సినిమా ఇండస్ట్రీలో గుండెపోటు వార్తలు ఎక్కువైపోతున్నాయి. మొన్నీ మధ్యే నటి శ్రుతి షణ్ముగప్రియ భర్త ఇలా చనిపోయారు. నిన్న కన్నడ హీరో పునీత్ రాజ్ కుటుంబానికి చెందిన నటి స్పందన గుండెపోటు వచ్చి సడన్ గా మృతి చెందింది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ సిద్ధిఖీ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: ఆస్పత్రి ఖర్చులకు డబ్బుల్లేక ప్రముఖ నటి మృతి!)
స్టార్ డైరెక్టర్
69 ఏళ్ల సిద్ధిఖీ.. మలయాళంతోపాటు తెలుగు, తమిళ, హిందీలో సినిమాలు తీశారు. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈయన.. లాల్ అనే యాక్టర్ కమ్ డైరెక్టర్ తో కలిసి బోలెడన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. కథ-స్క్రీన్ ప్లేలు కూర్చే కాంబోగానూ చాలా క్రేజ్ సంపాదించారు. 'రామ్‌జీరావ్ స్పీకింగ్', 'ఇన్ హరిహర్ నగర్', 'గాడ్ ఫాదర్', 'వియత్నాం కాలనీ', 'కాబూలీ వాలా' తదితర మలయాళ సినిమాలతో ఫేమస్.
తెలుగులోనూ
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధిఖీ నితిన్ తో కలిసి 'మారో' అనే సినిమా తీశారు. కాకపోతే అది సక్సెస్ కాకపోవడంతో ఇక్కడ మరో మూవీ చేయలేదు. డైరెక్షన్ పక్కనబెడితే నటుడిగా కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రలో మెరిశారు. పలు టీవీ షోల్లో జడ్జిగానూ మెరిశారు. చివరగా మోహన్ లాల్ తో 'బిగ్ బ్రదర్' సినిమా చేశారు. 2020లో ఇది రిలీజైంది. అలాంటిది ఇప్పుడు ఆయన గుండెపోటుకు గురై, విషమ పరిస్థితుల్లో ఉండటం అభిమానుల్ని కలవరపాటుకి గురిచేస్తోంది. త్వరగా కోలుకోవాలని వాళ్లు ఆకాంక్షిస్తున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!)
Comments
Please login to add a commentAdd a comment