malayalam director
-
ఆ డైరెక్టర్ నన్ను పనిమనిషిలా చూశాడు.. అందరిముందు..
మలయాళ దర్శకుడు రథీశ్ బాలకృష్ణ తనను మొదటినుంచీ ఇబ్బందిపెడుతూనే ఉన్నాడంది కాస్ట్యూమ్ డిజైనర్ లిజి ప్రేమన్. తనను ఒక ఆర్టిస్టుగా కాకుండా పనిమనిషిగా చూశాడని వాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిజి మాట్లాడుతూ.. సురేశంతియం సుమలతయుదేయమ్: హృదయహరియయ ప్రణయకథ అనే సినిమాకు నేను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశాను. 35రోజులు పని ఉంటుందన్నారు. అందుకుగానూ రెండున్నర లక్షలు అడిగాను. సరేనంటూ లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఎన్నో ఇబ్బందులు..ఈ సినిమా ప్రీపొడక్షన్ దగ్గరి నుంచి షూటింగ్ వరకు దాదాపు 110 రోజులు పని చేశాను. ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ రథీశ్‌కు ఇగో ఎక్కువ. నన్ను ఒక పనిమనిషిలా చూశాడు. అతడి ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు. అందరిముందు చులకన చేసి మాట్లాడేవాడు. ఆయన వల్ల ఎంతో మానసిక వేదన అనుభవించాను. తన టార్చర్ భరించలేక చివర్లో ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశాను. నాకు క్రెడిట్ ఇవ్వలేదుతీరా చూస్తే సినిమా క్రెడిట్స్‌లో నా పేరు వేయలేదు. అసిస్టెంట్ అని రాశారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా మరో వ్యక్తికి క్రెడిట్ ఇచ్చారు. ఇది నన్ను అవమానించడం కాకపోతే ఇంకేమవుతుంది. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు పూర్తిగా ముట్టజెప్పలేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాపై ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టిన వారిని ఊరికే వదిలిపెట్టను. నా వల్ల సినిమాకు ఇబ్బంది ఉండకూడదనే రిలీజ్ అయ్యేవరకు ఆగాను. ఓటీటీలో అయినా..ఇప్పుడు న్యాయపోరాటం చేస్తాను. కనీసం ఓటీటీలో విడుదల చేసేటప్పుడైనా కాస్ట్యూమ్ డిజైనర్‌గా సినిమాలో నా పేరు వేయాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే నా పట్ల దురుసుగా ప్రవర్తించినందుకుగానూ డైరెక్టర్ నాకు సారీ చెప్పాలి. మానసిక వేధింపులకు గురి చేసినందుకు పరిహారం చెల్లించాలి. నాలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు అని లిజి పేర్కొంది.చదవండి: గుడిలో కమెడియన్ పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్ ఇదే! -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ (77) కన్నుమూశారు. పక్షవాతంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేరళ కక్కనాడ్‌లోని వృద్ధాశ్రమంలో ఆయనకు ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం. (ఇది చదవండి: డ్రగ్స్ కేసులు..పబ్బు గొడవలు.. నిత్యం వివాదాల్లో హీరో నవదీప్!) 1976లో స్వప్నదానం సినిమాతో దర్శకుడిగా జార్జ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వ్యామోహం, యవనిక, ఇరకల్, మేళా, ఎలవంకోడు దేశం, మహానగరం, ఆడమింటే వారియెల్లు లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌గా తన తొలి చిత్రం స్వప్నదానం సినిమాకు జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. 2015లో మలయాళ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను కేరళ ప్రభుత్వం జైసీ డేనియల్ అవార్డుతో సత్కరించింది. అంతే కాకుండా కేజీ జార్జ్ కొత్త ఫిల్మ్ మేకింగ్ పాఠశాలను స్థాపించారు. మలయాళ సింగర్ సెల్మా జార్జ్‌ని 1977లో చెన్నైలో వివాహం చేసుకున్నారు. కాగా.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (ఇది చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి చార్లీ!) -
గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ కన్నుమూత
ఇండస్ట్రీలో మరో విషాదం. ఎన్నో అద్భుతమైన సినిమాల తీసి, స్టార్ డైరెక్టర్‌గా పేరు గడించిన సిద్ధిఖీ (63) కన్నుమూశారు. గత రెండు రోజులుగా అనారోగ్య సమస్యలతో సీరియస్ కండీషన్లో ఉన్న ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో మలయాళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హీరోయిన్ కీర్తి సురేశ్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, హీరో మోహన్‌లాల్ తదితరలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిఖీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఏం జరిగింది? సోమవారం మధ్యాహ్నం దర్శకుడు సిద్ధిఖీకి గుండెపోటు వచ్చింది. దీంతో కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. లివర్ సంబంధిత సమస్యలతోపాటు న్యూమోనియా ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. మరోవైపు ఈయన ఆరోగ్యం విషమించింది. ఎక్మో సాయంతో చికిత్స అందించినట్లు మాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఆయనకు ఏం కాదని, త్వరగా కోలుకుంటారని అనుకున్నారు. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రాణాలు వదిలేశారు. (ఇదీ చదవండి: బెడ్‌పై కదల్లేని స్థితిలో.. మాట రాక కంటనీరు..: రాజీవ్ కనకాల ఎమోషనల్) సిద్దిఖీ ఎవరు? సిద్ధిఖీ అసలు పేరు సిద్ధిఖీ ఇస్మాయిల్. డైరెక్టర్ కమ్ స్క్రీన్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్. మలయాళంలో మోహన్‌లాల్‌కు సిద్దిఖీ బెస్ట్ ఫ్రెండ్. వీళ్లిద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. అద్భుతమైన సక్సెస్‌లు అందుకున్నాయి. విచిత్రం ఏంటంటే సిద్దిఖీ తీసిన తొలి సినిమా 'రాంజీరావు స్పీకింగ్'. చివరి సినిమా 'బిగ్ బ్రదర్'. ఈ రెండింటిలోనూ మోహన్‌లాల్ హీరో కావడం విశేషం. దీన్నిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్లిద్దరి బాండింగ్ ఎలా ఉండేదోనని.. తెలుగులోనూ అలానే మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోని అద్భుతమైన సినిమాల్లో ఒకటైన 'హిట్లర్' కథ ఈయనదే. మలయాళంలో అదే పేరుతో మమ్ముట్టి హీరోగా తీసిన సినిమానే చిరు.. తెలుగులో రీమేక్ చేశారు. పలు భాషల్లో రీమేక్ అయిన 'బాడీగార్డ్' ఒరిజినల్‌కు దర్శకుడు ఈయనే. తెలుగులోనూ నితిన్ హీరోగా 'మారో' అనే మూవీ తీశాడు. కాకపోతే ఇది ఆడలేదు. దీంతో సిద్దిఖీ మరో తెలుగు సినిమా చేయలేదు. 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన సిద్దిఖీ ఇలా చనిపోవడం ఇండస్ట్రీకి తీరనిలోటు. 💔 pic.twitter.com/DJrV2IKZc6 — Keerthy Suresh (@KeerthyOfficial) August 8, 2023 RIP Deepest condolences to the family 🙏 pic.twitter.com/LXjkvvxxBl — Prabhudheva (@PDdancing) August 8, 2023 (ఇదీ చదవండి: అనాథలా రేకుల షెడ్డులో దుర్భర జీవితం గడిపిన స్టార్ హీరోయిన్!) -
'గాడ్ ఫాదర్' దర్శకుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అలా
సినిమా ఇండస్ట్రీలో గుండెపోటు వార్తలు ఎక్కువైపోతున్నాయి. మొన్నీ మధ్యే నటి శ్రుతి షణ్ముగప్రియ భర్త ఇలా చనిపోయారు. నిన్న కన్నడ హీరో పునీత్ రాజ్ కుటుంబానికి చెందిన నటి స్పందన గుండెపోటు వచ్చి సడన్ గా మృతి చెందింది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ సిద్ధిఖీ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: ఆస్పత్రి ఖర్చులకు డబ్బుల్లేక ప్రముఖ నటి మృతి!) స్టార్ డైరెక్టర్ 69 ఏళ్ల సిద్ధిఖీ.. మలయాళంతోపాటు తెలుగు, తమిళ, హిందీలో సినిమాలు తీశారు. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈయన.. లాల్ అనే యాక్టర్ కమ్ డైరెక్టర్ తో కలిసి బోలెడన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. కథ-స్క్రీన్ ప్లేలు కూర్చే కాంబోగానూ చాలా క్రేజ్ సంపాదించారు. 'రామ్జీరావ్ స్పీకింగ్', 'ఇన్ హరిహర్ నగర్', 'గాడ్ ఫాదర్', 'వియత్నాం కాలనీ', 'కాబూలీ వాలా' తదితర మలయాళ సినిమాలతో ఫేమస్. తెలుగులోనూ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధిఖీ నితిన్ తో కలిసి 'మారో' అనే సినిమా తీశారు. కాకపోతే అది సక్సెస్ కాకపోవడంతో ఇక్కడ మరో మూవీ చేయలేదు. డైరెక్షన్ పక్కనబెడితే నటుడిగా కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రలో మెరిశారు. పలు టీవీ షోల్లో జడ్జిగానూ మెరిశారు. చివరగా మోహన్ లాల్ తో 'బిగ్ బ్రదర్' సినిమా చేశారు. 2020లో ఇది రిలీజైంది. అలాంటిది ఇప్పుడు ఆయన గుండెపోటుకు గురై, విషమ పరిస్థితుల్లో ఉండటం అభిమానుల్ని కలవరపాటుకి గురిచేస్తోంది. త్వరగా కోలుకోవాలని వాళ్లు ఆకాంక్షిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
అనుమానాస్పదస్థితిలో డైరెక్టర్ మృతి!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ చిత్ర దర్శకుడు బైజు పరవూర్ జూన్ కేరళలోని కొచ్చిలో కన్నుమూశారు. అయితే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికి మీడియా కథనాల ప్రకారం ఫుడ్ పాయిజనింగ్తో మృతి చెందినట్లు భావిస్తున్నారు. (ఇది చదవండి: ఆ సూపర్ హిట్ సినిమాకు పార్ట్-2 ఉంది: వెట్రిమారన్) అసలేం జరిగిందంటే.. జూన్ 24న కోజికోడ్‌లోని ఒక హోటల్లో బైజు పరవూర్ భోజనం చేశారు. అయితే ఇంటికి వచ్చిన వెంటనే ఏదో అసౌకర్యంగా అనిపించడంతో కేరళలోని కున్నంకులంలో ఉన్న తన భార్య ఇంటికి వెళ్లాడు. అక్కడే స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న బైజు పరవూరులోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో కొచ్చిలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అయితే ఫుడ్ పాయిజన్ వల్లే బైజు చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా.. బైజు దాదాపు 45 సినిమాల్లో ప్రొడక్షన్ కంట్రోలర్‌గా పనిచేశారు. త్వరలోనే తాను తెరకెక్కించిన సినిమా సీక్రెట్ రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. (ఇది చదవండి: అర్జున్ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే) -
ఆ హీరో ఇండస్ట్రీకి పనికి రాడు, ఆ పాపం ఊరికే పోలేదు: దర్శకుడు
కేరళలో రిలీజైన '2018- ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో' సినిమా అక్కడ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ మలయాళీ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ జ్యూడ్ ఆంథొని జోసెఫ్ గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'కొన్నివిషయాలను అంత ఈజీగా మర్చిపోలేం. షేన్ నిగమ్, శ్రీనాథ్ బసి లాంటివాళ్లు గంజాయి, డ్రగ్స్‌కు బానిసయ్యారన్న ఆరోపణలున్నాయి. కానీ నా దృష్టిలో డ్రగ్స్ కన్నా మానవత్వం లేకపోవడమే అతి పెద్ద సమస్య. ఇండస్ట్రీలో ఆంటోని వర్గీస్ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా మంచి వాడని అందరూ అనుకుంటారు. నేనూ అలాగే అనుకున్నా. నిర్మాతగా అతడితో ఓ సినిమా చేయాలనుకున్నాను. అతడు కూడా ఓకే చెప్పాడు. ఇంతలో తన చెల్లెలి పెళ్లి అని చెప్పి సహనిర్మాత, నా స్నేహితుడు అరవింద్ నుంచి రూ.10 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. సినిమా ప్రారంభించడానికి ఇంకా 18 రోజులు ఉందన్న సమయంలో అతడు ముఖం చాటేశాడు. నాకు, అరవింద్‌కు చాలా బాధేసింది. ఇద్దరం ఎంతగానో ఏడ్చాం. మా సినిమా చేయనని చెప్పి నహస్ హిదయత్ అనే కొత్త దర్శకుడితో అరవం సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. కానీ కొంతకాలానికే ఆ సినిమా అటకెక్కింది. బహుశా అతడు చేసిన పాపం అతడికే చుట్టుకుందేమో! చాలా కాలం తర్వాత తను తీసుకున్న డబ్బును అరవింద్‌కు తిరిగిచ్చాడు వర్గీస్. చాలామంది అర్హత లేని వ్యక్తులు ఇండస్ట్రీలో ఉన్నారు. అందులో వర్గీస్ ఒకడు. డైరెక్టర్ లిజో జోస్ పెల్లిసరీ అతడిని ఇండస్ట్రీకి పరిచయం చేయకపోతే ఇలాంటి వాళ్లను భరించాల్సిన అవసరమే ఉండేది కాదు' అని ఎమోషనలయ్యాడు జ్యూడ్. చదవండి: నటితో సహజీవనం, వద్దనుకున్నా కొడుకు పుట్టడంతో.. -
డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోయిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. ఇంతలోనే విషాదం!
మలయాళ నూతన దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్(31) అనారోగ్యంతో కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన కేరళ అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించగా హెపటైటిస్‌తో ఫిబ్రవరి 25న తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. కాగా జోసెఫ్ మను 'ఐయామ్ క్యూరియస్' సినిమాతో బాలనటుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీ 2004లో రిలీజైంది. కొన్నేళ్ల తర్వాత జోసెఫ్ సినీపరిశ్రమ మీద ఉన్న ఆసక్తితో పలు మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. నాన్సీ రాణి సినిమాతో పూర్తిస్థాయిలో దర్శకుడిగా పరిచయం కానున్నారు. తను తెరకెక్కించిన సినిమా రిలీజ్‌ను చూడకముందే ఆయన మరణించడంతో చిత్రయూనిట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో అహానా క్రిష్ణ, అర్జున్ అశోకన్ ముఖ్య పాత్రలు పోషించారు. జోసెఫ్ మృతిపై అహానా సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనైంది. 'నీకిలా జరగాల్సింది కాదు మను. నీ ఆత్మకు శాంతి చేకూరుగాక' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. అజు వర్గీస్ సైతం 'చాలా త్వరగా వెళ్లిపోయావు బ్రదర్' అంటూ నివాళులు అర్పించారు. -
మాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
మాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్(60) అనారోగ్యంతో కన్నుమూశారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆయన కోచిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని కేరళ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ధృవీకరించింది. ఆయన అసలు పేరు రామన్ అశోక్ కుమార్. కామెడీ చిత్రాల ద్వారా మాలీవుడ్‌లో మంచిపేరు సంపాదించారు. (చదవండి: వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!) మలయాళంలో వచ్చిన సైకలాజికల్ డ్రామా వర్ణం సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. 1980ల్లో శశికుమార్ దగ్గర అసిస్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన అశోకన్.. అతని రెండో చిత్రం 'ఆచార్యన్' క్రేజ్ తీసుకొచ్చింది. మలయాళం కైరాలి టీవీలో ప్రసారమైన 'కనప్పురమున్' 2003లో ఉత్తమ టెలిఫిల్మ్‌గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకుంది. అశోకన్ సింగపూర్‌కు మారడానికి ముందు ఇదే చివరి చిత్రం. అ తర్వాత వ్యాపారరంగంలోకి ప్రవేశించారు. ఆయనకు గల్ఫ్, కొచ్చిలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అశోకన్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. -
విషాదం.. దర్శకుడు కన్నుమూత
కొచ్చి (కేరళ): మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. డైరెక్టర్ కేఎన్ శశిధరణ్(72) జూలై 7న తుదిశ్వాస విడవగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేరళలోని కొచ్చి సమీపంలో ఈడపల్లిలోని తన నివాసంలో ఆయన మరణించారు. ఈరోజు(సోమవారం) సాయంత్రం దర్శకుడి అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. కాగా శశిధరణ్ భార్య పేరు వీణ. వీరికి రీతూ, ముఖిల్ సంతానం. కేఎన్ శశిధరణ్ పుణె ఫిలిం ఇన్స్టిట్యూట్లో డిగ్రీ పట్టా అందుకున్నారు. 1984లో 'అక్కర' సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో ప్రవేశించారు. ఈ సినిమాలో మమ్ముట్టి, నెడుముడి వేణు, రాణి పద్మిని, మోహన్‌లాల్, భరత్ గోపి, మాధవి, శ్రీనివాసన్, వీకే శ్రీరామన్ ప్రధాన పాత్రల్లో నటించారు. రచయిత పీకే నందనవర్మ రాసిన అక్కర నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆ తర్వాతి ఏడాది 'కనతయ పెంకుట్టి' అనే మర్డర్ మిస్టరీ సినిమా తీశారు. ఇందులోనూ మరోసారి భరత్ గోపి, మమ్ముట్టి, వీకే శ్రీరామన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇకపోతే సినిమాల కంటే కూడా ఆయన ఎక్కువగా వాణిజ్య ప్రకటనలను డైరెక్ట్ చేసి గుర్తింపు సంపాదించుకున్నారు. చదవండి: లక్కీ చాన్స్ చేజార్చుకున్న కీర్తి సురేశ్? ట్రోల్ చేస్తున్న నెటిజన్లు! షూటింగ్ సమయంలో దర్శకుడితో కాస్తా ఇబ్బంది పడ్డా -
నాలుగు గోడల మధ్య నరకాలు నడిచొచ్చిన చోట...
కొన్ని చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి... కొన్ని చిత్రాల చిత్రజైత్రయాత్ర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ‘కేజ్డ్’ అనే లఘుచిత్రం కూడా ఇలాంటిదే! దీనిలో ఎలాంటి కమర్షియల్ గిమ్మిక్కులు లేవు... కన్నీటిబొట్లు ఉన్నాయి. వాటిలోకి ఒకసారి తొంగిచూస్తే మన ఊరు,వాడ, ఇల్లు కనిపిస్తాయి. కరోనా కాలంలో... ముఖ్యంగా లాక్డౌన్ టైమ్‌లో... ఒక ఊళ్లో ఒక భర్త: ‘చికెన్ బిర్యానీ వండిపెట్టమని రెండురోజుల నుంచి చెబుతున్నాను. పుట్టింటి వాళ్లతో మాట్లాడడానికి టైమ్ ఉంటుందిగానీ నేను అడిగింది చేసి పెట్టడానికి మాత్రం టైమ్ ఉండదు. మగాడికి విలువ లేకుండా పోయింది’ మరో ఊళ్లో ఒక భర్త: ఈయన ఇంట్లో ఉండడం కంటే ఆఫీసులో ఉండడమే ‘కుటుంబ సంక్షేమం’ అనుకుంటారు కుటుంబసభ్యులు. ఈ భర్త చాదస్తాల చౌరస్తా. ‘ఇది ఇల్లా అడవా? ఏంచేస్తున్నావు? ఎక్కడి వస్తువులు అక్కడే పని ఉన్నాయి’ అని గర్జించే ఈ భర్తకి టీవికి ఠీవీగా ముఖం అప్పగించడం తప్ప చిన్నచిన్న పనులలో కూడా భార్యకు సహాయం చేయడానికి మనసు రాదు. ఇంకో ఊళ్లో ఇంకో భర్త: ఈయనకు ఏమాత్రం టైమ్ దొరికినా అత్తింటివాళ్లు బాకీపడ్డ అదనపు కట్నం గురించి అదేపనిగా గుర్తొస్తుంది. అలాంటిది లాక్డౌన్ పుణ్యమా అని అతడు రోజంతా ఇంట్లోనే ఉన్నాడు. మాటలతోనే ఇంట్లో వరకట్న హింసను సృష్టించాడు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. లాక్డౌన్ టైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా మహిళలు రకరకాల హింసలు ఎదుర్కొన్నారు. ఈ హింసపై ఐక్యరాజ్య సమితి సాధికారికమైన నివేదికను ప్రచురించింది. దీనిని ఆధారం చేసుకొని అమెరికాలో స్థిరపడిన మలయాళీ డైరెక్టర్ లీజా మాథ్యూ ‘కేజ్డ్’ పేరుతో షార్ట్‌ఫిల్మ్ రూపొందించింది. లాక్డౌన్ టైమ్‌లో అక్షరజ్ఞానం లేని మహిళలతో పాటు బాగా చదువుకున్న మహిళలు, ఇంటిపనులకే పరిమితమైన వారితో పాటు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఎదుర్కున్న మానసిక, శారీరక, భావోద్వేగ హింసకు ‘కేజ్డ్’ అద్దం పడుతుంది. చిత్రంలో సంద్ర, జయ, విను, క్లైర్ ప్రధాన పాత్రలు. ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచంలోని వివిధ రకాల హింస బాధితులకు వీరు ప్రతీకలు. నిజానికి వీరు చిత్రం కోసం బాధితుల అవతారం ఎత్తిన వారు కాదు. నిజజీవితంలోనూ బాధితులే. సంద్ర, జయ, విను, క్లైర్ పాత్రలు పోషించిన సచిన్మై మేనన్, దివ్య సంతోష్, శిల్పఅరుణ్ విజయ్, రిలే పూల్‌లు భిన్నరకాల హింస బాధితులే. రిలే పూల్ విషయానికి వస్తే నిజజీవితంలోనూ ట్రాన్స్జండరే. ‘యువ అమెరికన్లపై హింస జరిగితే, తేరుకొని తిరిగిపోరాడతారు. మనదేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా గృహహింసకు సంబంధించిన కేసుల్లో చాలామంది మౌనంగా ఉంటున్నారు. మానసికహింస భౌతికహింస కంటే తక్కువేమీ కాదు’ అంటుంది లీజా మాథ్యూ. కొట్టాయం (కేరళ)కు చెందిన లీజా మాథ్యూ గత పదిసంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడింది. పద్దెనిమిది నిమిషాల నిడివి గల ‘కేజ్డ్’ మానసిక హింస నుంచి లైంగిక హింస వరకు మహిళలు ఎదుర్కొన్న రకరకాల హింసలను బయటపెడుతుంది. మొన్న మొన్నటి ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ఫెస్టివల్తో సహా లండన్ ఇండీ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్, నయాగరా ఫాల్స్ షార్ట్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్... ఎన్నో చిత్రోత్సవాలలో ప్రదర్శితమై రకరకాల ప్రగతిశీల చర్చలకు కేంద్ర బిందువుగా నిలిచింది. -
అత్యాచార ఆరోపణలు, పోలీసుల అదుపులో దర్శకుడు
కేరళ: అత్యాచార ఆరోపణలతో మలయాళ డైరెక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నివిన్ పాలీ హీరోగా నటిస్తున్న 'పడవెట్టు' సినిమాకు లిజు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో చిత్రయూనిట్‌లోని ఓ యువతి డైరెక్టర్ తనను అత్యాచారం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లిజు కృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేరళలోని కన్నూర్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడి అరెస్ట్‌తో షూటింగ్ వాయిదా వేశారు. పడవెట్టు సినిమాకు లిజు కృష్ణనే స్వయంగా కథ రాశాడు. ఇందులో నవీన్ పాలీతో పాటు మంజు వారియర్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షమ్మీ తిలకన్, షైన్ టామ్ చికో, ఇంద్రన్స్, సుదీష్, విజయరాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పడవెట్టు గతంలో తీసిన మూమెంట్ జస్ట్ బిఫోర్ డెత్‌కు పని చేసిన సన్నీ వేన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
డైరెక్షన్ టు టాలీవుడ్!
పొరుగింటి డైరెక్టర్ల డైరెక్షన్ మారింది. వాళ్ల డైరెక్షన్ టాలీవుడ్‌కి మారింది. ఎక్కడెక్కడి డైరెక్టర్లు ఇప్పుడు తెలుగులోకి వస్తున్నారు. తెలుగులో భారీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీ, కోలీ, మాలీ, శాండల్... ఈ అన్ని వుడ్స్ డైరెక్టర్లు మన తెలుగులో సినిమాలు చేస్తున్నారు. ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం. తెలుగు పరిశ్రమలో తెలుగు దర్శకులే ఉన్నారా? అంటే.. కాదు. పరభాషా దర్శకులు కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కువమంది రావడం విశేషం. ‘బాహుబలి’ అద్భుత విజయం తర్వాత భారతీయ చిత్రపరిశ్రమ చూపు తెలుగుపై పడిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తెలుగులో ప్యాన్ ఇండియన్ సినిమాల నిర్మాణం పెరిగింది. అందుకే ఇతర ఇండస్ట్రీల దర్శకులు కూడా కథలు రాసుకుని తెలుగు హీరోలకు వినిపిస్తున్నారు. తమ డైరెక్షన్‌ను టాలీవుడ్ వైపు తిప్పుకుంటున్నారు. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ కెరీర్లో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలది ప్రత్యేక స్థానం. ఈ రెండు చిత్రాలూ ఆయన్ను ఇతర భాషల్లోనూ పాపులర్ చేశాయి. ‘దృశ్యం’ సినిమా తమిళ రీమేక్ ‘పాపనాశం’ని తెరకెక్కించి, తమిళ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు జీతు. ఇందులో కమల్ హాసన్ నటించారు. ఇప్పుడు ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించి, తెలుగు చిత్రపరిశ్రమలోకి దర్శకుడిగా తొలి అడుగు వేశారు జీతు. తెలుగు ‘దృశ్యం’ (ఈ చిత్రానికి సుప్రియ దర్శకురాలు) పార్ట్ వన్‌లో హీరోగా నటించిన వెంకటేశ్.. రెండో పార్టులోనూ హీరోగా నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘బాహుబలి’ బ్లాక్‌బస్టర్ ప్రభాస్‌ను ప్యాన్ ఇండియన్ స్టార్‌ని చేసింది. దీంతో పక్క ఇండస్ట్రీ దర్శకులు కూడా ప్రభాస్‌తో సినిమాలు చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ కోసం ఓ కథ రాసి, వినిపించారు. ప్రభాస్‌కి కథ నచ్చడంతో ఈ కన్నడ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘సలార్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. అలాగే బాలీవుడ్లో ‘తన్హాజీ’ చిత్రంతో టెక్నికల్‌గా మంచి గ్రిప్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్’ అనే మైథాలజీ ఫిల్మ్ చేస్తున్నారు ప్రభాస్. ఇలా ఒకేసారి ఇద్దరు పక్క ఇండస్ట్రీ దర్శకులతో ప్రభాస్ సినిమాలు చేయడం విశేషం. అలాగే హిందీ సినిమా ‘వార్’ ఫేమ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక 2021లో జరిగిన ఓ విశేషం.. శంకర్ తెలుగు సినిమా చేయనుండటం. ‘ఇండియన్’ ‘జీన్స్’, ‘రోబో’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’ ఇలా చెప్పుకుంటూ పోతే దర్శకుడు శంకర్ కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా ఉన్నాయి. ఈ చిత్రాలు తెలుగులో అనువాదమై సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. కానీ తన 28 ఏళ్ళ కెరీర్లో శంకర్ తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయడం ఇదే మొదటిసారి. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ ప్యాన్ ఇండియన్ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం ఓ సోషల్ డ్రామాగా రూపొందనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక తమిళంలో ఉన్న మంచి మాస్ దర్శకుల్లో లింగస్వామి ఒకరు. అందుకు ఓ నిదర్శనం విశాల్‌తో ఆయన తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సండై కోళి’ (తెలుగులో ‘పందెంకోడి’). ఆ తర్వాత లింగుస్వామి తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ తీయాలనుకున్నారు. ఓ సందర్భంలో అల్లు అర్జున్‌తో లింగు స్వామి సినిమా ఓకే అయిందనే టాక్ కూడా వినిపించింది. కానీ వీరి కాంబినేషన్లోని సినిమా సెట్స్‌పైకి వెళ్ళలేదు. ఇప్పుడు రామ్ హీరోగా లింగుస్వామి సినిమా చేసేందకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘అవళ్’ (తెలుగులో ‘గృహం’), ‘కాదల్ టు కల్యాణం’ వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించిన మిళింద్ రావ్ డైరెక్షన్లో రానా హీరోగా ఓ సినిమా రానుంది. ఇందులో రానా పోలీసాఫీసర్ అనే ప్రచారం జరగుతోంది. ఇటీవల విడుదలైన రానా ‘అరణ్య’ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా తమిళ దర్శకుడు ప్రభు సాల్మాన్ కావడం విశేషం. వీళ్లు మాత్రమే కాదు.. మరికొందరు పరభాషా దర్శకులు తెలుగు సినిమాలు తెరకెక్కించే అవకాశం ఉంది. తెలుగులో పరభాషా కథానాయికలు, విలన్లు, సహాయ నటులు ఎక్కువమందే ఉన్నారు. ఇప్పుడు పొరుగింటి దర్శకుల జాబితా కూడా పెరుగుతోంది. మన తెలుగులో ప్రతిభావంతులు ఎక్కువే. అయితే ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహించే మనసు ‘తెలుగు పరిశ్రమ’కు ఉంది కాబట్టే... ఇంతమంది పరభాషల వారు ఇక్కడ సినిమాలు చేయగలుగుతున్నారు. వీళ్లూ వస్తారా? తమిళ దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్ తాము తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఒక దశలో అట్లీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోలుగా నటిస్తారనే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఇరుంబుతిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. సో... వీళ్లూ తెలుగులోకి వచ్చే చాన్స్ ఉంది. -
ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోయావు
కోయంబత్తూరు: షూటింగ్ సెట్స్‌లో గుండెపోటుతో కుప్పకూలిన మలయాళ దర్శకుడు నారానీపుజ షానవాస్(37) కన్నుమూశారు. కేరళలోని పాలక్కడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న 'గంధీరాజన్' సినిమా సెట్స్‌లో డిసెంబర్ 21న షానవాస్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని చిత్రయూనిట్ కోయంబత్తూరులోని కేజీ ఆస్పత్రికి తరలించింది. అక్కడ ఆయన పరిస్థితి మరింత విషమించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు బుధవారం వెల్లడించారు. ఏదైనా మిరాకిల్ జరిగి బతుకుతాడేమోనన్న ఆశతో అతడిని వెంటిలేటర్‌పైనే ఉంచినప్పటికీ అదే రోజు సాయంత్రం మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పలువురు సెబబ్రిటీలు ఆయన మరణానికి చింతిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. (చదవండి:కూరగాయలమ్ముతున్న ప్రముఖ డైరెక్టర్) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) "ఆయన కథల్లాగే షాన్వాస్ కూడా ఎంతో మంచివారు, సున్నిత హృదయం కలవారు. ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలి" అంటూ హీరోయిన్ అదితి రావు సోషల్ మీడియా వేదికగా దర్శకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నటుడు జయ సూర్య సెట్స్‌లో అతడితో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. 'ఎన్నో కథలను చెప్పావు, మరెన్నో జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయావు..' అంటూ నిర్మాత విజయ్ బాబు ఫేస్బుక్లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా నారానీపుజ షానవాస్ 2015లో 'కేరీ' చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కొంత కాలం గ్యాప్ తర్వాత అదితిరావు హైదరీ, జయసూర్య, దేవ్ మోహన్ నటీనటులుగా 'సూఫియమ్ సుజాతయుమ్' చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం అతడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. (చదవండి: కమెడియన్‌ను పెళ్లి చేసుకున్న నటి) View this post on Instagram A post shared by actor jayasurya (@actor_jayasurya) -
దర్శకుడి బ్రెయిన్ డెడ్
కోయంబత్తూరు: సెట్స్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు నారానీపుజ షానవాస్ హఠాత్తుగా కుప్పకూలారు. దీంతో వెంటనే అతడిని కోయంబత్తూరులోని కేజీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్లు బంధువులు తెలిపారు. కాగా షానవాస్ ప్రస్తుతం 'గంధీరాజన్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన పాలక్కడ్‌లోని ఆటపదిలో వేసిన సెట్స్‌లో చిత్రీకరణ జరుపుతుండగా గుండెపోటుతో కుప్పకూలారు. దీంతో వెంటనే ఆయనను అత్యవసర చికిత్స కోసం కోయంబత్తూరులోని కేజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి అతడి పరిస్థితి విషమంగా ఉంది. నేడు ఉదయం అతడిని మరోసారి పరీశిలించిన డాక్టర్లు అతడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వెల్లడించారు. (చదవండి: సినీ పరిశ్రమలో విషాదం : క్రిస్మస్ స్టార్ కడుతూ) ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నిర్మాత విజయ్ బాబు ట్వీట్ చేశారు. షానవాస్ ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఉన్నట్లు తెలిపారు. అతడి గుండె ఇంకా కొట్టుకుంటోందన్నారు. ఏదైనా మిరాకిల్ జరిగి ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు. కాగా 2015లో 'కేరీ' సినిమాతో షానవాస్ దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత అదితి రావు హైదరీ, జయసూర్య, దేవ్ మోహన్ నటీనటులుగా 'సూఫియమ్ సుజాతయుమ్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా గతేడాది అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. (చదవండి: మరీ అంత డర్టీ కాదు!) -
మీటూ భయాన్ని సృష్టించింది
సినిమా ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంపై కొందరు నటీనటులు తమ అభిప్రాయాలను వివిధ సందర్భాల్లో పంచుకున్నారు. తాజాగా మీటూ ఉద్యమం గురించి మలయాళగ దర్శకుడు లాల్ జోస్ మాట్లాడుతూ– ‘‘సినిమా షూటింగ్ సమయంలో నా తోటి వారితో కొన్నిసార్లు కోపంగా, మరికొన్నిసార్లు స్నేహపూర్వకంగా ఉంటాను. పురుషులు, మహిళలనే బేధం లేకుండా అందరితో ఒకేలా మాట్లాడతాను. అయితే నేను ఆగ్రహం వ్యక్తపరిచినప్పుడు ఎవరు ఎలా తీసుకుంటారో నేను ఊహించలేను. అందుకే ‘మీటూ’ వచ్చాక నా టీమ్‌లోకి మహిళలను తీసుకోవడానికి భయంగా ఉంది. దాదాపు 20 ఏళ్ల క్రితం సెట్లో నా ప్రవర్తన బాగోలేదని ఓ పాపులర్ లేడీ ఫొటోగ్రాఫర్ నాపై ఆరోపించారు. అయితే అది నిజం కాదు. ఇప్పుడు మీటూ ఉద్యమం ఒక భయాన్ని క్రియేట్ చేసిందని నా అభిప్రాయం. కానీ ఈ భయం మంచికా? లేక చెడుకా? అనేది చెప్పలేం’’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొన్నారు. -
ప్రముఖ మళయాల డైరెక్టర్ మృతి
ట్రాఫిక్, మిలి లాంటి ఎమోషనల్ సినిమాలతో సౌత్‌తో పాటు నార్త్ ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మళయాల దర్శకుడు రాజేష్ పిళ్లై (41) అనారోగ్య కారణాలతో మృతి చెందారు. సినిమానే జీవితంగా బతికిన ఆయన ఈ శుక్రవారం రిలీజ్ అయిన వేట్టా సినిమా కోసం ఆపరేషన్ వాయిదా వేసుకోవటంతో పరిస్థితి విషమంగా మారి శనివారం మృతి చెందారు. రాజేష్ పిళ్లై గతంలోనే కాలేయమార్పిడి చికిత్స చేయించుకోవాల్సి ఉన్నా, వేట్టా సినిమాను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఆపరేషన్ వాయిదా వేశారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్టు సన్నిహితులు తెలిపారు. ఇటీవల కాలంలో చాలాసార్లు ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుప్రతిలో చేరిన ఆయన, కొచ్చి లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 11.45 నిమిషాలకు మరణించారు. అవయదానం నేపథ్యంలో రాజేష్ పిళ్లై తెరకెక్కించిన ట్రాఫిక్ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు కూడా సాధించింది. మళయాలలో తెరకెక్కిన ఈ సినిమా తరువాత తమిళ, హిందీ, తెలుగు భాషల్లోనూ రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. -
సీనియర్ దర్శకుడు శశికుమార్ కన్నుమూత
సీనియర్ దర్శకుడు, ఎవర్ గ్రీన్ హీరో ప్రేమ్ నజీర్‌కు పలు హిట్ చిత్రాలను అందించిన శశికుమార్ మరణించారు. 1960లు, 70లలో మళయాళంలో పలు హిట్ చిత్రాలను తీసిన ఆయన (86) వృద్ధాప్యానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా సాయంత్రం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మళయాళ సినీ చరిత్రలోనే ఎవరూ చేయనంతగా 141 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. వాటిలోని 80 సినిమాల్లో ప్రేమ్ నజీరే హీరో. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే చాలు.. అది సూపర్ హిట్ అనేవారు. మొదట్లో అన్ని మళయాళ సినిమాల్లాగే వాస్తవిక చిత్రాలు తీసిన శశికుమార్, ఆ తర్వాత క్రమంగా ఎంటర్టైన్మెంట్, థ్రిల్లర్ల వైపు మళ్లారు. అవన్నీ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించాయి.