loss of lives in Hathras Stampede accident. pic.twitter.com/mcF3aBszUo— ANI (@ANI) July 3, 2024 ప్రారంభమైన రాజ్యసభరాజ్యసభ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సమాధానం ఇవ్వనున్నారు.Prime Minister Narendra Modi will speak in the Rajya Sabha on the Motion of Thanks to the President's Address at around 12 noon. pic.twitter.com/YQqV0GqVlH— ANI (@ANI) July 3, 2024 నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం నిన్న(మంగళవారం) రాజ్యసభను కుదిపేసింది. పేపర్ లీక్‌తో లక్షలాది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి.లోక్‌సభలో మంగళవారం రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వటంలో చర్చ ముగిసింది. అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు. -
అవే రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశాయి
న్యూఢిల్లీ : బుధవారం నాటి రాజ్యసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు శ్రీ హర్దీప్ సింగ్ పురి, జి.కిషన్‌రెడ్డిలు సమాధానం ఇచ్చారు. రియల్ ఎస్టేట్‌పై కరోనా ప్రభావానికి సంబంధించిన విజయసాయి రెడ్డి ప్రశ్నకు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి సమాధానమిస్తూ.. కరోనా మహమ్మారి ప్రభావంతో కార్మికులు వలస పోవడం, నిర్మాణ సామాగ్రి సరఫరా చైన్లు స్తంభించిపోవడం వంటి కారణాలు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశాయన్నారు. మున్సిపాలిటీలకు 423 కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించిన ప్రశ్నకు.. ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన పెర్ఫార్మన్స్ గ్రాంట్స్ బకాయిలు దాదాపు 423 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన 75 కోట్ల రూపాయల విషయమై హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని విజయసాయిరెడ్డి ప్రశ్నించగా.. విశాఖపట్నం జిల్లాను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా గుర్తించినందున భద్రతా సంబంధిత ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం 2015-16 నుంచి 2019-20 వరకు 95 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. -
ఏర్పాట్లు చేస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయనే విషయం ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కావలసిన ఏర్పాట్లను మాత్రం లోక్‌సభ స్పీకర్, నేను పర్యవేక్షిస్తున్నాం’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘పార్లమెంట్ సమావేశాల నాటికి పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నాం. సెప్టెంబర్‌లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. మహమ్మారి సమయంలో కూడా పార్లమెంటు సమావేశాలను విధిగా నిర్వహించాల్సిందే. ఏవైనా మార్పులు తేవాలనుకున్నా.. ఒకసారి సమావేశమై మార్పులు తేవొచ్చు. సమావేశాలు నిర్వహిస్తే కనీసం 3 వేల మంది సిబ్బంది పార్లమెంటు ప్రాంగణంలో ఉంటారు. అందువల్ల భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన ఆంక్షలు అమలుచేయాల్సి వస్తుంది. వర్చువల్ సమావేశాలు నిర్వహించాలంటూ సలహాలు వస్తున్నాయి. వర్చువల్‌కి, నేరుగా మాట్లాడడానికి చాలా తేడా ఉంది..’అని వెంకయ్య అన్నారు. ఢిల్లీలోని తెలుగు పాత్రికేయులతో ఆయన ఆన్లైన్లో ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. కరోనా విషయంలో మీడియా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని, వార్తల్లో అతిశయోక్తులు వద్దని సూచించారు. -
ఆవులను కాపాడతారు గానీ ఆడాళ్లను కాపాడరా?
-
ఆవులను కాపాడతారు గానీ ఆడాళ్లను కాపాడరా?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎవరైనా చంపితే 11 లక్షలు ఇస్తానంటూ బీజేపీ యువనేత చేసిన ప్రకటన పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించింది. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో తీవ్రంగా మండిపడ్డారు. ’మీరు ఆవులను కాపాడతామని చెబుతున్నారు గానీ మహిళల సంగతేంటి’ అని ఆమె ప్రశ్నించారు. బీజేవైఎం నేత యోగేష్ వర్ష్నే ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీర్భూమ్ నగరంలో హనుమాన్ జయంతి ర్యాలీ మీద ముఖ్యమంత్రి ఆంక్షలు విధించడంతో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ర్యాలీలో పాల్గొన్న వారిపై లాఠీ చార్జి చేయించారని చెబుతూ మమతా బెనర్జీని దెయ్యం అని అభివర్ణించారు. ఈ విషయమై పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ప్రకటనలను తాను కూడా ఖండిస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. అయితే జయాబచ్చన్ మాత్రం ఆయన సమాధానంతో సంతృప్తి చెందలేదు. మహిళల గురించి ఎవరైనా అలా మాట్లాడటానికి ఎంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారు. దేశంలో మహిళలను రక్షించే తీరు ఇదేనా అని నిలదీశారు. మహిళలు తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారని ఈ పరిస్థితిని ఎప్పటికి సరిచేస్తారని అన్నారు. అయితే దీనికి బీజేపీ సభ్యురాలు రూపా గంగూలీ దీటుగా సమాధానమిచ్చారు. తాను కూడా మహిళనేనని, తనను పోలీసుల ఎదురుగానే కొంతమంది కొట్టారని, దీనికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమాధానం ఇస్తారా అని ప్రశ్నించారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సభలో తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని దెయ్యం అంటున్నారని, రాష్ట్రంలో మతం పేరుతో అరాచకం కొనసాగుతోందని, దీన్ని అందరూ ఖండించాలని పార్టీ ఎంపీ సుఖేందు శేఖర్ అన్నారు.