Tollywood Young Director Paidi Ramesh Dies of Current Shock - Sakshi
Sakshi News home page

Director Paidi Ramesh: టాలీవుడ్‌లో మరో విషాదం.. కరెంట్‌ షాక్‌తో డైరెక్టర్ మృతి

Published Fri, Apr 29 2022 8:36 AM | Last Updated on Fri, Apr 29 2022 10:06 AM

Tollywood Young Director Paidi Ramesh Passed Away With Current Shock - Sakshi

Tollywood Young Director Paidi Ramesh Passed Away With Current Shock: టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. యంగ్‌ హీరో నిఖిల్‌ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్‌ గురువారం (ఏప్రిల్‌ 28) ఉదయం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అదే రోజు టాలీవుడ్‌కు చెందిన యంగ్‌ డైరెక్టర్‌ కన్నుమూశారు. డైరెక్టర్‌ పైడి రమేష్‌ ఓ భవనంపై నుంచి జారిపడి చనిపోయినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పైడి రమేష్‌ నాలుగో అంతస్తులో ఆరేసిన బట్టలు తీస్తుండగా షాక్‌ కొట్టి కింద పడి ఆయన మరణించినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

పైడి రమేష్‌ మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా పైడి రమేష్ 'రూల్‌' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2018లో విడుదల అయింది. అయితే ఈ సినిమా అంతగా గుర్తింపు దక్కించుకోలేదు. ప్రస్తుతం మరో సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు పైడి రమేష్‌. ఇంతలోనే ఈ ఘటన జరగడం పలువురిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 

చదవండి:  హీరో నిఖిల్‌ తండ్రి శ్యామ్‌ సిద్ధార్థ్‌ కన్నుమూత
గుండెపోటుతో ప్రముఖ సీనియర్‌ నటుడు మృతి




No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement