Acharya Pre Release Event: Director Meher Ramesh About Chiranjeevi ,See Inside - Sakshi
Sakshi News home page

Meher Ramesh In Acharya Pre Release Event: ఇంతకుముందు చూడని మెగాస్టార్‌ను చూస్తారు: మెహర్ రమేష్‌

Published Sat, Apr 23 2022 9:32 PM | Last Updated on Sun, Apr 24 2022 11:43 AM

Meher Ramesh About Chiranjeevi In Acharya Pre Release Event - Sakshi

Meher Ramesh About Chiranjeevi In Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రేజీ మూవీ 'ఆచార‍్య'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్‌ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్‌, పోస్టర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో స్పీడు పెంచింది 'ఆచార్య' చిత్ర బృందం. తాజాగా (శనివారం ఏప్రిల్‌ 23) ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. 

ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, బాబీ, మోహన్‌ రాజా, మెహర్‌ రమేష్‌ అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు ఫైట్ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌, బుట్టబొమ్మ పూజా హెగ్డే పాల్గొన్నారు. చిరంజీవి తదుపరి చిత్రం భోళా శంకర్‌ డైరెక్టర్‌ మెహర్ రమేష్‌ ఆచార్యలోని నీలాంబరి వీడియో సాంగ్‌ లాంచ్‌ చేశారు. మెహర్‌ రమేష్‌ మాట్లాడుతూ 'మెగాస్టార్‌ చిరంజీవి సినిమా అంటే ఒక పండుగల ఉంటుంది. అలాంటిది కొరటాల శివ.. చిరంజీవి, రామ్ చరణ్‌ ఇద్దరినీ చూపిస్తున్నారు. ఇది ఫ్యాన్స్‌కి కన్నుల పండగే. ఆచార్య చిత్రంలో నేను ఇంటర్వెల్‌ యాక్షన్ ఎపిసోడ్ చూశాను. మునుపెన్నడూ చూడని మెగాస్టార్‌ను చూస్తారు. బంజారా సాంగ్‌లో చిరు, చరణ్ డ్యాన్స్‌ ఐఫీస్ట్‌లా ఉంటుంది' అని తెలిపారు. 

చదవండి: ‘ఆచార్య’ కోసం రంగంలోకి మహేశ్‌ బాబు


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement