సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత | Hero Vikram condolences on Malayalam director Shafi dies at 56 | Sakshi
Sakshi News home page

ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో విక్రమ్ నివాళి

Published Sun, Jan 26 2025 12:43 PM | Last Updated on Sun, Jan 26 2025 12:56 PM

Hero Vikram condolences on Malayalam director Shafi dies at 56

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మలయాళ దర్శకుడైన షఫీ(56)కి ఈనెల 16న హార్ట్‌ స్ట్రోక్ రావడంతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాదాపు పది రోజుల చికిత్స పొందుతూ కోలుకోలేక ఇవాళ మృతి చెందారు. ఆయన మరణం పట్ల ప్రముఖ హీరోలు పృథ్వీరాజ్ సుకుమారన్, చియాన్ విక్రమ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ప్రియమైన స్నేహితుడిని కోల్పోయినందుకు బాధగా ఉందని చియాన్ విక్రమ్ ట్విటర్ వేదిక విచారం వ్యక్తం చేశారు. డైరెక్టర్‌ షఫీలో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

విక్రమ్ ట్విటర్‌లో రాస్తూ "ఈ రోజు ఒక ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను. అంతాకాదు ఈ ప్రపంచం ఒక అద్భుతమైన దర్శకుడిని కోల్పోయింది. నాకు తెలిసిన అత్యంత సున్నితమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. జీవితంలోని క్షణాలలో అందాన్ని చూడగల వ్యక్తి. అతను మన మధ్య లేకపోవచ్చు.. కానీ అతనితో ఉన్న క్షణాలు ఎల్లప్పుడూ గుర్తుకొస్తాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడి పార్థిస్తున్నా. నిన్ను మిస్సవుతున్నా కానీ ఎప్పటికీ మర్చిపోలేము " అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. డైరెక్టర్ మృతి పట్ల హీరో విష్ణు ఉన్నికృష్ణన్ నివాళులర్పించారు.

కాగా.. షఫీ అసలు రషీద్‌ కాగా.. సినిమాల్లోకి వచ్చాక  షఫీ పేరుతోనే ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా కామెడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 2001లో వన్ మ్యాన్ షో మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో 10 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. మలయాళంలో పులివాల్ కళ్యాణం, తొమ్మనుమ్ మక్కలుమ్, మాయావి, మరికొండొరు కుంజాడు లాంటి చిత్రాలను తెరకెక్కించారు. చివరిసారిగా 2022లో వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఆనందం పరమానందం’ దర్శకుడిగా వ్యవహరించారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement