
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మెహర్ రమేశ్ సినిమాల విషయానికొస్తే తెలుగులో 'శక్తి', 'కంత్రి', 'షాడో', 'భోళా శంకర్' సినిమాలను తెరకెక్కించారు. అంతకుముందు 2002లో తొలుత ఇతడు నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిరంజీవికి వరసకు తమ్ముడు అయ్యే మెహర్.. మహేశ్‌బాబు 'బాబీ' మూవీ సునీల్ అనే కామెడీ రోల్ చేశాడు. ఆ సినిమా ఆడకపోవడంతో మెహర్ యాక్టింగ్ వదిలేశాడు.
ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అయితే ఒకానొక సందర్భంలో అనుకోకుండా 'ఆంధ్రావాలా' కన్నడ రీమేక్ 'వీర కన్నడిగ' తీసే అవకాశం వచ్చింది. అలా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అ తర్వాత 'ఒక్కడు' చిత్రాన్ని కన్నడలో 'అజయ్'గా రీమేక్ చేసి మరో హిట్ కొట్టాడు. ఇలా కన్నడ భాషలో సక్సెస్ అందుకున్న మెహర్ రమేశ్.. తెలుగులో మాత్రం అంతలా సక్సెస్ కాలేకపోయారు.