Meher Ramesh
-
అక్కడేమో బ్లాక్ బస్టర్స్.. ఇక్కడ చూస్తే డిజాస్టర్స్!
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్‌కు సాలిడ్ హిట్ కొట్టేందుకు పదేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. అదే ఉత్సాహంతో ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన భోళాశంకర్ చిత్రం తెరకెక్కించారు. కానీ ఈ మూవీ అనుకన్నంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ చిత్రంపైనే భారీ ఆశలు పెట్టుకున్న మెహర్ రమేశ్‌కు తీవ్ర నిరాశను కలిగించింది. ఫ్లాపులకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేశ్ అంటూ నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలేన్ని? అందులో హిట్ అయిన సినిమాలు ఏవీ? ఫ్లాప్స్ అయినా చిత్రాలేవీ? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి. (ఇది చదవండి: మెహర్ రమేశ్.. కమెడియన్‌గా నటించాడని మీకు తెలుసా?) మెహర్ రమేశ్ పేరు చెప్పగానే అందరికీ 'శక్తి', బిల్లా, 'కంత్రి', 'షాడో' ఇప్పుడు 'భోళా శంకర్' ఇలా అట్టర్ ఫ్లాప్ సినిమాలే గుర్తొస్తాయి. కానీ తొలిసారి నటుడిగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టారాయన. మొదట 2002లో నటుడిగా మహేశ్‌బాబు 'బాబీ' మూవీలో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చారు మెహర్ రమేశ్. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం 'ఆంధ్రావాలా' కన్నడ రీమేక్ 'వీర కన్నడిగ' తీసే అవకాశం మెహర్ రమేశ్‌కు వచ్చింది. అలా ఆ చిత్రం ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే ఊపులో 'ఒక్కడు' చిత్రాన్ని కన్నడలో 'అజయ్'గా రీమేక్ చేసి మరో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. దీంతో కన్నడలో తెరకెక్కించిన రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. దీంతో అదే ఉత్సాహంతో తెలుగులోనూ అగ్ర హీరోలతో మెహర్ రమేశ్ చిత్రాలను తెరకెక్కించారు. ఎన్టీఆర్‌తో కంత్రి దీంతో మెహర్ రమేశ్ మరో హిట్ కొట్టాలనే ఉత్సాహంతో 2008లో జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన కంత్రి సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో హన్సిక , తనీషా హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, ముఖేష్ రిషి, సయాజీ షిండే, కోట శ్రీనివాస రావు, వేణు మాధవ్, సునీల్, బ్రహ్మానందం, సుబ్బరాజు, అలీ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్‌తో బిల్లా అయితే ఆ తర్వాత మెహర్ రమేశ్.. యంగ్ రెబల్ స్టార్‌తో హిట్ కొట్టాలన్న తన కోరిక నెరవేర్చుకున్నాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన బిల్లా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం కాలేకపోయింది. 2009లో రిలీజైన ఈ చిత్రం అనుష్క, హన్సిక హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు, నమిత, జయసుధ తదితరులు నటించగా.. మణిశర్మ సంగీతం అందించాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో శక్తి అయితే మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌తో జతకట్టిన మెహర్ రమేశ్.. శక్తి పేరుతో చిత్రాన్ని తెరకెక్కించారు. 2011 ఏప్రిల్ 1న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. (ఇది చదవండి: మీరు ఇలా అర్థం చేసుకున్నారా? : నెటిజన్స్‌కు మరో షాకిచ్చిన అనసూయ) వెంకటేశ్‌తో షాడో శక్తి ఫ్లాప్ తర్వాత మెహర్ రమేశ్.. విక్టరీ వెంకటేశ్‌తో జతకట్టాడు. అయితే చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. 2013లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలో శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. చిరంజీవితో భోళాశంకర్ అయితే మొదట పరభాషలో సక్సెస్ అందుకున్న మెహర్ రమేశ్.. తెలుగులో మాత్రం ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయాడు. ఆయన అగ్ర హీరోలతో చేసిన ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. దాదాపు పదేళ్ల తర్వాత మెగాస్టార్‌తో తెరెకెక్కించిన భోళాశంకర్ సైతం ఫ్లాప్‌గా నిలవడంతో సోషల్ మీడియా ట్రోల్స్‌కు గురయ్యాడు మెహర్ రమేశ్. -
'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!
మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజుకే టాక్ తేడా కొట్టేసింది. దీంతో రకరకాల విషయాలు బయటకొచ్చాయి. అలానే చిరు రెమ్యునరేషన్ గొడవ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే నిర్మాత వాట్సాప్ చాట్ అంటూ ఓ ఫొటో తెగ సర్క్యూలేట్ అయింది. ఇప్పుడు ఈ విషయాలన్నింటిపై నిర్మాణ సంస్థ స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఏం జరిగింది? మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరు 'భోళా శంకర్' చేశారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర దాదాపు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే రిలీజ్‌కి ముందే పలు సమస్యలు ఎదురయ్యాయి. పలు ఏరియాల్లో బయ్యర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో నిర్మాతనే స్వయంగా రిలీజ్ చేశారు. మరోవైపు ఈ మూవీ కోసం చిరుకు ఏకంగా రూ.65 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలని అనుకున్నారట. అందులో కొంత ముందు ఇచ్చారట. (ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు) అవన్నీ రూమర్స్ మిగిలిన మొత్తం ఇచ్చేందుకు నిర్మాత అనిల్ సుంకర దగ్గర డబ్బుల్లేక తన ఆస్తులు తాకట్టు పెట్టారని ఓ వార్త బయటకొచ్చింది. అలానే హీరో-నిర్మాత మధ్య ఈ విషయమై మనస్పర్థలు వచ్చినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటన్నింటిపై స్వయంగా నిర్మాణ సంస్థ స్పందించింది. అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అని కొట్టిపారేసింది. ట్వీట్‌తో క్లారిటీ 'సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ బేస్‌లెస్, సెన్స్‌లెస్ మాటలు. వాటిలో ఒక్కశాతం కూడా నిజం లేదు. దయచేసి ఇలాంటి వార్తల్ని నమ్మొద్దు. అనవసర డిస్కషన్స్ పెట్టొద్దని కోరుతున్నాం' అని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. బయటకు ఇలా చెబుతున్నారు గానీ లోలోపల ఏమైనా ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయా అనే డౌట్ వస్తుంది! The rumours regarding the disputes that are being circulated online are completely BASELESS & SENSELESS and don’t have a single percent of truth in them. We Kindly Request everyone NOT to BELIEVE such kind of news and have unnecessary discussions over it. — AK Entertainments (@AKentsOfficial) August 15, 2023 (ఇదీ చదవండి: స్టార్ హీరో.. ఇన్నాళ్లకు భారతీయుడు అయ్యాడు!) -
'భోళా శంకర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' థియేటర్లలోకి వచ్చేసింది. సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్ ఎంటర్టైనర్గా తీసిన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. అభిమానులు బాగుందని చెబుతుంటే.. సాధారణ ప్రేక్షకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ వీకెండ్ తర్వాత అసలు విషయం బయటపడుతుంది. అయితే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఇంతకీ ఎందులో ఎప్పుడు రావొచ్చు? (ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ) కథేంటి? మహాలక్ష్మి (కీర్తి సురేశ్) మంచి పెయింటర్. కోల్‌కతాలో మంచి ఆర్ట్స్ కాలేజీ ఉందని, చెల్లితోపాటు అన్నయ్య శంకర్(చిరంజీవి) అక్కడికి షిప్ట్ అవుతాడు. చెల్లిని కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. అక్కడే క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. అయితే ఒకానొక సందర్భంలో అమ్మాయిలని కిడ్నాప్ చేసే ఓ ముఠాతో చిరుకు వైరం ఏర్పడుతుంది. దీంతో శంకర్, మహాలక్ష్మిని విలన్ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఇంతకీ శంకర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనేది 'భోళా శంకర్' స్టోరీ. ఆ ఓటీటీలోనే 'వేదాళం' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా తీసిన 'భోళా శంకర్'కు మెహర్ రమేశ్ దర్శకుడు. ఈ మూవీలో చిరుకు చెల్లిగా కీర్తి సురేశ్ నటిస్తే, జోడీగా తమన్నా యాక్ట్ చేసింది. సుశాంత్ ఓ పాత్రలో నటించాడు. గెటప్ శీను, శ్రీముఖి, రష్మి తదితరులు సహాయపాత్రలు చేశారు. ఇకపోతే ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. బహుశా 5-6 వారాల తర్వాత అంటే సెప్టెంబరు చివరికల్లా స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ) -
'భోళా శంకర్'పై చిరు గట్టి నమ్మకం.. కామెంట్స్ వైరల్
‘‘రీమేక్స్ చేస్తారేంటి? అని అంటుంటారు. మంచి కంటెంట్‌ని తెలుగు ప్రేక్షకులకు చూపించాలనే ప్రయత్నం మన యాక్టర్స్, దర్శకులు చేస్తే తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. ‘వేదాళం’ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో లేదు. ఎవరూ చూసి ఉండరు. ఆ ధైర్యంతోనే మెహర్, అనిల్ నా వద్దకు రావడంతో ‘భోళాశంకర్’ చేశాను’’ అని చిరంజీవి అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘భోళాశంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘భోళాశంకర్’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘భోళాశంకర్’ సినిమా నాకు నచ్చింది కాబట్టే చేశాను. మీకు (ప్రేక్షకులు) కూడా నచ్చుతుందనే ధైర్యంతో విడుదల చేస్తున్నాం. స్వయంకృషితో మెహర్ రమేశ్ దర్శకుడిగా ఎదిగాడు. కొత్తవారి ప్రతిభతో ఇండస్ట్రీ మరింత ఎదగాలి. ఇండస్ట్రీని నమ్ముకుని వస్తే గొప్ప లైఫ్‌ని ప్రసాదిస్తుంది. ఇండస్ట్రీ పుష్పక విమానంలాంటిది.. ఎంతమంది వచ్చినా ఇంకా చోటు మిగిలే ఉంటుంది. ఇండస్ట్రీ అక్షయ పాత్రలాంటిది. ఎంతమంది తిన్నా కూడా ఇంకా భోజనం అందిస్తుంది ఈ కళామతల్లి. కేవలం స్టార్స్ మాత్రమే ఉండే ఈ ఇండస్ట్రీలోకి బిక్కు బిక్కు మంటూ నేను ప్రవేశించాను. నా ప్రతిభపై నాకు నమ్మకం ఉంది. నా లోపల ధైర్యం ఉంది. ‘కొత్త అల్లుడు’ సినిమాలో ఓ చిన్న వేషం వేయమన్నారు.. బాధగా అనిపించింది కానీ చేశాను. అలాగే ‘కొత్తపేట రౌడీ’ సినిమాలో కృష్ణగారి పక్కన చిన్న వేషం వేయమన్నారు. ఓ వైపు ‘శుభలేఖ’, ‘ఇంట్లో కృష్ణయ్య వీధిలో రామయ్య’ వంటి సినిమాలు చేస్తున్నాను.. ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తే బాగుంటుందా? అంటే.. ‘చేయండి సార్’ అన్నారు. చేయనంటే నా భవిష్యత్ మీద ప్రభావం పడుతుందేమో అనే భయంతో చేశాను. కానీ, ఈ ఇండస్ట్రీ నన్ను ఆదరించిన దానికంటే... నన్ను ప్రోత్సహించి, భుజాన ఎత్తుకుంది, పైకి లేపింది ప్రేక్షకులు. వారికి రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘మీరంతా (అభిమానులు) చిరంజీవిగారి సినిమాలు చూస్తూ పెరిగితే.. నేను చిరంజీవిగారితో సినిమాలు చేస్తూ పెరిగాను’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్ . ‘‘చిరంజీవిగారితో సినిమా చేయడాన్ని లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు అనిల్ సుంకర్. ‘‘ఒక షాడోలో ఉన్న నా మీద మెగాస్టార్ అన్నయ్య వెలుగు పడింది. ‘భోళా శంకర్’ నాకు దర్శకుడిగా పునర్జన్మలాంటిది’’ అన్నారు. ఈ వేడుకలో పలువురు దర్శక– నిర్మాతలు పాల్గొన్నారు. -
చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీ స్టిల్స్
-
బోళా శంకర్ అదిరిపోయే అప్డేట్ ఫాన్స్ కి పూనకాలే..!
-
మెగాస్టార్ 'భోళాశంకర్'.. ఫోటోలు లీక్ చేసిన చిరు!
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'భోళా శంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహానటి కీర్తిసురేశ్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుండగా.. హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. (ఇది చదవండి: కోల్‌కతాలో భోళాశంకర్.. ఆ సీన్ రిపీట్ కానుందా?) షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్స్ మెగాస్టార్ ఎప్పటికప్పుడు తన ట్విటర్లో పంచుకుంటున్నారు. తాజాగా తమన్నాతో ఓ సాంగ్ షూటింగ్ సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. స్విట్జర్లాండ్‌లోని అందమైన లోకేషన్స్‌లో తీసిన సాంగ్ షూట్ ఎంతో ఆహ్లాదంగా జరిగిందంటూ ట్వీట్ చేశారు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న షూటింగ్ ఫోటోలను మెగాస్టార్ అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకొస్తా.. అప్పటివరకు 'చిరు లీక్స్' పిక్స్ నవ్వుతున్న ఏమోజీని జత చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ మీ పాట కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. (ఇది చదవండి: రప్ఫాడిస్తున్న మెగాస్టార్.. భోళాశంకర్ క్రేజీ అప్డేట్) స్విట్జర్లాండ్ 🇨🇭లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది! ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను ! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం ! అప్పటివరకూ ఈ 'చిరు… pic.twitter.com/VfT8Jx2QNC — Chiranjeevi Konidela (@KChiruTweets) May 23, 2023 -
స్విస్‌లో సాంగ్
అసలే ఎండాకాలం.. పైగా కొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి టైమ్‌లో కూల్ కూల్‌గా ఉండేప్రాంతానికి వెళ్లే చాన్స్ వస్తే.. హాయి హాయిగా ఉంటుంది. ప్రస్తుతం ‘భోళా శంకర్’ టీమ్ ఆ హాయినే అనుభవిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లో ల్యాండ్ అయ్యాడు ‘భోళా శంకర్’. అక్కడి కూల్ కూల్ క్లైమేట్లో ప్రేయసితో ఫుల్ స్వింగ్‌లో స్ప్రింగ్‌లాంటి స్టెప్పులేస్తున్నాడట. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన చెల్లెలి పాత్రలో హీరోయిన్ కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్విట్జర్లాండ్లోప్రారంభమైంది. చిరంజీవి, తమన్నాలపై సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను కూడా ప్లాన్ చేశారు. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ స్వరకర్త. ‘భోళా శంకర్’ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. -
హైదరాబాద్‌లో కోల్‌కతా! బోళా శంకర్ కొత్త షెడ్యూల్
హైదరాబాద్‌లో కోల్‌కతా ఏంటీ అనుకుంటున్నారా! చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బోళా శంకర్’ కోసం హైదరాబాద్‌లో కోల్‌కతా సెట్ వేశారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ఇది. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన కోల్‌కతా సెట్లో ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మంగళవారం ప్రారంభం అయింది. ఈ సెట్లో చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని టాక్. ‘‘మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బోళా శంకర్’. చిరంజీవిని స్టైలిష్, మాస్ క్యారెక్టర్లో అద్భుతంగా చూపిస్తున్నారు మోహర్ రమేశ్. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్, తమన్నా కథానాయికగా నటిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: డడ్లీ. -
ఘనంగా కొణిదెల హీరో పవన్ తేజ్ యాంకర్ మేఘన నిశ్చితార్థం (ఫోటోలు)
-
ఇంతకుముందు చూడని మెగాస్టార్‌ను చూస్తారు: మెహర్ రమేష్
Meher Ramesh About Chiranjeevi In Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ మూవీ 'ఆచార్య'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో స్పీడు పెంచింది 'ఆచార్య' చిత్ర బృందం. తాజాగా (శనివారం ఏప్రిల్ 23) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, బాబీ, మోహన్ రాజా, మెహర్ రమేష్ అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే పాల్గొన్నారు. చిరంజీవి తదుపరి చిత్రం భోళా శంకర్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఆచార్యలోని నీలాంబరి వీడియో సాంగ్ లాంచ్ చేశారు. మెహర్ రమేష్ మాట్లాడుతూ 'మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఒక పండుగల ఉంటుంది. అలాంటిది కొరటాల శివ.. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరినీ చూపిస్తున్నారు. ఇది ఫ్యాన్స్‌కి కన్నుల పండగే. ఆచార్య చిత్రంలో నేను ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ చూశాను. మునుపెన్నడూ చూడని మెగాస్టార్‌ను చూస్తారు. బంజారా సాంగ్‌లో చిరు, చరణ్ డ్యాన్స్ ఐఫీస్ట్‌లా ఉంటుంది' అని తెలిపారు. చదవండి: ‘ఆచార్య’ కోసం రంగంలోకి మహేశ్ బాబు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_601242433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీ ప్రారంభం ఫోటోలు
-
అంగరంగ వైభవంగా ప్రారంభమైన ‘భోళా శంకర్’
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’ షూటింగ్ ప్రారంభైమంది. గురువారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో భోళా శంకర్ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను ఘనంగా ప్రారంభించారు చిరంజీవి. ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్, హరీశ్ శంకర్, బాబీ, గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి, కొరటాల శివ తదితరులు పాల్గొని, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు. ముహుర్తపు షాట్లో భాగంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిరుపై క్లాప్ కొట్టారు. ఇక భోళా శంకర్ విషయానికొస్తే.. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్ ఇది. . చిరంజీవి కెరీర్లో 154వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో హీరోయిన్గా తమన్నా, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఈనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, నవంబర్‌లో ‘భోళా శంకర్’ వస్తున్నాడు
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా ‘భోళా శంకర్’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళ మూవీ ‘వేదాళం’ రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. చిరు బర్త్‌డే(అగష్టు 22) రోజున ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడగా.. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన కొత్త అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది చిత్ర బృందం. నవంబర్ 11న ఈ మూవీని ప్రారంభం కానుందని, నవంబర్ 15 నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తాజాగా మేకర్స్ స్పష్టం చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ మూవీ రీమేక్‌గా భోళా శంకర్ రూపొందబోతోంది. ఈ చిత్రం తమిళ వెర్షన్లో అజిత్ హీరోగా నటించాడు. ఇందులో చిరు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఆయన ఈ సినిమాలో గుండుతో కూడా కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేశ్ నటించనుంది. #BholaShankar 𝐏𝐨𝐨𝐣𝐚 𝐂𝐞𝐫𝐞𝐦𝐨𝐧𝐲 𝟏𝟏-𝟏𝟏-𝟐𝟏 𝐌𝐞𝐠𝐚 𝐒𝐡𝐨𝐨𝐭 𝐛𝐞𝐠𝐢𝐧𝐬 𝐟𝐫𝐨𝐦 𝟏𝟓-𝟏𝟏-𝟐𝟏@KChiruTweets pic.twitter.com/8IeA0teifv — 𝐂𝐡𝐢𝐫𝐚𝐧𝐣𝐞𝐞𝐯𝐢 𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬 𝐅𝐚𝐧𝐬 (@Santhos43007209) October 27, 2021 -
చిరు బర్త్‌డే సర్ప్రైజ్ వచ్చేసింది..‘భోళా శంకర్’గా మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్‌కు సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి ‘బోళా శంకర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. (చదవండి: చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎవరిచ్చారో తెలుసా?) తమిళ్ బ్లాక్ బస్టర్ ‘వేదాళం రీమేక్ గా భోళా శంకర్ రూపొందబోతోంది. ఈ చిత్రం తమిళ వెర్షన్ లో అజిత్ హీరోగా నటించాడు. ఈ తెలుగు రీమేక్ లో ముందుగా పవన్ నటించాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రీమేక్ ను నాన్చుతునే ఉన్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రీమేక్ చేయబోతున్నారు. ఇందులో చిరు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఆయన ఈ సినిమాలో గుండుతో కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Happy birthday @KChiruTweets garu🤗 Honoured to be unveiling the title of your film! #BholaaShankar, under the directorial skills of my good friend @MeherRamesh and my favourite producer @AnilSunkara1 garu May the year ahead bring you great health and success. All the best sir! pic.twitter.com/U9czmnIK5I — Mahesh Babu (@urstrulyMahesh) August 22, 2021 -
చిరంజీవి బర్త్‌డే: రేపు రానున్న క్రేజీ ఆప్డేట్
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే నేపథ్యంలో ఆయన సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. ఆగస్ట్ 22న చిరంజీవి 66వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు చెప్పేందుకు అభిమానులు, సినీ సెలబ్రెటీలు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా చిరు ఇటివల ఆచార్య మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని లూసిఫర్ రీమేక్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. చదవండి: తండ్రి బర్త్‌డేకు సర్ప్రైజ్ ఇవ్వబోతోన్న సుస్మిత కొణిదెల త్వరలో వేదాళం రీమేక్ చేయనున్నారు. బాబీ దర్శకత్వంలోను ఓ మూవీ చేయబోతున్నారు ఆయన. ఆగష్టు 22(ఆదివారం) ఆయన పుట్టిన రోజు సందర్భంగా రేపు ఉదయం 9గం.లకు మెహర్ రమేష్ మూవీకి సంబంధించిన అప్డేట్ రానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. మెగా వేలో మెగాస్టార్ బర్డ్‌డే సెలబ్రేషన్స్ జరుపుకోండి ఇలా అని తమ ట్వీట్లో మేకర్స్ పేర్కొన్నారు. #MegaEuphoria 🤟#HBDMegastarChiranjeevi https://t.co/VJ1NfNr9tk — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) August 21, 2021 -
నువ్వే దిక్కన్న దర్శకుడు, సాయం చేసిన సోనూసూద్
సాధారణంగా హీరోలు మంచివాళ్లుగా, విలన్లు చెడ్డవాళ్లుగా కనిపిస్తారు. కానీ అది కేవలం స్క్రీన్ మీద మాత్రమే. రియల్ లైఫ్‌లో ఇది భిన్నంగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా విలన్ పాత్రలు వేసే ఓ వ్యక్తి మాత్రం గడ్డు కాలంలో ఉన్న అందరినీ ఆదుకుంటూ హీరో అయ్యాడు, ప్రజల గుండెల్లో దేవుడిగా కొలువుదీరాడు. అతడే సోనూసూద్... ఆపదలో ఉన్నవారికి అయినవారే అడుగు దూరంగా ఉంటున్న ఈ రోజుల్లో సోనూసూద్ మాత్రం అందరికీ సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు. Every single medicine you will get brother. Let's save lives 🇮🇳@SoodFoundation https://t.co/zwmQXlxs8g — sonu sood (@SonuSood) May 8, 2021 తాజాగా దర్శకుడు మెహర్ రమేశ్.. వెంకట రమణ అనే రోగి కోసం కొన్ని ఇంజక్షన్లు, మెడిసిన్లు కావాలని కోరుతూ ట్వీట్ చేశాడు. ఎంత ప్రయత్నించినా అవి సమకూర్చలేకపోయానని, దయచేసి అతడికి సాయం చేయండంటూ సోనూసూద్‌ను అభ్యర్థించాడు. ఈ విషయంలో మీరు, మీ ఫౌండేషన్ మాత్రమే సాయం చేయగలరని చేతులెత్తి వేడుకున్నాడు. ఈ ట్వీట్ చేసిన 24 గంటల్లో సోనూసూద్ ఆ మెడిసిన్స్‌ను దర్శకుడికి అందజేశాడు. దీంతో మెహర్ రమేశ్ అతడికి కృతజ్ఞతలు తెలియజేశాడు. సకాలంలో వాటిని ఇంత వేగంగా అందించడం మీకు మాత్రమే సాధ్యమైందంటూ ప్రశంసించాడు. ఇదిలా వుంటే ప్రస్తుతం మెహర్ రమేశ్.. మెగాస్టార్ చిరంజీవితో 'వేదాళం' రీమేక్ ప్లాన్ చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు కనిపిస్తోంది. Anything for you brother🙏 Thanks for helping us save a life 🇮🇳@SoodFoundation https://t.co/JY4q36ObpL — sonu sood (@SonuSood) May 8, 2021 చదవండి: హృదయం ముక్కలైంది.. సోనూసూద్ ఎమోషనల్ -
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్
ఒకప్పుడు హీరోలు అతికష్టంగా ఏడాదికి ఒక సినిమా విడుదల చేసేవారు. తర్వాత వచ్చిన యంగ్ హీరోలు వారికి పోటీగా ఏడాదికి రెండు, కుదిరితే రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. వారిని చూసి సీనియర్ హీరోలు స్పీడ్ పెంచారు. ఖైదీ నం.150 సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలనుకున్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటినుంచి సంవత్సరానికి ఒక సినిమాతో మీ ముందుకు వస్తానని ఫ్యాన్స్‌కు మాటిచ్చారు. కానీ అలా జరగలేదు. 150వ సినిమా వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత సైరా వచ్చింది. ఆ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే కొరటాల శివతో తన తర్వాత చిత్రం ఉండబోతుందని ప్రకటించేశారు. అదే ఆచార్య.. కోవిడ్ వల్ల ఆ సినిమా షూటింగ్ కూడా ముందుకెళ్లలేకపోయింది. కానీ లాక్డౌన్ సమయంలో స్క్రిప్ట్‌లను వింటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టారు చిరంజీవి. ఇప్పుడు లాక్డౌన్ సడలించడంతో ఆచార్య షూటింగ్ 9 నుంచి ప్రారంభం కానుంది. కాజల్‌తో పాటు ఆయన కూడా అప్పటినుంచి ఈ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారు. ఈ చిత్రం పూర్తవ్వగానే వెంటనే మరో సినిమా ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు మెగాస్టార్. (సీఎం కేసీఆర్‌తో చిరంజీవి, నాగార్జున భేటీ) బిల్లా, శక్తి వంటి సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైన మెహర్ రమేశ్ దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్ అజిత్ నటించిన వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ కథను తెలుగువారికి దగ్గరగా అనిపించేలా మార్పులు కూడా చేశాడు దర్శకుడు మెహర్ రమేశ్. తాజాగా అందిన సమాచారం ప్రకారం జనవరి 18న వేదాళం రీమేక్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. దీనిపై మూవీ టీమ్ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈలోపు మెహర్ రమేశ్ పూర్తి స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉండాలని, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకోవాలని చిరంజీవి సూచించారు. (బాహుబలి తిరిగొచ్చాడు) అనిల్ సుంకర, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రీమేక్ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించబోతుందనే వార్త ప్రచారంలో ఉంది. ముందు ఆచార్య షూటింగ్‌తో, ఆ తర్వాత వేదాళం రీమేక్ షూటింగ్‌తో చిరంజీవి తీరిక లేకుండా గడపనున్నారు. -
డిజాస్టర్ డైరెక్టర్‌తో నమ్రత ప్రాజెక్ట్!
బాక్సాఫీస్ దిమ్మతిరిగిపోయే ఫ్లాప్ సినిమాలు తీసిన దర్శకుడు మెహర్ రమేష్. కన్నడలో సక్సెస్‌లు సాధించినా తెలుగులో మాత్రం మెహర్ రమేష్ తెరకెక్కించిన సినిమాలన్ని బోల్తాపడ్డాయి. దీంతో చాలా కాలంగా ఈ దర్శకుడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు కొన్ని ప్రకటనలకు దర్శకత్వం వహించినా పూర్తి స్థాయి సినిమా తెరకెక్కించి చాలా కాలమే అవుతుంది. 2013లో రిలీజ్ అయిన షాడో సినిమా తరువాత సినిమాలకు దూరమైన మెహర్ రమేష్ సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఆ రిలేషన్స్ కారణంగానే ఓ క్రేజీ ప్రాజెక్ట్, ఈ దర్శకుడిగా చేతికి వచ్చినట్టుగా తెలుస్తోంది. నిర్మాణరంగం మీద దృష్టి పెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు, సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ పనులన్ని మహేష్ భార్య, నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే అడివి శేష్ హీరోగా మేజర్ సినిమాను రూపొందిస్తున్న నమ్రత, త్వరలో ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్నారు. ఈ సిరీస్‌కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ముందుగా ఈ వెబ్ సిరీస్‌ను రాహుల్ సంక్రిత్యాన్ (టాక్సీవాలా ఫేం) దర్శకత్వంలో రూపొందించాలని భావించినా.. రాహుల్ తప్పుకోవటంతో మెహర్ రమేష్‌ను దర్శకుడిగా తీసుకున్నారు. మరి వెండితెర మీద సక్సెస్ కాలేకపోయిన ఈ దర్శకుడు, డిజిటల్లో అయినా విజయం సాధిస్తాడామో చూడాలి.