ఇండస్ట్రీలో మరో విషాదం. ఎన్నో అద్భుతమైన సినిమాల తీసి, స్టార్ డైరెక్టర్‌గా పేరు గడించిన సిద్ధిఖీ (63) కన‍్నుమూశారు. గత రెండు రోజులుగా అనారోగ్య సమస్యలతో సీరియస్ కండీషన్‌లో ఉన్న ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో మలయాళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హీరోయిన్ కీర్తి సురేశ్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా, హీరో మోహన్‌లాల్ తదితరలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిఖీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
ఏం జరిగింది?
సోమవారం మధ్యాహ్నం దర్శకుడు సిద్ధిఖీకి గుండెపోటు వచ్చింది. దీంతో కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. లివర్ సంబంధిత సమస్యలతోపాటు న్యూమోనియా ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. మరోవైపు ఈయన ఆరోగ్యం విషమించింది. ఎక్మో సాయంతో చికిత్స అందించినట్లు మాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఆయనకు ఏం కాదని, త్వరగా కోలుకుంటారని అనుకున్నారు. కానీ పరిస్థితి చేయి దాటిపోవడంతో ప్రాణాలు వదిలేశారు.
(ఇదీ చదవండి: బెడ్‌పై కదల్లేని స్థితిలో.. మాట రాక కంటనీరు..: రాజీవ్ కనకాల ఎమోషనల్)
సిద్దిఖీ ఎవరు?
సిద్ధిఖీ అసలు పేరు సిద్ధిఖీ ఇస్మాయిల్. డైరెక్టర్ కమ్ స్క్రీన్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్. మలయాళంలో మోహన్‌లాల్‌కు సిద్దిఖీ బెస్ట్ ఫ్రెండ్. వీళ్లిద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. అద్భుతమైన సక్సెస్‌లు అందుకున్నాయి. విచిత్రం ఏంటంటే సిద్దిఖీ తీసిన తొలి సినిమా 'రాంజీరావు స్పీకింగ్'. చివరి సినిమా 'బిగ్ బ్రదర్'. ఈ రెండింటిలోనూ మోహన్‌లాల్ హీరో కావడం విశేషం. దీన్నిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్లిద్దరి బాండింగ్ ఎలా ఉండేదోనని..
తెలుగులోనూ
అలానే మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోని అద్భుతమైన సినిమాల్లో ఒకటైన 'హిట్లర్' కథ ఈయనదే. మలయాళంలో అదే పేరుతో మమ్ముట్టి హీరోగా తీసిన సినిమానే చిరు.. తెలుగులో రీమేక్ చేశారు. పలు భాషల్లో రీమేక్ అయిన 'బాడీగార్డ్' ఒరిజినల్‌కు దర్శకుడు ఈయనే. తెలుగులోనూ నితిన్ హీరోగా 'మారో' అనే మూవీ తీశాడు. కాకపోతే ఇది ఆడలేదు. దీంతో సిద్దిఖీ మరో తెలుగు సినిమా చేయలేదు. 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన సిద్దిఖీ ఇలా చనిపోవడం ఇండస్ట్రీకి తీరనిలోటు.
— Keerthy Suresh (@KeerthyOfficial) August 8, 2023
RIP Deepest condolences to the family 🙏 pic.twitter.com/LXjkvvxxBl
— Prabhudheva (@PDdancing) August 8, 2023
(ఇదీ చదవండి: అనాథలా రేకుల షెడ్డులో దుర్భర జీవితం గడిపిన స్టార్ హీరోయిన్!)
Comments
Please login to add a commentAdd a comment